జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉన్నారు. రోజూ వ్యాయామం చేస్తున్నారు. అయినా నడుం చుట్టుకొలత అంగుళం కూడా తగ్గలేదా? అయితే ఈ టిప్స్‌ను ట్రై చేయండి.
ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే ఫూర్తిగా ఫ్యాట్‌కు దూరంగా ఉండాలని కాదు. హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ తప్పక తీసుకోవాలి. ఇందుకోసం వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌ను మెనూలో చేర్చాలి.
ఫ్యాట్ కరగాలంటే డైట్‌లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ధాన్యాలు, పండ్లు, కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.
ఒత్తిడికి దూరంగా మెడిటేషన్‌ను దినచర్యలో భాగంగా చేసుకోవాలి. బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు తక్కువగా తింటారు.
విటమిన్ డి : బరువు నియంత్రణలో విటమిన్ డి పాత్ర కూడా కీలకమే. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గడం జరగదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం కాసేపు సూర్యరశ్మి పడేలా చూసుకోండి. ఈ సమయంలో సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ లేక ఏదైనా గేమ్ ఆడటంలాంటివి చేయవచ్చు.
నిద్రలేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. త్వరగా పడుకోవడం, వేకువజామున్నే నిద్రలేవడం వల్ల ఫలితం ఉంటుంది. కాల్షియం లోపం వల్ల జీవక్రియలు కుంటుపడతాయి.
కాబట్టి మెనూలో కాల్షియం అధికంగా లభించే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వండి. పాలు, పెరుగు, వెన్న వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తినండి. పండ్లు, వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకోండి. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి బరువు తగ్గడానికి అవకాశం కలుగుతుంది.
లంచ్, డిన్నర్ తక్కువగా తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ కింగ్ సైజ్‌లో ఉంటే లంచ్, డిన్నర్ స్మాల్‌సైజులో ఉండాలి.
కపాలభాతి, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలను చేయాలి.
రోజంతా యాక్టివ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. లిఫ్ట్ వాడే బదులుగా మెట్లు ఎక్కి వెళ్లడం, తక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినపుడు వెహికిల్ తీయకుండా నడవడం లాంటివి చేయాలి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా అదనపు కొవ్వును సులభంగా దూరం చేసుకోవచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/27/2020