অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటిలో కరిగే విటమిన్ల లోపం

వీటి లోపానికి ప్రధాన కారణాలు ఏవంటే

  • పేదరికం వలన తగినంతగా ఆహారాన్ని తీసుకోలేక పోవడం, వండే అలవాట్లలో దోషాల వలన శరీరం నిల్వ చేసుకోవడం, తయారి  విధాన ప్రక్రియలలోను విటమిన్లు నశించి పోవడం జరుగుతుంది.
  • దీర్ఘకాల అతిసార వ్యాధి, అంటువ్యాధులు, జీర్ణనాళ రుగ్మతల  కారణంగా విటమిన్లను శోషించుకోలేకపోవడం. శోషణలోప వ్యాధి, ప్రేవునాళంలోని మ్యూకస్‌ పొర మద్యపానం ద్వారా  విషపూరితంగా మారడం తోబాటు కాలేయంలో తీవ్రమైన లోపాలు ఏర్పడతాయి.
  • జీవ ప్రక్రియలు, విసర్జనక్రియః అంటు వ్యాధి, దీర్ఘకాలంగా మందులు వాడడంవంటి కారణాల వలన జీవక్రియలపై తీవ్రమైన ఒత్తిడి కల్గి   శరీరంలో విటమిన్ల నిల్వలేకుండాపోతుంది.
  • గర్భవతులుగ ఉన్న స్త్రీలకు లేదా ఎదుగుతున్నదశలోగల బాలలకు విటమిన్ల ఆవశ్యకత అధికంగా ఉంటుంది.
  • క్షీణించిపోయిన విటమిన్ల నిల్వలుః  పోషకవిలువలు తక్కువగా గల ఆహారం తీసుకునే తల్లుల ద్వారా శిశువులకు అందించే విటమిన్ల నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి.

బెరిబెరి- థయామిన్‌ లోపం

  • బాగా శుద్ధి చేసిన బియ్యాన్ని తినడం వలన థ్యామిన్ లోపము ఏర్పడుతుంది. మిల్లులలో ఆడించినప్పుడు ఎక్కువ మొత్తంలో థయామిన్‌ విటమిన్‌ బియ్యం నుండి తొలగింప బడుతుంది.
  • తక్కువ ఆదాయ వర్గం గలవారిలోను, నిరంతరం మద్యం సేవించే వారిలోను, పిల్లలకు, యుక్త వయస్కులకు,  పెద్దవారికి  కూడ థయమిన్‌ లోపం వచ్చే అవకాశం గలదు.
  • బెరిబెరి రెండు రీతులుగా ఉంటుందిః
  • శరీరం ఆర్చుకు పోయినట్లు- వడలిపోయిన లేదా కృశించిన /సరియైన పోషణలేని శరీరంగల బెరిబెరిః సాధారణంగా భారతదేశంలో ఉండేది.
  • ఆకలి మందగించడం, కాళ్ళు, చేతులు కంపించడం, స్పర్శ లోపించడం,
  • పాదాలు లాగినట్లుగా లేదా కండరాలలో నొప్పిగా ఉండడం, దీనివలన      చిత్తభ్రమలు, మనోవ్యాధి  కల్గుతాయి.
  • నీరు చేరినట్లుగా గల బెరిబెరి హృదయ సంబంధమైన బెరిబెరి
  • పిండి పదార్ధములు అధికంగా తీసుకున్నవారిలో శారీరక శ్రమ అధికంగా చేసిన వారిలోను ఈలోపం సామాన్యంగా వస్తుంది. కణజాలాల్లో వ్యాధి పూరితమైన ద్రవం చేరడం, గుండెకొట్టు కోవడంలో మార్పులు , శ్వాస సరిగా అందక పోవడం, హృదయ కండరాలలో బలహీనత ఏర్పడి హఠాత్తుగా గుండె ఆగిపోవడం సంభవిస్తుంది.
  • వరి అన్నం తీసుకునే పేద తల్లులలో బిడ్డలకిచ్చే తల్లి పాలల్లో థయామిన్‌ పదార్ధం బాగా ఉన్న వారైన తల్లులలొ కన్నా  తక్కువగా ఉంటుంది. ఇది శిశువులకు వచ్చే బెరిబెరి వ్యాధిని కల్గిస్తుంది. శిశువులలో థయామిన్‌ లోపముండే పరిస్థితి ఏర్పడి శిశుమరణాలకు దారితీస్తుంది. శిశువు హఠాత్తుగా జబ్బుపడడం లేదా బిగపట్టుకుపోవడం జరుగుతుంది. ఇది శిశువు మరణాని కి కారణమౌతుంది. ఈ లోపమున్న తల్లులకు థయామిన్‌ను సరిపడినంతగా అందిస్తే  బిడ్డలకిచ్చే తల్లిపాలల్లో థయామిన్‌ విటమిన్‌ పెరుగుతుంది.
  • చికిత్సః సరళమైన చికిత్సతో తటాలున ప్రతిస్పందన కన్పిస్తుంది. తీవ్రమైన వ్యాధి ఉన్నవారిలో ఈ లోపాన్ని పూరించడానికి ఇంజక్షన్ల రూపంలోను, నోటి మాత్రల ద్వారా చికిత్స చేస్తుండడం జరుగుతుంది.
  • రాకుండా జాగ్రత్తలు: వరిజాతి ధాన్యాలను అతిగా మిల్లుపట్టడం, ఎక్కువగా శుద్ధి చేయడం వంటి ప్రక్రియలను చేయకుండా ఉంటే వరివంటి ఆహారాలను రోజుతీసుకునే వారిలో థయామిన్‌ చేరి ఉంటుంది. వేయించిన మరియు మిల్లుపట్టని బియ్యంలో థయామిన్‌  అత్యధికంగా ఉంటుంది. వంట చేసే విధానంలో దోషాలను, బాగా శుద్ధి చేసిన ఆహారాలను అత్యధికంగా తీసుకోవడం, మద్యం సేవించడాన్ని విడిచిపెట్టాలి.

రిబోఫ్లోవిన్‌ లోపం

లోపం రావడంలో కన్పించే లక్షణాలు

  • నోటిలో కన్పించే లక్షణాలుః నాలుక మంటగా, వాపుగా ఉన్నట్లు(గ్లాసైటిస్‌)
  • నోటి అంచులలో పగిలినట్లుగా (నోటిలోని జిగటపొర మంటగా ఉండడం-ఏంగ్యులార్‌ స్టొమటైటిస్‌)
  • నోటిపూత, నాలుక మంట
  • పెదాలు పగలడం, పెదాలపై పుండ్లు ఏర్పడడం-చీలియోసిస్‌
  • చర్మంలో వచ్చే మార్పులుః సెబేషియస్‌ గ్రంధుల స్రావక సంబంధమైన రకంలో ముక్కుచుట్టూ వృషణాల తొడుగుల వద్దచర్మపువాపు, ఎర్రగామారడం(కందిపోయినట్లుగా)
  • కంటి సంబంధమైన మార్పులుః వెలుతురు చూడాలంటే భీతి (ఫొటొఫోబియా), కళ్ళనుండి నీరు కారడం (లేక్రైమేషన్‌) , మంటగా ఉండడం, దృష్టి అలసత్వం ఇంకను చూపు తీవ్రంగా మందగించడం.
  • కంటికటకాల, దృష్టి నాడిలోవాపులేదా మంటతోబాటు దృష్టి బాగా క్షీణించి పోవడం వంటి కేటరాక్ట్‌ మార్పులు జరుగుతాయి.
  • నరాల సంబంధమైన మార్పులుః ఉపరితల నాడులలో సామాన్యంగా వచ్చే వ్యాధి

చికిత్స

  • ప్రతీరోజు 5-10 గ్రాముల చొప్పున రిబోఫ్లోవిన్‌ తీసుకుంటేఈ వ్యాధి నయం అవుతుంది.
  • కొద్దిరోజుల నుండి కొన్ని వారాలలోపల ఈ వ్యాధిలో కన్పించే లక్షణాలన్నీ మటుమాయమౌతాయి
  • ఇతర బి కాంప్లెక్స్‌ విటమిన్లు రోగికి అవసరమౌతాయి

వ్యాధిరాకుండా జాగ్రత్తలు

  • రిబోఫ్లేవిన్‌ మెరుగుగాకల్గిన ఆహారపదార్ధాలను రోజుతీసుకునే అహారంలో ఉంటే గనుక సామాన్య ఆరోగ్యం మెరుగవుతుంది.
  • ఈ లోపముకు గురికాగలవారికి సంయోజక/ సింధటిక్ విటమిన్లను అదనంగా ఇవ్వవచ్చును.

పెల్లగ్రా-నియాసిన్‌ లోపం

కారణాలు

  • సామాజికంగా, ఆర్ధిక పరంగా తక్కువగా గల వర్గాల ప్రజలు ప్రధాన ఆహారంగా మొక్కజొన్నమరియు/లేదా జొన్నలను తీసుకుంటారు. ఈ ఆహారంలో ల్యూసిన్‌ అమైనో ఆమ్లం  సమృద్ధిగా ఉంటుంది.  అధిక ల్యూసిన్‌ ఉన్నప్పుడు ట్రిఎ్టోఫెన్‌ అమైనో ఆమ్లం  నియాసిన్‌ గా మారే ప్రక్రియను ఆటంకపరుస్తుంది.
  • మాంసకృత్తులు కల్గిన గింజ ధాన్యాలు (అపరాలు), పాలు, లేదా ఏ ఇతర మాంసాహరం మనం భుజించే ఆహారంలో లేక పోయిన, రక్షిత ఆహారాలైన ఆకుకూరలు జొన్నఅన్నంలో కలుపు కోకపోతే అమైనో ఆమ్లం సమతుల్యతను మార్చివేసి పెల్లగ్రా వ్యాధిని కల్గిస్తుంది.
  • రెండవ విధంగా మద్యపానం వలన, శోషణ లోపం వలన, ఇతర జీవ ప్రక్రియలు జరగకపోవడం వలన పెల్లగ్రాను గమనించవచ్చు

లక్షణాలు

పెల్లగ్రా వ్యాధి మధ్యవయస్కులలో సామాన్యంగా కన్పిస్తుంది. పిల్లలో చాల అరుదుగా వస్తుంది.

ఆకలి మందగించడం, జీర్ణసంబంధమైన అవరోధాలు, ఆతృత, కోపం, నిద్రలేమి వంటి ఉద్వేగ మార్పులు సామాన్యంగా ఉండే లక్షణాలు.

చర్మంపై ఏర్పడే గాయాలుఃపెల్లగ్రస్‌ డెర్మటైటిస్‌ కాంతికి సున్నితత్వాన్ని కల్గి దద్దుర్లుగా వస్తుంది. చేతులు, కాళ్ళు ముఖము, మెడ వంటి వెలుతురుకి బహిర్గతమయ్యే భాగాలలో ద్విపార్శ్వయుతంగా , సౌష్టవంగా కన్పిస్తాయి. ఈ గాయాలు హైపర్‌ కెరటోటిక్‌ మరియు అధికమైన వర్ణత్వం (హైపర్‌ పిగ్మెంటెడ్‌) గా ఉంటాయి. కంఠం మీద నెక్లెస్‌ (గొలుసువలె) లాగా కన్పిస్తుంది.

జీర్ణనాళంలో జరిగే హానిః మ్యూకస్‌  (జిగురు స్వభావంగల ) పొరమంట, వాపు వలన తీవ్రమైన నాలుక మంట, నోటిలోగల జిగురు స్వభావంగల పొరకు కలిగే వాపు లేదా మంట, ఉదరసంబంధమైన  నొప్పులతో కలిసి అతిసార వ్యాధిని  కల్గిస్తుంది.

నరాల సంబంధిత మార్పులు: ఇన్సోమ్నియా  లేదా నిద్ర లేమి తోబాధపడే లక్షణం ప్రధానంగా ఉంటుంది. జబ్బు పెరుగుతున్నకొద్దీ తెలియకుండా ఉండడం, మతిభ్రమణం, చిత్తభ్రమలు కన్పించడంపరితల నాడి తో పెరాస్తీషియ( చురుక్కుమనడం, తిమ్మెర్లు), సమన్వయ లోపం, వణుకు . మెదడుకు ఇంద్రియాలకు మధ్య పొంతన లేకపోవడంతో   వచ్చే శారీరక రుగ్మత( స్పాస్టిక్‌ పెరాప్లెజియ) రవచ్చు. అందరి పెల్లగ్రిన్‌లలో (పెలెగ్రా వ్యాధితో బాధపడుతున్నవారు) అతిగా నరాలు స్పందించడం గమనించవచ్చు.

చికిత్స

  • తగినంత నాణ్యమైన ప్రోటీన్లు (మాంసకృత్తులు), ఇతర బి కాంప్లెక్స్‌ విటమిన్లు ప్రతీ రొజు తీసుకునే అహారంలో వినియోగిస్తే నయాసిన్‌ లోపం తక్కువగా గలవారిలో వ్యాధి నయమౌతుంది.
  • ప్రతీరోజు 100-300 మిల్లిగ్రాముల నికోటినిక్‌ ఆమ్లం లేదా అమైడ్‌  వ్యాధి తీవ్రత మితంగా గల వారికి ఇవ్వాలి.
  • 24-48 గంటల  లోపల మానసిక లక్షణాలలో ప్రతి స్పందన కన్పిస్తుంది.
  • చర్మ గాయాలకు 3-4 వారాలవరకు చికిత్స పడ్తుంది.
  • తీవ్రమైన ఆతిసారవ్యాధితో బాధ పడ్తున్నవారిని మినహాయించి అన్ని రకాల పెల్లగ్రాతో బాధపడ్తున్నవారికి నోటిమాత్రల ద్వారా చికిత్స సంతృప్తికరగా పనిచేస్తుంది.
  • నరాల సంబంధిత లక్షణాలలో మాత్రం ఎక్కువగా రిబోఫ్లెవిన్‌ మరియు పెరిడాక్సిన్‌ అవసరముంటుంది.

రాకుండా జాగ్రత్తలు

  • ఇతర సీరియల్‌ జాతి (వరివంటి)ధాన్యాలను జొన్నకు బదులుగా తీసుకోవడం, లేదా జొన్నతో బాటు ఇతర నాణ్యమై న మాంసకృత్తులు కల్గిన ఆహారపదార్ధములను కలుపుకొని తినడం వలన పెల్లగ్రా రాకుండ  నివారించవచ్చు. రోజువారి ఆహారంలో వినియోగించుకోవడానికి ముందుగా సున్నపు నీటిలో జొన్నను కడగడం హైడ్రోలైజింగ్‌ ప్రక్రియ జరిగి, జీర్ణం కాలేని నియాసిన్‌ స్వేచ్చాయుత నియసిన్‌గా ఏర్పడుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate