అంగ వైకల్యం గల స్త్రీలకు మంచి ఆరోగ్యం కలిగి వుండే హక్కు వుంది. మంచి ఆరోగ్యం అన్నది సమతుల్యమైన పోషక విలువలు గల ఆహారం తీసుకోవటం వలన, క్రమ బద్దమైన శారీరక వ్యాయామం అంటే రోజూ కూడ ఏదో ఒక పని చేయటం ద్వారా శరీర భాగాలను చైతన్య పరచటం వలన, సాధారణమైన ఆరోగ్య సమస్యల నిరోధం, నివారణల గురించిన సమాచారం పొందగలగటం వలన లభిస్తుంది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి పరమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారం తెలియటం వల్ల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతే కాకుండా వికలాంగులైన ఫ్రీలు, బాలికలు కూడ వారి శక్తి సామర్థ్యాల మేరకు మంచి విద్య, ఉద్యోగాలు పొందగలిగితే, సమాజంలోని ఇతర స్త్రీల లాగా అన్ని కార్యక్రమాల లోను పాల్గొనే అవకాశాలుంటాయి.
వికలాంగులైన స్త్రీలు తమ తమ వ్యక్తిగత శారీరక లేదా మానసిక లోపాల గురించి వివరించేటపుడు 'వైకల్యం’ అన్న పదాన్ని ఉపయోగించటం జరుగుతుంది. అంధత్వం, వినికిడి శక్తి లోపం, నడవటం లేదా మాట్లాడటం కష్టం అయిన పరిస్థితులు, అర్థం చేసుకోవటం, నేర్చుకోవటం క్లిష్టమైన పరిస్థితి, మూర్చలకు దారితీసే పరిస్థితులు - ఇవన్నీ కూడ అంగ వైకల్యంగా పరిగణింపబడుతున్నాయి.
అంగ వైకల్యం లేని స్త్రీల నుంచి భిన్నంగా వున్నప్పటికీ అంగ వైకల్యం గల స్త్రీలు కూడ చూడటం, వినటం, తిరుగాడటం, అర్థం చేసుకోవటం, చూసి నేర్చుకోవటం వంటి అన్ని పనులు చేయగలుగుతారు. నిత్య జీవితానికి సంబంధించిన తినటం, స్నానం చేయటం, తెలియపరచటం, దుస్తులు ధరించటం, పడుకొన్న చోటు నుండి పైకి లేవటం, బిడ్డను ఎత్తుకోవటం, ఆలన పాలన చూసుకోవటం మొదలైన పనులన్నీ తేడాగా అనిపించినప్పటికీ చేయగలుగుతారు. తమకున్న లోపాన్ని అనుసరించి, తమ పనులు చేసుకోవటానికి వీలుగా ఒక పద్ధతిని అలవరుచుకోవటం అన్నది వారి జీవితంలో ఒక భాగం.
ప్రతి స్త్రీ కూడ తనకున్న వైకల్యంవల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆమె ఎన్నో సాంఘికపరమైన, భౌతికమైన, ఆర్థిక పరమైన అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఫలితంగా ఆమె ఆరోగ్య సంరక్షణ, విద్య, వృత్తిపరమైన శిక్షణ, ఉద్యోగం మొదలైన అవకాశాలన్నీ ఆ అవరోధంతో దూరమైపోయి నిస్సహాయురాలిగా మిగిలిపోవటం జరుగుతుంది.
అసత్యపు అభిప్రాయాలే అవరోధాలు
ఒక వైకల్యం గల స్త్రీ ఏమి చేయగలదు లేదా ఏమి చేయలేదు అన్న విషయంపై అసత్యపు అభిప్రాయాలు, తప్ప దృక్పథాలు కలిగి వుండటం వల్ల, అంగవైకల్యం గల స్త్రీల యొక్క ఆరోగ్య సంరక్షణ, ఇతర అవకాశాలు దూరమై వారు ఒక పరిపూర్ణమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపలేని దుస్థితి లోనే వుండి పోతున్నారు. అంతే కాకుండా తమ చుటూ వున్న సమాజంలో ఏ విధంగాను పాలు పంచుకొనలేక ఏకాకులుగా మిగిలిపోవటం జరుగుతుంది. ఉన్న వైకల్యానికి ఇటువంటి దుస్థితి తోడు కావటంతో విద్య, ఉద్యోగం, వైద్యం, సాంఘిక జీవనం వారికి అందని వరాలుగా మిగిలిపోవటం జరుగుతుంది.
ఒక బాలికకు అంధత్వం వుండటం వల్ల, లేక వినికిడి శక్తి లేకపోవటం వల్ల, ఆమె విద్య నేర్చుకోలేదన్న ఉపాధ్యాయుల అభిప్రాయం చాల హానికరమైనది. అంధురాలైతే బ్రెయిలీ లిపి అందు బాటుగా తెస్తే నేర్చుకుంటుంది. ఆడియో క్యాసెట్లు విని కూడ నేర్చుకోగలదు. అలాగే స్పర్శ వాసనలతో ఇతర జ్ఞానేంద్రియాలను వినియోగించి నేర్చుకోగలదు. అలాగే బధిరురాలైతే, వినికిడి శక్తి లోపించినప్పటికీ సౌజ్ఞలు, సంకేతాలతో కూడిన భాషను ఉపయోగించి బోధించినటైతే విద్య వారి స్వంతం అవుతుంది. కంటికి కనిపించే వీడియో క్యాసెట్లు, క్లిప్పింగులు చూసి కూడ నేర్చుకోగల సామర్థ్యం వారికి వుంటుంది. బోధనా విధానంలో చోటు చేసుకుంటున్న ఆధునిక పద్ధతుల ద్వారా వికలాంగ స్త్రీలు చదువుకోగలుగుతారు. ఉద్యోగాలు చేయగల సామర్థ్యాన్ని సంపాదించుకోగలరు.
ఒక నడవ లేని స్త్రీ, విద్య ఉద్యోగ రంగాలలో మంచి రాణింపు పొంది, తన కుటుంబాన్ని పోషించుకోగలంత ఆదాయం సంపాదించుకోగలుగుతుంది. కాని, ఆమె కదిలే పద్ధతులను, వైకల్యాన్ని నామోషీగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చాటున అణచి వేసినటైతే ఈ రాణింపు అంతా కనపడదు. వారి అభిప్రాయాలు, తప్ప భావాలే ఆమెను వైకల్యానికి గురి చేస్తాయి.
అంగ వైకల్యం అన్నది సమాజంలో ఎవరికైనా కలుగవచ్చు. అది ఒక సహజమైన దురదృష్ణస్థితి. కాని వైకల్యం కలవారు తమ లోపాన్ని మరచి మిగతా, సమాజంలోని వ్యక్తుల లాగే జీవించాలని కోరుకుంటారు. అందుకు తమకున్న అవకాశం మేరకు కృషి చేస్తారు కూడ. కాని సమాజంలోని ఇతర వ్యక్తులు వారి పట్ల చూపించే వివక్ష చిన్నచూపు వారిని వికలాంగులు గానే మిగిల్చేస్తున్నాయి.
అంగ వైకల్యానికి సంబంధించి వైద్యపరమైన అవగాహన
చాల మంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు వ్యక్తులలోని వైకల్యాన్ని మాత్రమే గుర్తించి, వారిలో చాల తేడా వుందనీ, ఆ లోపానికి నివారణ చేయాలని, కేవలం పునరావాసం కల్పించటం అవసరం అనీ భావిస్తారు.
మెట్ల వల్ల కాని దురభిప్రాయాల వల్ల కాని ఆసుపత్రులు, ఇతర సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడే సౌకర్యాలు, ప్రతి ఒక్కరు వినియోగించుకొనే అవకాశం లేకుండా పోతుంది. వారు అనుకుంటున్న లోపం వైద్య వ్యవస్థలోనే ఉంది. దానిని సరిచేసి, పునరావాసం కల్పించవలసిన అవసరం వుంది. ఒక స్త్రీ లోని వైకల్యాన్ని ఆమెకున్న లోపంగా భావించనక్కర్లేదు. వారి అవసరాలను అర్థం చేసుకొని తగిన సౌకర్యాలను వైద్యపరంగా, నిర్మాణ పరంగా కూడ కలుగ జేసినటైతే తమకు వైకల్యం వున్నదన్న విషయమే వారికి గుర్తుండదు. అంగ వైకల్యం పట్ల గల వైద్య పరమైన అవగాహనా లోపమే వారిని వికలాంగులుగా చేస్తుంది.
వైకల్యం అన్నది జీవితంలోని ఒక సహజమైన భాగం
వైకల్యం గల వ్యక్తులు కొందరు ఎపుడూ పడుతూనే వుంటారు. అలాగే ప్రమాదాలూ జరుగుతూనే వుంటాయి, వ్యాధులు సోకుతూనే వుంటాయి మనుషులకు, కాని సాంఘికంగా వారి స్థితి గతులను మెరుగు పరచగల శక్తి ప్రభుత్వానికి, సమాజానికి కూడ వుంది. సాంఘిక కార్యకలాపాలలో పాల్గనలేకుండా అడ్డుకొనే, దురభిప్రాయాలను, సాంఘిక పరమైన, సాంస్కృతిక పరమైన, ఆర్థికపరమైన, భౌతిక పరమైన అవరోధాలను అతిక్రమింప చేయాలి. సమాజంలో మనుషులుగా వారిని గుర్తించి, ఆదరించి, తమకున్న లోపాన్ని ఎదిరించి నిలబడగల ధైర్యాన్ని కలుగ జేసి, ఉద్యోగ అవకాశాలను కల్పించినటైతే, అంగవికలురైన స్త్రీల యొక్క మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడ మెరుగవుతాయి.
భారతదేశంలో బెంగుళూరులో ఆదర్శంగా నిలబడిన వికలాంగ స్త్రీలు
దక్షిణ భారతదేశంలో గల బెంగుళూరు నగరంలో వికలాంగులైన నలుగురు యువతులు - షాహినా, నూరి, దేవకి, చంద్రమ్మ కలిసి ఇతర స్త్రీలకు పునరావాసానికి అవసరమైన, సహాయపడే పరికరాలను, వస్తువులను తయారు చేసి అందించే పనిని చేపట్టారు. వారు Rehabilitation Aids Workshop by Women with Disabilities (RAWWD) లో పని చేస్తారు. వికలాంగులకు పునరావాసం కలిగించటానికి సహాయ పడే వివిధ రకాల సాధనాలను తయారు చేసే ఆ సంస్థ 1997 లో స్థాపించబడింది. విశేషం ఏమంటే అందులో పని చేసే వారంతా వికలాంగ స్త్రీలే. "మొబిలిటీ ఇండియా' అనే ప్రభుత్వేతర సంస్థ ప్రారంభంలో 8 మంది వికలాంగ స్త్రీలకు శిక్షణ నిచ్చి నడకకు సహయ పడే సాధనాల తయారీ మొదలు పెట్టింది.
ఈ సంస్థ (RAWWD) ప్రారంభించక ముందు ఇతరత్రా సౌకర్యాలు వుండేవి కాని, అక్కడ పనిచేసే వారు పురుషులే కావటం వల్ల, స్త్రీలు వారి దగ్గరకు కొలతలిచ్చి సహాయక పరికరాలను అమర్చుకోవటానికి వేళ్ళేటందుకు సంశయించేవారు. ఈ కారణంగా చాల మంది వికలాంగ స్త్రీలు ఆ సాధనాలను ఉపయోగించక నడిచే అవకాశాల్ని జార విడుచుకున్నారని చెప్పవచ్చు. ఆర్ ఎ డబ్యు డబ్ల్యూ డి సంస్థ ప్రస్తుతం భారీ ఎత్తున, శీలమండలకు (ankle) పాదాలకు, మోకాళ్ళకు పునర్జన్మను ప్రసాదించినట్టుగా నడిపించే సహాయ సాధనాలను తయారు చేస్తుంది. క్రెచెస్ (చేతుల క్రింద వూతంగా పెట్టుకు నడిచే కర్రలు), వాకర్స్ (నడవటానికి వూతం), షూస్ (బూట్ల), బెల్టులు, పట్టివుంచే బ్రేసెస్ తయారు చేసే వానిలో ముఖ్యమైనవి. వీటన్నిటినీ మంచి కృతిమ కాళ్ళు పాదాలు (Prosthetics) తయారు చేయటం విశేషం.
ఈ సంస్థలో పని చేస్తున్న స్త్రీలు తాము పెంచుకున్న ఆత్మ విశ్వాసం, నైపుణ్యాలతో వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడే ఇతర సంస్థలకు కూడ తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బెంగుళూరులో అనేక ఆసుపత్రులకు, పైవేట్ డాక్టర్లకు కూడ తమ సేవలను విస్తరించటం జరిగింది.
ఈ సహాయక పరికరాలను తయారు చేయటానికి అవసరమైన సామగ్రిని తీసుకొని రావటం, తమ క్లైంట్లకు సంబంధించిన రికార్డును తయారు చేయటం, తమ క్లైంట్లకు అమర్చిన సాధనాలు ఎలా పని చేస్తున్నాయో చూసి తెలుసుకొనేందుకు క్రమ బద్దమైన పర్యటనలు చేయటం, తమ వ్యాపారాన్ని సక్రమంగా నడిపించుకోవటం - ఇవే ఆ మహిళల పనులు.
ఈ సంస్థ వికలాంగులైన ఇతర స్త్రీలకు కూడ, ఈ సహాయక సాధనాలను తయారు చేయటంలోను, వాటి మరమ్మత్తు చేయటంలోను శిక్షణను ఇచ్చి, వారికి కూడ ఉపాధిని తమ వద్దే ఏర్పరచటం జరుగుతుంది. ఇందు వలన వికలాంగ స్త్రీలలో సమానత్వానికి పునాదులు పడటమే కాకుండా, కుటుంబ సభ్యులచే నిరాదరణకు గురైన వికలాంగ స్త్రీలకు కూడ ఉపాధి ఏర్పడి, తోటి స్త్రీలతో కలిసి మెలిసి బ్రతికే అదృష్టం కలగుతంది.
వనరులు మరియు అవకాశాలు
వివిధ ప్రాంతాలలో సంఘంలో స్త్రీలకు, పురుషులకన్నా తక్కువ వనరులు, అవకాశాలు కలిగి వుంటారు. ఈ స్త్రీ,పురుషుల మధ్య గల అసమానత్వం వికలాంగులైన వారి మధ్య కూడ వుంటుందన్న విషయం నిజం.
చక్రాల కుర్చీలు, కృతిమ అవయవాలు, సంకేత భాషా తరగతులు, బ్రెయిలీ లిపి పలకలు (అంధులు చదవటానికి ఉపయోగ పడే సాధనం), ఇంకా అనేక ఇతర ప్రయోజనకర వనరులు తరచు చాల ఖరీదైనవిగా, తక్కువ సంఖ్యలో అందుబాటుగా వుండేవిగా వుంటాయి. ఇవి పొందే అవకాశం స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువగా వుంటుంది. అందువలన చదువుకోవాలన్న ఆశ వున్నా అది నెరవేర్చుకోలేక, స్వయం సహాయం ఏర్పాటు చేసుకోలేక ఎంతో కష్టపడుతూ వుంటూరు, ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి, జీవితాన్ని స్వంతంగా నడిపించుకోలేని నిస్సహాయతకు లోనవుతారు ఆఫ్రీలు, ఆపైన ఇక సామాజిక జీవనంలో కూడ పాల్గొన లేని స్థితికి చేరుకోవవటం జరుగుతుంది.
భౌతిక అవరోధాలు:
చాల మంది వికలాంగ స్త్రీలు, సామాజిక సౌకర్యాలైన ఆసుపత్రులు, బ్యాంకులు మొదలైన వాటి సేవలను అందుకోలేక బాధపడుతూ వుంటారు. ఎందువల్లనంటే చాల భవనాల నిర్మాణం, ప్రతి ఒక్కరూ వినియోగించుకోగల తీరుగా వుండకపోవటమే కారణం అనుకోవచ్చు. అనేక భవనాలకు చక్రాల కుర్చీ నడిపించు కొనగల స్లోప్ గాని, పట్టుకు నడవటానికి రెయిల్స్ గాని, లిఫ్టులు, ఎలివేటర్లు మొదలైన సౌకర్యాలు లేకుండా నిర్మించటం వలన వికలాంగులకు చాల కష్టమవుతుంది. తమంతట తాము తిరగటానికి ఈ అడ్డంకుల వల్ల స్త్రీలు తరచు మంచి ఆహారం పొందలేకపోవటం, సరిపడిన వ్యాయమం శరీరానికి అందించ లేకపోవటం లాంటి సమస్యలనే కాకుండా, తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను కూడ పొందలేని సమస్యను కూడ ఎదుర్కోవటం జరుగుతుంది.
ఆరోగ్య కార్యకర్తలతో సహా చాల మంది, ఒక చక్రాల కుర్చి ఉపయోగించే స్త్రీ గురించి తప్ప అభిప్రాయం కలిగి వుంటారు. ఆమె భవనం లోపలకు రాలేదనీ, క్రచెస్ ఉపయోగించి రావాలనీ, లేక ఆమెను ఎవరైనా మోసి తీసుకు రావాలని భావిస్తారు. అది ఆమె రాలేక పోవటం కాదు. ఆ భవనానికి వున్న మెట్లు భౌతికంగా అడ్డంకు అవుతాయి. ఫలితంగా ఆమె ఆ భవనంలోకి వెళ్ళటం అసాధ్యంగా పరిణమిస్తుంది. అదే అక్కడ ఒక వాలుగా వున్న చష్ణారాంప్) వున్నటైతే ఆమె తన చక్రాల కుర్చీని నడిపించుకొని లోనికి వెళ్ళగలిగి వుండేది.
కొంత మంది స్త్రీలు పుట్టుకతోనే వికలాంగులై వుంటారు. కొంతమంది వైకల్యం కాలంతో పాటు పెరుగుతుంది. కొందరు అయితే హఠాత్తుగా జరిగే ప్రమాదాల వల్లనో, సోకే వ్యాధుల వల్లనో ఒక్కసారిగా వైకల్యానికి లోనవుతారు.
అన్ని రకాల వైకల్యాలను అరికట్టటం అన్నది అసాధ్యం. కొందరు బిడ్డలు తల్లి గర్భంలో ఏర్పడినపుడే తేడాగా ఏర్పడటం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. బిడ్డలలో సంభవించే చాల వైకల్యాలకు, స్త్రీలు జీవించే హానికర పరస్థితులే కారణం. స్త్రీలు తగిన పోషక విలువలు గల ఆహారం తీసుకోవటం ద్వారా, హానికరమైన రసాయనాలతో కూడిన పని చేయకుండా వుండటం ద్వారా, బిడ్డ పుట్టే సమయంతో సహా మిగతా కాలంలో కూడ మంచి ఆరోగ్య సంరక్షణ పొందటం ద్వారా అనేక వైకల్యాలు నిరోధించబడతాయి.
దారిద్ర్యం - పోషక ఆహార లోపం
అంగ వైకల్యానికి ప్రథమ, ముఖ్య కారణం దారిద్ర్యం అని చెప్పవచ్చు. నిరుపేదలకు వైకల్యాలు సంక్రమించే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే వారు ఆరోగ్యకరంగాలేని, క్షేమ పూరితం కాని, వాతావరణంలో జీవించవలిసి వుంటుంది. విధిలేక, అలాగే పని చేసే వాతావరణం కూడ హానికరం గానే వుంటుంది. తక్కువ చోటు లోనే క్రిక్కిరిసిన జనాభాతో కలిసి బ్రతకటం, రక్షిత త్రాగునీరు అందుబాటుగా లేకపోవటం, అందరాని విద్యా అవకాశాలు, తగినంత మంచి ఆహారం పొందలేక పోవటం - ఈ కారణాల వల్ల అంగ వైకల్యం కలిగే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఫలితంగా పోలియో, క్షయ వంటి వ్యాధులు సోకి తీవ్రమైన అంగ వైకల్యాలకు గురి అవటం సాధారణంగా జరుగుతుంది. ఇవి ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపించే వ్యాధులు కావటం వల్ల హాని తీవ్రత ఎక్కువగానే వుంటుంది.
పేద కుటుంబాలలో చాల మంది వైకల్యం గల శిశువులు జన్మించటం గాని, పసితనంలోనే మరణించటం గాని జరుగుతూ వుంటుంది. తల్లి గర్భంతో వున్న సమయంలో తగినంత ఆహారం పొందలేక పోవటమే అందుకు కారణం కావచ్చు. చిన్నతనంలో అంటే ఒక బాలికగా ఆమె సరిపడినంత ఆహారం పొందలేక పోవటం కూడ కారణం కావచ్చును. బాల్యం నుంచీ కూడ ఆడపిల్లకు, మగపిల్ల వాడి కంటే తక్కువగా ఆహారం ఇవ్వటం జరుగుతూ వుంటుంది. ఈ వివక్ష కారణంగా ఆమె పెరుగుదల చాల నెమ్మదిగా జరిగి ఎముకలు సవ్యంగా ఏర్పడక పోవటం జరుగుతుంది. ఎముకల ఎదుగుదల సరిగా లేకపోవటం వల్ల బిడ్డకు జన్మనిచ్చే ప్రసవ సమయంలో చాల కష్టమవుతుంది. ఆ సమయంలో ఆమెకు మంచి ఆరోగ్య సహాయం అందనటైతే మరీ సమస్య అవుతుంది. పిల్లలు పసితనంలో గాని, ఎదిగే వయసులోగాని, తగినంత మంచి ఆహారం పొందలేనటైతే ఆడపిల్ల అయినా మగపిల్ల వాడైనా సరే వారికి అంధత్వం గాని, చదువు సంధ్యలకు ఆటంకం కాగల దృష్టి లోపం గాని కలుగవచ్చు.
యుద్ధం
ఈ కాలంలో జరుగుతున్న యుద్దాలలో సైనికుల కన్నా పౌరుల సంఖ్యే ఎక్కువగా చనిపోయినట్లు నమోదవుతుంది. అందునా మరణించిన వారిలో స్త్రీలు, పిల్లలే ఎక్కువగా వున్నట్లు అంచనా. పెద్ద పెద్ద పేలుళ్ళ తాకిడికి మరణమో వైకల్యమో సంభవిస్తుంది వేలాది మందికి ఇతరత్రా కలిగే గాయాల కన్నా దృష్టిని కోల్పోవటం, వినికిడి శక్తి కోల్పోవడం లేక కాళ్ళూ చేతులూ పోగొట్టు కోవటం వంటి నష్టాలు జరుగుతున్నాయి ఆయుధాల ప్రభావం వల్ల, ఆ సమయాలలో చెలరేగే హింస వల్ల వారి మానసిక ఆరోగ్యం కూడ బాగా దెబ్బ తినటం జరుగుతుంది. అంతే కాకుండా ఇళ్ళు, హాస్పిటళ్ళ స్కూళ్ళ ధ్వంసం కావటం వల్ల ప్రజలకు అపార నష్టం కలుగుతుంది. నిత్య జీవితం పై దీని ప్రభావం వల్ల విపరీతమైన భారం పడుతుంది. బ్రతుకు తెరువు మార్గాలు నాశనమై రోడ్డున పడతారు నిరు పేదలు. కలహాలు, యుద్దాలు సంభవించినపుడు, అంగవైకల్యాలు, దారిద్ర్యం, వ్యాధులు అధికంగా కనిపిస్తాయి.
ప్రేలుళ్ళ, మందు పాతరల వల్ల కాళ్ళకు, చేతులకు జరిగే గాయలూ, నష్టాలే ఎక్కువ, తరచుగా స్త్రీలవో పిల్లలవో కాలు, చెయ్యి తొలగించ వలసినంత మేరకు హాని కలుగుతూ వుంటుంది, అటువంటి సంఘటనలలో, కాని ఇటు వంటి విధంగా అంగ వైకల్యం కలిగిన నలుగురిలో ఏ ఒక్కరో కృత్రిమ అవయవాలను (కాలు) పొందగలిగివుంటారు. ఎందుకంటే అది చాల ఖరీదైన విషయం. ఒకోసారి కృత్రిమ అవయవాలు లభించటం కూడ కష్టంగానే వుంటుంది. భారత దేశంలో నాణ్యతా పరిమాణాలతోను, తక్కువ లేక అందుబాటు ధరలోను తయారు చేసే క్షత్రిమ అవయవాల సంస్థలు 'ది ముక్తి లింబ్ మరియు జైపూర్ ఫుట్ అన్లవి మంచివి అని చెప్లవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకం లోనే లభిస్తుంది. మందు పాతరలను చట్టబద్దంగా నిషేధించాలన్న అంతర్జాతీయ ఒప్పందం పై కొన్ని దేశాలు విముఖతను ప్రదర్శించటం జరుగుతుంది. అందుకోసం వారిపై ఒత్తిడి తెచ్చి ఒప్పించాలి మీరు. అదే కనుక ఫలించినటైతే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చు అనేక మందిని వైకల్యం బారిన పడకుండా కాపాడు కోవచ్చుకూడ. |
అణుధార్మిక (న్యూక్లియర్) ప్రమాదాలు
భారీ మొత్తంగా అణుధార్మిక శక్తి సోకటం వల్ల అనేక మంది బాధ పడ్డారు. అణుధార్మిక శక్తికి ప్రత్యక్షంగా గురై ఆరోగ్య సమస్యలను తీవ్రంగా ఎదుర్కొన్న వారు ఎందరో, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని త్రీ మైల్ ఐలాండ్ లో 1979 లోను, 1986 లో ఉక్రెన్ లోని ఛెర్నోబిల్ లోను జరిగిన ప్రమాదాలలో అటువంటి పరిస్థితి ఏర్పడింది. 1945 వ సంవత్సరం లో అమెరికా, జపాన్ పై వేసిన అణుబాంబుల వల్ల కూడ ప్రజలకు విస్తృతంగా నష్టం కలిగింది. ఈ సంఘటనల వల్ల వెలువడిన భారీ రేడియో ధార్మిక శక్తికి గురై ఎందరో మరణించటం జరిగింది.
ఈ ప్రమాదాలలోను, బాంబు దాడులలోను ప్రాణాలతో మిగిలిన వారిలో చాలమంది శరీరంలోని వివిధ బాగాలపై క్యాన్సర్ పుండ్లతో బాధపడ్డారు. ముఖ్యంగా ధైరాయిడ్ గ్రంథిలో గాని లేక ల్యుకేమియా (రక్త సంబంధమైన క్యాన్సర్) గాని వచ్చి త్వరగా మరణం బారిన పడటం జరిగింది అనేక మంది.
ఈ అణు ధార్మిక శక్తికి గురైన ప్రాంతాలలో పుట్టిన శిశువులలో చాల మంది "డౌన్ సిండ్రోమ్' లక్షణాలతో అధిక సంఖ్యలో జన్మించటం జరిగింది. ఈ లక్షణాలు గల పిల్లలు తెలివితేటలు లోపించి, చూసి నేర్చుకోగల శక్తిని, అర్థం చేసుకోగల తెలివిని కోల్పోవటం జరుగుతుంది.
అందుబాటుగా లేని ఆరోగ్య సంరక్షణ
మంచి ఆరోగ్య సంరక్షణ వల్ల అనేక వైకల్యాలను సరి చేయవచ్చు. ప్రసవ సమయంలో కాన్పు కష్టం అయ్యే సందర్భాలలో, ఆ ఒత్తిడి కారణంగా శిశువుకు మెదడుకు సంబంధించిన పక్షవాతం (సెరెబ్రల్ పాల్సీ) సోకే ప్రమాదం వుంటుంది. ప్రసవ సమయంలో, శిక్షణ పొందిన నర్సులు, లేక మంత్రసానులు దగ్గర వుండటం ఎంతో అవసరం. అనుకోకుండా కలిగే సమస్యలకు, అత్యవసరంగా వారు తీసుకొనే జాగ్రత్తల వల్ల శిశువులను అనేక వైకల్యాల నుండి కాపాడగలుగుతారు. అంతే కాకుండా జన్మించిన శిశువులకు రోగ నిరోధక టీకాలు, చుక్కల మందులు వేయటం వల్ల కూడ అనేక రకాల వైకల్యాల నుండి, వారిని కాపాడవచ్చు. అనేక సందర్భాలలో వేక్సిన్ మందులు (రోగ నిరోధకాలు) అందుబాటుగా లేకపోవటం, లేక అందరికీ సరిపడినంత మేరకు రోగ నిరోధకాలు సరఫరా కాకపోవటం, లేక పట్టణాలకు, నగరాలకు దూరంగా నివసించే నిరుపేదలై వుండి ఆ ఖర్చును భరించ లేకపోవటం మొదలైన కారణాల వల్ల వైకల్యాలు ఏర్పడే అవకాశం వుంటుంది. సమాజం నుంచి తరిమికొట్టిన పోలియో, మశూచి వంటివి అక్కడక్కడా కనిపించటానికి ఇవే కారణాలు అనుకోవచ్చు.
అనారోగ్యాలు (వ్యాధులు)
గర్భంతో వున్న స్త్రీ కి సోకే కొన్ని రకాల జబ్బుల వల్ల, వ్యాధుల వల్ల, పుట్టే బిడ్డకు శారీరక వైకల్యం గాని, మానసిక వైకల్యం గాని కలిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. పుట్టుక తో వచ్చే లోపాలలో వినికిడి శక్తిని కోల్పోయేలా చేసే 'జర్మన్ మీజిల్స్ (రుబెల్లా) అనేది సాధారణంగా చాల మంది శిశువులకు వస్తుంది. ఈ రుబెల్లా శిశువులకు సోకకుండా వుండేటందుకు వేక్సిన్ (రోగ నిరోధక మందు) వుంది. కాని అది తీసుకున్న స్త్రీ ఆ తర్వాత ఒక నెల వరకు గర్భదారణ జరుగకుండా జాగ్రత్త పడాలి.
సిఫిలిస్ (పే. 163), హెర్పిస్ (పే. 165), హెచ్.ఐ.వి/ఎయిడ్స్ (పే. 169) కూడ తల్లి నుంచి బిడ్డకు సోకి, బిడ్డలో వైకల్యాలు ఏర్పడటానికి కారణమవుతాయి. అందువల్ల గర్భంతో వుండి కడుపులో బిడ్డ పెరిగే సమయంలో స్త్రీలు లైంగిక సంబంధం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించు కోవటం చాల అవసరం. ఇందువల్ల శిశువులు ఆరోగ్యంగా పుట్టే అవకాశం వుంటుంది.
కొన్ని వ్యాధుల వల్ల శిశువులు, చిన్న పిల్లలు కూడ వైకల్యం బారిన పడే అవకాశాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవి మెనింజైటిస్, పోలియో మరియు మీజిల్స్. అందువల్ల పుట్టిన ప్రతి శిశువుకు కూడ రోగ నిరోధక టీకాలు, చుక్కల మందులు క్రమబద్ధంగా వేయించటం చాల అవసరం (పే.276). కుష్టురోగులున్న ప్రాంతంలో నివసించేటపుడు పిల్లలకు వీలైనంత త్వరగా తగిన పరీక్షలు చేయించటం మంచిది.
మందులు మరియు సూది మందులు (ఇంజెకన్స్)
కొన్ని మందులను ఇంజెక్షన్ ల ద్వారా సవ్యమైనరీతిగాను, అవసరం మేరకే ఇవ్వటం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు, వైకల్యాన్ని నిరోధించవచ్చు. కాని అవసరం వున్నా లేకున్నా ఇంజెక్షన్లు పొడిచేసే ఒక అంటు వ్యాధిలాంటి గుణం ప్రపంచమంతా వ్యాపించివుంది అంటే అతిశయోక్తి కాదు.
పరిశుభ్రంగా లేని సూదిగాని, సిరంజ్ గాని ఉపయోగించి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఉన్న జబ్బుకు తోడు కొత్త వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. రోగ క్రిములు బాగ వ్యాప్తి చెంది, హెచ్.ఐ.వి./ఎయిడ్స్, హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురి చేయటం జరుగుతుంది కూడ.
ఈ విధంగా అనవసరంగా ఇచ్చే ఇంజక్షన్ ల వలన ప్రతి సంవత్సరం కోట్లాది మంది, ముఖ్యంగా పిల్లలు జబ్బు పడటం గాని, మరణించటం గాని లేదా అంగ వైకల్యానికి లోనవటం గాని జరుగుతుంది.
అశుభ్రమైన ఇంజక్షన్ ల వలన కలిగే కొన్ని వ్యాధుల వల్ల హానికరమైన పక్షవాతం, వెన్నెముక దెబ్బ తినటమే కాకుండా మరణించటం కూడ జరుగుతుంది.
ఇంజెక్ట్ చేసే కొన్ని మందుల వల్ల తీవ్రమైన ఎలర్జీ రియాక్షన్లు కలిగి పరిస్థితి విషమిస్తుంది కూడ. తల్లి కడుపులో వున్న శిశువుకు చెముడు కూడ వచ్చే ప్రమాదం కూడ వుంటుంది.
ఒక సూదిని కాని, సిరంజిని కాని ఒక్క వ్యక్తికే ఉపయోగించాలి. దానిని మరొకరికి ఉపయోగించే ముందు స్టెరిలైజ్ (నీటిలో ఉడక బెట్టటం) చెయ్యాలి తప్పనిసరిగా, ప్రతిసారి కూడ ఈ జాగ్రత్తను పాటించాలి.
కొన్ని మందులు గర్భంతో వుండగా తీసుకోవటం వలన శిశువుకు వైకల్యం కలిగే ప్రమాదం వుంటుంది. ఇంజెక్షన్ ద్వారా ఇవ్వదగిన "ఆక్సిటాసిన్" వంటి మందును ప్రసవ సమయంలో తల్లికి నొప్పులు ఎక్కువై తొందరగా కాన్పు జరగాలన్న ఉద్దేశ్యంతో ఇస్తారు. కాని అదే సమయంలో శిశువుకు ఆక్సిజన్ (ప్రాణ వాయువు) సరఫరాను తగ్గించటం జరుగుతుంది కూడ. ఇందువలన శిశువు యొక్క మెదడు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. ఆల్కహాల్ (మత్తు పానీయాలు), పొగాకు (టుబాకో) తీసుకోవటం వలన కూడ కడుపులో బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
ఏమందునైనా, మాత్రనైనా ఉపయోగించటం వల్ల సంభవించవచ్చు. అనేక ప్రమాదాలను గురించి, ప్రయోజనాలను గురించి ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించటం చాల అవసరం. డాక్టర్ లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, మందులను షాపులో విక్రయించే వారు - అందరూ కూడ మందులను తప్పుగా ఉపయోగించటాన్ని అతిగా ఉపయోగించటాన్ని ఆపాలి. ముఖ్యంగా అదుపు చేయ వలసినది అనవసర ఇంజెక్షన్లను.
పనిచేసే ప్రదేశంలో హానికర పరిస్థితులు
సరి పడినంత విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయంలో వరుసగా పని చేయటం వల్ల వారికి ప్రమాదాలు జరుగుతాయి. ప్యాక్టరీలు, క్యారీలు, వ్యవసాయ పద్ధతిలో మొక్కలు నాటే పనులు చేసే చోట, ప్రమాదకరమైన పనిముట్లు, యంత్రాలు, హానికరమైన రసాయనాలు ఇవన్నీ కలిసి స్త్రీలను ప్రమాదకర వాతావరణంలో పని చేసేలా చేస్తున్నాయి. ప్రమాదాలు, అధిక పని గంటలు, రసాయనాలు ఇవన్నీ కూడ అంగ వైకల్యాన్ని కలుగ చేస్తాయి.
పని దగ్గర సూపర్ వైజర్లు కాని, పై అధికారులు గాని, పని త్వర త్వరగా చేయించాలన్న ఉద్దేశంతో అధిక ఒత్తిడి కలుగజేయటం, ఒకోసారి హింసకు గురి చేయటం వల్ల, బెదిరించటం వల్ల కూడ శాశ్వితమైన వైకల్యం సంభవించవచ్చు. అపుడపుడు స్త్రీలు ఉద్యమాలకు దిగినపుడు, హానికర పరిస్థితులలో పని చేయలేమని ప్రతి ఘటించినపుడు, మిలటరీని, పోలీసులను కూడ పిలుస్తారు అధికారులు, వారిని అణగద్రొక్కటానికి.
ప్రమాదాలు
చాల మంది స్త్రీలు, పిల్లలు కూడ అనుకోకుండా జరిగే ప్రమాదాలు, అంటే వంట చేసేటపుడు జరిగే అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదంలో పడిపోవటం, విష పూరిత ఆహారం తినటం వలన కాని, విష వాయువులను పీల్చటం వల్ల గాని జరిగే హాని ఒకోసారి వారిని అంగ వైకల్యానికి గురి చేయటం జరుగుతుంది. సాధారణంగా క్రమ బద్దీకరణ తక్కువగా వుండే, రంగాలలో, అంటే నిర్మాణం లేక కట్టడాల పని, వ్యవసాయం, క్యారీ పనులు ఇంకా చిన్న చిన్న వ్యాపార సంస్థలలో పని చేసేటపుడు అవిటి తనానికి గురిచేసే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం వుంటుంది.
విష సంబంధాలు మరియు పురుగు మందులు
రంగులలో (పెయింట్లు) వినియోగించే లెడ్ (సీసం) వంటి విష పదార్ధాలు, ఎలుకల నిర్మూలనకు వాడే విషపూరిత పదార్థం, ఇంకా ఇతర రసాయనాలు మనుషులను అంగ వైకల్యానికి గురి చేయటమే కాకుండా గర్భస్థ శిశువుల ఎదుగుదలలో కూడ లోపాల్ని కలుగ జేయటం జరుగుతుంది. గర్భంతో వున్న సమయంలో పొగ త్రాగటం గాని, పొగాకు నమలటం గాని, పొగ పీల్చటం , మద్యం సేవించటం (త్రాగటం) గాని చేయటం వల్ల శిశువు పుట్టుకకు ముందే హానికి గురవ్వటం జరుగుతుంది.
పని చేసే ప్రదేశాలలో తరచు రసాయనాలను వినియోగించే పని వారికి, కనీసం అవి ఏ విధమైన జాగ్రత్తతో ఉపయోగించాలో కూడ చెప్పక పోవటం, అవి చాల ప్రమాదం కలిగించే పదార్ధాలని తెలియకనే పని చేయటం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. ఫ్యాక్టరీ లలో జరిగే ప్రమాదాల వల్ల ఒకోసారి గాలి, ఒకోసారి నీరు, మరొక సారి భూమి (మట్టి) కూడ విష పూరితం కావటం చాల ప్రమాదమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల శాశ్వత వైకల్యాలు కూడ కలుగవచ్చు.
వంశ పారంపర్యంగా సంక్రమించే వైకల్యాలు
వెన్నెమపకకు సంబంధించి వున్న కండరాలు, నరాలకు కలిగే మస్క్యూలర్ ఎట్రూఫీ మరియు మస్క్యూలర్ డిస్ వంటి వ్యాధులు వంశ పారంపర్యంగా సంక్రమించే కొన్ని వ్యాధులు. వంశ పారంపర్యంగా గల ఏవైనా వ్యాధులతో ఒకరిద్దరు పిల్లలు కలిగిన స్త్రీలకు మళ్ళీ కూడ అటువంటి బిడ్డే పుట్టే అవకాశం వుంది.
ఇతర రకాలైన వైకల్యాలు, సాధారణంగా దగ్గర సంబంధాల పెళ్ళిళ్ళు అంటే మేనరికాల వల్ల సంభవిస్తూ వుంటాయి. 40 ఏళ్ళ వయసున్న తల్లలకు జన్మించే పిల్లలలో తరచు డౌన్స్ సిండ్రోమ్ సమస్య కలుగుతూ వుంటుంది. ఏమైనప్పటికీ చాల వరకు వైకల్యాలు పూర్వీకుల నుండి సంక్రమించేవి కావు.
చాలా సందర్భాలలో వైకల్యంతో జన్మించిన శిశువు తల్లిదండ్రులు అందుకు ఏ రకంగాను కారణం కాదు. అలా జరగడానికి వారు కూడని పనులేవి చేసి వుండరు కూడా. తల్లిదండ్రులను అందుకు నిందించడం పొరపాటు.
ఆయా ప్రాంతాలలో వుండే ఆచారాలు, మూఢమైన విశ్వాసాలననుసరించి వైకల్యాన్ని గురించి తప్పెన, హానికరమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవటం జరుగుతుంది. ఒక స్త్రీ కి వైకల్యం కలుగటానికి అనేక కారణాలను ఊహిస్తూ వుంటారు కొందరు. ఆమె గాని ఆమె తల్లి తండ్రులు గాని గత జన్మలో ఏదో చెడు చేయటమే అందుకు కారణమంటారు. లేకుంటే పూర్వీకుల అభీష్టాలకు వ్యతిరేకంగా నడిచి వారిని బాధించటం వల్ల అలా జరిగిందంటారు. ఇంకా ఆమె తల్లితండ్రులలో ఒకరు వివాహేతర లైంగిక సంబంధం కలిగి వుండటమే కూతురు వైకల్యానికి కారణం అంటారు. సాధారణంగా పిల్లల అంగ వైకల్యానికి తల్లలను నిందిస్తూ వుంటారు. కాని అందుకు తల్లలు ఏమాత్రం కారణం కారు. అంగ వైకల్యానికి ఎవరినో కారణంగా చూపి వారిని నిందించటం వల్ల ప్రయోజనం ఏమీ వుండదు.
మరొక హానికరమైన అభిప్రాయం ఏమిటంటే సాధారణంగా వుండకుండా శారీరకంగా గాని, మానసికంగా గాని కొంచెం తేడాగా వున్న వ్యక్తులను వేరుగా చూసి వెలివేసినట్లు చేయటం, విమర్శించటం, వారిని వెక్కిరించి, హేళన చేసి బాధించటం, కొందరు అంగ వైకల్యం గల వ్యక్తులు అపశకునానికి సూచకులనీ, దురదృష్ట కారకులనీ అనుకుంటారు. అంగ వైకల్యం గల స్త్రీలు తరచు నిరాదరణకు గురవుతారు. సంఘంచేత బిచ్చగత్తెలుగా మార్చబడతారు. బ్రతుకు తెరువు కోసం వ్యభిచారం కూడ చేస్తారు తప్పనిసరిగా. కొందరైతే వారి విషయంలో మరీ నిర్దయగా వ్యవహరిస్తారు. వికలాంగ స్త్రీలు హెచ్.ఐ.వి / ఎయిడ్స్ కలిగి వుండే అవకాశాలు తక్కువగా భావించి వారిని లైంగికంగా కూడ హింసిస్తారు. వారితో లైంగిక సంబంధం కలిగి వుండటం వల్ల హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నివారింప బడతాయన్న మూఢ నమ్మకం కూడ వుంది కొందరికి.
కాని యదార్ధానికి వికలాంగురాలైన ఏ స్త్రీని కూడ ఎన్నడూ నిరాదరణకు గురి చేయకూడదు. అంగ వైకల్యం ఒక శిక్ష కాదు ఎపుడూ కూడ. అంగ వైకల్యం అన్నది ఒక శాపం వల్లనో, చేతబడి వంటి క్షుద్ర శక్తుల వలనో సంక్రమించే దురదృష్టం కాదు. అంగ వైకల్యం అన్నది ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి కూడ కాదు.
ఒక వికలాంగ స్త్రీ ఏమి చెయ్యగలదో, ఏమి చెయ్యలేదో అర్థం చేసుకోలేరు. ఎప్పటికీ అది తెలుసుకోలేరు.
ఒక వికలాంగ స్త్రీ యొక్క వైకల్య ప్రభావం, కేవలం ఆమె పైననే పడదు. చాలమంది బాధ పడవలసి వస్తుంది అందువల్ల, ఆమె కుటుంబం, స్నేహితులు, అన్నిటినీ మించి ఆమె చుట్టూ వున్న సమాజం కూడ ఈ ప్రభావానికి లోనవుతుంది. ఒక వికలాంగ స్త్రీ ఆరోగ్యంగా కోలుకోవాలంటే, ఆమె చుట్టూ వున్న వ్యక్తులు ఆమెకు అండగా నిలిచి గౌరవించాలి. వికలాంగ స్త్రీల పట్ల ప్రదర్శింపబడుతున్న ద్వేష భావాన్ని ప్రేమగా మార్చటం అన్నది చాల కష్టమైన విషయం. అయినప్పటికీ అవేం అసాధ్యమైన పనికాదు.
వికలాంగ స్త్రీలు ఏమి చేయగలరు
గొంతు విప్పి మీ హక్కుల కోసం పోరాడండి. వైకల్యానికి సంబంధించిన విషయాలకు ప్రాముఖ్యత వచ్చేలా చేయండి.
మార్కెట్లో చిన్న వ్యాపారంతోనే భద్రతను సాధించుకోవటం ఒపాన్స్లోవ్ అనే స్త్రీ జింబాబ్వే పౌరురాలు. అమె చక్రాల కుర్చీని ఉపయోగిస్తుంది. ఆమె ఇపుడు సమాజంలో ఒక గౌరవనీయ సభ్యురాలుగా గుర్తింపు పొందింది. ఆమె కూరగాయలు, టమాటోలు అమ్మే ఒక చిన్న పథకాన్ని మొదలు పెట్టింది. సమాజంలోని అనేక బృందాలు ఆమె దగ్గరే కూరగాయలు కొనటం మొదలు పెట్టాయి. స్థిరంగా వచ్చే ఆ ఆదాయంతో ఆమె ఒక ఇల్లు సంపాదించుకోగలిగింది. |
ఒలంపిక్ స్థాయి ఆటలు
|
మూఢ నమ్మకాలకు తెరదించిన బౌలర్ ఉగాండాకు చెందిన కాన్ స్టెన్స్ సిబాండా అనే అంధ బౌలర్ ఆ సంవత్సరానికి స్పోర్ట్స్ పర్సన్ గా నియమించబడటం గుడ్డి నమ్మకాలకు తెరదించటమే, కేవలం ఒక వికలాంగురాలిగా ఆమె సుదీర్ఘ కాలం నిరుపయోగంగాను, చనిపోయిన వారితో సమంగాను పడి వుండటం జరిగింది. ఆమె ఒక ప్రపంచ పోటీలో రెండు గోల్డ్ మెడల్స్ (బంగారు పతకాలు)ను సాధించింది. అమె అప్పట్నుంచీ ఆమె దక్షిణ ఆఫ్రికా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో జరిగిన పోటీలలో అంధ బౌలింగ్ కు గాను ఎన్నో పతకాలను సాధించింది. ఇతర బాలికలను, స్త్రీలను కూడ తమలో దాగి వున్న ప్రతిభను ప్రదర్శించమని సవాలుగా చెప్పింది కాన్ స్టెన్స్. |
అందరూ కలిసి చర్చించుకొని, అందరికీ మేలు జరగటానికి మీ సమాజంలో ఏఏ విషయాలలో మార్పులు చెయ్యాలో నిర్ణయించు కోవాలి. జీవితాలు మెరుగు పరుచుకోవటానికి ఉదాహరణగా ఇలా చెయ్యొచ్చు.
బృందాలుగా ఏర్పడి సంఘటితంగా పోరాడటం వల్ల మేలు జరుగుతుంది
వికలాంగులు కార్యాలయాలకు ఇతర నడుపుకోగలుగుతున్నాం. సమాజ సేవా సంసలకు ఆటంకం లేకుండా చేరగలిగే విధంగా నిర్మాణాలుండాలి.
సౌకర్యం కోసం అవగాహనను పెంచటం భారతదేశంలో ఒక రాష్ట రాజధాని అయిన బెంగుళూరులో చక్రాల కుర్చి ఉపయోగించే మహిళ డరోతి, ముఖ్యమంత్రి ఆఫీసులు గల భవనానికి వెళ్ళింది. అక్కడ చక్రాల కుర్చీ నడిపించుకు వెళ్ళే స్లోప్ సౌకర్యం కనిపించలేదు. ప్రవేశ ద్వారం కూడ ఆమె ప్రవేశానికి చాల ఇరుకుగా అనిపించింది. డరోతి ఈ విషయాన్ని అక్కడున్న గార్డులతో మాట్లాడింది. తనకు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇవ్వాలని పట్టుపట్టింది ఆమె. తర్వాత ఆమె వందలాది ఇ-మెయిల్స్ ఈ విషయమై ఎందరికో పంపించింది. సమస్య అందరినీ చేరటంతో ఒత్తిడి వల్ల ప్రభుత్వం గత్యంతరం లేక మార్పులు చేసింది. మరొక సందర్భంలో డరోతి క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళింది. అక్కడ పోలీసులు "ఎందుకు మేడమ్ ఇక్కడ వరకూ రావటం, హాయిగా ఇంట్లో కూర్చొని టీ.వీలో చూడవచ్చు కదా!" అన్నారట. ఆమె నెమ్మదిగా సమాధానమిచ్చింది. "ఇతరులందరిలాగానే నేను మ్యాచ్ ను లైవ్ గా చూద్దాం అని వచ్చాను" అని. |
అంగవైకల్యం - కుటుంబ పాత్ర
ఒక అంగవైకల్యం గల స్త్రీ యొక్క ఆరోగ్య స్థితి, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర వ్యక్తులు ఆమె పట్ల చూపే ఆదరణ లేక నిరాదరణలపై ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా వారికి సహాయపడ వలసిన వ్యక్తుల ప్రవర్తనపై ఆధారపడి వుంటుంది. వైకల్యం గల ఆడపిల్ల తనంతట తాను బ్రతకలేక ఎవరికీ ఏ పనిలోను సహాయ పడక, ఇంట్లో ఒక నిరుపయోగమైన వస్తువుగా చూపబడుతుంది తరచు. అన్ని విషయాలలోను కుటుంబ సభ్యుల చిన్నచూపుకి గురవుతూ వుంటుంది ఆమె అటువంటి వికలాంగ కుటుంబ సభ్యురాలిని కలిగి వుండటం నామోషీగా భావించి, నలుగురి కంట పడకుండా విసిరేసినట్లు ఓ మూలన పడేస్తారు. ఆమె వైకల్యానికి సంబంధించిన సమస్య బాధ కూడ చిన్నవే. అయిన వారి నిరాదరణే పెద్ద సమస్యగా తయారయి ఆమె మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తినటం జరుగుతుంది. నిస్సహయులిని నిరాదరించటమే వైకల్యం.
ఆదరణ, ప్రేమలతో విశ్వాసం క్రిస్టిన్ కు 13 ఏళ్ళ వయసులో వచ్చిన వ్యాధి వల్ల ఆమె కాలును తొలగించవలిసి వచ్చింది. దానితో తన కలలన్నీ ముగిసి పోయాయని భావించింది క్రిస్టిన్. కానీ తల్లితండ్రులు తనపట్ల చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ ఆమెలో తిరిగి జీవితం పట్ల ఒక విశ్వాసాన్ని నింపాయి. మొదట్లో తల్లితండ్రులు విపరీతమైన శ్రద్ధ వహించటాన్ని క్రిష్టిన్ ఇష్టపడలేదు. తనను కూడ మిగతా అక్కచెల్లెళ్ళను చూసినట్లే చూడమని పట్టు పట్టింది. ఎక్కువ ప్రతిభను కనబరిచినందుకు బహుమతులు పొంది కాలేజీ చదువు పూర్తి చేసింది క్రిష్టిన్ ఆమెలో వచ్చిన మార్పు ప్రతిభను గుర్తించిన తర్వాత తెలిసింది కుటుంబ సభ్యులకు, మిగతా సమాజానికి కూడ, ఆమె కాలులేని లోటు ఆమె కన్న కలలను నెరవేర్చుకోవటంలో ఆటంకం కాలేదని. |
వైకల్యగ్రస్తుల పట్ల పెంచుకొన్న దురభిప్రాయాలలో మార్పు రావాలంటే, అందుకు సామాజిక స్పృహ అవగాహన చాల అవసరం. అంగ వైకల్యం గల స్త్రీలకు, బాలికలకు కూడ మంచి ఆహారం, చదువు, ఆరోగ్య సంరక్షణ, సహజపరమైన అన్ని కార్యకలాపాల లోను పాల్గొనే అవకాశం చాల అవసరం. "మానసిక ఆరోగ్యం" సంరక్షకులకు తోడ్పాటు అన్న అధ్యాయాలు చూడండి.
ఎన్నో ప్రతిభలను, నైపుణ్యాలను సాధించవచ్చు లావోస్ కు చెందిన హాంగ్హా కు, 2 సంవత్సరాల వయసు అపుడు పోలియో వ్యాధి సోకటం జరిగింది. ఆమె కుటుంబ సహకారంతో, విశ్వవిద్యాలయం నుంచి ఫ్రెంచి డిగ్రీ సంపాదించగలిగింది. ఆమెకు ఉద్యోగం దొరకక కుట్టటం నేర్చుకొని, ఇంటి దగ్గరే కుటు షాపును ప్రారంభించింది హాంగ్హా, కుట్టుతో పాటుగా ఆమె ఇంగ్లీషు భాష నేర్చుకోవటం మొదలు పెట్టింది. ఒక స్నేహితురాలితో కలిసి హాంగ్హా ఒక చిన్న ఇంగ్లీష్ శిక్షణా కేంద్రాన్ని కూడ ఇంటి దగ్గరే ప్రారంభించింది. వైకల్యం గురించిన ఒక కార్యక్రమంలో ఆమె సమన్వయకర్తగా వ్యవహరించటం విశేషం. |
బాల్యం నుంచే సహాయపడటం
పిల్లలు పసితనం నుంచే శారీరక కదలికలతో తమకు కావలసిన అవసరాలను తెలియ పరచటం, మానసికంగా అలా తెలియ పరచాలని అనుకోవటం నేర్చుకుంటారు. బాల్యదశలో నేర్చుకున్నంత త్వరగా జీవితంలో మరేకాలంలో నేర్చుకోరు. పిల్లలు పుట్టగానే, అంటే తొలిదశ నుండి కూడ తమ చుట్టూ పరిసరాల నుంచి నేర్చుకోవటం మొదలు పెడతారు. అందువల్ల వికలాంగ శిశువుల తల్లితండ్రులు మరింత శ్రద్ధగా వారి సంరక్షణను చూసుకోవాలి. అది కూడ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది.
పిల్లలు నేర్చుకొనే ప్రతి కొత్త విషయం కూడ అంతకు ముందు తెలిసి వున్న వాటిపైనే ఆధారపడి వుంటుంది. నేర్చుకొనే వరుస క్రమంలో తేలికైన వాటి నుంచి కష్టమైనవి కూడ నేర్చుకోవటానికి తాపత్రయ పడటం గమనించవచ్చు మనం. అందువల్ల అసలు నేర్పటం, శిక్షణ అంటూ ఆరంభించినటైతే వారు ఒక్కోదశను జయప్రదంగా దాటుకొని ముందుకు వెళ్ళ గలుగుతారు.
వికలాంగ పిల్లల తల్లితండ్రులతో సహాయక బృందాల ఏర్పాటు - ప్రయోజనం
వికలాంగ పిల్లల తల్లులను వారి జీవిత భాగస్వాములు విడిచి పెట్టటం జరుగుతుంది తరచు. అటు వంటి సందర్భాలలో తల్లలే ఆ పిల్లల పెంపక బాధ్యత వహించవలసి వుంటుంది. తల్లితండ్రుల సహాయ బృందాలు వికలాంగ స్త్రీలకు సహాయపడినట్లే, వికలాంగ బాలికలకు కూడ వారు ఎదిగే క్రమంలో ఎదుర్కొనే సమస్యల ననుసరించి సలహాలను, సహాయాన్ని అందజేస్తాయి. ఇందువలన ఆ ఆడపిల్లల తల్లలకు ఒక విశ్వాసం, ధైర్యం కలుగుతాయి.
అదే విధంగా వికలాంగ యువతులకు సహాయ బృందాలను ఏర్పరచటం వల్ల, వారు ఒకరికొకరు సహాయ పడగలుగుతారు.
వైకల్యం - సమాజం బాధ్యత
సమాజపరంగా ఏర్పడిన బృందాలు, అంగవైకల్యం గురించిన సంగతులన్నింటిని ప్రభుత్వానికి, ఆరోగ్య కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వేతర పునరావాస కార్యకర్తలకు సమాజంలోని నాయకులకు వివరించటం జరుగుతుంది. ఇంకా వీధి నాటకాలు ప్రదర్శించి, చర్చలు జరిపి, ఇతర పద్ధతుల ద్వారాను, వైకల్యం లేని వ్యక్తులు పొందే. విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలు మొదలైన అన్ని హక్కులూ వికలాంగులు కూడ పొందాలన్న విషయాన్ని తెలియ పరచవచ్చు. అలాగే సమాజాలు ఉద్యోగ అవకాశాలను సృష్టించి ఇవ్వవచ్చు. వికలాంగ స్త్రీల కోసం అందింపబడే సేవలను గురించిన సమాచారం కూడ ఇయ్యవచ్చు.
తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు తమను గుర్తించి, మనుషులుగా అంగీకరించి ఆదరించినటైతే, వికలాంగ స్త్రీలు, బాలికలు ఆత్మవిశ్వాసం కలిగి, సాధించగలం అన్న ఒక నమ్మకంతో జీవించగలుగుతారు,
విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ అందించటమే కాకుండా విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రార్ధనా మందిరాలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు మొదలైనవన్నీ ప్రతి ఒక్క వ్యక్తి వినియోగించుకొనేలా వీలు కల్పించినటైతే వారి శక్తి మేరకు కృషి చేసి తమలోని ప్రతిభను చూపగలుగుతారు.
విద్య
వికలాంగ బాలికలకు అక్షరాస్యత చాల అవసరం. అంధులకు, వినికిడిశక్తి లోపం గలవారికీ సహాయకరమైన సంకేతపరమైన భాష, బ్రేయిలీ లేక ఆడియో క్యాసిట్లు అందుబాటుగా వుండి వారి శిక్షణకు ఉపయోగపడాలి.
చాలా పేద దేశాలలో వికలాంగ బాలికలు గనుక పాఠశాలకు పోయిచదువుకోనటైతే, వారు పెద్దగా పెరిగేక బిచ్చగత్తెలుగా మిగిలిపోవలిసిందే.
ఒక కమ్యూనిటీలోని వ్యక్తులంతా, వికలాంగులకు చదువుకొనే హక్కుల కోసం కృషి చేసినటైతే వారిస్థితిలో చాల పెద్ద మార్పు రావచ్చు.
కమ్యూనిటీ ఆధారంగా ఏర్పడిన బృందాలు, సమస్యల గురించి చర్చించుకొని, ఇతర పిల్లల్ని ఇంకా అందర్నీ కూడ వికలాంగ ఆడ పిల్లలకు ఆదరణను, గౌరవాన్ని అందించేలా ప్రోత్సహించవచ్చు. అంతేకాకుండా వారికి బాల్యం నుంచీ ప్రాథమిక విద్య అందుబాటుగా వుండేలా చూడటం. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంగా ఆర్థిక సహాయం లేక ఇతరత్రా సహాయం అందేలా కూడ చేయవచ్చు.
వికలాంగ బాలికలు చదువుకోవటం వల్ల వారి కమ్యూనిటీకి ఆధారంగా నిలబడి, ఆర్థికంగా ఆదుకోగలుగుతారు.
సమాజపరమైన సౌకర్యాలు అందరికీ అందుబాటుగా ఉంచటం
ప్రపంచ వ్యాప్తంగా వికలాంగ స్త్రీలు అందరూ, సమాజపరమైన సౌకర్యాలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వ్యాపార కూడలులు (మార్కెట్లు), నగర వీధులు, బస్లు మరియు చేయూతకు కమ్యూనిటీలు వికలాంగులైన వారందరికీ సులభంగా అందుబాటులోనికి వచ్చేటందుకు సహాయపడటంలో పెద్దఎత్తున కృషి చేస్తున్నారు.
వికలాంగులు వినియోగించుకొనే రీతిగా భవనాల నిర్మాణాన్ని రోడ్ల తయారీని చేయాలి ముందుగానే, తర్వాత మార్పులు చేర్పులు చెయ్యకుండా, ఈ విధంగా ప్రతి వ్యక్తికీ వివక్ష లేకుండా ప్రజా సౌకర్యాలన్నింటినీ అనుకూలంగా, అందుబాటుగా వుండేలా కృషి చేయటం వల్ల ఎందరికో ప్రయోజనం కలుగుతుంది. వయస్సు, స్థితి, వికలాంగులా కారా? అన్న వ్యత్యాసం లేకుండా, వీలైనంత ఎక్కువ మంది, వీలైనంత అధికంగా వినియోగించుకొనే తీరుగా వుంటాయి. యువత అయినా ముసలివారైనా, ఒకే విధంగా సౌకర్యం పొందవచ్చు ఈ మెళుకువ వల్ల నేను చాల నిస్సహాయురాలినై పోయి బాధపడుతున్నాను.
ఇలా భవనాల నిర్మాణం, వ్యాపార కూడలుల నిర్మాణం వికలాంగులు తమంత తాము తిరుగగల విధంగా వున్నటైతే, ప్రతి ఒక్కరూ సమాజ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు.
'అనూకూలం' అన్న పదం కేవలం భవనాల నిర్మాణాలకు రాంప్లు వుండటం మొదలైనవాటి వరకే కాదు. వారుకూడ తమ భావాలను ఇతరులతో పంచుకోగల పరిస్థితులు వండాలి. అలాగే ఎక్కడ ఏమి జరుగుతుందో, తమకు ప్రభుత్వం నుంచి ఏఏ సహాయాలు లభించనున్నాయో తెలుసుకోగల పరిస్థితి వుండాలి కమ్యూనికేషన్ పరంగా, అందువల్ల వారు సమాజ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొన గలుగుతారు. వైకల్యం అనగానే దురభిప్రాయాలు ఏర్పడి వుంటాయి వ్యక్తుల మనసులలో, వీరి చురుకుతనం, తెలివి తేటలు చూసిన తర్వాత ఆ అభిప్రాయాలు మారిపోవటం జరుగుతుంది. జీవితంలో జరిగే దురదృష్టకర సంఘటనలలో వైకల్యం కూడ ఒకటి అని, అదే జీవితంలో ఒక భాగమేనని అందరూ అర్థం చేసుకోవటం జరిగినపుడు, వికలాంగ స్త్రీలు కూడ సంఘంలోని విలువైన సభ్యులుగా గుర్తింపబడుతారు. అపుడు వైకల్యం పట్ల సమాజ దృక్పథంలో మార్పు కలుగుతుంది.
ప్రభుత్వాలు, రవాణా వ్యవస్థను, భవనాలను, ప్రజా కార్యక్రమాలను, ఇంకా ఇతర సౌకర్యాలను అందరికీ ఉపయోగ పడేలా, ముఖ్యంగా వికలాంగ స్త్రీ లకు ఈ విషయంలో తోడ్పడాలి తప్పనిసరిగా, సహకరించని వారిని శిక్షించాలి కూడ.
ప్రభుత్వం మార్పులు చేసే బధంగా చేయటం
|
స్త్రీలు కృషి చేస్తే ఫలితం సానుకూలం
యూనివర్సిటీ లో ఆఖరి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆమె ఒక వికలాంగ స్త్రీల బృందాన్ని కలుసుకోవటం తటస్థించింది. మార్పు కోసం కృషి చేస్తున్న ఆ బృందం పేరు “ఫ్రీ ఆక్సిస్” అందరి లాగే తమకు హక్కులన్నీ వర్తిస్తాయన్న విశ్వాసంతో తమ కమ్యూనిటీలను మరింత మెరుగు పరుచుకోవాలన్న ఆశతో ఆ బృందం పని చేస్తుంది. ఫ్రీ ఆక్సిస్ కు చెందిన స్త్రీలు వివిధ సంస్థల ఉన్నతాధికారుల దగ్గరకు నేరుగా వెళ్ళి వారితో చర్చలు జరిపి, వికలాంగ వ్యక్తుల జీవితాల్ని మెరుగు పరిచే దిక్కుగా వారు పని చేసేలా, మార్పులు తెచ్చేలా చేయటం వారి దిన చర్యగా మార్చుకున్నారు. ఉదాహరణకు, వారి నగర రవాణా సంస్థ డైరెక్టర్ ను కలుసుకొని, వారు వికలాంగ వ్యక్తులకు మిగతా వారిలా తిరగటం చాల కష్టమనీ, వారి రవాణా సౌకర్యం కోసం సహాయ పడమని కోరగా, అతడు అందుకు సంతోషంగా అంగీకరించి చాల బస్ లను వారి సౌకర్యార్థం నిర్దేశించటం జరిగింది. అలీషియా కూడ మార్పు కోసం కృషి చేయటానికి నిశ్చయించుకొంది. యూనివర్సిటి డైరెక్టర్ ను కల్సుకొని, తన క్లాస్ రూమ్ ను మూడవ అంతస్తు నుంచి క్రిందకు మార్చమని అడిగింది. అతడు వెంటనే ఒప్పకొన్నాడు. అందుకు వేరే గది వుందని చెప్పి మార్చటం జరిగింది. "వికలాంగులకు పైకి ఎక్కటం చాల కష్టమన్న ఆలోచన అతడికి ఎన్నడూ రాలేదు. అతడిని అడగవచ్చని నేనూ ఎన్నడూ భావించలేదు.” అంది అలీషియా, అటు తర్వాత ఆమెకు పైకి పాక్కొంటూ వెళ్ళే కష్టం తీరిపోయింది. |
ఉన్న పద్ధతులను మార్చటం అన్నది సులువైన పనేంకాదు. అది చాల సమయం తీసుకోవటమే కాకుండా, చాల చిక్కులతో కూడుకొన్నది కూడ. మార్పు అన్నది జరగటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఎందరో వ్యక్తుల యొక్క ఎంతో కృషి అవసరం దానికి. దానికయ్యే మూల్యం, అందువల్ల వ్యక్తులు పద్ద ఇబ్బందులు చేయాలనుకున్న మార్పులను అల్లుకొని ఉన్న రాజకీయాలు, ఎన్నో వుంటాయి. ఒక మార్పు కోసం ప్రయత్నించేటపుడు నిరాశ చెందటం అన్నది చాల సహజం. నిరాశా నిస్పృహలకు గురైనపుడు, దేశంలో మరో ప్రాంతానికి చెందినగాని, మరో దేశానికి చెందిన వారైన గాని ఇతర వికలాంగ స్త్రీలను సంప్రదించి, వారి సలహా తీసుకోవటం ప్రయోజనకరంగా వుంటుంది. మీకు సమాజ పరమైన ప్రజా సౌకర్యాలన్నింటిని పొందే హక్కు వుందని గుర్తుంచుకోండి. మీకు అనూకూలమైన సమాజాన్ని మీరు నిర్మించుకోగలరు. తమ నగరంలో గొప్ప మార్పులను తెచ్చిన ఒక వికలాంగ బృందం కథ ఇది.
ఒక నగరాన్ని అనుకూలంగా మార్చుకోవటం
కాని ప్రభుత్వం తమ కోసం మార్పులు చేపట్టినప్పటికీ అవి తమకు ఇంకా కష్టతరంగానే వున్నాయి వినియోగానికి చక్రాల కుర్చీలు, క్రెచెస్ ఉపయోగించే ఒక వికలాంగుల బృందం తెలుసుకోవటం జరిగింది. మార్పు చేసిన చాల ప్రదేశాలు నిరుపయోగమే అయ్యాయని వారు బాధ పడ్డారు. అందు వల్ల వికలాంగ వ్యక్తుల సబకారం లేనిదే ప్రభుత్వం ఆ పనులు చేయలేదని వారికి అర్థం అయింది. అందుకోసమే వికలాంగులందరూ కలిసి 'ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ సోసైటీ'గా ఏర్పడటం జరిగింది. వారు నగరం లోని ఎక్కువ ముఖ్యమైన తమకు వినియోగించుకొనేందుకు అత్యవసరమైన ప్రాంతాల జాబితాను తయారు చేశారు. నగర అధికారులను కలిసి, వారికి ఆ జాబితాను చూపారు. అపుడు అధికారులు కూడ తమకు, వికలాంగ వ్యక్తుల సలహా అవసరంగా అర్థం చేసుకున్నారు. వారు తాము ఏర్పరచిన సంస్థలో సభ్యులు, సిటీ కమిటీలో వుండేలా చూసుకున్నారు. అందువల్ల ఆ మార్పుల కార్యక్రమాలు సక్రమంగా జరిగే అవకాశం వుంటుందని వారిఆశ. కాని కమిటీ తలపెట్టి చేయాలని నిర్ణయించిన ఏ పథకానికైనా, వికలాంగ సభ్యులు సమ్మతి తెలిపి తీరాలి. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ సంస్థ, బిల్డింగులకు మార్పులను చేసే పని వారికి మార్గదర్శక సలహాలను ఇస్తుంది. మార్పులు చేయ దలిచిన బిల్డింగుల ఫోటోలను తీసుకొని, చేయవలిసిన మార్పులను వివరంగా బొమ్మగీసి ఇస్తారు వారు. ప్రస్తుతం అక్కడ పాత భవనాలన్నింటిని మారుస్తూ వున్నారు నెమ్మదిగా, క్రొత్తగా తయారయ్యే భవనాలు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కృషి తో వికలాంగ వ్యక్తులకు సౌకర్యంగానే తయారవుతున్నాయి. వీల్ ఛెయిర్లు ఉపయోగించే వారి కోసం పేవ్ మెంట్లు ఎత్తుతగ్గాయి. మార్కెట్లు, స్కూళ్ళు సినిమా థియేటర్లు చాల వరకు వారి వినియోగానికి అనుకూలంగా మారిపోయాయి. |
తీసుకోవల్సిన చర్య
ఉగాండాలో మార్పు కోసం వనరుల ఏర్పాటు
|
ఎల్ సాల్వడార్ లో మార్పు సాధించిన మహిళలు
అక్షరాస్యతను కలిగించే కార్యక్రమాలను, నాయకత్వపు శిక్షణను ఇవ్వటం కూడ చేస్తారు. ఏ రకమైన వైకల్యం ఉన్న వారికైనా సహాయాన్ని అందించటం, స్త్రీలకు, బాలికలకు సహాయాన్ని సేవలను అందించటం చేస్తారు. అ సాంఘిక పరమైనగాని, వైకల్య పరమైనగాని వివక్షతను అరికట్టటం కూడ వారి కార్యక్రమమే. |
ప్రతి ఒక్కరిని చేర్చుకుంటే కమ్యూనిటీ శక్తివంతం
నిర్లక్ష్యం, దురభిప్రాయాలు, వివక్షత వంటి అడ్డంకులు వున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా వికలాంగ స్త్రీలు, తమ లోని ప్రతిభకు సానపట్టి స్వయం సమృద్ధిని సాధించేదిశగా పయనిస్తున్నారు.
వికలాంగ స్త్రీలు కేవలం తమ వైకల్యాలకు సంబంధించినంత వరకే కాకుండా, అన్ని స్థాయిలలోను వివిధ రంగాలలో ఏమి జరుగుతుంది అన్న వార్తలు తెలుసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు - పురుషులు, వైకల్యం కలవారు - లేనివారు అందరూ కూడ మానవ హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, ఇంకా స్త్రీల గౌరవం కోసం పోరాడుతూ వుంటారు. వారందరూ కూడ వికలాంగ స్త్రీలు ఆరోగ్యంగా, స్వతంత్రంగా, సంతానం కలిగి పిల్లలతో కలిసి జీవించటానికి వారికి మద్దతునివ్వాలి. మనందరికీ ఒకలా జీవించే విధానం తెలిసినా, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవటం ద్వారా ఇంకా మెరుగైన జీవితాన్ని సంఫూన్ని ప్రపంచాన్ని ఏర్పరుచుకోగలుగుతాం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020