অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానసిక వ్యాధికి మందులు

సరైన మందును ఎంపిక చేసుకోవడంః వెల, సామర్థ్యం

ప్రపంచమంతటా ఆరోగ్య సంరక్షణ ఖరీదు పెరుగుతూంది. ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో దీని అర్థం ఏమందును రాయాలో ఎంపిక చేసే విషయంంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం. చాలా కొత్తమందులు అంతర్జాతీయ హక్కుల చట్టాలతో రక్షింపబడుతున్నాయి. దీని అర్థం కేవలం ఒకే ఒక్క మందుల కంపెనీకి కొంత సమయ పరిమితి వరకు ఆ మందును ఉత్పత్తి చేయడానికి అనుమతి లభిస్తుంది. ఎప్పుడూ ఈ మందులు పాతమందులకంటే చాలా ఎక్కువ ఖరీదుగా వుంటాయి. పాత, తక్కువ ఖరీదు మందును ఉపయోగించాలా లేక కొత్త, ఎక్కువ ఖరీదు మందును ఉపయోగించాలా అనే నిర్ణయం చేసేటప్పుడు ఈ క్రిందివాటిని పరిగణనలోకి తీసుకోవాలి.

  • మందు ఖరీదు
  • మందుసనిచేసే సామర్థ్యం
  • రాగల ఇబ్బందులు
  • కుటుంబపు ఆదాయం
అలా, మానసిక వ్యాధి లక్షణాల్ని తగ్గించడానికి పాతమందుకంటే ఎక్కువ బాగా పనిచెయ్యని కొత్తమందుకు తక్కువ ఇబ్బందులు రావొచ్చు. ఇది కొంతమందికి చాలా ముఖ్యం కావొచ్చు. ఉదాహరణకు పాత ఏంటీసైకాటిక్ మందులు ఎక్కువ బిగుతును, చాంచల్యాన్ని కలగజేయొచ్చు. పాతమందును వాడుతున్న వ్యక్తి ఎంత చంచలంగా వుంటాడంటే అతను తను పని చెయ్యలేనని, అందుచేత ఏమీ సంపాదించలేనని అనుకుంటాడు. మరోవైపు కొత్త ఏంటీసైకాటిక్మందును తీసుకుంటున్న వ్యక్తి ఎక్కువ డబ్బును ఖర్చు చెయ్యొచ్చు, కాని పాత మందును తీసుకుంటున్న వ్యక్తి కంటే బాగా పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించగలగడం వలన మందుల్ని కొనడానికి పాత మందుల్ని వాడేవారికంటే ఎక్కువ స్టోమతు వుంటుంది. మందుల్ని ఎంపిక చేసేటప్పుడు ఈ క్రీంద సందర్భాలు ఎదురవవొచ్చు
  • కొత్త, ఎక్కువ ధర మందుకంటే పాత, తక్కువ ధర మందు బాగా లేక దానితో సమానంగా పని చేస్తుంది, ఇబ్బందుల విషయంలో రెండిటికీ తేడా లేదు. పాత, చవక మందునే ఉపయోగించండి. మానసిక వ్యాధుల మందులకు ఒక మంచి ఉదాహరణ, రెండు టైసైక్లిక్ ఏంటీడిప్రెసెంట్స్ ఎమిట్రిప్టిలిన్ లేక నార్ట్రిష్టిలిన్ ని ఎంపిక చెయ్యడం. మొదటి మందు రెండోదానికంటే చవక, కాని రెండో మందు అంత బాగానూ పనిచేస్తుంది, రెండిటికీ ఒకేమాదిరి సమస్యలు వస్తాయి. అందువలన మీరు ఎమిట్రిష్టిలిన్ని వాడాలి. చాలా అతికొత్త ఏంటీసైకాటిక్ మందులు సామర్థ్యం, ఇబ్బందుల విషయంలో కొంతకాలం క్రింద ఉత్పత్తి చెయ్యబడ్డ పాత మందులకి భిన్నంగా ఉండవు. వాటిని సూచించవద్దు.
  • పాత, చవక మందు కొత్త, ఖరీదైన మందుతో సమానంగా పనిచేస్తుంది, కాని పాతమందుతో ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. దీనికి మంచి ఉదాహరణ, ఎమిట్రిప్టిలిన్ లాంటి పాత ఏంటీడిప్రెసెంట్, ఫ్లోక్సిటిన్ లాంటి కొత్త ఏంటీడిప్రెసెంట్, రెండిటి మధ్య ఒక దాన్ని ఎంపిక చెయ్యడం. మొదటిది రెండవదానితో సమానంగా పని చేస్తుంది, కాని, మొదటిమందుకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందుల వలన మొదటి మందును వాడేవారిలో ఎక్కువమంది మధ్యలో మానేసే అవకాశం ఎక్కువ. దీనికి మరొక ఉదాహరణ, హాలొపెరిడాల్ లాంటి పాత ఏంటీసైకాటిక్ మందుకు, రిస్పెరిడాన్ లాంటి కొత్త ఏంటీసైకాటిక్ మందుకు మధ్య ఎంపిక చెయ్యడం. మీకు రెండు అవకాశాల లభ్యత వుంటుంది. కొత్త మందును స్టోమతు వున్నవారికి రెండు మందుల గురించి చెప్పి, ప్రతిదానికి ఉన్న లాభనష్టాల గురించి వివరించండి. ఆవ్యక్తికే ఎంపిక చేసుకునే స్వేచ్చనివ్వండి. అలాకాక, ఆవ్యక్తి పేదకుటుంబానికి చెందినవాడైతే, పాతమందునే సూచించండి. ఆవ్యక్తి ఎలా కోలుకుంటున్నాడో పర్యవేక్షించండి; తీవ్రమైన ఇబ్బందులు వస్తే, కొత్తమందుకు మార్చండి.
  • కొత్త, ఖరీదైన మందు పాతమందుకంటే బాగా పనిచేస్తుంది. ఈ సందర్భంలో మీరు కొత్తమందునే సూచించండి. కాని ఆవ్యక్తికి కొత్తమందునుకొనే స్టోమతు లేకపోతే, పాతమందును ప్రయత్నించి చూడండి. అది పని చేస్తూంటే ఇంక మందును మార్చాల్సిన పనిలేదు. ఒక వేళ పాత మందు పని చెయ్యకపోతే, కొత్తమందును వాడడంతప్ప గత్యంతరం లేదు. దీనికి ఉదాహరణ, పాత ఏంటీసైకాటిక్మందులు, కొత్త ఏంటీసైకాటిక్ మందుల మధ్య ఎంపిక చెయ్యడం. ఆ విధంగా షిజోఫ్రినియాకు రిస్ పెరిడోన్ క్లోర్ప్రోమజిన్ కంటే బాగా పనిచేస్తుంది.
మానసిక వ్యాధికి అవసరమైన మందుల జాబితా

సోడియం వాల్ల్పోయేట్ • లేక కార్బమజిపిన్ ప్రోసైక్లిడిన్ లేక బెంజ్ హెక్సాల్, లేక బెంజొట్రోసిన్ రిస్పెరిడోన్ లేక ఒలాన్షపిన్ ఫ్లోక్సిటిన్ లేక సెర్టలిన్ (రెండూ సాధ్యం కాకపోతే, ఎమిట్రిప్టిలిన్ • లేక ఇమిప్రమిన్) ఏంటీసైకాటిక్ ఇంజక్షన్ (ఉదా. ఫూఫెనజిన్ డెకనొయేట్) డయాజిపామ్ • లేక నైట్రజిపామ్ ధయమిన్

  • ఈ గుర్తు వున్న మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురణ “అవసరమైన మందుల జాబితా" 11 వ ముద్రణలో ఇవ్వడం

మానసిక వ్యాధులకు వాడే మందులకు ఒక సత్వర అన్వేషణ మార్గదర్శిక

పట్టిక రెండవ వరసలో మీరు మందుల స్థానిక పేర్లను, వాటి ఖరీదును నమోదు చెయ్యవచ్చు. మందుల ప్రతి సంపూర్ణం కాదు. సర్వసాధారణంగా వాడే, బాగా గుర్తించగల మందుల్ని మాత్రమే చేర్చడం జరిగింది. ఐనప్పటికి మందుల ప్రతి విభాగం తరువాత మీ ప్రాంతంలో దొరికే ఇతర మందులను చేర్చడానికి ఖాళీ చోటును ఉంచడం జరిగింది. మానసిక వ్యాధి, చికిత్సకు అందుబాటులో ఉంచవలసిన మందుల జాబితాను ఇవ్వడం జరిగింది.

రాగల ఇబ్బందులు

తక్కువ శక్తివంతమైన మందులు : ఈ మందులను ఇబ్బందులు కలిగే ప్రమాదం తక్కువ ఉంటుంది. క్లోర్ ప్రోమజిన్.

సైకోటిన్, నిద్ర సమస్యలు ఉన్నవారికి రాత్రిపూట ఇస్తే నిద్రపోవడానికి సహాయపడుతుంది.

రాత్ర 25 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 200 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

బిగిసి పోవడం, నేరు ఎండిపోవడం, అలజడి, మగతగా వుండడం, బరువు పెరగడం, అకస్మాత్తుగా కుదుపుతో కదలడం

ఎక్కువ శక్తివంతమైన పాత ఏంటీసైకాటిక్ మందు : ఈ మందులకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఎక్కువ ట్రైప్లోపెరజిన్

తీవ్రమైన కల్లోలం ఉన్నప్పుడు ఉపయోగకరం, తక్కువ మగత వుంటుంది.

రాత్ర 5 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 10 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

క్లోర్ ప్రోమజిన్ కు వుండే ఇబ్బందులే వుంటాయి.

హోలోపెరడాల్

ట్రైప్లోపెరజిన్ కి వుండేవే

రాత్ర 5 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 10 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ట్రైప్లోపెరజిన్ కి వుండేవే

లోక్సపిన్

ట్రైప్లోపెరజిన్ కి వుండేవే

రాత్ర 20 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 100 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ట్రైప్లోపెరజిన్ కి వుండేవే

పిమోజైడ్

మోనోసింప్టమేటిక్ డెల్యూజినల్ పైపోఖోండ్రియాసిస్ లో ఉపయోగించవచ్చు.

రాత్ర 2 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 8 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ట్రైప్లోపెరజిన్ కి వుండేవే, .సి.జి. లో అసహజ మార్పులు

రిస్ పెరిడోస్

శక్తివంతమైన మందు, తక్కువ ఇబ్బందులు వుంటాయి.

రాత్ర 2 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 6 మి.గ్రా. వరకు పెంచండి.

మగత, అలజడి, కల్లోలం

ఓలంజపిన్

రిస్పెరిడోస్ కి వుండేదే

రాత్ర 2.5 మి.గ్రా. తో మొదలు పెట్టండి, 20 మి.గ్రా. వరకు పెంచండి.

మగత, బరువు పెరగడం

క్లోజపిన్

శక్తివంతమైన మందు. ఇతర మందులకు నయం కాని వారికి ఉపయోగకరంగా వుంటుంది. నిపుణుల సలహాతోనే వాడాలి.

రాత్ర 50 మి.గ్రా. తో మొదలు పెట్టండి, అంచెలంచెలుగా ప్రతీ 2-3 రోజులకు 50 మి.గ్రా. చొప్పున 200-300 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం వలన బరువు పెరగడం, చొంగ ఎక్కువగా కారడం పుంటాయి. వారానికొకసారి రక్తకణాల సంఖ్యను పరీక్షించండి.

ఏంటీసైకాటిక్ (డిపో) ఇంజక్షన్లు : తప్పనిసరిగా ప్రతీసారీ ఇంజక్షన్ పూర్తి మోతాదును (అతి తక్కువ మొతాదు మందును ఇచ్చి రియాక్షన్ లేక ప్రతిచర్య వుందేమో చూడడం) ఇవ్వాలి. ప్లూపెస్థిక్జాల్ చెక్నొయేట్.

సిజోఫ్రినియా, దీర్ఘకాల చికిత్సకు కండరం లోపలికి ఇంజక్షన్ ని ఇవ్వొచ్చు.

ప్రతి 4 వారాలకు 12.5 – 200 మి.గ్రా

క్లోర్ ప్రొమజిన్ కు వుండే ఇబ్బందులే వుంటాయి.

ప్లూఫినజిన్ డెకనేట్

ప్లూపెన్థిక్జాల్ డెకనొయేట్ కి వుండేదే

ప్రతి 4 వారాలకు 6.25 – 75 మి.గ్రా

క్లోర్ ప్రొమజిన్ కు వుండే ఇబ్బందులే వుంటాయి.

హాలొపెరిడాల్ డెకనొయేట్

ప్లూపెన్థిక్జాల్ డెకనొయేట్ కి వుండేదే

ప్రతి 4 వారాలకు 12.5 – 100 మి.గ్రా

క్లోర్ ప్రొమజిన్ కు వుండే ఇబ్బందులే వుంటాయి.

జుక్లొపెస్థిక్జాల్ డెకనొయేట్

ప్లూపెన్థిక్జాల్ డెకనొయేట్ కి వుండేదే

ప్రతి 4 వారాలకు 12.5 – 400 మి.గ్రా

క్లోర్ ప్రొమజిన్ కు వుండే ఇబ్బందులే వుంటాయి.

సాధారణ మానసిక వ్యాధులకు ఏంటీడి ప్రెసెంట్ మందులు (పేనిక్ ఎటాక్స్, డిప్రెషన్, ఏంగ్డయిటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, వైద్యపరంగా వివరించలేని భౌతిక లక్షణాలు)

మందుల

స్థానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

రాగల ఇబ్బందులు

మందు పాత, చవక ట్రైనైక్లిక్ఎంటీడిప్రెసెంట్స్, కాని ఎక్కువ ఇబ్బందులు వుంటాయి, పనిచెయ్యటానికి అన్ని మందులకు 2 వారాలు పడుతుంది.

ఫ్లోక్సిటిస్

సాధారణ మానసిక వ్యాధులు

ఉదయం 20 మి.గ్రా. తో మొదలు పెట్టండి, ఉదయం 60 మి.గ్రా. వరకు పెంచండి.

నెర్వస్ నెస్, నిద్రలేకపోవడం, నిస్ర్తాణ, వికారం, విరేచనాలు, ఆకలి లేకపోవడం, లైంగిక ఆశక్తత

సెర్ట్రలిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 50 మి.గ్రా. తో మొదలు పెట్టండి, ఉదయం 200 మి.గ్రా. వరకు పెంచండి.

ప్లోక్సిటిన్ కి లాగానే

ప్లూవార్సమిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 100 మి.గ్రా. తో మొదలు పెట్టండి, ఉదయం 300 మి.గ్రా. వరకు పెంచండి.

ప్లోక్సిటిన్ కి లాగానే

పెరాక్సటిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 20 మి.గ్రా. తో మొదలు పెట్టండి, ఉదయం 60 మి.గ్రా. వరకు పెంచండి.

ప్లోక్సిటిన్ కి లాగానే. ఎక్స్ ట్రాపిరమిడల్ ఇబ్బందులు

పెన్లాపాక్సిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

37.5 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తో మొదలు పెట్టండి. 150 మి.గ్రా. రోజుకు పెండుసార్లు వరకు పెంచండి.

వికారం, మగత, తలతిరగడం, తలనెప్పి, గొంతు ఎండుకుపోవడం, రక్తపోటు పెరగడం, ఫిట్స్.

కొత్త, ఎక్కువ ఖరీదు ఏంటీడిప్రెసెంట్స్ (సెలక్టివ్ సీరోటోనిన్ రీఅప్టేక్ ఇన్షిబ్రిటర్స్, సంబంధిత విభాగాలు)

మందులు

స్ధానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

రాగల ఇబ్బందులు

ఏమందులు ఎక్కువ ఖరీదు, కాని తక్కువ ఇబ్బందులు వుంటాయి; పనిచేయ్యడానికి వీటికి కనీసం 2 వారాలు పడుతుంది

ఫ్లోక్సిటిన్

సాధారణమానసిక వ్యాధులు

ఉదయం 20 మి.గ్రా. తో మొదలు పెట్టండి; ఉదయం 60 మి.గ్రా. వరకు పెంచండి

నేర్వస్ నెస్, నిద్రలేకపోవడం, నిస్త్రాణ, వికారం, విరేచనాలు, ఆకలి లేకపోవడం, లైంగిక అశక్తత

సెర్ ట్రలిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 50 మి.గ్రా. తో మొదలు పెట్టండి; ఉదయం 200 మి.గ్రా. వరకు పెంచండి

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఫ్లూవాక్సమిన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 100 మి.గ్రా. తో మొదలు పెట్టండి; ఉదయం 300 మి.గ్రా. వరకు పెంచండి.

ఫ్లోక్సిటిన్ కి లాగానే

పెరాక్సటన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

ఉదయం 20 మి.గ్రా. తో మొదలు పెట్టండి; ఉదయం 60 మి.గ్రా. వరకు పెంచండి

ఫ్లోక్సిటిన్ కి లాగానే, ఎక్స్ట్రాపిరమిడల్ ఇబ్బందులు

వెన్లాఫ్లాక్సీన్

ఫ్లోక్సిటిన్ కి లాగానే

37.5 మి.గ్రా రోజుకు రెండుసార్లు తో మొదలు పెట్టండి; 150 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి

వికారం, మగత, తలతిరగడం, తలనెప్పి, గొంతు ఎండుకుపోవడం, రక్తపోటు పెరగడం, ఫిట్స్

సామస్యలకు స్వల్పకాల ఉపయోగానికి, నిద్ర పట్టడం కష్టమైనప్పుడు వాడడానికి ఏంటీ ఏంగ్డయిటీ, నిద్ర మందులు (అలవాటుగా మారకుండా వుండడానికి ఈమందుల్ని ఒకేసారి 4 వారాల కంటే ఎక్కువ కాలం వాడగూడదు)

మందుల

స్థానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

డయాజిఫామ్

ఏంగ్జయితీ, నిద్రపట్టనప్పుడు, మద్యాన్ని మానేస్తున్నప్పుడు

రాత్రి 5 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 10 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

బోరజీఫామ్

డయాజిపామ్ కి లాగానే. కాని, ఎక్యూట్ మేనియాకు కూడా ఉపయోగిస్తుం ది.

రాత్రి 1 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 4 మి.గ్రా. వరకు పెంచండి.

నైట్రజిపామ్

డయాజిఫామ్ కి లాగానే

రాత్రి 5 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 10 మి.గ్రా. వరకు పెంచండి.

క్లోర్ డయాజిపాక్సైడ్

డయాజిఫామ్ కి లాగానే, కాని మద్యాన్ని మానుతున్నప్పుడు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

మద్యాన్ని మానుతున్నప్పుడు మోతాదుకు

క్లోనజిపామ్

డయాజిఫామ్ కి లాగానే, కాని మూర్ఛ వ్యాధికి కూడా ఉపయోగపడుతుంది.

రాత్రి 0.5 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 1 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ఆల్ప్రజోలమ్

డయాజిఫామ్ కి లాగానే

రాత్రి 0.25 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 1 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ఆక్సజిపామ్

డయాజిఫామ్ కి లాగానే

రాత్రి 7.5 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 40 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

ట్రయాజోలమ్

డయాజిఫామ్ కి లాగానే

రాత్రి 0.125 మి.గ్రా. తో మెదలు పెట్టండి, 0.25 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

మేనిక్ డిప్రెసివ్ డిజార్జర్కి మందులు (మూడ్ స్టెబిలైజర్స్)

మందుల

స్థానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

రాగల ఇబ్బందులు

లిధియమ్ కార్బొనేట్

మానిక్ డిప్రెసివ్, డిజార్డర్ ని నియంత్రించడానికి, సిరమ్లో స్థాయిని తెలుసుకునేందుకు ఆవకాసం లోకపోతే లేకా మూత్రం ధారళంగా పోయేందుకు మందుల్ని (డురిటాక్స్) తీసుకుంటుంటే, ఈ మందును ఇవ్వకండి.

400-1200 మి.గ్రా. ల్ని, ఒక్ మోతాదులో ఇవ్వండి. (సీరమ్ తో లీటర్ కి 0.6 – 1.2 మి. మాలిక్యూల్ వుండాలి.)

వికారం, విరేచనాలు, బరువు పెరగడం, బాగా దాబం వెయ్యడం, ఏంటీస్టిరాయిడల్ మందులతో కలిసి పని చెయ్యడం, మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే లిధియం చాలా ప్రమాదకారి అని గుర్తించుకోండి.

సోడియం వాల్ప్రొయేట్

లిధియమ్ కి లాగానే, కాని మూర్ఛ వ్యాధికి కూడా పని చేస్తుంది.

200 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తో మొదలు పెట్టండి, అంచెలంచెలుగా 600 మి.గ్రా. రోజుకు రెండుసార్లు వరకు పెంచండి.

వికారం, మగతి, విరేచనాలు, బరువు పెరగడం, వణుకు, కామెర్లు, కాలేయం పని చెయ్యక పోవడం, పాంక్రియాటైటిస్.

కార్బమజిపిన్

లిధియమ్ కి లాగానే, కాని మూర్ఛ వ్యాధికి కూడా పని చేస్తుంది.

200 మి.గ్రా. రోజుకు ఒకసారితో మొదలు పెట్టండి. పెండు వారాల వ్యవధిలో అంచెలంచెలుగా 800 మి.గ్రా. రోజుకు పెంచండి. సీరమ్ లో స్థాయి 8-12 మి.గ్రా/లీటర్ వుండేలాగా చూడండి.

వికారం, నడవడం కష్టమవడం, మలబద్ధకం, నిద్రమత్తు, తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్లు, శరీరంలో సోడియం తగ్గిపోవడం. అకస్మాత్తుగా రక్తకణాల సంఖ్య తగ్గిపోవచ్చని గమనికలో ఉంచుకోండి.

మూర్ఛవ్యాధి నియంత్రణకు ఏంటీకన్వల్సెంట్ మందులు

మందుల

స్థానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

రాగల ఇబ్బందులు

ఫినోలార్బిలోన్

పెద్దవారిలో అన్ని రకాల మూక్ఛ వాధులకు

రాత్రి 60 మి.గ్రా. తో మెదలు పెట్టండి, రాత్రి 120 మి.గ్రా. వరకు పెంచండి.

మగత, అలజడి, గందరగోళం

ప్రిమిడోన్

పెద్దవారిలో అన్ని రకాల మూర్ఛవ్యాధులకు

రాత్రి 125 మి.గ్రా. తో మెదలు పెట్టండి, అంచెలంచెలుగా 500 మి.గ్రా. రోజుకు రెండుసార్లు పెంచండి.

మగత, అలజడి, గందరగోళం

ఫినిబోయిన్

పెద్దవారిలో అన్ని రకాల మూక్ఛ వాధులకు

రాత్రి 150 మి.గ్రా. తో మెదలు పెట్టండి, రోజుకు 600 మి.గ్రా. వరకు పెంచండి.

వికారం, వణుకు, గందరగోళం, తలతిరగడం, తలనెప్పి

సోడియంవాల్ప్రొయేట్

పెద్దవారిలో అన్ని రకాల మూక్ఛ వాధులకు

200 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తో మెదలు పెట్టండి, అంచెలంచెలుగా 800 మి.గ్రా. రోజుకు రెండుసార్లు పెంచండి.

వికారం, మగత, విరేచనాలు, బరువు పెరగడం, వణుకు

కార్బమడిపిన్

పెద్దవారిలో అన్ని రకాల మూక్ఛ వాధులకు

రోజుకు 200 మి.గ్రా. తో మెదలు పెట్టండి, రెండు వారాలలో గరిష్టంగా రోజుకు 1000 మి.గ్రా. రెండుసార్లకు పెంచండి.

వికారం, నడవడం కష్టమవడం, మలబద్దకం, నిద్రమత్తు, అకస్మాత్తుగా రక్తకణాల సంఖ్య తగగిపోవచ్చని గమనికలో ఉంచుకోండి.

టిక 11.6పట్. మానసిక వ్యాధులకు వాడే ఇతర మందులు

మందుల

స్థానిక వ్యాపార పేరు, ఖరీదు

ప్రత్యేక ఉపయోగాలు

మోతాదు

రాగల ఇబ్బందులు

ప్రొపనలాల్

ఏంగ్జయిటీ కి వచ్చే తీవ్రమైన శారీరిక లక్షణాలకు

20 మి.గ్రా. రోజుకు రెండుసార్లు తో మెదలు పెట్టండి, 40 మి.గ్రా. రోజుకు రెండుసార్ల వరకు పెంచండి.

హార్ట్ ఫేయిల్యూర్, ఉబ్బసం, నిస్త్రాణ, వికారం.

ప్రొపౌక్లిడిన్

ఏంటీసైకాటిక్ మందులకు ఇబ్బందులు వచ్చినప్పుడు

2.5 మి.గ్రా. రోజుకు రెండుసార్లతో మెదలు పెట్టండి, 5 మి.గ్రా. రోజుకు మూడు సార్ల వరకు పెంచండి.

గొంతు ఎండిపోవడం, మలబద్దకం, దృష్టి మసకవారడం, మూత్రం పోవకపోవడం, గందరగోళం.

బెంజ్ హెక్సాల్

ప్రొసైక్లిడిన్ కి లాగానే

1 మి.గ్రా. రోజుకు ఒకసారితో మెదలు పట్టండి, 2.5 మి.గ్రా. రోజుకు మూడుసార్ల వరకు పెంచండి.

ప్రొసైక్లిడిన్ కి లాగానే

బెండ్ ట్రాపిక్

ప్రొసైక్లిడిన్ కి లాగానే

రాత్రి 0.5 మి.గ్రా. తో మెదలు పెట్టండి, రాత్రి 2 మి.గ్రా. వరకు పెంచండి.

ప్రొసైక్లిడిన్ కి లాగానే

థయోమిన్

మద్యం సమస్యలకు, మద్యాన్ని మానేటప్పుడు

20 – 50 మి.గ్రా. రోజుకు మూడుసార్లు

అరుదుగా నమోదు చెయ్యబడినాయి.

మానసిక వ్యాధులకు మందుల్ని వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • చాలామందులు మద్యంతో కలిసి పనిచేస్తాయి. ముఖ్యంగా నిద్రను కలగజేసే మందులు మద్యం తాగాక వచ్చే మత్తును ఇంకా ఎక్కువ చేస్తాయి.
  • పట్టికల్లో ఇచ్చినవి పెద్దవారికి ఇచ్చే మోతాదులు. ఆమోతాదుల్లో మూడవ వంతు లేక సగం మోతాదుల్ని 60 సంవత్సరాల వయసు పైబడినవారికి, 16 సంవత్సరాల వయసు లోపు వారికి ఇవ్వాలి.
  • చాలా సైకియాట్రిక్ మందులు మగతను, అధిక బరువును, సాంఘిక సమస్యలను కలగజేస్తాయి. వీటిని గమనికలో వుంచుకోండి. ఆమందుల్ని తీసుకునేవారికి బరువును నియంత్రించుకోవడానికి మితంగా తినమని, వ్యాయామం చెయ్యమని సలహానివ్వండి. మగత రావడం తరచుగా తాత్కాలికం, కొన్నాళ్ళు మందును వేసుకుంటూంటే తగ్గిపోతుంది. లైంగిక సమస్యల్ని 5.5 విభాగంలో సూచించిన విధంగా తగ్గించుకోవచ్చు.
  • గర్భంసమయంలో ఈక్రింది మందుల్ని వాడగూడదు; లిథియమ్, కార్బమజిపిన్, వాల్పోయేట్, క్లోనజిపామ్, ఏంగ్టయిటీకివాడే ఇతర మందులు, డిప్రెషన్కి వాడే పాత మందులు, సైకోసిస్కి వాడే అన్ని మందులు.
  • మానసిక వ్యాధులకు వాడడానికి కొన్ని ఇతర మందులు వున్నాయి, వాటిని పట్టికల్లో చేర్చలేదు. అతిచురుకు పిల్లలకు వాడే మిథైల్ఫినిడేట్, మద్యం అలవాటుకు వాడే డైసల్ఫిరామ్, మూర్ఛవ్యాధికి వాడే విగా బాట్రిన్, హీరాయిన్ అలవాటుకు వాడే మిధడోన్ ఇలా చేర్చబడలేదు. వీటిని జనరల్ ఫిజీషియన్లు, కమ్యూనిటీ ఆరోగ్యకార్యకర్తలు ప్రారంభించగూడదు (కనీసం పర్యవేక్షించడం కూడా తగదు). సాధ్యమైనంతవరకు వాటిని నిపుణులు మాత్రమే వాడాలి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate