অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈ ఐదింటితో నవ యవ్వనం

ఈ ఐదింటితో నవ యవ్వనం

యవ్వనంగానే ఉండాలనే కోరిక ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిలో ఉంది. మహిళల్లోనే కాదు పురుషులు కూడా వృద్ధాప్య ఛాయలు రావడాన్ని భరించలేకపోతున్నారు. ఇదే అదనుగా, యవ్వనంగా కనిపించేలా చేసే తిరుగులేని మందులంటూ యాంటీ ఏజింగ్‌ క్రీములు కుప్పలుగా వ చ్చిపడుతున్నాయి, వాస్తవానికి ప్రకృతి సిద్ధమైన తాజా పండ్లు, కూరగాయల్లోనే అన్ని రకాల వృద్ధాప్య సమస్యల్ని దూరం చేసే పలు అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ కింద పేర్కొన్న ఆహార పదార్థాలు వృద్ధాప్యాన్ని నిరోధించడంతోపాటు యవ్వనంగా కూడా కనపడేలా చేస్తాయి.

అవకాడో

పెద్ద మొత్తంలో విటమిన్‌-ఇ ఉండడంతో పాటు, అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. అవకాడోలో చర్మకణాలను పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా కనపించడమే కాకుండా, యవ్వనపు మెరుపు కనిపిస్తుంది.

 

కిడ్నీ బీన్స్‌

ఈ పప్పుధాన్యాల్లో పీచుపదార్థం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది కొలెసా్ట్రల్‌ నిలువల్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా చే స్తాయి. అంతకన్నామించి కిడ్నీ బీన్స్‌ల్లో ప్రొటీన్లు నిండుగా ఉంటాయి.

 

డార్క్‌ చాక్లెట్‌

70 శాతం కోకో ఉండే ఏ చాక్లెట్‌లో అయినా ప్రొటీన్‌, విటమిన్‌-బి కావలసినంత ఉంటాయి. తరుచూ చాక్లెట్‌ తినే వారిలో కొవ్వు బాగా క రిగిపోతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారతాయి.

 

బ్రొకోలి

దీనిలో భారీ మొత్తంలో పీచుపదార్థం, విటమిన్‌- సి ఉంటాయి. ఇవి శరీరం బరువును త గ్గించడమే కాకుండా, గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడతాయి.

 

బ్లూ బెర్రీస్‌
వీటిల్లో విటమిన్‌- సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తప్రసరణ సులువుగా జరగడానికి తోడ్పడుతుంది. బ్లూబెర్రీ్‌సలో ఉండే కొన్ని రకాల లవణాలు, వృద్ధాప్య వేగాన్ని తగ్గిస్తాయి. పొటాషియం కూడా వీటిల్లో ఎక్కువగా ఉండడం వల్ల బాగా చురుకుతనం లభిస్తుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate