మానసికపరమైన లేక ప్రవర్తనాపరమైన కలత /రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పధ్దతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుధ్దంగా ఉంటూ ఆలోచనా ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్ధలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్ధితి ద్వారా తెలుపబడుతుంది. చాలా సందర్భాలలో దీని లక్షణాలు మరియు దుఃఖం, మానసిక, వ్యక్తిగత విధులలో కలిగే దుస్ధితి, అంతరాయం, అడ్డంకులతో కూడి ఉంటాయి.
అర్ధం చేసుకోవడంలో ఉండే సమస్యలు
ఏకాగ్రతను నిలపుకోవడంలో ఇబ్బంది అలాగే సులువుగా దృష్టి మరలిపోతూ ఉండడం, మనసును దేనిమీదా లగ్నం చేయలేకపోవడం.
సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం.
సమాచారాన్ని నెమ్మదిగా సంగ్రహించుకునే ప్రక్రియ లేక గందరగోళంలో పడడం.
సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడం.
సంక్షిప్తంగా, గూఢంగా ఆలోచించలేక పోవడం.
ఆలోచనా విధానంతో సమస్యలు
ఆలోచనలు పరుగెడుతున్నట్లు గాని లేక నిస్సత్తువగా, స్తబ్దుగా, నెమ్మదిగా ఉన్నట్టు కనిపించడం.
ఆలోచనలు అంతగా అర్ధంలేకుండా ఒక విషయంపై నుండి మరొక దాని వైపు ఉరకలు వేస్తూ ఉండడం.
నిఘంటువు (డిక్షనరీ)లో కూడా లేని మాటలను లేక శబ్ద ప్రయోగాలను చేస్తూ ఉండడం.
బయటశక్తులతో ప్రభావితమవుతూ ఉన్నట్లు ఉండే తనయొక్క , చర్యలు, చేష్టలు, అలాగే అసాధ్యమైన, అసంబధ్దమైన ఆలోచనలు.
గ్రాహ్యశక్తితో ఉండే సమస్యలు
అసాధారణంగా అనిపిస్తూ ఉండడం: అసాధారణంగా ఉండే తెల్లటి, ప్రకాశవంతమైన రంగులు లేక విపరీతమైన రణగొణ ధ్వనులు
ఎక్కడా గోచరించని, అంతుచిక్కని శబ్దాలను వినడం. ఎవరూ పక్కన లేకపోయినప్పటికి, తనలో తానే మాట్లాడుకోవడం, నవ్వుకుంటూ ఉండడం.
పాత సంఘటనలను కొత్తవిగా, వింతవిగా, విచిత్రమైనవిగా ఊహించుకుంటూ ఉండడం.
టి.వి.లోనూ, రేడియోలోనూ లేక ప్రజా రవాణా వ్యవస్ధలోనూ నిగూఢమైన సందేశాలు దాగి ఉన్నాయనే నమ్మకంతో ఉండడం.
మనోభావాలతో సమస్యలు
దేనికీ కొరగాని, నిరాశాజనకమైన మరియు అసహాయుడనని భావించుకుంటూ ఉండడం.
స్వల్పమైన విషయాలపై అపరాధం చేసినట్లుండే భావన కలిగి ఉండడం.
మృత్యువును గురించి లేక ఆత్మహత్యను గురించి అనుచిత భావాలను కలిగి ఉండడం.
అనేక విషయాలలో ఆసక్తిని, ఆనందాన్నికోల్పోవడం.
తన సమర్ధతపైనా, ప్రతిభ, ప్రజ్ఞా పాటవాలపైనా, సంపదపైనా లేక తన రూపంలోనూ, వేష భాషలలోనూ అతి విశ్వాసాన్ని, ఆడంబరాన్ని కలిగి ఉండడం.
అధిక శక్తి మరియు నిద్ర లేకపోవడం.
ఎప్పడూ చిరాకుపడుతూ ఉండడం, తొందరగా కోపం తెచ్చుకోవడం.
ఏ విధంగానూ రెచ్చగొట్టబడక పోయినప్పటికీ విపరీతమైన మానసిక భావ ప్రకోపనాలు, ఊగిసలాటలు కలిగి ఉండడం
ఉద్రిక్తతను పొందుతూ ఉండడం, అమితానందాన్ని, అతి ఉల్లాసాన్ని పొందడం, అతి విశ్వాసాన్ని కలిగి ఉండడం మరియు ఇతరులకు భంగపాటును కలిగిస్తూ ఉండడం.
ఎప్పుడు చూసినా చాలా వరకూ అతి మెళుకువగా, అతి జాగ్రత్తగా ఉంటూ ఉండడం.
ప్రతి రోజూ జరుగుతూ ఉండే సంఘటనలతో ఆదుర్దా, కంగారు పడుతూ, భయంతో భాధ పడుతూ ఉండడం.
సాధారణంగా చేసుకునే పనులను భయం వల్ల తప్పించుకోవడం (బస్ ఎక్కడం, షాపుకి వెళ్లి సరుకులు, వెచ్చాలు తెచ్చుకోవడం వంటివి).
ఇతరుల మధ్య ఉండాలంటే అసౌకర్యంగా అనిపించడం.
ఆచార వ్యవహారాలను, నియమాలను లేక మరల మరల అదే విధంగా ప్రవర్తించే తీరును బలవంతంగా పాటించవలసి ఉండడం.
తలకిందులైన భావాలతో, అనుచితమైన జ్ఞాపకాలతో లేక పాత సంఘటనలపై పీడకలలతో సతమతమవుతూ ఉండే పరిస్ధితిని కలిగి ఉండడం.
సామాజకీకరణతో సమస్యలు
అతి తక్కువగా ఉండే సమీప మిత్ర గణం.
సాంఘిక కార్యకలాపాల్లో ఆతృత, కంగారు లేక భయం, బిడియం కలిగి ఉండడం.
వాగ్ధాటితో గాని లేక శారీరకంగా గాని దూకుడు స్వభావాన్ని కలిగి ఉండడం.
కోలాహలంగా, ఒడిదుడుకులతో నిండి వుండే బంధుత్వాలు, అతి విమర్శనాత్మకమైన స్ధితినుండి అతిగా ఆరాధించే స్ధితి వరకూ కోలాహలంగా, ఒడిదుడుకులలో నిండి ఉండే బంధుత్వాలు కలిగి ఉండడం.
కలిసికట్టుగా అందరితో మెలుగుతూ ఉండడం కష్టతరమైనదిగా ఉండడం.
ఇతరులను అవగాహన చేసుకోలేక పోవడం.
అసాధారణమైన అనుమానం, అపనమ్మకం కలిగి ఉండడం.
పని నిర్వహణతో సమస్యలు
తరచుగా కోపానికి గురవడం లేకపోతే వదిలివేస్తూ ఉండడం.
సాధారణమైన ఒత్తిడికి లేక అంచనాలకు అతి సుళువుగా కోపం రావడం లేక చిరాకు, విసుగు కలిగి ఉండడం.
పనిచేసే చోటగాని, పాఠశాలలో గాని లేక ఇంటివద్ద గాని ఇతరులతో కలిసి మెలిసి ఉండలేకపోవడం.
పనిని సమర్ధవంతంగా చేయలేకపోవడం అలాగే దేని మీదా దృష్టిని సారించలేకపోవడం.
ఇంటివద్ద సమస్యలు
ఇతరులను అవసరంలో ఆదుకోలేక పోవడం.
నిత్యకృత్యంగా జరుగుతూ ఉండే ఇంటిపనులతోనూ లేక గృహ సంబంధిత ఆశలు, ఆశయాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు భావించడం.
ఇంటిపనిని సరిగా నిర్వర్తించలేక పోవడం.
నిష్క్రియాపరంగా గాని లేక క్రియాశీలకంగా, ఉత్సాహంతో గాని కుటుంబ సభ్యులతో వాదనలను ప్రేరేపించడం లేక కొట్లాటకు దిగుతూ ఉండడం.
స్వయం శ్రధ్ధ, జాగ్రత్తతో సమస్యలు
వేష భాషల్లో గాని, పైకి కనబడే రూపలావణ్యాలలో గాని లేక పరిశుభ్రతలో గాని శ్రధ్ద, జాగ్రత్త తీసుకోకపోవడం.
చాలినంతగా తినకపోవడం లేక అతిగా తినడం
నిద్రలేక పోవడం లేక అతిగా నిద్రపోవడం లేక పగటిపూట నిద్ర
శారీరక ఆరోగ్యంపై అతి తక్కువ లేక అసలు ధ్యాస పెట్టకపోవడం
శారీరక రోగ లక్షణాలతో సమస్యలు
వివరించడానికి వీలుగాని నిరంతరం ఉంటూ ఉండే శారీరక లక్షణాలు
తరచుగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వీపు, వెనుక భాగం నొప్పి, మెడ నొప్పి రావడం.
ఒకే సారి వివిధ అవయవాలకు సంబంధించిన అనేక శారీరక వ్యాధులు రావడం
అలవాట్లతో సమస్యలు
అదుపుచేయడానికి వీలుగాని మరియు రోజు వారీ కార్యకలాపాలతో జోక్యం చేసుకునే, అడ్డంకిగా మారే మితిమీరిన ఏ అలవాటైనా.