స్వైన్ ఇన్పఫ్లూయెన్జా (స్వైన్ ఫ్లూ) అంటే, పందులలో వచ్చే శ్వాసకోశవ్యాధి. ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ రాదు కాని మానవ అంటురోగములు రావచ్చు మరియు వచ్చితీరతాయి. స్వైన్ ఫ్లూ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయని తెలిసింది. కాని గతంలో, ఈ వ్యాధి పరిమితంగా ఉండి మరియు ముగ్గురికి మించి వ్యాపించేది కాదు.
2009 సంవత్సరం మార్చి చివరలో మరియు ఏప్రిల్ మొదటిలో దక్షిణ కేలిఫోర్నియాలో మరియు సేన్ ఏంటోనియా, టెక్సాస్ దగ్గర తొలిసారిగా స్వైన్ ఇన్ ఫ్లూయెన్జా ఎ( హెచ్1 ఎన్1) వైరస్ ద్వారా మానవ అంటువ్యాధి కేసులు వచ్చినట్లు తెలిసింది. ఇతర అమెరికా సంయుక్త రాష్టాల మనుషులలో స్వైన్ ఫ్లూ అంటువ్యాధి వచ్చినట్టు సమాచారమందింది. అంతర్జాతీయంగా కూడా ఈకేసులు వచ్చినట్లు తెలిసింది.
మనుషులలో వచ్చే స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు సాధారణంగా వచ్చే ఫ్లూని పోలి ఉంటాయి. ఈ లక్షణాలు జ్వరం,దగ్గు,గొంతు నొప్పి,ఒంటి నొప్పులు,తల నొప్పి,చలి మరియు అయాసములని కలిగి ఉంటాయి. కొంత మందికి అతిసారవ్యాధి మరియు స్వైన్ ఫ్లూతో వచ్చే వాంతులు వచ్చినట్లు తెలిసింది. గతంలో, స్వైన్ ఫ్లూ వచ్చిన వారు తీవ్రవ్యాధి (నిమోనియా మరియు శ్వాస ఆగి పోవడం) మరియు మరణం చెందినట్టు తెలిసింది. సీజనల్ ఫ్లూ వలె స్వైన్ ఫ్లూ అవసరమైన దీర్ఘకాల ఆరోగ్య పరిస్థితులను క్షీణించేలా చేస్తుంది.
ఇన్ ఫ్లూయెన్జా ఉన్న వారు దగ్గడం లేదా తుమ్మడం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ముఖ్యంగా ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఒక్కొక్కప్పుడు ఫ్లూ వైరస్ ఉన్న వారిని ముట్టు కున్నపుడు, ఆ తరువాత వారి నోటిని లేదా ముక్కుని ముట్టుకున్నపుడు వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలు పెట్టిన ఒకరోజు ముందు మరియు వ్యాధి సోకిన ఏడు రోజులు వరకు లేదా అంతకన్నాఎక్కువ, వ్యాధి సోకిన వారు ఇతరులకు వ్యాధి సోకించ గలరు. అంటే మీకు వ్యాధి సోకిందని తెలిసే మునుపే లేదా మీరు వ్యాధిగ్రస్థులైనప్పుడు కూడా ఇతరులకు ఫ్లూని సోకించగలరు.
అన్నిటికన్నా ముందు ముఖ్యమైనది: చేతుల్ని శుభ్రంగా కడుగుకోవాలి,ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి,ఎక్కువగా నిద్రపోవాలి, శారీరకంగా చురుకుగా ఉండాలి,ఆందోళన పడకుండా ఉండాలి, ఎక్కువ ద్రవ పదార్థాలని తీసుకోవాలి మరియు పోషకాహారాన్ని తీసుకోవాలి. ఫ్లూ వైరస్ తో మురికిగాఉన్న ఉపరితలాలని ముట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. వ్యాధి ఉన్నవారి దగ్గరకు వెళ్ళకుండా ఉండండి.
స్వైన్ ఫ్లూ రాకుండా రక్షించుకోవడానికి ఇప్పుడు వేక్సీన్ లు లేవు. శ్వాసకోస వ్యాధిని కలిగించే ఇన్ ఫ్లూయెన్జా వంటి క్రిముల్ని వ్యాప్తి చెందకుండా ఆపడానికి దోహదపడే, ప్రతిరోజు తీసుకునే చర్యలు ఉన్నాయి. ప్రతిరోజు మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన సలహాలను పాటించాలి.
మీరు వ్యాధి గ్రస్థులయితే, వీలైనంత వరకు ఇతరులను కలవకుండా పరిమితంగా ఉండాలి. వ్యాధితో ఉన్నపుడు పనికి లేదా పాఠశాలకి వెళ్ళకుండా ఉండాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు మీరు నోటిని మరియు ముక్కుని టిస్యూతో కప్పాలి. ఇది మీ చుట్టు ప్రక్కన ఉన్నవారికి ఈ వ్యాధి సోకకుండా చేయవచ్చు. మీరు ఉపయోగించిన టిస్యూని చెత్త బుట్టలో పారవేయాలి. మీ దగ్గర టిస్యూ లేకపోతే, దగ్గు లేదా తమ్ము వచ్చినపుడు చేతితో అడ్డుపెట్టాలి. అప్పుడు మీ చేతులను శుభ్రపరచుకోవాలి. మీరు దగ్గు లేదా తుమ్ము వచ్చిన ప్రతిసారి ఈ విధంగా చేయాలి.
తరుచుగా మీచేతుల్ని కడుగుకోవడం వలన క్రిములు నుంచి మిమల్ని రక్షించుకోడానికి దోహద పడుతుంది. సబ్బు మరియు నీటితో కడుగుకోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత ‘చేతిని శుభ్రపరిచే వాటిని’ ఉపయోగించి శుభ్రపరచుకోవాలి. మీచేతుల్ని కడుగుకొనేటపుడు, 15-20 సెకన్ల పాటు సబ్బు మరియు వేడి నీటిలో మీచేతులని శుభ్రపరచుకోవడం మంచిది. సబ్బు మరియు నీరు దొరకనప్పుడు, ఒకసారే ఉపయోగించడానికి వీలుగల ఆల్కహాల్ ఆధారిత ‘చేతిని శుభ్రపరిచేవి’ లేదా జెల్ సానిటైజర్స్ని ఉపయోగించాలి. ఇంచుమించు అన్ని సూపర్ మార్కెట్ మరియు మందుల దుకాణాలలో ఇవి దొరుకుతాయి. జెల్ ని ఉపయోగిస్తే చేతుల్ని జెల్ ఆరి పోయేవరకు రుద్దాలి. జెల్ పనిచేయడానికి నీరు అవసరం లేదు,అందులో ఉన్న ఆల్కహాల్ మీచేతుల మీదున్న క్రిములను చంపివేస్తుంది.
పిల్లలలో అత్యవసర వైద్య జాగ్రత్త అవసరమయ్యే, అత్యవసర హెచ్చరించే చిహ్నాలు ఏమిటంటే:
పెద్దవారిలో అత్యవసర జాగ్రత్త అవసరమయ్యే, అత్యవసర హెచ్చరించే చిహ్నాలు ఏమిటంటే
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లూయెంజ విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాప్తి చెందే జలుబు. ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడంతో కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి.
పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంటుంది. పందుల్లో ఉండే వైరస్ తన యాంటి జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తి చెందడంతో స్వైన్‌ఫ్లూగా పేరుపెట్టారు. ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంది. స్వైన్‌ఫ్లూను వైద్యులు తమ పరిభాషలో హెచ్1ఎన్1 అని పిలుస్తారు.
చలికాలంలో జలుబు వైరస్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ కూడా ఇదే తరహాలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది. బాధిత రోగి జాగ్రత్తలు పాటించకపోతే అది ఎదుటి వారికీ సంక్రమించే ప్రమాదం ఉంది. దగ్గు, తుమ్ము వస్తే.. తుంపర్లు ఎదుటివారిపై పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులపై తుంపర్లు పడితే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్లూ సోకిన వారి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి.
వ్యాధి సోకిన వ్యక్తికి ఇది ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. వ్యాధి సోకిన వారు తీవ్ర జ్వరం, జలుబు (ముక్కు నుంచి నీరు కారుతుంది), గొంతులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, చలి, శరీర నొప్పులు, దగ్గు, నీరసం, అలసటతో బాధపడతారు. వాంతులు, విరేచనాలు అయినప్పుడు స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. కానీ స్వైన్‌ఫ్లూ రోగికి ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్నారుల్లో ఈ జబ్బు శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.
శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, జ్వరం తగ్గినా, దగ్గు తగ్గదు. పెద్దలలో ఆయాసం, ఛాతి, పొట్టలో నొక్కేస్తున్నట్లు నొప్పి, వాంతులు ఉంటే స్వైన్‌ఫ్లూ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి అప్పుడే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధారము: సాక్షి
దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు ఉండడం స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీలులేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ చుట్టు పక్కలకు వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులతో భుజించినా, కలిసి నడిచినా, కరచాలనం చేసినా, నిద్రించినా, ఆలింగనం చేసుకున్నా ఈ వ్యాధి సోకుతుంది.
ఆధారము: నమస్తే తెలంగాణా
స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా ఎలాంటి వైద్యం చేయించుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి లాంటి విషయాలు తెలియక చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వారం తెలుసుకుందాం...
ఆధారము: ఆంధ్ర జ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శ...
స్వైన్ ఫ్లూ కనుక అయితే భయం వద్దు