অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానసిక వ్యాధి ఉన్న వారిని గుర్తి౦చడ౦

మానసిక వ్యాధి ఉన్న వారిని గుర్తి౦చడ౦

  1. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిని మీరు పరీక్షి౦చగలరా?
  2. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడడానికి మీకు సమయ౦ ఉ౦టు౦దా?
  3. ఎవరికి మానసిక అనారోగ్య౦ వస్తు౦ది?
  4. మానసిక అనారోగ్య౦ వు౦దేమెననే అనుమాన౦ ఉన్న వ్యక్తిని ఏమి అడగాలి?
  5. మానసిక వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడే లక్షణాల జాబితా
  6. ఇ౦టర్వ్యూలో ఏమి గమని౦చాలి?
  7. ఇ౦టర్వ్యూను ఎలా నిర్వహి౦చాలి?
  8. వ్యాధిని నిర్ధారి౦చడమెలా?
  9. అ౦చనా వెయ్యడ౦లో ప్రత్యేక స౦దర్భాలు
    1. మాట్లాడడానికి నిరాకరించే వ్యక్తిని అంచనా వెయ్యడం
    2. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి యొక్క శారీరక బాధల్ని అంచనా వెయ్యడం
    3. టెలిఫోన్ ద్వారా ఒక వ్యక్తిని అంచనా వెయ్యడం
    4. కుటుంబసభ్యులు దగ్గరగా ఉండగా ఒక వ్యక్తిని అంచనా వెయ్యడం

ఈ అధ్యాయంలో మానసిక వ్యాధిని గుర్తించడానికి ఏవిధంగా ముఖాముఖి ప్రశ్నించి అడిగి తెలుసుకోవాలో (ఇంటర్వ్యూ) వివరించబడింది. మానసిక వ్యాధి ప్రధాన లక్షణాల గురించి, కష్ట తరమైన ఇంటర్వ్యూలను నిర్వహించడం గురించి ఉదాహరణకు, బాగా ఎక్కువ జనం ఉండే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జవాబివ్వడానికి నిరాకరించే వారితో ఇంటర్వ్యూ గురించి వివరించబడింది. మానసిక వ్యాధిని నిర్ధారించడానికి మీరు అడగగల ప్రశ్నల్ని కూడా వివరించడం జరిగింది.

మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిని మీరు పరీక్షి౦చగలరా?

మానసిక వ్యాధి ఉందా, లేదా అనే అంచనా వెయ్యడానికి మానసిక వైద్య నిపుణుడే అవసరం లేదు. సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం, ఈ పుస్తకంలో వివరించబడిన ప్రాథమిక పరిజ్ఞానం కొంత ఉన్న ఎవరైనా అంచనా వెయ్యొచ్చు.

కొంతమంది ఆరోగ్య కార్యకర్తలకు మిశ్రమ భావనలు ఉండొచ్చు. వారికి ఈ క్రిందివి ఉండొచ్చు:

  • ఆ వ్యక్తి తనను కొడతాడనే భయం.
  • ఆ వ్యక్తి వ్యక్తిగతంగా పరిశుభ్రంగా లేకపోవడం వలన చీదర కలగడం.
  • ఆ వ్యక్తితో ఇంటర్వ్యూ కి మామూలు పరీక్షకంటే ఎక్కువ సమయం పడుతుందేమోననే అ సహనం.
  • ఆ వ్యక్తి యొక్క అసహజమైన ప్రవర్తన పట్ల కొంత వినోదం.
  • ఏ జబ్బూ లేకుండా ఆ వ్యక్తి తమ సమయాన్ని వృధా చేస్తున్నాడనే కోపం.

అటువంటి భావాలు మానసిక వ్యాధి ఉన్న వ్యక్తికి సహాయ పడడాన్ని కష్ట తరం చెయ్యొచ్చు. ఆ ధోరణులు ఆ వ్యక్తికి ఇబ్బంది కలిగించి మీతో తన భావాల్ని స్వేచ్ఛగా పంచుకోకపోవచ్చు. శారీరక వ్యాధి ఉన్న ఇతరులకు ఎంత గౌరవంతో, సహానుభూతితో చికిత్స చేస్తామో అంతే గౌరవంతో, సహానుభూతితో మానసిక వ్యాధి ఉన్న వ్యక్తికి చికిత్స చెయ్యాలి. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులతో పని చెయ్యడం సంతృప్తినీ, ప్రయోజనాన్నీ కలిగిస్తుంది. మానసిక వ్యాధిని అంచనా వెయ్యడంలో అతి ముఖ్యమైన అంశం తగినంత సమయాన్ని వారితో గడపడం.

మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడడానికి మీకు సమయ౦ ఉ౦టు౦దా?

ఒక వ్యక్తి మీ దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసుకోవడానికి తీసుకునే సమయం ఆ oneతరువాత మీ సమయాన్ని ఆదా చేస్తుందనే విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి. చాలా మానసిక అనారోగ్యాలు, ముఖ్యంగా, సాధారణంగా కనబడే మానసిక సమస్యలు, మద్యం సంబంధిత సమస్యల్ని ఆరోగ్య కార్యకర్తలు గుర్తించరని మనకు తెలుసు. బాగా రద్దీగా వుండే ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు యధాలాపంగా విని ఏవో మందుల్ని ఇచ్చేస్తారు. అలా నెప్పల గురించి చెప్లే నెప్పల మందుల్ని అలసట వుందంటే విటమిన్ మాత్రల్ని నిద్ర సమస్య వుంటే నిద్ర మాత్రల్ని ఇస్తారు. కాని దీని అర్థం అసలు సమస్య మానసిక అనారోగ్యానికి చికిత్స చెయ్యలేదని. వీరిలో చాలామంది రోగులు మళ్ళీ క్లినిక్ కి వచ్చి మరింత ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అందు వలన అసలు సమస్యను కనుక్కోవడానికి తీసుకునే సమయం నిజానికి తరువాత దీర్ఘకాలంలో సమయాన్ని ఆదా చేస్తుంది. అంతేకాక, మీరు చికిత్స చేస్తున్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ మాత్రల కోసం రావడం కాక, అతని ఆరోగ్యం మెరుగు పడడం చూసే అవకాశం మీకు కలుగుతుంది. గుర్తుంచుకోవలసిన రెండవ ముఖ్యమైన విషయమేమంటే మానసిక అనారోగ్యం గురించి అడిగి తెలుసుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టదు. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడంలో కీలకమైన విషయం అసలెలా ప్రశ్నల్ని అడగాలో ముందే బాగా తెలుసుకుని వుండడం, అదే ఈ క్రింద వివరించబడింది

ఎవరికి మానసిక అనారోగ్య౦ వస్తు౦ది?

మానసిక వ్యాధిగ్రస్తుడు అనగానే మన కళ్ళ ముందు నిలిచే చిత్రం ఒక అస్తవ్యస్తంగా ఉన్న ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి నిజానికి మానసిక అనారోగ్యం ఉన్నవారిలో అత్యధికమంది శారీరక అనారోగ్యం ఉన్నవారిలాగానే కనపడతారు, మాట్లాడతారు. శారీరక అనారోగ్యం ఉన్నవారికంటే మానసిక అనారోగ్యం ఉన్నవారు ప్రమాదకారులు కాదు, మానసిక అనారోగ్యం ఉన్నవారితో మాట్లాడడం వలన మీరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు భావించగూడదు.

మానసిక అనారోగ్యం ఉన్నవారిని గుర్తించడానికి మీరు కొన్ని స్త్రీనింగ్ పద్ధతుల్ని ఉపయోగించడం గురించి ఆలోచించాలి. అప్పుడు మీరు సమస్యేమిటో తెలుసుకోవడానికి తగినంత సమయాన్ని వెచ్చించి చికిత్స చెయ్యగలుగుతారు. బాగా రద్దీగా ఉండే క్లినిక్ లో స్క్రీనింగ్ చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది, ఒక మానసిక అనారోగ్యాన్ని తెలియజేసే కొన్ని కీలకమైన లక్షణాలు ఉంటాయి, ఎవరైనా ఆ లక్షణాలతో వస్తే మీరు ఆ అనారోగ్యం వుందేమోనని అనుమానించాలి (పెట్టె 2.2). ఈ ప్రశ్నల్లో ఏ రెండిటికైనా సానుకూలమైన జవాబులు వస్తే మీరు ఆసమస్యల గురించి మరిన్ని ప్రశ్నల్ని అడగొచ్చు.

2.1. మానసిక అనారోగ్యాన్ని తెలియజేసే వివిధ రకాల గుర్తింపు లక్షణాలు :

  • ఆ వ్యక్తి లేక అతని బంధువు ఎవరైనా సూటిగా డిప్రెషన్, లేక మద్యం సంబంధమైన మానసిక అనారోగ్యం ఉందని చెప్పడం.
  • ఆ వ్యక్తి లేక అతని బంధువు ఎవరైనా అతనికి అతీంద్రయ శక్తులు ఉన్నాయని అనుమానించడం.
  • మానసిక అనారోగ్యానికి మద్యం వ్యసనం లేక గృహహింస లాంటి ప్రత్యేక కారణం స్పష్టంగా తెలుస్తున్నప్పుడు. ఆ వ్యక్తికి ఇతర వ్యక్తులతో సంబంధాల పరమైన, వైవాహిక లేక లైంగిక సమస్యలు ఉన్నట్లు మీకు తెలిస్తే.
  • ఆ వ్యక్తికి జీవిత సంబంధ సమస్యలు, ఉద్యోగం లేక పోవడం, అతనికి ప్రియమైన వ్యక్తి చనిపోవడం లాంటివి ఉన్నాయని మీకు తెలిసినప్పుడు.
  • ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని అనేక (ముఖ్యంగా మూడిటికంటే ఎక్కువ) బాధల్ని చెప్తుంటే.
  • మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేక కుటుంబ చరిత్ర ఉంటే.

2.2. సామాన్య ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మానసిక అనారోగ్యాన్ని గుర్తించడానికి విలువైన ప్రశ్నలు :

  • రాత్రిtwo పూట నిద్ర పట్టడంలో ఏమైనా సమస్య ఉందా?
  • మీ రోజువారీ కార్యక్రమాల్ని నిర్వహించడంలో మీకు ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా?
  • మీకు ఈ మధ్య విచారంగా, అసలు సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా?
  • మీరు దేని గురించైనా భయభ్రాంతులవుతున్నారా?
  • మీరీమధ్య మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నానని బాధపడుతున్నారా?
  • మీరీమధ్య మద్యం కోసం ఎంత డబ్బును ఖర్చుపెడుతున్నారు?

ఈ ప్రశ్నలలో దేనికైనా అవునని సమాధానం వస్తే వ్యాధి నిర్ధారణకు మరిన్ని ప్రశ్నల్ని వివరంగా అడగండి.

2.3. మానసిక అనారోగ్యం వందేమోననే అనుమానం ఉన్న వ్యక్తినుంచి పొందవలసిన సమాచారం సామాన్య సమాచారం :

  • లింగం
  • వయసు
  • వృత్తి
  • వైవాహిక స్థాయి

ప్రస్తుత బాధల గురించి సమాచారం :

  • ఎప్పుడు, ఎలా ప్రారంభమయింది ?
  • ఇంకా తీవ్రమవుతూందా ?
  • మందుల్నిగాని, ఇతర చికిత్సల్ని గాని తీసుకుంటున్నారా ?
  • వ్యాధి గురించి ఆ వ్యక్తి యొక్క విశ్వాసాలు - తనకే వ్యాధి ఉందని ఆ వ్యక్తి భావిస్తున్నాడు? ఎందుకు తనకా వ్యాధి వచ్చిందని అనుకుంటున్నాడు? మొదలగు మీరు వ్యాధికి కారణాలుగా ఒత్తిడి లేక అతీంద్రియ శక్తుల గురించి ప్రశ్నల్ని అడగవచ్చు.

ఇతర సమాచారం :

  • ఇంతకు మునుపు మానసిక వ్యాధి వచ్చిందా, వచ్చి వుంటే ఇదివరకు వాడిన మందుల చీటీలు హాస్పటల్ లో ఇచ్చిన చీటీలను అడగండి.
  • ఈ మధ్య తలకేమైనా దెబ్బ తగిలిందా లాంటి మెడికల్ సమాచారం.
  • ఇటీవల జరిగిన జీవిత సంఘటనలు, విడిపోవడం, కుటుంబంలోని వ్యక్తి మరణం, ఉద్యోగం పోవడం లాంటివి.
  • సాంఘిక ఆసరా - ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరితో కలిసి జీవిస్తున్నాడు, అతని బాగోగులు ఎవరు చూస్తారు, ఇంటి వెలుపల అతనికి ఆసరా నిచ్చే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయా లేక స్నేహితులు ఉన్నారా?

మానసిక అనారోగ్య౦ వు౦దేమెననే అనుమాన౦ ఉన్న వ్యక్తిని ఏమి అడగాలి?

ముందు స్క్రీనింగ్ తరువాత మానసిక అనారోగ్యం వుందేమోననే అనుమానం ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన, ప్రామాణికమైన ప్రశ్న పత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. సమస్యను అర్థం చేసుకోవడానికి మూడు రకాల సమాచారం అవసరమవుతుంది. ఈ సమాచారం ఆ వ్యక్తికి సహాయపడే మార్గాలను కూడా సూచించాలి.

  • మీ సహాయం కోరి వచ్చిన వ్యక్తి వయసు, చిరునామా, కుటుంబ వివరాలు, ఉద్యోగ వివరాలు మొదలైన ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి.
  • వ్యాధి గురించి సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు మొదట ఆ వ్యక్తికి ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఉదాహరణకు, లక్షణాలు ఎన్నాళ్ళ నుండి ఉన్నాయి, అవి అతని జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి.
  • అప్పుడు మీరు అతని సాంఘిక స్థాయి గురించి అడగాలి. అంటే, అతను ఎవరితో కలిసి జీవిస్తున్నాడు, అతనికి ప్రధాన ఆసరాగా ఎవరున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోవడం లాంటి ఈ మధ్య జరిగిన జీవిత సంఘటనల గురించిన ప్రశ్నలు ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నాడో వివరించగలుగుతాయి.

మానసిక వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడే లక్షణాల జాబితా

ఈ క్రింది లక్షణాల జాబితాను మూడు ప్రధాన రకాల మానసిక వ్యాధుల్ని నిర్ధారణ చెయ్యడానికి ఉపయోగించవచ్చు.

సాధారణ మానసిక వ్యాధిని నిర్ధారించడానికి :

(డిప్రెషన్ లేక కుంగుబాటు మరియు ఏంగ్డయిటీ లేక ఆందోళన) ఆ వ్యక్తికి కనీసం రెండు వారాలపాటు ఈక్రింది వాటిలో కనీసం ఒక లక్షణం ఉండాలి:

  • విపరీతమైన విచారం
  • రోజువారీ కార్యక్రమాలపై ఆసక్తిని కోల్పోవడం
  • ఎప్పుడూ ఒత్తిడికి గురవడం, నెర్వస్ గా ఉండడం, ఎక్కువగా ఆందోళన పడడం.

మీరు అడగవలసిన, తరచుగా కనపడే ఇతర లక్షణాలు :

  • కలత నిద్ర
  • అలసట
  • ఆకలి తగ్గిపోవడం
  • ఏకాగ్రత తగ్గిపోవడం
  • ఆత్మహత్య గురించి ఆలోచనలు
  • గుండె దడ (గుండె వేగంగా కొట్టుకోవడం), వణుకు, తల తిరగడం
  • ఒళ్ళంతా నెప్పలు

తీవ్రమైన మానసిక వ్యాధిని నిర్ధారణ చెయ్యడానికి :

ఆ వ్యక్తికి ఈ లక్షణాలలో కనీసం రెండు ఉండాలి.

  • నిజంకాని విషయాల్ని నమ్మడం, ఉదాహరణకు, తన ఆలోచనల్ని బయటి శక్తులేవో నియంత్రిస్తున్నట్లు భావించడం లేక జనం తనకు విష ప్రయోగం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవడం (భ్రమలు లేక డెల్యూజన్స్).
  • ఇతరులెవరికీ కనపడనివి లేక వినపడనివి తనకు కనపడడం, వినపడడం (బ్రాంతులు లేక హాలుసినేషన్స్).
  • కలవరం మరియు స్థిమితం లేకపోవడం లేక ఆసక్తి లేకపోవడం.
  • ఈ లక్షణాలు ఒక నెలకంటే తక్కువ రోజులుగా ఉంటే, ఎక్యూట్ సైకోసిస్గానూ, ఒక నెలకంటే ఎక్కువ రోజులుగా ఉంటే షిజోఫ్రినియా గానూ అనుమానించవచ్చు. మధ్యమధ్యలో ఆవ్యక్తి పరిస్థితి పూర్తిగా మెరుగుపడినట్లు ఉంటే బైపోలార్డిజార్జర్గా నిర్ధారించవచ్చు మరీ పెద్దది, మానియా లేక ఉన్మాదాన్ని ఈ క్రింది ఆధారాలతో నిర్ధారించవచ్చు మాట్లాడే వేగం ఎక్కువవడం.

  • స్థిమితం లేకపోవడం.
  • చిరాకుగా ఉండడం (త్వరగా కోపం రావడం).
  • పెద్ద పెద్ద ఆలోచనలు (వాస్తవానికి దూరంగా ఉన్నవి).

మద్యం (లేక మత్తు మందులు) వ్యసనాన్ని నిర్ధారణ చెయ్యడం :

ఆ వ్యక్తికి ఈక్రింది లక్షణాలలో కనీసం రెండు, కనీసం ఒక నెల నుండి ఉండాలి:

  • తాగడం (లేక మత్తు మందులు) వలన వ్యక్తిగతమైన ఇబ్బందులు; ఉద్యోగం పోవడం లేక ఏక్సిడెంట్లు: పచ్చకామెర్లు లాంటి ఆరోగ్య సమస్యలు.
  • తాగడం వలన సమస్యలు వస్తున్నప్పుడు తాగడాన్ని మానాలని ప్రయత్నించినప్పటికీ మానడంలో ఇబ్బందులు.
  • మద్యం (లేక మత్తు మందులు)ని రోజంతా తీసుకుంటూనే ఉండడం.
  • మద్యాన్ని లేక మత్తు మందుల్ని తీసుకుంటే తప్ప జబ్బుపడినట్లు లేక ఒంట్లో బాగా లేనట్లు ఉండ.
  • క్రమేపీ ఎక్కువ మోతాదులో మద్యాన్ని లేక మత్తుమందుల్ని తీసుకోవడం. గందరగోళం, మతిమరపు మరియు చిన్న పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలలాంటి ఇతర మానసిక వ్యాధుల్ని నిర్ధారించడానికి ఈ మాన్యువల్లోని ప్రత్యేక అధ్యాయాల్ని చదవండి

ఇ౦టర్వ్యూలో ఏమి గమని౦చాలి?

ఇంటర్వ్యూ లో ఈ క్రింది వాటిలో ఏవైనా ఉన్నాయేమో గమనించండి.

  • threeవిచారాన్ని లేక భయాన్ని వ్యక్తం చేసే ముఖ కవళికలు (షిజోఫ్రినియాలేక డిప్రెషన్).
  • స్థిమితం లేక పోవడం. అంటే ప్రశాంతంగా కూర్చోలేక పోవడం (సైకోసెస్, డిప్రెషన్, మద్యం వ్యసనం మరియు మానసిక వ్యాధులకు వాడే కొన్ని మందులకు వచ్చే సమస్యలు).
  • విచిత్రమైన కదలికలు (షిజోఫ్రినియా మరియు మానసిక వ్యాధులకు వాడే కొన్ని మందులకు వచ్చే సనస్యలు.
  • ప్రశ్నలకు సంబంధం లేని జవాబులు (అన్ని రకాల సైకోసెస్కు ఉండేవి).
  • విపరీతమైన వేగంతో మాట్లాడడం (సైకోసెస్ తోపాటు, ముఖ్యంగా, ఉన్మాదంలో ఉంటుంది).
  • fourమరీ నెమ్మదిగా మాట్లాడడం (డిప్రెషన్, మత్తుమందుల వ్యసనం, షిజోఫ్రినియాలో ఉంటుంది).
  • ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు, స్వీయ సంరక్షణ (డిప్రెషన్, మత్తు మందులు, మద్యం వ్యసనం, షిజోఫ్రినియాలో తక్కువ స్థాయిలో ఉంటాయి).

ఇ౦టర్వ్యూను ఎలా నిర్వహి౦చాలి?

తమ భావాల్ని లక్షణాలను ఇబ్బంది లేకుండా చర్చించడానికి సహాయ పడేందుకు అవసరమైన కొన్ని సూచనలు :

  • ఆ వ్యక్తికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. కొంతమందికి గందర గోళంగా ఉంటుంది లేక అనుమానిస్తూ ఉంటారు. మీ వృత్తిపరమైన పరిచయాన్ని స్పష్టంగా తెలిపి, ఈ మధ్య ఆ వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అతనితో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పండి.
  • అతనితో సామరస్యం నెలకొల్పుకోవడానికనువుగా మొదట ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. చాలామంది తాము మాట్లాడే భాషనే మాట్లాడే తమ ప్రాంతపు వ్యక్తితో ఇబ్బంది లేకుండా, ఎక్కువ సౌకర్యంగా తమ వ్యక్తిగత విషయాల్ని మనసు విప్పి చెప్పగలుగుతారు.
  • fiveసహానుభూతి అంటే ఎదుటి వ్యక్తి స్థానంలో తను ఉంటే ఎలా ఉంటుంది, ఎలా భావిస్తానని ఊహించు కోవడం. ఒక వ్యక్తి యొక్క సాంఘిక, కుటుంబ పరిస్థితిని, అతని బాధల్ని అర్థం చేసుకోవటం ఆ వ్యక్తితో మీరు సహానుభూతితో వ్యవహరించడానికి తోడ్పడుతుంది, అప్పడా వ్యక్తి మీతో  మాట్లాడడానికి ఎక్కువ సుముఖంగా ఉంటాడు.
  • మీ దగ్గరకు సహాయం కోరి వచ్చిన వ్యక్తిని 2.5 విభాగంలోని జాబితా ననుసరించి ప్రాధాన్యత ఉన్న ప్రశ్నల్ని అడగాలి. ఏ మాత్రం సానుకూలమైన జవాబులు లభించినా మరింత సాకల్యంగా, లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
  • ప్రధాన రకాల మానసిక వ్యాధులు, వాటి లక్షణాలను ముందే తెలుసుకుని ఉండడం సహాయపడుతుంది. ప్రత్యేకంగా గుచ్చిగుచ్చి అడిగితే తప్ప చాలామంది మానసిక వ్యాధి గ్రస్తులు తమ భావోద్వేగ సమస్యల గురించి బహిరంగంగా చెప్పరు.
  • మీరు సమయం ఎక్కువయి పోతూందనే ఒత్తిడితో, ఉదాహరణకు మాటి మాటికీ చేతి వాచ్ ని చూసుకుంటూ మాట్లాడకూడదు. ఆ ఒక్క పది నిమిషాలే అతని పరిస్థితిని తెలుసుకోవడానికి, చికిత్స ప్రత్యామ్నాయాలను సూచించడారికి కీలకమవుతుందని గుర్తుంచు కోండి. మీరు ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే మరీ మంచిది.
  • ఆ వ్యక్తి బంధువులు అక్కడ లేకుండా అతనికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. కేవలం వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి వారిమాటల్ని నమ్మగూడదనుకోకండి.
  • ఆ వ్యక్తి బంధువులతో కూడా మాట్లాడండి. మానసిక వ్యాధితో బాధపడుతున్న కొంతమంది తమకు వ్యాధి ఉందని ఒప్పుకోకపోవచ్చు. కొంతమందికి తమ ప్రవర్తన తీరు గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. వ్యాధి గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి తరచుగా బంధువులు, స్నేహితులు విలువైన సమాచారాన్ని అందించగలరు.
  • ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ వ్యక్తి వంక సూటిగా చూడండి. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడినప్పుడు అతని పట్ల మీకు నిజమైన ఆసక్తి ఉందనే నమ్మకం కలుగుతుంది.
  • అతనితో మాట్లాడుతున్నప్పుడు వేరే ఎవరూ అక్కడ లేకుండా, ఏకాంతంగా ఉండేలా జాగ్రత్త వహించండి, బాగా రద్దీగా ఉండే క్లినిక్ లో ఇది సాధ్యపడక పోవచ్చు, కాని అక్కడ కూడా మీరు నెమ్మదిగా, మృదువుగా, గదిలో ఉన్న వేరే వారికి వినపడకుండా అతని వ్యక్తిగత సమస్యలను చర్చించవచ్చు. అలా కాకుండా రద్దీ కొంచెం తగ్గేదాకా ఆగమని, అప్పుడు అతనితో వ్యక్తి గతంగా మాట్లాడవచ్చు.
  • భవిష్యత్తులో ఉపయోగ పడేలాగా ఇప్పుడు లభించిన సమాచారాన్ని ముఖ్యంగా ప్రధాన లక్షణాలు, ప్రస్తుతం నిర్ధారించిన వ్యాధి, ఇంకా ప్రాధాన్యం ఉన్న ఇతర సమాచారాన్ని నమోదు చెయ్యండి.

వ్యాధిని నిర్ధారి౦చడమెలా?

సామాన్య ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నిర్ధారించగలిగిన వ్యాధులు కొన్నే ఉంటాయి. 2వ విభాగంలో ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధి గ్రస్తులు చెప్పిన సమస్యల ఆధారంగా వివిధ రకాల మానసిక వ్యాధుల్ని మీరెలా నిర్ధారణ చెయ్యగలరో వివరించ బడింది. వివిధ రకాల మానసిక వ్యాధుల గురించి, ఈ అధ్యాయంలో వివరించిన విధంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వెయ్యడానికి అడగవలసిన ప్రశ్నల గురించి అవగాహన కలిగి ఉండండి. మీ సహోద్యోగులతో ముందుగా అభ్యాసం చేయండి. వ్యాధి నిర్ధారణలు రెండు కారణాల వల్ల చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి:

  • సరైన చికిత్సల్ని ఎంపిక చేసుకోవడానికి సహాయపడేందుకు.
  • తమ బాధలకు గల కారణాల్ని వారికి వివరించేందుకు.

అ౦చనా వెయ్యడ౦లో ప్రత్యేక స౦దర్భాలు

  • మానసిక వ్యాధిని అంచనా వెయ్యడానికి కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. అవి :
  • మాట్లాడడానికి నిరాకరించే వ్యక్తి వ్యాధిని నిర్ధారించవలసినప్పుడు.
  • మానసిక వ్యాధి ఉన్నవారి శారీరక బాధల్ని అంచనా వెయ్యాల్సివచ్చినప్పుడు.
  • టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ వ్యాధిని అంచనా వెయ్యాల్సినప్పుడు
  • కుటుంబ వ్యక్తుల సమక్షంలో వ్యక్తిని అంచనా వెయ్యాల్సి వచ్చినప్పుడు.
  • హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని అంచనా వెయ్యాల్సి వచ్చినప్పుడు.
  • గందరగోళంలో ఉన్న వ్యక్తిని అంచనా వెయ్యాల్సి వచ్చినప్పుడు.
  • అత్మహత్యా ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని అంచనా వెయ్యాల్సి వచ్చినప్పుడు.
  • మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్ని అంచనా వెయ్యాల్సి వచ్చినప్పుడు, మొదటి మూడు సందర్భాలు క్రింద చర్చించబడినాయి. మిగతా నాలుగు సందర్భాలు ఈపుస్తకంలోని ఇతర అధ్యాయాల్లో వివరించబడినాయి

మాట్లాడడానికి నిరాకరించే వ్యక్తిని అంచనా వెయ్యడం

sixకొన్నిసార్లు మాట్లాడడానికి నిరాకరించే వ్యక్తి తారస పడవచ్చు. ఇలా చాలా కారణాల వల్ల జరగొచ్చు. తమను క్లినిక్ కి తీసుకువచ్చినందుకు వారు కోపంగా ఉండి ఉండొచ్చు. ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడితే తనను మెంటల్ కేసుగా ముద్ర వేస్తారని భయపడుతూ ఉండి ఉండొచ్చు. మీ ఉద్దేశాల గురించి అనుమానపడుతూ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలలో సాధారణ సలహా ఏమిటంటే ఎక్కువ సమయాన్ని అనుమతించడం, వేరే గదిలో ఏకాంతంగా ప్రత్యేకంగా ఆ వ్యక్తితో మాట్లాడడం. అది సాధ్యంకానప్పుడు అతని బంధువుల్ని మీ సంభాషణలు వినపడనంత దూరంలో ఉండమని చెప్పండి. ఇది తన వ్యక్తిగత విషయాల్ని బెరుకు లేకుండా చెప్పడానికి ఆ వ్యక్తికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అతనిని బెదిరిస్తున్నట్లు, ఉదాహరణకు వృధా చెయ్యడానికి మీకు సమయం లేదని అనకండి. దానికి బదులు మీకు నిజంగా అతని సమస్యలపట్ల ఆసక్తి ఉందనే నమ్మకాన్ని కలిగించండి. ఒక వేళ మీకు వేరే పని ఉండి, అతను మాట్లడడానికి తిరస్కరిస్తూంటే, మీరు మీ పనిని చూసుకుని రావలసిన అవసరం ఉందని, బాగా ఎక్కువ సమయం ఉన్నప్పుడు మళ్ళీ వస్తానని చెప్పండి. ఇది అ వ్యక్తి ఆలోచించుకోవడానికి మరి కొంచెం సమయాన్నిస్తుంది. ఇది అతని పట్ల మీకు ఉన్న ఆ సక్తిని కూడా నిరూపిస్తుంది. వృధా చెయ్యడానికి నీకు సమయం లేదని ఆవ్యక్తిని (ఎడమ) బెదిరించవద్దు. దానికి బదులు, మాట్లాడడానికి నిరాకరిస్తున్న వ్యక్తితో ఆ వ్యక్తి సమస్యల గురించి మీకు ఆసక్తి ఉన్నదని నమ్మకం కలిగేలాగా చెప్పండి.

మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి యొక్క శారీరక బాధల్ని అంచనా వెయ్యడం

మానసిక అనారోగ్యం ఉందని ఆరోగ్య కార్యకర్తకు తెలిసిన ఒక వ్యక్తికి తలనెప్పి వచ్చిందని ఊహించండి. తరచుగా ఆరోగ్య కార్యకర్తలు తలనెప్పిని మానసిక సమస్యకు ఉన్న మరొక లక్షణంగానే పరిగణిస్తారు. కాని ఈ ధోరణి ఒక తీవ్రమైన శారీరక వ్యాధిని గుర్తించక, విస్మరించే ప్రమాదానికి దారి తీస్తుంది. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి శారీరక ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. కొత్తగా కనపడిన శారీరక బాధల్ని పూర్తిగా అంచనావెయ్యకుండానే, అవసరమైన పరీక్షలు చెయ్యకుండానే ఏమీ లేదని కొట్టిపారేయొద్దు. మానసిక వ్యాధులు ఉన్నవారు తమ శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని గుర్తుంచుకోండి. కొన్నిరకాల మానసిక వ్యాధులు శారీరక ఆరోగ్య సమస్యలతో సన్నిహితంగా ముడిపడి ఉంటాయి. చాలా ముఖ్యమైన ఉదాహరణలు:

  • శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే మద్యం, మత్తుమందుల వ్యసనం.
  • హింసకు, మానభంగానికి గురయిన స్త్రీ.
  • గందరగోళం, ఉద్రేకానికి తరచుగా కారణమైన శారీరక వ్యాధులు.
  • పెద్దవారిలో క్రమం తప్పిన ప్రవర్తన.

టెలిఫోన్ ద్వారా ఒక వ్యక్తిని అంచనా వెయ్యడం

టెలిఫోన్లు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో ప్రజలు మీ సలహా కోసం ఫోన్ చెయ్యొచ్చు. నిజానికి ఇది అనవసరంగా పదేపదే క్లినిక్ కి రానవసరం లేకుండా, మీ సమయాన్ని ఆ వ్యక్తి సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మీకు మానసిక వ్యాధి సంబంధమైన సమస్య గురించి చెయ్యొచ్చు. అలాంటి ఫోన్ కాల్స్ కి ఉదాహరణలు:

  • ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి.
  • sevenసహాయం అవసరమైన పరిస్థితిలో ఉన్న చిన్నపిల్లలు.
  • తాగి, గందరగోళ స్థితిలో ఉన్న వ్యక్తి.
  • కోపంతో తిడుతున్న వ్యక్తి.
  • టెలిఫోన్ ద్వారా అస్పష్ట సలహాలను లేక లేనిపోని భరోసాల నివ్వకండి. వారితో వ్యవహరించడానికి ఈ పద్ధతిని అనుసరించండి:

  • వారి పేరు, వయసు, చిరునామా, ఏ టెలిఫోన్ నెంబరు నుంచి ఫోన్ చేస్తున్నారో అడగండి.
  • వారి సమస్య ఏమిటి, అది ఎలా ప్రారంభమయింది, ఈ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా చెప్పమనండి. వారు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఒక అభిప్రాయానికి రండి.
  • వారు మాట్లాడ గలిగిన బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారేమో అడగండి. వారితో తమ బాధను పంచుకోవడానికి ప్రోత్సహించండి.
  • వారు తిడుతుంటే లేక గందరగోళంలో ఉంటే మీరు వారికి సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని, కాని వారు తమ ధోరణిని మార్చుకుంటేనే అది జరుగుతుందని వివరించండి. అయినా వారు మారకపోతే, టెలిఫోన్ ని పెట్టేయండి.
  • ముఖాముఖి మాట్లాడి అంచనా వేస్తే బావుంటుందని అనిపిస్తే, వారిని క్లినిక్ కి రమ్మనండి.
  • పిల్లలు బాధలో ఉంటే వెంటనే పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్థానిక బృందాలకు లేక పోలీస్ కు సమాచారాన్ని తెలపండి. పిల్లల్ని వారు ఇప్పుడు ఉన్నచోటే ఉండమనండి, వారికి సహాయం చెయ్యడానికి ఒకరు వస్తున్నారని చెప్పండి.

కుటుంబసభ్యులు దగ్గరగా ఉండగా ఒక వ్యక్తిని అంచనా వెయ్యడం

eightమానసిక వ్యాధులు ఉన్నవారిని అంచనా వెయ్యడంలోనూ, చికిత్స చెయ్యడం లోనూ కుటుంబాలు చాలా ముఖ్యమైన పాత్రవహిస్తాయి. వ్యక్తి యొక్క ఏకాంతానికి భంగం కలగకుండా వ్యాధిని గురించి అంచనా వెయ్యడంలో కుటుంబాన్ని భాగస్వాముల్ని చెయ్యాలి. నిబంధన ప్రకారం కనీసం ఒక్కసారన్నా ఆవ్యక్తితో ఒంటరిగా మీరు మాట్లాడడం ముఖ్యం. ఈ ఇంటర్వ్యూలో మీరు కుటుంబ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను, ఒత్తిడులను గుర్తించే అవకాశం కలుగుతుంది. తరువాత ఇతర కుటుంబ సభ్యులతో సమస్యను చర్చించవచ్చు. అయితే ఆ వ్యక్తి గోప్యంగా ఉంచమని కోరిన విషయాల గురించి వారితో చర్చించకుండా జాగ్రత్త వహించాలి.

కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి గురించి సమాచారం తెలపడానికి కుటుంబం కీలకమవొచ్చు. ఉదాహరణకు, బాగా తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నవారు, మద్యం లేక మత్తు మందుల వ్యసనం ఉన్నవారు తమ సమస్య గురించి వివరంగా, స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. అప్పుడు బంధువులతో మాట్లాడడం వలన వ్యాధిని నిర్ధారించడానికి అవసరమైన సమాచారం లభిస్తుంది. వ్యాధి ఉన్నవారిని జాగ్రత్తగా గమనిస్తూ, వారు సక్రమంగా మందులు వేసుకోవడానికి ప్రోత్సహించడానికి బంధువులు చాలా ముఖ్యమైన పాత్రను పోషించగలరు.

2.4. మానసిక వ్యాధి ఉన్న వారిని అంచనా వేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు :

  • మానసిక అనారోగ్యాన్ని అంచనా వెయ్యడంలో ముఖ్యమైన అంశాలు తగినంత సమయాన్ని వారికోసం వెచ్చించడం, వారు చెప్పేదాన్ని ఓర్పుతో వినడం.
  • మానసిక్ర అనారోగ్యం ఉన్న చాలామంది తమ సమస్య గురించి పూర్తిగా, స్పష్టంగా చెప్పగలరు. బంధువులు కూడా విలువైన సమాచారాన్నివ్వగలరు.
  • క్రమబద్ధంగా జరిపిన ఇంటర్వ్యూ మానసిక వ్యాధిచికిత్సలో మొదటి (మరియు చాలా ముఖ్యమైన) అడుగు.
  • ప్రత్యేకమైన బాధల గురించి ప్రశ్నించడం ద్వారా చాలా సాధారణ మానసిక ఆరోగ్య సమస్యల్ని సులభంగా నిర్ధారించవచ్చు
  • మానసిక అనారోగ్యం ఉన్నవారికి శారీరక బాధలు కూడా ఉండొచ్చు; మానసిక వ్యాధి ఉందనే నెపంతో ఎప్పుడూ శారీరక వ్యాధిని పట్టించుకోకుండా వుండొద్దు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate