బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.
బిడ్డ ఆరోగ్య సంరక్షణలో దశలు
పైన చెప్పిన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అన్ని దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపిస్తుంది.
పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల మరణాల సంఖ్య మరియు వ్యాధుల సంక్రమణను ఆధారంగా చేసుకొని నిర్ణయించవచ్చును.
పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, వయస్సు, లింగం, పరిసరాలు, కుటుంబ పరిమాణం, పోషణ, మాతాశిశు సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం.
ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న 'ఆటిజం' ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో 'ఆటిజం'పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది.
మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ... సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ... ఆటిజం!
'ఆటిజం' భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే 'పర్వేసివ్ డెవలప్‌మెంటల్ డిసార్డర్స్' అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.
కాదు మాంద్యం
కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు.
కారణాలు:
ఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి.
గుర్తించేదెలా?
మరీ చిన్నవయసులో..
కాస్త పెద్దవయసులో..
చికిత్స ఏమిటి?
సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్ స్కేల్స్' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్ సిండ్రోమ్ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.
మందులు (ఫార్మకలాజికల్ థెరపీ):
మానసిక స్థితిని చక్కదిద్దటం (సైకలాజికల్ ఇంటర్వెన్షన్)
ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.
ఫలితం..
ఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న వాదనా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని భావించి.. వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'జీఎఫ్ సీఎఫ్' డైట్ అంటారు. అయితే దీన్ని కచ్చితంగా పాటించటం కష్టం. 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది.
పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు
పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.)( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.
పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…
క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.
జాగ్రత్తలు :
నవజాత శిశువుకు వచ్చే ఆరోగ్య సమస్యలు – కామెర్లు, ధనుర్వాతం, శ్వాస సంబంధ సమస్యలు, ఉష్ణోగ్రతను క్రమపరచుకోవటం (బయటి వాతారణంలోని ఉష్ణోగ్రతను తట్టుకోకపోవటం), నోటి పూత సంబంధిత వ్యాధులతో బాధపడడం. అంటుసోకటం మొదలగునవి, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు బరువు చూడటం ముఖ్యమైన చర్య. మంచి ఆరోగ్యంతో పోషకాహారంతో ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలు 3.5 కేజీల బరువు ఉంటారు. కానీ భారతదేశంలో పిల్లల యొక్క కనీస బరువు 2.5 నుండి 2.9 కేజీలు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అంటారు.
తక్కువ బరువుతో పుట్టడం రెండు కారణాల వలన జరుగుతుంది
కారణాలు – ఎక్కువ సార్లు గర్భం రావటం, తల్లికి తీవ్రమైన అంటు సోకినప్పుడు, మూత్రంలో ఆల్బుమిన్, శరీరంలో వాపు ఉన్నప్పుడు, చిన్న వయస్సులో గర్భం దరించినప్పుడు, ఎక్కువ శారీరక శ్రమ వలన ఇలా జరగవచ్చు.
తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఇవ్వవలసిన జాగ్రత్త మరియు చికిత్స
పోషణ
1999 – 2003 సంవత్సరాలలో జాతీయ పోషకాహార సంస్థ మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారు చెప్పిన లెక్కల ప్రకారం ఆరు నెలల వయస్సు నుంచి రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు కుపోషణకు గురవ్వడం ఎక్కువగా ఉందని చెప్పారు.
పోషణ మరియు అంటువ్యాధులకు గురి అవ్వటం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పోషణ లోపం వలన పోషకాహార పదార్థాలను తగినంత పరిమాణంలో తీసుకోరు. దీని వలన వారి ఎదుగుదల నిలిచిపోవటం తో పాటు పోషణ లోపం వలన కొన్ని జబ్బులకు గురి అవుతారు. ఉదా. పిల్లల్లో విటమిన్-ఎ లోపం వలన రేచీకటి వస్తుంది. దీని వలన కంటి గుడ్డు భాగం దెబ్బతినవచ్చు.
ఐరన్ లోపము వలన రక్తహీనత వస్తుంది. దీని వలన పిల్లలో పెరుగుదల, అభివృద్ధి లోపించి చేసే పని మీద ఆసక్తి లేకపోవటం, నీరసంగా ఉంటుంది. ఐయోడిన్ లోపం వలన పిల్లలో బుద్దిమాంద్యత వస్తుంది.
పిండానికి సంబంధించిన కారణాలు
కవలలు, గర్భ సంచికి సంబంధించిన అంటు, క్రోమోజోములలో అవకతవకలు, సాధారణ పిండ స్థితి వలన.
మావికి సంబంధించిన కారణాలు
మావిలో అసాధారణ పరిస్థితులు, అసాధారణ పరిస్థితులు మరియు మావి కార్డు పొడవు ఉండవలసిన దానికన్నా చిన్నదిగా ఉండం.
తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు
అంటు వ్యాధులు అనేవి పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు మరియు ఇవి ప్రాణాంతకమైనవి కూడా. ఉదా – అతిసార వ్యాధి, తీవ్ర శ్వాస కోశ వ్యాధులు, తట్టు, కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో మరియు క్షయ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు 1947 సర్వే ప్రకారం పిల్లలో మరణాల సంఖ్యకు కారణాలను ఈ విధంగా చెప్పాలి.
ఈ వ్యాధులన్నీ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నిరోధక టీకాల ద్వారా పోషణ, ఆహారం వలన నివారించవచ్చు.
ప్రమాదాలు మరియు విష పదార్థాల వలన
భారత దేశంలో 5 సం.ల కంటే తక్కువ వయస్సు గల పిల్లలలో మరణాల రేటుకు కారణాలు
వయస్సు |
మరణాల రేటుకు కారణాలు |
ఏడు రోజుల లోపల |
బరువు తక్కువగా పుట్టడం, కష్టమైన కాన్పు, పుట్టే సమయంలో జరిగిన గాయాలు, శ్వాసకోశ ఇబ్బందులు, తగినంత ఆహారం లేకపోవటం, ఎక్కువగా చల్లదనం, ఎక్కువగా వెచ్చదనం |
7-28 రోజులు |
పైన చెప్పినవన్నీ – శ్వాస కోశ వ్యాధులు, అతిసార వ్యాధి, నియోనేటలం టెటనస్, అంటు వ్యాధులు |
1-12 నెలలు |
అతిసార వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు, తట్టు వ్యాధి, కోరింత దగ్గు, కుపోషణ |
12 నెలలు |
కుపోషణ, శ్వాసకోశ వ్యాధులు, తట్టు వ్యాధి వలన కలిగే అనర్ధాలు, అతిసార వ్యాధి, గాయాలు, ప్రమాదాలు |
1000 గ్రా.లు అంతకంటే ఎక్కువ బరువుతో గర్భస్థ స్థితిలో జరిగిన
మరణాల సంఖ్య (28 వారాలు గర్భంలోనే ఉన్నవారు)
1. గర్భంలోనే చనిపోయి పుట్టిన పిల్లల రేటు ---------------------------------------------------------------------
మొత్తం జీవించి పుట్టినవారు + గర్భంలోనే చనిపోయి
1000 గ్రాములు, అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టిన వారు x 1000
ప్రమాదాలు మరియు ప్రాణ హాని కలిగించే పదార్థాలను నోట్లో పెట్టుకోవటం, హానికరమైన వస్తువులను నోట్లో పెట్టుకోవటం, అనుకోకుండా క్రిందపడడం, విద్యుత్ షాక్ కొట్టడం, రోడ్డు ప్రమాదాలు మొదలైనవి. కొన్ని చిన్నవిగా ఉన్న కొన్ని ప్రాణానికి అపాయాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి.
పిల్లలలో మరణాల సంఖ్య/రేటు
అప్పుడే పుట్టిన పిల్లల మరణాల నుండి 5 సం.ల వయస్సు గల పిల్లల మరణాల సంఖ్య మొత్తం పిల్లల మరణాల రేటులో ఉంటుంది.
1 కేజీ అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టిన తరువాత 7 రోజుల లోపు
చనిపోయిన వారి సంఖ్య ఆ సం.లో జరిగిన మొత్తం జననాలు
PNMR --------------------------------------------------------------------------------
అదే సం.లో 1 కేజీ అంతకంటే ఎక్కువ బరువుతో మొత్తం సజీవ
జననాలు x 1000
పుట్టిన తరువాత 28 రోజుల లోపు చనిపోయిన వారి సంఖ్య
NNMR ------------------------------------------------------------------------- x 100
అదే సం.లోని సజీవ జననాల సంఖ్య
ఒక సం.లో ఏడాది లోపల వయస్సు గల పిల్లల మరణాల సంఖ్య
శిశు మరణాల సంఖ్య -------------------------------------------------------------------------------
అదే సం.లో మొత్తం సజీవ జననాల సంఖ్య
పిల్లల పుట్టుక నుంచి 5 సం.లు వచ్చే వరకు ఉన్న దశల ప్రకారం పిల్లల మరణాల రేటు వర్గీకరించారు.
పుట్టిన తరువాత వారంలోపు చనిపోయిన వారి మరణాల రేటు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మరణాలు మాతృశిశు, నాణ్యతగల, సరిపడినన్ని ఆరోగ్య సదుపాయాలు లేకపోవటం వలన జరుగుతుంటాయి.
కారణాలు
కష్టమైన కాన్పులు జరిగినప్పుడు తల్లికి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు, పుట్టుకతోనే జరిగే ప్రమాదాలు జరగడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం శ్వాస అందనప్పుడు, అంటుసోకినప్పుడు, పుట్టుకతో వచ్చే అసాధారణ కారణాలు.
శిశు మరణాల రేటు అనేది సమాజ ఆరోగ్యాన్నిసూచించడానికి మరియు మాతృశిశు సంరక్షణ సేవలను, నాణ్యతను ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేయడానికి సహాయపడుతుంది.
వ్యక్తిగత జాగ్రత్తలు
ప్రతి బిడ్డ కూడా వ్యక్తిగత జాగ్రత్త పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి శారీరక, మానసిక భావోద్రేకాలను మరియు సాంఘికంగా జరిగే ప్రమాదాల నుండి వారిని కాపాడటానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి మరియు మంచి జీవన శైలిని అలవర్చుకోవటానికి సహాయపడుతుంది.
వ్యక్తిగత జాగ్రత్తలలో ముఖ్యంగా వారు ధరించే దుస్తులు శుభ్రత, వారం వారం తలస్నానం , రోజూ శరీర అవయవాల పరిశుభ్రతత, సరిపడినంత విశ్రాంతి, నిద్ర, వ్యాయామం, చదువు మరియు మంచి ఆరోగ్య అలవాట్లు అలవర్చుకోవటంలో శిక్షణ చాలా అవసరం. తల్లులు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి.
పోషకాహారాన్ని అందించటం
సరైన మరియు బాలింత ఆహారాన్ని అందించటం అనేది పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే పోషకాహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎదిగే పిల్లలకు శరీరాభివృద్ధికి, శరీర ధర్మాలను నియంత్రించటానికి, కావలసిన శక్తిని ఇవ్వటానికి అవసరం.
తల్లి పాలు ఇవ్వటం
బిడ్డకు 6 నెలలు వయస్సు వరకు వారి ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.
భారత దేశంలో తల్లిపాలివ్వడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. పట్టణాలలో తల్లిపాలివ్వటం తగ్గిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కుటుంబ ఆరోగ్య పరంగా తల్లిపాలను ఇవ్వమని ప్రోత్సహించటానికి 10 సూచనలు ఇచ్చారు.
తల్లిపాలివ్వడం వలన బిడ్డ క్రమంగా బరువు పెరుగుతూ ఉంటాడు. మొదటి మూడు నెలలో నెలకు 800 గ్రాముల నుండి 1 కేజీ వరకు పెరుగుతారు. సరిపోయినంత పోషణ ఉన్న పిల్లలు ఐదు నెలలు వచ్చేటప్పటికి బరువుకు రెట్టింపు అవుతారు. మరియు ఒక సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి మూడింతల బరువు పెరుగుతారు.
రొమ్ము జాగ్రత్త
తల్లిపాలిచ్చేటప్పుడు రొమ్ములు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. రొమ్ము మొనలను నూనె కాని కోల్డ్ క్రీమ్ కాని రాసుకొని ఎప్పుడు మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అంతరాయం కలగకుండా క్రమంగా తల్లిపాలు ఇస్తూ ఉండాలి. లేకపోతే పాలు గడ్డలు కట్టి పుండ్లుగా మారే ప్రమాదం ఉన్నది.
అనుబంధ ఆహారాన్ని ఇవ్వటం
సాధారణంగా పిల్లలకు ఆరు నెలల వరకు ఒక కేజీ శరీర బరువుకు 170 మి.లీ. పాలు సరిపోతాయి. మామూలుగా తల్లులు, 450 నుండి 600 మి.లీ. పాలను పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయగలరు. 6 నెలల తరువాత పిల్లల పెరుగుదల పోషకావసరాలకు అనుగుణంగా తల్లిపాలు సరిపోవు. కాబట్టి ఇతర ఆహార పదార్థాలను వారికి తినిపించటం అవసరం. దీని వలన వారు నెమ్మదిగా తల్లిపాలను మానివేయడానికి సహాయపడుతుంది.
అనుబంధాహారం ఇవ్వటం అనేది తల్లులకు పిల్లలకు ముఖ్యమైనది ఎందుకంటే అనుబంధాహారం తయారీ విధానంలో మరియు తినిపించడంలో పరిశుభ్రత లోపిస్తే పిల్లలకు డయేరియా వచ్చే అవకాశం ఉంది. కావలసిన పరిమాణంలో అందించకపోవటం వలన వారికి కుపోషణ వలన ఇతర వ్యాధులు రావచ్చును.
అనుబంధాహారం ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
ఆరోగ్య కార్యకర్తలు తల్లులను అనుబంధాహారాన్ని అందించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎలా ఇవ్వాలో పద్ధతుల గురించి వివరించాలి.
పిల్లల పెరుగుదల అభివృద్ధిని పర్యవేక్షించుట
పిల్లల పెరుగుదల, అభివృద్ధిని పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని వారి పోషణ స్థితిని తెలియచేస్తుంది. మరియు పిల్లల పెరుగుదలలో వచ్చే తేడాలను తెలియచేస్తుంది. దీని వలన కుటుంబ స్థాయిలో నివారణోపాయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది.
పిల్లలలో పెరుగుదల
పిల్లలలో ముఖ్యంగా ఎత్తు, బరువు, తల, ఛాతీలను కొలవటం ద్వారా తెలుసుకోవచ్చు.
పిల్లలలో పెరుగుదలను క్రమ బద్ధంగా పర్యవేక్షించుట ద్వారా కుపోషణ వలన పిల్లల పెరుగుదలలో ఏదైనా తరుగుదల కనిపించటం తెలుస్తుంది. వెంటనే ఆరోగ్య కార్యకర్త /తల్లులు వారిని తిరిగి మామూలు స్థితికి రావడానికి చర్యలు తీసుకోవచ్చు. క్రమంగా బరువు పెరగటం అనేది ఆరోగ్యానికి సూచిక వంటిది. భారత ప్రభుత్వం వారు రూపొందించిన గ్రోత్ చార్ట్ / పిల్లల పెరుగుదల పట్టికలో పిల్లల బరువును నమోదు చేయవచ్చు. ఈ పట్టిక ఆరోగ్య కేంద్రాలలో లభ్యమవుతుంది.
సంవత్సరం వరకు పిల్లల బరువును నెలకొకసారి చూడాలి. రెండు సంవత్సరాలు వచ్చే వరకు రెండు నెలలకు ఒకసారి చూడవచ్చు. 5 సం.లు వచ్చే వరకు మూడు నెలలకు ఒకసారి చూడవచ్చును.
మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బరువు 1వ స్థితికి కంటే పైకి ఉంటుంది.
బిడ్డ బరువు 1వ – 2 మరియు 2 – 3 మధ్య ఉండే వారికి ఇంటి వద్ధనే అనుబంధ ఆహారాన్ని సరిపోయినంత అందించవలసి ఉంటుంది.
బిడ్డ బరువు 3వ లైను కంటే తక్కువ ఉంటే వారు డాక్టరును సంప్రదించి జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. వీరు తీవ్రమైన కుపోషణను గురి అవుతుంటారు.
బిడ్డ బరువు 4వ లైను కంటే తక్కువ ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందవలసిన అవసరం లేదు.
గ్రోత్ చార్టు
ఎటువంటి అంటుసోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరియు వారు వేసుకునే దుస్తులు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలను కనపరచాలి. దీని వలన పిల్లల్లో రక్షణ భావం, నమ్మకం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుతుంది. సరిపోయినంత ప్రేమ, ఆప్యాయత మరియు ఇతర అవసరాలకు సరైన స్థితిలో లేకపోవడం వలన పిల్లలలో అభద్రతాభావం ఏర్పడుతుంది. దీని వలన వారి మానసిక మరియు ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కనుక తల్లిదండ్రులకు వారి పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్రేకాలపరంగా రక్షణ కల్పించడం అవసరం. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని, నమ్ముకున్న విషయాలను గ్రహించే శక్తిని మరియు భద్రతాభావాన్ని కల్పిస్తుంది.
పిల్లలలో వచ్చే వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వటం
సాధారణంగా బిడ్డకు నెల రోజుల నుంచి 5 సం.ల వయస్సు వరకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన పిల్లలు వ్యాధులకు గురికావటం వలన మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధులు 4 రకాలు ఉంటాయి.
వీటన్నింటికి కూడా మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయాలు.
ఏ.ఆర్.ఐ.
భారత దేశంలో ఏ.ఆర్.ఐ. అనేవి పిల్లల మరణాలకు చాలా ముఖ్యమైన కారణం. శ్వాస కోశ వ్యాధులు ముఖ్యంగా గాలి ద్వారా మరియు వ్యాధికి గురి అయిన వ్యక్తుల నుండి సంక్రమిస్తుంది. ఇవి వైరస్, బాక్టీరియా వలన వస్తాయి.
మన దేశంలో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మన పరిస్థితి పొరుగున ఉన్న చిన్నచిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే కూడా హీనంగా ఉండటం మనందరికీ కూడా బాధాకరం.పుట్టగానే శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు.
పుట్టగానే శిశువుల మరణాలకు చాలా వరకూ ఈ మూడు అంశాలే కారణమవుతున్నాయి. కాన్పులు ఆసుపత్రుల్లో జరిగేలా చూడటం, బిడ్డ పుట్టిన 48 గంటల వరకూ అక్కడే ఉండటం, బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలివ్వటం ద్వారా ఎన్నో శిశుమరణాలను అరికట్టవచ్చు.
ఇక ఆ తర్వాతి దశలో పిల్లల మరణాలకు చాలా వరకూ కారణమవుతున్న అంశాలు న్యుమోనియా, డయేరియా. టీకాలతో నివారించదగ్గ వీలున్న జబ్బులతో మరణించే పిల్లల సంఖ్యా మన దగ్గర తక్కువేం లేదు. ముఖ్యంగా మీజిల్స్. వీటి గురించి వివరంగా చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 97 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తుండగా.. వీరిలో 21 లక్షల మంది మన దేశంలోనే మరణిస్తున్నారు.
మన దేశంలో ప్రతి 1000 మందిలో 37 మంది రోజుల బిడ్డలుగానే మరణిస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు.
దేశంలో ఏటా 2.7 కోట్ల కాన్పులు జరుగుతున్నాయి. కాన్పులు చేసే నిపుణులు సుమారు 3 లక్షల మందైనా కావాలి.
డయేరియాతో బాధపడే పిల్లల్లో సగటున 27% మందికే ఓఆర్‌ఎస్ ఇస్తున్నారు. మన దేశంలో తట్టు/పొంగు (మీజిల్స్) కారణంగా ఏటా 2 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది మన దేశంలోనే అత్యధికం.
జ్వరమంటే భయమేల?---డా. జీసన్ ఉన్ని-కొచ్చి, ఔషధ సిఫార్సుల విభాగం, ఐఏపీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాభరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్' వేస్తుంటారు. నిజానికి అంత ఆదుర్దా అవసరం లేదు. ఎందుకంటే జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో మన శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలి. కేవలం ఒళ్లు వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. చాలామంది ఒళ్లు వేడిగా ఉందనగానే వెంటనే థర్మామీటర్‌తో కొలవటం మొదలుపెట్టేస్తుంటారు. అంత అక్కర్లేదు. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నా ప్యారాసిటమాల్ వేయాలి. వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్ ఇవ్వచ్చు. ఈ రెండూ ఐపీఏ సూచిస్తున్న మందులు. ఒకవేళ వైద్యులు వైరల్ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే- ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయోటిక్‌ల వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డోసు యాంటీబయోటిక్ వాడితే మూత్ర, రక్త పరీక్షల్లో తేడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత్ర ఇన్ఫెక్షన్ల వంటివి ఉంటే గుర్తించటం కష్టం. కాబట్టి కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తెలుసుకోవాలి.
జ్వరం మరీ పెరిగితే ఫిట్స్ వస్తాయని భావించి తల్లిదండ్రులు వెంటనే ప్యారాసిటమాల్ వంటివి వేస్తుంటారు. నిజానికి జ్వరం ఒకేసారి అసాధారణంగా పెరిగినప్పుడు మాత్రమే ఫిట్స్ వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుందో ముందు గుర్తించటం కష్టం. అందుకని దాన్ని మనమెలాగూ నివారించలేం.
జ్వరంలో ఫిట్స్ ఒకసారి వచ్చినంత మాత్రాన ఏ హానీ ఉండదు. తరచూ వస్తుంటే మాత్రం మున్ముందు అది 'మూర్ఛ'గా మారుతుందేమో గమనించాలి. జ్వరం వచ్చినవారిలో 3% మందిలోనే ఫిట్స్ వస్తుంటాయి. మళ్లీ వీరిలో కూడా అది మూర్ఛగా మారే అవకాశంకేవలం 0.2% మందిలోనే!
ఆవుపాలు ఆవుదూడల కోసమేగానీ.. మన పిల్లల కోసం కాదు! దీనర్థం మన పిల్లలకు కావాల్సిన పాలు తల్లుల నుంచే వస్తాయిగానీ వేరే వాటి నుంచి కాదు అని. మనకూ జంతువులకూ ఎంతో తేడా ఉంది. ఆవుదూడ పుట్టిన 6 గంటలకల్లా లేచి నిలబడి తల్లి నుంచి పాలు తాగుతుంది. మూడేళ్లకల్లా అది పాలివ్వటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన పిల్లలు అలా కాదే! పసిబిడ్డలు మొదటి ఆర్నెల్లూ తల్లిపాల మీదే ఆధారపడతారు. రెండేళ్ల వరకూ పాలు తాగుతారు, తాగాలి కూడా. మన పిల్లల మెదడు జంతువులమెదడు కన్నా వేగంగా, పెద్దగా ఎదుగుతుంది. ఏనుగు మెదడు 800 గ్రాములు కూడా ఉండదు. అదే పిల్లల్లో పుట్టేటప్పటికే 800 గ్రాములుంటుంది, మూణ్ణాలుగేళ్లకల్లా 1,400 గ్రాములకు చేరుకుటుంది. కాబట్టి మన మేధస్సుకు మించిన సామర్థ్యం మరే జంతువుకూ లేదు. మన అవసరాలు వేరు.
తల్లిపాలలో లాక్టోజ్ శాతం 7 గ్రాములు ఉంటుంది. అదే ఆవుపాలలో అయితే 3 గ్రాములే. ఈ లాక్టోజ్ తర్వాత దశలో గాలక్టోజ్‌గా రూపొందుతుంది. ఇది ఇతర హార్మోన్లతో కలిసి గాలక్టోలిపిడ్స్‌గా మారుతుంది. మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఇదే ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోతే నాడీ వ్యవస్థకు సరిపడిన ఆహారం లభించదు. పైగా తల్లీబిడ్డల మధ్య మానసిక బంధం కూడా అంతగా బలపడదు. ఇది కౌమారదశలో విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొదటి ఆర్నెల్లూ తల్లిపాలు, ఆ తర్వాత ఇతర పదార్థాలతో పాటుగా పాలివ్వటం అవసరం. ఆ తర్వాత కూడా పిల్లలకు ఆహారం ప్రేమగా, ఆప్యాయతతో పెట్టాలి. లేకపోతే వాళ్లు తిరస్కరిస్తారు. ఈ దశ ఏడాది వరకు కొనసాగుతుంది.
ఏడాది దాటేసరికి పిల్లలు తీపి, పులుపు, చేదు వంటి భిన్న రుచులను బాగా గ్రహించే స్థితికి చేరుకుంటారు. ఇష్టాయిష్టాలను బాహాటంగా ప్రదర్శిస్తారు. వీరికి ఇంట్లో తయారు చేసుకునే ఆహారం సరిపోతుంది. అయితే- పెరుగుతున్న పిల్లలకు శరీరం ఎదగటానికి అవసరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా అవసరమే. ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్, రాజ్మా, జొన్నలు, చేపలు, మాంసం, పాలు వంటి వన్నీ ప్రోటీన్లు ఇస్తాయి. పాలల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయిగానీ దాని నుంచి ఎక్కువ శక్తి కేలరీలు రావు. కాబట్టి తల్లిదండ్రులు ఎదిగే పిల్లలకు పాలు పట్టాల్సిందేగానీ కేవలం అదే సరిపోతుందని భావించకూడదు.
బిడ్డకు పుట్టిన గంటలోపే కేవలం 26-46% మందే తల్లిపాలు పడుతున్నారు.
పెద్ద పిల్లల వయసును బట్టి ఉంటుంది.
ఈ క్రింది విధంగా పుట్టినప్పటి నుండి పెరుగుదల ఉంటుంది.
భారత ప్రభుత్వం తీసుకున్న సర్వే – సి.ఎస్.ఎస్.ఎమ్. 1995
వయస్సు |
బరువు |
ఎత్తు |
0-3 నెలలు |
200 గ్రాములు / వారానికి |
|
4-6 నెలలు |
150 గ్రాములు / వారానికి |
|
7-9 నెలలు |
100 గ్రాములు / వారానికి |
|
10-12 నెలలకు |
50-75 గ్రాములు / వారానికి |
|
1-2 సం.ల |
2.5 కేజీలు / సంవత్సరం |
|
3-5 సం.ల |
2 కేజీలు / సంవత్సరానికి |
|
ఒక సం. బిడ్డ |
25 సెం.మీ. / సంవత్సరానికి |
|
2 సంవత్సరానికి |
12 సెం.మీ. / సంవత్సరానికి |
|
3 సంవత్సరానికి |
9 సెం.మీ. / సంవత్సరానికి |
|
4 సంవత్సరానికి |
7 సెం.మీ. / సంవత్సరానికి |
|
5 సంవత్సరానికి |
6 సెం.మీ. / సంవత్సరానికి |
టీకాలు తయారు–వాటి ప్రయోగాలు మొదలైన సంవత్సరాలు
1885 మొట్ట మొదట లైవ్ అంటెన్యూటేడ్ వైరస్ వ్యాక్సిన్. మానవులపైన మొట్టమొదట ప్రయోగం చేయబడింది.
1909 బాక్టీరియా లైవ్ వ్యాక్సిన్ బి.సి.జి. టి.బి. తయారు చేయబడ్డది
1921 డిప్తిరియా టాక్సిడ్ ను గుర్తించారు
1924 టెటనస్ టాక్సాడ్ తయారు చేశారు
1930 కోరింత దగ్గు వ్యాక్సిన్ తయారు చేయబడింది
1932 ప్లూ జ్వరం వ్యాక్సిన్ తయారు చేయబడింది
1940 డిపిటి మొదలు పెట్టారు
1955 ఇన్ వ్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ మొదలు పెట్టారు
1963 నోటి ద్వారా పోలియో చుక్కలు, తట్టు సూది కూడా
1986 హెపటైటీస్ – బి
1990 వ్యాక్సిన్ హిబ్ – బి తయారు చేయబడింది
వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి?
ప్రతి శిశువుకి పుట్టినప్పుడు తల్లి శరీరము నుండి బొడ్డు త్రాడు ద్వారా సహజమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది. ఇది కొన్ని నెలల వరకు బిడ్డకు ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ సహజమైన శక్తి కొంత కాలానికి తగ్గిపోతుంది. కాబట్టి శరీరము సొంతంగా ఈ శక్తిని పెంపొందించుకోవాలి. మన శరీరములో శక్తిని పెంపొందించుకోవడమనేది మనం తీసుకునే ఆహారముపైన మరియు జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. మన ఆహారములో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే మనకు జబ్బులు తొందరగా రావు. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజాలు మరియు సూక్ష్మ పోషక విలువలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి వ్యాధి క్రిములతో పోట్లాడి అనారోగ్య పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.
మాతా శిశు సంరక్షణకు
వ్యాధి నిరోధక టీకాల పాత్ర చాలా ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి.
గర్భ సమయంలో తీసుకోవలసిన టీకాలు
గర్భము అని తెలిసిన వెంటనే అనగా 4వ నెలలో మొదటి టి.టి.ని ఆరోగ్య ఉపకేంద్రంలో లేదా ఆసుపత్రిలో తీసుకున్నతర్వాత ఒక కార్డు ఇస్తారు. ఇందులో తల్లీ బిడ్డకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ తరువాత ఒకటిన్నర నెలల వ్యవధిలో 2వ టి.టి. తీసుకోవాలి. ఈ టి.టి. సూది తల్లీ బిడ్డలకి ధనుర్వాతము రాకుండా కాపాడుతుంది.
సరైన సమయంలో టీకాలు తీసుకోకపోవటం వలన కలిగే నష్టాలు
టీకాలు ఇచ్చినప్పుడు తల్లి తెలుసుకోవలసినవి
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మరియు యూనిసెఫ్ సహకారంతో యునైటెడ్ స్టేట్స్ 1980లో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన 70 శాతం వరకు మాత్రమే టీకాలు ఇవ్వాలి. తట్టు వ్యాప్తిని తగ్గించలేకపోయాయి.
పిల్లలు వ్యాధి నిరోధక టీకాలు
క్షయ, పోలియో, కోరింత దగ్గు, కంఠ సర్పి, ధనుర్వాతం, పచ్చకామెర్లు, తట్టు, మొదలైన ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను వ్యాధి నిరోధక టీకాల ద్వారా కాపాడవచ్చును. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి నిరోధక టీకాలను సరైన వయస్సులో, సరైన సమయంలో మరియు అవసరమైన పరిమాణంలో ఇవ్వటం వలన ఈ వ్యాధుల నుంచి కాపాడగలుగుతున్నాయి.
క్షయ
ఇది బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది.
వ్యాధి కారకం
మైక్రో బాక్టీరియం ట్యూబర్ క్యులోసిన్
వ్యాక్సినేషన్ షెడ్యూల్ (హెపటైటిస్ – బి వ్యాక్సిన్ తో కలిపి)
లబ్ధిదారులు |
వయస్సు |
వాక్సిన్ |
డోసుల సంఖ్య |
ఏ విధంగా ఇవ్వాలి |
ఎంత ఇవ్వాలి |
ఎందుకు ఇవ్వాలి |
శిశువులు |
పుట్టిన వెంటనే |
బి.సి.జి. హెపటైసిట్ – బి |
1 3 |
ఇంట్రాడర్మల్ ఇంట్రామస్కులర్ |
1 మి.లీ. 0.5 మి.లీ. |
క్షయ వ్యాధి నుండి పిల్లల్ని కాపాడుటకు |
6 వారాల నుండి |
ఓరల్ పోలియో వాక్సిన్ |
3 |
నోటిలో |
రెండు చుక్కలు |
బిడ్డను పోలియో వ్యాధి నుండి రక్షించుటకు |
|
9 నెలల తరువాత |
తట్టు టీకా |
1 |
సబ్ క్యుటేనియస్ |
0.5 మి.లీ. |
బిడ్డను తట్టు వ్యాధి నుండి రక్షించుటకు |
|
16వ నెల నుండి |
డి.సి.టి. |
1 |
ఇంట్రామస్కులర్ |
0.5 మి.లీ. |
బూస్టర్ డోసుగా పనిచేయుటకు |
|
24 నెలలకు ముందు |
ఓరల్ పోలియో వాక్సిన్ |
1 |
నోటి |
రెండు చుక్కలు |
||
9వ నెల |
విటమిన్-ఎ (మొదటి) |
నోటి |
½ స్పూను |
బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు |
||
15-18 నెలలు |
విటమిన్-ఎ (రెండవ) |
నోటి |
1 స్పూను |
బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు |
||
21-24 నెలలు |
విటమిన్-ఎ (మూడవ) |
నోటి |
1 స్పూను |
బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు |
||
27-30 నెలలు |
విటమిన్-ఎ (మాల్గవ) |
నోటి |
1 స్పూను |
బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు |
||
33-36 నెలలు |
విటమిన్-ఎ (ఐదవ) |
నోటి |
1 స్పూను |
బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు |
||
పిల్లలు |
5 సంవత్సరాలు |
డి.టి. |
1 |
ఇంట్రామస్కులర్ |
0.5 మి.లీ. |
బిడ్డను డిప్తీరియా, ధనుర్వాతం నుండి రక్షించుటకు |
పిల్లలు |
10 సం.లు |
డి.టి. |
1 |
ఇంట్రామస్కులర్ |
0.5 మి.లీ. |
తల్లిని, బిడ్డను ధనుర్వాతం నుండి రక్షించుటకు |
16 సం.లు |
డి.టి. |
1 |
ఇంట్రామస్కులర్ |
0.5 మి.లీ. |
||
గర్భిణీ స్త్రీలు |
16-36 వారాల గర్భము |
డి.టి. |
2 |
ఇంట్రామస్కులర్ |
0.5 మి.లీ. |
వ్యాధి సంక్రమించు మార్గాలు
వ్యాధి గ్రస్థుని ఉమ్ము తుంపరల ద్వారా (చికిత్స పొందకుండా ఉన్నవారి ద్వారా మరియు చికిత్సను మధ్యలో ఆపివేసిన వారి ద్వారా వ్యాపిస్తుంది).
వ్యాధి సంక్రమించే మార్గాలు
కలుషితమైన పాలు (కాచకుండా పాలు త్రాగటం వలన) ఈ క్రిమి ఊపిరితిత్తులకు సోకుతుంది. పిల్మినరీ క్షయను మరియు కడుపులోని ప్రేగులకు, ఎముకలకు కీళ్ళకు, లింఫ్ గ్రంధులకు కూడా వ్యాపిస్తుంది.
వ్యాధి గ్రస్తుల శ్వాస లేదా తుంపరల ద్వారా ఈ క్రిమి వాతావరణంలో నుండి ఒకరి నుండి ఒకరికి లభిస్తుంది.
క్షయ వ్యాధి అందరికీ వస్తుంది. దీనికి వయస్సుతో తేడా లేదు. ఇది ఎక్కువగా సంవత్సరం లోపు పిల్లల నుంచి యుక్త వయస్సు వారికి వస్తుంది. వ్యాధిగ్రస్థులు తాకిన వస్తువుల నుంచి రాదు.
శ్వాస కోశ టి.బి.తో బాధపడే వారి వలన ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎముకలకు సంబంధించిన టి.బి. ఇతర శరీర అవయవాలకు వచ్చిన టి.బి. వలన ఇతరులకు టి.బి. వ్యాప్తి చెందటం జరగదు.
నివారించటం
బిసిజి టీకా వేయించటం
చికిత్సా విధానం
రోగగ్రస్థుని గుర్తించి వారికి చికిత్స ఇవ్వాలి. క్రిమి నివారణ జాతీయ కార్యక్రమాన్ని ముందు అధ్యాయంలో చూడాలి.
డాట్
రోగగ్రస్థునికి మందులు ఇవ్వాలి. ఒక సంవత్సరం పాటు చికిత్స ఇస్తారు.
ధనుర్వాతం
ధనుర్వాతం చాలా తీవ్రమైన వ్యాధి. ఇది క్లాస్ట్రీడియంటెటని అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియా చాలా శక్తివంతమైనది మట్టిలో దుమ్ములో చాలా సంవత్సరాలు బ్రతకగలదు. 120సెంటీగ్రేడ్. వద్ద 20 నిమిషాలు ఆవిరి ఉంచి వీటిని నాశనం చేయగలం. ఇవి పశువులు, మేకలు, గొర్రెల యొక్క ఉదరములో ఉండి వాటి మల విసర్జనలో బయటకు వస్తాయి. ఇవి స్పోర్సో రూపములో దుమ్ము మట్టిలో కలిసిపోతాయి. గాలి ద్వారా అన్ని పరిసరాలకు వ్యాపిస్తాయి.
ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దీని ద్వారా అంటుసోకుతుంది. ఆ దెబ్బ ఎంత చిన్నదైనా, పెద్దదైనా కావచ్చు మరియు పడిపోవడం వలన గాయం కావచ్చు. జంతువుల కాట్ల వల్ల కావచ్చును. ఈ అంటు కాన్పు జరిగే సమయంలో మరియు కాన్పు తరువాత, బొడ్డుత్రాడు కత్తిరించేటప్పుడు తరువాత బొడ్డు త్రాడు సంరక్షణ సరిగా చేయకపోవడం వలన, ఇంజక్షన్ల ద్వారా ,పళ్ళు పీకేటప్పుడు, పచ్చ బొట్లు పొడిపించుకునేటప్పుడు ఎప్పుడైనా అంటుసోకవచ్చు.
కండరాలకు దెబ్బ తగలటం, గాలి ఆడకపోవటం ధనుర్వాతం రావడానికి కారణాలవుతాయి. ధనుర్వాతం అన్ని వయస్సులో వారికి వస్తుంది కానీ హైస్కూల్ పిల్లలో వచ్చే అవకాశం ఎక్కువ. అసురక్షిత బ్లేడును బొడ్డు కత్తిరించటానికి వాడినప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో ధనుర్వాతం వస్తుంది.
ధనుర్వాతం అబ్బాయిలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో వారికి ఎక్కువగా వస్తుంది. ధనుర్వాతం ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించటం వలన కలుగుతుంది. పశువుల మల విసర్జనను మట్టిలో కలిపి తోటలకు వాడుతుంటారు. చేతులకు ఇతర శరీరావయవాలకు ఏదైనా గాయాలు ఉంటే ఈ స్పోర్సును శరీరములోనికి ప్రవేశిస్తాయి.
లక్షణాలు బయట పడడానికి 6-10 రోజులు పడుతుంది. కాని ఇది చాలా తక్కువ సమయం (1 రోజు) కావచ్చు. లేదా చాలా ఎక్కువ కాలం (చాలా నెలలు) పట్టవచ్చు. ఇది స్పోర్సు అభివృద్ధి అవి విడుదల చేసే ఎక్సోటాక్సిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్సోటాక్సిన్స్ కండరాలు బిగుసుకునేలా చేస్తాయి. మొదటిగా దవడ, మెడ కండరాలు బిగుసుకుపోతాయి. తరువాత 14 గంటలలో మెలికలు తిరిగటం / ఫిట్స్ రావటం జరుగుతుంది. వ్యాధి గ్రస్తులు 14 రోజులు బ్రతికిన వారు తరువాత కూడా జీవించే అవకాశం ఉంది 40-90 శాతం వరకు ఉంటాయి.
నివారణ
సరైన సమయంలో, మోతాదులో టెటనస్ టాక్సిడ్ అనే టీకా వేయించడం వలన దీనిని అరికట్టవచ్చు. దీనికి డిపిటితో పాటు 3 సార్లు వేస్తారు.
బూస్టర్ డోసులలో మొదటిది డిపిటి, రెండవది డిటిగా వేస్తారు. ఈ వ్యాక్సిన్ 5 సం.లు వరకు పనిచేస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు టి.టి. సూది తీసుకోవటం వలన పుట్టగానే బిడ్డకు ధనుర్వాతం రాకుండా అరికట్టవచ్చు.
దీనితో పాటు ఏదైనా గాయాలు అయినప్పుడు శుభ్రంగా కడగాలి. దానికి కట్టుకట్టించుకోవాలి. కాన్పులను శుభ్రతలు పాటించి చేయమని చెప్పాలి. ఆరోగ్య కార్యకర్తలు ఈ విషయాలపై ప్రజలకు, తల్లులకు అవగాహన కల్పించాలి.
పోలియో
పోలియో మైలిటిస్ అనేది అంగవైకల్యానికి దారితీస్తుంది. ఇది వైరస్ వలన వ్యాపిస్తుంది. ఈ వైరస్ మానవులలో మాత్రమే ఉంటుంది. ఇది వ్యాధి గ్రస్తుని మలములో ప్యారామైలజికల్ గా ఉంటుంది.వీరు వ్యాధిని వ్యాపించేస్తూ ఉంటారు.
వ్యాధి గ్రస్తుని మలం త్రాగు నీటిలో కలిసినప్పుడు ఆరోగ్యవంతులు ఈ నీటిని త్రాగినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 సం.ల లోపు పిల్లలలో ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
6 నెలల బిడ్డ నుండి 3 సం.ల వరకు వస్తుంది. మగ పిల్లలో 3 శాతం ఎక్కువ అవకాశం ఉంది.
లక్షణాలు
పక్షవాతం (కొన్ని అవయవాలకు లేదా అన్ని శరీర అవయవాలకు రావచ్చు)
నివారణ
పుట్టగానే ప్రతి ఒక్కరికి టీకా చుక్కలు వేయించాలి. సరైన సమయంలో మోతాదులో 15 సం.లలో లోపల వయస్సు ఉన్న పిల్లలకు వేయించాలి.
ఒకటిన్నర సం.లో బూస్టరు డోసులు కూడా పోలియో చుక్కలు వేయించాలి.
పోలియో వ్యాధి గ్రస్తులను వెతికి గుర్తించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 15 సం.ల లోపు వారు పక్షవాతం తో బాధపడేవారిని గుర్తించి వారికి ప్రత్యేక పోలియో వ్యాధి క్రిమి గురించి పరీక్షించబడుతుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇటువంటి వారిని గుర్తించి పరీక్షలు చేసి ఆరోగ్య కేంద్రానికి పంపాలి. పరీక్షలో ఎవరికైనా పోలియో ఉందని నిర్ధారణ అయితే వెంటనే పల్స్ పోలియో కార్యక్రమం చేయాలి.
పోలియో, డిప్తిరియా, టెటనస్, మీజిల్స్, హెపటైటీస్, విటమిన్-ఎ
పోలియో
ఇది వైరస్ వలన వ్యాపిస్తుంది. ఇది మానవుని మలం ద్వారా బయటికి వ్యాధి గ్రస్తుడు ఉమ్మి తుమ్మటం ద్వారా వ్యాపిస్తుంది. అపరిశుభ్రత వలన గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
శరీరములోకి ప్రవేశించిన తరువాత నుంచి 14 రోజులలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ మానవునిలో కేంద్ర నాడీ వ్యవస్థ కు పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నది.
దీనిని నివారించటానికి వ్యాధి నిరోధక టీకా / పోలియో చుక్కలు వేయించాలి. అవి రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో నోటి ద్వారా వేసే చుక్కలు, పోలియో వైరస్ లో 1, 2, 3 రకాలు ఉన్నాయి. పుట్టగానే జీరో పోలియో వేస్తారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి డోసుకు నెల తేడా ఉంటుంది. 6, 10, 14 వారాలలో పోలియో చుక్కలు వేస్తారు. వీటితో పాటు సూదులు కూడా వేస్తారు.
పోలియో వైరస్ ను పారద్రోలటానికి పోలియో నివారణా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ఏర్పాటు చేసారు. దీని వలన ఒకేసారి అనేక మంది పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వటం జరుగుతుంది. పోలియో చుక్కలు నిరోధక టీకాలలో భాగంగా పోలియో చుక్కలు వేయించని వారి కోసం పరిశోధన చేసి టీకాలు వేయించటం జరుగుతుంది.
డిప్తీరియా
ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సరైన సమయంలో దీనిని నివారించలేకపోతే మరణాల సంఖ్య తీవ్రంగా పెరుగుతుంది. డిప్తీరియా వ్యాధి, కోరిన్ బాక్టీరియా అనే బాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ముక్కు, గొంతు, కళ్ళు, చర్మము మర్మావయవాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. ఆ బాసిల్లై గొంతులోనే అత్యధికంగా పెరిగి అక్కడ ఒక ఎక్సోటాక్సిన్ అనే విష పదార్ధాన్ని విడుదల చేస్తుంది. ఈ విష పదార్ధం గొంతులో పలచని పొరలాగా ఏర్పడుతుంది. అది గొంతులో కణితి మీద మరియు శ్వాస నాళం మధ్యలో ఒక పొర ఏర్పడి ఎర్రగా చుట్టు ప్రక్కల కణాలని పాడు చేస్తుంది. ఆ గొంతు దగ్గర ఉన్న గ్రంధులు వాయడం, చాలా ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది (ఊపిరి కూడా తీసుకోలేనటువంటి).
వ్యాధి కారక బాక్టీరియా ఒకసారి శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి బయటపడేందుకు 2 నుండి 6 రోజులు పడుతుంది. ఈ వ్యాధి నుండి పిల్లలను కాపాడటానికి వ్యాధి నిరోధక టీకాలు వేయించవలెను.
కోరింత దగ్గ–వూఫింగ్ కాప్
చిన్న పిలలకు ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. బి.పర్టూసిస్ అనే బాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని Hundred Day Cough అంటారు. ఈ వ్యాధి స్వల్ప జ్వరం మరియు పొడి దగ్గుతో ప్రారంభమై తరువాత వెంట వెంటనే దగ్గు రావడం వలన ఊపిరి బిగపట్టి (ఊప్) అనే శబ్దం వచ్చేలా దగ్గుతూ పిల్లలు బాధపడతారు. ఇది దగ్గు తంపరల ద్వారా, తుమ్మడం, మాట్లాడేటప్పుడు ఈ వ్యాధి ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తరువాత 7-14 రోజుల లోపు వ్యాధి బయటకు కనిపిస్తుంది. దీని వలన నిమోనియా, ముక్కు నుంచి రక్తం, కళ్ళ పొరలలో రక్త ధారలు మరియు సెరిబ్రల్ హెమరేజ్ కూడా సంభవించును. దీని నివారణ ఇంజక్షన్ లేదా డిపిటి అనే వ్యాధి నిరోధక టీకా మూడు దపాలుగా ఇవ్వడం ద్వారా నివారించవచ్చు (వ్యాధి నిరోధక టీకాల పట్టిక చూడుము.
హెపటైటీస్ - బి
ఇది ప్రమాదకరమైనది. కామెర్లు వైరస్ ఒకసారి శరీరంలో ప్రవేశించిన తరువాత చాలా కాలం వరకు నిద్రాణ స్థితిలో ఉంటుంది. చాలా తక్కువ మందిలో కామెర్లు లక్షణాలు బయటకి కనపడవు.
హెపటైటీస్-బి వైరస్ వ్యాప్తి సూదులు, సిరంజిలు, సురక్షితం కాని సెక్స్ వల్ల కలుషితమైన రక్తం ఇతర శరీర ద్రవాల వలన వ్యాధి వస్తుంది.
ఒకసారి ఈ వ్యాధి వచ్చినా మరియు ఈ క్రిమి అలానే ఉంటుంది. ఈ వ్యాధిని శరీర విసర్జనల ద్వారా వ్యాపించేలా చేస్తుంది.
ఈ వ్యాధి ఉన్నట్లు రక్త పరీక్ష ద్వారా నిర్ణయించవచ్చు.
వైరస్ ప్రవేశించిన తరువాత 45-180 రోజుల లోపల లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు
జ్వరం, పచ్చగా ఉన్న మూత్రం రావటం ఈ లక్షణాలు కొంత కాలం వరకు ఉంటాయి. ఆ తరువాత దీర్ఘకాల వ్యాధి జాతీయ టీకాల కార్యక్రమంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది.
ఒకసారి ఈ వ్యాధికి గురి అయిన తరువాత టీకాలతో దీనిని నివారించలేం, కనుక పుట్టిన తరువాత ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర నెలల లోపు డి.పి.టి.తో పాటు వేయించాలి.
తట్టు
ఇది ప్రపపంచమంతటా ఉన్న వ్యాధి. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ శరీరం లోపలికి ప్రవేశించిన తరువాత 8-16 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలోనే నోటి బుగ్గలు లోపలికి నొక్కులుగా కనిపిస్తుంది. ముక్కు, గొంతు, నోరు మరియు దగ్గు నుంచి వచ్చే స్రావాల ద్వారా వ్యాధి వస్తుంది. వ్యాధి మొదట దశలో ఉన్నప్పుడే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 5వ రోజు నుంచి చర్మం మీద దద్దుర్లు ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి.
6 నెలల నుండి 3 సం.లు వారు ఎక్కువగా గురి అవుతారు. 7 సం.ల లోపలి వారు కూడా గురి అవుతున్నారు. 6 నెలల లోపల పిల్లలను తల్లిపాలలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వలన ఈ అంటు వ్యాధి వచ్చే అవకాశం ఉండదు.
ఒకసారి ఈ తట్టు సోకితే తరువాత వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక వేళ వచ్చిన తరువాత డాక్టరు సలహా / చికిత్స పాటించకపోతే వ్యాధి తీవ్రత ఎక్కువైనా మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఉదా. నిమోనియా, డయేరియా, శరీరంలో నీరు కోల్పోవటం, కుపోషణ, ఇవి అన్నీ పిల్లల ప్రాణాపాయానికి దారి తీస్తాయి.
తట్టు టీకా ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దీని ద్వారా 98 శాతం వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. బిడ్డకు 10వ నెలలు రాగానే ఈ టీకా వేయించాలి.
నివారణ
ఈ వ్యాధి వలన పిల్లలను మొదటి 7 రోజులు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. వ్యాధి వచ్చిన వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవ్వవలసిన ఆహారం, ఆసుపత్రికి తరలించటం, గురించి ఆరోగ్య కార్యక్రమాలలో అవగాహన కల్పించాలి. 3-4 సం.ల లోపల పిల్లలకి తట్టు వ్యాధి టీకాలు ఇచ్చినా, తట్టు వ్యాధి క్యాంపులలో కూడా వేయించాలి.
పిల్లల రక్షణ
పిల్లలకు రక్షణ కల్పించటం ఎంతో ముఖ్యమైనది పిల్లలకు అనువైన వాతావరణాన్ని మరియు ఇతర భౌతిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వలన పిల్లలలో ఆరోగ్యమైన మానసిక, సాంఘికపరమైన అభివృద్ధి ఉంటుంది. పిల్లలకు అంటుసోకే మార్గాలకు దూరంగా ఉంచాలి.
ఈ వ్యాధి సోకిన వారికి ఇతరత్రా వ్యాధులు వస్తాయి. 1) తీవ్రమైన శ్వాసకోశ (నిమోనియా) వ్యాధి, 2) అతిసార (డయేరియా) వ్యాధి, 3) చెవిలో చీము కారటం, మెదడు వాపు – అంటు ఈ వ్యాధిలో మరణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి తీవ్రమై ఎక్కువ ఉన్న సమయంలో దీనిని నివారించటానికి వ్యాధి టీకాలు సరైన సమయంలో, సరైన మోతాదులో టీకా ఇచ్చినచో 95 శాతం వ్యాధి నిరోధకం జరుగుతుంది. ఈ వ్యాధిని గురించి మూడు వ్యాక్సిన్ లు కలిపిన ఎం.ఎం.ఆర్.
తట్టు వ్యాధిని పారద్రోలటం అనే కార్యక్రమాన్ని పట్టణాలలో 2000 సం.లో 9 నెలల పిల్లల నుండి 5 సం.ల పిల్లలకు ఈ టీకాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వ్యాధి నిరోధక శక్తి
శరీరములో వ్యాధి నిరోధక క్రిములు ప్రవేశించినప్పుడు వాటిని నశింపచేసే శక్తిని వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి ప్రతి నిరోధకాలు అనే వాటిని శరీరములో కొన్ని రక్షక కణాలు ఉత్పత్తి చేస్తాయి.
యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి
యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి, శరీరములో ఇది ఎప్పటికి ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ముందే ఉంటుంది.
డయేరియా
డయేరియా అంటే నీళ్ళగా విరోచనాలు అవ్వటం. ఇవి 3 సార్లు కంటే ఎక్కువగా జరుగుతాయి. నీళ్ళ నిరోచనాలతో పాటు రక్తం కూడా నిసర్జించబడిన దానిని రక్త విరోచనాలు అంటారు. ఇది పిల్లలకు వచ్చే వ్యాధులలో ప్రాణాంతకమైనది ఎందుకంటే శరీరం ఎండిపోయి (నీరు కోల్పోతుంది) నట్లు అవుతుంది. మరియు కుపోషణకు దారితీస్తుంది. వీటి వలన శరీరంలోని నీరు, సోడియం క్లోరైడ్, పొటాషియం బైకార్బోనేట్ వంటి లవణాలను కోల్పోవటం జరుగుతుంది. దీని వలన శరీరం నీటిని కోల్పోయి ఎండిపోయినట్లు అవుతుంది.
అతిసార వ్యాధి అనేది ఆరు నెలల వయస్సు పిల్లల నుంచి 1 సం.ల వరకు ఎక్కువగా వస్తుంది. మరియు అనుబంధాహారం తినిపించేటప్పుడు అపరిశుభ్రత వలన కూడా రావచ్చు మరియు ఇది కుపోషణతో ఉన్న పిల్లలలో మరియు తక్కువ బరువు ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
డయేరియా అనేది ఇ.కోలై, విబ్రో కలరా మరియు నొర్మొనెల్లా, రోటో వైరస్, ప్రోటోజోన్స్ వలన వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియాలు మానవుని మరియు జంతువుల (శరీరంలో) పొట్టలో ఉంటాయి. మల విసర్జకాల గాని ద్వారా, నీటి ద్వారా, మానవునిలోకి ప్రవేశించుట వలన అపరిశుభ్రమైన చేతులు, గోళ్ళు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
లక్షణాలు | ఎండు గుణం తీవ్రతను గుర్తించుట | ||
లక్షణాలు లేకుండుట | కొంచెం లక్షణాలు | ఎక్కువ లక్షణాలు | |
సాధారణ పరిస్థితి | గుండుట, ఆరోగ్యంగా ఉండుట | నిలకడగా లేకుండుట, ఎల్లప్పుడు ఏడ్వడం |
శక్తి లేకుండా పోవటం అపస్మారక స్థితి |
కళ్ళు కంటి నీరు |
సాధారణంగా ఉంటాయి |
కళ్ళ చుట్టూ గుంతలు ఏర్పడతాయి | ఎక్కువ, ఎండిపోయినట్లు ఉండవు |
నోరు, నాలుక | తడిగా ఉంటుంది | మామూలుగా ఎండినట్లు ఉంటుంది | ఎండిపోయి ఉంటుంది |
దాహం | సాధారణంగా త్రాగుతారు | ఎక్కువ నీళ్ళు త్రాగాలని ఆశ ఉంటుంది | త్రాగటం చాలా తక్కువ నీరు త్రాగుతారు, నీరు త్రాగలేని పరిస్థితి |
చర్మం సాగే గుణం | చర్మం మీద సాగే గుణం కనిపిస్తుంది | చాలా తక్కువగా ఉంటుంది | అసలు కనిపంచదు |
మాడు | సాధారణంగా ఉంటుంది | సాధారణంగా ఉంటుంది | గుంత పడుతుంది. |
నిర్ణయం | ఎండు గుణం | రెండు లేక మూడు కనిపిస్తే కొంచెం ఎండు గుణం ఉన్నట్లు |
డయేరియాకి గురి అయిన వారికి మొదటిగా తీసుకోవలసిన జాగ్రత్తలు
వయస్సు |
ప్రతి మల విసర్జనకు ఎంత ఓ.ఆర్.ఎస్. పట్టాలి |
ఓ.ఆర్.ఎస్. ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి |
24 నెలల లోపు |
50 నుండి 100 మి.లీ. |
500 మి.లీ. |
చికిత్స- వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది
డయోరియాకు ఇంటి వద్ద తయారు చేసుకొనే చికిత్స
ఉదా – పప్పు నీరు, గంజి నీరు అన్ని కలిపిన కూరగాయాలను, తాజా కూరగాయలను, అప్పటికప్పుడు తయారు చేసిన వంట పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. ఈ ఆహారం దాదాపు ఒక రోజుకు ఆరు సార్లు తినిపించాలి. డయేరియా తగ్గిన తరువాత కూడా రెండు వారాల పాటు ఇస్తూనే ఉండాలి.
పైన చెప్పిన ప్రకారం డయేరియా పరిస్థితి తగ్గకుండా ఉంటే నీళ్ళ విరోచనాలు ఎక్కువగా కావటం, మరల మరల వాంతులు, దాహం ఎక్కువ ఉండటం, తినటం కాని, త్రాగటం కాని ఇష్టపడకపోవటం, జ్వరం, రక్తంతో కూడిన మలం ఇవన్నీ ఉంటే ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్ళాలి.
శ్వాస కోశ వ్యాధులు
లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువగా ఊపిరి పీల్చటం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం గురక పెట్టడం, పొబ్బ ఉబ్బి ఉండటం.
ఈ క్రింది లక్షణాలను గుర్తించండి |
||
తిండి తినకుండా ఉండటం |
మూర్ఛలు |
నిద్ర సరిగా ఉండకపోవటం, గురకపెట్టడం, ఊపిరి బిగపట్టడం, జ్వరం లేదా శరీర ఉష్ణ్రోగ్రత తగ్గిపోవటం |
|
తీవ్ర శ్వాసకోశ (న్యూమోనియా) గుర్తించటం |
శ్వాస కోశ (న్యూమోనియా) కనపడుట |
ఇంటి దగ్గర (అయితే) తీసుకోవలసిన జాగ్రత్తలు
పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు మరియు తక్కువగా శ్వాస తీసుకోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వ్యాధి తీవ్రత
వ్యాధి తీవ్రతను తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది.
యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి
యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి, శరీరములో ఇది ఎప్పటికీ ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ముందే ఉంటుంది.
డయేరియా
డయేరియా అంటే నీళ్ళగా విరోచనాలు అవ్వటం. ఇవి 3 సార్లు కంటే ఎక్కువగా జరుగుతాయి. నీళ్ళ నిరోచనాలతో పాటు రక్తం కూడా నిసర్జించబడిన దానిని రక్త విరోచనాలు అంటారు. ఇది పిల్లలకు వచ్చే వ్యాధులలో ప్రాణాంతకరమైనది ఎందుకంటే శరీరం ఎండిపోయి (నీరు కోల్పోతుంది) నట్లు అవుతుంది. మరియు కుపోషణకు దారితీస్తుంది. వీటి వలన శరీరంలోని నీరు, సోడియం క్లోరైడ్, పొటాషియం బైకార్బోనేట్ వంటి లవణాలను కోల్పోవటం జరుగుతుంది. దీని వలన శరీరం నీటిని కోల్పోయి ఎండిపోయినట్లు అవుతుంది.
అతిసార వ్యాధి అనేది ఆరు నెలల వయస్సు పిల్లల నుంచి 1 సం.ల వరకు ఎక్కువగా వస్తుంది. మరియు అనుబంధాహారం తనిపించేటప్పుడు అపరిశుభ్రత వలన కూడా రావచ్చు మరియు ఇది కుపోషణతో ఉన్న పిల్లలలో మరియు తక్కువ బరువు ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
డయేరియా అనేది ఇ.కోలై, విబ్రో కలరా మరియు నొర్మొనెల్లా, రోటో వైరస్, ప్రోటోజోన్స్ వలన వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియాలు మానవుని మరియు జంతులు (శరీరంలో) పొట్టలో ఉంటాయి. మల విసర్జకాలు గాని ద్వారా, నీటి ద్వారా, మానవునిలోకి ప్రవేశించుట వలన అపరిశుభ్రమైన చేతులు, గోళ్ళు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
లక్షణాలు |
ఎండు గుణం తీవ్రతను గుర్తించుట |
||
లక్షణాలు లేకుండుట |
కొంచెం లక్షణాలు |
ఎక్కువ లక్షణాలు |
|
సాధారణ పరిస్థితి కళ్ళు చర్మం సాగే గుణం |
బాగుండుట, ఆరోగ్యంగా ఉండుట చర్మం మీద సాగే గుణం కనిపిస్తుంది |
నిలకడగా లేకుండుట, చాలా తక్కువగా ఉంటుంది |
శక్తి లేకుండా పోవటం |
నిర్ణయం |
ఎండు గుణం |
రెండు లేక మూడు కనిపిస్తే |
డయేరియా కి గురి అయిన వారు మొదటిగా తీసుకోవలసిన జాగ్రత్తలు
వయస్సు |
ప్రతి మల విసర్జనకు ఎంత ఓ.ఆర్.ఎస్. పట్టాలి |
ఓ.ఆర్.ఎస్. ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి |
24 నెలల లోపు |
50 నుండి 100 మి.లీ. |
500 మి.లీ. |
చికిత్స- వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది
డయోరియాకు ఇంటి వద్ద తయారు చేసుకొనే చికిత్స
ఉదా – పప్పు నీరు, గంజి నీరు అన్ని కలిపిన కూరగాయాలను, తాజా కూరగాయలను, అప్పటికప్పుడు తయారు చేసిన వంట పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. ఈ ఆహారం దాదాపు ఒక రోజుకు ఆరు సార్లు తినిపించాలి. డయేరియా తగ్గిన తరువాత కూడా రెండు వారాల పాటు ఇస్తూనే ఉండాలి.
పైన చెప్పిన ప్రకారం డయేరియా పరిస్థితి తగ్గకుండా ఉంటే నీళ్ళ విరోచనాలు ఎక్కువగా కావటం, మరల మరల వాంతులు, దాహం ఎక్కువ ఉండటం, తినటం కాని, త్రాగటం కాని ఇష్టపడకపోవటం, జ్వరం, రక్తంతో కూడిన మలం ఇవన్నీ ఉంటే ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్ళాలి.
శ్వాస కోశ వ్యాధులు
లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువగా ఊపిరి పీల్చటం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం గురక పెట్టడం, పొట్ట ఉబ్బి ఉండటం.
ఈ క్రిఁది లక్షణాలను గుర్తించండి |
||
తిండి తినకుండా ఉండటం |
మూర్ఛలు |
నిద్ర సరిగా ఉండకపోవటం, గురకపెట్టడం, ఊపిరి బిగపట్టడం, జ్వరం లేదా శరీర ఉష్ణ్రోగ్రత తగ్గిపోవటం |
|
తీవ్ర శ్వాసకోశ (న్యూమోనియా) గుర్తించటం |
శ్వాస కోశ (స్యూమోనియా) కనపడుట |
ఇంటి దగ్గర (అయితే) తీసుకోవలసిన జాగ్రత్తలు
పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు మరియు తక్కువగా శ్వాస తీసుకోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వ్యాధి తీవ్రత
వ్యాధి తీవ్రతను తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది.
మెరాస్ మస్ (కట్టె నంజు) |
క్యాషియార్క్ ర్ (ఉబ్బు నంజు) |
లక్షణాలు- కట్టె నంజుకు దీనిలో కండరాలు తగ్గిపోతాయి, క్రొవ్వు పదార్థాలు, బరువుకు తగ్గ ఎత్తు లేకపోవటం, ఆకలి బాగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అతిసార వ్యాధి కూడా ఉంటుంది. |
లక్షణాలు- కాళ్ళ వాపు, బరువులో అభివృద్ధి లేకపోవటం, ఆకలి లేకపోవటం, రాగి రంగు జుట్టు కలిగి ఉండటం, అప్పుడప్పుడు అతిసారం, చర్మంపై పగుళ్ళు, చర్మం పగిలి, చెక్కులు చెక్కులుగా రాలిపోవటం. |
ఈ రెండింటిని నివారించటానికి గర్భవతిగా ఉన్నప్పుడు సమతులాహారం, తల్లిపాలు మాత్రమే పట్టించాలి, 6 నెలల వయస్సు ఉన్న బిడ్డకు ఆహారంలో ఘన పదార్థాలు మొదలుపెట్టి అదనపు ఆహారం ఇవ్వాలి. సమతులాహారం గురించి అవగాహన కల్పించాలి. కుటుంబ నియంత్రణ పాటించాలి. కుటుంబ వాతావరణం, మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ముందుగానే వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేసి, సమతులాహారం ఇచ్చి, క్రమబద్దంగా ఎత్తు, బరువును పరీక్షించాలి. |
అదనపు ఆహారం
శిశువుకు తల్లిపాలకు తోడుగా, తగినంత పోషక పదార్థాలను ఇచ్చే ఇతర ఆహారాన్ని అదనపు ఆహారమంటారు. శిశువుల్లో అది పాల వంటి ద్రవ పదార్థాలు కావచ్చు లేదా జారుడు ద్రవంగా ఉండే పాయసం కావచ్చు. లేదా ఒక ఏడాది బిడ్డల విషయంలోనైతే, అన్నం లాంటి ఇతర ఘనాహారాలు కావచ్చు.
అదనపు ఆహారాన్ని ఎందుకు, ఎప్పుడు వాడాలి
పుట్టినప్పుడు తల్లిపాలు ఒక్కటే చాలు. శిశువు పెరిగే కొద్ది, క్రమంగా అన్ని పోషక పదార్థాల అవసరాలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో క్రమేపి, తల్లిపాల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. పెరుగుతున్న పోషకావసరాలు, తగ్గుతున్న తల్లిపాలు ఈ రెండు కారణాల వల్ల బిడ్డకు లభించే పోషక పదార్థాలు క్రమేపీ తగ్గుతాయి. మామూలుగా ఈ పరిస్థితి బిడ్డకు 4-6 నెలల వయస్సప్పుడు ఏర్పడుతుంది. అందుకే అలాంటప్పుడు శిశువుల పెరుగుదల తగిన విధంగా ఉండాలంటే 4-6 నెలల వయస్సు నుండి తల్లిపాలతో బాటు అదనంగా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాలి.
ఉదా- కిచిడి తయారికి కావలసిన పదార్థాలు – బియ్యం 30 గ్రా, పెసరపప్పు 15 గ్రా, ఆకుకూరలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర కొంచెం.
పద్ధతి- బియ్యం, పెసర పప్పును శుభ్రం చేసి ఉప్పు వేసిన నీటిలో నీరు ఇంకి, గింజలు మెత్తబడే దాకా ఉడికించాలి. ముప్పాతిక ఉడికిన సమయంలో ఆకు కూరలను వేయాలి. నూనెలో జీలకర్రను వేయించి చివర కలపాలి.
ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్
ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే ...
గర్భాశయ క్యాన్సర్ అనేది స్త్రీ గర్భాశయంలో ఏర్పడే క...
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృ...
అంటు వ్యాధులు లక్షణాలు,రోగ కారణాలు తీసుకోవాల్సిన జ...