1-0-8 అత్యవసర ప్రతిస్పందన సేవ వైద్య, పోలీస్ మరియు అగ్ని ప్రమాదాలకై 24X7 (ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ) పని చేసే అత్యవసర సేవ. ఈ సేవ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, తమిళ్ నాడు, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, మేఘాలయ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉంది.
ఈ సేవ యొక్క ప్రధానాంశాలు:
ఈ క్రింది పేర్కొన్న ప్రయోజనాలకై 1 -0-8 కు డయల్ చెయ్యాలి:
మొదటి 24 గంటలూ ప్రాధమిక వైద్య సంరక్షణను ఉచితంగా అందచేయడానికి గాను 108 అత్యవసర ప్రతిస్పందన సేవ 6800 కి పైగా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది.
వైద్యసంబంధఅత్యవసరపరిస్థితులు |
పోలీస్ఎమర్జెన్సీలు |
|
తీవ్రమైనగాయాలు |
దొంగతనాలు,దోపిడీలు |
కాలినగాయాలు |
గుండెపోటు |
వీధిదెబ్బలాటలు |
మంటలుచెలరేగడం |
స్ట్రోక్(వాతం) |
ఆస్తితగాదాలు |
|
శ్వాససంబంధసమస్యలు |
స్వయంకృతగాయాలు/ఆత్మహత్యాప్రయత్నాలు |
|
మధుమేహం |
దొంగతనాలు |
|
|
దెబ్బలాటలు |
|
మూర్ఛ |
బహిరంగగొడవలు |
|
|
తప్పిపోవడం |
|
జంతువులకాట్లు |
కిడ్నాపులు |
|
తీవ్ర మైన జ్వరం |
ట్రాఫిక్సమస్యలు(ట్రాఫిక్జాం,ర్యాలీలు,రాస్తారోకోలు మొదలైనవి)
|
|
అంటువ్యాధులు |
బలవంతపుచర్యలు,దొమ్మీలువంటివి |
నిజమైన అత్యవసర పరిస్థితి లేనిదే 1-0-8 కు కాల్ చేయవద్దు. ఇది విచారణకో, సమాచార సేకరణకో చేసే నంబర్ కాదు. నవ్వులాటకి ఈ నంబర్ కి ఫోన్ చేసి ఆటలాడుకోవద్దు. అది ఒక నిజమైన ఆపదలో ఉన్న వారి కాల్ కు అడ్డు తగిలి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున డయల్ చేసినట్లయితే సంబంధిత అధికారికి విషయం చెప్పే వరకూ ఫోన్ పెట్టేయవద్దు.
108 అత్యవసర ప్రతిస్పందన సేవ 2005 ఆగష్టు లో హైదరాబాద్ లో మొదలవగా ప్రస్తుతం జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. ఒక సమగ్ర అత్యవసర సేవను రాష్ట్ర వ్యాప్తంగా 752 అంబులెన్సులతో నడుపుతూ రోజుకి 4800 మందికి అత్యవసర సేవ లంది స్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోనూ, గుజరాత్ లోనూ జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. 108 అత్యవసర సేవలను చూసి ఉత్తరాఖండ్, తమిళ్ నాడు, మధ్య ప్రదేశ్, గోవా, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, మేఘాలయ మరియు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో కూడా ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రతిస్పందన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించాయి.
జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గోవా, తమిళ్ నాడు, కర్ణాటక, అస్సాం, మేఘాలయ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అమలులో ఉంది.
అత్యవసర పరిస్థితులను తెలుసుకుని, సహాయం అందేటట్లు చూడడానికి జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. స్వఛ్ఛంద సేవను ప్రవేశ పెట్టింది. 1-0 -8 సేవల గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు జి.వి.కే. ఇ.ఎం.ఆర్.ఐ. వాలంటీర్ల సహాయాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
జి.వి.కే. ఇ.ఎం. ఆర్. ఐ. ఆశించేవి:
ఆధారము: జి వి కె – ఇ ఎమ్ ఆర్ ఐ
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020