ఫల సంపదలో అంజీరకు ఒక విశేష స్థానం ఉండటమే కాదు.... ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
రోజూ అరడజను మాత్రలు వేసుకునేవారికి మాత్రలే సమస్తం అనిపించవచ్చేమో గానీ, మందులతో పనిలేకుండా, ప్రకృతి సిద్ధమైన ఫలసంపదే ఎన్నో రుగ్మతల నుంచి విముక్తి కలిగించే అవకాశాలు ఉన్నాయి.
ప్రత్యేకించి అంజీర పండు ఎన్నో రకాల అనారోగ్యాలకు చక్కని నివారణా రూపంగా స్పష్టమవుతుంది. వాటిలో ముఖ్యంగా...
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అంజీర పాత్ర అంత్యంత కీలకమయ్యింది.
పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఇన్సులిన్ విడుదలను ఇది స్థిరపరుస్తుంది. నిలకడగా ఉంచుతుంది
ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు కావలసినంతగా ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే పరిస్థితిని శక్తివంతంగా ఎదుర్కొంటుంది.
చర్మ సంబంధ విషయాల్లో వాపును, ఎర్రదనాన్ని తగ్గించే అంశాలు ఇందులో ఉన్నాయి. అలా అంజీర చర్మ ఆర్మోగ్య పరిరక్షణలో బాగా తోడ్పడుతుంది.
అంజీరలో క్యాటరాక్ట్ సమస్యను, దృష్టి లోపాలను తగ్గించే గుణాలు ఉన్నాయి.
క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఇవి ఎముకల దారుఽఢ్యానికి బాగా ఉపయోగ.పడతాయి.
పేగుల కదలికలకు తోడ్పడే పీచుపదార్థాలు మిక్కుటంగా ఉండడం వల్ల అంజీరను అజీర్తిని తొలగించే గొప్ప ఔషధంగా చెబుతారు. పీచుపదార్థాల వ ల్ల అతిగా ఆకలి కావడం ఉండదు కాబట్టి శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి.