অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇతర సందర్బాలలో మానసిక ఆరోగ్యం

ఇతర సందర్బాలలో మానసిక ఆరోగ్యం

  1. ప్రాథమిక, సామాన్య ఆరోగ్య సంరక్షణ
    1. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో మానసిక వ్యాధులు
    2. ప్రాథమిక మానసిక ఆరోగ్య సంరక్షణ
    3. వ్యవస్థను మెరుగుపరచడం
  2. పునరుత్పత్తి ఆరోగ్యం
    1. స్త్రీ జననేంద్రియ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం
    2. తల్లుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం
  3. ఖైదీల ఆరోగ్యం
    1. మానసిక అనారోగ్యం, నేరం
    2. ఖైదీల మానసిక ఆరోగ్యం ఖైదీల మానసిక ఆరోగ్యం రెండు కారణాల వలన చాలా ముఖ్యం
    3. ఖైదీల మానసిక ఆరోగ్య సంరక్షణ
    4. వ్యవస్థను మెరుగుపరచడం
  4. కాందిశీకులు
    1. ముందు మౌలిక అవసరాల్ని తీర్చడం
    2. కాందిశీకుల మానసిక ఆరోగ్యం
    3. యుద్ధంలో పాల్గొనే పిల్లలు
    4. కాందిశీక శిబిరంలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం
  5. విపత్తులు
    1. విపత్తులు, మానసిక ఆరోగ్యం.
    2. మానసిక ఆరోగ్యాన్ని సహాయ కార్యక్రమాల్లో చేర్చడం
  6. కౌమార ఆరోగ్యం
    1. ఎదగడం ఒక వేడుక కావాలి
    2. మానసిక ఆరోగ్య అంశాలు
    3. మానసిక ఆరోగ్యాన్ని విద్యతో అనుసంధానం చెయ్యడం
    4. పాఠశాలలో కౌన్సిలింగ్ని ఇవ్వడం
  7. ఇల్లు లేనివారు, వీధిబాలలు
    1. ఇల్లు లేకపోవడం, మానసిక ఆరోగ్యం
    2. వీధిబాలలు
  8. హెచ్.ఐ.వి./ ఎయిడ్స్
    1. మానసిక ఆరోగ్యం ఎందుకు పాడవాలి
    2. హెచ్.ఐ.వి. పాజిటివ్ వారి సంరక్షణతో మానసిక ఆరోగ్యాన్ని మిళితం చెయ్యడం
  9. పెద్ద వయసువారి ఆరోగ్యం
    1. పెద్దవారికి వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు
    2. పెద్దవారి సంరక్షణ
  10. సంరక్షకుల సంరక్షణ
    1. సంరక్షణ సంబంధమైన ఒత్తిళ్ళు
    2. సంరక్షకుల మానసిక ఆరోగ్యం
    3. సంరక్షకుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం
    4. దుఃఖంలో ఉన్న సంరక్షకురాలికి సహాయపడడం
  11. ఆరోగ్యకార్యకర్తల మానసిక ఆరోగ్యం
    1. మిమ్మల్ని మీరు చూసుకోవడం
    2. ఎప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలి
మానసిక ఆరోగ్యాన్ని సంపూర్ణం చెయ్యడం ఈమాన్యువల్ లోని తొలి భాగాలు మానసిక వ్యాధుల రకాలను, వాటికి చికిత్సను వర్ణించాయి. వ  భాగం ఇప్పుడు పని చేసే ప్రత్యేకమైన ప్రదేశాలకు తోడ్కొని వెళ్తుంది. మీరు స్త్రీల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఖైదీలు, కౌమారులకు చికిత్స చేసే ఆరోగ్య కేంద్రాలలో పని చెయ్యవలసి రావచ్చు. ఒక ఆరోగ్యకార్యకర్తగా మిమ్మల్ని యుద్ధాలు, ప్రకృతి విపత్తుల లాంటి అత్యవసర పరిస్థితులలో పిలవొచ్చు. శరీరం, మనసు చాలా సన్నిహితంగా పనిచేస్తాయి. ఏకారణం చేతనైనా ఒకటి దెబ్బతింటే, రెండవది కూడా దెబ్బతింటుంది. ఆవిధంగా మానసిక ఆరోగ్యం మొత్తం ఆరోగ్య కార్యక్రమంలో ఒక భాగం. ఒకవ్యక్తి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతలలో సహజమైన భాగం
9వ అధ్యాయం వివిధ భిన్న కార్యస్థానాల్లో మీపనిలో మానసిక ఆరోగ్య అంశాలు ఎలా అంతర్గతమో చర్చిస్తుంది. మీరు పనిచేసే వివిధ కార్యస్థానాల్లో విభిన్న సందర్భాలకు, మానసిక ఆరోగ్య అంశాలకు ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తుంది. మీరు నిర్వహించే రోజువారీ కార్యక్రమాలలో మానసిక ఆరోగ్య అంశాలను ఎలా మిళితం చేయొచ్చో కూడా తెలుపుతుంది. ఈ అంశాలపై వృద్ధి పెట్టడం మీపనిని మరింత అర్ధవంతం చేస్తుంది, మీరెవరితో పని చేస్తున్నారో వారికి ఎక్కువ సంతృప్తినిస్తుంది
సామాన్య ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర నిర్వహిస్తారు.10వ అధ్యాయం సమాజంలో మానసిక ఆరోగ్య విషయాలపై దృష్టిని పెట్టడాన్ని ఎలా వృద్ధిచేయవచ్చో, ఎలా అసరానివ్వవచ్చో చర్చిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించడం వ్యక్తులు, కమ్యూనిటీలు తమ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వనరులు, ఇతర అంశాలపై అదుపును పెంచుకునే సాధికారతను పొందడానికి మార్గం. మానసిక ఆరోగ్యంపై సానుకూల వైఖరులను పెంపొందించడం, మానసిక అనారోగ్యాలు వున్న వ్యక్తుల అవసరాలు, హక్కులకోసం పని చెయ్యడం ఏసమాజపు సమగ్ర అభివృద్ధికైనా ముఖ్యమైన మార్గాలు. మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువ వున్న స్త్రీలు, పేదలు మానసిక ఆరోగ్య పెంపుదల లక్ష్యసమూహాలుగా పరిగణింపబడుతున్నారు.

ప్రాథమిక, సామాన్య ఆరోగ్య సంరక్షణ

వ్యక్తి ఆరోగ్య సమస్యతో ఆరోగ్య వ్యవస్థలో మొట్టమొదట వెళ్ళేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణను ఇస్తుంది. ఇతర ప్రదేశాలో ప్రైవేట్ డాక్టర్లు, నర్మింగ్ హోమ్లు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ఇస్తున్నాయి. చాలా ప్రదేశాలలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య సేవల్ని అందిస్తున్నారు. సామాన్య ఆరోగ్య సంరక్షణ పెద్దలలో  సామాన్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించినదిగా పరిగణింపబడుతుంది.  ఈ మాన్యువల్ మొత్తం ప్రాథమిక లేక సామాన్య ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో  ఆరోగ్య కార్యకర్తతో సంబంధం వున్న మానసిక ఆరోగ్య అంశాలుకాగా, ఈ విభాగం మరింత విశాల అంశాల సూక్ష్మ దర్శనం చేయిస్తుంది.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో మానసిక వ్యాధులు

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఏమానసిక వ్యాధినైనా చూడొచ్చు. కాని ముఖ్యంగా రెండు రకాల వ్యాధులు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి డిప్రెషన్, ఆందోళన మద్యం వ్యసనం . కాని ఒక వ్యక్తి చెప్పే బాధలు అసలు వెనుక వున్న మానసిక వ్యాధిని సూచించేలా వుండక పోవచ్చు. నమూనాగా, బాధలు సాధారణంగా వైద్యపరమైన వివరణను ఇవ్వలేని శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతాయి. పెట్టె 9.1. అలాంటి కేసుల్లో అవ్యక్తంగా వున్న మానసిక సమస్యను గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాల్ని ముందుంచుతుంది.

వైద్యపరంగా వివరించలేని లక్షణాలు: ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో మానసిక వ్యాధుల్ని గుర్తించడానికి జాడలు

ఎవరిలోనైనా ఈ క్రిందివి వుంటే డిప్రెషన్, లేక ఆందోళనను అనుమానించండి.

  • శారీరక ఆనారోగ్యంతో వివరించలేని శారీరక లక్షణాలు;
  • శరీరం లోని వివిధ భాగాల్లో నెప్పులు, పీకులు, అలసట, కళ్ళు బైర్లుకమ్మడం, నిద్ర సమస్యలు, గుండె దడ, వేళ్ళల్లో చురుకులు, తిమ్మిర్లు లాంటి అనేక లక్షణాలు;
  • లక్షణాలు మూడు నెలలకంటే ఎక్కువ కాలం వుండడం;
  • హింస లాంటి ఇంట్లో సమస్యలు వుండడం.
వ్యాధి నిర్ధారణను ధృవపరచేందుకు భావాలు, ఉద్వేగాల గురించి అడగండి
ఎవరిలోనైనా ఈ క్రిందివి వుంటే మద్యం వ్యసనం అని అనుమానించండి
  • పచ్చకామెర్లు:
  • వాంతిలో రక్తం పడడం;
  • తరచుగా జీర్ణకోశ ఇబ్బందులు;
  • గాయాలు, ప్రమాదాలు;
  • నిద్ర సమస్యలు
వ్యాధి నిర్ధారణను ధృవపరచేందుకు మద్యాన్ని తాగడం గురించి అడగండి

ప్రాథమిక మానసిక ఆరోగ్య సంరక్షణ

శారీరక ఆరోగ్య సమస్యల చికిత్సతో పోలిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు శ్వాసవ్వవస పెబాగంలో వచ్చే సమస్యలలాంటివి-పాదమిక ఆరోగ్య కార్యకర  శ్వాసవ్య  ప్రాథ గ్య sర్తి మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం

చక్కగా చికిత్స చెయ్యగలిగినవి. ఐనప్పటికి కొన్ని తీవ్రమైన శ్వాసవ్యవస్థ వ్యాధులకు, ఉదాహరణకు, న్యుమోనియా లాంటి వ్యాధులకు, నిపుణుల సంరక్షణ అవసరమవుతుంది. అదేవిధంగా, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలోని చాలా మానసిక అనారోగ్యాలకు ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త మానసిక వ్యాధుల నిపుణుల లాగానే చికిత్స చెయ్యగలుగుతాడు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో చికిత్సకు ఉన్న అదనపు ప్రయోజనం తక్కువ ఖర్చు, ఎక్కువ మందికి ఆమోదయోగ్యమైనది.

మీదగ్గరకు చికిత్స నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్కరిని మానసిక ఆరోగ్య సమస్య గురించి అడగడం ఉత్తమం. ఈక్రింది సరళమైన ప్రశ్నలు ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం గురించి సూచననిస్తాయి.

  • ఈ మధ్య మీకెలావుంటూంది? నేను కేవలం మీశారీరక ఆరోగ్యం గురించేకాక మీభావాలు, ఉద్వేగాల గురించి కూడా అడుగుతున్నాను.
  • ఈ మధ్య మీరు ఒత్తిడిలో వున్నట్లనిపిస్తోందా? వుంటే, ఎందుకు? ఇది మీఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

చాలామంది ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తారు, మీరు కొన్ని నిమిషాలకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఉండరు. సమస్యలు ఉన్నాయని చెప్పిన కొద్దిమందిని మానసిక వ్యాధి ఉందేమో తెలుసుకోవడానికి మరిన్ని ప్రశ్నల్ని వివరంగా అడగొచ్చు. సహజంగానే దీనికి ఎక్కువ సమయం పడుతుంది, కాని ఆవ్యక్తి పరిస్థితి మెరుగుపడడానికి మీరు సహాయపడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో బాగా ఉపయోగపడే చికిత్సా నైపుణ్యాలలో ఒకటి, లక్షణాల గురించి అవగాహన కలిగించడం ( 3.2. 5.) 3.4 వ విభాగం మానసిక వ్యాధి ఉన్నవారిని నిపుణుల సంరక్షణ కోసం ఎప్పుడు వేరేచోటకు పంపాలి అనే విషయంపై సలహాని ఇస్తుంది.

శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రెండిటిని రెండు భిన్న అంశాలుగా పరిగణించకపోవడం ാഴും. వాస్తవానికి, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు కలిసి వస్తాయి. క్షయవ్యాధితో బాధపడుతున్నాడు గనుక ఒక వ్యక్తికి మద్యం దుర్వ్యసనం లేదని చెప్పలేము. అదే విధంగా, ఒక వ్యక్తికి మానసిక వ్యాధి ఉంది కాబట్టి మలేరియా రాదని అర్థం కాదు. ఇది గుర్తుంచుకోవడానికి కారణం ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఉందని నిర్ధారిస్తే, అతనికి వచ్చే బాధలన్నిటినీ ఆ వ్యాధికి సంబంధించినవిగానే పరిగణిస్తారు.

కేస్ 9.1 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ క్లినిక్లో మీరు చూచే నమూనా సందర్భాన్ని వర్ణిస్తుంది

కేస్.9.1.

30 సంవత్సరాల వయసు ఉన్న వివాహిత స్త్రీ ఫెయిత్ అపోస్టిలిక్ చర్చికి వెళ్తుండేది. ఆమెకు ఒక సంవత్సరంకి పైగా కళ్ళు బయర్లకమ్మడం, తలనెప్పి ఉంటున్నాయి, కాని శారీరకమైన వ్యాధి ఏదీ కనబడలేదు. విచారించగా ఫెయిత్ తనీమధ్య ఎక్కువగా ఆలోచిస్తున్నానని, సరిగ్గా నిద్ర పోవడంలేదని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూందని ఒప్పకుంది. ఆమెకు చాలా అలసటగా, ఇంటి పని చెయ్యడానికి శక్తి లేనట్లుగా అనిపిస్తూంది. భర్తతో ఆమె సంబంధం మరింత దెబ్బతింది. పెళ్ళయి రెండేళ్ళయినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఆమె మీద అతనికి చాలా కోపంగా వుంది, అతను మరో పెళ్ళి చేసుకుంటానని ఆమెను బెదిరిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఆమె ఉద్యోగం పోయింది, తన భావాల గురించి కూడా ఆమెకు విచారంగా ఉంది, తను మరొక ఉద్యోగాన్ని వెదుక్కోలేనని అనుకుంది. ఆమె ఒంటరితనంతో బాధపడసాగింది. ఆరోగ్య కార్యకర్త ఫెయిత్కి ఇలా సహాయపడ్డాడు:

  • ఆమెకు అంతిమదశ లేక నయంచెయ్యలేని వ్యాధేమీలేదని నమ్మకం కలిగించడం;
  • ఉద్యోగం పోవడం వలన, వివాహ సమస్యల వలన ఆమె మరీ ఎక్కువగా ఆలోచిస్తూందని, అందుకనే ఆమెకు నిద్ర పట్టడం లేదని, అలసటగా వుంటూందని వివరించడం;

సమస్య, ఆచరణ జాబితాను గుర్తించడం:

  • డిప్రెషన్, దానికి ఏంటీడిప్రెసెంట్స్ని రాయడం;
  • పిల్లలు పుట్టకపోవడం, దానికి చికిత్స కోసం ఫెయిత్ని, ఆమె భర్తను గైనకాలజిస్ట్ దగ్గరకు పంపడం;
  • వివాహసమస్యలు, ఫెయిత్ భర్తను పిలిచి ఇద్దరినీ కలిపి ఇంటర్వ్యూ చెయ్యడం;
  • నిరుద్యోగం, ఫెయిత్తో డిప్రెషన్ నుండి బయటపడి, ఆరోగ్యం కుదుటపడేదాకా ఉద్యోగాన్ని వెదుక్కోవడాన్ని వాయిదా వెయ్యమని చెప్పడం;
  • ఒంటరితనం, చర్చికి వెళ్ళి పాస్టర్తో మాట్లాడమని సలహా చెప్పడం.

ఆరోగ్య కార్యకర్త ఫెయిత్ని వారానికొకసారి క్లినిక్కి రమ్మని చెప్పింది. మూడు వారాల తరువాత, పిల్లలు పుట్టే అవకాశాన్ని ఎలామెరుగు పరచుకోవాలో ఫెయిత్కి, ఆమె భర్తకు కౌన్సిలింగ్ చేసాక, ఫెయిత్కు తన ఆరోగ్యం బావున్నట్లనిపించసాగింది. ఒక స్థానిక రెస్టారెంట్లో ఫెయిత్కి శుభ్రపరచే పని దొరికింది. అప్పటి నుండి ఆరోగ్యకార్యకర్త ఫెయిత్ని నెలకొకసారి చొప్పున ఆరు నెలలపాటు కలిసింది, తరువాత ఇంక మందుల అవసరం లేకపోయింది.

వ్యవస్థను మెరుగుపరచడం

కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మొత్తం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్రను

నిర్వహించ గలరు. ఉదాహరణకు, ఒక ఆరోగ్యకార్యకర్త జిల్లా ఆరోగ్య కమిటీలో సభ్యుడయితే, వివిధ పాలసీ అంశాలపై

అతని అభిప్రాయాన్ని కోరతారు. ప్రాథమిక మానసిక ఆరోగ్యసంరక్షణను మెరుగు పరచడానికి కొన్ని ప్రత్యేక చర్యలు

ఉన్నాయి:

  • సాధారణ మానసిక ఆరోగ్య సమస్యల వ్యాధి నిర్ధారణ, చికిత్స విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అవసరం.;
  • కనీసం ఒక ఏంటీడిప్రెసెంట్, ఒక ఏంటీసైకాటిక్, ఒక ఏంటీకన్వల్సెంట్ ని తప్పనిసరి మందుల జాబితాలో ఉంచాలి ( అధ్యాయం. 11);
  • తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నవారికి అనంతర వైద్యంకోసం క్లినిక్స్ని ఏర్పాటు చెయ్యడం (తక్కువ మంది జనం డాక్టరు దగ్గరికి వచ్చే సమయాల్లో ఈక్లినిక్స్ని నిర్వహించగలరు);
  • ఆరోగ్య సేవల్లో సమాజసేవకులు, సైకాలజిస్టుల సంఖ్యను పెంచాలి, ఎందుకంటే డాక్టర్లకంటే వీరికి తక్కువ ఖర్చు అవుతుంది, మానసిక ఆరోగ్య సంరక్షణలో వారు ముఖ్యమైన పాత్రను పోషించగలరు. వివిధ మానసిక ఆరోగ్య సమస్యల్ని లెక్కించి, ప్రతి రోగి శ్రేస్నోట్లో నమోదు చేసే ఒక పర్యవేక్షణ వ్యవస్థను నెలకొల్పాలి.

పునరుత్పత్తి ఆరోగ్యం

పునరుత్పత్తి ఆరోగ్యం అంటే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలలో శారీరక, మానసిక, సాంఘిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉండడం. ఆచరణలో, చాలా భిన్నమైన రకాలు వుంటాయి. స్త్రీ జననేంద్రియ ఆరోగ్యం, గృహహింస, కౌమారుల ఆరోగ్యం, తల్లుల ఆరోగ్యం, లైంగిక వ్యాధులు ఇందులోకి వస్తాయి. ఇందులో ప్రతి ఒక్క దానికి సంబంధించిన  మానసిక ఆరోగ్య అంశాలు ఉన్నాయి. చాలా వాటిగురించి ఈ మాన్యువల్లో వేరే చోట వివరింపబడింది ( విభాగాలు.7.2 గృహహింసకొరకు, 9.8. లైంగిక వ్యాధుల కొరకు). జెండర్, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విశాల అంశాలు 10.9 విభాగంలో చర్చించబడినాయి. ఇక్కడ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు, తల్లుల ఆరోగ్యం మీద చర్చ కేంద్రీకరించబడింది.

స్త్రీ జననేంద్రియ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం కోణం నుంచి ముఖ్యమైనవి మూడు ప్రత్యేకమైన స్త్రీ జననేంద్రియ సమస్యలు ఉన్నాయి.

జననేంద్రియ సంబంధ సమస్యలు. జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు సాధారణం, ముఖ్యంగా తెల్లబట్ట లేక వైట్ డిశ్ఛార్జి, పొత్తి కడుపులో నెప్పి. వీటితో బాధపడే చాలామంది స్త్రీలు అలసట, నీరసం, డిప్రెషన్, ఆందోళనతో కూడా బాధపడతారు.

రుతుస్రావ సమస్యలు. కొంతమంది స్త్రీలకు ప్రతిసారి బహిష్టు రావడానికి ముందు నలతగా వుంటుంది. దీనిని ప్రీమెనుృవల్ సిండ్రోమ్ అంటారు. దీనితో బాధపడుతున్నవారికి చిరాకుగా, కుంగుబాటుగా, ఏకాగ్రత లేకుండా, అలసటగా వుంటుంది. కొంతమంది స్త్రీలకు బహిష్ణులు ఆగిపోయే దశలో తలనెప్పి, ఏడుపు, చిరాకు, ఆందోళన, నిద్ర సమస్యలు, నిస్తాణ వుంటాయి.

స్త్రీజననేంద్రియాలకు ఆపరేషన్ తరువాత, కుటుంబ నియంత్రణ ఆపరేషన్, (ఉదా. అండవాహికలో చిన్న ముక్కను కత్తిరించడం), గర్భాశయ ఆపరేషన్లు, (ఉదా. గర్భాశయాన్ని తొలగించడం), రొమ్ము ఆపరేషన్లు (ఉదా. రొమ్ముకేన్సర్కి) స్త్రీలకు మానసిక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. పునరుత్పత్తి అవయవాలను సెక్సువాలిటీకి, స్త్రీత్వానికి చిహ్నాలుగా భావించడం వలన జననేంద్రియాల ఆపరేషన్లు స్త్రీలకు చాలా ఒత్తిడిని కలగజేస్తాయి. ఆచరణలో, మీరు గైనిక్ బాధలతో వచ్చే ప్రతి వారిని డిప్రెషన్, ఏంగ్డయిటీ గురించి అడగాలి. అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్ని, ఏంటీడిప్రెసెంట్స్ని ఉపయోగించాలి.

తల్లుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం

స్త్రీజీవితంలో మాతృత్వం చాలా సంతోషదాయకమైన, ఫలప్రదమైన దశ, అదేసమయంలో స్త్రీ శరీరంలో, ఇతరులతో సంబంధాలలో, పనిలో విపరీతమైన మార్పులు వచ్చే దశకూడా. ఉదాహరణకు, ఇతర పిల్లలతో, భర్తతో సంబంధాలు మారవచ్చు. కొత్తబిడ్డతో పనిభారం పెరుగుతుంది. ఈమార్పులు భావోద్వేగాల్ని ప్రభావితం చేస్తాయి. తల్లులకు సంబంధించి రెండు సందర్భాలలో మానసిక ఆరోగ్య అంశాలు · ప్రధానం.

• ప్రసవం తరువాత డిప్రెషన్. ప్రసవమైన వెంటనే స్త్రీలకు డిప్రెషన్ వచ్చే ప్రమాదం వుంది. సంతోషంలేని వివాహం, గృహహింస, బిడ్డకు తన పాలివ్వడంలో సమస్యలు, పుట్టిన బిడ్డకు అనారోగ్యాలు, మరణం, కొన్ని సమాజాలలో, ఆడపిల్ల పుట్టడం వంటివి డిప్రెషన్ని కలగజేస్తాయి. మరొకవైపు, కోరుకున్నప్పుడు వచ్చిన గర్భం, కుటుంబ సభ్యుల అసరా ప్రసవానంతర డిప్రెషన్ని నిరోధిస్తాయి. ప్రసవానంతర డిప్రెషన్ 12 నెలల దాకా ఉండొచ్చు. దీనికారణంగా బిడ్డ సంరక్షణలో నిర్లక్ష్యం ఉండొచ్చు, బిడ్డ ఎదుగుదల, అభివృద్ధి కుంటుపడతాయి.
  • గర్భవిచ్ఛిత్తి, గర్భస్రావం. గర్భవిచ్చిత్తి, గర్భస్రావం కారణంగా గర్భాన్ని కోల్పోవడం డిప్రెషన్కి దారితీస్తుంది. గర్భస్రావం అవడం గురించి ఆ స్త్రీ న్యూనతపడొచ్చు. తన శరీరం బిడ్డకు జన్మనివ్వడంపై నమ్మకంలేక ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంది. కొన్నిసార్లు గర్భం పోయాక, ఏదోకోల్పోయినట్లు, విచారం, శూన్యత, కోపం, కొరత, నిందమోపడం, ఈర్ష్య మొదలైన ఉద్వేగాలు కలుగుతాయి.

మిడ్వైవ్స్, ప్రసూతి కేంద్రాల్లో సిబ్బంది లాంటి మాతృత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు గర్భాన్ని కోల్పోవడం, ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ని నిరోధించడంలో ప్రముఖ పాత్రను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా డిప్రెషన్ వచ్చే ప్రమాదం వున్న స్త్రీలకు, ఉదాహరణకు, బిడ్డ చనిపోయిన స్త్రీలకు, గర్భస్రావాలయిన స్త్రీలకు, వివాహంలో సంతోషం లేని స్త్రీలకు. ఇతర కుటుంబ సభ్యుల అసరా లేని స్త్రీలకు కౌన్సిలింగ్ ఇవ్వొచ్చు. కౌన్సిలింగ్ కేంద్రీకరణ రెండు రకాలుగా వుంటుంది.

  • గర్భాన్ని కోల్పోవడంవలన కలిగే దుఃఖాన్ని తట్టుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి, లేదా బిడ్డకు పాలివ్వడానికి, బిడ్డని సంరక్షించడానికి తగినంత విశ్రాంతి, పోషకాహారం (తల్లికి) అవసరాన్ని గురించి, తన భావాల్ని దగ్గరి బంధువులతో పంచుకోవడం వలన కలిగే లాభాల గురించి సలహానివ్వడం ద్వారా బిడ్డను సాకడంలో తల్లిని శక్తిమంతురాల్ని చెయ్యడం
  • పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులిరువురు బాధ్యతను పంచుకోవలసిన అవసరాన్ని ముఖ్యంగా సంప్రదాయకంగా బిడ్డను పెంచడం తల్లి బాధ్యతేనని, తండ్రి పాత్ర లేదని నమ్మే సమాజాల్లో, తల్లిదండ్రులిద్దరికి అవగాహన కలిగించడం, పిల్లల్ని పెంచడం కేవలం బాధ్యతే కాదు, సంతోషదాయకమైన అనుభవం కూడా అని తండ్రులకు బోధించాలి.

కొన్నిసార్లు ఇతర కుటుంబ సభ్యులకు కూడా, ముఖ్యంగా సమష్టి కుటుంబవ్యవస్థలో, కౌన్సిలింగ్ని విస్తరించాలి. పెద్ద పిల్లల్ని తల్లికి పని భారాన్ని తగ్గించడానికి సహాయ పడమని ప్రోత్సహించాలి, ఆడపిల్ల పట్ల ప్రతికూల భావాలు ఉన్న వారికి సానుకూల వైఖరి ఏర్పడేలాగా బోధించాలి. చివరగా, దంపతులిద్దరు చర్చించుకుని, కుటుంబనియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకుని, కోరుకున్నప్పుడు బిడ్డను కనేలాగా ప్రోత్సహించాలి. కోరుకున్నప్పుడు బిడ్డను కనడం తల్లి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఖైదీల ఆరోగ్యం

మానసిక అనారోగ్యం, నేరం

కొన్ని రకాల మానసిక వ్యాధులు వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించేలాగా ప్రభావితం చేస్తాయి. నమూనా ఉదాహరణలు ఇవి:

  • తీవ్రమైన వూనసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు హింసాయుతంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, సైకాటిక్ దశలో వారు మనుషులమీద అరుస్తూ బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చు. అరుదుగా, మానసిక అనారోగ్యం వున్న వ్యక్తి ఎదుటివ్యక్తిని బెదిరించవచ్చు, దాడి చెయ్యొచ్చు.
  • మద్యం, లేక మత్తుమందుల వ్యసనం వున్నప్పుడు దొంగతనం నేరం వుంటుంది. కారణం చాలా సరళం: వారి మందు అలవాటు కోసం డబ్బు చెల్లించడానికి మనుషులు దొంగతనం చేస్తారు. కౌమారులు కాండక్ట్ సమస్యవలన దొంగతనం చేస్తారు.
  • మద్యాన్ని మితిమీరి తాగడం వలన, తీవ్రమైన మానసిక అనారోగ్యం కారణంగా ప్రమాదకరంగా వాహనాల్ని నడుపుతారు. ఐనప్పటికి, మానసిక అనారోగ్యం, నేరంని గమనించినప్పుడు "నేరాలు చేసే వారిలో చాలామంది మానసిక అనారోగ్యాలతో బాధపడతారా?" అని ప్రశ్నిస్తే, జవాబు లేదు' అని వస్తుంది. ఆవిధంగా, మానసిక వ్యాధులు వున్నవారిని హింసాత్మకంగా ప్రవర్తించేవారిగా లేక చట్టాన్ని ఉల్లంఘించే వారిగా పరిగణించక పోవడం చాలా ముఖ్యం. మానసిక వ్యాధులు వున్నవారిలో చాలామంది హింసాత్మకంగా ప్రవర్తించరు.

ఖైదీల మానసిక ఆరోగ్యం ఖైదీల మానసిక ఆరోగ్యం రెండు కారణాల వలన చాలా ముఖ్యం

  • కొంతమంది మానసిక అనారోగ్యం వున్న వ్యక్తులు నేర కార్యకలాపాల్లో పాల్గొని, చివరకు జైలులో పడతారు.
  • జైలులో ఉండడం ఒత్తిడి కలిగించే అనుభవం. వెలిగా వుండడం, స్వేచ్ఛను కోల్పోవడం, ఆందోళన, కొంతమందిలో మానసిక వ్యాధికి దారితీస్తాయి. కొన్ని జైళ్ళలో మత్తుమందుల ఉపయోగం, హింస వుంటాయి. జైలులో వుండడం వలన మానసిక వ్యాధి రావచ్చు.

జైళ్ళలో కొంచెం ఎక్కువ సాధారణంగా వుండే మానసిక అనారోగ్యాల రకాలు:

  • సైకాటిక్ వ్యాధులు, ముఖ్యంగా, ఊహాత్మక వ్యక్తులతో లేక తమతో తాము మాట్లాడుకోవడం, చంచలంగా, ఒకచోట కుదురుగా కూర్చోకుండా తిరుగుతూ అసహజంగా ప్రవర్తించే వ్యక్తులు;
  • జైలులో పెట్టిన వెంటనే మద్యం లేక మత్తుమందుల్ని మానేసాక వ్యక్తులలో కలిగే ప్రతిస్పందనలు; జైలులో పెట్టిన ఫలితంగా వచ్చే డిప్రెషన్, ఏంగ్టయిటీ (జైలులాంటి బాగా రక్షణ, నిఘా ఉన్నచోట కూడా ఆత్మహత్యలు జరగడం)

ఖైదీల మానసిక ఆరోగ్య సంరక్షణ

సాధారణంగా జైళ్ళు కఠినమైన ప్రదేశాలు, ఇక్కడ నిత్య జీవితసారం క్రమశిక్షణ, మార్పులేకుండా ఒకేలా గడవడం. ఇవి మనుషుల్ని శిక్షించడానికి పంపే ప్రదేశాలు. ఒకవ్యక్తిని చాలా తీవ్రంగా గాయపరచిన వ్యక్తి పట్ల సానుభూతిని చూపడం కష్టం. కాని, ఆరోగ్య కార్యకర్తలు ఖైదీ నేరం చేసాడు, లేదు, మంచివాడు లేక చెడ్డవాడు అనే తీర్పునిస్తూ మాట్లాడగూడదు. ఉపయోగకరమైన నైపుణ్యం సహానుభూతి, అంటే మిమ్మల్ని ఎదుటి వ్యక్తి స్థానంలో ఉన్నట్లు ఊహించుకుని, అతనెలా భావిస్తూ ఉంటాడో అలా భావించడానికి ప్రయత్నించడం. చాలా నేరాల్ని మనుషులు తమజీవితంలో వేరే దారిలేనట్లు భావించి చేస్తారని- బహుశా పేదరికం వారిని ఆనేరం చేసే స్థితికి నెట్టుతుందని మీరు తెలుసుకుంటారు. ఐతే, ఇది నేరంచెయ్యడం న్యాయమని చెప్పడంకాదు, కాని ఇది మీరు ఖైదీ హానికి గురవగల మనిషిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మీరు ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని ఇలా మెరుగుపరచగలరు:

  • వ్యక్తిగత కౌన్సిలింగ్. కీలకమైన అంశాలుః
  • వినండి: ఖైదీని తన భావాల్ని మీతో పంచుకోనివ్వండి, ఈ చర్చను అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడో లేదో అంచనా వెయ్యడానికి ఉపయోగించుకోండి.
  • ఆచరణాత్మక అవసరాల్ని చర్చించండి: ఉదాహరణకు, ఆఖైదీ తన కుటుంబాన్ని కలవడానికి తపించిపోతున్నాడు, ఇది అతనికి చాలా అసంతోషాన్ని కలిగిస్తూంది. కేవలం అతని కుటుంబంతో కలవడానికి ఏర్పాటు చెయ్యడం అతని మానసిక ఆరోగ్యాన్ని కుదుట పరుస్తుంది.
  • సమస్యా పరిష్కార నైపుణ్యాలు
  • స్నేహితుల ఆసరా. జైళ్ళలో పనిచేసే ఆరోగ్యకార్యకర్తలకు ఏఖైదీ నమ్మకస్తుడో, ఇతరులపట్ల సానుభూతితో వ్యవహరిస్తాడో, ఇతరులకు సహాయపడే నైపుణ్యంవుందో తెలుస్తుంది. అలాంటివారిని మీరు కౌన్సిలర్స్గా, లేక అవసరం ఉన్న ఇతర ఖైదీలకు ఆసరానిచ్చే స్నేహితులుగా ఉపయోగించవచ్చు.

బృందాలు. జైలు అధికారులకు ఖైదీల సమష్టి సమస్యలగురించి చర్చించడానికి బ్బంద చర్చలు నిర్వహించాలని సూచించండి

ప్రత్యేకమైన మానసిక వ్యాధులకు చికిత్స. ఈప్రత్యేక లక్షణాలు ఉంటాయి:

  • మద్యం, మత్తుమందులను మానేటప్పుడు వచ్చే విత్డ్రాయల్ లక్షణాలు
  • హింసాత్మక లేక కలవరం లేక గందరగోళప్రవర్తన
  • అత్మహత్యా ప్రయత్నం, లేక అత్మహత్య గురించి ఆలోచనలు.

వ్యవస్థను మెరుగుపరచడం

జైలు వ్యవస్థ మొత్తం ఖైదీల భావోద్వేగ అవసరాలపట్ల సానుభూతితో వుండదు కనుక ఖైదీలతో పని చెయ్యడం కష్టం. జైలులో పని చెయ్యడం ఒత్తిడిని కూడా కలగజేస్తుంది, వార్డెన్లు, గార్డులు, ఇతరులకు భావోద్వేగ సమస్యలు కలిగేందుకు దోహదం చేస్తుంది. జైలులో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మీరు ఉపయోగకరమైన పాత్రను పోషించగలరు, ఇది చివరగా అక్కడ నివసించే లేక పని చేసే వారి మానసిక ఆరోగ్యానికి లాభం చేకూరుస్తుంది. ఖైదీలకు, జైలు సిబ్బందికి మధ్య ఉన్న సమస్యల్ని అరమరికలు లేకుండా చర్చించడాన్ని సాధ్యం చేసే కార్యక్రమాలు వారి మధ్య ఉన్న అనుమానాలు తొలగడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్య సమస్యలపై లేక ఖైదీల హక్కులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల్ని భాగస్వాముల్ని చేస్తూ నిర్ణీత వ్యవధిలో బ్బంద సమావేశాలను నిర్వహించడం లాభదాయకం. ఖైదీలకు, జైలు సిబ్బందికి మెడిటేషన్, ప్రశాంతపరచే శిక్షణ నివ్వడానికి ప్రయత్నించడంవలన వారు ఒత్తిడిని తట్టుకోవడానికి, నైపుణ్యాల్ని పంచుకోవడానికి, ధైర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.

కాందిశీకులు

వేలమంది ప్రజలు యుద్ధం, మతద్వేషం కారణంగా, హత్యలు, కరువు కారణంగా తమ ఇంటిని, ఊరిని వదిలి వేరేచోటకు పారిపోతారు. వారిని మనం కాందిశీకులు లేక శరణార్డులు అని అంటాము, వీరు ప్రాణాల్ని కాపాడుకోవడానికి తమ ఇంటిని వీడతారు. యుద్ధాలు, ఉగ్రవాదం, ఘర్షణలు, పౌర సంక్షోభాలు ప్రపంచమంతటా జరుగుతున్న విషాదాలు. ఒక వైపు సాంకేతికత అభివృద్ధి చెందుతూండగా, మరొక వైపు భయంకరమైన, క్రూరమైన హత్యాసాధనాలు లభ్యమవుతున్నాయి, ఆయుధాల వ్యాపారం వేగంగా వృద్ధిచెందుతూంది. సాధారణంగా సామాన్య పౌరులు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు తీవ్రమైన గాయాల పాలవుతారు. ఒక విధంగా కాందిశీకులే అదృష్టవంతులు, పారిపోకుండా ఉన్నచోటే మిగిలిపోయిన వారు అధునిక యుద్ధ బీభత్సాన్ని దాడులు చేసిన వారి అమానుషత్వాన్ని అనుభవిస్తారు. స్త్రీలు మానభంగానికి, పురుషులు హత్యలకు గురవుతారు. సమాజాలు నాశనమవుతాయి. మానవత్వం లేకపోవడం, నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవడం, మనుషులు గాయపడేటప్పుడు కలిగే బీభత్సం యుద్ధానంతర మానసికపరిణామాల్ని కలగజేస్తుంది.

ముందు మౌలిక అవసరాల్ని తీర్చడం

కాందిశీకులు, యుద్ధ ప్రదేశాల్లో నివసించేవారి మానసిక ఆరోగ్యాన్ని సవ్యంగా ఉంచడానికి వారికి భద్రత కలిగించడం, నీరు, ఆహారంలాంటి మౌలిక అవసరాలను తీర్చడం చాలా ముఖ్యమైన చర్యలు. సమయం గడిచేకొద్దీ జరిగిన విషాదాల్ని మరచి మనుషులు ఎంత మామూలుగా జీవిస్తే అంత త్వరగా కోలుకుంటారు. వ్యక్తులకు కొన్ని బాధ్యతల్ని కొన్ని పాత్రల్ని అప్పగించడమంటే అర్థం కాందిశీకులు తమ ఉపశమన కార్యక్రమాల్ని తామే నిర్వహించుకోగలరు అని చెప్పడం. ఇది ఇతరులమీద ఆధారపడడాన్ని నిస్సహాయతను తగ్గిస్తుంది.

కాందిశీకుల మానసిక ఆరోగ్యం

కాందిశీకుల మానసిక ఆరోగ్యం దెబ్బ తినడానికి చాలా కారణాలు ఉన్నాయి:
  • దుఃఖం, సంతాపం. తమ స్వంత వస్తువులన్నిటినీ, కుటుంబాన్ని ఇంటిని, ఆదాయాన్ని పోగొట్టుకోవడం మనుషులకు, ముఖ్యంగా పేదలకు చాలా పెద్ద దెబ్బ. జరిగిన సంఘటనలు అర్థం పర్థం లేనివవటం వలన శోకం మరింత ఎక్కువవుతుంది.
  • భయంకరమైన హింసకు గురవడం. చాలామంది కాందిశీకులు భీతావహమైన సంఘటనల్ని చూసి వుంటారు లేక భయంకరమైన అనుభవాల్ని పొందివుంటారు.
  • శారీరకమెన్ల గాయాలు లేక అనారోగ్యాలు. వీటి పరిణామాలు మానసిక అనారోగ్యాలు.
  • కమ్యూనిటీ నెట్వర్క్ లేని వాతావరణంలో నివసించడం. కాందిశీక శిబిరాలు తరచుగా క్రిక్కిరిసిన జనంతో, పారిశుధ్యమనేదే లేకుండా, విచారంతో నిండి వుంటాయి. విభిన్నమైన కమ్యూనిటీలవారు కలిసి నివసిస్తారు. చాలామంది కాందిశీకులు ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకుంటారు. ఇతరుల ఆసరాను పొందే మార్గాలను కనుకుంటారు, ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. ఐనప్పటికీ కొంతమందిలో మానసిక అలజడి లక్షణాలు కనపడవచ్చనే అవగాహన మీకు ఉండాలి. సాధారణంగా కనపడే మానసిక వ్యాధులు డిప్రెషన్, పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్డర్  వీరిలో నిద్ర సమస్యలు, పీడకలలు, భయభ్రాంతులవడం,అలసట, రోజువారీ కార్యక్రమాలపై ఆసక్తిని కోల్పోవడం, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక ఉంటాయి. కొంచెం తక్కువ తరచుగా వ్యక్తి అర్థం లేకుండా మాట్లాడుతూ, అసహజంగా ప్రవర్తిస్తూ అలజడిగా వుంటాడు. వీరిని వైద్య సదుపాయాలన్నీ ఉన్నచోట ఉంచి చికిత్స చెయ్యాలి.

యుద్ధంలో పాల్గొనే పిల్లలు

పోరాటం వలన కలిగే ఒత్తిడి పిల్లల్లో ఒత్తిడికి కారణమవుతుంది. పిల్లలు తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోవడం వలనేకాక, వారిని యుద్ధంలో ఏజెంట్స్గా ఉపయోగించుకోవడం వలన తరచుగా వారు దారుణమైన యుద్ధ పీడితులు. బాల సైనికులు తీవ్రమైన గాయాలకు, మరణాలకు గురవడమేకాదు, వారు ఇతరులమీద హింసకు పాల్పడతారు. అలాంటి అనుభవాల వలన వారు W పెరుగుతున్నప్పుడు హింసాత్మక వ్యక్తులుగా తయారవుతారు. హింసకు గురైనప్పుడు కొంతమంది పిల్లలు ముడుచుకుపోతారు, పీడకలలు, తలనెప్పులు, ఇతర శారీరక నెప్పలు, వారి అసలు వయసుకంటే చిన్న వయసువారిగా ప్రవర్తిస్తారు .

కాందిశీక శిబిరంలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

కాందిశీక శిబిరంలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఆరోగ్య కార్యకర్త చాలా చెయ్యగలడు.

  • బాధ్యతల్ని అప్పజెప్పడం. నిస్సహాయత కాందిశీకుడిగా వ్యక్తిని అతి ఎక్కువగా కలచివేసే అనుభవం. బాధ్యతాయుతంగా వుండడం, తమ అవసరాలకు ప్రతిస్పందనగా నిర్ణయాలు చెయ్యడం కాక కాందిశీకులు సహాయ కార్యకర్తలమీద పూర్తిగా ఆధారపడతారు, పరిస్థితులు వారి నియంత్రణలో వుండవు. బాధ్యతల్ని అప్పజెప్పడం అంటే వ్యక్తులకు కొన్ని ప్రత్యేకమైన పనుల్ని కేటాయించడం. వ్యక్తుల సామర్థ్యాల్ని గుర్తించి వారికి తగిన పనుల్ని అప్పజెప్పాలి.
  • బృంద కార్యక్రమాల్ని నిర్వహించండి. ఆహారాన్ని తయారు చెయ్యడం, జబ్బుపడిన వారికి సేవ చెయ్యడం వంటి పలు రకాల బృంద కార్యక్రమాలలో కాందిశీకులు పనిచెయ్యగలరు . పిల్లలు క్లాసులకు వెళూ, బృందాలుగా ఆడుకుంటూ దాదాపుగా మామూలు జీవితాన్ని గడపడానికి అవకాశమివ్వాలి.
  • వ్యక్తికి కౌన్సిలింగ్ చెయ్యండి. కొంతమంది కాందిశీకులకు ప్రత్యేకమైన సహాయం అవసరమవుతుంది, ఉదాహరణకు, తన పిల్లలందరినీ కోల్పోయిన లేక చాలా దారుణంగా మానభంగానికి గురైన స్త్రీ కౌన్సిలింగ్ అంటే మనుషుల అనుభవాల్ని వినడం, వారిని తరచుగా కలవడం, చిన్నచిన్న సహాయాలు చెయ్యడం, సమస్యా పరిష్కారానికి ప్రయత్నించడం.
  • మందుల్ని ఇవ్వండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏంటీ డిప్రెసెంట్ మందును ఇవ్వడం సహాయకారిగా వుంటుంది. కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి అలజడిగా ప్రవర్తిస్తాడు. స్వల్పకాలం పాటు నిద్రమాత్రల్ని లేక ట్రాంక్విలైజర్స్ని తగినట్లు వాడడం ఆ వ్యక్తిని ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది.

విపత్తులు

ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో అనేకమంది మనుషులు ఒకేసారి బాధపడే సంఘటనల్ని విపత్తులు అంటాము. విపత్తులు ఇళ్ళు కూలిపోవడం, యుద్ధాల వంటి మనుషుల వలన కలిగేవి అవొచ్చు, లేక భూకంపాలు, భూమి జారడం లాంటి ప్రకృతి విపత్తులు కావొచ్చు. విపత్తుల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా వుంటుంది, ఎందుకంటే వారికి తక్కువ నిలవలు, పునర్నిర్మాణానికి తక్కువ వనరులు వుంటాయి. అంతేకాక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విపత్తుల నెదుర్కోవడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు ఉండవు. ఫలితంగా విపత్తులు వచ్చినప్పుడు నిరుపేదలు ఎక్కువగా బాధపడతారు. విపత్తు వచ్చాక చేసే సహాయ కార్యక్రమాలలో చాలా ముఖ్యమైనది బాధితులకు ఆహారం, తాగునీరు, నివాసం, గాయాలకు అత్యవసర మందులు లాంటి మౌలిక అవసరాల్ని తీర్చడం.

విపత్తులు, మానసిక ఆరోగ్యం.

విపత్తులతో వుండే ఈ అనుభవాల్ని గమనించండిః
  • మీ ప్రాణాలకు ముప్ప;
  • మీ సన్నిహిత కుటుంబ సిబియ్య్ లు తీవ్రంగా గాయపడ్డారు లేక మరణించారు;
  • మీ ఇల్లు నాశనమయింది (మీరు, మీకుటుంబ సిబియ్య్ లు ఇల్ల్ లేనివారయారు)
  • ఆహారం, తాగునీరు లేకపోవడం వలన మీ శారీరక ఆరోగ్యం దెబ్బతింది.

అలాంటి అనుభవాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తాయి. విపత్తులు వచ్చినప్పుడు చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. చాలా తరచుగా వచ్చేవి, డిప్రెషన్, ఏంగ్టయిటీ, పోస్ట్ ట్రమాటిక్ ప్రైస్ డిజార్డర్ నిస్సహాయత, భయం, ఆత్మహత్య సంబంధ ఆలోచనలు, బ్రతుకు మీద ఆసక్తి పోవడం మానసిక వ్యాధి తొలి లక్షణాలు

మానసిక ఆరోగ్యాన్ని సహాయ కార్యక్రమాల్లో చేర్చడం

విపత్తులు వచ్చినప్పుడు ఆరోగ్యానికి ఒక సమగ్ర విధానం అవసరం. మాలిక సౌకర్యాలను కల్పించడం ద్వారా సహాయ కార్యకర్త మానసిక ఆరోగ్యానికి అవసరమైన ఒక ముఖ్యమైన చర్యను తీసుకుంటున్నాడు. బాధితులు తమ పరిస్థితిని తట్టుకోవడానికి కౌన్సిలింగ్ సహాయపడుతుంది. విపత్తు బాధితుడి కౌన్సిలింగ్లో ఈ క్రిందివి వుండాలి.

  • ఇతర కుటుంబసభ్యులు ఎక్కడ వున్నారో తెలుసుకోవడం - తరచుగా విపత్తు కారణంగా కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాన్ని ఒక దగ్గర చేర్చడం చాలా ముఖ్యమైన లక్ష్యం.
  • ఆ వ్యక్తి అవసరాలేమిటో అడగడం-ఆచరణాత్మక సహాయం, ఉదాహరణకు, ఇంటినెలా నిర్మించుకోవడం, చాలా ముఖ్యమైన విషయమవొచ్చు;
  • విపత్తు సమయంలో జరిగిన సంఘటనల్ని గుర్తుచేసుకుని చెప్పమని అడగండి- ఆ దారుణ సంఘటన గురించి చర్చించడం, ఆ అనుభవాల్ని పంచుకోవడం అందరికీ దూరంగా వున్న భావనను, ఒంటరితనాన్ని తగ్గిస్తాయి.

  • సమస్యా పరిష్కారం-ఒక్కసారి ముప్పిరిగొన్న సమస్యల్లో ఆమె మునిగిపోవచ్చు, ఆమె ప్రధానమైన సమస్యల్ని ముందు ఎంపిక మీమిగతా కుటుంబసభ్యులు చేసుకోవడానికి సహాయపడి, వాటిని పరిష్కరించే మార్గాలకోసం ఎక్కడున్నారో నీకు తెలుసా? పనిచెయ్యడం ముఖ్యమైన సాధికారతా అనుభూతి;
  • డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధులకు చికిత్స.

విపత్తు బాధిత ప్రాంతాలలో వివిధ సంస్థలు కలిసి పని చేస్తాయి. వారందించే వివిధ సౌకర్యాలను మీరు తెలుసుకుని వుండాలి. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం నిర్ణీత సౌకర్యాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది. అలా వున్నప్పుడు డిప్రెషన్, ఆత్మహత్య సంబంధ ఆలోచనలు ఉన్నవారిని వేరే చోటకు చికిత్సకోసం పంపడం గురించి ఆలోచించండి. చివరగా, విపత్తు బాధితులతో, (హింస, యుద్ధ బాధితులతో) పని చెయ్యడం కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న పని అని గుర్తుంచుకోండి, మీ మానసిక ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించండి

కౌమార ఆరోగ్యం

ఎదగడం ఒక వేడుక కావాలి

ఎవరి జీవితంలోనైనా కౌమారం ఒక ప్రత్యేకమైన దశ. పిల్లలు తాము పెద్దవారమయామని భావించే దశ, తమను తాము ప్రత్యేకమైన, అసామాన్యమైన వ్యక్తులుగా భావించేదశ. వారికి స్నేహితులు కావాలి. ముఖ్యమైన పరీక్షల్ని ఎదుర్కోవాలి గనుక వారు శ్రద్ధగా చదవాల్సిన దశ. ప్రత్యేకంగా, ఇది వ్యతిరేక సెక్స్ వ్యక్తులపట్ల లైంగిక ఆకర్షణ ప్రారంభమయే ఉత్తేజపూరితమైన దశ. కౌమారదశ 11, 12 ఏళ్ళకు ప్రారంభమయి 18, 19 ఏళ్లవరకు కొనసాగుతుంది. కౌమార ఆరోగ్యం ఒక ప్రధానమైన అంశం. మన యువతకు మంచి ఆరోగ్యాన్ని నిశ్చయపరిస్తే, మన కమ్యూనిటీల భవిష్యత్తు భద్రంగా వుంటుంది. వారి శరీరాలలో, జీవితాలలో ఎంతో మార్పు జరుగుతూ వుండడం వల్ల, ఒత్తిడి, కష్టాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యువత ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడానికి కారణం వారు లైంగికంగా పరిణతి చెందు తూండడం. లైంగిక పరిజ్ఞానాన్ని సామాన్య తెలివిని పెంపొందించడం హెచ్ ఐ వి / ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధుల్ని నిరోధించడానికి ముఖ్యమైన మార్గం.

మానసిక ఆరోగ్య అంశాలు

ఎదుగుదలతో ముడిపడిన మూడు ముఖ్యమైన మానసిక ఆరోగ్య ఉన్నాయి:
  • డిప్రెషన్కి లోనవడం. డిప్రెషన్కి సాధారణ కారణాలు కుటుంబంలో పోట్లాటలు, చదువులో ఇబ్బందులు, స్నేహితులతో సంబంధాలలో సమస్యలు
  • మత్తుమందులు, మద్యం వ్యసనం. చాలామంది యువతీయువకులు సిగరెట్స్ తాగడం, మద్యం తాగడం, కన్నబిస్ (హాషిష్, మార్జువానా) లాంటి మత్తుమందుల్ని తీసుకోవడం మొదలుపెడతారు. ప్రమాదమేమిటంటే, మొదట ప్రయోగంగా మొదలు పెట్టింది. తరువాత అలవాటుగా మారుతుంది
  • షిజోఫ్రినియా రావడం. మొదటి రెండు సమస్యల కంటే ఇది అరుదుగా వస్తుంది. కాని దీనిని మనసులో ఉంచుకోవాలి, ఎందుకంటే తీవ్రమైన మానసిక వ్యాధి అయిన షిజోఫ్రినియా కౌమారదశలో, ముఖ్యంగా బాలురలో, ప్రారంభమవుతుంది, తమ కొడుకు స్నేహితులకు, కుటుంబానికి దూరంగా వుంటున్నాడని, వింతగా ప్రవర్తిస్తున్నాడని, వింతగా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులు చెస్తే, షిజోఫ్రినియాను పరిగణనలోకి తీసుకోండి.

మానసిక ఆరోగ్యాన్ని విద్యతో అనుసంధానం చెయ్యడం

చాలా పాఠశాలల్లో ఇప్పుడు కౌమారులు తమ లైంగిక ప్రవర్తన విషయంలో ఎలా సబబైన నిర్ణయాలు తీసుకోవాలో బోధించడానికి లైంగిక విద్యను అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య అంశాన్ని చేర్చడం వలన ఈ కార్యక్రమాలు లాభపడతాయి. అలాంటి కార్యక్రమాల్లో చేర్చవలసిన అంశాలు:

  • సానుకూలంగా ఆలోచించడం. అత్మగౌరవం అంటే అర్థం ఒక వ్యక్తి తనకు తాను ఎంత విలువ ఇచ్చుకుంటుందో అది. ఆమెకు తన గురించి మంచిగా అనిపిస్తే ఆమెకు ఆత్మగౌరవం ఎక్కువ వుంటుంది. ఆమె దుఃఖితురాలుగా, అసంతోషంగా వుంటే ఆమెకు ఆత్మగౌరవం తక్కువవుంటుంది. ఆమె తన గురించి మంచిగా భావిస్తే, ఆమె ఛాలెంజిల్ని అంగీకరిస్తుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడించి స్నేహాల్ని ఆనందిస్తుంది. ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి కీలకం వ్యక్తులు తమ బలాల్ని బలహీనతల్ని గుర్తించి తమను తాము అంగీకరించడానికి సహాయ పడడం. వాస్తవ లక్ష్యాల్ని పెట్టుకోవడం,స్నేహితుల్ని నమ్మి, వారితో సన్నిహిత సంబంధాలను పెంపొందించు కోవడం, ఎంత చిన్నవైనప్పటికీ తాము సాధించిన వాటికి గర్వపడడం గురించి కౌమారులు అర్థం చేసుకోవాలి. కౌమారులకు ఆత్మగౌరవం తక్కువగా వుండడానికి ఒక సాధారణ కారణం తమ ఆకారం గురించి వారి భావన. ఫేషన్ పరిశ్రమ ఒక ప్రత్యేక ఆకారాన్ని సౌందర్యంగా ప్రచారం చెయ్యడమే దీనికి కారణం. కేవలం తమ శారీరక ఆకృతిని బట్టి కాక ఇతర రకాలుగా సమాజానికి మంచి చేసిన వ్యక్తుల వ్యక్తిత్వాలపై దృష్టిని కేంద్రీకరించి సంపూర్ణవ్యక్తిని ప్రముఖంగా చూపడం ద్వారా ఇలాంటి పిచ్చి విశ్వాసాల్ని ప్రతిఘటించండి.
  • నొ అని చెప్పడాన్ని నేర్చుకోవడం. లైంగిక ఆరోగ్య పెంపుదలలో ఈ సందేశం చాలా ముఖ్యమైన భాగం, కాని ఇది పొగాకు,మద్యం, లేక మత్తుమందుల విషయంలో కూడా వర్తిస్తుంది స్నేహితులతో మాట్లాడడం. ఒత్తిడిని తట్టుకోవడానికి స్నేహితులతో తమ భావోద్వేగాల్ని సమస్యల్ని పంచుకోవడం అత్యున్నత పద్ధతి. మాట్లాడడానికి స్నేహితులు లేకపోవడం దానంతటదే ఒక సమస్య. కొత్త స్నేహాల్ని చేసుకునే మార్గాల్ని గుర్తించడానికి, సమస్యా పరిష్కారాన్ని ఉపయోగిస్తూ వ్యక్తిగత కౌన్సిలింగ్ ద్వారా ఈసమస్యను పరిష్కరించవచ్చు.
  • ముందుగా ప్రణాళికను సిద్ధంచేసుకోవడం. పాఠశాలలో కీలకమైన సంవత్సరాలలో ముందుగా ప్రణాళిక వేసుకోవడం వలన పరీక్షలసమయంలో చదువుకోవడం ఒత్తిడిని కలిగించదు. ముందుగా ప్రణాళికను వేసుకోవడంలో టైమ్ టేబిల్ని ఉపయోగించడం సాధారణ పద్ధతి.

పాఠశాలలో కౌన్సిలింగ్ని ఇవ్వడం

కౌమారులకు సంబంధించిన విషయాల్లో మార్గదర్శనం చెయ్యడానికి పాఠశాలలో కౌన్సిలింగ్ ఒక మార్గం. ప్రత్యేకంగా పట్టించుకోవలసిన విషయాలు ఒక్కొక్కరికీ వేరుగా వుంటాయి. మీరు అనుసరించగలిగిన సామాన్య నియమాలు ఇవి:
  • వినండి. కౌమారుల విచారాల్ని సమస్యల్ని వినడానికి తగిన సమయాన్ని వెచ్చించండి.
  • అడగండి. ప్రత్యేకంగా వారి మానసిక స్థితి, ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనల గురించి అడగండి.
  • సమస్యా పరిష్కారం. కౌమారుల్లో మానసిక సమస్యలు  వారెద్కుంటున్న వాస్తవ సమస్యలతో సంబంధం కలవని గుర్తుంచుకోండి.
  • కుటుంబాన్ని కలపండి. ఒకరితోనొకరు మాట్లాడుకోవలసిన అవసరం గురించి, ఒకరినుంచి మరొకరు ఆశించేదాన్లో మరీ బిగిసి పోకుండా, చర్చలతో రాజీమార్గాన్నవలంబించాలని తల్లిదండ్రులకు, కౌమారులకు బోధించండి. కుటుంబ ఘర్షణల్లో ఇది మరీ .
  • ఆచరణతో సహాయం. కీలక సమస్య ఆ యువ వ్యక్తికి లెక్కలు చెయ్యడం కష్టమవడం లేక అతనిని ఇతరులు అల్లరిపెట్టడం అని మీరు కనిపెడితే ఈ అంశాల్ని పాఠశాల అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగలనని చెప్పండి.
  • స్నేహబృందాలు. కౌమారులు నిర్ణీత సమయాల్లో కలిసి తమందరికి సామాన్యంగా వుండే విషయాలు, చదువు, ఒత్తిడి, స్నేహాలు మొదలైన వాటి గురించి చర్చించుకోవచ్చు.

ఇల్లు లేనివారు, వీధిబాలలు

చాలా నగరాల్లో స్త్రీలు, పురుషులు, బాలలు నివాసంలేక వీధుల్లో  నిద్రిస్తున్నారు. ఇల్లు లేక పోవడానికి ప్రధాన కారణం దారిద్ర్యం.  పేద ప్రజలు ఉద్యోగాల్ని మెరుగైన భవిష్యత్తును వెదుక్కుంటూ తమ గ్రామాల్లోని ఇళ్ళను వదిలి నగరాలకు వలస వెళ్తారు. ఇక్కడ వీరు జన సమ్మర్దంతో క్రిక్కిరిసివుండే రోడ్లు, అద్దె ఎక్కువ వుండే ఇళ్ళు వున్న అపరిచిత ప్రపంచంలో దిక్కుతోచకుండా వుంటారు. వారికి ఇక్కడ జా8త్రే ఉద్యోగాలు నైపుణ్యంలేని కూలిపనులు. భద్రమైన నివాసం దొరకడానికి వారికి పరిమితమైన అవకాశాలుంటాయి.

ఇల్లు లేకపోవడం, మానసిక ఆరోగ్యం

ఇల్లు లేకపోవడం చాలా దుఃఖదాయకమైన అనుభవం. భద్రత లేకపోవడం, చెడు వాతావరణం నుండి రక్షణ లేకపోవడం, పోషకాహారలోపం, ఇల్లు లేక పోవడంతో ముడిపడివుండే ఒత్తిడులు. చాలా నగరాల్లో ఉన్నట్లుగా కళ్ళు చెదిరే సంపద మధ్య ఇల్లు లేని పరిస్థితి ఉంటే, బాధితులు ఆగ్రహంతో మండిపడతారు. ఫలితంగా, ఇల్లులేనివారు మానసిక వ్యాధులతో బాధపడతారు. మరీముఖ్యమైన మానసిక సమస్యలు, డిప్రెషన్, మందుల వ్యసనం (మద్యం, పొగాకు).

తరచుగా మానసిక వ్యాధులు ఇల్లు లేక పోవడానికి కారణమవవచ్చు. పెద్దవారిలో చాలా ముఖ్యమైన కారణం ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. ముఖ్యంగా షిజోఫ్రినియా ఉన్న వారిని ఏ ఏర్పాటూ లేకుండా హాస్పటల్నుండి బయటకు పంపేస్తారు, లేక కుటుంబాలు వారిని తిరస్కరిస్తాయి. వ్యాధి కారణంగా అసలే రోజువారీపనుల్ని చేసుకోవడానికి తగినంత సామర్థ్యంలేని వీరి పరిస్థితి ఇల్లు లేకపోవడం అనే ఒత్తిడితో మరింత దిగజారుతుంది. వీరు వీధుల్లో తిరుగుతున్నవిధం పోలీసులకు ప్రమాదకరంగా తోచడం వలన చివరకు వీరిని జైల్లో వేస్తారు. ఇల్లు లేనివారికి ఆహారం, నివాసం లాంటి మరొలిక సౌకర్యాల్ని కల్పించడం తప్పనిసరిగా వారి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారికి మద్యం వ్యసనం, తీవ్రమైన మానసిక వ్యాధి వున్నాయేమో చూడాలి, వీటికి చికిత్స చేస్తే, వ్యక్తుల ఆరోగ్యం తప్పక మెరుగుపడుతుంది. వ్యక్తిగత కౌన్సిలింగ్, ముఖ్యంగా ఇల్లు లేనివారితో మీరు విశ్వసనీయమైన సంబంధాన్ని నెలకొల్పుకున్నప్పుడు, సహాయపడుతుంది. వారు ఎక్కువ కాలక్షేపం చేసే చోటకు మీరు తరచుగా వెళ్ళి వారి ఆరోగ్య సమస్యలకు స్పందించి చికిత్స చేస్తే ఇది సంభవమవుతుంది. కౌన్సిలింగ్కి కీలకం సమస్యా పరిష్కారం ; భద్రమైన ఉద్యోగం లేకపోవడం, శారీరక ఆరోగ్యం సరిలేకపోవడం, నివాసం లేకపోవడం మొదలైన వాటికి పరిష్కారాల్ని కనుగొనడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.

వీధిబాలలు


నగరాల్లో బాలలు వీధుల్లో నివసించడానికి కారణం వారి ఇళ్ళల్లో వుండే దారిద్ర్యం. హింస, వేధింపు కూడా వారు ఇంటినుండి పారిపోవడానికి కారణం. ఐనప్పటికీ వీధిజీవితం క్రూరమైనది. వీధిబాలలు కూలీలుగా,పనిమనుషులుగా, సెక్స్ వర్కర్స్గా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తారు. వారు నేర ముఠాల సభ్యులుగా జీవిస్తూ చివరకు జైలు కె పాలవుతారు. పరిశుభ్రత సవ్యంగా లేకపోవడం, పోషకాహారం తగినంతగా లభించక పోవడం వలన వీధిబాలలు చర్మానికి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు మొదలైన అనేక శారీరక అనారోగ్యాలతో బాధపడతారు, వీరిని ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్ళేవారెవరూ లేకపోవడంవలన చికిత్సేవుండదు. వీధిబాలలు బాల్యానికి సంబంధించిన రెండు ముఖ్యమైన భాగాల్ని కోల్పోతారు, భద్రమైన, ప్రేమపూరితమైన కుటుంబ వాతావరణం, పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం

వీధిబాలలు మానసిక వ్యాధులకు ఎక్కువగా గురయే ప్రమాదం వుంది, దీనికి కారణం వారు ఇంటిని విడిచి పెట్టడానికి కారణమైన ఒత్తిడులు, ప్రస్తుతం వీధుల్లో నివసించడం వలన కలుగుతున్న ఒత్తిడులు. వీధిబాలలు తగినంత ఆహారం లభించని, తమ భావోద్వేగాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టని ఇళ్ళనుంచి బయటకు వస్తారు. వారు నిర్తక్ష్యానికి, వేధింపులకు గురయి వుండొచ్చు బాల్యంలో సంతోషంగాలేని అనుభవాలు తరువాత, పెద్దయాక మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. కొంతమంది పిల్లలు ఒంటరి జీవులయి, విడిగా వుంటూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరికొంతమంది విచారం, తీవ్ర దుఃఖంతో ఆత్యహత్య చేసుకోవాలనే ఆలోచనలతో వుంటారు.

వీధిబాలలకు సహాయపడే ముఖ్యమైన మార్గం, తమ ఆరోగ్యకరమెన్ల భావోద్వేగ అభివృద్ధికి పిల్లలందరూ కోరుకునే ప్రేమ, శ్రద్ధను అందించడం. ఇది వారికి చదువుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఉత్తమంగా జరుగుతుంది. రోజుకు ఒకటి, రెండు గంటలపాటు చదువుకునే అవకాశం వీధిబాలలు తాము కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందడానికి తోడ్పడుతుంది. మందుల వ్యసనానికి గురయిన బాలలకు ప్రత్యేక సహాయం అవసరమ5°తుంది. వీధిబాలలతో పని చేస్తున్నప్పుడు మీరు తెలుసుకోవలసిన ప్రత్యేక ఉన్నాయి. కొంతమంది వీధి బాలలు తమపై ఎవరైనా శ్రద్ధ చూపడాన్ని ఇష్టపడరు, సహాయాన్ని తిరస్కరిస్తారు. తమతో ప్రయోజనం పొందాలను కునే వారిని సందేహంగా చూడొచ్చు. అలాంటి పరిస్థితి వున్నప్పుడు వారు అడిగిన సహాయాన్ని మాత్రమే చేసి వారితో నమ్మకమైన సంబంధాన్ని పెంపొందించుకోండి. దానికి పూర్తిగా విరుద్ధంగా కొంతమంది పిల్లలు మీకు అంటుకుపోయి, మిమ్మల్ని తల్లి లేక తండ్రిగా భావిస్తారు. అనారోగ్య కరంగా ఆధారపడుతూ బ్రతకడాన్ని మీరు ప్రోత్సహించవద్దు.

లైంగిక రూపాన్ని తీసుకోవడం ప్రారంభించే ఏ సంబంధానికైనా సరే దూరంగా వుండాలి. బిడ్డకు లైంగిక ఆకర్షణను కలిగించే భావాలపట్ల లేక బిడ్డ ప్రవర్తనలో లైంగిక ఛాయలు ఉన్నట్లు ఆధారముంటే సున్నితంగా వ్యవహరించడం ఈ సమస్యకు పరిష్కారం.

హెచ్.ఐ.వి./ ఎయిడ్స్

శరీరానికి ఇన్ఫెక్షన్లు, కేన్సర్లు సోకకుండా రక్షణనిచ్చే రక్త కణాల్ని నాశనం చేసే హ్యూమన్ ఇమ్యునొ డెఫిషియన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ప్రస్తుతం ఈవ్యాధికి చికిత్స లేనందున ఈ వ్యాధి బాధితుల్లో చాలామంది చివరకు చనిపోతారు. వ్యాధి చివరిదశకు చేరడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో ఎయిడ్స్ మరణాలకు ప్రధాన కారణంగా వుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎయిడ్స్ వ్యాధి చాలా విస్తృతంగా, ఒక ఎపిడెమిక్ స్థాయిలో వుంది, ఇక్కడ వ్యాధి బాధితులు సంరక్షణ లభించక, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన మందులు లభించక చాలా త్వరగా చనిపోతున్నారు.

మానసిక ఆరోగ్యం ఎందుకు పాడవాలి

ఎయిడ్స్ మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడుచేస్తుంది.
  • నెప్పి. ఎయిడ్స్ సంబంధమైన అనేక వ్యాధులు నెప్పిని కలగజేస్తాయి, నెప్పి మళ్ళీ వ్యక్తిని బాధిస్తుంది.
  • వైకల్యం. పనిచేసేచోట, ఇంటిదగ్గర పని ఏమాత్రం చెయ్యలేనంత నీరసంగా అయిన వారు నిస్సహాయతతో, కోపంతో వుంటారు.
  • చనిపోతాననే భయం. ఆవ్యక్తికి చావంటే భయం వుండొచ్చు. ఆమెకు కుటుంబం భవిష్యత్తు గురించి, ముఖ్యంగా తనకులాగే ఇన్ఫెక్షన్ వచ్చిన తన భర్త గురించి బెంగగా వుండొచ్చు.
  • ఖర్చు హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్కి వాడవలసిన మందులు చాలా ఖరీదు, చాలా కుటుంబాలకు వాటిని కొనే స్టోమతు వుండదు, కొంతవరకు కొనగలిగిన వారికి కూడా ఆర్థిక కష్టాలు తప్పవు.
  • కుటుంబం నుండి తిరస్కారం. కుటుంబానికి ఏమీ చెయ్యకుండా, పైగా ఎప్పుడూ కుటుంబం సహాయం, ఆసరా మీద ఆధారపడే వారిని కుటుంబసభ్యులు భారంగా పరిగణిస్తారు. లైంగికంగా ఆవిశ్వాసంగా ప్రవర్తించినందుకు, అతను వ్యాధిని అంటించుకోవడమేకాక తనకు కూడా వ్యాధిని వ్యాపింప జేసినందుకు భార్యకు కోపంగా వుండొచ్చు.
  • కళంకం, వివక్ష హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ గురించి అనేక అపార్థాలు, వ్యాధి ఉన్నవారి పట్ల వివక్ష ఉన్నాయి.
  • మెదడు ప్రత్యక్షంగా దెబ్బతినడం. హెచ్.ఐ.వి. వలన, డిమెన్షియా లాంటి వ్యాధుల వలన మెదడు ప్రభావితం అవుతుంది. ఇది ఫిట్స్కు, మానసిక సమస్యలకు దారితీస్తుంది.

హెచ్.ఐ.వి. పాజిటివ్ వారి సంరక్షణతో మానసిక ఆరోగ్యాన్ని మిళితం చెయ్యడం

రెండు వేరు సమయాల్లో మానసిక ఆరోగ్యం ప్రభావితమౌతుందిః మొదటిసారి తమకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందనే వార్తను విన్నప్పుడు; తరువాత వ్యాధి తాలూకు వాస్తవం, బాధ, మరణం అంతర్గతమవడం ప్రారంభమైనప్పుడు.

మొదటి సందర్భంలో వ్యక్తుల ప్రతిస్పందన షాక్, అపనమ్మకం."ఇది నిజమయివుండదు' అనే ఆలోచన మనసులోకి వస్తుంది. వ్యాధి వచ్చిన మనుషులకు విచారం, కోపం కలుగుతాయి. వ్యాధి నిర్ధారణ అయాక కొన్నివారాలకు డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ సమాచారాన్ని మృదువుగా చెప్పడం ద్వారా వ్యాధి గురించి తెలిసాక కలిగే తొలి ప్రతిస్పందనను తగ్గించవచ్చు. వ్యాధి తరువాత దశలో కౌన్సిలింగ్తోపాటు ఆ వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడే ఇతర చర్యల్ని తీసుకోవాలి. ఉదాహరణకు:

  • నెప్పిని బాగా తగ్గించడం;
  • ఇన్ఫెక్షన్లు, ఇతర శారీరక ఆరోగ్య సమస్యలకు చికిత్స
  • ఇంట్లో తిరగడానికి, పనులు చేసుకోవడానికి ఆచరణాత్మక సూచనలనివ్వడం;
  • కుటుంబానికి, సంరక్షకులకు కౌన్సిలింగ్ని, ఆసరాను ఇవ్వడం
  • నాణ్యమైన, తక్కువఖర్చుతో చికిత్స లభించేలాగా చెయ్యడం

 

చివరిదశలో ఉన్నవారి సంరక్షణ

చివరిదశ వ్యాధులైన కేన్సర్ లేక ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్నవారు నెప్పి, చనిపోతాననే భయం, తను ప్రేమించేవారిని

విడిచి వెళ్ళబోతున్నాననే బాధ లాంటి అనేక కారణాల వలన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. మీరు ఈక్రింది చర్యల ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడగలరు:

  • త్రరచుగా వ్యాధి ఉన్న వ్యక్తిని కలవడం ద్వారా మంచి సంబంధాన్ని నెలకొల్పుకోవడం;
  • ఆమెతో మరణం అంటే అర్ధం ఏమిటి అనే విషయం గురించి మాట్లాడడం (ఆమె విచారాలేమిటి, ఇప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కోవడం ఎలా?)
  • కుటుంబాన్ని ముఖ్యంగా దగ్గరి బంధువుల్ని రోగి కలవరాల్ని పంచుకోవదంలో భాగస్వాముల్ని చెయ్యడం (ఎంతోకాలంగా పరిష్కరింపబడని కుటుంబ ఘర్షణల్ని ఒక కొలిక్కి తేవచ్చు);
  • పూర్తిచెయ్యని ఆర్థిక లేక న్యాయపరమైన వ్యవహారాల్ని ముగించమని సలహానివ్వడం;
  • ఆ వ్యక్తి తనకు వచ్చిన వ్యాధి గురించి పూర్తిగా అర్థం చేసుకునేలాగా చెయ్యడం, అత్యుత్తమ చికిత్స, ముఖ్యంగా నెప్పిని తగ్గించడానికి, లభ్యమయేలా చూడడం,
  • డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధులు ఉంటే ఏంటీడిప్రెసెంట్స్ లేక ఇతర మందుల్ని ఇవ్వడం;
  • వ్యాధి ఉన్న వ్యక్తుల పిల్లలు, కుటుంబం వారి చివరి కోర్మెను నెరవేర్చేలా చూడడం;
  • సంరక్షకుడి సంరక్షణ

హెచ్.ఐ.వి. పాజిటివ్ వ్యక్తులలో కొంతమందికి వున్న మానసిక వ్యాధికి మందులతో చికిత్స అవసరమవుతుంది. డిప్రెషన్ బాధను మరింత తీవ్రం చేసినప్పటికీ ఎయిడ్స్ వ్యాధికి సహజ ఫలితంకాదు. ఏంటీడిప్రెసెంట్స్తో చికిత్స చెయ్యడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది, ఆవ్యక్తి వ్యాధిని మెరుగ్గా తట్టుకోవడానికి సహాయపడుతుంది

ఎయిడ్స్ వ్యాధితో వచ్చే సైకోసెస్ సామాన్యంగా మెదడుకు ఇన్ఫెక్షన్ ఫలితం. ఎయిడ్స్ వ్యాధికి ఇచ్చే మందులతో పాటు సైకోసిస్కి ఒక ఎక్కువ శక్తివంతమైన ట్రాంక్విలైజర్ని  ఇవ్వాలి. ఈ రోగులకు నిపుణుల క్లినిక్లో చికిత్స చెయ్యడం మంచిది.

పెద్ద వయసువారి ఆరోగ్యం

చాలా దేశాల్లో శారీరక ఆరోగ్యం మెరుగుపడి వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లో మనిషి సగటు జీవించే కాలం 60 సంవత్సరాలకు పైగా వుంది. దీని అర్థం పంచుకోవడానికి, నేర్చుకోవడానికి, అనుభవించడానికి, లేక సహాయపడడానికి దీర్ఘకాల జీవితం ఉంటూంది. ఐనప్పటికి, వయసు పెరుగుతున్నకొద్దీ వారి శరీరం, మనసు.

కూడా కొన్ని ఆరోగ్యసమస్యలకు గురయే ప్రమాదం వుంది. వారి సాంఘిక జీవితం మారుతుంది. అంతకుముందు చేస్తున్న పని లేక ఉద్యోగ విధులు ముగిసి, అంతకుముందు కంటే తక్కువ సంపాదన వుంటుంది. వారి దినచర్య మారుతుంది. వారి పిల్లలు పెద్దవారయి, ఇంటిని విడిచి వెళ్ళి తమ స్వంత కుటుంబాన్ని ప్రారంభిస్తారు. చాలామంది పెద్దవారికి పెద్దవయసు సానుకూలమైన, ప్రయోజనకరమైన కాలం. మనవలతో హాయిగా గడపడానికి వీలయే సమయం. పుస్తకాలు చదువుకోవడానికి, ఇంతకు మునుపు ఉద్యోగ బాధ్యతల కారణంగా వ్యవధి లేక చెయ్యలేకపోయిన పనుల్ని ఇప్పుడు చేసుకోగలిగిన కాలం. స్నేహితులతో కలిసి గడిపే సమయం.

పెద్దవారికి వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు

కొన్ని సందర్భాల్లో పెద్దవారు మానసిక వ్యాధులతో బాధపడతారు. ఈసమస్యలకు అనేక కారణాలు ఉన్నాయిః

  • ఒంటరితనం. చాలా ప్రదేశాల్లో సమష్టి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. క్రమేపీ ఇంకా ఇంకా ఎక్కువమంది తమ పిల్లలనుండి ఎటువంటి ఆసరా లేకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. తన భర్త లేక భార్యను కోల్పోయాక ఒంటరితనం మరింత భయంకరంగా వుంటుంది
  • శారీరక ఆరోగ్యం. కొంతమంది పెద్దవారికి వైకల్యాన్ని కలిగించే శారీరక వ్యాధులు వస్తాయి. ఉదాహరణలు, కీళ్ళవాతం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు. ఈవ్యాధులు ఒక వ్యక్తి పనులు చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి, ఇతరులమీద ఆధారపడి బ్రతికేలా చేస్తాయి.
  • మెదడు వ్యాధి. కొన్ని రకాల మెదడు వ్యాధులు, ముఖ్యంగా డిమెన్షియా లేక చిత్తవైకల్యం పెద్ద వయసు వా8లో సాధారణం. మెదడును ప్రభావితం చెయ్యడం ద్వారా అవి మానసిక వ్యాధులకు దారితీస్తాయి.
  • ఆర్థిక కష్టాలు. పెద్దవారు సామాన్యంగా పనులు చెయ్యరు. అందువలన వారు అప్పటిదాకా దాచుకున్న డబ్బు లేక పెనన్ మీద ఆధారపడతారు, ఇది పెరుగుతున్న ధరల ప్రపంచంలో దేనికీ చాలదు. యువతలో వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలన్నీ పెద్దవారిలోకూడా రావొచ్చు. ఐనప్పటికీ మీరు అవగాహన చేసుకోవలసిన మూడు రకాల సమస్యలు ఉన్నాయి.
  • డిప్రెషన్, పెద్దవారిలో ఎక్కువ సాధారణంగా వుంటుంది
  • డిమెన్షియా, మెదడు వ్యాధి, జ్ఞాపకశక్తి సమస్యలతో ప్రారంభమవుతుంది. కాని సాధారణంగా ప్రవర్తనా సమస్యలు ప్రారంభమైనప్పుడు దానిని గుర్తించడం జరుగుతుంది
  • డెలీరియమ్ లేక గందరగోళం సామాన్యంగా మెడికల్ సమస్యలవలన, మందుల వలన వస్తుంది

పెద్దవారి సంరక్షణ

చాలామంది పెద్దవారు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారు, మానసికంగా శక్తివంతులుగా వుంటారు. ఒక పెద్దవ్యక్తి ముడుచుకుని అందరికీ దూరంగా వుంటే, ఆమెకు డిప్రెషన్ లేక చిత్తవైకల్యం లేదని నిర్ధారించుకోవాలి. పెద్దవారిని తరచుగా కలిసి మాట్లాడడం వారికి ఆసరానిచ్చే గొప్ప అవకాశం, ఒకవేళ వారి మానసిక స్థితిలో ఏమైనా మార్పులు వస్తే తొలి దశలో  గుర్తించి చికిత్స చేసే అవకాశం వుంటాయి. ఏదైనా మందును వారికి ఇచ్చేముందు వారికి నడి వయసు వ్యక్తులకు ఇచ్చే మోతాదులో సగం - మాత్రమే ఇవ్వాలని గుర్తుంచుకోండి. మరీ ఎక్కువ మోతాదు మందు ་ గందరగోళాన్ని కలగజెయ్యొచ్చు . వృద్ధాశ్రమాల, పెద్దవారికి లభించే ఇతర సేవల సమాచారంతో ఈమాన్యువల్ లోని వనరుల విభాగాన్ని నవీకరించవచ్చు.  పెద్ద వయసు వ్యక్తికి నివాసం అవసరమైనప్పుడు, లేదా ఒంటరితనపు ప్రభావాన్ని తగ్గించడానికి ఈసమాచారం ఉపయోగపడొచ్చు.

సంరక్షకుల సంరక్షణ

ఈ విభాగం దీర్ఘకాలిక లేక చివరిదశ వ్యాధులతో బాధపడుతున్న వారి సంరక్షణ చేస్తున్న సంరక్షకుల మానసిక ఆరోగ్య సమస్యలగుంచి చర్చిస్తుంది. చాలామంది సంరక్షకులు స్త్రీలు, భార్యలు, కుమార్తెలు, తల్లులు, కోడళ్ళు సంరక్షణ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒత్తిళ్ళతో కూడుకున్నది. కాని ఇంట్లో ఉన్న జబ్బు వ్యక్తి కారణంగా వీరి ఆరోగ్య సమస్యలు గుర్తించబడవు.

సంరక్షణ సంబంధమైన ఒత్తిళ్ళు

జబ్బుపడిన వ్యక్తికి పరిచర్యలు చెయ్యడం వలన సంరక్షకులపై రకరకాల ప్రభావాలు పడతాయి కలుగుతాయి.

  • శారీరకభారం. జబ్బుపడిన వ్యక్తి మలమూత్రాల్ని విసర్జించడం, ఆహారాన్ని తినడం లాంటి ప్రాథమికమైన పనుల్ని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, వారిసంరక్షణ చాలా శారీరక శ్రమను కలిగిస్తుంది.
  • భావోద్వేగభారం. సంరక్షకులకు తను ప్రేమించే వ్యక్తి పడే బాధను చూడడం, ముఖ్యంగా వారి పరిస్థితి దిగజారుతున్నప్పుడు, అంత తేలిక కాదు.
  • మానసిక సమస్యల లక్షణాలను సంబాళించడంలో కష్టం. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తికి సంరక్షణ చెయ్యడం ప్రత్యేకమైన ఛాలెంజీల్ని ఎదుట నిలుపుతుంది. మూడు రకాల లక్షణాలు మరీ బాధాకరం. ఉద్రేకపూరితమైన, అలజడితోకూడిన ప్రవర్తనను సైకోసెస్, చిత్త వైకల్యంలో చూడవచ్చు జబ్బు వ్యక్తి తనకు రోజువారీ పనుల్లో సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సంరక్షకురాల్ని కొట్టొచ్చు, లేక తిట్టొచ్చు. రోగికి మతిమరపు సంరక్షకులకు మరొక బాధను కలిగించే లక్షణం; దాదాపు 40 సంవత్సరాలకుపైగా కలిసి జీవించిన వ్యక్తి ఇంక తనను గుర్తు పట్టకపోవడం గుండె పగిలే దుఃఖాన్ని కలగజేస్తుంది. మూడవ లక్షణం ఆత్మహత్యా ప్రయత్నం, లేక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం.
  • సంరక్షకురాలికి జబ్బు, సంక్షణ చేస్తున్నవారికి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. హెచ్.ఐ.వి. వున్న వ్యక్తిని సంరక్షిస్తున్న అతని భార్యకు కూడా హెచ్.ఐ.వి. వుండొచ్చు. చాలామంది రోగులు వృద్దులు, అలాగే వారిని సంరక్షంచేవారు కూడా వయసుపైబడినవారే.
  • ఖర్చు జబ దీర్ఘకాలికమయేకొద్దీ ఖర్చు పెరుగుతుంది. మందుల కోసం ఆహారం లాంటి ఇతర అంశాలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవలసి వస్తుంది.
  • ఇతర కార్యక్రమాల్ని కోల్పోవడం. సంరక్షకులు తమ ఇష్టాల్ని ఆసక్తుల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, బహుశా తను బయట చేసే పని మానేయాల్సి రావొచ్చు.
  • సాంఘిక సంబంధాల్ని కోల్పోవడం. జబ్బుమనిషి ఉన్నప్పుడు, ఇంటి వాతావరణం మారిపోతుంది, ఇంతకు మునుపు మామూలుగా కలవడానికి ఇంటికి వచ్చేవారు రావడం మానేస్తారు.
  • దుఃఖం. జబ్బుపడిన వ్యక్తి మరణించిన తరువాత విపరీతమైన దుఃఖం కలుగుతుంది.

సంరక్షకుల మానసిక ఆరోగ్యం

సంరక్షకులు అన్ని రకాల దుఃఖదాయకమైన ఉద్వేగాల్ని అనుభవిస్తారు.

  • జబ్బుపడిన వ్యక్తి గురించి వ్యతిరేక ఆలోచనలు వస్తున్నందుకు న్యూనత
  • బ్రతుకును కష్టతరం చేసినందుకు జబ్బు వ్యక్తిపై కోపం
  • తను ప్రేమించే వ్యక్తి బాధను చూచి దుఃఖం
  • జబ్బుపడిన వ్యక్తి వ్యాధి తనకు సోకుతుందేమోననే భయం
  • జబ్బుపడిన వ్యక్తి భవిష్యత్తు , తమ భవిష్యత్తు గురించి నిరాశ
  • తాము ఎంత చేసినప్పటికీ అనారోగ్యం తగ్గకపోవడం పట్ల ఆశాభంగం

ఈ ఉద్వేగాలన్నీ ముఖ్యంగా సంరక్షణ తొలి దశలో సంరక్షకులకు సాధారణం, కాని చాలామంది సంరక్షకులు దీర్ఘకాలంలో చాలా అమోఘంగా తట్టుకుని నిలబడతారు, జబ్బుపడిన వ్యక్తిపట్ల ప్రేమ, సంరక్షణలో ఇతరులనుండి లభించే సహాయం, తన భావాల్ని గురించి స్నేహితులు, కుటుంబంతో మాట్లాడడం, తన స్వంత సంతోషాలకోసం కొంత సమయాన్ని గడపడం సంరక్షకురాలు తట్టుకోవడానికి ఉపయోగపడే కొన్నిమార్గాలు. కొంతమంది అంతబాగా తట్టుకోలేరు. సమయం గడిచేకొద్దీ వారి ప్రతికూలభావాలు మరింత ఎక్కువయి, డిప్రెషన్కి, ఏంగ్డయిటీకి గురవుతారు

సంరక్షకుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

మొదటి అడుగు మానసిక ఆరోగ్యసమస్యల ప్రమాదం వుండి, మీ ఆసరాతో లాభం పొందగల సంరక్షకురాల్ని గుర్తించడం. స్వయంగా శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్న పెద్దవయసు సంరక్షకులు సంరక్షణసంబంధమైన ఒత్తిళ్ళను ఎక్కువగా ఎదుర్కొంటారు. సంరక్షకురాలు డిప్రెషన్కి గురయేలోగానే మీరు తగిన చర్యలు తీసుకోవాలి. మీరు జబ్బుపడిన వ్యక్తిని కలిసినప్పుడల్లా సంరక్షకురాలితో కూడా కొన్ని నిమిషాలుమాట్లాడాలి. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చెయ్యండి. జబ్బుపడిన వ్యక్తికి దూరంగా, ఏకాంతంగా వారితో మాట్లాడండి. తాము సంరక్షణ చేస్తున్న వ్యక్తి సమక్షంలో సూటిగా తమ ప్రతికూల భావాల గురించి మాట్లాడడానికి చాలామంది సంరక్షకులు ఇష్టపడరు. తరచుగా జబ్బుపడిన వ్యక్తిని, సంరక్షకురాల్ని కలవడం వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఉత్తమమైన మార్గం.

దుఃఖంలో ఉన్న సంరక్షకురాలికి సహాయపడడం

దుఃఖంలో వున్న సంరక్షకురాలికి సహాయపడడానికి ఓర్పు, సహానుభూతి అవసరం. సహానుభూతి అంటే సంరక్షకురాలి స్థానంలో మిమ్మల్ని నిలుపుకుని, ఆమె ఏవిధంగా భావిస్తుందో, బాధపడుతుందో ఊహించుకునే సామర్థ్యం.
  • సంరక్షకురాలి అనుభవాల్ని వినండి. కొంతమంది లోపల విచారంగా వున్నప్పటికీ పైకి గంభీరంగా వుంటారు. మీరు కలిసినప్పుడల్లా విచారం గురించి తప్పనిసరిగా అడగండి.
  • సంరక్షకురాలు దుఃఖంలో వున్నప్పుడు కౌన్సిలింగ్ చెయ్యండి. తరచుగా సంరక్షకులు మరణపుఅంచుమీద ఉన్న  సంరక్షణను చెయ్యవలసి వస్తుంది. మరణానికి సన్నద్ధం చెయ్యడం, దుఃఖం తగ్గించడానికి కౌన్సిలింగ్ చెయ్యడం ముఖ్యమైన పని
  • డిప్రెషన్కి ఏంటీడిప్రెసెంట్స్, సమస్య పరిష్కార పద్ధతితో చికిత్స చెయ్యండి
  • సపోర్టునిచ్చే బృందాల గురించి సమాచారాన్నివ్వండి ఇతర సంరక్షకులతో కలవడానికి సహాయపడండి.
  • ఇతర కుటుంబసభ్యుల్ని భాగస్వాముల్ని చెయ్యండి. వారితో మాట్లాడండి, సంరక్షకురాలి మీద ఒత్తిళ్ళ ప్రభావం గురించి మీ కలవరాల్ని వారితో పంచుకోండి. సంరక్షణను పంచుకునే మార్గాలను సూచించండి.
  • ఆచరణాత్మక సలహా చాలా సహాయపడుతుంది. సంరక్షకులు తరచుగా ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, మలమూత్ర విసర్జన చేయించడం, ఇతర రోజువారీ పనులు చేయించడానికి ప్రయాస పడతారు. ఈ పనుల్ని సులభంగా చేసే విధానాల్ని సాధారణ కిటుకుల్ని సూచించడం వారి జీవితాన్ని తేలిక పరుసుంది.

ఆరోగ్యకార్యకర్తల మానసిక ఆరోగ్యం

ఆరోగ్య కార్యకర్తలు జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడినట్లే మానసిక ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఆరోగ్య కార్యకర్తలు కూడా ఇతరుల లాగానే బాధలు, దిగుళ్ళు వుండే మానవమాత్రులే అవడం. అదనంగా, పెద్దవారి సంరక్షణలో అత్యధిక సమయాన్ని గడుపుతూ తమ స్వంత సమస్యల్ని ఉద్వేగాల్ని ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యకార్యకర్త చేసే పనులు లేక ఆమె పనిచేసేచోట వుండే పరిస్థితులు ఆమెకు ప్రత్యేకమైన ఒత్తిళ్ళను కలగజేయొచ్చు. ఇవి అలాంటి సందర్భాలకు కొన్ని ఉదాహరణలు:

  • విపత్తు లేక యుద్ధం వచ్చినప్పుడు మిగతా ప్రజలందరిలాగానే ఆరోగ్యకార్యకర్త కూడా బాధితురాలేబాధితురాలవడంతోపాటు మిగతా బాధితులకు కౌన్సిలింగ్ చేసి ఓదార్చే క్రమంలో తన స్వంత అవసరాల్ని నిర్లక్ష్యం చెయ్యవలసిరావచ్చు;
  • ఆరోగ్యకార్యకర్త బాగా జబ్బుగావున్న రోగుల్ని సంరక్షించేటప్పుడు, ఉదాహరణకు అంతిమ దశలో వున్నవారు ఎక్కువగా వున్న చోట పనిచేస్తున్నప్పుడు (ఉదాహరణకు హెచ్.ఐ.వి. రోగులు) - ఎవరైనా మరణించిన ప్రతిసారి ఆరోగ్యకార్యకర్త విచారానికి లోనవుతుంది;
  • ఆరోగ్యకార్యకర్త గాయాలపాలైన వారిని సంరక్షించాల్సి వచ్చినప్పుడు- హింసాబాధితులు, హింసకు పాల్పడినవారు (జైలులో లేక మానభంగానికి గురైనవారిని సంరక్షిస్తున్నప్పుడు) -వారి బాధలకు ప్రతిస్పందనగా కలిగే భావోద్వేగాలు.

మీ మానసిక ఆరోగ్యం బాగోనప్పుడు మీమామూలు ఆరోగ్యంతో పాటు మీరు సవ్యంగా పనిచేయగల సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అందువలన మీకు మీమానసిక ఆరోగ్యం గురించి తెలిసివుండడం, ఒకవేళ బాగోకపోతే మరెవరి సహాయాన్నైనా తీసుకోవడం ముఖ్యం. కొన్ని సార్లు పనితో ఒత్తిడిలో ఉన్నానని చెప్పడం బలహీనతకు చిహ్నంగా లేక పనిపట్ల అంకితభావం లేపోవడంగా భావించవచ్చు. ఆరోగ్య కార్యకర్త సహాయంకోసం మీదగ్గరకు వస్తే ఇతరుల విషయంలో లాగానే రహస్యాన్ని పాటించే నియమాల్ని అనుసరించడం చాలా ముఖ్యం .

మిమ్మల్ని మీరు చూసుకోవడం

ఒత్తిడి వుంటుందని అనిపించిన పరిస్థితుల్లో పనిచేసేటప్పుడు మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందుగానే ఆలోచించుకోవాలి. ఇది తరువాత మానసిక ఆరోగ్య సమస్యరాకుండా నిరోధించడానికి ఒక రకమైన టీకాలాగా పనిచేస్తుంది. మీమానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు చేసేపనుల్ని ఏ ఆరోగ్య కార్తకర్తతోనైనా అభ్యాసం చేయించవచ్చు.
  • ప్రశాంతత, ధ్యానం (రిలాక్సేషన్, మెడిటేషన్): ప్రశాంతతను పొందటానికి వ్యాయామాల్ని  రోజూ చేస్తే ఉపయోగపడగలవు. ఈ వ్యాయామాలు యోగా, ప్రార్ధన లాంటి ధ్యాన పద్ధతుల లాగే వుంటాయి
  • సృజనాత్మక, వినోదాత్మక కార్యక్రమాలు: ప్రతిరోజూ మీకు ఇష్టమైన లేక వినోదం కలిగించే, కాని పనితో సంబంధంలేని, కార్యక్రమాలకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. స్నేహితులతో, బంధువులతో సరదాగా కొంత సమయాన్ని గడపడం, మంచి పుస్తకాన్ని చదవడం, తోటపని చెయ్యడం, కుట్టుపని చెయ్యడం లేక నడవడం లాంటివి మీకు సంతోషంకలిగించే కొన్ని పనులు. ఒక కవితను లేక కథను రాయడం, ఒక చిత్రం గీయడం సృజనాత్మక కార్యక్రమాలలోకి వస్తాయి.
  • మీ పరిసరాల్ని మెరుగుపరచుకోవడం: మీరు పనిచేసే పరిసరాలు మురికిగా వుంటే అది తప్పకుండా మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంటిని సరిగ్గా సర్దుకోవడం, విరిగిపోయిన కిటికీల్ని కుర్చీల్ని సరిచేసుకోవడం, గోడలమీద రంగురంగుల చిత్రాల్ని లేక పటాల్ని పెట్టడం, ఎక్కువ శబ్దాలు రాకుండా ఏర్పాటు చేసుకోవడం, గదుల్లోకి సాధ్యమైనంత ఎక్కువగా సహజమైన వెలుగు వచ్చేలా చూసుకోవడం మీపని వాతావరణాన్ని మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి అవసరం. పనిచేసేచోట వుండే అందరితో కలిసి మీరు కృషి చేస్తే దీనిని సాధించగలరు.
  • భాగంపంచుకోవడం, అందరితో కలవడం: మీమానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇతరులతో భాగం పంచుకోవడం, మాట్లాడడానికి మించింది లేదు. మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో ఆ రోజు మీరు పనిచేసేచోట జరిగిన విషయాలన్నిటినీ చెప్పండి. మీ సహోద్యోగుల అనుభవాల్ని వినండి, వారి కష్టకాలంలో మీరు ఆసరానివ్వొచ్చు, వారినుంచి మీరు నేర్చుకోవచ్చు.
  • సపోర్టు గ్రూపు లేక ఆసరాబృందాన్ని ఏర్పాటు చేసుకోవడం: మీకు, మీ సహోద్యోగులకు సహాయం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరమైన మార్గం. అందరికి సమష్టిగా ఒక విషయం వున్నవారు ఈ ఆసరా బృందంలో వుంటారు, ఇక్కడ వారు ఆరోగ్య కార్యకర్తలు. అందరికీ వున్న కలవరాల్ని సమస్యల్ని పంచుకోవడానికి ఈ ఆసరాబృందం తరచుగా కలవాలి.

ఎప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలి

రెండు సందర్భాలలో మీకు నిపుణుల సహాయం అవసరం తప్పనిసరి అవుతుంది.

  • అత్మహత్యసంబంధ అలోచనలు: నిరాశ, నిస్పృహ, బ్రతుకుని అంతం చేసుకోవాలని మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. అవెంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికి, మీరు నమ్మే ఎవరితో ఒకరితో ఈభావాలగురించి మాట్లాడడం ఉపయోగకరంగా వుంటుంది. మీరు ఎలా బ్రతుకును అంతమొందించుకోవాలో ప్రణాళిక వేసుకుంటున్నట్లు లేక మీకు ప్రతిక్షణం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నట్లు మీరు గుర్తిస్తే వృత్తిపరమైన సహాయాన్ని మరొక ఆరోగ్య కార్యకర్త నుండి పొందండి.
  • మద్యం, మత్తుమందుల సమస్య ఆరోగ్య కార్యకర్తలు మందులకు, ముఖ్యంగా, సులభం౦గా లభిస్తాయి కనుక నిద్రమాత్రలకు అలవాటుపడే ప్రమాదం వుంది మీకు మందులు లేక మద్యానికి మీరు అలవాటు పడుతున్నట్లు అనిపిస్తే లేక బంధువులు, స్నేహితులు మీ అలవాట్ల గురించి కలతను వెల్లడిస్తే మీరు వృత్తిపరమైన నిపుణుల సహాయంతీసుకోవాలి.

మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు, మీరు సంకోచం లేకుండా మీఆరోగ్య సమస్యలను చెప్పగల చనువు వున్న వారి సహాయాన్ని తీసుకోండి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate