అతి చౌకగా లభించే పచ్చని ఆకుకూరలు ఎన్నో పోషక విలువలు గల ఆహారం, తోటకూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూర వంటివి మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు. యా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ – ఎ, సి, రబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు ఎక్కువగా ఉంటుంది.
మనకు ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలెన్నో.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తూ జీవనశైలిని మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండచమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు వండుకునే ముందు కచ్చితంగా ఒకటి రెండుసార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండేనుందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు నాశనమవుతాయి. వీటికి తొందరగా నలిగే గుణం డడం వలన సలాడ్, సూపులుగా, చట్నీలుగా చేసుకోవచ్చు. ఆకుకూరల్లో ఉండే పోషకాలు పోకుండా ఉండడానికి వండేటప్పుడు మూతపెట్టి వండాలి. అంతేకాకుండా ఆకుకూరలు ఉడకబెట్టిన నీటిని పారేయకుండా కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధం), చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్లు కలిగి ఉం టాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని చేర్చుకోవడం తప్పనిసరి.
ఆకుకూరల్లో విటమిన్లు ఎ, కె, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల శ్వాస సంబంధిత వ్యాధులను, మూత్ర, పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ఒక కప్పు ఆకుకూరలను ప్రతిరోడు తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని మీ దరిదాపుల్లో చేరనివ్వదు. అంతేకాకుండా జీవక్రియను శుభ్రం చేస్తుంది.
ఆకుకూరలు శరీరంలోని ప్రీరాడికల్స్ (హానికర కణాలు)తో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్లు, ఖనిజాలు రక్తపోటును నివారించడానికి బాగా సహాయపడతాయి.
ఆకుకూరల్లోని అనేక ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ టాయి. ఇవి క్యాన్సర్ రహిత గుణాలను కలిగి (పోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది).
ఆకుకూరల్లోని మెగ్నీషియం రక్తపోటు (బ్లడ్ ప్రెఫర్)ను అదుపులో ఉంచేందుకు బాగా సహాయపడితింది. అలాగే ఆకుకూరల్లోని ఫాల్లేట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
శరీరంలో ఉండే చెజు కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోడు ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిది.
ఆకుకూరల్లోని కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో కెరోటిన్ విటమిన్ – ఎ గా మారుతుంది. విటమిన్ – ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుటుంది. మొటిమలు, మచ్చలు, రాఫెస్ వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది.
కళ్ళకు సరైన చుపును ఇస్తూ రేచీకటిని రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కేటరాక్ట్, వయస్సుతో వచ్చే కళ్ళ సమస్యను నివారిస్తుంది.
ఆకుకూరల్లో సెలినియం, నియాసిన్, ఒమేగా 3 – ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉండి మెదడు, నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆకుకూరలు కీళ్ళ నొప్పులను, అస్ల్పమేషన్ (వాపు)ను తగ్గిస్తుంది. ఆకుకూరల్లోని ఆంటీ ఇస్ల్పమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో అభ్భుతంగా సహాయపడతాయి.
ఆకుకూరల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. రక్త పు,టికి ఇనుము చాలా అవసరం. గర్భిణీలు, బాలింతలు, కిశోరబాలికలు, 5 సంవత్సరం లోపు పిల్లలకు ఇనుము అవసరం బాలా ఎక్కువగా ఉంటుంది.
భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐ.సి.ఎం.ఆర్) సిఫార్సు చేసిన దాని ప్రకారం ప్రతి మనిషి రోజుకు కనీసం 125 గ్రా. ఆకుకూరలు తినాలి.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023