অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహారం - ఆరోగ్యం

ఆహారం - ఆరోగ్యం

 1. అన్నం
 2. అరటి పండ్లు
 3. అరటి పువ్వు
 4. అల్లం టీ
 5. అల్లం
 6. ఆకు కూరలు - మన ఆరోగ్యం
 7. ఆఫీసులో ఉద్యోగినులకు పోషకాహారం అవగాహన
 8. ఆరోగ్యానికి పానీయాలు
 9. ఉత్సాహానికి ఈ 7 తినాలి
 10. ఉప్పు
 11. ఉసిరి
 12. ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు
 13. కష్టంగా జీర్ణం అయ్యే కొన్ని ఆహారాలు
 14. కోడి గ్రుడ్డు
 15. పాలు
 16. చేపలు
 17. జీడి పప్పు
 18. త్రిఫల చూర్ణం
 19. దానిమ్మ
 20. పసుపు
 21. పుచ్చకాయ
 22. పెరుగు
 23. వాము
  1. వంటింట్లో వాము
  2. ఔషధోపయోగాలు
  3. ఆయుర్వేదంలో వాము
 24. జింజర్ (అల్లం) టీ త్రాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
  1. అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు
  2. ఎక్కువగా వినియోగం:
  3. రక్తాన్ని పలుచగా మరియు లోపాలు:
  4. నిద్ర సమస్యలు:
  5. అనస్థీషియా:
  6. పిత్తాసయంలో రాళ్లు:
  7. కడుపు అప్ సెట్:
  8. గర్భధారణ:

అన్నం

అన్నం మనం సాధారణంగా రోజూ భుజించే ఆహారము. వరి ధాన్యం నుండి వేరుచేసిన బియ్యం నీటిలో ఉడికించి అన్నాన్ని తయారుచేస్తారు. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం తెలుగు వారు అన్నప్రాసన పండుగలాగా జరుపుకుంటారు.

 • అన్నంలో పిండిపదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావయిపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల. శరీరానికి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. మెదడు, కండరాలు, కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం.
 • ఇంకా చెప్పాలంటే. చైనా, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాల ప్రజల ప్రధాన ఆహారం అన్నమే. కానీ ప్రపంచ ఆరోగ్యసూచి ప్రకారం వాళ్లల్లో వూబకాయం శాతం చాలా తక్కువ. అన్నంలో గంజి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక పొరలాగా పనిచేసి పెద్దప్రేగు క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది. పాలిష్‌ పట్టని బియ్యంలో పీచుపదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
 • 100 గ్రాముల అన్నంలో ఏమేం ఉంటాయంటే న్యూట్రిషన్ ఫాక్ట్స్ సెర్వింగ్ సైజు 1 కప్ (174.0 గ్రామ్స్) కాలోరీస్ -169 కాలోరీస్ ఫ్రొం ఫాట్ - 3 టోటల్ ఫాట్ - 0.3g 1% సంతృప్త కొవ్వు - 0.1g 0% పాలీ అన్ సాచురేటేడ్ కొవ్వు - 0.1g మోనో అన్ సాచురేటేడ్ కొవ్వు - 0.1g కొలెస్ట్రాల్ - 0mg - 0% సోడియం -9 mg - 0% టోటల్ కార్బోహైడ్రేట్స్ - 36.7g -12% డైటరి ఫైబర్ - 1.7g-7%షుగర్స్ - 0.1g ప్రోటీన్ -3.5g విటమిన్ A 0%, విటమిన్ C 0% కాల్షియమ్ 0%, ఐరన్ 1%

అరటి పండ్లు

పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలుఇతర త్రున ధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.

 • అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
 • ప్రపంచం మొత్తం మీద మన దేశం అరటిని పండించే విషయంలో రెండో స్థానంలో ఉంది. ఎంతోమంది రైతులకు, వ్యాపారస్థులకు ఇది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆర్థిక వెసులుబాటును కల్గిస్తూ బాసటగా నిలుస్తోంది.
 • అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.
 • నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
 • అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.
 • మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).
 • అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)
 • అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)
 • ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.
 • అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.

పోషక విలువలు: అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు

 • 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది,
 • 23% కార్బోహైడ్రేటులు,
 • 1% ప్రోటీనులు,
 • 2.6% ఫైబరు ఉంటుంది.

ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం, శ్రేష్టమైనది. వందగ్రాముల అరటిలో

 • నీరు - 70.1 గ్రా.
 • ప్రోటీన్ - 1.2 గ్రా.
 • కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
 • పిండిపదార్థాలు - 27.2 గ్రా.
 • కాల్షియం - 17 మి.గ్రా.
 • ఇనుము - 0.4మి.గ్రా.
 • సోడియం - 37 మి.గ్రా.
 • పొటాషియం - 88 మి.గ్రా.
 • రాగి - 0.16 మి.గ్రా.
 • మాంగనీసు - 0.2 మి.గ్రా.
 • జింక్ - 0.15 మి.గ్రా.
 • క్రోమియం - 0.004 మి.గ్రా.
 • కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
 • రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
 • సి విటమిన్ - 7 మి.గ్రా.
 • థయామిన్ - 0.05 మి.గ్రా.
 • నియాసిన్ - 0.5 మి.గ్రా.
 • శక్తి - 116 కిలోకాలరీలు

ఉపయోగాలు:

 • దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
 • శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
 • అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
 • అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
 • జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
 • పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
 • అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

అరటి తో వైద్యము:

 • అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు
 • అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్‌'అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌'మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది.అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.
 • అమ్మాయి పుట్టాలని కోరుకునే గర్భిణులు అరటిపళ్లు తినడం మానేయాలి.

అరటితో ఆరోగ్యం:

 • అందానికీ ఆరోగ్యానికీ అరటి మంచి నేస్తం. పెరట్లో పండే, అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్నిరకాల లాభాలున్నాయో చూడండి.
 • అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది.
 • అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
 • డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మార్చుతుంది.
 • ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్‌ బి6, కాల్షియం, జింక్‌ ఫోలిక్‌ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి.
 • అరమగ్గిన అరటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
 • రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారుచేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరుగుతారు.
 • బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్‌ డిశ్ఛార్జ్‌ సమస్యను దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతుచక్రం సమయంలో నొప్పినీ రక్తస్రావాన్నీ తగ్గిస్తుంది.
 • చిన్నపాటి కాలిన గాయాలను మాన్పించే గుణం అరటిగుజ్జుకు ఉంది.కనిపించింది.

అరటిపండు సగం చాలు
జిమ్‌లో ఎక్కువ సమయం వ్యాయామం చేశాక శరీరానికి శక్తి రావడం కోసం స్పోర్ట్స్‌ డ్రింకో, బజార్లో దొరికే మరో పానీయమో తీసుకుంటారు. కానీ 'వాటికి ప్రత్యామ్నాయంగా అరటి పండు ఎంచుకోవాలి. అప్పుడు కనీసం సగం అరటి పండు తిన్నా కావాల్సిన శక్తి అందుతుంది'అని అమెరికాకు చెందిన అధ్యయన బృందం తెలిపింది. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్లే కొందరిపై అధ్యయనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌తో పోల్చినప్పుడు. అరటి పండ్ల నుంచి పిండిపదార్థాలే కాక అదనంగా యాంటీఆక్సిడెంట్లూ, పీచు, పొటాషియం, బి6 విటమిన్‌ లాంటి పోషకాలూ అందుతాయి. అరటి పండులో లభించే పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచుతాయి. అంతేకాదు ఎముకలూ దృఢపడతాయి. అజీర్తితో బాధపడేవారు రోజుకో పండు తింటే చాలు అంటున్నారు నిపుణులు.

అరటి తెచ్చే అందం
ఇంట్లో అరటిపండు ఉంటే చాలు. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే! నిజమే. చర్మాన్ని తేమగా ఉంచడానికీ, వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడానికీ, పగిలిన పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికీ అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని, ముఖానికి పట్టించి, పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ముఖానికి ఖరీదైన మాయిశ్చరైజర్లు ఇవ్వలేని తేమా, నునుపుదనం వస్తాయి.

బయటికెళ్లిన కాసేపటికే కొందరి ముఖం జిడ్డుగా మారిపోతుంది. ఈ సమస్య తగ్గాలంటే పండిన అరటి పండు గుజ్జుకు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి దానిని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే. జిడ్డు వదిలిపోతుంది. ఎన్నిసార్లు కండిషనింగ్‌ చేసినా జుట్టు పొడి బారుతుంటే. పండిన అరటి పళ్లు తీసుకుని, దానిలో కొద్దిగా పెరుగు కలిపి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ, అందంగా మెరిసిపోతుంది.

అరటిపళ్లలోని 'ఇ'విటమిన్‌ ముఖంలో వయసు తాలూకు ఛాయలను కనిపించకుండా చేస్తుంది. దీనికి ఓట్‌మీల్‌, కొబ్బరిపాలు కూడా జోడించి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి. అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే, వాటికి తగినంత తేమ అంది పగుళ్లు రాకుండా ఉంటాయి.

అరటి పువ్వు

 • అరటి శాస్త్రీయ నామము "plantaemusaceaemusa". ఇది అన్ని దేశాలలో దొరుకును.
 • అరటి పువ్వు గుండె రూపంలో ఉంటుంది. మన ప్రాంతంలో కొంతమంది అరటిపువ్వును ఒక కురగాయగా పరిగనిస్తారు. అరటిపువ్వును సలాడ్ గా, సూప్ లాగా తయారుచేసి వాడుతారు. కొన్ని గిరిజన ప్రాంతాలలో అరటిపువును ఎండబెట్టి, పొడిచేసి. దానితో చపాతీలు చేసుకుంటారు.

ఉపయోగాలు:

 • అరటిపూవు జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును.
 • ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి సక్రమముగా పనిచేసేటట్లు దోహదపడును.
 • ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును.
 • ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును.
 • మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును.

అల్లం టీ

మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

అల్లం టీ కావలిసినపదార్ధాలు:

 • పాలు : రెండు గ్లాసులు
 • పంచదార : రెండు స్పూన్ లు
 • టీపొడి : ఒక స్పూన్
 • యాలుక్కాయ : ఒకటి
 • అల్లం ముక్క : అంగుళం ముక్క
 • నీళ్ళు : ఒక గ్లాసు

తయారు చేయు విధానం:

స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి. మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి. ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి.

ఉపయోగాలు:

 • అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది.
 • అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 • ఇంకా తెల్లవారున సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
 • ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం 'టీ'తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 • అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు.
 • మోకాళ్ల వాపులు కూడా అల్లం 'టీ'రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.
 • జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం ''టీ''తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించుకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
 • ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం 'టీ'రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి.
 • అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
 • నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సహం వస్తుంది.
 • అల్లం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలి ప్రభావం వల్ల తలెత్తే సమస్యలను ఇది అదుపులో ఉంచుతుంది. కొందరికి ప్రయాణాలు పడవు. కడుపులో వికారంగా ఉండటం, వాంతులవడం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఓ కప్పు అల్లం టీ తాగి చూడండి. ఉత్సాహం వచ్చేస్తుంది. వికారంలాంటివి బాధించవు. కాస్త ఎక్కువగా తిన్నప్పుడు భుక్తాయాసం బాధ పెడుతుంది. దాన్నుంచి బయట పడాలంటే. కప్పు అల్లం టీ తాగితే సరిపోతుంది. తరచూ ఈ టీ తాగడం వల్ల కండరాలూ, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకో కప్పు చొప్పున తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి. టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి.

అల్లం

అల్లంఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది.ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదుకీల్లవాపు ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

లక్షణాలు:

 • కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
 • దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
 • కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.

శొంఠిఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.

అల్లం ఉపయోగాలు:

 • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
 • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
 • పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
 • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
 • అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది.
 • రక్త శుద్దికి తోడ్పడుతుంది.
 • రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.
 • అల్లం కొన్ని వారాలపాటు వాడితే. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 • అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు.
 • అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంతాలను ఆరొగ్యము గా ఉంచుతుంది.

అల్లం తో షుగర్ నియంత్రణ :

 • షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిధ్యాలయం పరిశోధనా ఫలితాలు వెళ్ళడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు.ఇటువంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము. ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు.

ఆకు కూరలు - మన ఆరోగ్యం

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 • మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ. నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి.

ఉదాహరణ కు కొన్ని ఆకుకూరలు:

 • మెంతికూర,
 • కరివేపాకు,
 • కొత్తిమీర,
 • తోట కూర,
 • తులసి,
 • గోంగూర,
 • బచ్చలి

ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండ టం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే. వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది.

ఆకుకూరలు తో మధుమేహానికి చెక్:
ఆకుకూరలు తినండి మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి.

ఆఫీసులో ఉద్యోగినులకు పోషకాహారం అవగాహన

 

ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం.

స్పానీటితో శక్తినిచ్చే టీలు స్పా వాటర్‌. మినరల్‌ వాటర్‌ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్‌ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే కెలొరీలు తగ్గి అధిక బరువు సమస్య ఉండదు.

 • దంచిన పుదీనా ఆకులు, అల్లం, నిమ్మ, బత్తాయి రసాలు వీటిలో ఏవి దొరికితే వాటిని గ్లాసుడు చల్లని స్పా నీటిలో కలిపి, చెంచా పంచదార వేసి టీ చేసుకోవచ్చు. దీని నుంచి 15 కెలొరీలు మాత్రమే అందుతాయి.
 • స్పా నీటితో చేసిన బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, డీకేఫ్‌ పానీయాలు(కెఫీన్‌ లేనివి) ఆరోగ్యదాయకం.
 • దాల్చినచెక్క, వెనిల్లా టీలు పంచదార వేయకపోయినా రుచిగానే ఉంటాయి. మామూలు టీ, కాఫీలకు బదులు ఈ టీలు తాగడం వల్ల ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా అంది శరీరం నూతనోత్సాహం సంతరించుకొంటుంది. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. కెలొరీలు లేని కాఫీలు టీ కంటే కాఫీ తయారీలో పాలు ఎక్కువ పడతాయి. అందుకనుగుణంగా రుచికోసం వాడే క్రీం, పంచదార వినియోగమూ ఎక్కువే. ఫలితంగా కాఫీ అందించే కెలొరీలు ఎక్కువే! ఒక పెద్ద కప్పు కాఫీ నుంచి అందే కెలొరీలు 300 నుంచి 400 వరకు ఉంటాయి.
 • ఒక చిన్న చెంచా పంచదారతో. మీగడ లేని కాఫీ తాగడం వల్ల సమస్య ఉండదు. అప్పటికప్పుడు అందుబాటులో పండ్లరసాలు క్యాంటీన్‌కు వెళితే సోడా అధికంగా ఉండే శీతల పానీయాల వైపు మనసు మళ్లడం సాధారణమే! బదులుగా బజారులో దొరికే పండ్ల గుజ్జుని కొనిపెట్టుకొని అవసరం అయినప్పుడు చల్లని మినరల్‌ వాటర్‌ లేదా స్పా నీళ్లతో కలుపుకోవచ్చు. రెండు చెంచాల గుజ్జుకు గ్లాసుడు నీళ్లు కలపొచ్చు.
 • కప్పు శీతలపానీయాల నుంచి 150 కెలొరీలు అందితే. ఈ రకం పండ్లరసం నుంచి 18 కెలొరీలు మాత్రమే అందుతాయి. తాజాగా ఫ్రూట్‌ కూలర్లు. సూపర్‌మార్కెట్లలో తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకులు దొరుకుతున్నాయి. కానీ వీటిల్లో ఉండే కెలొరీలు ఎక్కువే. బదులుగా కప్పు ఐసు, కప్పు మినరల్‌ వాటర్‌, కొద్దిగా స్టాబెర్రీలు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. గ్లాసులోకి తీసుకొని పుదీనాతో అలంకరించుకొని తాగేయండి. రుచితో పాటు శక్తి కూడా! ఆరోగ్యకరంగా. డెస్క్‌టాప్‌ పానీయాలు కొన్ని రకాల విధి నిర్వహణల్లో భాగంగా రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో టీ, కాఫీలు, కోలాలకు బదులుగా పంచదార కలపని ఈ పానీయాలని ప్రయత్నించవచ్చు.

కొవ్వు లేని పాలు

 • కొవ్వులేని పాలతో చేసిన హాట్‌ చాక్లెట్‌ పానీయం.
 • కొద్దిగా స్పావాటర్‌ వాడిన పండ్ల రసం.
 • నెక్టర్‌ వాడి చేసిన పండ్లరసం. నెక్టర్‌ అంటే సహజసిద్ధంగా పూలు, పండ్లను నుంచి సేకరించిన చక్కెర పదార్థం. ఆఫీసు బ్యాగులో పోషకాహారం
 • సాయంకాలం ఉపాహారం తినే సమయంలో చాలా మంది ప్రాధాన్యం ఇచ్చేది సమోసా, పిజా, బర్గర్‌, చిప్స్‌ వంటి వాటికే! బదులుగా ఉప్పు తక్కువగా ఉండే సూప్‌లు లేదా గుప్పెడు వాల్‌నట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.
 • మనకోసం మనం చేసుకొనే పదార్థాల్లో వేటి మోతాదు ఎంత మేరకు ఉంటే. ఆరోగ్యదాయకమో మనకు బాగా తెలుస్తుంది. ఉద్యోగ పనుల్లో ఆరోగ్యం గురించి ఆలోచించడానికి క్షణం తీరిక లేదు అనుకొనేవారు ఒక రోజు ముందుగానే పండ్లని ముక్కలుగా తరిగి జిప్‌లాక్‌ బ్యాగులో వేసుకోవాలి. ఆఫీసుకెళ్లేటప్పుడు బాక్సులో తీసుకెళ్లిపోవచ్చు.
 • ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినేద్దాంలే అనుకోకుండా ఉండాలంటే. బేబీ క్యారట్‌, తృణధాన్యాలతో చేసిన బార్లు, మొలకలు వంటి వాటిని బ్యాగులో వేసుకొని వెళితే మేలు. కొంతవరకైనా జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండగలుగుతారు.
 • వంట చేయడాన్ని ఆస్వాదించేవారు తక్కువ సమయంలో అయిపోయే కార్న్‌చాట్‌, చపాతీ రోల్స్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వెంట తీసుకెళ్లవచ్చు. బజ్జీలు, సమోసాలకు బదులు పాప్‌కార్న్‌, బేల్‌పూరీలు మంచి ప్రత్యామ్నాయాలు.
 • నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు కెలొరీలు, కొవ్వు, పంచదార ఉంటాయి.
 • ఆఫీసులో పార్టీ అనగానే క్యాంటీన్‌లో కనిపించే చాక్లెట్లని తినేస్తుంటారు చాలామంది. సాధారణ చాక్లెట్‌కన్నా హాట్‌ చాక్లెట్‌ డ్రింక్‌ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిలో మూడు గ్రాముల కొవ్వు, 140 కెలొరీలు శక్తి మాత్రమే ఉంటే, చాక్లెట్‌ని నేరుగా తినడం వల్ల 230 కెలొరీల శక్తి, 13 గ్రాముల కొవ్వు చేరుతుంది. ఎండుఫలాలు. వేయించిన సెనగలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తాజా పోషకాహారాన్ని తెచ్చుకోవడానికి వీలుపడట్లేదు అనుకొనేవారు. ఆఫీసులో భద్రపరుచుకొనే ఆహారాలివి. ఒక డబ్బా నిండా ఎండు ఫలాలు, పీచు అధికంగా ఉండే పోషకాహార బిస్కెట్లు, ఇన్‌స్టంట్‌ భేల్‌పురీ, వేయించిన సెనగలు, బఠాణీలు, మరమరాలు ఉంచుకోవచ్చు. పనివేళల్లో ఆహారం. అప్రమత్తం
 • 'పని ఎక్కువగా ఉంది'అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే పని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఆహారంపై దృష్టిపెట్టకపోయినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత పనిలో ఉన్నా సరే భోజనం తినేటప్పుడు కొంత విరామాన్ని తప్పక తీసుకోవాలి.

ఆరోగ్యానికి పానీయాలు

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మనము నిత్యజీవతములో చిన్న చిన్న పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటూ ఉంటాము. ప్రతి దానికి డాక్టరు వద్దకు పరుగెత్తుకెళ్ళడం సాధ్యము కాదు. అంత అవసరము కుడా ఉండదు. అలాంటి సమయాల్లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఆరోగ్యసమస్యల్ని తేలికగా అధిగమించవచ్చునని అద్యయనము చేసిన నిపుణులు సూచిస్తున్నారు.

 • నీరసముగా ఉండి అలసిపొయిన మీరు తిరిగి త్వరగా శక్తి పుంజుకోవడానికి, ఉత్సాహము కలగడానికి నిమ్మరసము బాగాపనిచేస్తుంది. ఒక అరముక్క నిమ్మపండు రసము ఒక గ్లాసు నీటిలో (250 మి.లీ) తగినంత పంచదార, మధుమేహం గలవారు సుగరు ఫ్రీ పౌడర్ వేసి బాగా కలియబెట్టి త్రాగితే నీరసము, అలసట తగ్గుతుంది. నిమ్మ ముక్కు (నోస్) లో వుండే నరాలను ఉత్తేజపరిచి అలసటను పోగొడుతుంది. మెదడులోని సెన్సర్లు చైతన్యము పొంది శరీరము, మనసు హుషారు పొందుతాయి. నిమ్మ లో ఉండే విటమిన్‌ "సి"యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసి శరీరము లో వ్యర్ధపదార్ధాలు తొలగి పోతాయి.
 • ఉదయాన్నే లెచిన వెంటనే బద్దకము గా అనిపిస్తుంది. ఒక పట్టాన నిద్రమత్తు వదలదు. కాసేపాగి లేద్దాం అనిపిస్తుంది. వీటిని నివారించాలంటే ఒక కప్పు కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. రోజూ ప్రారంభములోనే నిద్ర మత్తు వదలించి ఉత్తేజము కలిగించే గుణము కాఫీలోని కెఫిన్‌ లో ఉంటుంది. శరీరమంతా ఉన్న నరాల వ్యవస్థ ఉత్తేజము పోంది హాయిగా చురుకుగా ఉండవచ్చును. అయితే వెన్నతీసిన పాలనే వాడాలి. తక్కువ చెక్కెర వేసుకోవాలి లేదా సుగరు ఫ్రీ పౌడర్ వాడాలి.
 • పొట్టలో వికారముగా లేదా బరువుగా, ఉబ్బరము గా ఉన్నప్పుడు మనసంతా చికాకుగా మారిపోతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇలాంటి సమయాలలో అల్లం తో రసము తయారు చేసి తీసుకుంటే ఉపసయనము కలుగుతుంది. రోజూ మామూలుగా తాగే టీ లో రెండు అల్లము ముక్కలు వేసి తయారుచేసి త్రాగాలి లేదా గ్లాసు నీళ్ళలో చితకకొట్టిన అల్లము ముక్కలు వేసి బాగా కాచిన తర్వాత ఆ రసాన్నికొద్దిగా పంచదార వేసి తీసుకోవచ్చు. ఇందులో మింట్ కలుపుకోవచ్చును. ఐతే చాతీలో మంటగా ఉంటే మాత్రము మింట్ ను వాడకూడదు. మింట్. మంటను అధికము చేస్తుంది.
 • వ్యాయామము చేసిన తరువాత చెమట రూపము ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతాయి. శక్తి అవసరము కావున. మధుమేహం లేకుంటే గ్లూకోస్ + నిమ్మ రసము కలిపి త్రాగాలి. తేనె +నిమ్మరసము అయితే మరీ మంచిది. మార్కెట్ లో "ORS డ్రింక్స్ రెడీ గా దొరుకుతాయి అవి త్రాగితే మంచిదే. వెన్న తీసిని పాలను పంచదార తగినంత కలిపి తీసుకోవచ్చు. వీటిలోని ప్రోటీన్లు, కాల్సియం, అనేక పోషకాలు శరీరానికి బాగా ఉపకరిస్తాయి.
 • రోజంతా వివిధ రకాల పనులతో ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి రావచ్చు. అలాంటి సమయములో యాపిల్ జ్యూస్ తీసుకోవాలి. యాపిల్ లో ఉండే 'యాస్ప్రిన్‌'వల్ల తలబారము, తలనొప్పి తగ్గుతాయి. యాస్ప్రిన్‌ వలన గుండె జబ్బులు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది.
 • ప్రతి మహిళ రుతుస్రావము సమయము లో నొప్పి, నీరసము అనుభవిస్తుంటారు. ప్రతిరోజూ "ఇన్సులిన్‌ ఆకు"కషాయము తీసుకుంటే చాలా మంచిది. ఇన్‌సులిన్‌ మొక్క ఆకులు 4-5 దింటిని ముక్కలుగా చేసి ఒక గాసు (150 మి.లీ) నీటిలో బాగా మరిగించగా వచ్చిన నీటిని పాలు, పంచదార వేసి కాఫీ లా ప్రతిరోజూ తాగితే (మదుమేహం ఉంటే సుగర్ ఫ్రీ పౌడర్ వాడాలి) రుతుస్రావ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి.
 • అప్పుడప్పుడు ఏదీ జ్ఞాపకము ఉండడం లేదని చెప్పే వయసు మల్లినవారు రోజూ "గ్రీన్‌ టీ"తాగితే బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని అనేక యాంటి ఆక్షిడెంట్స్ ఆరొగ్యాన్ని కాపాడి మెదడును చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి.
 • నిద్ర రావడనికి మాత్రలు వాడేకంటే. పడుకునే ముండు వెచ్చటి పాలు తీసుకుంటే ప్రయోజనము ఉంటుంది. పాలు నిద్రకు ఉపయోగపడే "ట్రిప్టోఫాన్స్ "లను ఉత్తేజపరుస్తుంది.

ఉత్సాహానికి ఈ 7 తినాలి

నాకు అది ఇష్టము, ఇది ఇష్టము అని బెట్టు చేయకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదీ కాదనకుండా తినడం. అయితే మెరుపులీనే చర్మము, మంచి ఆరోగ్యముకోసమే అని గుర్తుంచుకుని మరీ తినాల్సినవి ఏడు ఉన్నాయి. రోజంతా ఉత్సాహముగా ఉండాలంటే బాగా పోషక విలువలున్నవి తినాలి. ఇవి అలాంటివే:

 1. టొమాటో: దీనిలోని లైకోపిన్‌ కాన్సర్ నిరోధకం గా పనిచేస్తుంది. గుండె, రక్తనా ళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడములో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.
 2. నట్స్: ముఖ్యముగా వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడం లో వీటి పాత్ర అమోఘము. వాల్నట్స్ పీచుపదార్షము, ప్రోటీన్‌ ఇతోదికముగాను, మెగ్నీషియం,కాఫర్, ఫోలేట్, విటమిన్‌-ఇ, ఉండి శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్స్ ని శరీరానికి అందిస్తాయి. నిజానికి ఓ సూపర్ డ్రింక్ ఇది. బ్లడ్ ప్రషర్ తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండ ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది.
 3. టీ :నిజానికి టీ ఓ సూపర్ డ్రింక్.బ్లడ్ ప్రెషర్ని కొంత తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది, గుండే ఆరోగ్యానికి సహా కరిస్తుంది. చర్మానికి ఎండచేసే హానిని నిరోధిస్తుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.
 4. యోగర్డ్ లేదా పెరుగు :ప్రోటీన్‌, కాల్షియం, విటమిన్‌-బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్పెక్షన్‌ కలగకుండా పోరాడతాయి. యోగర్డ్ మన శరీర ఆరోగ్యానికి, డైజెస్టివ్ ట్రాక్ (digestive Track) నెర్వస్ సిస్టం (nervous system ) మేలుచేస్తుంది. పైగా క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై-కొలెస్టిరాల్ బారిన పడకుండా కాపాడుతుంది.
 5. బీన్స్ :ప్రోటీన్స్, పీచుపదార్ధము, విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్ లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ క్యాన్సర్ రాకుండా తోడ్పడుతాయి. డయాబెటీస్ తో పొరాడుతాయి. షుగర్ లెవల్స్ సమతుల్యముగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. అదేసమయములో కొలెస్టరాల్ లెవెల్స్ నీ కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్ తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండి నట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.
 6. బెర్రిస్. ముఖ్యము గా నేరేడుపండ్లు :వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించేఅవకాశమున్నది. అలాంటి అనారోగ్యలనుండి కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్షిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.
 7. ఆకుకూరలు :బ్రొకోలిలాంటి ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్‌ బి, సి,ఇ, ఫొలేట్, పొటాషియం, సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి అమోఘమైనవి. కాల్సియం ని శరీరం ఇముడ్సుకోవటానికి తోడ్పతాయి. వృద్ధాప్యములో వచ్చే కేటరాక్ట్ లను నిరోదించడములో స్పినాచ్ తోడ్పడుతుంది. పీచుపదార్ధము ఉండడం మరో మేలైన అంశము.

ఉప్పు

మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్‌ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.

 • బహు ప్రయోజనకారి

ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్‌ ప్రెజర్‌ 'కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్‌ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్‌ చేస్తుంది. ఆల్డోస్టిరాన్‌ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్‌, ఆల్డోస్టిరాన్‌ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్‌ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్‌ చేయడానికి మందులు ఉన్నాయి.

 • ఎంత తీసుకోవాలి?

రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.

 • గుండెను కబలిస్తుంది

సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.

 • రక్తపోటును పెంచుతుంది

శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్‌ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్‌ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్‌ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్‌ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్‌ తీసుకుంటారు. ఈ పిల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్‌ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్‌ హెమరేజ్‌ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.

 • బిపికి జీవితాంతం మందులు

ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్‌ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్‌ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.

 • ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?

మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.

 • నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.
 • ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.
 • ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.
 • డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.
 • ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్‌, చిప్స్‌ను బాగా తగ్గించాలి.
 • ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.
 • పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.
 • అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.
 • ఆల్కహాలు, ధూమపానం మానాలి.
 • ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.
 • కూల్‌డ్రింక్స్‌ మానాలి.

ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

 • మీకు తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.

ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.

మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.

ఉప్పు తినాలా ? వద్దా?.ఉప్పు తప్పనిసరిగా ఆహారములో తీసుకోవాలి. నార్మల్ గా ఏ వ్యాధులు లేనివారు రోజుకి 6(ఆరు) గ్రాములు అన్నివిధాలా మొత్తము గా తీసుకోవాలి. గుండెజబ్బులు, బి.పి. ఉన్నవారు ఇందులో సగము. సుమారు 2.5 - 3.0 గ్రాములు వాడాలి.

 • ఉప్పులో రకాలు :

ఉప్పులో సోడియం, క్లోరైడ్ అను రెండు పదార్ధాలు ఉంటాయి.

 • కామన్‌ సాల్ట్ :

ఇది మనము కిచెన్‌ లో వాడే రకము. సముద్రపు నీటినుండి తయారుచేసి శ్ర్భ్రము చేస్తారు. కొన్ని రసాయనాలు కలిపి ఫ్రీ గా పొడుము గా ఉండేలా చేస్తారు.

 • అయోడైజ్డ్ సాల్ట్ :

కామన్‌ సాల్ట్ కు అయోడిన్‌ కలుపుతారు. ఉప్పును శుభ్రము చేసినపుడు అయోడిన్‌ పోతుంది. అయోడిన్‌ వల్ల థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. అందువల్ల ఉప్పుకు అయోడిన్‌ కలిపి తయారుచేస్తారు.

 • సీ సాల్ట్ :

సముద్రము నీటినుండి తయారుచేసే ఉప్పు స్పటికాలు. దీనిలో కొద్దిగా అయోడిన్‌, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనినే వాడేవారు.

 • రాక్ సాల్ట్ :

గ్రే / పింక్ రంగులో ఉంటుంది. ఇది రిఫైన్‌ చేసింది కాదు. కాబట్టి అన్ని మినరల్స్ యదాతదం గా ఉంటాయి. ఎసిడిటీని తగ్గిస్తుంది.

 • ఎప్సమ్‌ సాల్ట్ : మెగ్నీషియం సల్ఫేట్

దీన్ని వంటకాలలో వాడరు. మందులషాపులలో దొరుకుతుంది. స్నానము చేసే నీటిలో కలిపి వాడితే శారీక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది. చర్మము పై మృతకణాలను తొలగిస్తుంది. containing magnesium, sulfur and oxygen, with the formula MgSO4. దీన్ని విరోచనకారిగా వాడుతారు (used as a saline laxative).

 • ఉప్పుహార్ట్ ఫెయిల్యూర్

అధిక రక్తపోటు వలన ధమనుల్లో ఆర్టీరియల్ ఒత్తిడి ఏర్పడి రక్తం సంచితమవుతుంది. దీని పరిణామంగా రక్తం వెనుకు పోటేసి గుండె పంపింగ్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కొద్దిసేపు ఏదైనా పని చేస్తే శ్వాసవేగం పెరుగుతుంది. పనితో సంబంధం లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూడా ఆయాసం రావడం జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పు ఎంతవరకు అవసరం ? మన శరీరంలో సోడియం ఉత్పత్తికాదు, కాబట్టి దీనికి మనం తినే ఆహారం తాగే ద్రవ పధార్ధాలు, దుంపలు, ధాన్యాలు పప్పుదినుసులు, పండ్లు మాంసం, పాలు, మనం తినే నీటిలో కూడా సోడియం వుంటుంది. మనం వంటచేసేటపుడు కూరలతో ఉప్పు సరేసరి! వీటిని దృష్ఠిలో పెట్టుకుని ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు 1 టీ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రక్తపోటు, గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులున్న వారు ఉప్పు తక్కువ తినాలి. మోతాదుకు మించి ఉప్పును వాడటం మంచిదికాదు.

ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకుంటున్నారా? అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం చొప్పున వినియోగించాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది 3000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సోడియం వాడుతూ వుండడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ లాంటి ఇతర రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. కేవలం ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2000 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో దొరికే ఏ ఒక్క వస్తువులోనైనా తేలిగ్గా అంతే మోతాదు వుంటుంది. దీర్ఘ కాలం ఎక్కువ సోడియం వాడడం రక్త పోటు, ఇతర బలహీన పరచే పరిస్థితులకు సంబంధించినది కావడం వల్ల సోడియం వాడకాన్ని నియంత్రణ లో ఉంచుకునే మార్గాలు వెతకడం ఆరోగ్యానికి మంచిది. సోడియం వాడకం మితిమీరి ఎక్కువైతే అది వెంటనే కొన్ని వైద్య లక్షణాలు చూపిస్తుంది - పగిలిన, రక్తమోడుతున్న పెదాలు, కడుపులో తిప్పడం లాంటివే కాక, కొన్ని తీవ్ర సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకున్నా లేక తొలగించాలనుకున్నా, మీ ప్రయత్నంలో ఉపయోగపడేందుకు ఇదిగో ఈ క్రింది సూత్రాలు పాటించండి. :

1. మీ ఆహారాన్ని సహజ స్థితిలో లేదా ఉడికించిన స్థితి లో రుచి చూడడానికి అలవాటు పడ౦డి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ఉప్పు కలపక ముందు రుచి చూడ౦డి. మీరు అలవాటు చొప్పున ఉప్పు వేసుకునే వారైతే, ఉప్పు కన్నా ముందు ఫోర్క్ తీసుకుని - ఉప్పు లేని ఆహారం రుచిని ఆస్వాదించడం మళ్ళీ నేర్చుకోండి. మొదట్లో చప్పగా వున్నట్టు అనిపించినా, ఆ భావన త్వరలోనే పోయి ఉప్పు ఆహార పదార్ధాల అసలు రుచిని ఎలా మరుగు పరుస్తుందో తెలుసుకుంటారు. మార్పు రావడానికి కొద్ది సమయం ఓపిక పట్టండి - ఓ రెండు మూడు నెలలకు గానీ మీ ఇంద్రియాలు ఉప్పు కోసం వెంపర్లాడడం మానవు.

2. ఆహార పదార్ధాల పై లేబుళ్ళు చదవండి, వెబ్ సైట్ లు చూసి మీరు రోజూ తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత ఉందొ తెలుసుకోండి. మీరు తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకు౦టు౦టే ఉప్పు వాడకం తగ్గించాలని మీరు త్వరగా సమాధానపడతారు. వెచ్చాలు కొనేటప్పుడు సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి.

ఇంట్లో వండుకుని తినడం 1. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఉప్పు వాడకం తగ్గించండి. అత్యవసరమైతే తప్ప ఉప్పు వేయడం మానేయండి. వంటకాల్లో సూచించిన దాంట్లో సగం ఉప్పే వేయండి, ఇంకా అలా సగం చేసుకుంటూ వెళ్ళండి. కుదిరితే, వంట చివర గానీ లేదా తినబోయే ముందు కానీ ఉప్పు వేయండి. ఇలా చేస్తే, ఉప్పుకి వంటకం లో కలవడానికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెమే సరిపోతుంది. 2. తాలింపు కోసం వాడే వాటిలో సోడియం ఎంతుందో చూడండి. పంది మాంసపు ముక్కలు, రొమనో వెన్న, కొన్ని ఎంపిక చేసిన తాలింపు సామాను లాంటి చాలా పదార్ధాలు ఎక్కువగా ఉప్పుతో కూడి వుంటాయి కనుక సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయండి (కెచప్, ఆవ పెట్టిన ఊరగాయ బదులు బర్గర్ మీద పాలకూర, ఉల్లి, టమాటో వాడండి). ప్రత్యేకమైన తాలింపు పాకెట్ వుండే వాటికి - ఆ పాకెట్ లో తక్కువ పరిమాణం వాడండి లేదా పూర్తిగా తగ్గించండి. ఐతే, కొద్దిగానే అయినా ఈ రుచులు, తాలింపు ఉప్పు కలపడమే నేరుగా ఉప్పు కలపడం కన్నా మంచిది. 3. ఉప్పు బదులు ఉప్పు లేని తాలింపు వాడండి. ఉప్పు నుంచి దూరంగా ఉండడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయాల శ్రేణి వుంది. వాటిలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, తాజా కూరగాయలు, మాంసం, కూరల ఉప్పు ఒరేగానో, నిమ్మ రసం, మిరియప్పొడి, మిరపగుండ, కారపు సాస్ లేదా సాల్సా కూడా కొద్దిగా రుచిని జోడిస్తాయి. 4. ప్రాసెస్ చేసిన ఆహారాలు మానివేయండి. తాజాగా తయారైనవి, మాంసం, మంచినీటి చేప లాంటివి ఉప్పు లేకుండా వుంటాయి లేదా కొద్ది పాటి సోడియం ను కలిగి వుంటాయి, కాగా సూప్ లు, శీతలీకరించిన ఆహారం, ప్రాసెస్ చేసినవి, రెస్టారెంట్ లో తయారయ్యేవి సాధారణంగా సోడియం అధికంగా కలిగి వుంటాయి. మీకు తాజా కూరగాయలు అందుబాటులో లేకపోతే సోడియం అధికంగా వుండే కూరగాయల కన్నా సోడియం లేని, లేదా తక్కువగా వుండే డబ్బాల్లో వున్న కూరగాయలు వాడడం మంచిది. అందుకే సోడియం పరిమాణం ఎంతుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. 5. ఆహార పదార్ధాల మీద నుంచి సోడియం తొలగించండి. ఉప్పు కలిసిన వాటి కన్నా పైన ఉప్పు చల్లిన పదార్ధాలు ఎంచుకోండి. ఉదాహరణకు సాల్టైన్ లు కొనేటప్పుడు ‘సాల్ట్ కలపని పైముక్కల'కొనుగోలు మానేయండి ఎందుకంటే వాటి పైన కాకుండా ఉప్పు లోపల కలిసిపోయి వుంటుంది - అందువల్ల దాన్ని తొలగించడం కుదరదు. "ఉప్పు పైన'వుండే ఉత్పత్తులు కొద్ది సోడియం పరిమాణానికి ఎక్కువ రుచిని అందిస్తాయి, కనుక ఆ కోణంలో చూసినా అవే మంచివి. 6. టేబుల్ దగ్గర కూర్చున్నపుడు మీ ఉప్పు వాడే అలవాట్లు మార్చుకోండి. సాల్ట్ షేకర్ ముట్టుకోకండి. తగ్గించేటప్పుడు కూడా మొత్తం ఒంపుకోకుండా ఒక్కసారి షేక్ చేయండి - ఇక నెమ్మదిగా ఈ అలవాటుకి దూరం జరగండి. మసాలా దినుసులతో జాగ్రత్త - సాస్ లు ఇతర టాపింగ్స్ లో ఎక్కువ పరిమాణం లో ఉప్పు ఉంటుంది. 7. ఆహారాల్లో వున్న సోడియంను తగ్గించండి. మీరు ఎక్కువ సోడియం వున్న సూప్ ల లాంటి పదార్ధాలు కొంటే దాన్ని పల్చగా తయారు చేయడం వల్ల సోడియం స్థాయి తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు లేబుల్ మీద సూచించినట్టుగా సూప్ తయారు చేస్తే, దాంట్లో సోడియం పరిమాణం ఎక్కువగా వుంటుంది. దాని బదులు మీరు క్యాన్ చేసిన సూప్ ను తీసుకుని బంగాళా దుంపలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, కారెట్లు లాంటి తాజా కూరగాయలు కలపండి. అలా కాకుండా దాన్ని నేరుగా వడ్డి౦చడం వల్ల తినే ప్రతివారికీ ఎక్కువ పరిమాణంలో సోడియం అందుతుంది. 8. ఇంట్లో తినండి. వేరే వాళ్ళ ఇళ్ళలోనో, రెస్టారెంట్లలోనో తింటే ఇతరులు తయారు చేసిన పదార్ధాలలో సోడియం పరిమాణం నియంత్రించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇంట్లో తింటున్నాం అంటే మీ ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.

నిత్యం అందుబాటులో ఉండే ఉప్పు వంటలకు రుచినివ్వడమే కాదు, మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది.

రోజూ నీళ్లు పోయడం వల్ల ఫ్లవర్‌ వాజు లోపల గారపడుతుంది. అలాంటప్పుడు ఉప్పు నీటిని వాజులో నింపి అరగంట నాననివ్వాలి. ఆ తరవాత బాగా గిలక్కొట్టి సబ్బు నీటితో కడిగేస్తే గార వదులుతుంది. గుమ్మాలకు వేలాడదీసే ప్లాస్టిక్‌ పూల దండలూ, ఫ్లవర్‌ వాజులపై దుమ్ము పేరుకుంటుంది కదా! దాన్ని వదిలించడానికీ ఉప్పు ఉపయోగపడుతుంది. అందుకు ఏం చేయాలంటే. పెద్ద ప్లాస్టిక్‌ కవరులో గుప్పెడు ఉప్పు వేసి అందులో ప్లాస్టిక్‌ పువ్వుల్ని ఉంచి ముడి వేసి, కవరును బాగా కదపాలి. ఉప్పు నల్లబడిందంటే దుమ్ము పోయినట్లే.

గదులు వూడ్చే మెత్తని చీపురుని కొనగానే వాడేయకండి. బకెట్‌ వేడి నీళ్లలో కప్పు ఉప్పు వేసి దాన్లో చీపురు మునిగేలా ఉంచండి. పావు గంటయ్యాక దాన్ని బయటకు తీసి ఎండలో ఉంచండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువకాలం మన్నుతుంది.

భోజనాల బల్లపై నీటి మరకలు ఎక్కువగా పడుతుంటాయి. వాటిని వదిలించాలంటే ఉప్పే పరిష్కారం. అరకప్పు ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. దీన్ని నీటి మరకలున్న చోట పూతలా రాసి కాసేపయ్యాక కడిగితే మరకలు సులువుగా పోతాయి.

ఈ కాలంలో కిటికీ అద్దాలపై మంచు పేరుకుని మసగ్గా కనిపిస్తుంది. దానికీ ఉప్పు నీరే పరిష్కారం. ఉప్పు నీటిలో మెత్తని వస్త్రాన్ని ముంచి కిటికీ అద్దాలను తుడవాలి. ఆ వెంటనే మరో మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఇంట్లో చీమలు బారులు తీరి ఇబ్బంది పెడుతోంటే ఆ ప్రదేశంలో ఉప్పు చల్లితే, తక్కువ సమయంలో వాటి బెడద వదులుతుంది.

చెత్త డబ్బాల్లో పేరుకున్న మురికీ దుర్వాసనా వదలాలంటే డబ్బా అంతటా అరకప్పు ఉప్పు చల్లండి. కాసేపయ్యాక చల్లని నీరు పోస్తూ కడిగేస్తే, మురికితో పాటూ దుర్వాసన కూడా పోతుంది.

ఆధారము : Sindhu@boldsky.com

ఉసిరి

దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా(Phyllanthus emblica). ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమా రుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరిం చి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకు పచ్చ రంగుల సంమ్మేళనంతో కూడి ఉంటా యి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి, 6 నిలువుగీతలు కలిగివుంటాయి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణా లున్న వృక్షం. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విట మిన్‌ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడు తుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటి వి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్‌ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచేస్తున్నారు. అంతేకాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారుచేయబడిన నూనెని చాలా మంది నిత్యంవాడుతూ వుంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది. సౌందర్యసాధనాల తయారీ లో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ది చెం దింది. భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసు కునే రంగుల్లో, కూడా దీనిని విరివిగా వాడు తున్నారు. దీనితో తయారుచేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధవ్యాధులకి ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధిగంగా ఎగుమతి అవుతు న్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచమార్కెట్లో అధిక లాభాల్ని అర్జింస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే, మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందన డంలో ఎంత మాత్రం అతిశయోక్తికాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడు తుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం వక్కాణిస్తున్నాయి. ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల'అనీ, సంస్కృతంలో "ఆమలక"అనీ అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఇదు రుచులను కలిగి ఉంది. అత్యధికం గా "సి "విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.రాసాయనికముగానా రింజలోకన్నాఉసిరిలో౨౦రెట్లుఎక్కువగావిటమిన్సిఉంటుంది. యాన్తి ఆక్షిదేంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్,కాల్సియం, ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి.

 • ఉపిరి తిత్తులు,కాలేయం, జీర్ణమండలం, గుండె -దీని పరిదిలోనికి వస్తాయి.

జీర్ణమండలం:

 • దాహం,మంట,వాంతులు,ఆకలిలేకపోవుట,చిక్కిపోవుట,ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, మున్నకు జీర్ణ మంటాడ వ్యాదులను తగ్గిస్తుంది.

ఉపిరితిత్తులు:

 • ఆస్తమా,బ్రాంకైటిస్,క్షయ,శ్వాసనాలముల వాపు, ఉపిరితిట్టులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది.

గుండె:

 • ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది.
 • ఉసిరి వళ్ళ ఆహారములోని ఇనుము ఎక్కువగాగ్రహించబడుతకు తోడ్పడుతుంది.
 • శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది.

కాలేయము:

 • కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి.
 • కాలేయం లో చేరిన మలినాలు,విష పదార్ధాలు ను తొలగిస్తుంది, 'యాంటి ఆక్షిడెంట్'గా పనిచేస్తుంది.

ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు

విటమిన్‌ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం

 • చీజ్‌,
 • క్యారెట్‌,
 • పాలూ,
 • గుడ్లూ

వాళ్లకి అందించాలి.

బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి.

 • మాంసం,
 • చేపలూ,
 • సోయా,
 • బీన్స్‌

వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి.

కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్‌ సి చాలా అవసరం.

 • టొమాటోలూ,
 • తాజా కాయగూరలూ,
 • విటమిన్‌ సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్‌ సి లభిస్తుంది.

ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్‌ డి అందాలి. ఇందుకోసం

 • పాలూ,
 • పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.

ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం

 • పాలకూర,
 • ఎండుద్రాక్ష,
 • బీన్స్‌ వంటివి తరచూ తీసుకోవాలి.

కష్టంగా జీర్ణం అయ్యే కొన్ని ఆహారాలు

 • తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి మీలో గుండె మంటలను కలిగిస్తాయి. అలాగని అన్ని ఆహారాలు మంటను కలిగించవు, బరువుగాను వుండవు. అయితే, చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. చాలాసార్లు, మనం అసలు అజీర్ణం ఎలా కలుగుతోందో చెప్పలేము. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్ణం ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం.
 1. బాగా వేయించిన ఆహారాలు :
  • - బాగా వేయించిన వేపుడు పదార్ధాలు అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అంతేకాక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు అనారోగ్య నూనె లేదా బాగా మరిగిన నూనె అనేక మార్లు ఉపయోగించటం చేస్తారు. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
 2. మసాలా ఆహారాలు :
  • - పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.
 3. పాలలోని షుగర్ పడకపోవటం :
  • - లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది లేదా లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.
 4. ఆకు కూరలు -కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్నం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.
 5. గింజ ధాన్యాలు
  • - పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది.
 6. సిట్రస్ పండ్ల రసాలు -సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. ప్రత్యేకించి వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి. ఉదాహరణకు ఖాళీ పొట్టతో సిట్రస్ పండ్లు లేదా రసాలు తీసుకోరాదు.
 7. విత్తన ఆహారాలు -
  • విత్తనాల ఆహారాలు ఏవైనప్పటికి పొట్టకు బరువే. విత్తనాలకంటే కూడా ముందుగానే ఆహారం జీర్నం అయిపోతుంది. టమాటా, వంకాయ, పచ్చిమిరప వంటివాటి గింజలు లోపల జీర్ణం కాకుండానే పేగుల ద్వారా ప్రయాణించి మలంలో బయటకు విసర్జించబడటం చూస్తూనే వుంటాము.
 8. రాగి అంబలి / రాగి రొట్టెలు- ఇందులో కాల్సియం, ఐరన్‌. ఎక్కువగా ఉండడము చేత కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఆలస్యముగా జీర్ణమవుతుంది. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది.
  • ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. కాని అవి తినటం మానరాదు. ఎందుకంటే మీ ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకుండా వాటిని తక్కువ మొత్తాలలో తినండి

కోడి గ్రుడ్డు

పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కాదుగనుక తొందరగా ఆకలివేయదు.

గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు :

 • 9 ఎమినోయాసిడ్లు,
 • ఎ.,డి., ఇ. విటమిన్లతో సహా
 • 11 అత్యవసర పోషకాలు,
 • థయమిన్‌,
 • నియాసిన్‌,
 • రైబోఫ్లేవిన్‌,
 • ఐరన్‌,
 • పాష్పరస్..ఉంటాయి.

గుడ్లు చాలా చవకైన పోషకాహారమే కాదు. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 • గుడ్లలో విటమిన్‌ డి దండిగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముకజబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
 • ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
 • మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయజబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం.
 • ఉదయంపూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలి వేయకుండా చూస్తూ. ఎక్కువెక్కువ ఆహారం తినకుండా చేస్తాయి. ఇలా బరువు తగ్గటానికీ గుడ్లు తోడ్పడతాయన్నమాట.
 • ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయులు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఇవి రెండూ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలే.

పాలు

 • పాలుఅంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకొనే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్దంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రముగా జీర్ణం కాగలిగిన ఆహారం.
తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు, పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు,ఒంటెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.
 • మూడు ప్రోటీనులూ, ఆరు విటమినులూ, ఇరవై ఐదు ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంది. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది. స్తన్యములను వృద్ధిచేయును. శరీరానిని కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడములో పాలు తోడ్పడుతుంది.

పోషక విలువలు:

 • కొవ్వు పదార్దాలు 4 %
 • పిండి పదార్ధాలు ('కార్బోహైడ్రేట్‌'లు) - 4.7 %
 • మాంసకృత్తులు ('ప్రోటీన్‌'లు) - 3.3 %
 • నీరు - 88 %
 • మనిషి పాలలో 71 కిలో కేలరీలు, ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.

పాల ఉత్పత్తులు:

 • మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు.
 • పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది.
 • పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి.
 • మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది.
 • మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది.
 • వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది.
 • పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారుచేస్తారు.
 • ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు.

పిల్లలకు త్రాగించే పాలు :

 • పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి(వేడి చేసి) పొంగిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్ల యితే అందులోని బాక్టీరియా నశిస్తుం ది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. పశువులపాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాలవ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులొస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడు తోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అల్లాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వుద్వారా లభించేది ఎ,డి విటమిన్‌లు. 'ఎ'విటమిన్‌ ఆహార పదార్థా ల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందు తుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు, పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరకదృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వాము ను వేసి మూటకట్టి, పాలను కాచేట ప్పుడు, ఆ మూటను ఆ పాల ల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుం టుంది. ఆకలికూడా బాగా ఏర్పడుతుంది.

 • పాలు జీర్ణము అయ్యే విధానము :

పాలు జీర్ణమవడానికి. రెనెట్ అనే ఎంజైం సముదాయము పాలు జీర్ణానికి మానవులలో తోడ్పడుతుంది. దీనిలో ''కైమోసిన్‌ లేదా రెన్నిన్‌''అనే ఎంజైం ముఖ్యమైనది.

 • లైపేజ్ : కొవ్వు పదార్ధములను,
 • ప్రొటియేజ్ : మాంసకృత్తులను,
 • లాక్టేజ్ : పాలులో ఉన్న కార్బోదైడ్రేట్ ను లాక్టోజ్ అంటాము. ఇది లాక్టేజ్ అనబడే ఎంజైం వలన జీర్ణము అవుతుంది.

కైమోసిన్‌ లేదా రెనిన్‌ అనేది ఒక proteolytic enzyme. ఉదరకోశము (stomach) లో చీఫ్ కణజాలము (chief cells) ద్వారా తయారగును. ఇది పాలును జీర్ణము చేయుటలో ముఖ్య పాత్ర వహించును. కెసిన్‌ అనే పాల పోటీన్‌ ను విడగొట్టడము తో పాలు జీర్ణమగును. పుట్టి పసిపిల్లలలో 100 శాతము తయారగును. క్రమేపి రెనిన్‌ తయారీలో తగ్గుముఖం పడుతూ 12 సం.లు వయసు నాటికి ఇది పూర్తిగా తయారవడం ఆగిపోయీ దీని స్థానము లో పెప్సిన్‌(pepsin) తయారయి. ప్రొటియోలైటిక్ ఎంజైం గాపనిచేయును. కావున పెద్దవారిలో పాలు జీర్ణము కావు. కెసిన్‌ హైడ్రోలైసేట్ బ్రేక్ డౌన్‌ అవక నిరుపయోగముగా విసర్జించబడును. పాలలో ఉన్న నీరు, నీటిలో కరిగే విటమిన్లు పెద్దవారిలో గ్రహించబడి ఊపయోగపడును.

.పాలతో బరువు తగ్గవచ్చును :

పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుగు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే. మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడం తో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదేసమయము లో ఇతర పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్సియం, విటమిన్‌ డి-బరువుతగ్గడము లో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది.

ఎసిడిటీని తగ్గించే పాలు :

పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన 'పరిపూర్ణ పౌష్టి కాహారం'కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది.

ఆహార విలువలు

పాలలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, మనకు తెలిసిన అన్నిరకాల విటమిన్‌లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రొటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ లభిస్తాయి.

ఒక లీటరు పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్పరస్‌, పుష్కలంగా విటమిన్‌'ఎ''సి', మూడోవంతు ప్రొటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్‌, నాలుగోవంతు, శక్తి 'బి', 'ఇ','డి'విటమిన్లు కొంత లో కొంత లభిస్తాయి.

పాలలో లభించే కొవ్వులో 99 శాతం, ప్రొటీన్లలలో 97 శాతం, కార్బోహైడ్రేట్లలో 98 శాతం తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావటానికి గంటన్నర సమయం సరిపోతుంది. పాలలోని లవణాలు, నీరు జీర్ణాశయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్‌ కావడం కావడం ప్రారంభిస్తాయి. కాని మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం ప్రేవులలోకి చేరుకున్న దగ్గరినుంచి అబ్జార్బ్‌ కావటం మొదలెడతాయి.

ఉపయోగాలు

మన ప్రాచీన వైద్యుడు చరకుడు చెప్పిన దానిని బట్టి పాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. అలసటను పోగొడతాయి. సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ ఋజువు కాబడ్డాయి. పాలు తాగే పాపాయిల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒకటేనంటే అతిశయోక్తి కాదు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్ళకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది.

పాలు పడకపోవటం

కొందరి వొంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే. పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరోచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.

పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలటెటగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్ధం చేసుకుని పాలను మానేయాలి.

ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి త్వరగా అతను అంటురోగాల బారినపడే అవకాశం ఉంది.

పాలలో ఔషధోపయోగాలను ఈ కింద పేర్కొనడం జరిగింది.

లావెక్కడానికి :బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థి తికి వచ్చేస్తుంది.

పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

సజావుగా రక్తప్రసరణ : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది శరీరంలో రక్తప్రసరణ సహ జసిద్ధంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్ధి తికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు.

కడుపులో వాయువు :కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థి తులు చాలా త్వరగా సాధారణ స్థి తికి వచ్చేస్తాయి.

నిద్రలేమి :నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కడుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు!

శ్వాస సంబంధవ్యాధులు :జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది.

చర్మవ్యాధులు :పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.

సౌందర్య సాధనంగా :కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ ఇంక మీ దరికి చేరవు.

చేపలు

ఆహారముగా చేపలు: చేపలు ఆరొగ్యనికి ఛాల మంచిది. చేపల్ని మూడు రకాల ప్రధాన తరహాలుగా గుర్తించవచ్చు.

 • వీటిలో శరీరం లో తైలం అధికముగా ఉండేవి ఒక రకము -- >సాల్ మన్, మాక్రెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డినెస్ మున్నగునవి.వీటిలో తైలము ఎక్కువ & విటమిను 'ఎ, డి, ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికము గా ఉంటాయి.
 • రెండో రకము. వైట్ ఫిష్ -> వీటిలో తైలము తక్కువ., ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ తక్కువగా ఉంటాయి. వీటిని తినడము వల్ల ఆరోగ్యము మెరుగవుతుంది.
 • మూడోరకము -- > నిజానికి చేపలు కావు, అవి రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు వంటివి. వీటిలో 'సెలీనియం,జింక్, అయోడిన్, కాపర్ వంటివి చాలా ఎక్కువగా లభిస్తాయి. మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

'బంగారుతీగ'రకం చేపలు మంచినీటిలోనే పెరుగుతాయి. 'ట్యూనా'ల్లాంటివి సముద్రపు నీటిలోనే పెరుగుతాయి. 'బంగారుతీగ'చేప ఉప్పునీటిలో చనిపోతే, 'ట్యూనా'మంచి నీటిలో చనిపోతుంది. ఇలాంటి చేపల్ని 'స్టెనోహాలిన్‌'చేపలు అంటారు. కానీ 'సాల్‌మన్‌, ఈల్‌'ల్లాంటి చేపలు ఉప్పు, మంచి నీళ్లలోనూ జీవించగలవు. కానీ వీటిని పరిసరాలకు అనుకూలంగా తయారుచేయాలి (అక్లైమెటైజ్‌). ఇలాంటి చేపలను 'యూరోహాలెన్‌'రకం చేపలంటారు.

 • Fish -------Calories ---TotalFat ---Saturated---Protein ---Cholesterol
 • Ocean-----110 --------2g -----------0g ------------21g----------50mg

ప్రాచీనకాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం. * చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు. * మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. * చేపలు పట్టబడిన తర్వాత తేలిగ్గా పాడవుతాయి. కావున వీటిని వెంటనే వినియోగించాలి లేదా జాగ్రత్తగా నిల్వచేయాలి. ఎండబెట్టుట, స్మోకింగ్, ఉప్పు లేదా మంచు గడ్డలలో నిల్వచేయుట మంచిది. రోజుకు 3.3గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. గుండెజబ్బుల ముప్పు 23శాతం మేర తగ్గినట్టే. చేపల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి. దానివల్ల కలిగే లాభాలన్నీ పొందాలంటే చేపల్ని వండటంలో కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండుచేపలు, ఉప్పుచేపల్లో ఈ ఆమ్లాలు ఉండవట. తాజా చేపల్ని కూడా వేపుడులాగా కాకుండా మామూలుగా కూరలాగా వండినప్పుడూ లేదా పులుసులో ఉడికించినప్పుడు మాత్రమే పూర్తిప్రయోజనాలు పొందగలమంటున్నారు.

 • పోషకవిలువలు.

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల. రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.

రోజూ చేపలు తినటం మధ్యవయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గానీ అంతకుమించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపు అవుతోంది. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 40-69 ఏళ్ల వారిని ఎంచుకొని. వారి ఆహార అలవాట్లు, తదితర అంశాలను పరిశీలించారు. చేపలు, ఎన్‌-ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవటం వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పులపై ప్రభావాన్ని అంచనా వేశారు. మిగతా వారితో పోలిస్తే రోజూ చేపలు తినేవారిలో ఈ అంశాలు 57 శాతం తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. చేపల్లో దండిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి ట్రైగిజరైడ్ల మోతాదును కూడా తగ్గిస్తాయని వివరించారు. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయని చెబుతున్నారు.

 • అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే ముప్పు ఎక్కువ. తక్కువ నూనెతో వండుకోవటం చాలా అవసరం.
 • చేపలు. పెద్దపేగుకు మేలు

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి బొజ్జ, రక్తపోటు పెరగకుండా చేస్తూ. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా చేపల గురించి మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వీటిని దండిగా తినేవారికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినా. చేపలతో మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు. చేపలు తినే అలవాటు, క్యాన్సర్లకు గల సంబంధంపై గతంలో చేసిన 41 అధ్యయనాలను క్రోఢీకరించి ఈ ఫలితాలను అంచనా వేశారు. అందువల్ల చేపలను అంతగా తిననివారు వీటిని తరచుగా తీసుకోవటం ద్వారా గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని న్యూజెర్సీ-రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన డాక్టర్‌ మైఖేల్‌ గోచ్‌ఫెల్డ్‌ వివరిస్తున్నారు. అయితే ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అధ్యయన కర్త డాక్టర్‌ జీ లియాంగ్‌ హెచ్చరిస్తున్నారు.

జీడి పప్పు

ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో వుంది. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు. ఉపయోగాలు

 • వైద్యం మరియు పరిశ్రమలు

జీడి పిక్క ద్రవంలో(CNSL ), జీడిపప్పు తయారీ పద్దతిలో మిగిలే ద్రవంలో చాలా మటుకు అనకర్దిక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు దంత సమస్యల పైన ప్రభావంతంగా పని చేస్తుంది. ఇది హాని కారక బ్యాక్టీరియను చంపుతుంది. ఇది వివిధ రకాల హాని కారక బ్యాక్టీరియల పైన కూడా సమర్ధవంతంగా పని చేస్తుంది. ఈ చెట్టు వివిధ భాగాలని పటమొన, గయాన వాసులు వైద్యంలో వాడతారు. చెట్టు బెరడు తీసి రాత్రంతా నానబెట్టి లేదా ఉడకబెట్టి విరోచనాలకి మందుగా వాడతారు. విత్తనాల్ని పిండి చేసి పాము కాట్లకు విరుగుడు మందు వాడతారు. పిక్క నూనెను అరికాలి పగుళ్ల పైన పుతగా శైవలాల నిరోధకంగా వాడతారు.అనకర్డిక్ ఆమ్లమును రసాయన పరిశ్రమల్లో కర్డనల్ అనే పదార్ధం ఉత్పత్తి చేయడానికి వాడతారు.

 • వంటలలో వాడకం(వేపి, ఉప్పు వేసిన జీడిపప్పు)

జీడిపప్పు ప్రఖ్యాత ఫలహారము, దీని ఘనమైన రుచి వల్ల పచ్చిగా కూడా తినవచ్చు, కొద్దిగా ఉప్పు లేదా చెక్కర కలుపుకుని కూడా ఆరగించవచ్చు. జీడిపప్పుని చాకొలేట్ పూతతో అమ్ముతారు కానీ ఇది వేరు సెనగ మరియు బాదం పప్పు కన్నా ఖరీదు ఎక్కువ మరియు వాడకం తక్కువ. థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పు భాగం ఉంది, వీరు పూర్తి పిక్కను వాడతారు, అయితే భారతీయ వంటల్లో ముద్ద చేసి షాహీ కుర్మా లాంటి వాటిలో వాడతారు,అంతే కాకుండా పిండి వంటల్లో అలంకరణకు వాడతారు. అంతగా తెలియకపోయినా రుచికరముగా ఉండే జీడిపప్పు యొక్క ఉపయోగం అది లేతగా ఉండి, దాని తోలు ఇంకా గట్టిపదకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని పిక్క మెత్తగా ఉన్నప్పుడు, దానిని కత్తితో రెండు భాగాలుగా చీలుస్తారు. పప్పుని తీసి(అది ఇంకా క్షారతని కోల్పోదు, అందు వల్ల చేతి తొడుగులు అవసరం) పసుపు కలిపిన నీటిలో నానబెడతారు. దీని వల్ల క్షారత కోల్పోతుంది. ఈ విధమైన వాడుక కేరళ వంటకాలలో ముఖ్యంగా అవియల్ తయారీలో కనిపిస్తుంది, ఇందులో రకరకాలైన కూరగాయలు,కొబ్బరి కోరు,పసుపు మరియు పచ్చి మిరపకాయలు వాడతారు. మలేషియాలో లేత ఆకులని పచ్చిగా సలాడ్ లాగా లేదా సంబల్ బెలకన్(మిర్చి మరియు నిమ్మరసం కలిపిన రొయ్యల ముద్ద)కలిపి తింటారు. బ్రెజిల్ లో జీడి పండు రసం దేశం మొత్తం ప్రఖ్యాతి గాంచింది. ఫోర్ట్లేజా వంటి ఈశాన్య ప్రాంత సందర్శకులు తరచుగా అమ్మకందారులు జీడిపప్పు పప్పుని తక్కువ ధరకి అమ్మటాన్ని చూడవచ్చును. కొన్న పిమ్మట ఉప్పువేసి ప్లాస్టిక్ సంచులలో ఇస్తారు. ఫిలిపిన్స్ లో జీడిపప్పు అంటిపోలో యొక్క ప్రఖ్యాతి గాంచిన పంటగా ప్రసిద్ది మరియు సుమన్ తో కలిపి ఆరగిస్తారు. పంపంగాలో ఒక మిఠాయి అయిన టురోన్స్ డి కసుయ్ కూడా జీడిపప్పు పప్పుతో తాయారు అవుతుంది. జీడిపప్పు మార్జిపాన్ ను తెల్లని కాగితంలో చుడతారు.

 • మద్యం

గోవాలో జీడి పండుని(సహాయక ఫలం) నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. తద్ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతం మత్వరలో జీడి పండుని(స్వహిలి బాషలో బిబో ) ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి మరియు బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తాయారు చేస్తారు. దీని పేరు గంగో. మొజాంబిక్ లో జీడిపప్పు వ్యవసాయదారులు సాధారణంగా ఘాటైన మద్యాన్ని జీడి పండుతో తాయారు చేస్తారు. దీనిని "యగవ అర్దంట్"(మండే జలం) అంటారు.

 • పోషక పదార్థాలు -

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

 • శక్తి ---------------550 kcal 2310 kJ
 • పిండిపదార్థాలు ---------- 30.19 g
 • - చక్కెరలు----------- 5.91 g
 • - పీచుపదార్థాలు--------- 3.3 g
 • కొవ్వు పదార్థాలు---------- 43.85 g
 • మాంసకృత్తులు---------- 18.22 g
 • థయామిన్ (విట. బి1)----.42 mg 32%
 • రైబోఫ్లేవిన్ (విట. బి2)-----.06 mg 4%
 • నియాసిన్ (విట. బి3)----- 1.06 mg 7%
 • పాంటోథీనిక్ ఆమ్లం (B5)-----.86 mg 17%
 • విటమిన్ బి6-----------.42 mg 32%
 • ఫోలేట్ (Vit. B9)----- 25 μg 6%
 • విటమిన్ సి-------------.5 mg 1%
 • కాల్షియమ్------------ 37 mg 4%
 • ఇనుము------------- 6.68 mg 53%
 • మెగ్నీషియమ్----------- 292 mg 79%
 • భాస్వరం------------- 593 mg 85%
 • పొటాషియం------------ 660 mg 14%
 • జింకు-------------- 5.78 mg 58%

పోషక విలువల డేటాబేసు

 • జీడిపప్పు పప్పులో క్రొవ్వు, నూనె పదార్థాలు 54%
 • మోనో అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:1),18%
 • పోలి అన్ సేచ్యురేటెడ్ కొవ్వు(18:2),మరియు
 • సేచ్యురేటెడ్ కొవ్వు-16%
 • (9% పల్మిటిక్ ఆమ్లం(16:0)మరియు
 • 7 % స్టేరిక్ ఆమ్లము(18:O)) ఉంటాయి.

ఆధారము : USDA పోషక విలువల డేటాబేస్

త్రిఫల చూర్ణం

ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు. ఉసిరి ఉసిరిలో సి విటమిన్‌ అత్యధికంగా వుంటుంది.

ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియంలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్దకం తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది. బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిన్‌ ఉసిరిలో వుంది. తానికాయతానికాయ వగరు, ఘాటురుచి కలిగి వుంటుంది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది. కరక్కాయ త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్నిస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.

వాడే విధానంత్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది. త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలిపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి. మలబద్ధకం బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.

ఒక చెంచా త్రిఫ లచూర్ణం రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మరక్షణకు త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మ కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా వుండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్శివలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.అంతేకాదు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.

దానిమ్మ

దీని శాస్త్రీయ నామము"punica granatum".పండ్లజాతులలోమేలైనది.తినడానికిరుచిగాఉంటుంది.దీనిలోవిటమిను-ఎ,సి,ఇ,బి5, flavanoidsఉన్నాయి.

 • గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. పండులోని "ఇల్లాజిక్ యాసిడ్ "ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది. దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది.

అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.

 • దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.

ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.

 • సహజ ఆస్ప్రినే కాదు. దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.

గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.

 • వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

 • రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.

దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది. శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది.

 • గుండె (హృదయము) కు మేలు చేస్తుంది.

దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ 'వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది.

 • రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది.
 • ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది.
 • దానిమ్మ గింజల,నూనె. రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది.

వారానికోసారి దానిమ్మ రసము :

 • అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే ''హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ ''50 కన్నా తక్కువగా ఉన్నా. ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు. మంచిది.

పసుపు

పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు. చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడు గా పనిచేస్తుంది. మనదేశములో ఆహారములో రంగు, వాసనలతో పాటు ఔషధగుణాల పేరున పసుపును వాడుతున్నారు. పసుపు క్రిమిసంహారిని. క్రిములను నసింపజేస్తుంది.శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సుక్ష్మక్రిములు దరిచేరవు. సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది. ఇది ప్రకృతి పసాదించిన మహా దినుసు. దీనిలోని "కర్కుమిన్‌ "వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామము "Curcuma longa ''. పసుపు (లాటిన్ - Curcuma longa), అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు.

ఎన్నోవ్యాధులకుమందు:

 • మొటిమలు : జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి,
 • కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. కఫము తగ్గుతుంది.
 • రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది.
 • దగ్గు,జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి,
 • నొప్పులు, బెనుకులు : పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి.
 • డయాబెటిస్: ఉసిరి పొడి తో పసుపు కలిపి బీర్లో కరిగించి తాగాలి.మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాసు నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా నానబెట్టి . పొద్దునా లేచేక పసుపు కొమ్ము తేసేసి నీల్లలు ఒక చెంచా తో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను, రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.
 • తలతిరుగుడు : పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.
 • అల్జిమార్ వ్యాధి : పసుపు లో ఉండే "కర్కుమిన్ "అనే పదార్ధము మతిమరుపును అరికడుత్న్ది.

ఆయుర్వేదిక్ గుణాలు :

 • పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
 • సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
 • పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
 • వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
 • పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
 • వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
 • వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
 • మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
 • నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
 • పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
 • పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
 • రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
 • చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
 • పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 • పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
 • పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
 • వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

పుచ్చకాయ

ప్రకృతి ప్రసాదించిన అద్భుతాల్లో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయను కేవలం దప్పికను తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా వాడుకోవచ్చు.

 • పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ.
 • ఒక మాట. పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు గాని, లేదా పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు గాని పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే, పుచ్చకాయలో ఇవి రెండూ ఎక్కువ.
 • పుచ్చకాయ మనిషికి పూర్వకాలంనుంచి తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతంనుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు. కాగా ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తోంది.
 • పుచ్చకాయ అనేక రీతుల్లో లభ్యమవుతుంది. పొడుగువి, గుండ్రనివి, గింజలు కలిగినవి, గింజలు లేనివి, ఎర్రని గుజ్జు కలిగినవి, పసుపు రంగు గుజ్జు కలిగినవి. ఇలాగ. ఇటీవల కాలంలో జపాన్‌లో నలు చదరంగా, త్రిభుజాకారంగా ఉండే పుచ్చకాయలను కూడా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో 1,200 రకాలకు పైగా పుచ్చకాయలను సాగుచేస్తున్నారు. మన దేశంలో ఎంతోమందికి పుచ్చకాయ జీవనోపాధిని కల్గిస్తోంది.
 • పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. అందుకే దీనిని ఇంగ్లీషులో ‘వాటర్’మిలన్ అంటారు. పుచ్చకాయను శాస్ర్తియ భాషలో ‘సిట్రులస్ లానేటస్’ అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందినది. గుమ్మడి, దోస మొదలైన పండ్లను పోలి ఉంటుంది.
 • సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు. ఐస్‌క్రీమ్ తీసే స్కూప్‌తో గుండ్రని బంతుల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు కొంతమంది. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడతారు. పుచ్చకాయ గింజలను రోస్ట్‌చేసి తినవచ్చు. వీటికి ఉప్పుచేర్చి పొడి చేసుకుని గాని, రొట్టె మాదిరిగా తయారుచేసుకుని గాని వాడుకుంటారు మరికొంతమంది. పుచ్చకాయ వెలువలి తొక్క భాగాన్ని పారేయకుండా పచ్చడి చేసుకుని తినటం అక్కడక్కడా కనిపిస్తుంది.
 • పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. విటమిన్-బి6 మెదడులో సెరటోనిన్, మెలటోనిన్, డోపమిన్ వంటి న్యూరోట్రాన్సిమిటర్స్ విడుదలవ్వటానికి తోడ్పడుతుంది. ఈ న్యూరోట్రాన్సిమిటర్స్‌వల్ల ఆందోళన, చిరాకు వంటివి తగ్గుతాయి. విటమిన్-సి వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇనె్ఫక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం అనేది శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపుచేస్తుంది. ఇది లోపిస్తే కండరాల నొప్పి అనుభవమవుతుంది.
 • పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడటమే కాకుండా గుండె జబ్బులను, మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను (కంటిలోపలి పొర క్షీణించి పోవటం) సైతం నిరోధిస్తుంది. లైకోపీన్ అనేది టమాట, ఎర్రజామ, ఎర్రద్రాక్ష వంటి పండ్లలో ఉన్నప్పటికీ పుచ్చకాయలో అత్యధిక మొత్తాల్లో ఉంటుంది. (రెండు కప్పులు పుచ్చకాయ ముక్కల్లో 18 మి.గ్రా. ఉంటే ఒక మోస్తరులావున్న టమాటాలో కేవలం 4 మిల్లీగ్రాములే ఉంటుంది.) శరీరాంతర్గతంగా అనిశ్చితంగా కదులుతూ ఆరోగ్యవంతమైన కణాలపైన దాడి చేసి క్యాన్సర్, కణాల క్షీణతకి (డీజనరేషన్) కారణమయ్యే ప్రీర్యాడికల్స్‌ని పుచ్చకాయలో ఉండే లైకోపీన్ తటస్త పరుస్తుంది.
 • చూడ్డానికి పుచ్చకాయ గట్టిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ చాలా పెళుసుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రవాణా చేయాలి. కాయ అడుగు భాగంలో వెన్న మాదిరి రంగులో తెల్లని మచ్చ కనిపిస్తే పక్వానికి వచ్చిందని అర్థం. పండిన పుచ్చకాయను బాగా కదిలిస్తే లోపలుండే గింజలు కదిలి శబ్దం వస్తుంది. సహజంగా పండినప్పుడు అడుగు భాగంలో తెల్లగా కనిపిస్తుంది. బయట తోపుడు బండ్లమీద పుచ్చకాయ ముక్కలను కొనాలనుకున్నప్పుడు కాంతివంతంగా, చక్కని తాజా ఎరుపు రంగులో ఉండి, తెల్లని చారికలు లేని వాటిని ఎంచుకోవాలి.
 • పుచ్చకాయను గుండ్రంగా, సమానంగా ఉన్నదానిని, రాయి దెబ్బ తగలని దానిని ఎంచుకోవాలి. ఎంత బరువుగా ఉంటే అంత మంచిది. పుచ్చకాయను తినాలనుకున్నప్పుడు ముందుగా సగానికి కోసి తరువాత త్రిభుజాకారంలో కోయాలి. ఫోర్క్ సహాయంతో గింజలను తొలగించి వాడుకోవాలి. పచ్చిగా ఉన్న పుచ్చకాయను సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద ఉంచితే పండుతుంది. పండిన తరువాత కొద్దికాలంపాటు నిల్వచేసుకోదలిస్తే ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒకవేళ ముక్కలుగా కోసిన తరువాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోదలిస్తే కోసిన వెంటనే పాలీథిన్ కాగితం చుట్టినా గాలి చొరపడని ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టినా 3-4రోజుల వరకూ తాజాగా ఉంటాయి.

ఔషధోపయోగాలు

 • క్యాన్సర్ నివారణకోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటాకెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లను, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఇదే బీటాకెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ల రూపంలో వాడినప్పుడు ఈ ప్రయోజనం కనిపించలేదు.
 • గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్ -బి6వల్ల మహిళల్లో గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.
 • జన్మతఃప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసి పాపాయిల్లో గ్రహణం మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది.
 • పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పోటాషియం ఉంటుంది కాబట్టి మూత్రం జారీ అవ్వటంకోసం వాడుకోవచ్చు. ముఖ్యంగా మూత్ర మార్గంలో రాళ్లు తయారైనప్పుడు, నిర్జలీయత ప్రాప్తించి మూత్రం గాఢంగా తయారైనప్పుడు, మధుమేహం వంటి వ్యాధుల్లో ఆమ్లత్వం (మెటబాలిక్ ఎసిడోసిస్) పెరిగినప్పుడు పుచ్చకాయను వాడితే ఎంతో మేలు జరుగుతుంది.
 • గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యల్లో సోడియం సంచితమై శరీరంలో నీరు చేరుకున్నప్పుడు నిరపాయకరంగా వెలువరించడానికి పుచ్చకాయ సహాయపడుతుంది. కాకపోతే యురీమియా వంటివి ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి.
 • ఎండాకాలంలో ఉక్కపోతవల్ల స్వేదంతోపాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీనిని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు.
 • విరేచనాలు, గ్యాస్ట్రో, బంక విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యల్లో నిర్జలీయత ప్రాప్తించి బాగా నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పుచ్చకాయను ముక్కలుగా కోసి తినవచ్చు. లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేనె లేదా నిమ్మ రసం వంటివి చేర్చి తీసుకోవచ్చు.

పుచ్చకాయతో హాయి

 • వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి.
 • చర్మంపె మచ్చలు,,సన్నని ముడతలు కనిపిస్తోంటే. పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా కనిపిస్తుంది.
 • చిన్న పుచ్చకాయ ముక్కని ముఖానికి రాసుకుంటే. అది చర్మగంథ్రుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం ఫ్రిజ్‌లో ఉంచి రాసుకున్నా. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
 • ఎండలో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాదు, దుమ్మూధూళీ కూడా చేరుతుంది. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది టోనర్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది.

పెరుగు

4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు. కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి. పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.

 • పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సిం శతం ఎక్కువ. కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.
 • విటమిన్ బి, పాస్ఫరస్, పొటాసియం, మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి.
 • పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది.
 • పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర, కరివేపాకు, చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి, డయేరియా తగ్గును.
 • పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది.

పొట్టచుట్టూ కొవ్వు. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం. పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది. రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు.శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.

చర్మ కాంతికి పెరుగు

ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు.

క్లెన్సర్‌: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది

మాయిశ్చరైజర్‌: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

ప్రొటీన్‌ మాస్క్‌: టేబుల్‌ స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

చర్మానికి కండిషనర్‌: ఒక టేబుల్‌ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి.

సన్‌స్క్రీన్‌ లోషన్‌: కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.

పెరుగు లాభాలెన్నో.

కూర, పచ్చడి, సాంబారు. ఎన్ని వేసుకుని తిన్నా చివరలో పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. అంతగా మన దైనందిన ఆహారంలో భాగంగా మారిన పెరుగు గురించిన కొన్ని విశేషాలు.

అన్నంలో కలిపి తింటారా. లేదా విడిగా తింటారా. అది మీ ఇష్టం. కానీ కచ్చితంగా రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. తెలిసో తెలియకో మనం పెరుగన్నం తింటూనే ఉంటాం. కానీ బరువు తగ్గాలనో నిద్ర వస్తుందనో ఈమధ్య చాలామంది మానేస్తున్నారు. కానీ రోజూ పెరుగు తినేవాళ్లకి బీపీ వచ్చే అవకాశం తక్కువ అన్నది స్పానిష్‌ నిపుణుల పరిశీలన. బల్గేరియన్లూ రష్యాల్లోని స్టెప్పీలూ పెరుగు బాగా తినడంవల్లే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారని పారిస్‌ నిపుణుల ఉవాచ.

పాలూ పెరుగూ 'అసలు పాలకీ పెరుగుకీ తేడా ఏమిటి? పెరుగు తినకపోతేనేం?'. వంటి సందేహాలెన్నో. నిజమే, పాలల్లో పోషకాల సంఖ్య ఎక్కువే. అయితే అందులోని లాక్టోజ్‌ను అంతా అరిగించుకోలేరు. అదే పెరుగయితే ఆ సమస్య ఉండదు. మలబద్ధకం, డయేరియా, పేగు క్యాన్సర్‌, మొలలు. వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పెరుగు, తేనె మిశ్రమాన్ని దేవతల ఆహారంగా పురాణాలు పేర్కొన్నాయి.

పెరుగులో లాక్టో బాసిల్లస్‌, స్ట్రెప్టోకాకస్‌. అనే భిన్న జాతులకు చెందిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా లాక్టోజ్‌ చక్కెరను లాక్టిక్‌ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలల్లోని ఆమ్లశాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా పాలల్లోని ప్రొటీన్లు అమైనోఆమ్లాలుగా మారి గడ్డకడతాయి. అదే సమయంలో ఈ బ్యాక్టీరియా కాస్త పులిసేలా చేస్తుంది.

లాభాలెన్నో. పెరుగులోని ఈ రకం బ్యాక్టీరియా పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. లేదంటే అవి అల్సర్లనీ తద్వారా క్యాన్సర్‌నూ కలిగిస్తాయి. అందుకే పెరుగు తయారీకి అవసరమైన ఈ బ్యాక్టీరియాను కృత్రిమంగా రూపొందించి యాక్టివ్‌ కల్చర్స్‌ పేరుతో విక్రయిస్తుంటారు.

పెరుగులో విటమిన్‌ -ఎ, ఇ, సి, బి2, బి6, బి12 విటమిన్లూ; కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, జింక్‌, అయొడిన్‌. వంటి ఖనిజాలూ; లాక్టోజ్‌ చక్కెరలూ కొవ్వు ఆమ్లాలూ ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలతో పోలిస్తే పెరుగులోని కాల్షియం ఒంటికి పట్టి డి-విటమిన్‌ తయారీకి తోడ్పడుతుంది. అందుకే ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవాళ్లకి పెరుగు ఎంతో మేలు. ఎసిడిటీతో బాధపడేవాళ్లకి పాలకన్నా పెరుగే మంచిది. బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తినీ నాడీ వ్యవస్థ పనితీరునీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకూ వృద్ధులకూ ఇది ఎంతో మంచిది.

 • తరచూ ఈస్ట్‌ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్లకి పెరుగు తినడంవల్ల ఫలితం ఉంటుంది.
 • వ్యాయామం తరవాత బాటిల్‌ నీళ్లతోపాటు కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వెంటనే శక్తిని పుంజుకుంటారు.
 • రోజూ కనీసం 50 గ్రా. ఫ్రూట్‌ ఫ్లేవర్లతో కూడిన పెరుగు తినేవాళ్లలో దంతాలు పుచ్చిపోవడం జరగదు.

పెరుగులో పండు!

పాల ఉత్పత్తులను అమ్మే కంపెనీలు ఇటీవల పెరుగును రకరకాల ప్యాక్‌ల్లో భిన్న కాంబినేషన్లలో విక్రయిస్తున్నారు. స్ట్రాబెర్రీ, ద్రాక్ష. వంటి అనేక పండ్ల ఫ్లేవర్లలోనూ పెరుగు వస్తోంది. అయితే ప్యాక్డ్‌ పెరుగుల్ని కొనేముందు 'లైవ్‌ అండ్‌ యాక్టివ్‌ కల్చర్స్‌'అన్న లేబుల్‌ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే బ్యాక్టీరియా లేకుండా రెనిట్‌, ఇతర ఆమ్లపదార్థాలతో కూడా పెరుగుని తయారుచేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. అంతేకాదు, రకరకాల పండ్లూ నట్స్‌ టాపింగ్స్‌తో ఐస్‌క్రీమ్‌ మాదిరిగా అందించే ఫ్రోజెన్‌ యోగర్ట్‌ పార్లర్లూ వచ్చాయి.

భిన్న రుచుల్లో.

పెరుగుని ఇంట్లోనే భిన్నరుచుల్లో తయారుచేసుకోవచ్చు. కీరా, క్యారెట్‌, ఉల్లిముక్కలు, కొత్తిమీర, మిర్చి. కలిపి చేసే రైతాల మాదిరిగానే; వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌; స్ట్రాబెర్రీ, మామిడి, దానిమ్మ, కమలా, ద్రాక్ష, పైనాపిల్‌ పండ్లముక్కలు; ఇలా రకరకాల రుచుల్ని పెరుగులో జోడించవచ్చు. ప్రొటీన్‌ శాతం అధికంగా ఉండే పెరుగుకి పీచు ఎక్కువగా ఉండే ఓట్స్‌, రాగులు వంటి తృణధాన్యాలను జోడిస్తే మంచి సమతులాహారం. వడగట్టిన పెరుగులో యాలకులపొడి, కుంకుమపువ్వు, పంచదార కలిపి చేసే శ్రీకండ్‌ రుచి తెలిసిందే. దీనికే మామిడిపండు రసం కలిపితే అదే ఆమ్రఖండ్‌. రుచికరమైన వేసవి డిజర్ట్‌.

ఇటీవల ఆవు, గేదె పాలతోనే కాదు, బియ్యం, సోయాపాలతో చేసిన వెజిటబుల్‌ పెరుగులూ వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే పెరుగుని చల్లచల్లగా ఆస్వాదించండి. వేసవి నుంచి ఉపశమనం పొందండి.

వాము

వాము వంటలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజ వాన్‌ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. దీని శాస్త్రీయ నామము ట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్ (Trachyspermum copticum).

వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు.

వంటింట్లో వాము

వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది'అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దద.

ఔషధోపయోగాలు

 • వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
 • జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
 • అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
 • దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
 • వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
 • గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
 • మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
 • చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
 • జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
 • ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
 • గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
 • కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
 • కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
 • దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
 • దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.

ఆయుర్వేదంలో వాము

 • ఆకలి పెంచటానికి: వాము చూర్ణాన్ని, బిడా లవణాన్ని ఒక్కొక్కటి రెండు గ్రాములను అర గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అరుగుదల పెరుగుతుంది. శరీరంలోపల పెరిగే బల్లలు కరిగిపోతాయి. (చరకసంహిత, వృందమాధవ).
 • అర్శమొలలు తగ్గించుటకు: వాము చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం ఒక్కొక్కటి రెండేసి గ్రాముల చొప్పున ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే అర్శమొలలు తగ్గుతాయి.
 • ఆహారం అరుగుదలకు: వాము, శొంఠి, చిరుబొద్ది, దానిమ్మ రసం, బెల్లం వీటిని ఉప్పు కలిపిన మజ్జిగతో తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది.
 • కడుపునొప్పికి: వాము, సైంధవ లవణం, కరక్కాయ పెచ్చులు, శొంఠి వీటి చూర్ణాలను సమంగా కలిపి రెండు గ్రాముల మోతాదుగా అరకప్పు వేడి నీళ్లకు కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
 • దద్దుర్లు తగ్గించుటకు: వామును బెల్లంతో కలిపి వారంపాటు తీసుకుంటే దద్దుర్లు తగ్గుతాయి.
 • కొండనాలుక వాపు తగ్గుటకు: వామును బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే కొండనాలుక వాపు తగ్గుతుంది. ఇలా ఒక పగలు, ఒక రాత్రి నిరంతరమూ చేయాలి.
 • దంత సమస్యలకు: రాత్రిపూట వామును, వస కొమ్మును సమభాగాలను పలుకులుగా చూర్ణించి చిటికెడు మోతాదుగా నోట్లో ఉంచుకొని దంతాలమధ్య ఒత్తిపట్టి ఉంచుకుంటే దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి.
 • ముక్కుదిబ్బడ, తల నొప్పి: 200నుంచి 250 గ్రాముల వామును పెనంమీద వేడి చేసి, మెత్తని పల్చని నూలుగుడ్డలో పోసి మూటగాకట్టి పెనంమీద వేడి చేసి బాగా గాఢంగా వాసన పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
 • ముక్కు దిబ్బడ: ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక నూలు గుడ్డలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కన ఉంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
 • ఉబ్బసం, బ్రాంకైటిస్: ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. సుఖోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
 • జలుబు: పావు టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపును ఒక బొవెన్‌లో తీసుకోండి. ఒక టీ కప్పు వేడి నీళ్ళు కలపండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, జలుబువల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
 • కఫం: అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
 • దగ్గు: అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
 • ఊపిరితిత్తుల మార్గం శుభ్రం: రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
 • తలనొప్పి, పడిసెం: వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.

ఆధారము : డాక్టర్ వందన శేషగిరి రావు బ్లాగ్

జింజర్ (అల్లం) టీ త్రాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ప్రపంచ వ్యాప్తంగా మరియు ఆసియా అంతటా ప్రజలు ప్రతి రోజు ఒక మసాలా సంప్రదాయ పానీయం అయిన అల్లం టీని త్రాగుతూ ఆనందిస్తారు. అలాగే మాకు ఆయుర్వేదం మరియు 3000 సంవత్సరాల పురాతన చైనీస్ మందులలో అల్లంను ఉపయోగించటం తెలుసు. అల్లం వేళ్ళతో తయారు చేసిన టీ అజీర్ణం,వాపు, మైగ్రేన్లు,వికారం,విరేచనాలు మరియు అనేక ఇతర వ్యాధులు మరియు పరిస్థితులను నయం చేయటానికి ఒక సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. అల్లం టీని టీ ఆకులు లేకుండా కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా చైనా లో బ్రౌన్ షుగర్ ను అధికంగా వాడతారు. కొరియాలో అల్లంను మధురమైన తేనెలో భద్రపరుస్తారు. తేనె, నిమ్మరసం లేదా పిప్పరమింట్ తో కలిపి అందిస్తే అది అత్యద్భుతంగా ఉంటుంది. అల్లం రూట్ టీలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B6 మరియు సి సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక గిన్గేరోల్, జిన్గేరోనే, శోగోల్,ఫమేసేనేమరియు β- ఫేల్లద్రేనే,సినేఒల్,సిట్రాల్ వంటి నూనె లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి అల్లం టీ త్రాగటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఒక ప్రసిద్ధ నానుడి ప్రకారం - 'ఏదైనా చాలా ఎక్కువగా చేస్తే చెడు చేస్తుంది'. అలాగే దీనికి ఎటువంటి మినహాయింపు లేదు! ఇలాంటి మొత్తం హెర్బల్ పదార్ధాలు, అల్లం టీ వలన కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి కడుపు అప్సెట్, గుండెల్లో మంట, నోటి చికాకు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. అల్లంను క్యాప్సిల్ రూపంలో తీసుకుంటే కొంత దుష్ప్రభావాలు తగ్గటానికి సహాయం చేస్తుంది. అల్లం టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు గురించి చదవండి.

అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

ఇంట్లో అల్లం టీ సిద్ధం చేయటం చాలా సులభం. అల్లం వేరును శుభ్రం చేసి పొడి చేయాలి. అల్లం వేరును పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. 11/2 కప్పుల నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. దీనిని 5 నుంచి 15 నిముషాలు మరిగించాలి. టీ రుచిని పెంచడానికి పంచదార, నిమ్మరసం, పాలు,టీ ఆకులు,తేనె,క్రీమ్ లేదా మీరు కోరుకొనే ఇతర పదార్థాలను జోడించవచ్చు. టీ ని వేడిగా త్రాగి అలసటను తగ్గించుకోండి. అలాగే అల్లం టీ అందుబాటులో లేకపోతే,క్యాప్సిల్ మరియు సారం రూపంలో కొనుగోలు చేయవచ్చు

ఎక్కువగా వినియోగం:

ఏదైనా మోతాదు మించి త్రాగితే ఆరోగ్యానికి హాని చేస్తుంది. అదే విధంగా, అల్లం టీని కూడా శరీరం యొక్క అవసరాల దృష్ట్యా పరిమిత పరిమాణంలో మాత్రమే సేవించాలి. అల్లం టీని మోతాదుకు మించి త్రాగితే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దాని పలితంగా గుండెల్లో మంట,నోటిలో చికాకు,అతిసారం,వికారం వంటి లక్షణాలు కలుగుతాయి. ఎక్కవగా త్రాగటం వలన మానవ శరీరంలో ఎక్కువ ఆమ్లాల ఉత్పత్తికి దారితీస్తుంది. అంతేకాక,మధుమేహంతో బాధపడుతున్న ప్రజలు ఎటువంటి అల్లం టీని త్రాగకూడదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గించేయుట వలన హైపోగ్లైసెమియాకి కారణం అవుతుంది.

రక్తాన్ని పలుచగా మరియు లోపాలు:

రక్తాన్ని పలుచన చేసే అల్లం రూట్ ను ఉపయోగించటం ఏ విధంగానూ అనుకూలం కాదు. ఈ మిశ్రమం ఆస్పిరిన్ లేదా ఇబూప్రోఫెన్ వంటి నొప్పినివారిణీలలో ఉంటుంది. అలాగే,అధిక రక్తపోటు మందులు తీసుకొనే వారు ఏ రూపంలోను అల్లంను వాడకూడదు. ఎందుకంటే ఇది తక్కువ రక్తపోటుకు మరియు గుండె దడకు కారణమవుతుంది. అల్లం రూట్ రక్తం యొక్క భాగాల ఫంక్షన్ లో జోక్యం చేసుకుంటుంది. ఇది హిమోగ్లోబిన్ ని గడ్డకట్టించి పలకలుగా తయారుచేస్తుంది. అల్లంను తింటే హేమోఫిలియా వంటి రక్త లోపాలు ఏర్పడతాయి. కాబట్టి అల్లం టీని వినియోగించేటప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

నిద్ర సమస్యలు:

అల్లం టీని త్రాగటం వలన విశ్రాంతి లేకపోవటం మరియు నిద్రలేమికి కారణం కావచ్చు. అల్లం నిద్రను హరిస్తుంది. అంతేకాక పడుకొనే ముందు అల్లం టీని త్రాగకూడదు. ఎందుకంటే మీకు తొందరగా నిద్ర పట్టదు. దాని వలన మీరు జీవితానికి అపాయం కలిగించే గుండెల్లో మంటను ఎదుర్కొంటారు.

అనస్థీషియా:

ఒక శస్త్రచికిత్సకు ముందు అల్లం టీ త్రాగటం లేదా దీర్ఘకాలంగా అలవాటు ఉంటే,అప్పుడు అల్లం టీ చర్య ప్రమాదంగా ఉంటుంది. అనస్థీషియా మందులు పనిచేయవు. ఫలితంగా,రోగి ఫోటోసెన్సిటివ్ ప్రతిచర్యల స్వస్థతలో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాక గాయాలు మరియు రక్తం గడ్డకట్టకపోవటం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి,చాలా మంది వైద్యులు శస్త్రచికిత్స ముందు కనీసం ఒక వారం అల్లం తీసుకోవడం ఆపివేయమని సిఫార్సు చేస్తారు.

పిత్తాసయంలో రాళ్లు:

అల్లంను పోషకవిలువల సంబంధిత డాక్టర్ తో జాగ్రత్తగా సంప్రదించిన తరువాత మాత్రమే పిత్తాశయ రోగులు తీసుకుంటారు. ఎందుకంటే దుష్ప్రభావాలు సంభావ్యత ఉంటుంది. పిత్తాసయంలో రాళ్లు ఏర్పడితే చాలా భాదాకరముగా ఉంటుంది. అల్లం పైత్యరసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుంటుంది.

కడుపు అప్ సెట్:

అల్లంను వికారం యొక్క చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అయినా మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం ప్రకారం ఖాళీ కడుపుతో అల్లం టీని పెద్ద మొత్తంలో తీసుకొంటే జీర్ణశయం అప్ సెట్ అవుతుంది. అల్లం టీ మోతాదు మార్గదర్శకాలు వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. పలితంగా అల్లం టీని ఎంత స్థాయిలో తీసుకుంటే జీర్ణశయం అప్ సెట్ అవుతుందో చెప్పటం కష్టం అవుతుంది.

గర్భధారణ:

అల్లం ఉపయోగం గర్భధారణలో వివాదాస్పద అంశంగా లేదు. అది పుట్టబోయే బిడ్డకు విషపూరితం పదార్ధం అని పుకారు ఉండుట వలన,అల్లం టీని గర్భిణీ స్త్రీలకు సిఫార్సు చేయటం లేదు. అయితే కొంతమంది వైద్య నిపుణులు వికారము కోసం ఒక ఔషధంగా అల్లం టీని త్రాగమని సలహా ఇస్తారు. సాంప్రదాయ చైనీస్ మూలికా శాస్త్ర వేత్తలు పిండం,అలాగే తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని దాని వాడుక ఆపమని చెప్పుతారు. బహుశా గర్భస్రావం అవుతుందని ఒక కారణం కావచ్చు. గర్భం సమయంలో అల్లం తీసుకొనే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate