অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహార పదార్థములు మరియు వాటి పోషక విలువలు

ఆహార పదార్థములు మరియు వాటి పోషక విలువలు

అరటిపండు అన్ని వేళలా అందరికీ ప్రియమైన మరియు చౌకైన ఫలము.

  • కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో చలామణి  అవుతున్న ఫలము. దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా వున్నాయి. ఇది విరివిగా మరియు చౌక ధరల్లో అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో లభిస్తుంది.
  • అన్ని రకాల అరటి పండ్లలో ఏదో ఒక విధమైన లాభం చేకూర్చే గుణం ఉంది. అరటి పండు తీసుకుంటే తగు శక్తి, సహజ చక్కెరలు, (గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్) తక్షణం శరీరానికి అందుతాయి. దీనిలో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది.
  • అరటి పండుకు చాలా వ్యాధుల బారి నుంచి రక్షించే మరియు నివారించే గుణాలు వున్నాయి.
  • మానసికంగా కృంగిపోవుట : అరటి పండులో వున్న ఒక రకమైన మాంసకృత్తులను శరీరం సెరటోనిన్ అను పదార్థంగా మార్పు చెందుతాయి. ఈ పదార్ధ మూలంగా మానవులకు ఉల్లాసంగా నిశ్చితంగా వున్నట్లు భావం కలుగుతుంది.
  • బహిష్ఠతకు ముందుగా ఉత్పన్నమయే సమస్యలు అరటిపండు నందు లభ్యమయ్యే B6 అను విటమిను రక్తంలోని చక్కెర పదార్థాల మోతాదును నియంత్రించి తద్వారా మానసిక స్థితి మెరుగు పడడంపై ప్రభావాన్ని చూపుతుంది.
  • అనీమియా (రక్త హీనత) :- అరటి పండులో అధిక మోతాదులో ఉన్న ఇనుము రక్తంలోని ఎర్రరక్తరంజక ద్రవ్య కణాల ఉత్పత్తిని పెంచడానికి  దోహదపడుతుంది.
  • రక్త పోటు :-  అరటిపండులో పొటాషియం కన్నా సోడియం తక్కువ ఉంటుంది. ఇందు మూలంగా రక్తపోటు ఉన్న వారికి కూడా ఇది మంచి పోషకాహారము.
  • మేధాశక్తి :-  పరిశోధనలలో అరటిపండులో అధిక మోతాదులో వున్న పొటాషియం కంటిపాపను సావధానంలో వుంచుతూ  శిక్షణలో సహాయ పడుతుంది.
  • మలబద్ధకము :-  పీచు పదార్థములు అధికంగా ఉండడము మూలంగా మల విసర్జన సాధారణంగా జరగడంలో సహాయపడుతు మలబద్దకం నుంచి  కాపాడుతుంది.
  • గుండెలో మంట :- అరటిపండు సహజ  గుణము కలిగి ఉన్నది.  దీని మూలంగా  గుండెలో మంట నుంచి శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది.
  • వ్రణములు దీర్ఘనీల :- అరటిపండు నున్నగా,మెత్తగా వుండడం మూలంగా పేగులకు సంబంధించి వ్యాధులలో దీనిని ముఖ్య ఆహార పదార్థంగా సూచిస్తారు.
  • అన్నాశయ అంతరంగాల్లో ఇది ఒక పూతగా ఏర్పడి దీర్ఘకాలిక వ్రణాల ఆమ్లాల బారి నుండి మరియు తేపుడు పుట్టించే లక్షణాల నుంచి కాపాడుతుంది.
  • పక్షవాతము :-  ప్రతిదినము పోషణలో అరటిపండు తీసుకోవడం వల్ల పక్షవాతము  వంటి ఆకస్మిక జబ్బుల నుండి 40 % వరకు తగ్గించుకొనవచ్చును.

బార్లీ గింజలు :- బార్లీ గింజలో కొవ్వు మరియు ఉప్పులవణాలు తక్కువ మోతాదులో వుంటాయి. సహజ ఇనుము వీటిలో పుష్కలంగా వుంటుంది.  రసాయన మూల పదార్థము అధిక మోతాదులో వుండుట మూలాన ఇవి గుండె, ఎముకలు మరియు గోర్లు వంటి అవయవాలకు మేలు కలుగజేస్తాయి. కలిగియున్న పీచు పదార్థములకు ఇది ముడి సరకు వంటిది. సగం కప్పు ఉడికించిన  బార్లీ గింజలలో 4 గ్రాముల చిక్కటి కరిగిన పీచు పదార్థం లభిస్తాయి. ఈ పీచు పదార్థం LDL అను రక్తంలో వుండే  చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.

బార్లీ గింజలు అధికంగా ఉన్న కొవ్వును పీల్చుకొని శరీరం నుంచి వెలుపలకు పంపించి వేస్తాయి. ఇందులో వున్న అధిక మోతాదు పీచు పదార్థములుగా ఇవి మలబద్దకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ విధులు మరియు కార్య నిర్వహణలో సహాయపడుతుంది.

బార్లీ గింజలు అధికంగా ఉన్న ఆహారం రక్తంలో చక్కెర శాతం నియంత్రిస్తాయి. బార్లీ గింజలు నరాల జబ్బులకు కూడా సహాయపడతాయి. స్త్రీలలో ఋతు సమయంలో ఉత్పన్నమయ్యే గర్భాశయం మరియు అండాశయంకు సంబంధించిన సమస్యలలో ఎక్కువగా ఇవి సహాయపడతాయి.

వీటిలో ఉన్న ఏకైక కొవ్వు ఆమ్లము మరియు జీవక్రియ రక్షకము విటమిన్ - ఇ (E) తో కలిసి కణముల యొక్క క్షీణతను ఆపి క్యాన్సరు జబ్బు నుంచి కాపాడుతాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

లైంగిక జీవితంలో కామవాంఛను తగ్గించే ఆహారాలు

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది నమ్మకం, ప్రేమ, స్నేహం.. మాత్రమే కాదు, వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఆహారనియమాలు, వ్యాయామాలు చాలా అవసరం. లైంగిక సామర్థ్యం బాగుండాలంటే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. పూర్ డైట్ మరియు బరువును పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి మీ వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతియ్యడమే కాకుండా, బ్లడ్ ఫ్లో, మరియు శరీరం యొక్క సామర్థ్యంను కూడా తగ్గించేస్తాయి. తాజా అధ్యయనాల ప్రకారం, కొన్ని రకాలా ఆహారాలు మరియు న్యూట్రీషియన్స్ లిబిడో బూస్టింగ్ లో ప్రధాన పాత్రపోషిస్తాయి. అందుకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయమేటంటే, సెక్స్ లైఫ్ ను మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్లో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మీరు విశ్రాంతి పొందవచ్చు అనుకుంటారు. కానీ మద్యం తీసుకోవడం వల్ల మీరు మగత ఉండటానికి కారణం అవుతుంది. అంతే కాదు ఆల్కహాల్లో ఉండే కెమికల్స్ టెస్టోస్ట్రెరాన్ ఉప్పత్తిని తగ్గిస్తుంది . కాబట్టి మీ పార్ట్నర్ తో సంతోషంగా గడపదులుచుకుంటే మద్యం సేవించడం తక్షణం మానివేయాలి.

కాఫీ:

ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

పుదీనా:

పుదీనా నోటిలోకి వేసుకొనే ముందు ఒక సారి ఆలోచించండి!ఇది జీర్ణ వ్యవస్థ ప్రయోజనాలు మరియు చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది మీ లిబిడోకు ప్రతి కూలా ప్రభావాలను కలిగి ఉంటుంది. మీలో సెక్స్ డ్రైవ్ ను చల్లబరిచే మెంతోల్ గుణం ఇందులో ఉంటుంది. కాబట్టి చెడు శ్వాసను వదిలించుకోవడానికి, సహజ మూలికలును తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

సోడ మరియు కోలాస్:
రెగ్యులర్ సోడాలు మరియు రుచికరమైన పానీయాలు(కోకో కోలా)మీ బరువు హెచ్చుతగ్గులు మరియు మీ మానసిక స్థితి ఒడిదుడులకులకు కారణం కావచ్చు. ఇటువంటి పానీయాలు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం కావచ్చు. ఉదా: ఊబకాయం, దంతక్షయ సమస్యలు, మధుమేహం, మరియు మరొకన్ని ఇతరములు..ఈ లక్షణాలతో మీరు కనుక బాధపడుతున్నట్లైతే ఇప్పటికి మీరు మీ లైంగి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రహించాలి.

 

కార్న్ ఫ్లేక్స్ మొక్కజొన్న పొత్తుల్లో వుండి కామోద్దీపనకు హానికలుగజేసే వ్యతిరేక లక్షణాలు ఉన్నాయనడంలో ఆశ్చర్యం కలగక మానదు డాక్టర్ జాన్ హార్వే కేల్లోగ్గ్ ఈ కార్న్ ఫ్లేక్ లో చప్పగా ఉండే ఒక బాగం ప్రజల యొక్క సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని తెలిపాడు. కాబట్టి ఉదయం, రాత్రి బెడ్ టైమ్ లో వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

ప్రయాణంలో మీరు ఖచ్చితంగా తినకూడని 6 ఆహారాలు

సాధారణంగా వీకెండ్స్ లేదా లాంగ్ లీవ్స్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ వెళ్తామని చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. ఆ ఉత్సాహంలో ఆడ్రినల్ స్థాయి పెరిగి వివిధ రకాల ఆహారాలు తీసుకోవడానికి అత్యుచ్చాహం చూపిస్తారు. ఐతే ఏమైన జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఆరోగ్య మరియు మానసిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. బస్సులో, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు. కొందరికి షిప్‌లలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, మీరు ఎక్కడైకనా ప్రయాణం చేయాలనుకొన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హాపీగా జరగుతుంది. ఈ మోషన్ సిక్ నెస్ ఉన్నప్పుడు అస్సలు తినకూడాని కొన్ని ఆహారాలున్నాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ నుండి ఖచ్చింగా తొలగించుకోవల్సి ఉంటుంది. ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలు మీరు ప్రయాణించడానికి ముందు మరియు మీ ప్రయాణ సమయంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే మీరు మరింత హెల్తీగా మరియు పీస్ ఫుల్ గా ప్రయాణించగలరు.

ఫ్రైడ్ ఫుడ్స్ ప్రయాణం చేసే సమయంలో ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రై చేసిన ఆహారాలు ఓకే అయితే, ప్రయాణానికి ముందు మరియు ప్రయాణంలో ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇటువంటి ఆహారాలు జీర్ణక్రియ సమస్యలకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి వీటిని మీ ప్రయాణంలో తీసుకోకండి

ఆల్కహాల్:

చాలా మందికి ప్రయాణం చేసే ముందు ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇది శరీరం డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. అంతే కాదు, హ్యాంగోవర్ కు కూడా దారితీస్తుంది. ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతారు. ఇలా తాగడం వల్ల వారు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. అయితే ఇది చాలా తప్పు , కార్బోహైడ్రేటెడ్ బెవరేజస్ సోడా మరియు కోల్డ్ డ్రిక్స్ గాస్ట్రిక్ సమస్యను ఏర్పరుస్తాయి. ఇంకా నోటి దుర్వాసనకు దారి తీస్తుంది. కాబట్టి ప్రయాణంలో సాఫ్ట్ డ్రింక్ కు చెక్ పెట్టండి.

ఛీజ్ అండ్ కోల్డ్ మీట్:

స్నాక్స్ మీద చీజ్ ను తురుము అలంకరించిన ఫుడ్ చాలా ఆకర్షిస్తూ నోరూరిస్తుంటుంది. అయితే ప్రయాణానికి ముందు చీజ్ మరియు కోల్డ్ మీట్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇంకా జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. చీజ్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా సమయం వరకూ కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. కాబట్టి ప్రయాణానికి ముందు చీజ్ తో తయారు చేసి స్నాక్స్, వంటకాలకు దూరంగా ఉండాలి.

మాంసాహార ఆహారాలు:

మాంసాహారల్లో చేపలు, మరియు చికెన్ మరియు రెడ్ మీట్ తో తయారుచేసే ఆహారలు తీసుకోవడం వల్ల అజీర్ణంకు గురిచేస్తుంది. అంతే కాదు ప్రయాణానికి ముందు మరియు ప్రయణాలు ఇటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ ను తప్పనిసరిగా తొలగించాలి. కారంతో తయారు చేసిన గ్రేవిలు తీసుకోవడం వల్ల కడుపులో మంట పుట్టిస్తుంది చాలా మంది ప్రయానికులు ప్రయాణంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడంతో చాలా బాధ పడుతుంటారు. కాబట్టి ప్రయాణానికి ముందు చాలా తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

మిల్క్ అండ్ డైరీప్రొడక్ట్స్:

ప్రయాణాలు చేసే ముందు మరియు ప్రయాణాల్లో మిల్క్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి . ఇవి మార్నింగ్ మోషన్ సిక్ నెస్ కు గురిచేస్తాయి. కాబట్టి, ఈ ఆహారాలను ముఖ్యంగా ప్రయాణాల్లో నివారించాల్సి ఉంటుంది

హెవీ మీల్స్:

చాలా మంది కడుపు నిండా తిని ప్రయాణం చేయడం చాలా హాయిగా ఉంటుంది అనుకుంటారు , దాంతో ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుందని భావిస్తారు. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. మీరు ప్రయాణం చేసేసమయంలో ఆరోగ్యకరమైన ఆహారం మరియు లైట్ ఫుడ్ ను తీసుకోవాలి.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

చక్కటి ఔషధం వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.

వెల్లుల్లితో చేసుకున్న సిరప్ దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో చిన్న వెల్లుల్లి ముక్క వేసి పన్నెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత కొంచెం పంచదార కలుపుకుని తీసుకుంటే దగ్గు ఇట్టే మాయమవుతుంది. రుచిగా ఉండాలని కోరుకునే వారు కొంచెం తేనెను కలుపుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు వెల్లుల్లి కలిపిన టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది.

చెవిపోటుతో బాధపడేవారు వెల్లుల్లి ముక్కను తీసుకుని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వేడి చేసుకుని మిశ్రమం చల్లారిన తరువాత చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి తెగిన చోట, గాయాలకు రాసుకోవచ్చు. చర్మం ఎర్రగా మారి ఇరిటేషన్‌తో బాధపడుతున్న వారు, ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు వెల్లుల్లి పేస్టు రాసుకుంటే నయమవుతుంది. వెల్లుల్లి నూనెను పన్ను నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ

రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడంలో వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. తెల్ల రక్తకణాలు మరింత సమర్థంగా పోరాడటానికి అవసరమైన శక్తిని అందించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

క్యాన్సర్

వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నివారించే ఔష«ధ గుణాలున్నాయి. క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తిని వెల్లుల్లి పెంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, బ్రెస్ట్, ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్‌ల కణాలపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది.

అధిక రక్తపోటు

వెల్లుల్లికి, అధిక రక్తపోటుకి సంబంధం ఉంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ఉపకరిస్తుంది. క్రమంతప్పకుండా వెల్లుల్లిని తీసుకునే వారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

కొలెస్టరాల్, గుండె ఆరోగ్యం

అధిక రక్తపోటును నియంత్రించడం ద్వారా వెల్లుల్లి గుండెను కాపాడుతుంది. చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలోనూ వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లి వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. గుండెను పదిలంగా ఉంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

ఇతర ఉపయోగాలు కలరా, నులిపురుగులు, విరేచనాలు, స్మాల్‌ఫాక్స్, ధనుర్వాతం, క్షయ, టైఫాయిడ్ తదితర వ్యాధులకు కూడా వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది.

ఆహారంతో అందం

ఎన్ని క్రీములు రాసినా కొందరి ముఖ చర్మంలో ఎటువంటి మార్పూ రాదు అనేకమందికి.టివిలలో మాత్రం అందమైన అమ్మాయిలను చూపించేసి మా క్రీము వాడినందుకే వారు అంతగా అందంగా తయారయ్యారంటూ ప్రకటనదారులు ఊదరకొడుతుంటారు.ఇది చూసిన అనేకమంది ముందూ వెనుకా ఆలోచించకుండా కొనుగోలు చేసి వాడేస్తుం టారు.అయితే కొందరిలో ఇది దుష్పరిణామాలను కూడా కలిగిస్తుంది.వీటికన్నా ముందు ఇటువంటి వారు దృష్టి పెట్టవలసింది లోపలకు తీసుకునే ఆహారం మీద అంటున్నారు సౌందర్య నిపుణులు. పౌష్టికాహారం తీసుకుంటే అదే చర్మానికి కాంతిని, నిగారింపును ఇస్తుందంటున్నారు వారు.

నారింజ...

దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది.ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది.రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్‌సి అవసరమవుతుంది.నారింజ రసం తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

బొప్పాయి...

చూడగానే నోరూరించే ఈ పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు.ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.

గోధుమలు...

వీటిలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి.చర్మంలో మృత కణాల స్థానంలో కొత్త కణాల పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తాయి.స్ట్రెస్‌, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి. పగిలిన చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది.వీటిలో ఉండే నియాసిన్‌ చర్మ కణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది.గోధుమపిండితో చేసే బిస్కెట్స్‌, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.

ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు...

తేలికగా, కరకరలాడే ఈ గింజలలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.ఇవి చర్మం తేమను కోల్పోకుండా చేసి కోమలంగా తయారు చేస్తుంది.బ్లాక్‌ెహడ్స్‌ను నిర్మూలిస్తాయి.మచ్చలు కూడా తగ్గుతాయి.వారానికి రెండు సార్లు రెండు టేబుల్‌ స్పూన్‌ ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి.వంటకు కూడా సన్‌ ఫ్లవర్‌ నూనెను ఉపయోగించడం మంచిది.

గింజధాన్యాలు...

చర్మ కణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి.చుండ్రును నిర్మూలించే బయోటిన్‌ అనే పోషకం వీటిలో ఉంటుంది.జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది.ప్రతిరోజూ క్రమం తప్పకుండా తింటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకంటే చాలా మంచిది.

నట్స్‌...

కేలరీలు, జింక్‌ అధిక శాతం ఉంటాయి.జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది.క్రమం తప్పకుండా నట్స్‌ తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

అలొవెరా...

ప్రతిరోజూ అలొవెరా రసం తాగడం వల్ల చర్మంపై కలిగే దురదలు, మొటిమలు, పిగ్మెంటేషన్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు.రోజుకు ముఫె్పై మిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate