షుగరు వ్యాధిలో రోగి రక్తంలో చక్కెర ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువవుతుంది. ఒక పరిమితికి మించి చక్కెర రక్తంలో పెరిగిపోయినప్పుడు రోగి సృహ కోల్పోతాడు. అదే విధంగా ఒక పరిమితికి మించి రక్తంలో చక్కెర తక్కువయిపోయినప్పుడు కూడా రోగి సృహ కోల్పోతాడు.
అందరు మనషులలో సృహలో వున్నప్పుడు రక్తంలో చక్కెర సరిపడా మోతాదులో ద్రవరూపంలో ప్రసరణలో వుంటుంది. చక్కెర జబ్బులో ఇది కొద్ది కొద్దిగా అధికమవుతూపోయి ఒక పరిమితి దాటినప్పుడు రోగి సృహ కోల్పోవడం జరుగుతుంది.
చక్కెర జబ్బు చికిత్స తీసుకుంటున్న వారిలో, ఇన్సులిన్ తీసుకుంటున్న వారిలో ఇంకొక రకంగా సృహ కోల్పోవడం, అపస్మారక స్థితిలోనికి పోవడం జరుగుతుంది. ఇన్సులిన్ శరీరంలో రక్త ప్రసరణలో వున్న చక్కెర మోతాదును నియత్రిస్తుంది. ఇది చక్కెర మోతాదును అతి త్వరగా తగ్గించి వేస్తుంది లేదా ఎక్కువగా తగ్గించి వేస్తుంది దీని మూలంగా రోగి కొద్ది నిమిషాల హెచ్చరికతో సృహ కోల్పోతాడు. ఈ సమయంలో రోగి సన్న గొంతుతో మాట్లాడుతాడు, చికాకుగా వుండి ఎదుటి వారిని ఏమీ చేయనీకుండా అడ్డుపడుతూ వుంటాడు. జాగ్రత్తగా వెదికితే రోగికి చక్కెర జబ్బు వున్నట్టు నిర్థారించే సమాచారం దొరకవచ్చు. ఒకసారి సృహ కోల్పోయిన తరువాత, చికిత్స అందని పక్షంలో అపస్మారక స్థితిలోనికి జారుకుంటారు.
రోగి కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు తినడానికి చక్కెర ఇవ్వవచ్చును. కానీ ఒక్కసారి రోగికి సృహ తప్పాక నోటిలోనికి ఏమీ పోయకూడదు. వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం లేదా వైద్యుని పిలిపించడం చేయాలి.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020