మాల్టింగ్ అనేది అతి పురాతనమైన, సాంప్రదాయపు ఆహార తయారి పద్ధతి. దీని వల్ల పోషక లాభాలు అధికంగా ఉంటాయి. మాల్టింగ్ అంటే గింజలను నానబెట్టి, మొలకెత్తించి, ఆరబెట్టి పొడి చేయడం. ఇలా చేయడం వల్ల ఆహారపదార్థాలు ఏ వయస్సు వారికైన సులభంగా జీర్ణమవుతాయి. ఆహారంలో మాంసకృత్తుల విలువలు పెరగడం, పోషకాలను శరీరం సులభంగా గ్రహించడం వంటి లాభాలు కలుగుతాయి. మాల్టెడ్ ధాన్యాల నుండి చేసిన పిండిలో అమైలేజ్ అనే ఎంజైము అధికంగా ఉంటుంది. ఇది తక్కువగా తిన్నప్పటికీ ఎక్కువ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఇవి చంటిబిడ్డలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ద్వారా ధాన్యాల అరుగుదల శక్తి పెరుగుతుంది.
అమైలేజ్ మాల్టింగ్ మిక్సుతయారు చేసే విధానం
కావలసిన పదార్థాలు రాగి లేదా గోధుమలు - 50 % పెసలు - 25% చక్కెర - 15% వెన్న తీసిన పాల పొడి - 10%
రాగులు లేదా గోధుమలను, పెసలను దుమ్ము, ధూళి, చెత్త లేకుండా శుభ్రంగా చేసుకోవాలి.
శుభ్రపరచిన రాగులను లేదా గోధుమలను, పెసలను 18 గంటలపాటు నీటిలో నానబెట్టాలి.
ధాన్యాలలో నీటిని తొలగించాలి. ఇప్పుడు ఈ ధాన్యాలను ఒక సన్నటి పొడి గుడ్డలో కట్టాలి. వీటిని ఇలాగే 2 రోజుల పాటు ఉంచాలి.అప్పుడు ధాన్యాలు మొలకెత్తుతాయి. అదే పెసర్లకైతే మొలకలు రావడానికి ఒక్క రోజు సరిపోతుంది. గుడ్డపై నీళ్ళు చల్లుతూ ఉండాలి, అప్పుడు ధాన్యాలు మొలకెత్తడానికి కావలసిన తేమ లభిస్తుంది.
మొలకెత్తిన ధాన్యాలను, ఒక గిన్నెపై పొరలా పరచి డ్రైయర్ లో ఎండబెట్టాలి. ఇలా ఎండిన తర్వాత పెసర్లపై పొట్టును ఒక గుడ్డతో రుద్దడం ద్వారా తొలగించాలి.
ఈ ధాన్యాలను చక్కని సువాసన వచ్చే దాకా వేయించాలి.
ఇలా వేయించిన ధాన్యాలను పిండి పట్టాలి. పిండిలో మలినాలు తొలగించడానికి జల్లెడ పట్టాలి.
దీనినే మాల్టెడ్ పిండి అంటారు.
తయారు చేసే విధానం - ఫ్లో చార్టు
ఉపయోగాలు
తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి
సులభంగా తయారు చెయ్యవచ్చు
ముడి సరుకులకు తక్కువ వ్యయం
ఎటువంటి రసాయనాలు అవసరం లేదు
పోషక లాభాలు మెండుగా ఉంటాయి
మాల్టింగ్ పద్ధతిలో వచ్చే ఉత్పత్తులు పొట్టు, వేర్లు మొదలైన వాటిని జంతువుల దాణాగా ఉపయోగించవచ్చు.
చిన్నకారు పరిశ్రమగా ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది.
ఆరోగ్య, ఆర్థిక బలాన్ని పొందడానికి మంచి ఉపాయం.
ఆధారం: డాక్టర్ కె. ఉమా మహేశ్వరి, ప్రొఫెసర్ మరియు యూనివర్శిటీ హెడ్, ఆహారం & పోషణ విభాగం కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/7/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి