భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం. ఆయుర్వేదం అన్నది అక్షరాలా ‘జీవితం యొక్క శాస్త్రం’ అని అర్ధం. ఇతర వైద్య విధానాలలాగ కాకుండా ఆయుర్వేదం వ్యాధుల చికిత్స కంటే ఆరోగ్యకరమైన జీవనంపై మరింతగా దృష్టిని పెడుతుంది. ఆయుర్వేదంలోని భావన ఏమిటంటే ఇది కోలుకుని, ఉపశమనాన్ని పొందే ప్రక్రియను వ్యక్తిగతమైనదిగా చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం నాలుగు ప్రధాన అంశాలతో రూపొందించబడి ఉంటుంది – దోషం, ధాతువు, మలం మరియు అగ్ని. ఆయుర్వేధంలో ఈ నాలుగు ప్రధాన అంశాలకు అత్యంత విశిష్టత ఉంది. ఇవన్నీ
‘మూల సిధ్ధాంతాలు’ లేక ‘ఆయుర్వేదం యొక్క ప్రాథమిక మౌలిక అంశాలు’ అని కూడా పిలువబడతాయి.
వాతం, పిత్తం మరియు ఖఫం దోషం యొక్క జీవనాధారం వంటి అతి ప్రధానమైన మూడు సూత్రాలుః ఇవి క్యాటబోలిజమ్ (జీవధాతు నిర్మాణమందు రసాయనిక శక్తి విడుదల అగుట), మరియు అనాబోలిక్ (వివిధ రకాలైన పరమాణువులను వాటి అతి సరళ స్ధితి నుండి వాటి శక్తితో సహా సంగ్రహించి సంయోగం చేయు ప్రక్రియ) మెటాబోలిజమ్ (జీవక్రియ–శరీరంలో కలుగు భౌతిక, రసాయనిక మార్పులు, కణములు వృద్ధి చెందునపుడు గాని, నాశనమగునపుడు గాని వాటి యందు కలుగు మార్పు)ను క్రమబద్ధీకరించి, నియంత్రిస్తూ ఉంటాయి. శరీర ధాతు నిర్మాణానికి సహకరించే, అరిగి జీర్ణమైన ఆహారం యొక్క ఉప ఉత్పత్తులను (బై ప్రోడక్ట్స్) శరీరమంతటా వ్యాపింపచేయడం ఈ మూడు దోషాల ప్రధాన విధి. ఈ దోషాలలో ఏది సరిగా పని చేయకపోయినా అది వ్యాధికి కారణమవుతుంది.
ధాతువును శరీరానికి సహకారాన్ని అందించేదిగా వర్ణించవచ్చు. శరీరంలో ఏడు ధాతు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రం అనేవి. ఇవి వరుసగా ప్లాస్మా, రక్తం, కండరాలు, కొవ్వు కణజాలం, ఎముక, ఎముక మజ్జ (నూలగ) లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ధాతువులు శరీరానికి మూల పొషకాలను మాత్రమే అందిస్తాయి. ఇది మెదడు యొక్క నిర్మాణానికి, పెరుగుదలకు సహకరిస్తుంది.
మలం అంటే వ్యర్ధం లేక మురికి పదార్ధం అని అర్ధం. శరీరంలోని మూడింటి గుంపులో అంటే దోషాలు మరియు ధాతువులతో కలిపి ఇది మూడవది. ప్రధానంగా మూడు రకాలైన మలాలు ఉన్నాయి. ఉదాహరణకుః మలం, మూత్రం మరియు చెమట. మలం అనేది ముఖ్యంగా శరీరం యొక్క వ్యర్ధ పదార్ధంవంటి ఉత్పత్తి. ఒక వ్యక్తియొక్క ఆరోగ్యం సరిగా ఉండాలంటే శరీరం నుండి వ్యర్ధ పదార్ధం సక్రమంగా విసర్జన జరగాలి అనేది ముఖ్యం. మలంలో ప్రధానంగా రెండు అంశాలున్నాయి, అంటే మలం మరియు కిత్తా. మలం అనేది శరీరంలోని వ్యర్ధ పదార్ధాలకు సంబంధించింది, కిత్తా అనేదంతా ధాతువుల యొక్క వ్యర్ధ పదార్ధపు ఉత్పత్తి.
జీవక్రియకు మరియు జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల క్రియలు అగ్ని అని పిలువబడే, శరీరంలోని జీవశాస్త్రపరంగా ఉండే ఎంజైములు విడుదల చేసే ఉష్ణం యొక్క సహాయంతో జరుగుతాయి. ఆహార నాళం, కాలేయం, ధాతుకణాలలో ఉండే వివిధ రసాయనాలనే ఈ అగ్నిగా పిలువవచ్చు.
ఆయుర్వేదంలో జీవం అనేది మానవ శరీరం, ఇంద్రియాలు, మెదడు మరియు ఆత్మల సమ్మేళనంగా భావించ బడుతోంది. జీవించి ఉండే మనిషి మూడు దోషాలు (వాత, పిత్త మరియు ఖఫములు), ఏడు ప్రాథమిక ధాతు కణజాలాలు (రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రాలు) అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు (మలం, మూత్రం మరియు చెమట) లతో కలిసి ఉన్న ఒక సమ్మేళనం వంటిది. ఆ విధంగా మొత్తం శరీర నిర్మాణం శరీరంలో ఉండే ఈ దోషాలతోనూ, ధాతువులు, కణజాలంతోనూ మరియు వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తులతోనూ కలిసి వుంటుంది. రసాలుగాను, ధాతువులుగానూ మరియు వ్యర్ధ పదార్ధంగానూ జీర్ణ ప్రక్రియ ద్వారా మారే మనం తీసుకునే ఆహారం చుట్టూ శరీరాకృతి మరియు అవయవ సంబంధిత పెరుగుదల మరియు క్షీణత అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆహారాన్ని మింగడం, అది జీర్ణమవడం, శరీరం దానిని గ్రహించడం, జీర్ణమయింది వంటబట్టడం అనేవి మానసిక వ్యవస్థపైన, అలాగే జీవాగ్ని (బయో ఫైర్) పైన, ప్రభావితం చేస్తూ, చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపే మన ఆరోగ్యంతోనూ, వ్యాధులతోనూ ఒకదానితో మరొకటి అంతర చర్యలను కలిగి ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంతో సహా విశ్వంలో ఉండే ప్రతి పదార్ధం, వస్తువూ కూడా, ఐదు ప్రాథమిక సూత్రాలతో (పంచ మహాభూతాలు) రూపొందించబడి ఉన్నాయి. అవిః భూమి, నీరు, అగ్ని, గాలి మరియు శూన్యం (ఆకాశం). ఈ అంశాలతో, వివిధ ప్రమాణాలలో, శరీరాకృతి మరియు దాని ఇతర భాగాల విధులకు అవసరమయ్యే మరియు వాటి శరీర నిర్మాణాలకు అమరే విధులకు అవసరమయ్యే, ఈ పంచభూతాల ఒక సమీకృత కూర్పు తగిన నిష్పత్తులలో ఉంది. శరీరాకృతి పెరుగుదల మరియు అభివృధ్ది వీటి పొషక విలువలపై ఆధారపడి ఉంటుంది, అంటే మనం తీసుకునే ఆహారం మీద, ఈ ఆహారం, తిరిగి శరీరంలో జీవాగ్ని నిర్వహించే చర్య పూర్తయిన తరువాత, ఇదే శరీరం యొక్క ఈ మాదిరి భాగాలను నింపడం లేక వాటితో పొషణనిస్తూ, పై ఐదు పంచభూతాలతో నిండివుంటుంది. శరీరంలో ఉండే ధాతువులు నిర్మాణసంబంధితమైనవి, అయితే పంచభూతాలనుండి వివిధ సమీకరణలు మరియు మార్పిడినుండి ఆవిర్భవించిన రసాలు మాత్రం మానిసిక సంబంధిత పదార్ధాల వంటివి.
ఆరోగ్యం లేక అస్వస్ధత అనేవి వివిధ అవయవాల మధ్య ఉండే సమతుల్యతతో సహా మొత్తం శరీరం యొక్క సమతుల్యత ఉందా లేక లేదా అనే పరిస్ధితిపై ఆధారపడి ఉంటుంది, ఇందులో అంతర్లీనంగా మరియు బాహ్యంగానూ ఉండే రెండు అంశాలూ సహజ సమస్ధితి, సమతౌల్యంలో విఘాతానికి, గందరగోళానికి కారణమై రోగాలకు దారితీయవచ్చు. విచక్షణారహితమైన ఆహారం, అనుచితమైన, అవాంఛిత అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన జీవనసరళి నిబంధనలను పాటించకపోవడం అనే వాటివల్ల సహజ సమతౌల్యం లోపించవచ్చు. వివిధ ఋతుసంబంధిత అసమానతలు, వైపరీత్యాలు, లేక సున్నితమైన శరీరాంగాల అనిశ్చిత, అస్ధవ్యస్థమైన అభ్యాసాలు లేక వాటి అనుచిత వినియోగం మరియు శరీరం, మెదడు యొక్క పొంతనలేని చేష్టలు కూడా ప్రస్తుతం ఉన్న మానసిక సమతౌల్యంపై విఘాతాన్ని సృష్టించడానికి కారణ మవ్వవచ్చు. ఈ విధంగా విఘాతానికి గురైన శరీరాకృతిని, మెదడును తిరిగి యధాస్ధితికి తీసుకురావడానికి ఆహారాన్ని తీసుకోవడాన్ని క్రమబధ్దీకరించడం ద్వారా, మామూలుగా రోజూ గడుస్తూ వుండే జీవన విధానాన్ని, ప్రవర్తనను సరిచెయ్యడం, మందులని సరైన రీతిలో వాడుతూ ఉండడం వంటి వాటి నివారణోపాయంతో ఉండే పంచకర్మలను మరియు రసాయనిక చికిత్సా విధానాన్ని అనుసరిస్తూ ఉండడం ఉంటుంది.
ఆయుర్వేదంలో ఎప్పుడూ కూడా రోగ నిర్ధారణ వైద్యుడు రోగిని పూర్తిగా పరిశీలించిన తర్వాత జరుగుతుంది. వైద్యుడు రోగి యొక్క అంతర్గత బౌతిక, శారీరక లక్షణాలను మరియు మానసిక స్ధితి, స్వభావాలను శ్రధ్ధగా గుర్తిస్తాడు. రోగికి సంబంధించిన ఇతర అంశాలను, అంటే శరీరంలో ప్రభావితం కాబడిన ధాతువులు, కణజాలం, రసాలు, రోగం కేంద్రీకృతమైన ఉన్న చోటు, రోగి నిగ్రహం, తట్టకోగలిగే శక్తి, అతని దినచర్య, ఆహారపు అలవాట్లు, చికిత్సా సంబంధిత పరిస్ధితుల ప్రాధాన్యత వల్ల కలిగే ప్రభావం, జీర్ణం చేసుకోగలిగే పరిస్ధితులు, రోగి యొక్క వ్యక్తిగత, సాంఘిక, ఆర్ధిక మరియు పర్యావరణ సంబంధిత పరిస్ధితి అనే అంశాలను కూడా అధ్యయనం చేస్తాడు. రోగ నిర్ధారణ ఈ క్రింది పరీక్షలతో సహా కలిసి ఉంటుందిః
ప్రాథమిక చికిత్సా విధానం అనేది ‘మంచి ఆరోగ్యానికి రక్షణనిచ్చేది మాత్రమే సరైన చికిత్సా విధానం మరియు మనల్ని వ్యాధులకు దూరంగా ఉంచేవాడే మంచి వైద్యుడు’. ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాన్ని ఇది దృవీకరిస్తుంది, అంటే ఆరోగ్య పరిరక్షణ మరియు పెంపొందించుకోవడం, రోగ నివారణ మరియు అనారోగ్యానికి చికిత్స వంటివి.
వ్యాధి నివారణ లేక చికిత్స అంటే పంచకర్మ పధ్దతులననుసరించడం ద్వారా మందులను తీసుకుంటూ ఉండడం, సరైన ఆహారం, చురుకుగా ఉండడం మరియు సమతౌల్యాన్ని మరియు శరీర యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన అభ్యాసాలు, పథ్యాన్ని పాటిస్తూ ఉండడం భవిష్యత్తులో సంక్రమించకుండా వ్యాధుల నివారణ లేక వాటిని తగ్గించడం కోసం చికిత్స అనే వాటి ద్వారా శరీరం యొక్క, దాని ఆకృతిని, లేక దాని ఇతర ఏ అవయవాల యొక్క అసమతౌల్యం, అనిశ్చితస్ధితికి గురిచేసే అంశాలను నివారించడం.
సామాన్యంగా చికిత్సా చర్యలు మందుల వాడకం, ఖచ్చితమైన, స్పష్టమైన ఆహారం, అలాగే విహితపరచబడిన దినచర్యలు అనే వాటి ప్రమేయంతో ఉంటాయి. రెండు విధాలుగా ఈ మూడు చర్యలను వినియోగించుకోవడం జరుగుతుంది. చికిత్స చేసే ఒకటో విధానంలో ఈ మూడు చర్యలు కూడా రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలనూ మరియు వివిధ రూపాలలో రూపాంతరం చెందుతూ ఉండే రోగాన్ని తమ ప్రతిచర్య ద్వారా వ్యాధిని నిరోధిస్తాయి, రెండో విధానంలో ఇదే మూడు రకాలుః మందుల వాడకం, ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన దినచర్యలను రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలు మరియు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వుండే వ్యాధి ప్రక్రియల మాదిరిగానే తమ ప్రభావాన్ని చూపించే విధంగా లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాయి. ఈ రెండు రకాలైన చికిత్సావిధానాలు విపరీత మరియు విపరీతార్ధకారి చికిత్సలు అనే పేర్లతో, ఆ వరుసలో పిలువబడుతూ ఉంటాయి.
విజయవంతంగా చికిత్సను విర్వహించడానికి నాలుగు ముఖ్యమైన విషయాలున్నాయి. అవి:
ఈ ప్రాధాన్య క్రమంలో మొదటి అంశం వైద్యుడు. అతను సాంకేతిక నైవుణ్యాన్ని, శాస్ర్రీయ పరిజ్ఞానాన్ని, స్వఛ్చత మరియు మనిషి యొక్క మనోగతాన్ని అర్ధం చేసుకోగలగడం వంటి లక్షణాలను కలిగివుండాలి. మానవసేవ చేయడంలో వైద్యుడు తన కౌశల్యాన్ని, జ్ఞానాన్ని వినయం, విధేయత, నమ్రత, విజ్ఞతలను ఉపయోగించాలి. ఇక ఈ ప్రధాన క్రమంలో తరువాత వచ్చే రెండవ అంశం ఆహారం, మందులు. ఇవి అత్యంత నాణ్యతకలిగి, విస్తృతంగా వినియోగించుకోవడానికి తయారుచేయబడి, అనుమతింపబడిన పధ్దతుల ద్వారా పెంచబడిన మరియు తయారుచేయబడి ఉండి, చాలినంత మేరకు అందుబాటులో ఉండాలి. ఇక మూడవ అంశం, సేవలనందించడంలో మంచి తెలివితో, వారియొక్క వృత్తిలో, కళలో ఆరితేరి ఉండే మరియు ఆప్యాయత, జాలి, దయతో, తెలివితేటలు, పరిశుభ్రతతో, స్వయంసిధ్దులుగా ఉండే సేవలనందించే సిబ్బంది (నర్సులు) పోషించే పాత్ర. చివరిగా నాలుగో అంశం సహకార స్వభావంతో వైద్యుడి సూచనలను, సలహాలను విధేయతతో అనుసరిస్తూ ఉంటూ, తన ఇబ్బందులను, బాధలను చక్కగా వివరించి చేప్పగలిగి ఉంటూ, చికిత్సనందుకోవడానికి కావలసిందంతా చేయగలిగే రోగియే.
వ్యాధికి చికిత్స చేయడంలో, వ్యాధికి కారణమయ్యే లక్షణాలు ప్రారంభమైనప్పటినుండి చోటు చేసుకుని వ్యాధి చివరికి రూపాంతరం చెందే వరకూ సంభవించే సంఘటనలను, పరిణామాల వివిధ దశల యొక్క స్పష్టమైన విశ్లేషణాత్మకమైన వివరణలను విశదీకరిస్తూ వ్యాధికి చికిత్స చేయడంలో ఆయుర్వేదం అభివృధ్ది చేసింది. వ్యాధిని కలిగించే, ప్రఛ్చన్నంగా దాగివుండే, వ్యాధి రావడానికి అవకాశమున్న లక్షణాలను బయటపడడానికి ముందే కనిపెట్టగలిగే, అదనపు సౌలభ్యాన్ని ఈ ఆయుర్వేద పధ్దతికి ఇది కలిగిస్తుంది. వ్యాధి ప్రబలడానికి ముందు దశలోనే దానిని అరికట్టడానికి సరైన, సమర్ధవంతమైన చికిత్సాపరమైన చర్యలను తీసుకోవడానికి వీలును కలిగించడం ద్వారా అది మరింతగా వృధ్ది అయ్యే అవకాశాన్ని తప్పనిసరిగా నివారించే పాత్రను ఇది చురుకుగా పోషిస్తుంది.
వ్యాధికి చేసే చికిత్సను ఈ క్రింది విధంగా విస్తృతంగా వర్గీకరించవచ్చు.
శారీరక (సోమేటికి) మరియు మనోవికృత హేతుక శరీర జాఢ్య సంబంధిత (సైకో-సోమేటిక్) వ్యాధులకు కారణమయ్యే అంశాలను తొలగించే ఉద్దేశ్యంతో ఈ శోధన చికిత్స అనేది పనిచేస్తుంది. ఈ ప్రక్రియ అంతర్గత మరియు భాహ్య శుద్ధీకరణ (ప్యూరిఫికేషన్) తో ప్రమేయం కలిగి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చికిత్సతో ప్రమేయం కలిగి ఉండేవిః పంచకర్మలు ఎమిసిస్ (వైద్యపరంగా ప్రేరేపించబడి, నోటిద్వారా కడుపులోని పదార్ధాలను బయటకు కక్కించే ఒక ప్రక్రియ), పర్గేషన్ (విరేచనకారి మందు వాడకం), అయిల్ ఎనీమా (ఆయిల్ ను గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), డికాక్షన్ ఎనీమా (కషాయాన్ని గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), ముక్కు రంధ్రాల ద్వారా మందును లోనికి పంపే ప్రక్రియ. మరియు పంచకర్మ విధానానికి ముందు అనుసరించే పధ్దతులు (అంతర్గత మరియు బాహ్య ఓలియేషన్ మరియు చెమట పట్టడాన్ని ప్రోత్సహించే సాంబ్రాణి వాడకం) గా ఉంటాయి. జీవక్రియ నిర్వహణపై పంచకర్మ దృష్టిని సారిస్తుంది. చికిత్సా సంబంధిత లాభాలతో పాటుగా, ఇది అవసరమైన శుధ్ది చేయబడే ప్రభావాన్ని అదనంగా కలుగ జేస్తుంది, ముఖ్యంగా నరాల సంబంధిత అనారోగ్య సమస్యలకు, అస్ధిపంజర-కండర సంబంధిత వ్యాధి పరిస్ధితులలోనూ, కొన్ని రకాలైన రక్తనాళమయ లేక నాడీ-రక్త సంభంధిత పరిస్ధితులలోనూ, శ్వాస సంబంధిత అనారోగ్యంలోనూ, జీవక్రియ మరియు జీవక్రియ క్షీణిస్తూ ఉండే అనారోగ్యం వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా సహాయకారిగా ఉంటుంది.
అణగారి ఉన్న విషపూరిత రసాయనాల (దోషాల)తో ఈ షమన చికిత్స ప్రమేయం కలిగివుంటుంది. ఈ విధమైన ఇబ్బందికరమైన దోషాలు తగ్గిపోవడం లేక ఇతర దోషాలలో అసమతుల్యాన్ని కలిగించకుండా, సాధారణ పరిస్థితికి తిరిగి చేరుకునే ఈ ప్రక్రియ షమనగా పిలువబడుతుంది. ఆకలిని పుట్టించే వాటిని, జీర్ణమవడానికి సహకరించే వాటిని, వ్యాయామాలు మరియు సూర్యరశ్మికి గురి కాబడడం, స్వఛ్చమైన గాలి మొదలైన వాటి ద్వారా ఈ చికిత్సను విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ చికిత్సా విధానంలో ఉపశమనాన్నిచ్చే వాటిని మరియు ప్రశాంతతను కలిగించే వాటిని ఉపయోగించడం జరుగుతుంది.
పథ్య వ్యవస్ధ అనేది ఆహర, దినచర్య, అలవాట్లు మరియు భావోద్రేక పరిస్ధితులకు సంబంధించిన లక్షణాలను లేక ప్రతిలక్షణాలతో కలిసి ఉండేది. చికిత్సాపరమైన చర్యల ప్రభావాన్ని అధికం చేయడానికి మరియు వ్యాధిని పుట్టించే ప్రక్రియను నిరోధించే ఉద్దేశ్యంతో ఇది చేయబడుతుంది. అగ్నిని ప్రేరేపించడానికి మరియు తగినంతగా జీర్ణమవడానికి మరియు ఆహారాన్ని సమీకృతం చేయడానికి, దీని ద్వారా ధాతువులలో బలాన్ని కలిగించేటట్లు చూసే ఉద్దేశ్యంతో ఆహార విషయంలో చేయవలసిన మరియు చేయకూడని వాటిని నొక్కి చెప్పబడుతుంది.
ఆహారంలోనూ మరియు జీవనశైలిలోనూ రోగి యొక్క తెలిసి ఉండి, గుర్తించిన వ్యాధి లక్షణాలను నివారించడానికి లేక నిరోధించడానికే నిదాన్ పరివర్జన్ ఉద్దేశింపబడింది. వ్యాధిని పెంచి లేక తీవ్రతరం చేసే లక్షణాల నుండి జాగ్రత్తపడుతూ, వాటికి దూరంగా ఉంటూ ఉండాలనే భావాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది.
సత్వవజయత్ అనే మానసిక వ్యాధుల చికిత్స ప్రధానంగా మానసిక అలజడికి సంబంధించింది. ఇది మనసును అనారోగ్యకరమైన కోరికలను కలిగించే విషయాలనుండి దూరంగా ఉంచడం మరియు ధైర్యాన్ని అలవరుచుకోవడం, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించుకోవడం వంటి వాటితో కూడి ఉంటుంది. ఆయుర్వేదంలో మానసిక శాస్త్రాన్ని మరియు మనోవ్యాధుల చికిత్సా శాస్త్రాలను అధ్యయనం చేయడం, అలాగే మానసిక అనారోగ్యాల చికిత్సలో విస్తృత శ్రేణిలో అనుసరించే విధానాలూ అభివృధ్ది చేయబడ్డాయి.
రసాయన చికిత్స బలాన్ని, శక్తిని వృధ్ది చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరాకృతి పొందికగా ఉండడం, జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడం, వ్యాధి నిరోధక శక్తి, యవ్వనాన్ని, శరీర కాంతిని మరియు శరీర ఛాయను కాపాడడం మరియు శరీరం మరియు ఇంద్రియాల యొక్క శక్తిని, బలాన్ని అత్యున్నత స్ధాయిలో పోషించడం అనే కొన్ని సానుకూల లాభాలు ఈ చికిత్సా విధానానికి జత చేయ బడ్డాయి. శరీర ధాతువుల అకాల (పరిణతి చెందకుండానే) అరుగుదలను అరికట్టడం మరియు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని పెంపొందించడం అనేవి ఈ రసాయన చికిత్స పొషించే పాత్ర.
ఆయుర్వేదంలో ఆహార నియమాన్ని ఒక క్రమ పధ్దతిలో, ఒక చికిత్సగా, పాటించడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా ఎందుకంటే, ఇది మానవ శరీరాన్ని ఒక ఆహార ఉత్పత్తిగా పరిగణిస్తుంది కాబట్టి. ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు ఆధ్యాత్మిక పెరుగుదల, అలాగే అతని స్వభావం, వ్యక్తిత్వం అనేవి అతను తీసుకునే ఆహారపు నాణ్యతతో ప్రభావితం చేయబడి ఉంటాయి. మానవ శరీరంలోని ఆహారం ముందుగా అన్నరసం లేక అన్నధాతుసారం లేక రసంగా మార్పుచెందుతుంది. అటు తర్వాత ఒకదాని వెంబడి ఒకటిగా ఈ ప్రక్రియ అంతా దీనిని రక్తం, కండరాలు, కొవ్వు, ఎముకలు, ఎముకలలో మజ్జ, పునరుత్పత్తికి అవసరమయ్యే మూల పదార్ధాలుగా మార్చడంతో కూడి ఉంటుంది. అన్ని జీవ ప్రక్రియలతో చెందే మార్పులకు మరియు జీవిత చైతన్యానికి ఈ విధంగా ఆహరం మూలాధారమైనటువంటిది. ఆహారంలో పొషకాలు కొరవడడం లేక సరిగా జీర్ణం కాకుండా, మార్పు చెందని ఆహారం అనేక విధాలైన వ్యాధులను కలిగించే పరిస్ధితులకు దారితీయవచ్చు.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
ఎంత సేపూ వ్యాధి లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల కోసం వెళతాం కానీ, వ్యాధి కారకమైన ఆ మూలాల మీదికి చాలా సార్లు మన దృష్టే వెళ్లదు. శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించుకోకుండా ఏ వ్యాధైనా శాశ్వతంగా పోదుకదా! అందుకే ఆయుర్వేదం ఆ కల్మషాలను తొలగించే పంచకర్మ చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి సొరియాసిస్ వ్యాధి నిర్మూలనలో ఈ పంచకర్మ చికిత్సలు మరీ ముఖ్యమైపోయాయి.
శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలు సొరియాసిస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. ఈ మాలిన్యాలకు మానసిక ఒత్తిళ్లు కూడా తోడైతే, సమస్య మరీ తీవ్రమవుతుంది. అందుకే సొరియాసిస్‌కు ఈ రెండు కోణాల్లోంచి చికి త్సలు అందించవలసి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉద్దేశించినవే పంచకర్మ చికిత్సలు.
వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఈ ఐదు చికిత్సలు సొరియాసిస్ నిర్మూలనలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరాన్ని పంచకర్మ చికిత్సలకు సిద్ధం చేయడానికి కూదా కొన్ని విధానాలు ఉంటాయి. వీటినే పూర్వకర్మలు అంటారు. అందులో భాగంగా స్నేహం ( తైలమర్ధనం) స్వేదం ( స్టీమ్) ఉంటాయి.
చర్మ వ్యాధుల్లో సాధారణంగా శరీరం పొడిబారిపోయి ఉంటుంది. ఔషధాలు కలిసిన నెయ్యి గానీ, నూనె గానీ ఇచ్చే ఈ స్నేహపాన ం వల్ల ఆ పొడితనం పోయి చ ర్మానికి ఒక నూనెతనం, ఒక మృదుత్వం వస్తాయి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజుల దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో వాడే నూనె లేదా నెయ్యికి సహజంగా జిడ్డుతనం, జారుడు గుణం ఉంటాయి. వీటివల్ల శరీరంలో పేరుకుపోయి, గ ట్టిపడిన దోషాలను ఇది మెత్తబడతాయి. ఆ తరువాత శరీరానికి చెమట పట్టించే స్వేదం చేస్తాం. దీనివల్ల అప్పటికే మెత్తబడిన మలినాలన్నీ కడుపులోకి వచ్చేస్తాయి. వాటిని కడుపులోంచి బయటికి పంపించడానికి ఇక పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి.
వమనం
సొరియాసిస్ మచ్చలు మందంగా ఉండి దురద కలిగిస్తూ, నలుపెక్కి ఉంటే శరీరంలో ఖఫదోషం ఎక్కువగా ఉన్నట్లు భావించబడుతుంది. ఈ దోషాన్ని నిర్మూలించడానికి 'వమన క్రియ' అవసరమవుతుంది. ఇది ఔషధాలు కలిపిన ద్రవాలు ఇచ్చి వాంతి చేయించే ప్రక్రియ. వమన క్రియ వల్ల కడుపులోకి చేరిన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
విరేచన క్రియ
సొరియాసిస్ మచ్చలు ఎర్రబడి, పొట్టు ఎక్కువగా రాలుతూ ఉండడం వాతం ఎక్కువగా ఉన్నట్లు చెప్పే సూచనలు. ఈ స్థితిలో విరేచన క్రియ అవసరమవుతుంది. వాతాన్ని తొలగించడంలో విరేచన క్రియను మించింది లేదు. ఇది మలద్వారం ద్వారా శరీరంలోని మలినాలన్నిటినీ బయటికి పంపించే ప్రక్రియ.
వస్తికర్మ
సొరియాసిస్ చికిత్సలో వస్తికర్మ పాత్ర చాలా తక్కువ. కాకపోతే, సమస్య సొరియాసిస్ ఆర్థరైటిస్‌గా పరిణమించిన స్థితిలో మాత్రం వస్తికర్మ అవసరమవుతుంది. ఈ సమస్యేమీ లేనప్పుడు వస్తికర్మ అవసరం లేదు. నిజానికి సొరియాసిస్ చికిత్సలో వమన, విరేచనాలదే కీలక పాత్ర అవుతుంది.
నస్యకర్మ
ఔషధపు చుక్కలను నాసిక రంద్రాల్లో వేసే ప్రక్రియను నస్యకర్మ అంటారు. ఇది శారీరక ప్రధానమే కాకుండా మానసిక ప్రధానం కూడా. ఈ చికత్సతో ప్రతికూల ప్రేరకాలన్నీ తొలగిపోయి మెదడు చైతన్యవంతమవుతుంది. అలాగే అస్తవ్యస్తమైపోయిన మెదడులోని అల్ఫా, బీటా, గామాలు నియంత్రణలోకి వస్తాయి.
ఇవి తరంగాల వంటివి. వీటి ఆధారంగానే మనిషి ఆలోచన సరళి ఉంటుంది. ఆ తరంగాలను నియంత్రించడం నస్యకర్మ వల్ల సాధ్యమవుతుంది. దీనివల్ల భయాందోళనలు, దిగులు, డిప్రెషన్ తొలగిపోయి, మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.
రక్తమోక్షణం
కొందరిలో సొరియాసిస్ మచ్చలు కొన్ని చోట్ల మందంగా మారిపోతాయి. అక్కడ గడ్డకట్టుకుపోయిన చెడు రక్తమే ఇందుకు కారణం. ఆ చెడు రక్తాన్ని తీసివేయకుండా ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గవు. గడ్డకట్టుకుపోయిన ఆ చెడు రక్తాన్ని, జలగల సహాయంతో తీసివేయవలసి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు. ఆ తరువాత కూడా ఆ వ్యాధి మళ్లీ రాకుండా ఒక ఏడాది పాటు మందులు వాడవలసి ఉంటుంది.
నిజానికి, పంచకర్మల తరువాత శరీరంలో మందులను గ్రహించే శక్తి బాగా పెరుగుతుంది. పంచ కర్మ చికిత్సలకు ముందే మందులు వాడితే, 50 శాతం ఉండే ప్రయోజనం ఆ చికిత్సల తరువాత అయితే 100 శాతం ఉంటుంది. కాకపోతే, పంచకర్మ చికిత్సలతో శరీరం పరిశుద్ధంగా మారి, మందులతో వ్యాధి తగ్గినా, అది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేమీ కాదు.
ఆ శక్తి పెరగకపోతే మళ్లీ ఏదో ఒక వ్యాధి వచ్చే వీలుంది. అందుకే పంచకర్మ చికిత్సలు తీసుకున్నాక వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికి త్సలు తప్పనిసరి అవుతాయి. అశ్వగంధ, శతావరి, గుడూచి, బ్రాహ్మి, యష్టిమధు వంటి ఔషధాల మిశ్రమంతో తయారయ్యే ఈ రసాయనాలు శరీరాన్ని సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా స్థిరంగా ఉంటుంది.
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.
ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం... ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.
ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.
అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్... ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు
ఆస్త్మా తగ్గించే ఆహారం
కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
బేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.
ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.
ఇలా కూడా తీసుకోవచ్చు...
పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.
ఇవి వద్దు!
పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.
‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.
- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను తీసుకుని తయారు చేసే తైలాన్ని " మహా విషగర్భ తైలం'' అంటారు.
తక్కువ సంఖ్యలోనూ, తక్కువ మోతాదులోనూ అలాగే తక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను వినియోగించి తయారు చేసే తైలాన్ని " లఘు విషగర్భ తైలం'' అంటారు. తైలం తయారీకి మూలికలు, ఖనిజ రసాయనాలు కలిపిన ఒక ముద్దను తయారు చే సుకుని అందుకు నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకుంటారు. ఆ తరువాత నూనెకు నాలుగు రెట్లు 16 భాగాల ద్రవాంశం కోసం ముందు కషాయాన్ని తయారు చేసుకుంటారు.
మహా విషగర్భ తైలం
ఈ తైలం తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త విత్తులు, వావిలి విత్తులు, చేదు సొరకాయ విత్తులు, గలిజేరు వేర్లు, ఆముదం విత్తులు, అశ్వగంధ, చిత్రమూలం, మునగ పట్ట, కాకమాచీ, లాంగలీ దుంప, వేపపట్ట, వెర్రిపుచ్చ వేర్లు, దశమూలాలు, శతావరీ, సారిబా, ముండీ, విదారీకంద, స్నుహీ, అర్క, కర్కాటక శృంగి, గన్నేరు వేర్లు, కాకజంఘ వేర్లు, ఉత్తరేణు వేర్లు, బలా, అతిబలా, నాగబలా, మహాబలా, అడ్డసరం, తిప్పతీగె, ప్రసారిణీ మొదలైన మూలికలకు నీరు చేర్చి కషాయం సిద్ధం చేసుకుంటారు.
అలాగే విషముష్టి (శుద్ధి చేయనివి), శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, రాస్నా, కోష్టు, హరితాలకం, తుంగముస్తలు, దేవదారు, వత్సనాభి, యవక్షారం,సర్జక్షారం, పంచలవణాలు, మైల తుత్తం, కాయఫలం, పాఠా, భారంగీ, నవసారం, వెర్రిపుచ్చ, జవాసా, జీరక మూలికలను చూర్ణం చేసుకుని, తడిపి ముద్ద చేస్తారు. తైలపాక వి«ధి ప్రకారం నువ్వుల నూనెను కూడా తీసుకుంటారు.
పైన తెలిపిన అన్ని ద్రవాలను తగిన పాత్రలో కలిపి పొయ్యి పైన ఉంచుతారు. మూలికల ముద్ధ మాడిపోకుండా, కషాయ ద్రవం ఇగిరిపోయి తైలాంశం మాత్రమే మిగిలేంతవరకు ఉడికించి తైలాన్ని జాగ్రత్తగా తయారు చేస్తారు.
ఉపయోగాలు
లఘు విషగర్భ తైలం
లఘు అనే పదం లేకుండా చాలా మంది కేవలం విషగర్భ తైలం అని కూడా పిలుస్తారు. ఈ తైలం తయారీకి అవసరమైన ద్రవం కోసం ఈసబ్గోల్ కషాయం, గన్నేరు వేర్లు క షాయం, ఉమ్మెత్త స్వరసం, నిర్గుండీ స్వరసం, జటామాంసీ కషాయం, ఇవన్నీ కలిపి తీసుకుంటారు.
మూలికల ముద్దకోసం ఉమ్మెత్త విత్తులు, కోష్టు, ప్రియంగు పూలు, వత్సనాభి, పిచ్చి కుసుమ వేళ్లు, రాస్నా, గన్నేరు వేర్లు, మాల్కంగినీ విత్తులు, మిరియాలు, దంతీ, జటామాంసీ, చిత్రమూలం, పచ్చ ఆవాలు, దేవదారు, పసుపు, కస్తూరి పసుపు, ఆముదం వేర్లు, లక్షా, త్రిఫలా, మంజిష్ఠా చూర్ణాలను సమానంగతా తీసుకుంటారు. వీటన్నిటినీ తైలపాక నిష్పత్తిలో నువ్వుల నూనె చేర్చి తైలం మిగిలేలా ఉడికిస్తారు.
దీని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మహా విషగర్భ తైలం లాగే ఉంటాయి. కాకపోతే తీక్షణత తక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నితులకు ఇది ఉత్తమం. పైగా వేడి వాతావరణంలోనూ ఈ తైలాన్ని వాడవచ్చు.
విషముష్టి తైలం:
ఈ తైలం తయారీకి ప్రత్యేకించి విషముష్టి గింజలు మాత్రమే తీసుకుంటారు. దీనికి జొన్న కలి (కాంజికం) చేర్చి కషాయం తయారు చేస్తారు. ముద్ద కోసం విషముష్టి గింజల పొడినే వాడతారు. నువ్వుల నూనెతో పాటు ఆముదం కూడా జతచేస్తారు. అన్నిటినీ తైలపాక నిష్పత్తిలో కలిపి తైలం మిగిలేలా ఉడికిస్తారు. దీని ఉపయోగాలు విషగర్భ తైలంలాగే ఉంటాయి.
డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్.
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని , సాంకేతిక , పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం , తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన , ఆగ్రహం , ఒత్తిడి , ఆందోళనకు లోనవుతున్నాడు.
మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో , పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత , ఉద్రిక్తత , సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి , ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం , దుఃఖం , నిస్సహాయత , స్తబ్దత , సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.
ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి , దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.
శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం , ధ్యానం , చక్రాలను చైతన్యవంతం చేయడం , ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం , దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.
గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను , ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.
డా ప్రసాద్ , ఎం.డి.(ఆయుర్వేద) ,
డా స్వాతి , ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ ,
101, రామచంద్రనివాస్ అపార్ట్‌మెంట్స్ ,
వెంగళరావ్‌నగర్ , హైదరాబాద్
ఫోన్: 93909 57168 / 9666649665 / 09503628150
Prasad _ayur@rediffmail.com
swathi_ayur@rediffmail.com
సుదీర్ఘ కాలం జీవించడం ఎలా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తూ వచ్చిన ప్రశ్న. కేవలం సుదీర్ఘ కాలం జీవించడమే కాదు జీవితంలో అన్ని సంతోషాలనూ అనుభవిస్తూ జీవించాలని కోరుకుంటాడు. మానవుడు 125-150 ఏళ్ళ వరకూ భౌతికంగా జీవించగలడు. అంత సుదీర్ఘ కాలం మనుషులు జీవించినట్టు రికార్డులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వయసు మీద పడడానికి ప్రాథమిక కారణాలు జన్యుపరమైనవి. వాటిని తప్పించుకోలేం. జన్యుపరంగా భౌతిక స్వరూపం , శరీర తత్వం వ్యక్తులకు ముందస్తుగా నిర్ణయించిన జీవితకాలం ఉంటుంది. నివారించగల ఇతర కారణాలలో వ్యాధులు , ఇన్ఫెక్షన్లు , విటమిన్లు , ఎంజైములు , హార్మోన్లు , ఇతర కీలక పదార్ధాల లోటు. వీటివల్ల ప్రాణాలకు భంగం నేరుగా వాటిల్లకపోయినప్పటికీ కణజాలాన్ని , ధాతువులకు సరిచేయలేని హాని కలిగించి తద్వారా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.
రసాయన చికిత్స శరీరానికి బలాన్ని , ఉత్తేజాన్ని కలిగించి వ్యాధులను నివారించే చికిత్స. శరీరంలోని రసాది సప్త ధాతువుల సమగ్రతకు దోహదం చేస్తూ సుదీర్ఘ కాలం జీవించేందుకు తోడ్పడుతుంది. జీవక్రియలలో మార్పులను సవరించే సామర్ధ్యం కలిగిన రసాయనం మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. అది జీవిత కాలాన్ని పొడిగించడమే కాదు జీవితాన్ని గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది.
రసాయన చికిత్సలో ఉపయోగించేందుకు అనేక మందులను సూచించారు. వైద్యపరమైనవి కాని వాటిలో నిత్యం ఆహారంలో నెయ్యి తీసుకోవడం , బ్రహ్మచర్యాన్ని పాటించడం వ్యక్తి సుదీర్ఘ కాలం జీవించడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అష్టాంగ ఆయుర్వేదలో రసాయన చికిత్స కీలకమైన శాఖ. ఆరోగ్యమైన వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి , వ్యాధుల బారిన పడిన వారికి శరీర బలం , ఉత్తేజం పెంచడం ద్వారా వ్యాధిని చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రసాయన చికిత్సలో భాగంగా రస , ఇతర ధాతువులను పరిపుష్టం చేస్తారు. నిర్వహణ దృక్కోణం నుంచి చూస్తే రెండు రకాల రసాయన చికిత్సలు ఉంటాయి:
విదంగ - విదంగ అవలేహ------------ నాగబల - నాగబల రసాయన
భల్లాతక - భల్లాతక సర్పి , భల్లాతక క్షీర , గుడ భల్లాతక , భల్లాతక తైలం ,
లోహ - లోహాది రసాయన , బ్రాహ్మ రసాయన పిప్పలి - పిప్పలి రసాయన , పిప్పలి వర్ధమాన రసాయన
మండూక పర్ణి స్వరస --- యష్టిమధు చూర్ణ --- శంఖపుష్పి కల్క శిలాజిత్ --- బాల - బాలకల్ప --- వరాహి కంద
బ్రాహ్మి రసాయ , --- బ్రాహ్మి కల్ప-- వచ వచ రసాయన సువర్ణ ----- శతావరి - శతావరి ఘృత---- అరవింద రసాయన ---- గోక్షుర రసాయన
తువారక రసాయన ---- పునర్నవ , భృంగరాజ రసాయన నరసింహ ఘృత.
వాత ప్రకృతి ఉన్న వ్యక్తులను పాలు , పిత్త ప్రకృతి ఉన్నవారిని నెయ్యి , కఫ ప్రకృతి ఉన్న వ్యక్తులను తేనె , రక్త ప్రకృతి ఉన్నవారిని చల్లటి నీటినీ ఆహారానికి ముందు తీసుకోమని సూచిస్తారు. ఇది అవసరమైన రసాయన ప్రభావాన్ని చూపి వార్ధక్యాన్ని నిరోధించేందుకు ఈ సూచనలు చేస్తారు.
సుదీర్ఘ జీవితానికి , పటిష్టతకు ముందుగా శరీర శుద్ధి చేసుకోవాలని సూచిస్తారు. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ ఎంతో ఉపయోగపడుతుంది. రసాయన ఔషధాలను ఇచ్చే ముందు శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. వమన , విరేచన , బస్తి , రక్తమోక్షన , స్వేదన అనేవి పంచకర్మలోని శుద్ధి ప్రక్రియలు. శరీర మసాజ్‌లు , పిండ స్వేద , ధారా , పదాభ్యంగన అనేవి శరీరానికి పునశ్శక్తినిచ్చే చికిత్సలు.
గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను , ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు..
డా స్వాతి , ఎం.డి. (ఆయుర్వేద)
డా ప్రసాద్ , ఎం.డి.(ఆయుర్వేద)
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్
వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ, డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు.
ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం.
వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు.
బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి.
వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు.
స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి...
తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం.
ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి.
కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి.
బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు.
చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి.
తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు.
చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది.
గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది.
ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి.
నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.
అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు.
చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి.
భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది.
చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.
భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట.
భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు.
ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి.
పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది.
అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు.
భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి.
మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస.
అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది.
అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది.
భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం.
ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది.
భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం.
పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి.
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు.
పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు.
ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి.
నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది.
నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది.
నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి.
సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.
నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు.
బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు.
ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం.
పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం.
పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి.
లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం.
బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి.
పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు.
తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం.
తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు.
చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి.
కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం. పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది.
పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.
ఆధారము: సాక్షి
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020
ఆయుర్వేదం జీవన సారం