కొబ్బరి నూనెను తలనూనెగానే ఉపయోగిస్తాం. కానీ పోషకాల నిలయమైన కొబ్బరినూనెను వంటకు ఉపయోగించవచ్చు. కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరినూనెనే విరివిగా ఉపయోగిస్తారు. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విఽధానాల గురించి తెలసుకుందాం. పోషకాలు.. కొబ్బరి నూనె - 100గ్రా కెలోరీలు - 862 మొత్తం కొవ్వులు - 100గ్రాముల్లో ఇందులో.. శాచురేటెడ్ ఫ్యాట్ - 87గ్రా పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ - 1.8గ్రా మోనోశాచురేటెడ్ ఫ్యాట్ - 6గ్రా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
కొబ్బరినూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు గురికాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ నూనెతో పొందే ఇతర ప్రయోజనాలు...
ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెసా్ట్రల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది.
కొబ్బరినూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల సీ్త్రలలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి.
శరీర మెటబాలిక్ రేట్‌ను పెంచుతుంది. ఫలితంగా బాడీ వెయిట్ అదుపులో ఉంటుంది.
ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరినూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు.
కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరినూనెకు ఉంది.
వంటల్లో ఇలా ఉపయోగించాలి
కొబ్బరినూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్‌హీట్. కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చు.
కేక్లాంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరినూనెను ఉపయోగించొచ్చు. అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25శాతం తక్కువ కొబ్బరినూనె వాడాలి.
పాప్‌కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు.
వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్లా బ్రెడ్ మీద అప్లై చేసి తినొచ్చు.
స్మూదీస్, సూప్స్, సాసె్సలో కలుపుకోవచ్చు.
ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చు. పప్పు తాలింపులో వాడొచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/29/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి