ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.
DRABCR పద్దతి
- D అనగా Danger - అతనిని మనకు ప్రమాదాన్నుంచి తప్పించాలి. ఉదా,, అతనిని విషవాయువున్న ప్రదేశాన్నుంచి తప్పించాలి.
- R అనగా Response - అతనిని పలుకరించాలి - అతను పలుకకునప్పుడు
- A అనగా Airway అతని శ్వాస నాళాన్ని సరి చేయాలి. అందుకు
నొసలు వెనక్కువంచి గడ్డాన్ని పైకి ఎత్తి పట్టాలి. నోరు పరీక్ష చేసిన తర్వాత
- B అనగా Breathing శ్వాస ఉన్నది లేనిది గమనించి, శ్వాస
- లేకుంటే కల్పిత శ్వాస కలిగించాలి. రెండు సార్లు నాల్గు సెకన్లకు
ఒకసారి శ్వాస కలిగించాలి.
- అనగా Circulation అంటే రక్త ప్రసారము కొరకు నాడిని పరీక్షించాలి. నాడి తెలియకుంటే గుండె ఆగినట్లు కాబట్టి కార్డియాక్ మసాజ్ చేయాలి.
- అనగా అతనిని రికవరీ పద్దతిలో పరుండబెట్టాలి.
సాధారణంగా ఈ సందర్బలలో మనిషి స్రృహ లేకుండా ఉంటాడు.
- తలకు దెబ్బ - ప్రధమ చికిత్స DRABCR
- పక్షవాతము వచ్చినప్పుడు - ప్రధమచికిత్స DRABCR
- ఫిట్స్ - ప్రధమచికిత్స DRABCR
- చిన్న పిల్లలు ఫిట్స్ సాధారణముగా చిన్న పిల్లలకు ఫిట్స్ జ్వర తీవ్రత వలన రావచ్చును. ప్రధమచికిత్సలో DRABCR కాక జ్వరమును తగ్గించుటకు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి. ( Cold Sponging) అయితే జ్వరం 102ºF వచ్చినట్లయితే తుడవటాన్ని ఆపాలి.
- వడదెబ్బకు గురైతే DRABCR పద్దతి అవలంబిస్తు అతనిని చల్లని ప్రదేశాలకు తరలించాలి.
- శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు అతని అవలంబిస్తు అతని శరీరమంతా తడి గుడ్డతో తుడవాలి .
- స్రృహ వచ్చిన తరువాత అతనికి ఉప్పు కలిపిన నీళ్ళు (అనగా ఒక గ్లాసు నీళ్ళల్లో ¼ చంచాడు ఉప్పు కలిపి ) త్రాగించాలి.
- కళ్లు తిరిగి పడిపోవుట (Fainting) ప్ర.చి. DRABCR
- హిస్టీరియా - మానసిక బలహీనత వల్ల తెలిసి, తెలియక స్రృహ కోల్పోవుట.
- రక్త స్రావమువలన స్రృహ కోల్పోవుట.
- విషపదార్థములు సేవించినందువలన స్రృహ కోల్పోవుట.
- గుండె పోటు వలన స్రృహ కోల్పోవుట. తదితర కారణాల వల్ల పై సందర్బాలలో పైన వివరించినట్లుగా DRABCR పద్దతిని పాటించినట్లయితే రోగికి ఉపశమనం కలుగుతుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.