ద్రాక్షతో తయారు చేసే వివిధ పదార్థాలలో వైన్ మొదటిది కాగా, ఎండు ద్రాక్షది రెండవ స్థానం. ద్రాక్షను ఎక్కువ మోతాదులో పండించినప్పటికీ దాన్ని సరైన క్రమంలో వాడుకోలేకపోతున్నాం. పైగా కాలానుగుణంగా పండే పంట అవ్వడాన వేరే కాలంలో ఇవి దొరకవు. దిగుబడి అవుతున్నప్పుడే వీటిని సక్రమతీరులో నిల్వచేసుకోవాలి. మన దేశంలో సుమారు ఒక ఎకరా ద్రాక్షసాగుకు 2.5 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. 20-25 టన్నులు/ హెక్టారు పండ్లు ఉత్పత్తి జరిగినప్పటికీ, అవి సరిగా భద్రపరచలేకపోవడం వలన, రవాణాలో లోపాల వలన 60-70 % వరకు వృధా అవుతున్నది. ఈ నష్టాన్ని నివారించాలంటే ఎండుద్రాక్ష తయారీ ఒక శ్రేష్టమైన పద్ధతి.
ఎండుద్రాక్ష తయారు చేయడం
కావలసిన పదార్థాలు
ద్రాక్ష పండ్లు
సల్ఫర్ (10 గ్రాం/కిలో గ్రాం)
ఎయిర్ టైట్ సల్ఫర్ చాంబర్
దూది
చిల్లులున్న ఒక ట్రే
సన్నటి తీగ (ఇనుము కాకుండా)
పింగాణీ టైల్.
ఎంపికలో మెళుకువలు
గింజలుకల లేదా గింజలు లేని పచ్చ, నల్ల ద్రాక్ష ద్రాక్షపండ్లు ఎంపిక చేసుకోవాలి.
ద్రాక్షపండ్లు ఒకే క్రమపద్ధతిలో పూర్తిగా పండి ఉండాలి.
పల్చటి తోలు కలిగి ఉండాలి.
2-4 బ్రిక్స్ కలిగి ఉండాలి.
ప్రాథమిక తయారీ
పూర్తిగా మగ్గిన ద్రాక్షపండ్ల గుత్తులనే తీసుకోవాలి.
వీటిలో నుండి దెబ్బతిన్న లేదా రంగు మారిన, ఎండిపోయిన వాటిని తీసివేయాలి.
పారే నీటిలో శుభ్రంగా కడగాలి.
తర్వాత వీటిని ఎండబెట్టాలి.
సల్ఫరింగ్
ద్రాక్ష పండ్ల గుత్తులను 30-35 సెంటీ మీటర్ల పొడవైన తీగకు కట్టాలి.
ఒక కిలో ద్రాక్షకు 8-10 గ్రాముల సల్ఫర్ చొప్పున తీసుకోవాలి.
ఈ ద్రాక్ష పండ్ల గుత్తులను తీగ సహాయంతో సల్ఫర్ చాంబర్ లోకి వేలాడదీయాలి.
దూదిని ఒక పొరలా ఏర్పాటు చేసి దానిపై సల్ఫర్ ని ఒక క్రమపద్ధతిలో పరచాలి. ఈ పత్తిని పింగాణీ టైల్ మీద పెట్టాలి.
ఈ పింగాణీ రేకుని సల్ఫర్ చాంబర్ లోకి పెట్టి, దాన్ని కాల్చాలి. వెంటనే మూత పెట్టేయాలి. ద్రాక్ష పండ్లకు ఈ సల్ఫర్ పొగ తగిలేలా చూడాలి. ఇలా 3-4 గంటల వరకు చేయాలి.
ద్రాక్ష పండ్లలోని రసాయనాలను నిర్విర్యామం చేసి పండ్లు నిల్వ ఉండడానికి సల్ఫరింగ్ చేస్తారు.
ఎండబెట్టడం
ఇలా సల్ఫర్ తగిలిన పండ్లను ఎండలో గాని, నీడలో గాని లేదా సోలార్ డ్రైయర్ ద్వారా గాని ఎండ బెట్టాలి.
ఎండిన తర్వాత పండ్లను గుత్తుల నుండి వేరుచేయాలి.
ఇప్పుడు వీటిని గోరువెచ్చని నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉండే దుమ్ము, ధూళి, క్రిమి సంహారాలు తొలగిపోతాయి.
ఇప్పుడు వీటిని ఒక పేపరుపై పరచి ఫ్యాను గాలి కింద ఆరనివ్వాలి. అవసరమైతే కొంచెం సేపు ఎండబెట్టాలి. అప్పుడు వీటికి చక్కని పటుత్వం ఏర్పడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇనుముతో కూడిన సామాగ్రిని వాడరాదు.
సల్ఫర్ పొగలను పీల్చకూడదు.
సల్ఫర్ ని మండించిన వెంటనే మూత పెట్టాలి.
తయారు చేసే విధానం - ఫ్లో చార్టు
ఉపయోగాలు
సులువైన పద్ధతి
ముడి సరుకులకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది
సులభంగా తయారు చేయవచ్చు
ద్రాక్ష పంటలలో నష్టాన్ని నివారించవచ్చు
చిన్న పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆధారం:
డాక్టర్ కె. ఉమా మహేశ్వరి, ప్రొఫెసర్ మరియు యూనివర్శిటీ హెడ్, ఆహారం & పోషణ విభాగం కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి