జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14, 2010 నాడు ప్రభుత్వం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించాలని ఇందుమూలంగా ఆదేశాలను జారీ చేసింది. కార్యనిర్వహణలో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జె.బి.ఏ.ఆర్) అన్న పేరు పిల్లల ఆరోగ్యాభివృధ్ది పధకం (చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ - చిప్) గా వ్యవహరంచబడుతుంది.
ఈ జవహర్ బాల ఆరోగ్య రక్ష రాష్ట్రంలో 46,823 ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతూ వుండే 85,32,635 మంది విద్యార్ధులకు వర్తిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ముందే విద్యార్ధులందరికి పరీక్షలు చేయడం, అలాగే ఇప్పటికే వ్యాధులతో ఉన్నవారిని కూడా తగిన వైద్య చికిత్సకు పంపడం (రిఫరల్) పూర్తవుతుంది. దీని వెంటనే మండల మరియు జిల్లా స్ధాయిలలో పూర్తి చేయబడే ఒక వివరణాత్మకమైన షెడ్యూలును తయారుచేయడం జరుగుతుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) వైద్య అధికారి నేతృత్వంలో ఒక పేరా మెడికల్ బృందం, ఒక నేత్ర సంబంధిత అధికారితో సహా, ఒక ఆరోగ్య బృందం ప్రతి పాఠశాలతో పాటుగా, పాఠశాలలోచదివే పిల్లలు అందరిని పరిక్ష చేయడానికి ముందుగా నియమించిన షెడ్యూల్ ను అనుసరిస్తూ 1 డిసెంబరు 2010 మరియు 10 మార్చి 2011 మధ్య కాలంలో సందర్శిస్తుంది.
వైద్యునిచే శారీరక పరీక్షలు వివరంగా నిర్వహింపబడిన తరువాత ప్రతి ఒక్కరికి విద్యార్ధుల ఆరోగ్య రికార్డు (స్టూడెంట్ హెల్త్ రికార్డ్ – ఎస్.హెచ్.ఆర్) ఇవ్వబడుతుంది. 5 సంవత్సరాల వరకూ చెల్లుబాటు అయ్యే ఈ ఎస్.హెచ్.ఆర్. ఒక పరిపూర్ణమైన డాక్యుమెంట్ లాంటిది. విద్యార్ధుల జీవితంలో చోటు చేసుకునే ఆరోగ్య పరిణామాలు ఇందులో పొందుపరుస్తూ, ఈ ఎస్.హెచ్.ఆర్. పాఠశాల ఉపాధ్యాయుని వద్ద జాగ్రత్తగా ఉంచబడి ఎపుడైనా విద్యార్ధికి గాని, అతని తలిదండ్రులకు గాని వారి పిల్లలను ఆసుపత్రికి పంపవలసి వచ్చినప్పుడు వారికి ఇవ్వబడుతుంది. తదుపరి వ్యాధి నిర్ధారణకు మరియు చికిత్సకు అన్నీ ఏ.పి.వి.వి.పి. మరియు విద్యాబోధన చేయు ఆసుపత్రులలోను ఈ ఎస్.హెచ్.ఆర్. ను తనతో తీసుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి కూడా వ్యాధి దర్యాప్తునందు మరియు చికిత్సలోనూ ప్రాధాన్యత నివ్వబడుతుంది. ఈ పాఠశాల విద్యార్ధులకోసం ఒక కౌంటర్ ను విడిగా నెలకొల్పి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వీరికోసం ఒక రిజిస్టరును కూడా విడిగా ఉంచడం జరుగుతుంది. విటమిన్ ఏ మరియు డి లను ఇవ్వడం మరియు పిల్లల కడుపులో పాములు రాకుండా నివారించడంతో పాటుగా చిన్న చిన్న వ్యాధులు ఏమైనా వుంటే వాటిపై పరిక్షలు నిర్వహించే వైద్యునిచేతనే చికిత్సలను చేయించడం కూడా జరుగుతుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
బాలికల సంరక్షణ కోసం స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి...
న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమ...
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. ...
విద్య ప్రతి పిల్లవాడి హక్కు అందరికి ప్రాథమిక విద్య...