অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం.  ఆనుదిన ఆహారంలో దాదాపు 20%  వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటివలన అపారమైన లాభాలున్నాయి.

  1. ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పొలిస్తే విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టటానికి తొడ్పడే పొషకపదార్థం. ఆంతే కాకుండా గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో  రాళ్ళు  వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి దీనికి ఉంటుంది.
  2. కొలెస్ట్రాలును తగ్గించే గుణం ఉంది. లివర్ లో కొలెస్ట్రాలును వినియోగించుకొని బైల్ యాసిడ్ ను తయారుచేస్తుంది. ఇది కొవ్వు జీర్ణ ప్రక్రియలో తొడ్పడుతుంది. ఆయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైలు యాసిడ్ కల్సినపుడు అది విసర్జించబడుతుంది. ఆందుచేత లివర్ మరలా మరలా, బైలు యాసిడ్ ను తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది.
  3. ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ కెరొటినాయిడ్, క్సైంతిన్ రూపంలో ఉంటుంది.  ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కనుక కంటిచూపు పరిరక్షించబడుతుంది.
  4. శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమినులు, ముఖ్యంగా బి5 (పాంటోథెనిచ్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత  శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. అంతేకాక బి విటమినులకు నీటిలో కరిగే గుణం ఉంటుంది కనుక, ఇవి శరీరంలో నిల్వచేయబడవు. అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి.
  5. ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది.  ప్రతిరోజు  ముఖ్యంగా 31-35 సంవత్సరాల వయస్సు మహిళలు 1000 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు  సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు.
  6. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్ను  నివారించకలుగుతాయి.

ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పొషక విలువలు:
పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి  కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన.

పేరు

పోషక విలువ

గోంగూర

 

విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

పాలకూర

 

విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల సాంద్రతకు ఉపయోగపడుతుంది

బచ్చలి కూర

విటమిన్ ఎ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొన్నగంటి

విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని  క్రిములని నాశనం చేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

చుక్కకూర

విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది

తోటకూర

 

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాల ఆరోగ్యానికి ఉపయోగకరం. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల రక్తహీనతను నివారిస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది

మెంతికూర

 

పీచుపదార్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువుకు, గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

సొయ్యకూర

 

ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తకణాలు ఎర్పడడానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఎ,సి ఎక్కువ ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది.

మునగాకు

 

అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది.

కోత్తిమీర

 

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య  లక్షణాలను తగ్గిస్తుంది.

 

కరివేపాకు

బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సమ్రక్షణకు మంచిది.అరుగుదల శక్తిని పెంచుతుంది.

పుదీన

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

గంగవల్లి

 

ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా యాంటి ఆక్సిడెంట్లు ఉండడం వలన ముఖం పై ముడతలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.

క్యాబేజి

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువ ఉండడం వల్ల నరాల బలహీనతలను నివారిస్తుంది.

కాలీ ఫ్లవర్

కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

ఆకుకూరలు వండడం:
ముందుగా కడిగి తరువాత కోయాలి. కోసాక  నీళ్ళలో వేస్తే వాటిలొ ఉండే  నీటిలో కరిగే బి విటమిన్లు వృధా అయిపోతాయి.
తక్కువ నూనేతొ వండాలి. నూనెలో కరిగే కె విటమిన్ ఉండడం వలన ఎక్కువ నూనె వాడితే అది వృధా అయిపోతుంది.
నీళ్ళు పోయకుండానే , వాటిలో ఊరే నీళ్ళతో ఉడికించాలి.
ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషకపదార్థాల సమతుల్యత లభిస్తుంది.
రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన అన్నిరకాల ఖనిజలవణాలు విటమినులు  పొందవచ్చు.
రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి  కాబట్టి వీటిని రక్షిత ఆహార పదార్థాలు అంటారు.

ఆధారం: కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate