విబ్రియో కలరా బ్యాక్టీరియమ్ చిన్న ప్రేవుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు.ఈ అంటు వ్యాధి తరచుగా తక్కువగాను, లేదా లక్షణాలేమీ కన్పించకుండానే వస్తుంది. కానీ కొన్ని సార్లు తీవ్రంగా కూడ వస్తుంది.
20 మందికి కలరా సోకితే అందులో సుమారుగా ఒకరికి తీవ్రవైున వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. అవిః
ఈ వ్యక్తులు శరీరంలోని ద్రవ పదార్ధాలు త్వరితంగా కోల్పోవడం, ఆకస్మిక వ్యాకులత చెందడం జరుగుతుంది. సరైన సమయంలో చికిత్స గనక జరగకపోతే కొద్ది గంటల వ్యవధిలోనే మరణిస్తారు.
కలరా, బ్యాక్టీరియమ్ గల కలుషితమైన నీటిని తాగడం లేదా కలుషితమైన ఆహారం తినడం ద్వారా ఏ వ్యక్తికైనా రావచ్చు. అంటువ్యాధిసోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంతో కలుషితమైన వాటి మూలంగా సమాజం లోని కూటమి ఒకే చోట నివసించే వారందరికి సామాన్యంగా కలరా వస్తుంది. మురుగునీరు, మంచి నీటి సదుపాయాలు తగిన రీతిలో లేనప్పుడు శీఘ్రంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
చవిటిగా ఉండి కొద్దిగా ఉప్పదనంగల నదులలోను, సముద్ర తీరపు నీటి వాతావరణంలో కూడ కలరా బ్యాక్టీరియమ్ నివసించగలదు.
శుభ్రంగాలేని లేదా సరిగా ఉడకని ఎండ్రకాయ, రొయ్యలు మొదలగు వాటిని తినడం మూలంగా కలరా రావచ్చును. ఈ వ్యాధి నేరుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. కాబట్టి, సాధారణ స్పర్శ ద్వారా అంటువ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వచ్చే ప్రమాదం లేదు.
అతిసారం వలన కోల్పోయిన ద్రవాలను, లవణాలను తిరిగి రోగికి చక్కెర , ఉప్పు మిశ్రమ ద్రావణం వెంటనే ఇవ్వడం ద్వారా చక్కటి చికిత్స జరుగుతుంది. నోటిద్వారా జల ద్రావణాన్ని (ఓరల్ డీ హైడ్రేషన్), పొట్లంలో గల చక్కెర, ఉప్పు మిశ్రమానికి నీటిని చేర్చి ఎక్కువ మొత్తంలో తాగించడం ద్వారా చికిత్స చేయడం. ప్రపంచ వ్యాప్తంగా ఈ ద్రావణాన్ని డయేరియా (అతిసార) చికిత్సకు ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన వ్యాధిగలవారిలో కూడ రక్తనాళాలకు నేరుగా ఈ ద్రవాన్ని చేరేటట్లుగా ఎక్కించాలి. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి చేరేటట్లు చేయాలి. నిర్జలీకరణాన్ని లేకుండ చేయడం ద్వారా ఒక శాతం కన్నా తక్కువ మంది కలరా వ్యాధిగ్రస్తులు చని పోతున్నారు.
ఏంటీబయాటిక్స్ వల్ల చికిత్సా సమయం తగ్గించబడి, వ్యాధి తీవ్రత తగ్గుతుంది. కానీ ఎంత చేసినప్పటికినీ ఉప్పు, చక్కెర మిశ్రమ ద్రావణం కన్నా మేలైనది కాదు. ఏ దేశంలోనైతే కలరా వ్యాపించబడి, తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులతో బాధపడుతున్న వ్యక్తులకు తక్షణమే వైద్య చికిత్సను అందుబాటులోకి తేవాలి.
ఆధారము: Medicinenet
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
భారతదేశ వైద్యవిధానాలలో సిద్ధ అనేది ఒక అతి పురాతనమై...
ఈ పేజి లో వివిధ వ్యాధుల యొక్క చికిత్స మెటీరియల్ అం...
అంటు వ్యాధులు లక్షణాలు,రోగ కారణాలు తీసుకోవాల్సిన జ...
మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే ...