অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వైకల్యం, బుద్ధిమాంధ్యం గల బాలబాలికలు

వైకల్యం, బుద్ధిమాంధ్యం గల బాలబాలికలు

భౌతికంగా... అంటే కుంటి, గుడ్డి, చెవిటి వంటి అవిటి వారి పట్ల, మానసికంగా దెబ్బతిన్న వారి పట్ల సమాజ దృక్పథం మారుతూ ఉన్నట్లు కనిపిస్తూ వున్నాయి. వీరందరినీ ఇటీవలి కాలంలో విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి, ఇటువంటి ఇబ్బందికి గురియైన వారిని చిన్నప్పుడే గుర్తించి వారి పట్ల శ్రద్ధాసక్తుతో తగిన విద్య, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి తగిన అంటే దృశ్య, శ్రవణ పరికరములు వంటివి సమకూర్చినప్పుడే వారంతా జీవనోపాధి మార్గాలను ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. అందరిలాగానే వీరుకూడా జీవనాన్ని సాగించగల్గుతారు.

6 -14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో శ్రవణ లోపం (వికిడి లోపం) గల వారిని గుర్తించడానికి పట్టిక

Hearing Impairment (HI)- వినికిడి లోపం

1

3 నుండి 5 అడుగుల దూరం నుండి పేరుపెట్టి పిలిచినప్పుడు వినపడనట్లున్నారా ?

అవును / కాదు

2

ప్రశ్న వేస్తే జవాబు ఇవ్వలేక పోవడం లేక సంబంధం లేని జవాబు ఇస్తున్నారా ?

అవును / కాదు

3

ఉపాధ్యాయుడు మరియు తోటి విద్యార్థులు చెప్పే విషయాల మీద ఆసక్తి చూపలేక పోతున్నారా ?

అవును / కాదు

4

దగ్గర నుండీ కూడా అధిక స్వరంతో ఉచ్ఛరిస్తున్నారా / మాట్లాడుతున్నారా?

అవును / కాదు

5

మాట్లాడినప్పుడు అవసరంలేని శబ్దాలను ఉచ్చరించడం. అవసరం వున్న వాటిని వదిలివేయటం చేస్తున్నారా ?

అవును / కాదు

6

వాహనాలు, జంతువులు మొదలగు శబ్దాలకు స్పందించి చెవిని మాత్రమే ముందుకు వంచి వినడానికి ప్రయత్నిస్తున్నారా?

అవును / కాదు

7

విన్న శబ్ధాన్ని గుర్తించ లేక పోతున్నారా? శబ్దం వచ్చిన  వైపు చూడలేక పోతున్నారా?

అవును / కాదు

8

చెవి బాహ్య నిర్మాణంలో ఏవైనా తేడా (లోపం) ఉన్నదా?

అవును / కాదు

9

చెవి నుండీ చీము కారుచున్నదా ? (ఔను / కాదు)
ఔను అయితే
ఎ) తరచుగా కారుచున్నదా
బి) ఏ చెవిలో (ఒకటి / రెండు)
సి) ఏమైనా దుర్వాసన వచ్చుచున్నదా?
డి) డాక్ట ర్ వద్ద చికిత్స తీసుకుంటున్నారా?

అవును / కాదు

10

చెవి దిబ్బడి వేసినట్టుగా ఉంటుందా?

అవును / కాదు

11

ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు తిరిగి ప్రశ్నను అడుగుచున్నారా?

అవును / కాదు

12

చెప్పిన పదాన్ని ఉచ్ఛారణ దోషం లేకుండా పలుకుచున్నారా?

అవును / కాదు

13

తాను చెప్పదల్చుకున్న విషయాల్ని మాటలతో కాకుండా సంజ్ఞలతో/ సైగలతో లేదా కదిలికల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా?

అవును / కాదు

14

తోటి పిల్లలతో కలిసి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవటంలో సమస్యను ఎదుర్కొంటున్నారా?

అవును / కాదు

పైన పేర్కొన్న ప్రశ్నలలో 5 లేదా 6 అవును అని సమాధానం వస్తే వారికి శ్రవణ లోపం / మాట్లాడటంలో సమస్య ఉందని గుర్తించి వారిని పాఠశాల స్థాయిలో నమోదు పత్రం నందు HI / వినికిడి లోపం అని ఉన్న చోటులో/ స్ధానంలో నమోదు చేయవలెను.

పాఠశాలలో అభ్యసన లోపం గల పిల్లలను గుర్తించు పట్టిక

అభ్యసన లోపం - Learning Disability (LD)

1 ఉపాధ్యాయులు ఇచ్చిన పనిని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయ గలుగుచున్నారా? అవును / కాదు

2

చదివేటప్పుడు తరచుగా అక్షరాలను / పదాలను వ్యతిరేక దిశలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నారా? (ఉదా : ని గాను , ను గా గుర్తించడం).

అవును / కాదు

3

తరగతిలో చెప్పే విషయాలను సరైన దిశలోనే అవగాహన చేసుకోగలుగుతున్నారా?

అవును / కాదు

4

పదాలు, అక్షరాలను ఉన్నవి ఉన్నట్లుగా పలుకుటలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?

అవును / కాదు

5

ఆకారాలు, రంగులు, వారమునకు రోజులు, నెలలు వరుసగా చెప్పగలుగుతున్నారా?

అవును / కాదు

6

చదివేటప్పుడు  ఒకే  పదాన్ని అనేక పర్యాయములు చదువుచున్నారా?

అవును / కాదు

7

చదివేటప్పుడు ఉన్న పదాలను తప్పించడం, క్రొత్త పదాలను  చేర్చడం జరుగుచున్నదా?

అవును / కాదు

8

చదివేటప్పుడు - వ్రాసేటప్పుడు అంకెలను తారుమారుగా వేస్తున్నారా?
(ఉదా : 13 ను 31 గా, 6 ను 9 గా చదువుట-వ్రాయుట)

అవును / కాదు

9

గణిత సంజ్ఞలను చూపుటలో పొరపాటు చేస్తున్నారా?
(మరియు X :  < మరియు )

అవును / కాదు

10

లెక్కలు చేయుటలో బాగా వెనకబడి ఉన్నారా?

అవును / కాదు

11

పదాలను చూసి వ్రాసేటప్పుడు సక్రమంగా రాయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? సాధారణ దృష్టి కలిగి ఉన్నారా? (ఉదాః book or black board)

అవును / కాదు

12

అక్షరాలను లేదా పదాలను వ్రాసేటప్పుడు అతి దగ్గరగా లేదా దూరంగా వ్రాస్తున్నారా?

అవును / కాదు

13

బోధనను సక్రమంగా అర్థం చేసుకొంటున్నారా? ప్రశ్నలకు సమాధానములు సక్రమంగా చెప్పుచున్నారా? ఒక ప్రశ్న అడిగితే వేరే జవాబు చెబుతున్నారా?

అవును / కాదు

పైన పేర్కొన్న ప్రశ్నలలో ఏవైనా 4 లేక 5 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే వారిని అభ్యసన లోపం గల (Learning Disability ) పిల్లలుగా పరిగణించి మీకు అందించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు పత్రంలో LD గా నమోదు చేయాలి.

6 -14 సంవత్సరాలు వయస్సు గల పిల్లల్లో చలన సామర్ధ్యం లోపం గల పిల్లలను గుర్తించు పట్టిక

కండరాల, ఎముకల (నిర్మాణ) లోపం - Orthopedic Impairment (OI)

1

కూర్చోవడానికి, నిలబడడానికి, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారా?

అవును / కాదు

2

శరీరంలో ఏ భాగంలోనైనా గమనింపదగిన లోపం కలిగి ఉన్నారా?

అవును / కాదు

3

కండరాలు కుచించుకొని గానీ, బిగుసుకొని గానీ  ఉన్నాయా? కండరాల సమన్వయం లోపించిందా?

అవును / కాదు

4

పెన్సిల్ పట్టుకొని వ్రాయడంలో, పుస్తకం పట్టుకోవడంలో సమస్య  కలిగి ఉన్నారా?

అవును / కాదు

5

ఆటలలో చురుకుగా పాల్గొనలేక పోతున్నారా?

అవును / కాదు

6

శరీరంలో ఎడమవైపు భాగాలు గానీ,  కుడి వైపు భాగాలు గానీ పనిచేయడం లేదా?

అవును / కాదు

7

ఏదైనా వస్తువును చేత్తో పట్టుకోవడంలో గానీ , కింది పెట్టడంలో గానీ ఇబ్బంది పడుతున్నారా?

అవును / కాదు

8

నడుము  సమతుల్యతలో తేడా లేదా లోపం ఉందా?

అవును / కాదు

9

కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారా ?శరీర భాగాల్లో ఏవైనా వంకర్లు తిరిగి ఉన్నాయా?

అవును / కాదు

10

మెడను నిలుపుటలో, నియంత్రించుటలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?

అవును / కాదు

11

పరిసరాలలో చురుకుగా తిరగటానికి మరియు దైనందిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకోగలుగుతున్నారా?

అవును / కాదు

పైన పేర్కొన్న ప్రశ్నలలో ఏవైన 4 లేక 5 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే వారిని చలన సామర్ధ్య లోపం గల బాలలుగా గుర్తించి వారి పేరును పాఠశాల స్థాయిలో గుర్తింపు ఫ్రొఫార్మాను (OI) అని ఉన్న చోటున/ కాలం నందు నమోదు చేయాలి.

6 -14 సంవత్సరాలు వయస్సు గల పిల్లల్లో సెరిబ్రల్‌ పాల్సీ గల పిల్లలను గుర్తించు పట్టిక

సెరిబ్రల్‌ పాల్సీ - Cerebral Palsy (CP)

1

శరీర కండరాలు బిగుసుకొనినట్లుగా ఉన్నాయా?

అవును / కాదు

2

తల, కాళ్లు, చేతులు, కళ్లు తనకు తెలియకుండానే చలనం కలిగి ఉన్నవా లేదా బలహీనమైన కండరాల నియంత్రణ కలిగియున్నారా?

అవును / కాదు

3

నడుచుచున్నపుడు మరియు నిలబడినపుడు తనకు తెలియకుండా నియంత్రణ కోల్పోతున్నారా?

అవును / కాదు

4

గాలిపీల్చుకోవటంలో ఏవైనా సమస్య కలిగియున్నారా?

అవును / కాదు

5

నడుచుచున్నప్పుడు కాళ్లు కత్తెర పడుచున్నవా?

అవును / కాదు

6

బొంగురు గొంతుతో, కీచుగొంతుతో మాట్లాడుచున్నారా?

అవును / కాదు

7

వినటంలో, చూడటంలో, మాట్లాడటంలో, స్పర్శలో సమస్యలు ఎదుర్కొంటున్నారా?

అవును / కాదు

8

తరచుగా సొంగకార్చు కొంటున్నారా?

అవును / కాదు

9

మోకాళ్లు, మోచేతులు వంచలేక పోతున్నారా?

అవును / కాదు

10

వయసుకు తగిన శారీరక పెరుగుదలను కలిగియున్నారా?

అవును / కాదు

11

తీవ్రకోపం, పళ్లుకొరకటం, తనకుతానుగా గాయపర్చుకోవటం వంటి పనులు చేస్తున్నారా?

అవును / కాదు

పై వాటిలో ఏవైనా 4 లేదా 5 అవును అను సమాధానం వస్తే అలాంటి పిల్లలను సెరిబ్రల్ పాల్సీ ఉన్న వారిగా గురించి, పాఠశాల స్థాయిలో నమోదు పత్రంను (ఈ) కాలంనందు/ చోటున నమోదు చేయాలి.

6 -14 సంవత్సరాలు వయస్సు గల పిల్లల్లో దృష్టి లోపం గల పిల్లలను గుర్తించు పట్టిక

Visual Impairment (VI)

1

కళ్ళు నిర్మాణంలో లోపాలు (కనుగుడ్లు ముందుకు పొడుచుకొని రావడం / కనుగుడ్లు లోపలికి ముడుచుకొని ఉండడం) ఉన్నాయా?

అవును / కాదు

2

కనురెప్పలు ఎక్కువగా ఆర్పటం లేదా ఆర్పకుండా ఉండటం చేస్తున్నారా?

అవును / కాదు

3

కంటిలో నీరు కారుతూ ఉందా? కళ్ళు ఎర్రగా ఉండి, కళ్ళను తరచుగా రుద్దుతున్నారా?

అవును / కాదు

4

వస్తువులను చూచుటలో కళ్ళు పెద్దవి చేసి లేదా చిన్నగా చేసి చూడటం / గుర్తించుటలో ఏవైనా సమస్యలున్నవా?

అవును / కాదు

5

మీటరు దూరం నుండి చేతివ్రేళ్ళను లెక్కించడానికి ఇబ్బంది పడుతున్నారా?

అవును / కాదు

6

టీచరు బోర్డుపై వ్రాసిన విషయాలను చూడలేక పక్కవారి పుస్తక ములు చూచి వ్రాస్తున్నారా? నల్లబల్లకు దగ్గరలో కూర్చోవటానికి ప్రయత్నిస్తున్నారా?

అవును / కాదు

7

క్రింద పడిన వస్తువులను వెతికి తీసుకొనేందుకు కష్టపడుతున్నారా?

అవును / కాదు

8

వ్రాయునప్పుడు, చదువునప్పుడు పుస్తకాలను మరీ దగ్గరగా గాని, మరీ దూరంగా గాని పట్టుకుంటున్నారా? చదువునపుడు వేలిని వరుస వెంబడి జార్చుతూ చదువుచున్నారా? మరియు తక్కువ కాంతిలో చదవడానికి,రాయడానికి
ఇబ్బంది పడుచున్నారా?

అవును / కాదు

9

అక్షరాలను గాని, పదాలను గాని, వాక్యాలను గాని విడిచి విడిచి చదువుచున్నారా? ఎక్కువసేపు చదవడం, రాయటం చేసినప్పుడు కళ్ళు నెప్పితో ఇబ్బంది పడుతున్నారా?

అవును / కాదు

10

నడుచునప్పుడు లేదా పరిగెత్తున్నపుడు వస్తువులను / మనుషులను తాకుతూ మరియు ఎత్తుపల్లాలను గమనించకుండా నడుస్తున్నారా?

అవును / కాదు

11

కన్ను నల్లగుడ్డుపై మచ్చలు లేదా పొరలు ఉన్నాయా?

అవును / కాదు

12

మెల్లకన్ను కలిగియున్నారా?

అవును / కాదు

13

క్రిందపడిన వస్తువులను తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారా?

అవును / కాదు

14

బొమ్మలు వేయటంలో, కత్తిరించటంలో, పజల్స్ చేయటంలో ఆటలు ఆడుటలో దృష్టి సంబంధాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారా?

అవును / కాదు

15

ఒకే వస్తువు రెండు లేదా మూడు వస్తువులుగా కనపడుచున్నట్లు బ్రాంతికి లోనౌతున్నారా?

అవును / కాదు

16

రంగులను గుర్తిచటంలో లేదా జతచేయటంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడా?

అవును / కాదు

17

మామూలు వెలుతురు నుండి తక్కువ వెలుతురులోకి వెళ్ళినప్పుడు వస్తువులను చూడటంలో ఎక్కువసేపు ఇబ్బంది పడుతున్నారా?

అవును / కాదు

6 -14 సంవత్సరాలు వయస్సు గల పిల్లల్లో బుద్ధిమాంద్యత గల పిల్లలను గుర్తించు పట్టిక

బుద్ధిమాంద్యం - Mental Retardation (MR)

1

పేరు పెట్టి పిలిచినపుడు స్పందించలేక పోతున్నారా?

అవును / కాదు

2

వయసుకు తగినంత మానసిక పరిపక్వత ఉన్నదా? మరియు
తక్కువ జ్ఞాపకశక్తి కలిగివున్నారా?

అవును / కాదు

3

స్నానంచేయడం, తల దువ్వుకోవడం, బట్టలు వేసుకోవడం లాంటి చిన్నచిన్న పనులు కూడా స్వయంగా చేసుకోలేక పోతున్నారా?

అవును / కాదు

4

సమ వయస్కులతో పోల్చి చూస్తే ఎక్కువ విషయాలలో గానీ / పనులలో గానీ  చురుకుగా పాల్గొనలేక పోతున్నారా?

అవును / కాదు

5

నేర్చుకున్న విషయాలను త్వరగా మర్చిపోతున్నారా? పదేపదే  చెప్పవలసి వస్తోందా? లేదా చేసిన పనినే తరచూ చేస్తున్నారా?

అవును / కాదు

6

అభ్యసనలో తోటి పిల్లలతో పోల్చినపుడు ఏదైనా నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకొంటున్నారా?

అవును / కాదు

7

కొద్ద సమయము కంటే ఎక్కువసేపు తాను చేసే పనిలో ఏకాగ్రత చూపలేక పోతున్నారా?

అవును / కాదు

8

శారీరక, మానసిక అభివృధ్ధి లోపించినట్లు ఉందా?

అవును / కాదు

9

తరగతి కృత్యాలలో శ్రద్ధగా పాల్గొనలేక పోతున్నారా?

అవును / కాదు

10

నోటివెంట తరచుగా చొంగ కారుచున్నదా?

అవును / కాదు

11

శరీరము, తల, కళ్ళు, పెదాలు అసాధారణ నిర్మాణము కలిగియున్నారా?

అవును / కాదు

12

బొంగురు గొంతు లేదా గరగర శబ్ధం వచ్చే విధంగానూ లేదా మధ్యలో శబ్దం లేకుండా వచ్చేమాటలు మాట్లాడుచున్నారా?

అవును / కాదు

13

ఆగ్రహ, ఆవేశ పూరిత ప్రవరన కలిగి ద్వంశపూరిత లక్షణం కలిగి ఉన్నారా?

అవును / కాదు

పైన పేర్కొన్న ప్రశ్నలలో ఏవైనా 4 లేక 5 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే వారిని బుద్ధిమాంద్యత గల పిల్లలుగా గుర్తించి పాఠశాల స్థాయిలో నమోదు పత్రం నందు MR అని ఉన్నచోట/ స్థానంలో వారిని నమోదు చేయాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate