ప్రకృతిలో కాలానికి తగ్గట్టుగా మార్పులు రావటం సహజం. మాములుగా ఓ మోస్త్తారు వర్షాలు కురిసినా, లేక తుఫాను ప్రభావంతో ముసురు వానలు పడ్డా వాతావరణం లో మార్పు సహజంగానే కలుగుతుంటుంది. అలాంటి సమయాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా జ్వరాలు, ఒక పట్టాన వదలని జలుబుతో బాధపడుతుంటారు. జ్వరం తగ్గకుండా వున్నా, ముక్కు వెంట నిరు కారుతూ పడిశం ఇబ్బంది వున్నా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకొంటూ ఉంటాము. ఇది ఇలా వున్నా ఇటీవల స్వైన్ ఫ్లూ తిరిగి ప్రవేశించింది. దీని బారిన పడి మృతి చెందుతున్నారనే వార్తలు కూడా మనం చూస్తూనే వున్నాము. అందరిలో తెలియని ఆందోళన ప్రారంభమైంది. కాసంత జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది. ఆరోగ్యాంగా ఉండే వారికి అంత హాని కలిగించదు. కాకపోతే చిన్న పిల్లలు వయసు మళ్ళిన వృద్దులకు కొంత మందికి ఇతరత్రా సమస్యలు కలిగే వీలుంది. అందుచేత అవగాహనతో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
ఇందులో సాధారణంగా ఫ్లూ జ్వర లక్షణాలే ఉంటాయి. గొంతు నొప్పి జ్వరం, తల నొప్పి, ముక్కు దిబ్బడగా ఉండటం, నిరు కారి పోవటం వంటివి కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడుగా నొప్పులు, విపరీతమైన నీరసం, వంటి నొప్పులు కూడా ఉంటాయి. కొంత మందిలో విరేచనాలతో పటు వాంతులు కూడా అవుతాయి. మాములు ఫ్లూ లక్షణాలు ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే ఉండీ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ముదురుతుంటే అది న్యుమోనియాగా వ్యాప్తి చెంది మరింత ఆందోళనకు గురి చేసే ప్రమాద ముంది. కనుక స్వైన్ ఫ్లూ మరణాలకు ఇదే కారణమని మనం గ్రహించాలి. గుండె జబ్బు, మధు మేహం వంటివి కూడా సమస్యను తీవ్ర తరం చేస్తాయి.
శీతా కాలంలో ఫ్లూ సోకుతుందని అనేక మంది ఆలోచన. నిజానికి ఇది అవాస్తవం. ఫ్లూ జ్వరాలు ఎప్పుడైనా రావచ్చు. అయితే శీతా కాలం లో ఫ్లూ సంబంధమైన వైరస్ గాలిలో ఎక్కువ రోజులు ఉంటుంది. కనుక ఎక్కువగా వ్యాపించే వీలుంది. రోగ నిరోధక శక్తీ దృఢంగా ఉంటే ఫ్లూ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాటానికి మనం తప్పని సరిగా శ్రద్ద వహించాలి. సమతులమైన ఆహరం తినటం, రోజులో తగినంత నిద్ర పోవటం, ఆలస్యం కాకుండా వేలకు నిద్ర పోవటం వంటివి పాటించాలి. పండ్లు, పండ్ల రసాలు వీలయినంత ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తీ మెరుగు అవటానికి బాగా సహకరిస్తుంది. దింతో వైరస్ శరీరంలోకి జొరబడినా ఎదుర్కొనే శక్తీ మనకు కలుగుతుంది.
స్వైన్ ఫ్లూ సోకకుండా ఉండేందుకు ప్రస్తుతం టీకాలు అంబాటులోకి వచ్చాయి. వైరస్ ల ఉంచి కాపాడుతుంది. టీకా తీసుకున్న నాలుగు వారాలకు శరీరంలో వైరస్ ను సమర్ధంగా ఎదుర్కునే యాన్తి బాడీ తయారవుతుంది. అయితే ఒక సారి ఫ్లూ సోకినా తరువాత తీసుకుంటే అంత ప్రయోజనం ఉండదు. ఇది సోకటానికి ముందుగానే, అది కూడా సాధారణ మైన ఆరోగ్యంతో ఉండగానే తీసుకుంటే మంచిది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడకుండా ఉండాలనుకునే వారు ఎవరైనా టీకా వేసుకోవచ్చు. ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, 80 సంవత్సరాలు విన్న వృద్దులు, గర్భిణీ స్త్రీలు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, రాక నిరోధక శక్తీ తక్కువగా ఉన్నటువంటి వారు తీసుకోవచ్చు. వీరంతా కుడా విధిగా టీకాలు మంచిది. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నీళ్లలోగా టీకా వేయించు కోకూడదు. 4 - 6 నెలల మధ్య కాలంలో వేయించుకోవచ్చును. దీనివల్ల పుట్టబోయే పిల్లలకు ఫ్లూ సోకకుండా కాపాడుకునే వీలుంటుంది. హెచ్ 1 ఎన్ 1 అనే వైరస్ మూలంగా స్వైన్ ఫ్లూ వచ్చే వీలుంది. గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి వస్తుంది. వైరస్ రక్తం లో ఉండదు. శ్వాస కోశ అవయవాల్లో ఉంటుంది. వైదుల్ని సంప్రదిస్తే పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.
వ్యాసం: అనూరాధ
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2024
స్వైన్ ఇన్పఫ్లూయెన్జా (స్వైన్ ఫ్లూ) అంటే, పందులలో ...
సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శ...