অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బాల్యం, కౌమార దశలో సమస్యలు

బాల్యం, కౌమార దశలో సమస్యలు

  1. ఎదుగుదలలో మైలురాళ్ళు
    1. మెంటల్ రిటార్టేషన్ (ఎమ్.ఆర్) అంటే ఏమిటి
    2. బుద్ధిమాంద్యానికి కారణమేమిటి
    3. బిడ్డ మామూలుగా మాట్లాడ లేకపోయినప్పుడు
    4. బుద్ధిమాంద్యం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది
    5. మీరు ఎప్పుడు బుద్ధిమాంద్యాన్ని అనుమానిస్తారు
    6. ఈసమస్యనెలా సంబాళించడం
  2. చదువులో ఇబ్దందులు వున్న బిడ్డ
    1. పిల్లలకు చదువులో ఇబ్బందులు రావడానికి కారణాలేమిటి
    2. ఈ సమస్యనెలా పరిష్కరించడం
  3. ఒకచోట స్థిరంగా కూరోలేని బిడ్డ
    1. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ అంటే ఏమిటి
    2. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవడం
    3. ఎ డి హెచ్ డి ఎందుకు ముఖ్యమైన సమస్య
  4. వేధింపులకు గురవుతున్న బిడ్డ
    1. పిల్లలు వేధింపులకు ఎందుకు గురవుతారు
    2. వేధింపు కారణంగా పిల్లలెలా నష్టపోతారు
    3. పిల్లలపై వేధింపును ఎప్పుడు అనుమానించవచ్చు
    4. ఈ సమస్యనెలా పరిష్కరించడం
  5. చెడ్డగా ప్రవర్తించే బిడ్డ
    1. ఎప్పుడు చెడు ప్రవర్తన ఆరోగ్య సమస్యగా మారుతుంది
    2. పిల్లలు ఎందుకు చెడుగా ప్రవర్తిస్తారు
    3. ఈ సమస్యనెలా పరిష్కరించడం
  6. పక్కతడిపే బిడ్డ
    1. పిల్లలు ఎందుకు పక్కను తడుపుతారు
    2. పగటిపూట తడుపుకోవడం సంగతేంటి
    3. ఈసమస్యనెలా పరిష్కరించడం
    4. బట్టలు పాడయితే
  7. విచారంగా వున్న లేక నెప్పులు, బాధల గురించి ఫిర్యాదు చేసే కౌమార వ్యక్తి
    1. కొంతమంది కౌమారులు ఎందుకు విచారంగా వుంటారు
    2. కౌమారుల్లో డిప్రెషన్
    3. ఈ సమస్యనెలా సంబాళించడం

మ్మదిగా పెరుగుతున్న బిడ్డ

ఈ విభాగంలో ఇతర పిల్లలు పెరిగిన క్రమంలో పెరగని బిడ్డగురించి వివరించ బడింది. పిల్లల శారీరక, మానసిక సామర్థ్యాలలో తేడాలు వుంటాయి (పెద్దవారిలో కూడా). కొంతమంది పిల్లలు ఇతరులకంటే ఆటల్లో మెరుగా వుంటారు, కొంతమంది పిల్లలు ఇతరులకంటే చదువులో ముందుంటారు. కొంతమంది ఇతరులకంటే ఆలస్యంగా నడవడం నేర్చుకుంటారు. ఒక బిడ్డ ఎదుగుదలలో ముఖ్యమైన మైలు రాళ్ళను సాధించడం ఆలస్యంగా జరుగుతూ వుంటే , ఆ బిడ్డ బుద్ధిమాంద్యంతో (మెంటల్ రిటార్టేషన్, ఎమ్.ఆర్.) బాధపడుతూందేమోనని కలతచెందాలి. ఈవిభాగంలో బుద్ధిమాంద్యం గురించి ప్రాధమిక అంశాలను వివరించడం జరిగింది.

ఎదుగుదలలో మైలురాళ్ళు

బిడ్డ పుట్టినప్పటినుండి పెద్దయేవరకు ఎదుగుదలలో చాలా మైలు రాళ్ళు వున్నాయి. ఆశించిన దానికన్నా ఎక్కువ నెమ్మదిగా ఒక బిడ్డ ఎదుగుతున్నదా అనేది తెలుసుకునేందుకు కొన్ని ముఖ్యమైన మైలు రాళ్ళు వున్నాయి. క్రింద వున్న మైలురాళ్ళను బుద్ధిమాంద్యాన్ని కనుగొనడానికి సూల మార్గదర్శకాలుగా ఉపయోగించుకోవచ్చు.

మైలురాయి

ఎక్కువామంది పిల్లలు ఈమైలురాయిని సాధించే వయసు

మైలురాయిని చేరడం ఇంతకన్నా అలస్యమైంతే బుద్ధిమాంద్యాన్ని అనుమానించవచ్చు

పేరుపెట్టి పిలిస్తేస్వరాలకు స్పందన

1-3 నెలలు

4 వ నెల

ఇతరుల్ని చిరునవ్వుతో చూడడం

1-4 నెలలు

6 వ నెల

తలను స్ధిరంగా నిలపడం

2-6 నెలలు

6 వ నెల

ఆసరా లేకుండా కూర్చోవడం

5-10 నెలలు

12 వ నెల

ఆసరా లేకుండా నిలబడడం

9-14 నెలలు

18 వ నెల

బాగా నడవడం

10-20 నెలలు

20 వ నెల

2-3 పదాల వాక్యాల్ని పలకడం

16-30 నెలలు

3 వ నెల

తనంత తాను తినడం, తాగడం

2-3 నెలలు

4 వ నెల

తన పేరును చెప్పడం

2-3 నెలలు

4 వ నెల

తనంత తాను టాయిలేట్ కి వెళ్ళడం

3-4 నెలలు

4 వ నెల

చిన్న ప్రమాదాల్ని తప్పించుకోవడం

3-4 నెలలు

4 వ నెల

మెంటల్ రిటార్టేషన్ (ఎమ్.ఆర్) అంటే ఏమిటి

మెంటల్ రిటార్టేషన్ అంటే మానసిక ధర్మాలు మందకొడిగా అభివృద్ధి చెందుతున్నాయని, మరొకలాగా చెప్పాలంటే బిడ్డ ఎదగవలసిన విధంగా వయసుకు తగినట్లు ఎదగడంలేదని. మెంటల్ రిటార్టేషన్ ఉన్న పిల్లలకు కొత్త విషయాల్ని నేర్చుకోవడం కష్టమవు తుంది. ఈ వైకల్యం బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన అన్ని అంశాలకు వర్తిస్తుంది. కూర్చోవడం, నడవడం దగ్గర్నుంచి తినడం, మాట్లాడడం వరకు ఏ విషయాన్ని నేర్చుకోవడమైనా కష్టమవుతుంది. మెంటల్ రిటార్టేషన్ జబ్బు కాదు, జీవితం తొలి దశ నుండి (సామాన్యంగా పుట్టినప్పటినుండి) వుండి, జీవితాంతం కొనసాగే ఒక పరిస్థితి. మెంటల్ రిటార్టేషన్కి చికిత్సలేదు, నయమవదు. కాని ఆబిడ్డ, కుటుంబం తాలూకు జీవన నాణ్యతను మెరుగు పరచడానికి చాలా చెయ్యొచ్చు. బుద్ధిమాంద్యం స్వల్పం, ఒకమోస్తరు లేక తీవ్రమైనది అయుండొచ్చు. బుద్ధిమాంద్యం వున్నవారిలో చాలా ఎక్కువ మందికి అది స్వల్పంగానే వుంటుంది. బిడ్డ ఎదుగుదల వివరాలను వివరంగా తెలుసు కోవడం ద్వారా బుద్ధిమాంద్యం స్థాయిని తెలుసుకోవచ్చు.

బుద్ధిమాంద్యానికి కారణమేమిటి

మెదడు సరిగ్గా అభివృద్ధి చెందక పోవడం కారణంగా బుద్ధిమాంద్యం వస్తుంది. మెదడు అభివృద్ధిని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. బుద్ధిమాంద్యానికి కారణాలుః


  • బిడ్డ పుట్టకముందు వచ్చే సమస్యలు, తల్లికి పోషకాహారం సరిగ్గా లభించకపోవడం, తల్లి మద్యాన్ని ఎక్కువగా తాగడం, తల్లికి వచ్చిన కొన్ని ఇన్ఫెక్షన్లు (ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఉప్పులో అయొడిన్ తక్కువగా వుండడం వలన బిడ్డ పుట్టాక థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చెయ్యక మెఁటల్  రిటార్టేషన్ లేక బుద్ధిమాంద్యం వస్తుంది);
  • బిడ్డ పుడుతున్నప్పుడు వచ్చే సమస్యలు, కాన్పు అవడానికి చాలా సమయం పట్టడం, లేక బొడ్డుతాడు బిడ్డ మెడ చుటూ బిగిసి పోవడం లాంటివి;
  • పుట్టాక మొదటి సంవత్సరంలో వచ్చే సమస్యలు, మెదడుకు ఇన్ఫెక్షన్లు, పచ్చకామెర్లు చాలా తీవ్రంగా వచ్చి, చాలా కాలంపాటు వుండడం, అదుపు చెయ్యలేని ఫిట్స్, ఏక్సిడెంట్స్, తీవ్రమైన పోషకాహారలోపం;
  • బిడ్డను పెంచడంలో లోపాలు, ప్రేరణలోపించడం, వేధింపులు, భావోద్వేగపరమైన నిర్లక్ష్యం;
  • జెనిటిక్ అంశాలు, డౌన్స్ సిండ్రోమ్ బుద్ధిమాంద్యం వున్న కొంతమంది పిల్లల్లో ఖచ్చితమైన కారణాన్ని ఎప్పటికీ తెలుసుకోలేము.

బిడ్డ మామూలుగా మాట్లాడ లేకపోయినప్పుడు

కదలికలు, కూర్చోవడం, నుంచోవడం, ఇతర శారీరక ధర్మాల పరంగా కొంతమంది పిల్లలు చాలా మామూలుగా వుంటారు. కాని వారికి మాట్లాడడంలో సమస్యలు వుంటాయి. తప్పనిసరిగా వారి వినికిడి శక్తిని పరీక్షించండి. వినికిడి సమస్యలు భాష అభివృద్ధిని ఆలస్యం చేస్తాయి. వారి వినికిడి శక్తి మామూలుగా ఉంటే బహుశా వారు మెంటల్ రిటార్టేషన్తో బాధపడుతూ వుండి వుంటారు. అరుదుగా వచ్చే మరొక పరిస్థితి ఆటిజమ్" కూడా కారణం కావచ్చు. ఆటిజమ్ వున్న పిల్లలకు ఇతరులతో సాంఘిక సంబంధాలను ఏర్పరచుకోవడం కష్టమవడం లాంటి ఇతర ప్రవర్తనాపరమైప సమస్యలు వుంటాయి. సరైన వ్యాధి నిర్ధారణ కష్టం కనుక భాష అలస్యమవడం  లాంటి సమస్యలు ఉన్న పిల్లల్ని పిల్లల వైద్య నిపుణుడిదగ్గరకు పంపాలి.

బుద్ధిమాంద్యం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది

బుద్ధిమాంద్యం పిల్లల అభివృద్ధిని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందిః

  • శారీరక ధర్మాలు, ఉదాహరణకు, బిడ్డ నడిచే, చేతుల్ని ఉపయోగించే సామర్థ్యాన్ని
  • స్వీయ సంరక్షణ, ఉదాహరణకు, తినడం, స్నానం చెయ్యడం, టాయిలెట్ని ఉపయోగించే సామర్థ్యాల్ని ఇతరులతో సంభాషణ, మాట్లాడడం, ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడం;
  • సాంఘిక వ్యవహారం, ఇతర పిల్లలతో ఆడుకోవడం లాంటిది;
  • మానసిక వ్యాధి
  • శారీరక వైకల్యాలు, వ్యాధులు (బుద్ధిమాంద్యం ఎంత తీవ్రంగా వుంటే అంత ఎక్కువగా ఫిట్స్, శారీరక వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది)
  • బిడ్డ బుద్ధిమాంద్యం వలన కలిగే న్యూనత, అసంతోషం, కోపం కారణంగా వచ్చే కుటుంబ సమస్యలు.

మీరు ఎప్పుడు బుద్ధిమాంద్యాన్ని అనుమానిస్తారు

బిడ్డకి ఈక్రిందివి వుంటే బుద్ధిమాంద్యాన్ని అనుమానించండిః

  • ఎదుగుదలలో మైలురాళ్ళు ఆలస్యమైనప్పుడు
  • స్కూలు చదువులో, ఇతర పిల్లలతో మాట్లాడడంలో ఇబ్బందులు;
  • చెప్పినది  సామర్థ్యం లేకపోవడం.
కౌమారులకు ఇవి వుంటే బుద్ధిమాంద్యంవుందని అనుమానించవచ్చుః
  • ఇతర కౌమారులతో సాంఘిక సంబంధాల్ని నిర్మించుకోవడంలో ఇబ్బందులు ఉంటే;
  • తప్పుడు లైంగిక ప్రవర్తన వుంటే
  • తన క్లాసులోని ఇతర విద్యార్థులు నేర్చుకున్నంత వేగంగా నేర్చుకోలేకపోతే,
పెద్దవయసువారు ఈక్రింది విధంగా వుంటే బుద్ధిమాంద్యాన్ని అనుమానించవచ్చుః
  • నిత్యం చేసే పనులు చెయ్యడంలో ఇబ్బందులు (ఉదా. వండటం, శుభ్రం చెయ్యడం);
  • సాంఘిక సర్దుబాటు చేసుకోవడంలో ఇబ్బందులు (ఉదా. స్నేహాల్ని చేసుకోవడం, పనిని వెదుక్కోవడం).

రెండు సంవత్సరాలలోపు పిల్లలకు సామాన్యంగా ఒకమోస్తరు లేక తీవ్రమైన బుద్ధిమాంద్యం వుంటుంది. కౌమారుల్లో గాని, పెద్దవయసు వారిలోగాని బుద్ధిమాంద్యం కనిపించినప్పుడు అది సామాన్యంగా స్వల్పంగా వుంటుంది. ఈ కారణంవల్లే బాల్యంలో దీనిని గుర్తించడం జరగదు, ఆవ్యక్తి తరువాత జీవితంలో కొత్త బాధ్యతల్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఒక సమస్యగా బయటపడుతుంది.

బుద్ధిమాంద్యం, మానసిక వ్యాధి ఒకేసారి వచ్చినప్పుడు

బుద్దిమాంద్యం వున్న చిన్న పిల్లలకు మానసిక వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. బుద్ధిమాంద్యం స్వల్పంగా వున్న పిల్లలు ఇతర పిల్లలతో పోలిస్తే తమకు వున్న పరిమిత సామర్థ్యాల్ని అవగాహన చేసుకోగలగడం కారణంగా క్లాస్ రూమ్లో భావోద్వేగపరమైన, ప్రవర్తనాపరమైన సమస్యలు వ్యక్తమవుతాయి. (హైపర్ఏక్టివిటీ లాంటిది). వారు పెరుగుతున్నకొద్దీ

స్నేహితుల్ని సంపాదించుకోవడంలో వున్న ఇబ్బందుల కారణంగా డిప్రెషన్కి, కోపానికి లోనవుతారు. లైంగిక సమస్యలు కూడా రావచ్చు ఎక్కువ తీవ్రమైన బుద్ధిమాంద్యం వున్న పిల్లలకు తరచుగా మెదడు దెబ్బతింటుంది, వారికి సైకోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ వుంది. బుద్ధిమాంద్యం వున్న బిడ్డ ప్రవర్తనలో మార్పు వస్తే మానసిక వ్యాధిని అనుమానించవచ్చు.

ఈసమస్యనెలా సంబాళించడం

తల్లిదండ్రుల్ని అడగ వలసిన ప్రశ్నలుః

  • మీ బిడ్డ అభివృద్ధి గురించి మీరు ఎందుకు ఆదుర్గా పడుతున్నారు? బిడ్డ అభివృద్ధిలో ఏ కోణం మీదగ్గరకు సలహా  కోసం వచ్చేలా చేసింది అనే విషయం గురించి స్పష్టమైన కథను తెలుసుకోండి.
  • ఏవయసులో మీబిడ్డ తలను నిలిపాడు? అసరాతో ఎప్పుడు కూర్చున్నాడు? ఆసరాతో ఎప్పుడు నుంచున్నాడు? తనంత తాను ఎప్పుడు నడిచాడు? రెండు పదాల వాక్యాన్ని మొదట ఎప్పుడు మాట్లాడాడు? ఇవి కీలకమైన మైలురాళ్ళు.
  • మీబిడ్డకు వినికిడి సమస్యలేమైనా ఉన్నాయా? దృష్టి లోపాలేమైనా వున్నాయా? మెంటల్రిటార్టేషన్ అని నిర్ధారణ చేసే ముందు ఇంద్రియపరమైన సమస్యలు లేవని నిర్ధారణ చేసుకోండి.
  • కొంచెం పెద్ద వయసు పిల్లల స్వీయ సంరక్షణ సామర్థ్యాలు, స్కూలు చదువు, ప్రవర్తన గురించి అడగండి.
  • మీబిడ్డకు ఫిట్స్లాంటి మెడికల్ సమస్యలు ఉన్నాయా?
  • సమస్యలకు కారణాలేమిటని మీరు అనుకుంటున్నారు? కొంతమంది తల్లిదండ్రులు ఏవో దుష్టశక్తులు లేక చేతబడి తమ బిడ్డను ఇలా మందకొడిగా చేసిందని అనుకుంటారు.
  • బిడ్డ పుట్టే సమయంలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ఉదా. కాన్పు అవడానికి ఎక్కువ సమయం పట్టడం లాంటిది. బిడ్డ పుట్టాక నెల లోపు ఏమైనా సమస్యలు వచ్చాయా? ఉదాహరణకు, తీవ్రమైన జ్వరం, ఫిట్స్ వచ్చాయా? కుటుంబంలో ఎవరికైనా నేర్చుకునే సమస్యలు వున్నాయా? ఈ ప్రశ్నలు బుద్ధి మాంద్యానికి కారణాన్ని గుర్తించడానికి సహాయసడతాయి.


బిడ్డను అడిగే ప్రశ్నలు

బిడ్డను ప్రశ్నల్ని అడగడానికి, వారి సామర్థ్యాల్ని పరీక్షచెయ్యడానికి కొంత ప్రత్యేకమైన శిక్షణ, అభ్యాసం వుండాలి. మెంటల్ రిటార్టేషన్ని గుర్తించడానికి ప్రధాన సాధనం తమ బిడ్డ ఎదుగుదల, సామర్థ్యాల గురించి తల్లిదండ్రులు చెప్పే వివరాలు. ఈబిడ్డ కొంచెం పెద్దవాడయితే అతని కలతలు (స్నేహితులతో సంబంధాలు, చదువు, పాఠశాలలో అతని ప్రగతి మొ.). అతను ఎదుర్కొంటున్న సమస్యల స్వభావం తెలిస్తే మెంటల్రిటార్టేషన్ ఈసమస్యలకు కారణమని గుర్తించగలు గుతారు.  బిడ్డ మాట్లాడే నైపుణ్యాల్ని అంచనా వేసి అతను తన వయసుకు తగినట్లు ఎదుగుతున్నాడో లేదో గమనించగలరు.

ఇంటర్వ్యూలో చూడవలసిన విషయాలు

  • ఇంటర్వ్యూలో బిడ్డ ఎంత శ్రద్ధగా వున్నాడో, ఎంత లీనమయి స్పందిస్తున్నాడో గమనించండి. బుద్ధిమాంద్యం వున్నపిల్లలు ఇంటర్వ్యూ విషయాలను అర్థం చేసుకోవడం కష్టం, మనసు అటూ, ఇటూ సంచరిస్తూ వుంటుంది. వారు పగటికలలు కంటున్నట్లు కనిపిస్తారు, లేక శ్రద్ధలేనట్లుగా వుంటారు. వారు చాలా సామాన్యమైన ప్రశ్నల్ని కూడా అర్థం చేసుకోవడం కష్టం, లేదా తప్ప జవాబులు చెప్తారు.
  • బుద్ధిమాంద్యం వున్న పిల్లలకు ఒకోసారి అసాధారణమైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. తల మరీ పెద్దది లేక చిన్నదిగా వుండడం, శారీరక వైకల్యాలు కనిపిస్తాయి. కాని బుద్ధిమాంద్యం వున్నపిల్లల్లో అధిక భాగం మామూలుగా, ఇతర పిల్లల్లాగానే కనిపిస్తారు.
  • కొంతమంది పిల్లలకు ప్రత్యేకమైన జెనిటిక్ సమస్య వుంటుంది. ఇది బుద్ధిమాంద్యంతో పాటు ప్రత్యేకమైన శారీరక అవకరాల్ని కలిగిస్తుంది. సాధారణంగా కనపడేది డౌన్స్ సిండ్రోమ్, ఇది వున్న బిడ్డకు వాలినకళ్ళు, క్రిందకు ఉన్న చెవులు, పొట్టి మెడ, అరచేతుల్లో స్ఫుటంగా కనిపించే ఒకే ఒక్క అడ్డ గీత వుంటాయి.

ప్రత్యేక ఇంటర్వ్యూ సూచనలుః

బుద్ధిమాంద్యం వున్నంతమాత్రాన ఆ బిడ్డ తన గురించి చెప్తున్నది అర్థం చేసుకోలేడనికాదు. బుద్ధిమాంద్యం ఎంత తీవ్రంగా వున్నప్పటికి, ఆగదిలో ఆబిడ్డ అసలు లేనట్లే ప్రవర్తించే తప్పును చెయ్యకండి, హుందాగా, గౌరవంగా ప్రవర్తించండి.

ఏమి చెయ్యాలి?

మొట్టమొదటి, అతి ముఖ్యమైన విషయం ఆ బిడ్డకు ఖచ్చితంగా బుద్ధిమాంద్యం వుందని నిర్ధారణ చేసుకోవడం. నయం చెయ్యలేని సమస్య అనే అర్థం వస్తుంది కనుక బుద్ధిమాంద్యం అనే ముద్ర చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆముద్ర చాలా అసంతోషాన్ని వేదనను కలిగిస్తుంది, అందుచేత జాగ్రత్తగా ఉపయోగించండి. వ్యాధి నిర్ధారణ ఖచ్చితమని తెలుసుకోవడానికి మూడు వ్యూహాలున్నాయి:

  • ఇంటర్వ్యూలో ఆ బిడ్డ వయసుకు సులభంగా వుండే మౌఖిక, రాత పరీక్షల్ని పెట్టండి. ఉదాహరణకు ఒక మూడేళ్ళ పిల్లని నీపేరేమిటని అడగండి.
  • స్కూలుకు వెళ్ళే పిల్లల్ని వారి స్కూలు చదువు ఎలా వుందో తెలిపే రిపోర్టును అడగండి.
  • రెండవ అభిప్రాయం కోసం మరొక బిడ్డను లేక మానసిక ఆరోగ్యనిపుణుడిని అడగండి.

ఒకసారి బిడ్డకు బుద్ధిమాంద్యం వుందని రూఢిచేసుకున్నాక, దాని తీవ్రతను నిర్ణయించండి. బిడ్డకు వున్న సామర్థ్యాలు రాబోయే సంవత్సరాలలో ఆబిడ్డ ఎంత అభివృద్ధిచెందగలడనే అంశానికి ముఖ్యమైన సూచిక (మరిన్ని వివరాలకు, డిజేబుల్ విలేజ్ చిల్డన్ డి వి సి.). బిడ్డ గురించి వాస్తవంగా ఏమి అశించవచ్చు అనే విషయాన్ని తల్లిదండ్రులకు అవగాహన కలిగించ వలసిన అవసరం వుంది.

  • బుద్ధిమాంద్యం వున్న చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్ళగలుగుతారు. చాలామంది, ముఖ్యంగా వారి అవసరాలకు స్పందించ గలిగిన ఉపాధ్యాయులు వుంటే, మామూలు స్కూల్స్కే వెళ్ళగలుగుతారు. కాని కొంతమందికి ప్రత్యేక పాఠశాల అవసరం అవుతుంది. చాలామంది తమ సంరక్షణను తాము చేసుకోగలుగుతారు, చాలావరకు స్వతంత్రంగా వుండగలుగుతారు. ఈ పిల్లలు ఎదిగేకొద్దీ ఇతరులతో స్నేహం చెయ్యడంలో, ఉద్యోగాల్ని వెదుక్కోవడంలో ఇబ్బందిపడతారు. రోజూ ఒకేలాగా మార్పు లేకుండా వుండే కాటీన్ ఉద్యోగాలు వారికి తగినవి.
  • ఒక మోస్తరు బుద్ధి మాంద్యం వున్నవారికి ప్రత్యేక పాఠశాలలు అవసరమవుతాయి. వారికి వెనుక ఎవరోఒకరు ఎప్పుడూ చెపూ వుండాలి, రోజువారీ పనులకు సహాయం అవసరమవుతుంది. ఉదాహరణకు ఒక బిడ్డ తనంత తాను స్నానం చెయ్యగలుగుతుంది, టూయిలెట్ కి వెళ్ళగలుగుతుంది, కాని గుర్తుచేస్తూ వుండాలి, అప్పుడప్పుడూ చేస్తూందో లేదో చూస్తూ వుండాలి. చాలా మంది పిల్లలు ఇతరులతో మాట్లాడటానికి కుటుంబ సభ్యుల మీద ఆధారపడతారు. చాలామంది తాము మామూలుగా చేసే ఉద్యోగాల్ని నిలుపుకోలేరు. కాని నీడపట్టున, వర్క్షాప్స్లాంటి చోట చెయ్యడం సాధ్యపడొచ్చు. (మీ స్థానిక వనరుల గురించి అధ్యాయం 12). పెద్దయాక లైంగిక సర్దుబాటు సమస్యకావొచ్చు.
  • తీవ్రమెన్ల బుద్ధిమాంద్యం వున్నవారికి జీవిత పర్యంతం సంరక్షణ అవసరమవుతుంది. వారు అంగవైకల్యాలతో, మెడికల్ వ్యాధులతో బాధపడొచ్చు. చాలా పెద్దయేదాకా మూత్రాశయంని, మలాశయంని కంట్రోలు చేసుకోలేక పోవచ్చు. అలాంటి పిల్లలు ప్రత్యేక స్కూల్స్లో కూడా నెగ్గుకు రాలేకపోవచ్చు. ఉద్యోగం చెయ్యగలగడం అవాస్తవ విషయం.

బిడ్డకు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచెయ్యకపోవడం లేక ఫిట్స్ లాంటి మెడికల్ సమస్యలు వుంటే నిపుణుల సలహాకోసం పంపండి. ప్రత్యేకంగా (అరుదుగా) వచ్చే ఈసందర్భాల్లో తప్పితే, బుద్ధిమాంద్యానికి చికిత్స కోసం మందులు వాడాల్సిన పని లేదు. మెదడు బాగా పని చేసేలా చేస్తాయనే ఉద్దేశంతో మెదడు టానిక్స్ని వాడగూడదు. ఇవి ఖరీదైనవేకాక సహాయపడేవి కావు. తల్లిదండ్రులకు బిడ్డకు పరిమితమైన సామర్థ్యాలే ఉన్నప్పటికి జీవితంలో అనేక మైలురాళ్ళను సాధించగలదనే నమ్మకాన్నివ్వండి. వారు బిడ్డ ఈమైలురాళ్ళను చేరుకోవడంలో కలుగుతున్న ఆలస్యాన్ని అంగీకరించడానికి సన్నద్ధంగా వుండాలి, తమ బిడ్డ ఏమేరకు సాధించగలదో వాస్తవంగా ఆలోచించాలి. ఈ సమస్యకు చికిత్స లేదని, చికిత్స చేస్తామని చెప్పే అబద్ధాల్ని నమ్ముతూ డబ్బును వృథాచేసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పండి. తినడం, టాయిలెట్కి వెళ్ళడం లాంటి రోజువారీ పనుల్లో సహాయ పడడమెలాగో తల్లిదండ్రులకు నేర్పండి. ఇక్కడ కొన్ని సామాన్య మార్గదర్శకాలు ( డి వి సి ) ఉన్నాయిః

  • తమ బిడ్డనుండి ఏమి ఆశించవచ్చు అనే విషయంలో తల్లిదండ్రులు మరీ అంత పట్టుగా వుండగూడదు.
  • బిడ్డకు ఉన్న బుద్ధిమాంద్యం స్థాయి, బిడ్డ వయసుని ಬಟ್ಲಿ తల్లిదండ్రులు తమ బిడ్డ ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ముందు కొంచెం సులభమైన పనులతో మొదలు పెట్టి, వాటిని సాధించాక మరికొంత క్లిష్టమైన కార్యక్రమాలను చేపట్టాలి.
  • కార్యక్రమాలను చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఉదాహరణకు, స్నానం చెయ్యడానికి మగ్గుతో నీళ్ళు పట్టుకోవడం, తల్లి లేక తండ్రి సబ్బును బిడ్డ ఒంటికి రాసి స్నానం చేయిస్తున్నప్పుడు సబ్బును పట్టుకోవడం, తనంతతాను బిడ్డ సబ్బును ఒంటికి రాసుకోవడం, సబ్బును కడుక్కోవడానికి నీళ్ళను ఒంటి మీద పోసుకోవడం, తనే టవల్తో తుడుచుకోవడం. మొత్తం పని పూర్తి అవడానికి ఇందులో ప్రతి ఒక్క భాగాన్ని విడిగా నేర్చుకోవాల్సిన అవసరం వుంది. మరొక కార్యక్రమాన్ని చేపట్టేముందు ప్రస్తుత కార్యక్రమాన్ని కనీసం రెండు వారాలపాటు మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
  • ఫలితం పెద్దగాలేదని తెలిసినప్పటికీ తల్లిదండ్రులు బిడ్డకు ప్రేరణనివ్వాలి. ఉదాహరణకు, వారు బిడ్డతో మాట్లాడవచ్చు, బిడ్డతో కలిసి పుస్తకాన్ని చదవొచ్చు చిన్న పిల్ల వయసుకి తగిన భాషను ఉపయోగించవలసిన అవసరం వుంది. బిడ్డ నేర్చుకున్నకొద్దీ తల్లిదండ్రులు తమ భాషను, కథ చెప్పే స్థాయిని మెరుగు పరచుకోవచ్చు.
  • ఎంత చిన్నదైనప్పటికీ బిడ్డ ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులు మెచ్చుకుని, చిన్న బహుమతిని ఇవ్వాలి.
  • తల్లిదండ్రులు తమ బిడ్డతో కలిసి సమయాన్ని గడపడానికి వీలు కలిగించే కార్యక్రమాల్ని చేస్తూనే వారు ఇంటిపనులు చేసేందుకు అనుమతించాలి. ఉదాహరణకు బిడ్డ తల్లికి రోజువారీ చేసే ఇంటిపనుల్లో సహాయపడొచ్చు.
  • సాంఘిక కార్యక్రమాలు-ఎవరినైనా చూసినప్పుడు నమస్కరించడం, విడిపోయేటప్పుడు సెలవు అని చెప్పడం, తన బొమ్మల్ని కాసేపు ఆడుకోవడానికి ఇతర పిల్లలకు ఇవ్వడం, ఇతరుల వస్తువుల్ని తీసుకునేటప్పుడు వారి అనుమతిని కోరడం, వ్యతిరేక సెక్స్ వా

    రితో సరిగ్గా ఎలా మెలగాలో నేర్చుకోవడం- స్వతంత్రంగా బ్రతకడానికి బిడ్డ చేసుకునే సర్దుబాట్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. బిడ్డకు తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడంలో నిలకడ వుండాలి, తాము బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. వారు తమ బిడ్డ ఏమి చెయ్యాలనుకుంటున్నారో, ఎందుకు చెయ్యాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి.
  • తల్లిదండ్రులు పిల్లలకు మితి మీరి రక్షణనివ్వగూడదు, తనంతతాను ఎంత చేసుకోగలదో అంత చేసుకోనివ్వాలి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, స్వావలంబనకు దారితీస్తుంది
  • బిడ్డ విద్యావసరాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దు. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డకు బుద్ధిమాంద్యం వుందని తెలియగానే ఇంక తామెంత ప్రయత్నించినా ప్రయోజనం వుండదని భావించి బిడ్డ చదువు సంగతిని వదిలేస్తారు. ఇతర పిల్లలకులాగానే వారి బిడ్డకు కూడా చదువు అవసరమని తల్లిదండ్రులకు గట్టిగా చెప్పండి. ప్రత్యేక అవసరాలున్న పిల్లల పాఠశాలకు ఆకుటుంబాన్ని పంపండి
  • బుద్ధిమాంద్యం వున్న పిల్లల కుటుంబాలకు ఆర్థిక, విద్యాపరమైన సహాయం చేసే ప్రత్యేక స్కీములేమైనా వుంటే వాటి సమాచారాన్ని వారికి ఇవ్వండి.
  • ఆ కుటుంబాన్ని అప్పుడప్పుడు కలుస్తూ వుండండి. బుద్ధిమాంద్యం వున్న బిడ్డ సంరక్షణ, ముఖ్యంగా బాగా తీవ్రంగా వున్నప్పుడు, అది చాలా తీవ్రమైన ఒత్తిడిని కలగజేస్తుంది. ఆ పిల్లల సంరక్షణ ఒక్కటే చాలా ఒత్తిడికి, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది  మీ ప్రదేశంలోని సపోర్టు గ్రూపుల దగ్గరకు పంపండి.
  • చివరగా, పిల్లల్ని వేధించడం, నిర్లక్ష్యం చెయ్యడం వుందని అనుమానిస్తే, నేర్చుకోవడంలో ప్రత్యేకమైన వైకల్యాలేమిటి? లో వివరించినట్లు సంబాళించండి.

ఎప్పుడు వేరేచోటకు పంపాలి?

థైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచెయ్యడం, మళ్ళీ మళ్ళీ ఫిట్స్రావడం బుద్ధిమాంద్యానికి కారణమని అనుమానిస్తే ఆబిడ్డను వైద్య నిపుణుడి దగ్గరకు పంపండి- ధైరాయిడ్ మందును, ఏంటీకన్వల్సెంట్స్ని తొలి దశలో ఇస్తే మానసిక సామర్థ్యాలు దిగజారకుండా అవి నిరోధిస్తాయి.

బుద్ధిమాంద్యాన్ని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • బుద్ధిమాంద్యం వలన తరచుగా అభివృద్ధి ఆలస్యంగా జరుగుతుంది. బుద్ధిమాంద్యం ఒక వ్యాధి కాదు, జీవితపర్యంతం క్రానసాగే పరిస్థితి.
  • బుద్ధిమాంద్యం వున్న అత్యధికమంది మామూలు పిల్లల్లాగే కనిపిస్తారు.
  • బుద్ధిమాంద్యాన్ని నయం చెయ్యలేము, నిరోధించవచ్చు. ఆరోగ్య కరమైన గర్భాలు, ప్రసవం, బిడ్డపుట్టాక సంరక్షణ, అభివృద్ధి
  • చాలా కేసుల్ని నిరోధిస్తాయి
  • తొలిదశలో గుర్తించడం చాలాముఖ్యం, ఎందుకంటే తల్లిదండ్రులకు శిక్షణనివ్వడం ద్వారా బిడ్డ అంతిమ ఎదుగుదలను మెరుగుపరచ డానికి సహాయపడుతుంది.
  • కౌమారదశదాకా, ఒకోసారి పెద్దయాకగానీ బుద్దిమాంద్యాన్ని గుర్తించలేకపోవచ్చు. అలాంటి వారికి బుద్దిమాంద్యం స్వల్పంగా వుంటుంది.
  • ఆబిడ్డల సంరక్షణను ఎలా చెయ్యాలో, ప్రత్యేక విద్యనందించాలో, ఆసమాచారం తల్లిదండ్రులకు అవసరమవుతుంది.
  • బుద్దిమాంద్యం ఉన్నప్పుడు, ఫిట్స్ని అదుపుచెయ్యడానికి, కొంతమందిలో వుండే తీవ్రమైన మానసిక వ్యాధులకు తప్ప, మందులు ఉపయోగపడవు.

పిల్లలకు మార్గదర్శనాన్ని ఇచ్చే క్లినిక్, లేక మానసిక ఆరోగ్య నిపుణుడు వుంటే బుద్ధిమాంద్యం వుందని మీరు అనుకునే బిడ్డను తదుపరి అంచనాల కోసం పంపండి. బుద్ధిమాంద్యం అనే ముద్రను బిడ్డ జీవితాంతం మోస్తాడు, రెండో ఆలోచన లేకుండా దానిని ఉపయోగించడంలో చాలా జాగ్రత్త వహించండి.

చదువులో ఇబ్దందులు వున్న బిడ్డ

పిల్లలకు అనేక కారణాలవలన చదువులో ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు వారు పని చేసి తల్లిదండ్రులకు సహాయం చెయ్యవలసిన అవసరం వుండొచ్చు. పాఠశాల చాలా దైన్యస్థితిలో వుండొచ్చు, గురువుకు సరైన శిక్షణ వుండకపోవచ్చు, ఇది బిడ్డకు చదువు ఎందుకూ పనికి రాదు అనే అభిప్రాయాన్ని కలగ జేయొచ్చు. చదువుకోవడాన్ని కష్టతరం ముఖ్యమైన మానసిక సమస్యలు పిల్లలకు వుండొచ్చు. పిల్లల్ని పాఠశాలకు వెళ్ళేలా చూడడం ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ముఖ్యమెనభాగం, ఎందుకంటే చదువుకున్నపిల్లలు ఆరోగ్యం వున్న వ్యక్తులుగా పరిణామం చెందుతారు.

పిల్లలకు చదువులో ఇబ్బందులు రావడానికి కారణాలేమిటి

సాధారణ కారణాలు కుటుంబంలో, పాఠశాలలో లేక బిడ్డలో వుంటాయి. కుటుంబంలో తల్లిదండ్రులు తగినంత సంరక్షణ చెయ్యకపోవడం, హింసకూడా బిడ్డ చదువుకు ఇబ్బందుల్ని కలగజేస్తాయి . కుటుంబంలో ముందు తరం వారు, తల్లిదండ్రులు పాఠశాల చదువు లేనివారయి, నేర్చుకునేవారే మొదటితరం వారయితే కూడా సమస్యలు రావచ్చు. తరగతి గదులు సరిగ్గా లేకపోవడం, తరగతిలో ఎక్కువమంది ఉండడం, సరైన శిక్షణ తైసీ ఉపాధ్యాయులు, బోధనాభాష అతను ఇంటిదగ్గర మాట్లాడేభాష కాకపోవడం (చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో యూరోపియన్ భాషలు) మొదలైన పాఠశాల సమస్యలు ఉంటాయి,

చదువులో ఇబ్బందులకు బిడ్డలో కనపడే కారణాలు:
  • బుద్ధిమాంద్యం, నేర్చుకోవడంలో ఇబ్బందులవలన
  • అతిచురుకు; ఏకాగ్రత, శ్రద్ధ చూపడం కష్టమవడం
  • బిడ్డకు సంతోషం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం వలన డిప్రెషన్
  • ప్రవర్తన పరమైన సమస్యలు, బిడ్డ సరిగ్గా ప్రవర్తించక ఇబ్బందుల్లో పడతాడు.
  • బిడ్డపై వేధింపు, బిడ్డ సంతోషంగా లేకపోవడం, పరధ్యానం వలన
  • వినడంలో లేక చూడడంలో ఇబ్బందులు;
  • మత్తుమందుల దుర్వినియోగం, మరీముఖ్యంగా కౌమారుల్లో
  • మెదడు చూసేదాన్ని వినేదాన్ని తప్పుగా గుర్తించడం వలన చదవడం, రాయడం, స్పెల్లింగులు, గుర్తులు, సంఖ్యల విషయంలో సమస్యలు (డిప్లెక్సియా), నేర్చుకోవడంలో ప్రత్యేకమైన ఇబ్బందులు

ఈ సమస్యనెలా పరిష్కరించడం

తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని అడగవలసిన ప్రశ్నలు

సామాన్యంగా పాఠశాలలో బిడ్డ చదువు సరిగ్గా లేనందున మీదగ్గరకు తీసుకు వస్తారు, అలా ఉపాధ్యాయుల నుండి పొందే సమాచారం సహాయకారిగా వుంటుంది. బాల్యంలో వచ్చే సాధారణ మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఈ విధంగా ప్రశ్నించవచ్చు:

  • మొదట బుద్ధిమాంద్యం గురించి ప్రశ్నల్ని అడగండి. ప్రత్యేకంగా బిడ్డ పాఠశాలకు వెళ్ళేదాకా స్వల్పంగా వుండే బుద్ధిమాంద్యాన్ని గుర్తించలేము. బిడ్డ ఎదుగుదలలో మైలురాళ్ళగురించి జాగ్రత్తగా అడగడం ద్వారా తెలిసిన వివరాలు బుద్ధిమాంద్యాన్ని సూచించవచ్చు.
  • వినికిడి, దృష్టిలోపాల గురించి అడగండి.
  • తరువాత అతిచురుకును పరిగణనలోకి తీసుకోండి. ఎక్కువ చురుకుగా వుండడం గురించి, ఏకాగ్రత, శ్రద్ధ గురించి ప్రశ్నించండి.  బిడ్డకు బుద్ధిమాంద్యంలేదని మీకు నమ్మకం వుంటే ఈక్రింది ప్రశ్నల్ని అడగండి:
  • చదువులో మీ బిడ్డకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? అతను ప్రధానంగా చదవడం, స్పెల్లింగులు, రాయడం, దేనిలో తప్పులు చేస్తాడు? అతనికి ప్రత్యేకంగా లెక్కలు చెయ్యడంలో సమస్య వుందా? చెప్పినదాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది వుందా? ఇవి ముఖ్యంగా డిప్లెక్సియా ఉన్న పిల్లల్లో వున్నట్లు తెలుస్తుంది.
  • మీబిడ్డకు కుడి, ఎడమ చెప్పడంలో ఏమైనా సమస్య వుందా? ఆమె తెలివి తక్కువగా, లేక తక్కువ సమతుల్యతతో, ఉదాహరణకు క్రీడల్లో, వ్యవహరిస్తూందా? డిసైక్సియా వున్న పిల్లలకు ఈవిధమైన ఇబ్బందులు వస్తాయి. చివరగా కుటుంబ సమస్యను పరిగణనలోకి తీసుకోండి. తల్లిదండ్రుల్ని హింస, బిడ్డను వేధించడంతో సహా ఇంట్లో సమస్యల గురించి అడగండి.
నేర్చుకోవడంలో ప్రత్యేకమైన వైకల్యాలేమిటి?

నేర్చుకోవడంలో ప్రత్యేక వైకల్యం అంటే చదువులో ఒక ప్రత్యేక కోణంలో ఇబ్బంది, ఉదాహరణకు చదవడంలో, స్పెల్లింగుల్లో, రాయడంలో లేక లెక్కల్లో, డిసైక్సియా అంటే,చదవడం, రాయడం, స్పెల్లింగులో ప్రత్యేక ఇబ్బంది నేర్చుకోవడంలో అతి సాధారణంగా కనపడే ప్రత్యేక వైకల్యం. ఈ పిల్లలకు మామూలు తెలివి తేటలు వుంటాయి. అవగాహన తక్కువగా వుండడం వలన డిప్లెక్సియా వున్న చాలామంది పిల్లల్ని మూఢులని, లేక ఉపాధ్యాయులు సరిగ్గా ప్రయత్నించడం లేదని అనుకుంటారు. డిసైక్సియా కారణంగా బిడ్డ పాఠాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. బిడ్డ ఏకాగ్రతను కోల్పోతాడు, విసుగు పుడుతుంది, సంతోషాన్ని కోల్పోతాడు, ఆగ్రహం కలుగుతుంది, తరగతిలో సవ్యంగా ప్రవర్తించడు. పరీక్షలో తప్పడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది.

కొంతమంది పిల్లలకు డిప్లెక్సియా ఎందుకు వస్తుందో మనకు తెలియదు. బహుశా సమాచారాన్ని మెదడు స్వీకరించి, క్రోడీకరించడంలో ఏదో తేడా వుంటుంది. మనకు డిప్లెక్సియా సాధారణ సమస్య అనీ, అది, బుద్ధిమాంద్యం ఒకటే కాదనీ తెలుసు. డిప్లెక్సియా వున్న పిల్లలకు వుండే సమస్యల రకాలు:
  • చూచిరాత రాయడంలో, స్పెల్లింగులు రాయడంలో ఇబ్బంది;
  • చెప్పినదాన్ని అర్ధం చేసుకోవడంలో ఇబ్బందులు;
  • సుంఖ్యలో, లెక్కల్లో ఇబ్బందులు;
  • చదవడంలో ఇబ్బందులు;
  • ప్రవర్తన్హా సమస్యలు.

ఎ) డిప్లెక్సియా వున్న పిల్లలకు చదవడంలో ఇబ్బంది వుంటుంది.

బి) ఇది ఉపాధ్యాయులతో వారికి ఇబ్బందుల్ని కలగజేస్తుంది.

సి) ఇది చదువులో ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది.

డి) ఇది మరింత ఇబ్బందిలో పడేలా చేస్తుంది.

ఇ) చివరకు వారు స్కూలు మానేస్తారు.

పిల్లల్ని అడగవలసిన ప్రశ్నలు

డిప్లెక్సియాను గుర్తించడానికి పిల్లల్ని ఇంటర్వ్యూ చెయ్యాలంటే అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. మీరు ఆపిల్లల్ని తదుపరి పరీక్షలకోసం బాలల మార్గదర్శక నైపుణ్యక్లినిక్కి పంపండి. తల్లిదండ్రులకు ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పండి. పరీక్ష అంటే వారు కలత చెందవచ్చు. ఒకవేళ దగ్గరలో అలాంటి క్లినిక్ లేకపోతే, బిడ్డను ఈ క్రింది ప్రశ్నల్ని అడగండి:

  • చదువులో నీకు ఇబ్బందులెందుకు వస్తున్నాయి? బిడ్డ అభిప్రాయాలు చాలా ಮಿಬ್ಬಂ; ఆబిడ్డ తన ఇబ్బందుల గురించి చాలా కలత చెందుతూ వుండి వుంటాడని గుర్తుంచుకోండి.
  • నీకు కొన్ని పాఠ్యాంశాలంటే మిగతా వాటికంటే ఎక్కువ ఇష్టంగా వుంటుందా? ఉదాహరణకు సంఖ్యలలో ఇబ్బంది ఉన్న పిల్లలకు లెక్కలంటే ఇష్టం వుండదు.
  • నీకు చదవడం లేక టీచర్ చెప్పింది అర్థం చేసుకోవడం కష్టంగా వుందా?
  • నీకు స్పెల్లింగులు కష్టంగా వున్నాయా?
  • నీకు లెక్కలు కష్టంగా వున్నాయా?
  • నీకు టీచర్ చెప్పేది వినడంలో ఇబ్బంది వుందా? బల్లమీద రాసింది సరిగ్గా కనపడడంలేదా?
  • ఈసమస్య నీ బ్రతుకు మీద ఎలాంటి ప్రభావం చూపుతూంది? నీ ఇబ్బందులకు మీటీచర్స్, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తున్నారు?

ఇంటర్వ్యూలో గమనించవలసిన విషయాలు

బిడ్డ చూపుని, వినికిడిని పరీక్షించండి. బిడ్డ మీ ప్రశ్నలకు మామూలు స్వరంతో జవాబిస్తుంటే, బహుశా ఆమె వినికిడి శక్తి మామూలుగా వుండి వుంటుంది. కొంచెం దూరంలో వున్న అక్షరాల్ని ఉదాహరణకు, క్లినిక్ గోడమీది పోస్టర్పై ఉన్న అక్షరాల్ని చదవమని చెప్పడం ద్వారా ఆమె చూపును పరీక్షించవచ్చు. డిప్లెక్సియాకు ప్రత్యేకమైన చిహ్నాలు మూడు రకాలుగా వుంటాయి: చదువు సంబంధిత, చలన సంబంధిత, భాష సంబంధిత

  • చదువు సంబంధిత చిహ్నాలు. బిడ్డను ఏ అంశం మీదనైనా సరే కొన్ని వాక్యాలను రాయమని అడగండి (ఉదాహరణకు, తన కుటుంబం) అతను రాసినదాన్లో స్పెల్లింగు లేక అక్షర క్రమంలో తప్పులు వున్నాయా, అక్షరాల్ని తారుమారుగా, అద్దంలో ప్రతిబింబం కనపడినట్లు, ఉదాహరణకు, తన ని ‘నత లాగా,'లతను తల లాగా రాసాడా అనేది చూడాలి. బిడ్డ కొన్ని అక్షరాల్ని రాయకపోవడం, పదంలో తప్ప అక్షరాన్ని రాయడం వుండొచ్చు, స్పెల్లింగు తప్పులు రాయొచ్చు. రాత తరచుగా పొందికగా వుండదు. బిడ్డను ఎక్కాల్ని చెప్పమని అడగడం ద్వారా లెక్కబెట్టడంలో ఇబ్బందుల్ని పరీక్షించవచ్చు. డిప్లెక్సియా వున్న పిల్లలకు హెచ్చవేతను క్రమంగా చెయ్యడంలో ఇబ్బంది వుంటుంది కనుక తప్ప జవాబులు వస్తాయి.

డిప్లెక్సియా వున్న బిడ్డ చేతిరాత

  • చలన సంబంధిత చిహ్నాలు. బిడ్డ స్థిమితం లేకుండా, లేక అతిచురుగ్గా వుంటుంది. పరధ్యానంగా, మతి మరపుతో వుంటుంది. అమెకు కుడి, ఎడమ తేడా తెలుస్తూందో లేదో గమనించడానికి కుడిచేతిని లేక ఎడమ చెవిని చూపమని అడగండి. అమెకు తన బూటు లేసుల్ని కట్టుకోవడం లేక చొక్కా గుండీ పెట్టుకోవడం కష్టమవుతుంది.
  • భాష చిహ్నాలు. చెప్పింది అర్ధం చేసుకోవడం, గడియారంలో టైమ్ని చూడడం, లేక కథను చెప్పడంలో బిడ్డకు ఇబ్బంది వుండొచ్చు.

ఏమి చెయ్యాలి?

  • తమ బిడ్డ మామూలుగానే కనపడుతున్నప్పటికీ చదువులో వెనకబడడం తల్లిదండ్రుల్ని నైరాశ్యంలో ముంచుతుంది. తమ బిడ్డ మెంటల్ రిటార్టేషన్తో బాధపడుతున్నాడేమోనని కలతచెందుతారు. బిడ్డకు నేర్చుకోవడంలో
  • సమస్యవుందని, పాఠశాల చదువులో రాణించకపోవడాన్ని తప్పు పట్టొద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పండి. సమస్యగురించి వివరించేముందు బిడ్డను పరీక్ష కోసం పంపడం మంచిది. చదువులో ఇబ్బంది పడడానికి చాలా కారణాలు వుండొచ్చు, డిప్లెక్సియా అందులో ఒకటి అవొచ్చు అని వివరించండి.
  • రెమిడియల్ ఎడ్యుకేషన్ అనే ప్రత్యేకమైన బోధనా పద్ధతి డిప్లెక్సియా (ఇతర సమస్యలు) వున్న పిల్లలు మెరుగ్గా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతి సహాయంతో చాలామంది పిల్లలు తమ పాఠశాల చదువును పూర్తి చెయ్యగలుగుతారు, చాలామంది బాగానే చదవగలుగుతారు. డిప్లెక్సియా ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన పాఠశాలలు అవసరంలేదు, అవి ప్రధానంగా మెంటల్ రిటార్టేషన్ ఉన్న పిల్లలకు కావాలి.
  • బిడ్డ అవసరాలగురించి టీచర్తో మాట్లాడండి. బిడ్డ మెంటల్ రిటార్టేషన్తో బాధపడడం లేదని వివరించండి. బిడ్డ కొన్ని సబ్జెక్ట్స్ని చదవనవసరం లేకుండా మినహాయించడానికి, కొన్ని అంశాల్లో (ఉదా. చూచిరాతలో) మార్ముల్ని వెయ్యడంలో మృదువుగా వుండడానికి పాఠశాలను ప్రోత్సహించవచ్చు (పాఠశాలలో మానసిక ఆరోగ్య పెంపుదల)
  • బిడ్డకు మెంటల్ రిటార్టేషన్ లేక అతిచురుకు వుంటే  విభాగాలు 8.1,8.3.
  • బిడ్డకు కౌన్సిలింగ్ చెయ్యండి. ఆమెకు బహుశా కోపంగా, సంతోషం లేకుండా వుండి వుండొచ్చు. ఆమెకు సరిగ్గా చదవకుండా అడ్డుపడుతున్న సమస్య వుందని వివరించండి. ఆమె మూఢురాలుకాదని, సరైన సహాయం అందితే ఆమె తప్పకుండా మెరుగ్గా చదవగలదని నచ్చజెప్పండి.
ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

వ్యాధి గురించి పూర్తిగా నిర్ధారణ చేస్తేగానీ బిడ్డకు బుద్ధిమాంద్యం లేక డిప్లెక్సియా అనే ముద్రను వెయ్యకండి. ఇది డిప్లెక్సియాలా కనిపించే స్వల్ప బుద్ధిమాంద్యం విషయంలో మరీముఖ్యం. బిడ్డను పరీక్షించడానికి ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ లేక పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకు పంపండి. వారు మీ ప్రదేశంలో వున్న వ్యాధిని నయం చేసే బోధనాసౌకర్యాల గురించి కొంత సమాచారాన్ని చెప్పగలరు.  పెట్టె 8.5. ఈపిల్లల్ని పంపడానికి నిపుణుల సౌకర్యాలు లేకపోతే ఏమి చెయ్యాలో వివరిస్తుంది.


పంపడానికి నిపుణుల సౌకర్యాలు లేకపోతే ఏమి చెయ్యాలి?
  • తల్లిదండ్రుల్ని హోమ్వర్క్ చెయ్యడంలో, చదువుకోవడంలో బిడ్డకు సహాయపడమని ప్రోత్సహించండి. బొమ్మల్ని గీయడం, వివిధ ఆకారాల్ని గీయడం (ఉదా. గడియారం, మనిషి) ఉపయోగకరమైన వ్యాయామాలు.
  • చదవడంలో, రాయడంలో, లెక్కలు చెయ్యడంలో ప్రస్తుతం వున్న తరగతికంటే తక్కువ తరగతి స్థాయిలో బిడ్డ సామర్థ్యాల్ని పరీక్షించండి. ఈ విధంగా ఏ తరగతిలో బిడ్డను వుంచి చదివించవచ్చో నిర్ణయించవచ్చు.
  • తరువాత తను ఇప్పుడు వున్న స్థాయికి తగినట్లు రాణించడానికి సహాయపడండి.
  • ఒకవేళ మామూలు పాఠశాలల్లో సాధ్యం కాకపోతే, బిడ్డ ఉద్యోగ అవకాశాల్ని మెరుగుపరచగల నైపుణ్యాల్ని నేర్పించే వృత్తి విద్యా పాఠశాల వుందేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి.
చదువులో ఇబ్బందులు ఉన్న పిల్లల్ని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • చదువులో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న బిడ్డకు మానసిక ఆరోగ్య సమస్య వుండొచ్చు. బుద్ధిమాంద్యం, అతిచురుకు, డిప్లెక్సియా, డిప్రెషన్, బిడ్డపై వేధింపు- ఇవన్నీ చదువులో ఇబ్బందులకు దారితియ్యొచ్చు.
  • మామూలు తెలివితేటలు వున్న బిడ్డకు డిప్లెక్సియా వుంటే, చదవడం, రాయడం, స్పెల్లింగులు, లెక్కలలో వుండే ప్రత్యేక ಇಬ್ಬಂದಿ కారణంగా చదువులో వెనుకబడిపోతాడు.
  • బాల్యంలో వుండే చెడు నడవడికి, డిప్రెషన్కి డిప్లెక్సియా ముఖ్యమైన కారణం.
  • డిప్లెక్సియాను కనిపెట్టడానికి ప్రత్యేకమైన పరీక్షలు అవసరం.
  • డిప్లెక్సియా వున్న పిల్లలు మామూలు పాఠశాలల్లో చదవాలి. ఉపాధ్యాయులకు డిప్లెక్సియా గురించి తెలిసి వుండాలి, వారు అవసరమైతే ఆపిల్లలకు చదువులో ప్రత్యేక సహాయన్నందించాలి.

ఒకచోట స్థిరంగా కూరోలేని బిడ్డ

చాలామంది పిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాలలోపువారు, ఒకేచోట చాలా సేపు స్థిరంగా కూర్చోలేరు. ఒకచోట స్థిరంగా కూర్చో గలగడం ఒకపనిమీద, ఉదా. పుస్తకం చదవడం, మెదడు నిమగ్నమవగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. పిల్లలు ఎదిగేకొద్దీ నిమగ్నత వుండడం వారు బాగా చదువు కోవడానికి, క్రమశిక్షణతో మెలగడానికి అవసరం. ఒకవేళ బిడ్డ శ్రద్ధచూపకపోతే తరగతిగదిలో చెప్పినది అవగాహన చేసుకోలేడు. ఆప్పుడతను చంచలంగా, అస్థిరంగా వుంటాడు. అలాగే బిడ్డ తన తల్లిదండ్రులు ఏమి చెయ్యమని చెప్పారో దానిమీద శ్రద్ధ చూపకపోతే, అతను చెడుగా ప్రవర్తిస్తాడు. కొంతమంది పిల్లలు ఎంత చంచలంగా అవుతారంటే, వారు చాలా ప్రమాదకరమైన పనుల్ని చేస్తారు, ఉదా. ఎత్తులమీద నుండి క్రిందకు దూకడం. అలాంటి సందర్భాలలో బిడ్డ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ (ఎ డి హెచ్ డి) అనే ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడుతున్నాడు.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ అంటే ఏమిటి

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ అనే వ్యాధి మగపిల్లల్లో ఎక్కువగా వుంటుంది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ ఉన్న పిల్లలు ఇలా వుంటారు:
  • అస్థిరంగా, ఉదాహరణకు, ఒక పాఠం అయిపోయేదాకా కుర్చీలో కూర్చో లేకుండా వుంటారు;
  • చంచలంగా, అదేపనిగా మాట్లాడుతూ, ఇతరులకు అడ్డు తగులుతూ వుంటారు;
  • ఏకాగ్రత నిలపడం లేక శ్రద్ధగా వుండడం కష్టమవడం, ఉదాహరణకు హోమ్వర్క్ని పూర్తిచెయ్యలేకపోవడం;
  • సులభంగా ధ్యాస మరలడం, మొదలు పెట్టిన పనిని పూర్తిచెయ్యకపోవడం;
  • హఠాత్తుగా తనకు తోచింది చెయ్యడం- ఆలోచన లేకుండా అకస్మాత్తుగా మనసులోకి

ఏదివస్తే అది చేయడం;

  • ఆటల్లోగాని, ఇతరులతో మాట్లాడడంలోగాని తన వంతు వచ్చేదాకా ఆగలేకపోవడం;
  • ఇతరుల శ్రద్ధ అంతా తనమీదే వుండాలని దబాయించడం;
  • నేర్చుకోవడంలో, చదువులో సమస్యలు;
  • చిందరవందరగా, ఒక క్రమం లేకుండా వుంటాడు;

ఈ ప్రవర్తనలన్నీ బిడ్డ జీవితాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసేంత తీవ్రంగా వుంటాయి.

  • ఇంటిదగ్గర క్రమశిక్షణలో వుంచడం కష్టమవడం, తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎప్పుడేది తనకు తోస్తే అది చేసేయడం వలన వారికి చికాకు తెప్పిస్తాడు;
  • పాఠశాలలో ఒకదగ్గర కుదురుగా కూర్చోలేక, తరగతిలో బోధనకు ఎప్పుడూ అడ్డుతగులుతూ ఉపాధ్యాయులకు చికాకు తెప్పిస్తాడు;
  • ఆడుకునే దగ్గర తన వంతు వచ్చేవరకు ఆగకుండా స్నేహితులకు చికాకు తెప్పిస్తాడు;

ఈ సమస్యను ఎలా ఎదుర్కోవడం

కుటుంబాన్ని అడగవలసిన ప్రశ్నలు

  • సమస్యేమిటి? చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రవర్తన గురించి విసిగిపోతారు. తల్లిదండ్రుల్ని అడిగి బిడ్డ చేసే పనుల గురించి ప్రత్యేక వివరాల్ని తెలుసుకోండి.
  • మీబిడ్డ ఏవిషయంమీదైనా, ఉదాహరణకు మీరు చెప్పింది చెయ్యడం మీద, శ్రద్ధ పెట్టడం కష్టంగా వుందా? మీ బిడ్డకు కుదురుగా వుండడం, ఉదాహరణకు, భోజనం చేసేదాకా, చదువు పూర్తయేదాకా, ఒక దగ్గర కూర్చోవడం కష్టమవుతోందా?
  • పాఠశాలనుంచి ఏమైనా ఫిర్యాదులు వున్నాయా? ఎ డి హెచ్ డి లో బిడ్డ జీవితంలోని అన్ని కోణాల్లోనూ ప్రవర్తనాసమస్యలు కనిపిస్తాయి. సమస్య పాఠశాలలో లేక ఇంట్లో మాత్రమే ఐతే, ఆది ఆ ప్రత్యేక వాతావరణంలో బిడ్డ ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించినదై వుంటుంది, ఉదాహరణకు, ఉపాధ్యాయుడు చెప్పేది అర్థం చేసుకోవడాన్ని కష్టంచేసే నేర్చుకునే సమస్య, దానికారణంగా పాఠశాలలో మాత్రమే బిడ్డ చంచలంగా, అస్థిరంగా వుండడం.
  • మీరీసమస్యను ఎప్పుడు గుర్తించారు?
  • ఈ సమస్యను తగ్గించడానికి మీరేమి చేసారు? కుటుంబంలో హింస గురించి అడగండి. అతిచురుకుగా వుండే పిల్లల్ని వారి చెడు ప్రవర్తనను సరిచేసేందుకు చావబాదుతారు.

బిడ్డను అడిగే ప్రశ్నలు

  • నీకు పాఠశాలలోగాని, ఇంట్లోగాని సమస్యేమైనా వుందా? బిడ్డ సమస్య గురించి తన అభిప్రాయాన్ని చెప్పనివ్వండి.
  • టీచర్ చెప్పేదానిని అర్ధం చేసుకోవడం కష్టంగా వుందా? ఉదాహరణకు, ఆమె చెప్పేదానిమీద లేక నీ చదువు మీద దృష్టి పెట్టడం కష్టంగా వుందా? ఒకే చోట కొంతసేపు వుండడం, ఉదాహరణకు, క్లాసు అయిపోయేదాకా నీ కుర్చీలో కూర్చోవడం కష్టంగా వుందా?
  • ఇంట్లో సంగతేంటి? ఇంట్లో విషయాలపై శ్రద్ధచూపడం, ఉదాహరణకు, భోజనం పూర్తి చెయ్యడం, టెలివిజన్ చూడడం, కష్టంగా వుందా?
  • ఇతరులపై కోపం వస్తూందా? లేక విచారంగా వుందా?
  • మీ అమ్మా, నాన్న నీపై కోపగించుకుంటారా? ఎందుకు? కోపం వచ్చినప్పుడు వారేమి చేస్తారు?

ఇంటర్వ్యూలో గమనించవలసిన విషయాలు.

ఎ డి హెచ్ డి వున్న బిడ్డ అస్థిరంగా, చంచలంగా గదిలో ఒకచోట కూర్చోకుండా నిరంతరం లేచి అటూ, ఇటూ తిరుగుతూ వుంటాడు. ఇతరులు తమ వంతు వచ్చినప్పుడు చెప్తున్న దానికి అడ్డు తగులుతూ వుంటాడు.

ఎ డి హెచ్ డి ఎందుకు ముఖ్యమైన సమస్య

ఎ డి హెచ్ డి ఉన్న చాలా మంది లో  ఆవ్యాధి ఉన్నట్లు గుర్తించరు. దానికి బదులు వాళ్ళు అల్లరిగా, బాధ్యత లేకుండా వున్నారని ముద్రవేస్తారు. ఇది వారు న్యూనత చెందేలా, విచారపడేలా చేస్తుంది. వారికి సరైన చికిత్స లభించదు, దానితో వారు సరిగ్గా ప్రవర్తించరు, కొంతమంది పిల్లలు పెద్దయాక కూడా జీవితంతో సర్దుకోవడానికి సమస్యల్ని ఎదుర్కోవడం కొనసాగుతుంది. కొంతమందిలో కౌమార దశలో ప్రవర్తనా సమస్యలు తలెత్తుతాయి, మత్తుమందులకు లేక మద్యానికి అలవాటు పడతారు. తరువాత చాలా మంది అసాంఘిక కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. ఈవ్యాధిని గుర్తించడం బిడ్డ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తల్లిదండ్రులు, టీచర్స్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎక్కడ లోపముందో తెలియడం మెరుగ్గా చికిత్స చెయ్యడానికి ఉపయోగపడుతుంది.

ఏమి చెయ్యాలి?
  • బిడ్డసమస్యేమిటో (బిడ్డ వున్నప్పుడు) కుటుంబానికి వివరించండి. బిడ్డకు ఆరోగ్య సమస్య వుందని తెలిస్తేనే చాలా మంది తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా ఆశావహంగా ఉండడానికి తోడ్పడుతుంది.
  • ఇంట్లో ప్రవర్తనను అదుపు చెయ్యడంలో తల్లిదండ్రులకు సలహా అవసరమవుతుంది.
  • సమస్యను చెపూ క్లాస్ టీచర్కి ఒక వివరణను చీటీమీద రాసి పంపండి. తరగతిలో బిడ్డను అదుపు చెయ్యడం గురించి టీచర్తో చర్చించవచ్చు
  • కొంతమంది పిల్లలకు మిథైల్ ఫినిడేట్ అనే మందును వాడడంవల్ల ప్రయోజనం వుంటుంది. ఈ మందును పిల్లల వైద్యనిపుణుడు లేక మానసిక వైద్యనిపుణుడు మాత్రమే ఇవ్వవలసివుంటుంది.
  • నిద్ర మాత్రల్ని వాడకండి; ఇవి బిడ్డను మగతలో వుంచి అతని ఏకాగ్రతను ఇంకా దిగజారుస్తాయి.
అతిచురుకు పిల్లడిని సంబాళించడం, తల్లిదండ్రులకు మీరివ్వగల సలహా

తల్లిదండ్రులకు ఈక్రిందివి చెయ్యమని సలహా నివ్వవచ్చు.

  • పిల్లడికి ఇంట్లోనూ, పాఠశాలలోనూ ప్రశాంతంగా, ఏకాగ్రతతో వుండడానికి ఎక్కువ సహాయపడండి.
  • పిల్లడిని శిక్షించకండి. అతను ఉద్దేశ పూర్వకంగా అలా ప్రవర్తించడంలేదు.
  • బిడ్డ చెడుగా ప్రవర్తిస్తూంటే, అతనిని తిట్టొద్దు, కొట్టొద్దు. అలా చేస్తే మీరు అతనికి తప్పుడు శ్రద్ధను చూపిస్తున్నారు, అతని ప్రవర్తన ఇంకా చెడ్డగా మారుతుంది. దానికి బదులు ఆసమయానికి ఊరుకోండి, లేక నిర్లక్ష్యంచెయ్యండి, లేక ఆ గదిలోనుండి బయటకు వెళ్ళిపోండి.
  • బిడ్డ సక్రమంగా ప్రవర్తిస్తున్నప్పుడు పొగడండి, బహుమతిని ఇవ్వండి.
  • ఒకేసారి మరీ ఎక్కువ ఆజ్ఞల్ని ఇవ్వకండి, బిడ్డ మీరు అతనిని ఏమి చెయ్యమని ఆశిస్తున్నారో అర్ధం చేసుకోలేడు. ఉదాహరణకు, స్నానం చేసి చదువును పూర్తి చెయ్యి అని చెప్పొద్దు, దానికి బదులు రెండు పనులుగా విభజించి ముందు ఒకటి అప్పజెప్పండి.
  • ఒకటి బాగా పూర్తి చేసాక అతన్ని పొగిడి రెండో పనిని అప్పజెప్పండి.
  • పిల్లడికి ప్రేరణను తగ్గించండి, ఒకసారి ఒక్క బొమ్మను మాత్రమే ఇవ్వండి .
  • పిల్లడి విజయాల నమోదుతో గర్వం ఫైలును ఉంచండి. అతను గీసిన బొమ్మలు, సర్టిఫికెట్లు, అతని సామర్థ్యాలకు సూచికలుగా లభించిన జ్ఞాపికల్ని ఉంచొచ్చు.
  • బిడ్డ ఏమి చెయ్యాలని మీరు ఆశిస్తున్నారో దానిని స్పష్టంగా చెప్పండి, ఉదాహరణకు, 'నువ్వు మంచి పిల్లడిలా వుండు' అని చెప్పే బదులు 'బల్ల దగ్గరనుండి కదిలేముందు తినడం పూర్తి చెయ్యి అని చెప్పొచ్చు.
  • పరిమితికి మించి ఉన్న శక్తిని విడుదల చెయ్యడానికి బిడ్డ క్రమబద్ధంగా రోజూ ఆటల్లో పాల్గొనడం ఉపయోగకరమైన మార్గం.
  • బిడ్డకు రోజువారీ పనుల్ని క్రమబద్ధంగా చేసే పద్ధతిని ఏర్పరచండి. విషయాల్ని బిడ్డ నిర్ణయానికి వదిలేయకండి. గోడమీద టైమ్ ఛార్జును పెట్టండి, బిడ్డకు రోజులో ఏపని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
  • బిడ్డ భావాల్ని ఆలోచనల్ని వినండి. చాలామంది ఎ డి హెచ్ డి వున్న పిల్లలు తమను సరిగ్గా అర్థం  చేసుకోవడంలేదని భావిస్తారు, సంతోషంగా వుండరు. ఆతనికి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో  మీకు తెలుసని, తన జీవితాన్ని అతను నియంత్రించుకోవడానికి అవసరమైన సహాయాన్ని చెయ్యాలని వండగలిగేలా ఇంట్లో కోరుకుంటున్నానని అతనికి తెలియజెప్పండి.
  • మార్కెట్లు, పెళ్ళిళ్ళులాంటి జనం ఎక్కువ వున్న ప్రదేశాలకు ఆబిడ్డను తీసుకు వెళ్ళకండి. ఒకవేళ తీసుకు వెళ్ళినప్పటికి, అతనిని పర్యవేక్షించడం కష్టంగా వున్నప్పుడు వెనక్కు వచ్చేయడానికి సిద్ధంగా వుండండి.
  • కార్యక్రమాల్ని ముందుగానే రూపొందించుకోండి, దాంతో అతని ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని విచారాన్నికలగజెయ్యకుండా వుంటుంది.



అతిచురుకు పిల్లలను సంబాళించడం: ఉపాధ్యాయులకు మీరివ్వగలిగిన సలహా

టీచర్స్కి ఇవి చెయ్యమని సలహానివ్వాలి.

  • టీచర్ బల్ల దగ్గర విద్యార్థిని కూర్చోబెట్టాలి, అతని అవసరాలమీద ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి వీలవుతుంది. అంతేకాక, మిగతా విద్యార్థులంతా అతని వెనుక కూర్చుని వుండగా అందరికీమందు భాగాన కూర్చోవడం వలన అతని ధ్యాస మరలకుండా వుంటుంది.
  • అతని చుటూతా ఎక్కువ బాధ్యతతో, ఎక్కువ గౌరవంగా మెలిగే విద్యార్ధుల్ని కూర్చోబెట్టండి. ఆదర్శంగా వుండే ఒక విద్యార్ధితో స్నేహం చెయ్యడానికి ప్రోత్సహించండి.
  • ధ్యాస తప్పడాన్ని నివారించండి. ఉదాహరణకు కిటికి, లేక తలుపు దగ్గర విద్యార్ధిని కూర్చోనివ్వకండి
  • ఏదైనా చెయ్యమని చెప్పేటప్పుడు విద్యార్ధివంక చూడండి. సరిగ్గా విన్నాడో లేదో నిర్ధారించుకునేందుకు మీరు చెప్పినదాన్ని తిరిగి అతనిని చెప్పమనండి.
  • స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పండి. రోజువారీ చేసే పనుల్ని తరచుగా మార్చకండి.
  • క్లిష్టమైన మార్గదర్శకాల్ని సరళం చెయ్యండి. ఒకేసారి ఎక్కువ ఆజ్ఞల్ని ఇవ్వకండి. చెయ్యాల్సిన పనుల్ని చిన్న భాగాలుగా విభజించి, మధ్య మధ్యలో స్వల్పకాల విరామాలనివ్వండి.
  • మీరు చెప్పినదాన్ని అతను అర్థం చేసుకున్నాడని నిర్ధారించుకోండి. మీకు ఖచ్చితంగా తెలియక పోతే నెమ్మదిగా మళ్ళీ చెప్పండి. అరవడం వల్ల పని సులభమవదు.
  • అతనికి అవసరమనుకుంటే ఇతరుల్ని సహాయం అడగవచ్చని విద్యార్ధితో చెప్పండి. విద్యార్ధితో హోమ్వర్క్ పుస్తకాన్ని పెట్టించండి. అతను ఇంటికి వెళ్ళేలోగా హోమ్వర్క్ అంశాలన్నిటినీ రాసాడో లేదో మీరు సరిచూడొచ్చు. ఇది టీచర్ కి, విద్యార్థికి మధ్య భావ ప్రసారాన్ని మెరుగు పరుస్తుంది.
  • పరీక్షల సమయంలో ఈ విద్యార్థికి ఎక్కువ సమయాన్ని అనుమతించండి. ఉదాహరణకు అతని జవాబు పత్రాన్ని అందరికంటే చివరన తీసుకోండి. పనుల మధ్యలో విద్యార్థిని తరచుగా పర్యవేక్షించండి
  • విద్యార్థిని ఎప్పుడూ అవమానించవద్దు. దానికి బదులు నెమ్మదిగా అతను తరగతి నియమాల్ని ఉల్లంఘించాడని చెప్పండి. క్రమశిక్షణ విషయంలో నిర్ణీత నియమాల్ని అనుసరించండి.
  • విద్యార్థి ప్రతి అంశాన్ని విజయవంతంగా పూర్తిచేసినప్పుడల్లా పొగడండి, బహుమతిని ఇవ్వండి. ప్రతి ప్రయత్నాన్ని పొగడడం
  • ప్రతి విజయాన్ని పొగడడమంత ముఖ్యమైనది.  పాఠశాలల్లో మానసిక ఆరోగ్య పెంపుదలకు మార్గదర్శకాన్నిస్తుంది.


చంచలంగా వున్న బిడ్డను సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • చాలామంది పిల్లలు చంచలంగా ప్రవర్తిస్తారు, ముఖ్యంగా వారు మరీ పసిపిల్లలుగా వున్నప్పుడు. చాలా స్వల్పకాలం ఏవిషయం మీదైనా శ్రద్ధపెడతారు, ఇది బాగా తీవ్రంగా వున్నప్పుడు బిడ్డను ఇంటి దగ్గర, పాఠశాలలోను, స్నేహితులతోను అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. దీనినే అటెనన్డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిజార్డర్ (ఎ డి హెచ్ డి) అని అంటారు.
  • తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అతని ప్రవర్తనను ఎలా సంబాళించాలో సలహానివ్వడం ద్వారా, ఏకాగ్రత లోపం కారణంగా బిడ్డకు వచ్చే సమస్యల్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా ఎ డి హెచ్ డి కి మెరుగైన చికిత్స చెయ్యొచ్చు.
  • సాధ్యమైనప్పుడు బిడ్డను నిపుణుల దగ్గరకు పంపడం మంచిది. ఎ డి హెచ్ డి ని తగ్గించడానికి మందులు ఉన్నాయి, కాని వాటిని నిపుణులు మాత్రమే ఇవ్వాలి.

వేధింపులకు గురవుతున్న బిడ్డ

బిడ్డ ఆరోగ్యం లేక అభివృద్ధిని ప్రభావితం చేసే ఏపనైనా బిడ్డ పై వేధింపుగా పరిగణింప బడుతుంది. పిల్లలు అనేక విధాలుగా బాధింపబడతారు.
  • భావోద్వేగవేధింపు. ఇది అన్నిటికంటే ఎక్కువగా జరిగే వేధింపు, కాని చాలా అరుదుగా నమోదుచెయ్యబడుతుంది. సరిపడా ఆహారం లేక ప్రేమ, అప్యాయత లేక మందులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చెయ్యడం జరుగుతుంది. కొన్ని సార్లు కుటుంబంలో కేవలం ఒక బిడ్డ మాత్రమే వేధింపుకు గురవుతుంది, ఇతరుల్ని భిన్నంగా చూస్తారు. అరవడం, వెక్కిరించడం, నీచమైన తిల్లు తిట్టడం భావోద్వేగ వేధింపులో భాగం.
  • శారీరక వేధింపు. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డను క్రమశిక్షణలో వుంచడానికి అప్పుడప్పుడు చెంప దెబ్బ కొడతారు. ఐతే, శారీరక వేధింపు తీవ్రంగా, ఎక్కువ తరచుగా జరుగుతూంటే, అది బిడ్డ భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా విపరీతంగా దెబ్బతీస్తుంది. కొంతమంది పిల్లల్ని ఎంత తీవ్రంగా కొడతారంటే వారి ఎముకలు విరిగిపోవడం లేక తీవ్రమైన గాయాలవడం జరుగుతుంది.
  • లైంగిక వేధింపు. ఇది మరీ ఎక్కువగా బాధించే వేధింపు. ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి బిడ్డను లైంగిక ఆనందం కోసం ఉపయోగించు కుంటాడు. అతను బిడ్డ లైంగిక అవయవాల్ని ముట్టుకుంటాడు లేక బిడ్డను తన లైంగిక అవయవాల్ని ముట్టుకోమంటాడు, చివరికి బిడ్డతో లైంగికంగా కలుస్తాడు.

పిల్లలు వేధింపులకు ఎందుకు గురవుతారు

అడపిల్లలు, మగపిల్లలు కూడా వేధింపులకు గురవుతారు. బిడ్డను వేధించే వ్యక్తి తరచుగా తెలిసిన వ్యక్తి, తండ్రి, సోదరుడు, మామ, ఇతర మగ బంధువు, కుటుంబ స్నేహితుడు, ఇంటినెకరు, బిడ్డ సంరక్షకులు, లేక పొరుగువారు అయివుంటారు. పెద్దవ్యక్తి బిడ్డతో తనకు వున్న సన్నిహిత సంబంధాన్ని బిడ్డపై తన నియంత్రణను ఉపయోగించుకుంటాడు. పిల్లల్ని వేధిస్తున్న కుటుంబాల్లో ఇతర రకాల వేధింపులుకూడా వుంటాయి (తండ్రి తల్లిని హింసించడం లాంటివి). హింసించేవారిలో చాలామంది వారి బాల్యంలో హింసకు గురయిన వారైవుంటారు.

తక్కువ తరచుగా పిల్లలు అపరిచితులతో కూడా వేధింపులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో వీధిబాలలలాంటి, వేధింపుకు గురయే ప్రమాదం ఎక్కువ వున్న వారు, వేధింపులకు గురవుతారు, పెద్దవారితో సెక్స్వర్కర్స్గా ఉపయోగించు కోబడతారు. పర్యాటకం, వేగంగా జరిగే పట్టణీకరణ కారణంగా బాలల్ని రక్షించే సామాజిక వ్యవస్థలు కుప్ప కూలిన ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఇది మరీ ఆందోళనకరమైన స్థాయిలో వుంది. వేధింపు జరిపే వారిలో ఎక్కువమంది పురుషులే. కొంతమంది పరిణతిలేని, ఒంటరిగా, వెలిగా వుంటున్న పురుషులు, మద్యం, మత్తుమందుల వ్యసనం వున్న వ్మక్తులు , ఇలా వేధింపులకు పాల్పడతారు, కాని చాలామంది అసహజంగా కనపడరు, అసహజంగా ప్రవర్తించరు.

వేధింపు కారణంగా పిల్లలెలా నష్టపోతారు

ఇది వేధింపు రకం, తీవ్రత మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు మామూలుగా ప్రేమించే తండ్రి ఎప్పుడైనా ఒక చెంప దెబ్బకొడితే, పెద్దగా హాని జరగకపోవచ్చు. అలాకాక, అనేకసార్లు శారీరక హింస జరిగితే చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

  • శారీరక ఆరోగ్యం. కముకు దెబ్బలు, కోతలు, విరగడం, సిగరెట్ వాతలు మొదలైన గాయాలు, తీవ్రమైన కేసుల్లో మరణించవచ్చు.
  • లైంగిక ఆరోగ్యం. లైంగిక అవయవాలకు గాయాలు, గర్భం, లైంగిక వ్యాధులు రావచ్చు.
  • మానసిక ఆరోగ్యం. వేధింపుకు గురయిన పిల్లలకు భయం, ఉద్రేకం, ఏకాగ్రత లేకపోవడం, డిప్రెషన్, అసాంఘిక కార్యకలాపాలు వుంటాయి.
  • పాఠశాల చదువు. వేధింపుకు గురయే ಹಿಲ್ಲಲು చదువులో వెనుకబడుతారు.

పిల్లలపై వేధింపును ఎప్పుడు అనుమానించవచ్చు


శారీరక వేధింపు

బిడ్డకు ఇవి వుంటే శారీరక వేధింపు అని అనుమానించండిః

  • భయపడుతూంటే;
  • ఇతర పిల్లలకు దూరంగా వెళ్ళడం, వారితో ఆడుకోవాలని కోరుకోకపోతే
  • ఉద్రేకంగా వుంటే లేక ఇతర పిల్లల్ని అల్లరిపెడుతూంటే;
  • ఇంటినుండి లేక పాఠశాల నుండి పారిపోతే;
  • అబద్ధాలు చెపూంటే లేక దొంగతనం చేస్తూంటే;
  • స్కూల్లో సరిగ్గా చదవకపోతే

లేలంగిక  పేదింసు

బీద్ద్కు ఇవీ వుంటె లేలంగిక  పేదింసు అనీ అనుమానీంచ్మ్దీ

  • ముడుచుకుని వుండి, విచారంగా కనపడుతూ వుంటే,
  • బహిరంగంగా తన లైంగిక అవయవాలను ముట్టుకోవడం, వాటితో ఆడడం వంటి లైంగికంగా వ్యక్తమయే ఆట లేక ప్రవర్తన;
  • మీరు ఆశించినదానికంటే ఎక్కువ లైంగిక పరిజ్ఞానం;
  • ఒకసారి నియంత్రణ వచ్చాక మళ్ళీ మూత్రంతో పక్కతడపడాన్ని ప్రారంభించడం;
  • పాఠశాల చదువులో వెనుకబడడం;
  • అసహజమైన రీతిలో పెద్దవాళ్ళతో అపరిమితమైన స్నేహంగా వుండడం;
  • ఆత్మహత్యాప్రయత్నం చెయ్యడం;
  • స్పష్టమైన కారణం లేకుండా ఇంట్లోని పెద్దవాళ్ళంటే భయపడడం;
  • ఇతరుల్ని నమ్మకపోవడం;
  • మద్యం, మత్తుమందుల దుర్వినియోగాన్ని ప్రారంభించడం;
  • పదే పదే మూత్రవ్యవస్థ ఇన్ఫెక్షన్లు రావడం, మూత్రం పోసుకుంటున్నప్పుడు నెప్పి, లైంగిక అవయవాలకు ఇన్ఫెక్షన్లు లేక ఎర్రబడి, వాచిపోవడం.
  • అభివృద్ధి, ఎదుగుదల సక్రమంగా లేకపోతే
  • స్పష్టమైన మెడికల్ కారణం లేకుండా బరువు తగ్గడం;
  • ఎప్పుడూ జబ్బుపడడం;

భాష అభివృద్ధి సక్రమంగా లేకపోవడం, అంటే, అతను మాట్లాడ వలసినట్లుగా మాట్లాడలేకపోవడం; అవే చిహ్నాలు వేర్వేరు రకాల వేధింపుల్లో వుండొచ్చు. ఉదాహరణకు, ఇంటినుండి పారిపోవడం లైంగిక వేధింపు చిహ్నం కావొచ్చు, మూత్రంతో పక్క తడపడం శారీరక వేధింపు చిహ్నం కావొచ్చు

ఈ సమస్యనెలా పరిష్కరించడం

కుటుంబాన్ని లేక స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు

తమకు తెలిసిన బిడ్డ వేధింపుకు గురవుతున్నాడని చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు బాహాటంగా వెల్లడి చేస్తారు. మీరు ఒక బిడ్డ వేధింపుకు గురవుతున్నాడని అనుమానిస్తే, బాహాటంగా, నిక్కచ్చిగా, పెద్దవారిని వేధింపు గురించి అడగడం అవసరం.

  • ఈబిడ్డ ఎవరివల్లనైనా ఏవిధంగానైనా బాధింపబడుతున్నాడని మీకు తెలుసా లేక అనుమానిస్తారా; ఒకవేళ ఆఅవకాశం వుంటే, మూడు రకాల వేధింపుల గురించి ప్రత్యేకంగా అడగండి. లైంగిక, శారీరక వేధింపుకంటే తక్కువ బాధాకరమని అనుకుని భావోద్వేగ వేధింపు గురించి అడగడాన్ని ఉపేక్షించకండి.
  • బిడ్డను ఎవరు వేధిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అది ఎప్పుడు ప్రారంభమయింది?
  • బిడ్డకు శారీరకంగా దెబ్బలు తగిలాయా? ఎంత తీవ్రమైనవి? దీనికి ఏమి చేసారు?
  • బిడ్డ లైంగికంగా బాధింపబడిందా? ఎంత తీవ్రంగా? దీనికి మీరు ఏమి చేసారు?
  • ఈవిషయాన్ని మీరు మరెవరితోనైనా చెప్పారా? ఎవరితో?
  • బిడ్డకు గార్డియన్ లేక రక్షకుడు ఎవరు? అది వేధించే వ్యక్షే ఐతే, వేరెవరైనా  ఆబిడ్డ బాధ్యతను తీసుకుంటారేమో అడగండి.
బిడ్డను అదగవలసిన ప్రశ్న్ లు
  • కొన్నిసార్లు పిల్లలు ఎదిగిన వ్యక్తి చేత వేధింపబడతారు. ఇటీవల ఎవరైనా పెద్ద వయసు వ్యక్తి నిన్ను బాధించాడా? ఒకవేళ అవును ఐతే, అతను ఎవరు? ఒకవేళ బిడ్డ జవాబు చెప్పడానికి భయపడితే ఆమెను బలవంతం చెయ్యొద్దు. తరువాత ప్రశ్నను వెయ్యండి.
  • అతను నిన్నెలా బాధించాడు? ఎంత తరచుగా?
  • దీనిగురించి నువ్వెలా భావిస్తున్నావు?
  • నువ్వు ఎవరితోనైనా చెప్పావా? ఎవరితో? వారు నీతో ఏమి అన్నారు?

.ప్రత్యేక ఇంటర్వ్యూకు సూచనలు

  • వేధింపు జరిగే సంభావ్యత గురించి పిల్లల్ని ఇంటర్వ్యూ చెయ్యడం కష్టం. బిడ్డని అనుభవం వున్న ఆరోగ్య కార్యకర్త ఇంటర్వ్యూ చెయ్యడం ఉత్తమం. వీలయితే, పిల్లల వైద్యనిపుణుడిని, లేక వేధింపులకు గురయే పిల్లలతో పనిచేసే ఆరోగ్యకార్యకర్తను సంప్రదించండి.
  • బిడ్డ మీకు కొంచెం అలవాటయేదాకా వేధింపు గురించి బిడ్డను ప్రశ్నలు అడగకండి. దీని అర్థం ఎక్కువ సమయం బిడ్డతో గడపడం ఐతే, అలాగే చెయ్యండి. బొమ్మల్ని ఇస్తే బిడ్డ ప్రశాంతపడతాడు.
  • బిడ్డతో నెమ్మదిగా మాట్లాడండి. ఆ బిడ్డ మిమ్మల్ని ఏ ప్రశ్ననైనా స్వేచ్ఛగా అడగొచ్చని స్పష్టంగా చెప్పండి.
  • తల్లి లేక వేధిస్తున్నాడని అనుమానిస్తున్నవ్యక్తి కాక వేరెవరైనా పెద్దవారు దగ్గర వుండగా బిడ్డను ఇంటర్వ్యూ చెయ్యండి.
  • ఎవరినీ బెదిరించకండి, ఎవరిపైనా నిందారోపణలు చెయ్యకండి. మీరు బిడ్డను భయపెట్టొచ్చు, అప్పుడు పెద్దవారు మీ ఉద్దేశాల్ని అనుమానిస్తారు.
ఇంటర్వ్యూలో గమనించవలసిన విషయాలు

వేధింపుకు గురైన బిడ్డ శారీరక పరీక్షకు చాలా సున్నితంగా వుంటాడు. బిడ్డ ఏకాంతాన్ని గౌరవించండి. మీరు ఎందుకు పరీక్ష చేస్తున్నారో, ఏమి చేస్తున్నారో వివరించండి. పరీక్ష చేస్తున్నప్పుడు నమ్మదగిన కుటుంబ సభ్యుడిని ఉంచండి. గమనించిన వాటినన్నిటినీ వివరంగా నమోదు చెయ్యండి. ఇవి పోలీస్ విచారణలో ఉపయోగపడొచ్చు. బిడ్డను సంపూర్ణంగా పరీక్షించడంలో ఈక్రిందివి భాగంగా వుంటాయి:

  • బరువు, ఎత్తు (బిడ్డ పెరగవలసినట్లుగా పెరగడం లేదని సూచించే చిహ్నాలకోసం చూడండి);
  • శరీరంపై ఏవైనా గాయాలు;
  • లైంగిక అవయవాలు వాచి, ఎర్రబడడం లేక వాటిపై గాయాలు-మలద్వారాన్ని కూడా, ముఖ్యంగా బాలురకు, పరీక్షించండి
వెంటనే ఏమి చెయ్యాలి?
  • మీప్రాధాన్యం బిడ్డతారోగ్యం, భద్రత. బిడ్డకు ప్రాణాపాయం వుందని మీరు అనుమానిస్తే, వెంటనే భద్రత వుండే చోటుకు తరలించండి. ఇది ఒక కుటుంబ సభ్యుడు, దగ్గరలో వున్న అసుపత్రి లేక చిన్న పిల్లలతో పని చేస్తున్న సంస్థ అవొచ్చు.
  • సంబంధంవున్న పెద్దవారితో పిల్లల్ని వేధించడం నేరమని, ఫిర్యాదు చేస్తే పోలీస్ చర్యకు అర్హమని వివరించండి. ఇంటర్వ్యూలో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా రాయండి. పోలీస్కి చెప్పడం వలన పరిస్థితి ఇంకా దిగజారుతుందేమో అలోచించండి. (ఉదాహరణకు, వేధించే వ్యక్తి ఒక్కడు మాత్రమే కుటుంబంలో సంపాదనపరుడైతే, అతను జైలుకు వెళ్లే కుటుంబం ఎలా జీవిస్తుంది?). బిడ్డను భద్రమైన ప్రదేశానికి (ఉదాహరణకు, బంధువుల ఇల్లు) తరలించడం తాత్కాలిక పరిష్కారాన్ని స్తుంది. కొన్ని ప్రదేశాలలో, చట్టరీత్యా పిల్లలపై లైంగిక వేధింపు గురించి ఫిర్యాదు చెయ్యడానికి ఆరోగ్య కార్యకర్తలు కావాలి. అలాంటి ప్రదేశాల్లో పోలీస్కి సమాచారాన్ని అందించి చట్టాన్ని తన పనిని తాను చెయ్యనివ్వాలి.
  • అక్కడ వున్న కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీరు వేధింపును ఎందుకు అనుమానిస్తున్నారో వివరించండి. చాలా మంది తల్లిదండ్రులకు తమ పనులు బిడ్డ ఆరోగ్యానికి అంత హానికరమని తెలియదు. కేవలం బిడ్డను కొట్టడంవలన లేక వారి భావోద్వేగ అవసరాల్ని నిర్లక్ష్యం చెయ్యడం వలన కలిగే ప్రమాదాలగురించి చెప్పినంత మాత్రానే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. తరచుగా, తల్లిదండ్రులు బిడ్డను కొట్టడంవలన బిడ్డ సవ్యంగా ప్రవర్తించకపోవడం, అది మరిన్ని దెబ్బలకు దారితియ్యడం, ఆహింస మళ్ళీ బిడ్డ చెడు ప్రవర్తనకు దోహదం చెయ్యడం ఒక విష వలయం ఏర్పడుతుంది.
  • మీరు లైంగిక వేధింపును అనుమానిస్తే, కుటుంబం అంత సులభంగా దానిని అంగీకరించదు, ముఖ్యంగా వేధించే వ్యక్తి కుటుంబానికి సన్నిహితుడైతే, ఎవరి మీదా ఆరోపణ చెయ్యొద్దు. దానికి బదులు మీకలతల్ని బాహాటంగా కుటుంబానికి చెప్పండి, వేధింపు కొనసాగితే, బిడ్డ ఆరోగ్యం మరింత తీవ్రంగా దెబ్బ తింటుందని నొక్కి చెప్పండి.
  • బిడ్డకు తన భద్రత గురించి జాగ్రత్త పడడమెలాగో నేర్పండి. వేధింపు ఆమె తప్పకాదని, దానిగురించి మాట్లాడడానికి న్యూనత పడొద్దని వివరించండి ఇది మళ్ళీ జరగకుండా చూడడం చాలా ముఖ్యం. వేధింపు మళ్ళీ జరగకుండా నిరోధించడానికి ఈక్రిందివి సూచించండి:
    • వేధించే వ్యక్తితో నిన్ను ముట్టుకోవద్దని ఖచ్చితంగా చెప్పండి.
    • వేధించే వ్యక్తికి దూరంగా పారిపోండి- మిమ్మల్ని రక్షించగల వ్యక్తి దగ్గరకు వెళ్ళండి.
  • కుటుంబాన్ని సామాజిక సపోర్టు బృందాలతో, ಹಿಲ್ಲಲ సపోర్టు గ్రూపులు, కుటుంబ హింస గ్రూపులు, న్యాయ సహాయ బృందాలు, పిల్లల రక్షణ ఏజన్సీలు, పోలీస్ లేక వైద్య నిపుణులతో కలపండి.

వేధింపుకు గురైన బిడ్డకు సహాయపడడం తనగురించి సానుకూలంగా భావించడానికి సహాయపడడం

  • వేధింపుకు తన బాధ్యత ఏమీలేదని బిడ్డకు నచ్చజెప్పండి.
  • బిడ్డకు తన ప్రవర్తన, భావోద్వేగాల గురించి సానుకూల సందేశాలనివ్వండి.
  • స్నేహితులతో ఆడుకోవడంలాంటి బిడ్డ ఆనందించే పనుల్ని సూచించండి.
బిడ్డ నమ్మడానికిసహాయపడండి
  • బిడ్డ మీతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చనే నమ్మకం కలిగించండి.
  • బిడ్డతో ఏకాంతంగా సమయాన్ని గడపండి.
  • బిడ్డకు ప్రేమను, ఆప్యాయతను పంచండి, కాని శరీరాన్ని ముట్టుకోవడంలో జాగ్రత్త వహించండి.

బిడ్డ తన భావోద్వేగాల్ని గుర్తించి, వ్యక్తపరచడానికి సహాయపడండి

  • భావాల్ని ఉద్వేగాల్ని లీనం చేసుకునే ఆటల్ని ఆడండి.
  • ఉద్వేగాల్ని లీనం చేసుకున్న పుస్తకాల్ని చదవండి.
  • బిడ్డ అనుభవిస్తున్న ఉద్వేగాల గురించి, అవి రావడానికి కారణంగురించి మాట్లాడండి.
  • బిడ్డ నెమ్మదించేదాకా బొమ్మలతో ఆడించి బిడ్డకు కోపాన్ని నిగ్రహించుకునే విధానాల గురించి బోధించండి.
బిడ్డ భద్రతగా వుండడం కోసం సహాయపడండి
  • స్థానిక పోలీస్ ఫోన్ నంబర్లు వుంటే బిడ్డ సులభంగా చూడగలిగేలా ఎక్కడైనా రాసి పెట్టండి.
  • బిడ్డకు సహాయం చెయ్యగల స్నేహితుడు లేక పొరుగు వారిని ఎంపిక చెయ్యండి.
  • పెద్దవారికి నొ లేక వద్దు అని చెప్పడం నేర్చుకోవడానికి సహాయపడండి
పిల్లలను సాంత్వన పరచే సందేశాలు
  • నీగురించి నేను శ్రద్ధ తీసుకుంటాను.
  • నిన్ను నేను గౌరవిస్తాను.
  • నువ్వెంతో ముద్దుగా వున్నావు.
  • నీకు చాలా బలాలు వున్నాయి.
  • నువ్వు నాకు చెప్పి మంచి పని చేసావు; ఇంక నిన్ను మళ్ళీ కొట్టకుండా చూసుకుంటాము.
  • చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్ని కొట్టరు. ఇతరులు మిమ్మల్ని ముట్టుకునే తీరు నచ్చకపోతే నొ అని చెప్పొచ్చు.


ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

వేధింపు కొనసాగుతూ వుంటే లేదా తీవ్రంగా వుంటే పిల్లల వైద్యనిపుణుల బృందం దగ్గరకు పంపండి, పోలీస్కి సమాచారాన్నివ్వండి.

తరువాత ఏమి చెయ్యాలి?

ఆరు నెలలదాకా ఆబిడ్డతోనూ, కుటుంబంతోనూ నిర్ణీత సమయ వ్యవధి తరువాత మాట్లాడుతూ వుండండి. చాలా తరచుగా, ఒకసారి బహిరంగంగా వేధింపు గురించి చర్చించాక, వేధింపు తగ్గుతుంది. ఒకవేళ ఆగకపోతే, కుటుంబాన్ని వేధింపును ఆపమని ప్రోత్సహించండి. ప్రతిసారి బిడ్డతో మాట్లాడండి; చాలామంది ఆ ఆఘాతాన్నుండి బయటపడతారు, కాని కొంతమంది పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు, వారికి శిక్షణ పొందిన పిల్లల ఆరోగ్య కార్యకర్తలు లేక కౌన్సిలర్ల నైపుణ్య సహాయం అవసరమవుతుంది.

పిల్లల పై వేధింపును సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • పిల్లల పై వేధింపు పిల్లలు రిపోర్టు చేసినదానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం చాలామంది పిల్లలు పెద్దవారికి చెప్పడానికి విపరీతంగా భయపడతారు, లేక బిడియపడతారు.
  • వేధించే వ్యక్తి సాధారణంగా బిడ్డకు బాగా తెలిసిన వ్యక్లే అయివుంటాడు-తరచుగా తండ్రి, మామ, సోదరుడు, ఇంటి సేవకుడు, లేక కుటుంబ స్నేహితుడు.
  • ఆడపిల్లలకు లాగానే మగపిల్లలు కూడా వేధింపులకు గురవుతారు.
  • వేధింపు శారీరకమైన, భావోద్వేగపరమైన లేక లైంగికమైనది అవొచ్చు. ఈ మూడు రకాల వేధింపులు బిడ్డ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  • ఒకసారి వేధించేవారిని కనిపెట్టగానే వారు వేధింపును ఆపేస్తారు. మీరు వేధింపును అనుమానించగానే తల్లిదండ్రులకు చెప్పాలి.
  • బిడ్డ వేధింపుకు గురవుతానని చెస్తే ఎప్పుడూ అనుమానించకండి, నమ్మండి, దానిగురించి గంభీరంగా ఆలోచించండి.

చెడ్డగా ప్రవర్తించే బిడ్డ

చాలామంది పిల్లలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవిధేయంగా ప్రవర్తిసారు లేక కుటుంబ నియమాల్ని ఉల్లంఘిస్తారు. చాలామంది పిల్లలు, ముఖ్యంగా నాలుగు సంవత్సరాల వయపులోపు పిల్లలు, వారు కోరింది లభించకపోతే అసహనంగా వుంటారు, అల్లరి చేస్తారు. చాలామంది పిల్లలు ఈదశనుండి బయ

టపడతారు. చాలామంది తల్లిదండ్రులు ఈప్రవర్తన సహజమైన బాల్యానికి తగి

నదేనని, ప్రేమ, క్రమశిక్షణ ఆప్రవర్తనను అదుపు చేస్తుందని గుర్తిస్తారు. కాని, కొంత

మంది తల్లిదండ్రులు ఆదుర్గా పడుతూ సహాయంకోరతారు. అందువల్ల పిల్లల చెడు ప్రవర్తన ఆరోగ్య సమస్యగా మారుతుందని తెలియడం ఉపయోగకరంగా వుంటుంది.

ఎప్పుడు చెడు ప్రవర్తన ఆరోగ్య సమస్యగా మారుతుంది

బిడ్డ చెడు ప్రవర్తన సమస్య ఈక్రింది విధంగా వుంటే ఆరోగ్య సమస్యగా మారుతుంది:

  • చాలా కాలంనుంచి ఉంటే (ఆరు నెలల కంటే ఎక్కువ);
  • పదే పదే కుటుంబ, సామాజిక నియమాల్ని ఉల్లంఘించడం, ఉదా. అబద్ధాలాడడం;
  • కొట్టడం లేక తిట్టడం లాంటి ఉద్రేక ప్రవర్తన ఉన్నప్పుడు;
  • నేరాల్ని చేసినప్పుడు, దొంగతనంలాంటివి చేసినప్పడు;
  • పాఠశాల ఎగొట్టినప్పుడు లేక బాగా చదవకుండా, మార్కులు తక్కువ వచ్చినప్పుడు. బిడ్డ చెడు ప్రవర్తన తీవ్రంగా వుంటే దానిని కాండక్ట్ డిజార్డర్ అని అంటారు.

పిల్లలు ఎందుకు చెడుగా ప్రవర్తిస్తారు

చాలా మంది తల్లిదండ్రులు వాడు చెడ్డవాడు కాబట్టి చెడుగా ప్రవర్తిస్తున్నాడు అని భావిస్తారు. కాని అదెప్పుడూ నిజంకాదు.

ప్రవర్తనకు సంబంధించిన సమస్యలకు ప్రధానకారణం తల్లిదండ్రులు బిడ్డకు క్రమశిక్షణను నేర్పించిన విధానం.

ప్రవర్తనాపరమైన సమస్యలకు దారితీసే సందర్భాలివి:

  • కుటుంబంలో హింస వున్నప్పుడు, పెద్దవాళ్ళు తమ కోపాన్ని అసంతోషాన్ని ఇలాగే వ్యక్తపరుస్తారని పిల్లలు నేర్చుకుంటారు. తాము కూడా అలాగే చేస్తారు.
  • తల్లిదండ్రులు బిడ్డను క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఒకే తీరులో లేకపోతే బిడ్డ ఏదిఒప్పో, ఏది తప్పో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం.
  • బిడ్డను నిర్లక్ష్యం చేస్తే, ఇతరుల దృష్టిని తనపైకి తిప్పుకోవడానికి చెడుగా ప్రవర్తిస్తాడు.
  • బిడ్డ మత్తుమందుల్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆమె మత్తుమందుల్ని కొనడానికి డబ్బును దొంగిలిస్తుంది. కొన్నిసార్లు అతిచురుకు లేక డిసైక్సియా లాంటి మరొకమానసిక

ఆరోగ్య సమస్య కారణంగా పిల్లలకు ప్రవర్తనాపరమైన సమస్యలు వస్తాయి

సలిఫ్ ఎలా అదుపు తప్పిపోయాడు?

ఎనిమిదిమంది వున్న కుటుంబంలో సలిఫ్ ఆరవవాడు. అతని తండ్రి గ్రామానికి దూరంగా పనిచేసేవాడు. అతను సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చి ఒక నెలపాటు వుండేవాడు. వచ్చినప్పుడు అతను అలసటగా, అసంతోషంగా వుండేవాడు. అతను తెగతాగేవాడు, సలిఫ్ తల్లితో పోట్లాడేవాడు. సలిఫ్ తన తండ్రి తల్లిని చావబాదడం చూసాడు. అతని తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో చాలా కఠినంగా వుండేవాడు. తండ్రి పనికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు రహస్యంగా సంతోషించేవారు. దగ్గరలో వున్న కొట్టులో పనిచేస్తూ, ఇంటి పనితో కూడా సతమతమయిపోయే వారితల్లికి.

పిల్లల్ని క్రమశిక్షణలో వుంచడానికి సమయం వుండేది కాదు. సలిఫ్కి తొమ్మిది సంవత్సరాల వయసు వున్నప్పుడు క్లాసులు ఎగ్లోట్టడం మొదలు పెట్టాడు. అతని టీచర్ అతని తల్లితో సలిఫ్ని బడిలోనుండి వెళ్ళగొట్ట వలసి వస్తుందని హెచ్చరించాడు. సలిఫ్ తల్లి అతన్ని చావబాదింది; ఆమె అప్పుడు ఏడ్చి, సలిఫ్ తప్పుదోవలో పడితే దానికి అతని తండ్రి తననే తప్ప పట్టి నిందిస్తాడని భయపడుతున్నానని చెప్పింది. సలిఫ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, కాని తల్లిమీద చాలా కోపం వచ్చింది. అతను క్లాసులు ఎగొట్టడాన్ని కొనసాగించాడు, ఆ సంవత్సరం పరీక్షలో తప్పాడు. అతని తండ్రి ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితులు మరింత విషమించాయి. ఒకరోజు సలిఫ్ ఇంటినుండి పారిపోయాడు. కొన్ని రాత్రులు స్నేహితుడి ఇంట్లో వుండి ఇంటికి వచ్చి మళ్ళీ తన్నులు తిన్నాడు. అతను ఇంటి బయటే ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాడు, ఎప్పుడూ స్కూలకి వెళ్ళేవాడుకాదు. అతను స్నేహితులతో గడపడం, సిగరెట్లు తాగడం, షాప్స్నుండి దొంగిలించడం మొదలైనవి చేసాడు. ఒకరోజు అతని స్నేహితుల్లో ఒకతను గ్రామంలోనుంచి వెళ్తున్న వర్తకుడు ఇచ్చిన హీరాయిన్ని పీలుద్దామని సూచించాడు. చాలా త్వరగా సలిఫ్ మత్తుమందుకు అలవాటు పడ్డాడు, రోజూ అదిలేనిదే బ్రతకలేని స్థితికి వచ్చాడు. ఆ అలవాటు వలన డబ్బుకోసం దొంగతనం చెయ్యడం మొదలు పెట్టాడు, చివరికి ఒకరోజు పోలీసులకు పట్టుబడ్డాడు. సలిఫ్కి 16 సంవత్సరాల వయసులో తన గ్రామానికి చాలా దూరంలో వున్న బాల నేరస్తుల్ని వుంచే జువెనైల్ జైలుకు పంపారు.

ఈ సమస్యనెలా పరిష్కరించడం

కుటుంబాన్ని స్నేహితులను అడగవలసిన ప్రశ్నలు

  • సమస్యేమిటి? ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో చెడుగా ప్రవర్తించడం జరిగింది? తల్లి లేక తండ్రి కేవలం తన బిడ్డ చెడుగా ప్రవర్తిస్తున్నాడని చెప్తారు. దాని అర్థం ఏమిటో కనుకోండి.
  • ఎప్పటి నుండి మీరది గుర్తించారు? అది కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తూంది? బిడ్డ చదువును ఎలా ప్రభావితం చేస్తుంది? ఎంత ఎక్కువ కాలం నుంచి వుంటే సమస్య అంత తీవ్రంగా వుంటుంది.
  • బిడ్డ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? బిడ్డ అలా ప్రవర్తిస్తున్నప్పుడు మీరేమి చేస్తారు? తల్లిదండ్రులు బిడ్డను ఎలా క్రమశిక్షణలో వుంచుతున్నారో కనుకోండి. తల్లిదండ్రులిద్దరినీ ఈప్రశ్నను వేర్వేరుగా అడగండి. ఇది వారి భిన్నమైన వైఖరిని, క్రమ శిక్షణలో వుంచే పద్ధతిని వెల్లడి చేస్తుంది
  • మీరు బిడ్డను కొడతారా? ఎంత తరచుగా? దేనితో? హింసాత్మక క్రమశిక్షణ ప్రవర్తన సమస్యను ఇంకా తీవ్రం చేస్తుంది.
  • పరిస్థితిని మార్చడానికి మీరేమి చెయ్యడానికి సిద్ధంగా వున్నారు? పరిస్థితిని మార్చడానికి మీబిడ్డ ఏమి చెయ్యాలని మీరనుకుంటున్నారు?

బిడ్డను అడిగే ప్రశ్నలు

  • నీప్రవర్తనలో సమస్య వుందని నువ్వు భావిస్తున్నావా? సమస్యేమిటి? బిడ్డ తన తల్లి తన గురించి ఫిర్యాదు చేస్తూ వుంటుందని విని వుంటుంది. ఇప్పడామె స్పందించడానికి అవకాశమివ్వండి.
  • మీ తల్లితండ్రులంటే మీకు కోపంవుందా? ఎందుకు? బిడ్డ కోణంనుండి ఇబ్బందుల్ని తెలుసుకుంటే అటె పరిష్కారాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
  • నువ్వు ఇతర పిల్లలతో కొట్లాడుతున్నావా?
  • స్కూల్లో ఇబ్బందుల్లో పడుతున్నావా? పరిస్థితిని మార్చడానికి నువ్వేమి చెయ్యడానికి సిద్ధంగా వున్నావు? పరిస్థితిని మార్చడానికి మీ తల్లిదండ్రులు ఏమి చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు? తల్లిదండ్రుల్ని బిడ్డను అడిగే ఈ ప్రశ్నలు ఇంట్లో శాంతిని నెలకొల్పుకోవ డానికి ఎంతవరకు వారు సిద్ధంగా వున్నారనేది సూచిస్తాయి.
ప్రత్యేక ఇంటర్వ్యూ సూచనలు

బిడ్డకు సంబంధించినవి ప్రవర్త్నా సమస్య్ లు సుటుంబ వాతావరణినికి సంబంధించినవి . బిడ్డను, కుటుంబ సభ్యుల్ని కలిపి ఇంటర్వ్యూ చెయ్యండి. వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా ప్రతిస్పందిస్తారో గమనించండి. తల్లిదండ్రులకు, బిడ్డకు మధ్య ఉన్న కోపాన్ని మీరు గమనించ గలుగుతారు. తల్లిగాని తండ్రిగాని మాట్లాడుతున్నప్పుడు బిడ్డ ముఖంలో కనపడే హావ భావాలు బిడ్డకు సంబంధించిన ప్రవర్తనా సమస్యలు కుటుంబ వాతావరణానికి వారు చెప్తున్నదానికి అతనెలా ప్రతిస్పందిస్తున్నాడో తెలుపుతాయి. బిడ్డ అలక్ష్యంగా లేక విచారంగా వుంటాడు. ఎప్పుడూ తల్లిదండ్రులు చెప్పేది ఎంత ప్రధానమో అతను చెప్పేదికూడా అంతే ముఖ్యమన్నట్లుగా మీరు అతనితో మాట్లాడాలి.

ఏమి చెయ్యాలి?

  • ప్రవర్తనాసమస్యలు చాలా సాధారణమని, అవి బిడ్డ చెడ్డవాడవడంవలన వచ్చినవి కావని కుటుంబానికి (బిడ్డ దగ్గర వున్నప్పుడు) నమ్మకం కలిగేలా చెప్పాలి.
  • ప్రధాన చికిత్స పిల్లల్ని క్రమశిక్షణలో వుంచే నియమాల్ని వివరించడం. క్రమశిక్షణ సూటిగానూ, ఒకే విధంగానూ వుంటే పెద్దలందరూ బిడ్డ పట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తారు. "బయటకు పోయే సమయం" వచ్చిందని చెప్పడం, బిడ్డ కావాలని అన్నవాటిని ఇవ్వకుండా వుండడం, బిడ్డను క్రమ శిక్షణలో వుంచడానికి మేలు మార్గాలు. హింస, వేధింపు చాలా తక్కువగా ಏನಿವೆಸಿ మార్గాలు. చెడ్డగా ప్రవర్తించిన వెంటనే క్రమశిక్షణచర్య తీసుకోవాలి.
  • క్రమశిక్షణలో వుంచడానికి సహనంకావాలి, కొంత సమయం అవసరం. అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దు. వైవాహిక సమస్యలలాంటి కుటుంబ సమస్యలు వుంటే క్రమశిక్షణలో వుంచడం మరింత కష్టమవుతుంది. ఒకవేళ వుంటే వాటి మీద కూడా మీరు పని చెయ్యాల్సి వస్తుంది.
  • తల్లిదండ్రుల అనుమతితో ఇంట్లో పెద్ద వారికి లేక స్నేహితులకు ఈ సమస్యల గురించి చెప్పండి.
  • బిడ్డను నెమ్మదింప జెయ్యడానికి మందులు వాడాలని మీరు భావిస్తున్నప్పటికీ మందుల్ని వాడవద్దు.
  • బిడ్డకు నేర్చుకోవడంలో, ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు వుండే డిప్లెక్సియా లేక అతిచురుకు వుందేమోనని భావించాలి .

ప్రతి రెండు వారాలకు కుటుంబాన్ని కలవండి. ప్రతిసారి బిడ్డను కలిసినప్పుడు అతని ప్రవర్తనను సమీక్షించండి. పరిస్థితి మెరుగుపడకపోతే, ఎందుకు జరగలేదో కనుకోండి. తరచుగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న అంగీకారం అమలవక పోవడం కారణమవుతుంది.

ప్రవర్తన ఒడంబడిక వ్యవహారాన్ని ఎలా నెరపడం?

ఆరోగ్య కార్యకర్త ఒక కుటుంబంలో కొడుకును అతని తల్లిదండ్రులు అతనిని ఏమి చెయ్యడానికి అనుమతించాలను కుంటున్నారో, అతను వారికోసం ఏమి చెయ్యడానికి సిద్ధంగా వున్నాడో అడుగుతాడు. అరోగ్యకార్యకర్త వారి కొడుకు వారిని అనుకరించి వారు ప్రవర్తించినలాగానే ప్రవర్తిస్తాడని తెలుసుకోవడం ముఖ్యమని కుటుంబంతో చెప్తాడు. అందువలన తనను వారు కొడితే లేక అరిస్తే, తనకు కోపం వచ్చినప్పుడు తను కూడా అలాగే ప్రవర్తించాలని అనుకుంటాడు. ఆరోగ్యకార్యకర్త వారు ఒడంబడికను ఎలా అమలు చేసారో తెలుసుకోవడానికి మళ్ళీ రెండువారాలలో రమ్మని ఆహ్వానిస్తూ సమావేశాన్ని ముగిస్తాడు.

వేరే చోటకు ఎప్పుడు పంపడం?

మానసిక ఆరోగ్య ఆసుపత్రి లేదా పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకు ఇప్పుడు పంపండి:

  • బిడ్డ ఇతరులకు హాని చేసే ప్రమాదం వంటే (లేక మత్తుమందుల ద్వారా తనకు తాను హానిచేసుకునే ప్రమాదం)
  • బిడ్డ కుటుంబానికి తీవ్రమైన సమస్యలు, ఉదాహరణకు, తీవ్రమైన హింస లేక వేధింపు, వుంటే,

 

పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం : ఏది ఉపయోగకరం, ఏది కాదు?

ఒక ఆరోగ్య కార్యకర్తగా మీరు పిల్లలను క్రమశిక్షణలో ఎలా వుంచాలో తల్లిదండ్రులకు సలహానివ్వగలగాలి. వాస్తవంగా, ఇది మీకు కూడా ఒక తండ్రి లేక తల్లిగా మీపాత్రను నిర్వహించడానికి సహాయపడుతుంది! ఈ క్రింది అంశాలు ఎక్కువమంది తల్లిదండ్రులకు, ముఖ్యంగా మీరు అవి బిడ్డ ప్రవర్తనను ఎలా మెరుగుపరుస్తాయో వివరిస్తే, అంగీకారమవుతాయి.

  • మంచి ప్రవర్తనను మెచ్చుకోండి. మీరు మెచ్చుకుంటున్నదేమిటో, దాని గురించి మీరెలా భావిస్తున్నారో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు, “నువ్వు ఒక పేజీ మొత్తం హోమ్వర్క్ అంతా చెయ్యడం చూసాను. నాకు చాలా ఆనందంగా వుంది", అని మీరు చెప్పొచ్చు. ఇది బిడ్డ తనను తాను మెచ్చుకుని " ఓ! ఇది నేను చెయ్యగలను" అని భావించడానికి సహాయపడుతుంది
  • ఒకేవిధంగా వుండండి. మీరు ఏర్పరచిన నియమాలను తప్పక అనుసరించండి. ఆమోదించలేని ప్రవర్తనను ఒకసారి అనుమతించి మరొక సారి ప్రవర్తన అదుపులో వుండాలని ఆశించకండి. మీరు ఆప్రవర్తనను ఇష్టపడకపోతే, బిడ్డకు ఎందుకు ఇష్టపడడంలేదో స్పష్టంగా చెప్పండి, బిడ్డ సరిగ్గా ప్రవర్తించని ప్రతిసారి అదే నియమాలను అమలు చెయ్యండి
  • అందరు పెద్దవాళ్ళు బిడ్డ పట్ల ఒకే విధంగా ప్రవర్తించేలా జాగ్రత్త పడండి. తల్లిదండ్రులిద్దరూ బిడ్డపట్ల చెరొక విధంగా ప్రవర్తించడం పెద్ద సమస్య బిడ్డ తన తల్లిదండ్రుల్లో ఒకరి పట్ల సరిగ్గా ప్రవర్తించకపోతే రెండవవారు అతనిని వెనకేసుకొస్తారు అని నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు బిడ్డతో ఒకేవిధమైన క్రమశిక్షణతో వ్యవహరించాలి.
  • స్పష్టంగా వుండండి. మీరు ఎందుకు కలవరపడుతున్నారో, బిడ్డను ఎందుకు క్రమశిక్షణలో ఉంచుతున్నారో అర్థమయేలాగా చెప్పండి. మీఆజ్ఞల్ని సూటిగా ఇవ్వండి. ఒక్కసారి ఒక్క ఆజ్ఞను మాత్రమే ఇవ్వండి, ఒక ఆజ్ఞ తరువాత మరొకటి ఇవ్వండి, మీరు బిడ్డతో ఏమి చెయ్యగూడదో చెప్పేకంటే ఏమి చెయ్యాలో చెప్పాలి. ఉదాహరణకు, " ఆలస్యంగా ఇంటికి రాకు” అని చెప్పే బదులు "ఇంటికి రాత్రి పది గంటలలోపు రా" అని చెప్పండి.
  • ప్రశాంతంగా వుండండి. మీనెమ్మదితనాన్ని కోల్పోకండి. తల్లిదండ్రులు కోపగిస్తే బిడ్డకు తన కోపాన్ని భిన్నంగా ఎలా అదుపు చేసుకోవాలో నేర్చుకోవడం కష్టం.
  • "బయటకు పోయే సమయం (టైమ్ అవుట్)" అని చెప్పండి.  బిడ్డ సరిగ్గా ప్రవర్తించనప్పుడు అవతలికి పొమ్మని (ఉదాహరణకు, మరొక గదిలోకి), నెమ్మదించాక మళ్ళీ రమ్మని లేదా కొంత నిర్ణీత సమయం తరువాత (ఉదా.ఐదు నిమిషాల తరువాత) రమ్మని చెప్పడం. ఈ టైమ్ అవుట్ వ్యవధి తరువాత బిడ్డతో ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో, దాని గురించి ఆమె ఎలా భావిస్తూందో చర్చించడం ముఖ్యం. టైమ్అవుట్తో కలిసి టైమ్ ఇన్ వుండాలి. దీని అర్థం రోజూ కాసేపు బిడ్డతో ఆడడం, లేదా బిడ్డ చెప్పేది వినడం.
  • అతనికి రాగల లాభాల్ని నిరాకరించండి. ఉదాహరణకు, తప్పుగా ప్రవర్తిస్తున్న బిడ్డతో నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే ఈరోజు టెలివిజన్ని చూడలేవు అని చెప్పడం.
  • స్వల్పకాల ప్రతిఫలాల్ని ఇవ్వాలి. ఇది నువ్వు ఎప్పుడు నీ భోజనాన్ని తినేస్తావో, అప్పుడు నువ్వు నీ స్నేహితులతో బయటికి వెళ్ళిచ్చు లాంటి ఎప్పుడు-అప్పుడు వ్యాఖ్యతో చెయ్యొచ్చు.
  • బిడ్డతో ఆమె భావాలు, ఆశలు, భయాల గురించి మాట్లాడడానికి, మీ భావాల్ని తనతో పంచుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. మీబిడ్డను మీకు ప్రియమైన, నమ్మకమైన మితృడిగా పరిగణించండి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ప్రయోగించకండి. ఒక ఎట్టి, ఎంత విపత్కర పరిస్థితిలోనైనాసరే, దీర్ఘకాలంలో సమస్యను మార్చలేదు.
  • బిడ్డతో ఒక ఒడంబడిక చేసుకోండి. తల్లిదండ్రులు, బిడ్డకు మధ్య ప్రవర్తనకు సంబంధించిన ఒడంబడిక, క్రమశిక్షణను గురించిన ఒడంబడిక బిడ్డనుంచి ఏమీ ఆశిస్తున్నారనేది స్పష్టంగా నిర్వచించడానికి, ఇరువైపులవారు పథకానికి ఒప్పుకోవడానికి సహాయ పడొచ్చు. మంచి ప్రవర్తనకు ప్రతిఫలంగా, తల్లిదండ్రులు ముందే నిర్దేశించిన ఏదో ఒక ప్రతిఫలాన్ని ఇవ్వాలి, అలాగే, తప్పుగా ప్రవర్తించినప్పుడు నిర్ణీత చర్య తీసుకోవాలి. ఇలాంటి పథకం ఎవరు అన్నమాట మీద నిలబడ్డారో, ఎవరు మాట తప్పారో నిర్ణయించడానికి సహాయపడుతుంది.
  • క్రమశిక్షణకు కీలకం బిడ్డమీద ప్రేమను, గౌరవాన్ని చూపడం.
తప్పుగా ప్రవర్తిస్తున్న పిల్లలతో వ్యవహరించేటప్పుడు గుర్తుంచుకోవలసిక విషయాలు
  • అందరు పిల్లలు ఎప్పుడో ఒకసారి, ముఖ్యంగా నాలుగు సంవత్సరాల లోపువారు, తప్పుగా ప్రవర్తిస్తారు. ఇది సహజం.
  • చాలా నెలలపాటు అబద్ధాలు చెప్పడం, దొంగతనం చెయ్యడం, ఇతరుల్ని ఏడిపించడం, కొట్లాడడం, లేక స్కూలు ఎగ్గొట్టడం లాంటి తప్ప ప్రవర్తన పెద్ద పిల్లల్లో కనపడితే, దానిని కాండక్ట్ డిజార్డర్ అని అంటారు
  • కాండక్ట్ డిజార్జర్కి సాధారణ కారణాలు కుటుంబంలో హింస, తల్లిదండ్రులు పెట్టే క్రమశిక్షణలో నిలకడ లేకపోవడం. అతిచురుకు లేదా హైపర్ ఏక్టివిటీ, డిసైక్సియా ఇతర కారణాలు.
  • కాండక్ట్ డిజార్డర్ పరిష్కారం క్రమశిక్షణ తాలూకు సులభమైన నియమాల్ని బోధించడం, తల్లిదండ్రులు, బిడ్డ మధ్య చర్చలు. మందులకు పాత్రే లేదు.

పక్కతడిపే బిడ్డ

పక్క తడపడం అంటే పక్కమీద నిద్ర పోయేటప్పుడు మూత్రం పోయడం. పిల్లలందరూ మూత్రాశయాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకునేదాకా పక్కను తడుపుతారు. మూడు సంవత్సరాల వయసు తరువాత పదే పదే పగలు బట్టల్లో మూత్రం పోసుకుంటే సమస్య, రాత్రిపూట నిద్ర్లలొ పక్కను తడపడం ఐదు సంవత్సరాల వయసు తరువాతే సమస్య బుద్దిమాంద్యం వున్న పిల్లలు మూత్రాన్ని అదుపు చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.

పిల్లలు ఎందుకు పక్కను తడుపుతారు

సాధారణ కారణం బిడ్డ ఈభాగం ఎదగడం ఆలస్యమవడం. దీని అర్థం బిడ్డకు బుద్ధిమాంద్యం వుందని కాదు. కొంతమంది పిల్లలు పెద్ద కారణం లేకుండానే ఇతర పిల్లలకంటే ఆలస్యంగా మూత్రం పోసుకోవడాన్ని అదుపు చేసుకోగలుగుతారు. కొంతమంది మూత్రాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాక మళ్ళీ పక్క తడపడాన్ని ప్రారంభిస్తారు. ఇది తరచుగా బిడ్డ ఏదో ఒక విషయానికి, ఇంట్లో హింస, ఇంట్లోకి కొత్త పాపాయి రావడం లాంటివాటివలన కలతచెందడంవలన జరుగుతుంది, ఇతర, కొంచెం తక్కువ తరచుగా వుండే కారణాలు, మూత్రసంబంధ ఇన్ఫెక్ఛన్లు, పిల్లలపై వేధింపు, డయాబెటిస్ లేక చక్కెర వ్యాధి, మూత్ర వ్యవస్థలో భౌతిక సమస్యలు, కొన్ని నరాల సమస్యలు.

పగటిపూట తడుపుకోవడం సంగతేంటి

కొంతమంది పిల్లలు పగటి పూట మూత్రంతో ಬಟ್ಜಲು తడుపుకుంటారు. బడికి వెళ్ళడం ప్రారంభించాక పిల్లలిలా తడుపుకుంటే, సిగ్గు, న్యూనత కారణంగా సమస్యలు వస్తాయి. ఇలా పగటిపూట తడుపుకోవడానికి కారణాలు, ಮಿಲ್ಗಲು టాయిలెట్స్ని ఉపయోగించడం ఇష్టం లేకపోవడం, మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు, స్కూలుకు సంబంధించిన సమస్యలు.

ఈసమస్యనెలా పరిష్కరించడం

కుటుంబాన్ని లేదా స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు

  • బిడ్డ వయసు ఎంత? పక్కతడపడం అసహజమా, కాదా అని నిర్ధారణ చెయ్యడానికి ఇది ముఖ్యం.
  • పక్క తడపడం పగటిపూటకూడా జరుగుతుందా?
  • అసలు ఎప్పుడైనా బిడ్డ మూత్రాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాడా? లేకపోతే, బహుశా, సమస్యకు కారణం ఎదుగుదలలో ఆలస్యం అవొచ్చు.
  • ఒకవేళ బిడ్డ మూత్రాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాక మళ్ళీ పక్క తడపడం ప్రారంభిస్తే, మళ్ళీ అతను ఎప్పటినుండి పక్క తడుపుతున్నాడు? ఆసమయంలో మీ కుటుంబంలో ఏదైనా ప్రత్యేకమైన సంఘటన జరిగిందా, ఉదాహరణకు, కొత్త బిడ్డ జన్మించడం లేక ఏదైనా కుటుంబ సమస్య
  • పక్క తడపడం గురించి మీరేమి అనుకుంటున్నారు? బిడ్డతో మీరేమి చెప్పారు? బిడ్డను తిట్టే కోపధారి తల్లిదండ్రులు సమస్యనింకా క్లిష్టం చేస్తారు.
  • ఇంతవరకు సమస్యనెలా పరిష్కరించే ప్రయత్నం చేసారు?

బిడ్డను అడిగే ప్రశ్నలు

  • ఈ మధ్య ఏమి జరిగింది? ఇంటిదగ్గర? స్కూలులో? బిడ్డ సంకోచం లేకుండా జవాబులు చెప్పేందుకు కొంత సమయమివ్వడానికి సామాన్య ప్రశ్నలతో ప్రారంభించండి.
  • ఈమధ్య నువ్వే విషయంలోనైనా బాధపడుతున్నావా? బిడ్డ తనే ఆవిషయాన్ని ప్రస్తావించేలా చూడండి.
  • చాలామంది పిల్లలకు పక్క తడపడం సమస్యలు ఉన్నాయి. ఈసమస్య నీకు ఈమధ్యే వచ్చిందా? ఇది చాలామందికి సామాన్యంగా వచ్చే సమస్యేనని మీకు తెలుసని చెపూ సూటిగా ఈ ప్రశ్నను అడగండి.
  • ఎప్పటినుండి ఇది జరుగుతూంది? ఇది ఎందుకు జరుగుతూందని నువ్వు అనుకుంటున్నావు? అతని జవాబులు

అతను కలత చెందడానికి కారణాలను సూచిస్తాయి.

  • మూత్రం పోసుకుంటున్నప్పుడు నెప్పి లేక మంట వున్నాయా? ఇది మూత్రంలో ఇన్ఫెక్షన్ వుందో లేదో తెలుపుతుంది.
  • ఈ సమస్యవలన నీకు కలుగుతున్న ఇబ్బందులేమిటి? ఇంటిదగ్గర? స్కూల్లో?
  • ఈ మధ్య నినెవరైనా కొట్టారా? ఉదాహరణకు, నువ్వు ముట్టుకోగూడదనుకున్న చోట ముట్టుకోవడం. మీరు పిల్లలపై వేధింపును అనుమానిస్తూంటే ఈప్రశ్నల్ని అడగండి.

ప్రత్యేక ఇంటర్వ్యూ సూచనలు

పక్క తడపడం బిడ్డ మాట్లాడడానికి సిగ్గుపడే అంశం. పక్కతడుపుతున్న బిడ్డను మీదగ్గరకు తీసుకు వచ్చేటప్పటికే

బిడ్డకు ಜಸೆಟ್ తప్ప చేస్తున్నట్లు తెలిసివుంటుంది. ఆమె సిగ్గుపడుతూ, విచారంగా వుంటుంది. బిడ్డ భావాల పట్ల సున్నితంగా వ్యవహరించండి. పక్క తడపడానికి కారణంగా అరుదైన వెన్నెముక వ్యాధులు వున్నాయేమో కనిపెట్టడానికి బిడ్డ నడుము క్రింది భాగాన్ని నడకను పరీక్షించండి. పక్క తడపడం గురించి బిడ్డతో ఏకాంతంగా, లేదా, స్పందించే పెద్ద వయసు వ్యక్తితో మాట్లాడండి. డయాబెటిస్, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి మూత్రంలో షుగర్, కల్చర్ పరీక్షల్ని చెయ్యండి.

ఏమి చెయ్యాలి?

  • పక్క తడపడాన్ని గురించి చాలా కుటుంబాలు ఆదుర్గా పడతాయి. పక్క తడపడం సాధారణ విషయమేనని, బుద్ధిమాంద్యానికి చిహ్నం కాదని, దీనికి చికిత్స వుందని వివరిస్తూ నచ్చజెప్పండి. ఇది బిడ్డ తప్పుగా ప్రవర్తించడం వలన వచ్చింది కాదు.
  • మూత్రంలో ఇన్ఫెక్షన్ వుంటే, ఏంటీబయాటిక్ ఇచ్చి, బిడ్డను తగినంత నీటిని తాగమని చెప్పండి. ఈసలహాని ఇచ్చేముందు ఇన్ఫెక్షన్ వున్నదీ, లేనిదీ రూఢి చేసుకోండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ లేకపోతే అదేసలహా బిడ్డ సమస్యనింకా తీవ్రం చేయవచ్చు!
  • బిడ్డ పక్కమీదకు వెళ్ళబోయేముందు మూత్రం పోసుకోమని చెప్పండి.
  • పక్క తడపని రాత్రులు వున్నప్పుడు బిడ్డను మెచ్చుకోండి, కాని పక్క తడిపినప్పుడు కోప్పడకండి. కేవలం, నువ్వు ప్రయత్నించినందుకు నాకు సంతోషంగా వుంది, ఫరవాలేదు, రేపు రాత్రి ఇంకా మెరుగ్గా వుంటుందిలే అని చెప్పాలి. నక్షత్రాల ఛార్జుని ఉపయోగించండి (క్రిందచూడండి) పక్క పేజీలో చూడండి.
  • ఒక వేళపక్కతడపడం కొనసాగుతూంటే, రాత్రి మధ్యలో బిడ్డను లేపి మూత్రం పోయించాలి.
  • పగటిపూట టాయిలెట్ కి వెళ్ళకుండా ఆపుకునే సమయాన్ని పెంచడం ద్వారా మూత్రాన్ని అదుపు చేసుకోవడమెలాగో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించండి.
  • మూత్రాన్ని అదుపు చేసుకోవడానికి మరొక వ్యాయామం, మూత్రం పోసుకుంటూ మధ్యలో ఆపుజేసి, కొన్ని

సెకన్లపాటు బిగబట్టి, మళ్ళీ పోసుకుని, మళ్ళీ బిగబట్టడం, ఇలా పూర్తిగా పోసేసుకునేదాకా చెయ్యాలి. ఎంత ఎక్కువ సేపు ఈవిధంగా అతను ఆపి-ప్రారంభిస్తూ మూత్రాన్ని పోసుకుంటే అంత ఎక్కువ అదుపు వస్తుంది.

  • కొన్ని చోట్ల ప్రత్యేకమైన బజ్జర్ అలారాలు లభిస్తున్నాయి. వీటిని దుప్పటికి తగిలిస్తే, పక్క తడుస్తున్న తక్షణం పెద్ద శబ్దంతో అలారం మ్రోగుతుంది. ఇది పూర్తిగా మూత్రం పోసుకోకముందే బిడ్డను లేపుతుంది, అప్పుడు తల్లిదండ్రులు బిడ్డను టాయిలెట్కి తీసుకు వెళ్ళవచ్చు
  • ఈ పద్ధతులేవీ పనిచెయ్యకపోతే అప్పుడు ఇమిప్రమిన్ అనేమాత్రను 25-50 మి.గ్రా. మోతాదులో నిద్రపోవడానికి రెండు గంటలముందు ఇవ్వాలి. ఈ మందు చాలామంది పిల్లలకు పనిచేస్తుంది, కాని తరచుగా, మందును ఆపజెయ్యగానే మళ్ళీ సమస్య తిరిగి వస్తుంది. ఆ మందు వల్ల కలిగే నిజమైన లాభం కొంతకాలంపాటు మూత్రాన్ని ఆదుపుజేసుకోగలగడం వలన బిడ్డ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మందుతోబాటు పైన చెప్పిన చర్యలను కూడా పాటించమని చెప్పాలి. మందును ఆరు నెలల వరకు వాడవచ్చు.
  • ఇంట్లో ఏమైనా బాధలు, ఒత్తిడులు ఉన్నట్లయితే, వాటిని సవరించండి.

పగటిపూట మూత్రాన్ని అదుపుచేసుకోలేకపోతే, ఈక్రింది విధంగా తల్లిదండ్రులకు సలహానివ్వండి:

  • పక్క తడపకుండా ఉన్న ప్రతి ఒక్క రోజుకు ఒక బహుమానాన్ని ఇవ్వండి. పిల్లలకు బహుమానాన్ని ఇవ్వడానికి సులభమైన మార్గం నక్షత్రాల ఛార్జును ఉపయోగించడం. ఇది పిల్లలు పడుకునే గదిలో గోడకు అంటించిన పేపరు. ఒక పగలు లేదా రాత్రి పక్క తడపకపోతే, అతను ఒక నక్షత్రాన్ని సంపాదిస్తాడు, దానిని గోడమీద పేపర్ పై అంటించాలి. ముందే అనుకున్న ఒడంబడిక ప్రకారం, కొన్ని నక్షత్రాలు లభించగానే ఒక బొమ్మలేదా ప్రత్యేకమైన ఆహారం లాంటివాటిని బహుమతిగా ఇస్తారు.
  • బిడ్డ నిర్ణీత సమయంలో, ఉదా: ప్రతి రెండు గంటలకు, టాయిలెట్కి వెళ్ళేలాగా అలవాటు చెయ్యండి. ఈ విధంగా మూత్రకోశం ఎప్పుడూ ఖాళీగా వుంటుంది. ఒకసారి ఇది పగటిపూట పక్క తడపడాన్ని  అదుపు చెయ్యగలిగితే, క్రమేపీ, టాయిలెట్ కి వెళ్ళేవ్యవధిని పెంచవచ్చు. బిడ్డ స్కూలులో వుంటే, దీనిలో టీచర్ కూడా భాగస్వామి కావాలి.

సమస్య పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు బిడ్డను, తల్లిదండ్రుల్ని సమీక్షిస్తూ వుండండి.

ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

ఈ క్రింది సందర్భాలలో పిల్లల వైద్య నిపుణుడి దగ్గరకు పంపాలి

  • డయాబెటిస్, నరాల సమస్యలు వున్నప్పుడు
  • తీవ్రమైన కుటుంబ సమస్య ఉన్నప్పుడు, ముఖ్యంగా, మీరు వేధింపు వుందని అనుమానిస్తున్నప్పుడు
  • మీరు సూచనల్ని ఇస్తున్నప్పటికీ సమస్య కొనసాగుతూ వుంటే
  • బిడ్డకు 10 సంవత్సరాల తరువాత కూడా సమస్య కొనసాగితే

బట్టలు పాడయితే

బట్టలు వేసుకున్నాక లేదా పక్క మీద వున్నప్పుడు మూత్రం లేక విరేచనంతో పాడవడం నాలుగు సంవత్సరాల వయసు తరువాత కూడా జరిగితే అది అసహజం. కొంతమంది పిల్లలకు ఎప్పుడు విరేచనానికి వెళ్ళాలో తెలుసు, కాని, టాయిలెట్ బయట వెళ్తారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు ఈ రెండిటితోనూ బాధపడతారు. మొదటిది మలబద్ధకం. రెండవది టాయిలెట్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోకపోవడం. ఇది తరచుగా తల్లిదండ్రులకు బిడ్డ సహకరించకపోవడంలో భాగంగా వుంటుంది. బిడ్డ ఆహారంలో సమృద్ధిగా ద్రవాలు, పండ్లు, కూరలు, పీచు ఉండేలాగా చర్యలు తీసుకోమని తల్లిదండ్రులకు సలహా ఇవ్వండి. విరేచనం నెప్పిని కలిగించేంత ఎక్కువ గట్టిగా వుంటే మలాన్ని మెత్తగా చేసే లాక్టటివ్ మందుల్ని ఇవ్వండి. విరేచనానికి వెళ్ళడానికి ఒక నిర్ణీత క్రమాన్ని ఏర్పరచండి, బిడ్డ ప్రతిసారి టాయిలెట్లో విరేచనానికి వెళ్ళినప్పుడు పొగడండి.

పక్క తడపడాన్ని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • ఎప్పుడన్నా ఒకసారి పక్కతడిపితే ఆదుర్గా పడనవసరంలేదు. బిడ్డ మూత్రాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలని మీరు ఆశించిన వయసు (సామాన్యంగా ఐదు సంవత్సరాలు) దాటాక కూడా పదే పదే పక్కను తడుపుతూంటే దానిగురించి కలతపడాలి.
  • బుద్ధిమాంద్యం వున్న పిల్లలు మూత్రాన్ని అదుపు చేసుకోవడాన్ని ఆలస్యంగా నేర్చుకుంటారు. కాని బిడ్డ పక్కను తడిపినంత మాత్రాన అతనికి బుద్ధిమాంద్యం వుందని అనుకోగూడదు.
  • పక్కను తడపడం ఎదుగుదలలో ఆలస్యం వలన లేక మూత్రంలో ఇప్ఫెక్షన్ వలన అవొచ్చు. ఈరెండు సందర్భాలలోనూ పరిస్థితి ఆశాజనకమే, పిల్లలకు నయమవుతుంది.
  • మూత్రాశయాన్ని అదుపు చేసుకోవడం, నిర్ణీత సమయంలో మూత్రం పోసుకోవడం గురించి సాధారణ సలహా చాలామంది పిల్లలకు సహాయపడుతుంది.

 

విచారంగా వున్న లేక నెప్పులు, బాధల గురించి ఫిర్యాదు చేసే కౌమార వ్యక్తి

కౌమారం 10-19 సంవత్సరాల మధ్య వయసు, బాల్యానికీ, పెద్దరికానికీ మధ్య వయసు. చాలా కారణాల

వలన అది ప్రత్యేకమైన వయసు

  • కౌమార దశలో వ్యక్తిత్వాలు పరిణతి చెందుతాయి. కౌమారులు తమగురించి, తమ ఇష్టాలు, అయిష్టాల గురించి, తమ బలాలు, బలహీనతల గురించి స్పష్టమైన అభిప్రాయాల్నేర్పరచు కుంటారు.
  • శారీరకంగా మార్పు చెందుతారు, లైంగికంగా పరిణతి చెందుతారు, దీని అర్థం వారు ఇతరులతో లైంగికంగా ఆకర్షణకు లోనవుతారు. ఇతరులు తమపట్ల ఆకర్షణకు గురవడం పట్ల సున్నితంగా వుంటారు.
  • తమ చదువు, వృత్తి, ఉద్యోగాల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇదే. ఈ మార్పులన్నీ జరుగుతున్నప్పుడు కౌమారులు ఒత్తిడికి గురవడం ఆశ్చర్యమేమీకాదు

కొంతమంది కౌమారులు ఎందుకు విచారంగా వుంటారు

కౌమారులు చాలా కారణాల వలన విచారంగా వుంటారు.
  • వారి కుటుంబ జీవితాలు సంతోషంగా లేనందున, ఉదా. కుటుంబంలో హింస, వేధింపు, నిరంతర కొట్లాటలు;
  • స్కూల్లో తమ చదువు గురించి నిస్పృహవల్ల- పరీక్షల్లో తప్పడం, లేదా ఆశించినంత బాగా ఫలితం లేక పోవడం;
  • తాము ప్రేమించే వ్యక్తులతో లేనందువల్ల- తల్లిదండ్రులు లేదా తాము ప్రేమించిన వ్యక్తి ప్రేమ వ్యవహారాన్ని విచ్ఛిన్నం చేసినప్పడు;
  • వారు శరీరంలో నెప్పి లేక వ్యాధితో బాధపడుతున్నందువలన;
  • వేధింపు, హింస వలన;
  • వారు తీవ్రమైన డిప్రెషన్, లేక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ వుండడం వలన; వారు మద్యం, మత్తుమందుల వ్యసనానికి లోనవడం వలన.

కౌమారుల్లో డిప్రెషన్

కౌమారుల్లో డిప్రెషన్ సాధారణం. ఇది తరచుగా శారీరక బాధల రూపంలో వ్యక్తమవుతుంది, తరచుగా స్కూల్లో

చదువు విషయంలో వున్న ఇబ్బందులకు సంబంధించినవి. టీనేజ్డ్ డిప్రెషన్కి సాధారణ లక్షణాలు:

  • తలనెప్పి, ఇతర నెప్పులు, బాధలు;
  • ఏకాగ్రత నిలపడం కష్టమవడం;
  • నిద్ర సరిగ్గా పట్టకపోవడం;
  • కుటుంబానికి, స్నేహితులకు దూరమవడం;
  • తనగురించి తాను తక్కువగా భావించడం, ఉదా. తను ఇతరులకంటే తక్కువ ఆకర్షణీయంగా వుంటుందని,
  • తనకు తక్కువ తెలివి వుందని;
  • మూడీగా, చిరాకుగా వుండడం, కుటుంబంతో, స్నేహితులతో కొట్లాటకు దిగడం;
  • బ్రతకడంలో అర్థం లేదనుకోవడం;
  • ఆత్మహత్య గురించి ఆలోచించడం;
  • కోపం, చిరాకు;

డిప్రెషన్ కౌమారుల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది;

  • స్కూలు చదువు సరిగ్గా లేక పోవడం;
  • స్నేహితులతో, కుటుంబంతో సరైన సంబంధాలు లేకపోవడం;
  • తమకు తాము హాని చేసుకునే ప్రమాదం ఎక్కువవడం;
  • మద్యం, మత్తుమందుల దుర్వినియోగం.
కేస్ 8.2.
12 ఏళ్ళ వయసు ఉన్న లూసా తన తరగతిలో తెలివిగల పిల్లల్లో ఒక బాలిక. కాని, ఇటీవల తన సహాధ్యాయులతో ఆమె అంత స్నేహంగా వుండడంలేదు. ఒకప్పుడు ఆమె మధ్యాహ్న భోజన విరామంలో ఆటలు ఆడేది, ఇప్పుడు ఒక్కతే ఒంటరిగా తరగతి గదిలో కూర్చుని వుంటూంది. ఆమె ప్రేమలో పడిందని ఏడిపిస్తూ స్నేహితులు ఆమెను మామూలు మనిషిని చెయ్యడానికి ప్రయత్నించారు. కాని లూసా వారికి మరింత దూరమయింది. చివరికి ఆమె చాలా పరుషంగా ప్రవర్తిస్తూందనుకుని వారు ఆమె విషయాన్ని విడిచి పెట్టారు. సగం సబ్జెక్ట్స్లో తప్పేసరికి టీచర్ చాలా కలత చెంది ఆ ఫలితాల గురించి చర్చించడానికి లూసా తల్లిదండ్రుల్ని పిలిపించింది తండ్రి రాలేదు, తల్లివచ్చి కూర్చుని మౌనంగా వింది. ఆమె లూసా ఎందుకలా సరిగ్గా చదవడంలేదో తనకు తెలియదని చెప్పింది. ఆమె లూసా అల్లరి చిల్లరిగా తిరుగుతూ కష్టపడి చదవలేదని అనుకుంది. కాని ప్రధానోపాధ్యాయురాలు లూసా తల్లి పరధ్యానంగా, విచారంగా వుందని గమనించింది. ఆమె ఇంటి దగ్గర ఏమైనా సమస్యలున్నాయా అని అడిగింది. అప్పుడు లూసా తల్లి భోరుమని ఏడ్చింది. ఆమె తనభర్త కొన్ని నెలల క్రితం తమను విడిచి పెట్టి వెళ్ళిపోయాడని, తను, లూసా తినడానికి కూడా డబ్బు పంపడం ఆపేసాడని చెప్పింది. ఇంట్లోని ఈ గడ్డు కష్టాలకారణంగా లూసా డిప్రెషన్కి గురయింది. అప్పడామె లూసాతోనూ, ఆమె తల్లితోనూ ఆమె భావాల్ని ఉద్వేగాల్ని కనుక్కోవడానికి ఏకాంతంగా మాట్లాడింది, ఆమె లూసాతో ఎప్పుడు కావాలంటే అప్పుడు టీచర్తో మాట్లాడవచ్చని చెప్పింది. తరువాత టీచర్ లూసా స్నేహితులతో మాట్లాడి, వారికి ఆమెతో సున్నితంగా, సానుభూతితో వ్యవహరించమని చెప్పింది. టీచర్ తన ఇంటి పరిస్థితి గురించి ఆమె భావాల్ని తెలుసుకోవడానికి, ఆమెకు చదువులో సహాయ పడడానికి ప్రతివారం 15 నిమిషాలు లూసాతో మాట్లాడుతోంది. నెమ్మదిగా, స్నేహితుల సహాయంతో లూసా శక్తిని కూడదీసుకుని స్కూల్లో మెరుగ్గా చదివింది.
.కేస్ 8.3
థామస్ మాధ్యమిక పాఠశాలలో చివరి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ళ బాలుడు. ఇది అతనికి, అతని కుటుంబానికి ముఖ్యమైన సంవత్సరం. అతని కుటుంబం అతని ప్రైవేట్ బడి చదువు కోసం చాలా ಓಬು ఖర్చుపెట్టింది. వారంతా థామస్ మెడికల్ స్కూల్కి వెళ్ళి డాక్టర్ అవుతాడని ఆశిస్తున్నారు. కాని థామస్ ఎప్పుడూ ఒక సగటు విద్యార్దే. అతనికి సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఎప్పుడూ ఇష్టంలేదు. థామస్ బాగా కష్టపడి చదివాడు. కాని అతనికి తలనెప్పి,  అలసటగా వుండేది. అతను తన తల్లిదండ్రులతో తనకళ్ళు దెబ్బతిన్నాయని,  టెక్స్ పుస్తకాలు చదవడానికి కష్టంగా వుందని చెప్పాడు. అతని తల్లిదండ్రులు అతని కళ్ళు పరీక్ష చేయించారు, వాటిలో ఏతేడాలేదు, మామూలుగానే వున్నాయి. తలనెప్పి ఇంకా తీవ్రమయింది, నిద్రపట్టడం కష్టమయింది. థామస్ పరీక్షలు అసలేమీ బాగా రాయలేదు. అతని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు, వారికి అతని మీద చాలా కోపంవచ్చింది. అతనెందుకు కష్టపడి చదవలేక పోయాడు? వారతనికి ప్రైవేట్ ట్యూషన్ పెట్టించారు. థామస్కి చాలా అలసటగా వుంటోంది, చదువు మీద మనసును లగ్నం చెయ్యడం పూర్తిగా కష్టమయిపోయింది. ఇప్పుడతని తల్లిదండ్రులు మరింత విచారానికి గురయారు. ఆరోగ్య కార్యకర్త థామస్ని చూసి, అతను పరీక్షల్లో బాగా రాయడం గురించి ఆదుర్జాతో ఒత్తిడికి గురయాడని గుర్తించింది. ఆమె థామస్తో ఈ ఒత్తిడి గురించి మాట్లాడింది, అతని భవిష్యత్తు వృత్తి లేక ఉద్యోగం గురించి అతని భావాలేమిటో తెలుసుకుంది. అతను తనకు మెడిసిన్ చెయ్యడం ఇష్టంలేదని, ಹೇಕೆ ವಿಡಿ ఒకరంగాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పాడు. ఆరోగ్య కార్యకర్త థామస్ కుటుంబంతో మాట్లాడింది, అతని ఒత్తిడి గురించి వారికి వివరించింది. తల్లిదండ్రులు ధామస్తో ప్రత్యామ్నాయ వృత్తుల గురించి మాట్లాడారు. థామస్ తెలివిగల కుర్రాడు, అతను ఎంపిక చేసుకున్న వృత్తిని చేపట్టడానికి అతన్ని అనుమతిస్తే, అతనికి ఒత్తిడి తగ్గుతుంది. అతను తన తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలగసాగాడు, ఇప్పుడతను చాలా బాగా వున్నాడు. .

ఈ సమస్యనెలా సంబాళించడం

తల్లిదండ్రులను అడగవలసిన ప్రశ్నలు

  • ఇటీవల మీఅబ్బాయి ప్రవర్తనలో ఏమన్నా మార్పును గమనించారా? మీరేమి గుర్తించారు?
  • ఇది ఎందుకు జరుగుతూందని మీరు అనుకుంటున్నారు? తల్లిదండ్రుల అభిప్రాయాలు సమస్య కారణాన్ని సూచించవచ్చు. ఉదాహరణకు, తల్లిదండ్రులు పిల్లాడు కష్టపడి చదవడం లేదంటే, అది పరీక్షల్లో బాగా రాయాలనే ఒత్తిడి వల్ల వచ్చిందని అనుకోవచ్చు
  • దీనిని మార్చడానికి ఏమైనా ప్రయత్నించారా? పరిస్థితిని మార్చడానికి మీ అబ్బాయి ఏమి చెయ్యాలని మీరు అనుకుంటున్నారు?

కౌమారులను అడగవలసిన ప్రశ్నలు

  • ఈ మధ్య నీ ఆరోగ్యం ఎలా వుంది? ప్రత్యేకంగా నిద్ర, ఏకాగ్రత, ఉద్వేగాల గురించి అడగండి.
  • ఈ మధ్య నువ్వు దేని గురించైనా బాధపడుతున్నావా? ఉదాహరణకు, ఇంట్లో సమస్యలు? లేదా నీ చదువు గురించి? లేదా నీస్నేహితుల కారణంగా?
  • నువ్వీ కలతల్ని విచారాల్ని ఎవరితోనైనా పంచుకున్నావా? ఎవరు? వారి సూచన ఏమిటి? కౌమారుల సాంఘిక అసరాలగురించి కనుకోండి.
  • నువ్వు అత్మహత్య చేసుకోవాలనుకున్నావా? ఎంత తరచుగానో, ఎప్పుడో కనుకోండి. కొంతకాలం నుంచి ఉన్న ఆలోచనలు, ముఖ్యంగా డిప్రెషన్లో వున్నప్పుడు వచ్చిన అలాంటి అలోచనల్ని ఎక్కువ గంభీరంగా తీసుకోవాలి.
  • ఇటీవల ఎవరైనా నిన్ను గాయపరచారా? ఉదాహరణకు, నిన్ను కొట్టడం లేక లైంగిక ప్రయోజనం పొందడం జరిగిందా ?
  • నువ్వు మద్యాన్ని లేక మత్తుమందుల్ని తీసుకుంటున్నావా? తీసుకుంటూంటే ఎంత?

ఏమి చెయ్యాలి?

  • కౌమారుని భావాల్ని విచారాల్ని గురించి అతను చెప్పేది వినండి. త్వరపడకండి. మీకు సమయం లేక పోతే అతన్ని తరువాత మీకు ఎక్కువ సమయం వున్నప్పుడు మళ్ళీరమ్మని చెప్పండి. తన భావాలకు, తను ఎదుర్కొంటున్న ఒత్తిడికి మధ్య వున్న సంబంధాన్ని గుర్తించడానికి సహాయపడండి.
  • అతని తల్లిదండ్రులతో (వీలయితే అతని టీచర్స్తో) మాట్లాడగలనని, అతని భావాల్ని, కలతల్ని వారికి తెలియ జేయగలనని సూచించండి.తరచుగా కౌమారుడు తన భావాల్ని తల్లిదండ్రులకు తెలియజేయలేడు, అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది, అతను తనలో తానే తన ఉద్వేగాల్ని దిగమింగుకుంటాడు, తల్లిదండ్రులు అతనితో విసిగిపోతారు, అతను మరింతగా సంతోషానికి దూరమవుతాడు. కుటుంబంతో సమస్యలగురించి బాహాటంగా చర్చించడం సహాయకారిగా వుండొచ్చు.
  • ఆచరణాత్మకమైన సూచనల్ని చెయ్యండి, ఉదాహరణకు, ఏదైనా ఒక సబ్జెక్ట్ చదవడానికి అతను ఇబ్బంది పడుతూంటే, దీని గురించి చెపూ టీచర్కి ఒక చీటీ రాసి పంపండి టీచర్ మామూలు క్లాసులు అయిపోయాక కొంత అదసపు సమయం తీసుకుని ఆసబ్జెక్ట్ అతనికి బోధపడేలా చెప్పి సహాయపడొచ్చు.
  • కౌమారుడికి ప్రశాంతంగా వుండేందుకు వ్యాయామాలు నేర్పండి. ఇది ఏకాగ్రతకు ఉపయోగపడొచ్చు. అలసట  నిద్ర సమస్యలు ఇతర లక్షణాలకు, ఈమాన్యువల్లో ఇతర చోట్ల సూచించిన విధంగా సలహానివ్వండి.
  • అతను ఎదుర్కొనే ఒత్తిడులను తట్టుకోవడానికి సమస్య పరిష్కార పద్ధతుల్ని నేర్పండి.
  • మద్యం లేక పొగాకు లేక మత్తుమందుల్ని వాడొద్దని సలహానివ్వండి. అతనికి పూర్తిగా బాగయేవరకు మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పండి. తన భవిష్యత్తు గురించిసానుకూలంగా భావిస్తూంటే, తన భావాల్ని ఇతరులతో పంచుకోవడం, స్కూల్ చదువులో మంచి మార్కులు రావడం అధారంగా అతని పరిస్థితి మెరుగయిందీ, లేనిదీ తెలుస్తుంది.
  • పైన సూచించినవేవీ పనిచెయ్యక పోతే ఏంటీ డిప్రెసెంట్స్ని ఉపయోగించండి.

 

ఒత్తిడిని తట్టుకోవడంః కౌమారులకు సూచనలు

మనుషులు ఒత్తిడికి రకరకాలుగా ప్రతిస్పందిస్తారు. కొంతమంది వారి ఆరోగ్యానికి తక్కువ హాని కలిగే మార్గాలను అనుసరిస్తారు.; నువ్వు కూడా అలాగే చెయ్యడానికి కొన్ని సూచనలు ఇవి:

  • నీకు ఒత్తిడి కలిగించే సందర్భాలు లేక సంఘటనల్ని గుర్తించు.
  • నీ స్నేహితులు, ముఖ్యంగా, నీకంటే బాగా ఒత్తిడులను తట్టుకోగలిగిన వారు, ఈసందర్భాలకు వ ప్రతిస్పందిస్తారో ఊహించు.
  • ఈసందర్భాలలో తక్కువ ఒత్తిడి వుండేలా చేసేందుకు నీఆలోచనలకు అందిన మార్గాలన్నిటి జాబితాను తయారు చెయ్యి * నువ్వే వీటిని చేస్తున్నట్లు ఊహించు.
  • నువ్వు పరిస్థితిని ఎదుర్కోకముందే అభ్యాసంచెయ్యి
  • నీఒత్తిడిని స్నేహితులు,కుటుంబసభ్యులు, లేక టీచర్స్ తో పంచుకో.
  • కౌన్సిలర్ని కలవడానికి సంకోచించవద్దు.

ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

ఈ క్రింది పరిస్థితుల్లో పంపండిః

  • మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ పరిస్థితి మెరుగు పడనప్పుడు;
  • మత్తుమందుల వ్యసనం, హింస, మానసిక వ్యాధి లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు;
విచారంగా వున్న కౌమారుడిని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • కౌమారుల్లో అస్పష్టంగా ఉన్న బాధలు తరచుగా ఒత్తిడికి, డిప్రెషన్కి సంబంధించినవి
  • కౌమారుల్లో డిప్రెషన్ సాధారణంగా కనపడే ఆరోగ్య సమస్య
  • కుటుంబంలోనూ, స్కూలులోనూ ఉన్న ఒత్తిడి డిప్రెషన్కి పెద్ద కారణం కనుక కుటుంబంతోనూ, టీచర్స్తోనూ పనిచెయ్యడం కౌమారులకు సహాయపడడంలో ముఖ్యమైన భాగం.
  • డిప్రెషన్ ఉన్న చాలామంది కౌమారులు కోలుకుంటారు. వారి కలతల్ని బాధల్ని వినడం, వారితో మాట్లాడడం చాలా బాగా సహాయపడగల చికిత్స.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate