వాతదోషప్రకోపం వల్ల ఎముకలు గుల్ల బారి బలహీనంగా తయారవుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.
ఈ వ్యాధినే ఆయుర్వేద వైద్యులు ‘ఆస్టియోపోరోసిస్’ అని పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడినవారికి నడుము, వెన్నెముక, మణికట్టు వద్ద ఎముకలు సులభంగా విరిగిపోతాయి.
శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్- డి తగ్గిపోవటం, థైరాయిడ్ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారు ఈ వ్యాధి బారినపడతారు.
నడుంనొప్పి, ఎత్తుతగ్గటం, ఎముకల్లో కదలికలు లేకపోవటం లాంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎముకలు గుల్లబారిపోకుండా ఇంట్లోనే కొన్ని సులభ చికిత్సలు చేయవచ్చు
- రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగాలి.
- గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్ చొప్పున కలిపి తాగాలి.
- రోజూ ఉదయాన్నే రెండు చిటికెల పిప్పిళ్ల చూర్ణాన్ని తేనెలో కలిపి తీసుకోవాలి.
- ఒక టీ స్పూన్ మద్ది చెక్క మెత్తని చూర్ణాన్ని పాలల్లో కలిపి తాగాలి.
- కప్పు వేడిపాలలో టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు గట్టిపడతాయి.
- కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకోవాలి. తరుచూ మునగ కాయలతో పులుసు చేసుకుని తింటుంటే చక్కని ఫలితం కలుగుతుంది.
- ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటి పై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలలో తాగాలి.
- ఇసుకలో దొరికే పసుపురంగు గవ్వను కానీ, తెల్లని నత్తగుల్లను కానీ నీటిలో శుభ్రంగా కడిగి రాత్రి ఒక గ్లాసులో వేసి ఒక నిమ్మకాయ రసం పిండి మూతపెట్టాలి. ఉదయాన్నే ఆ గ్లాసులోని నీటిని వడబోసి తాగుతుంటే త్వరగా వ్యాధి తగ్గిపోతుంది. -కందమూరి, ఆయుర్విజ్ఞానకేంద్రం
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/11/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.