యువ పరిశోధన ప్రోత్సాహ యోజన (KVPY)
లక్ష్యాలు
పరిశోధక యోగ్యత కలిగిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించటం మరియు ప్రోత్సహించటం. అలాగే మూల శాస్త్రాల, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్, విద్యార్ధులను ఈ విషయాలలో పరిశోధనను ఉపాదిగా చేపట్టేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఆర్ధిక సహాయం
మూల శాస్త్రాలు |
నెలసరి సహాయం |
వార్షిక కాంటిన్జెన్సీ గ్రాంట్ |
SA / SX /SB - B.Sc./B.S./B.Stat./B.Math / ఇంటిగ్రేటెడ్ M.Sc. /M.S – 1నుంచి 3 సంవత్సరాల సమయంలో. |
రూ.5000 |
రూ. 20000 |
SA/SX/SB - MSc సమయంలో/ ఇంటిగ్రేటెడ్ MSc. 4 నుంచి 5 సంవత్సరాల సమయంలో. |
రూ. 7000 |
రూ. 28000 |
క్లాసులు కలుపుకొని
11వ తరగతి చదవటానికి మరియు పైచదువులకు (ప్రీ PhD వరకు. B.Sc./ఇంటిగ్రేటెడు M.Sc మరియు BE/B.tech/B.Arch./MBBS మొదటి/రెండవ సంవత్సరం అభ్యసించటానికి).
ఎంపిక విధానం
మూల శాస్త్రాలు (SA, SX మరియు SB):
- ఆప్టిట్యూడ్ పరిక్ష (వ్రాత; బహుళ ఐచ్చిక ప్రశ్నలు)
- ఇంటర్వ్యూ (ఎంపికైన అభ్యర్థులకు)
SP మూల శాస్త్రాలు:
- ఒక గురువు/ సంబంధిత రంగంలో ప్రొఫెషనల్ పర్యవేక్షణలో (దీని కోసం ప్రత్యేకంగా అభ్యర్థి ఎంపిక చేసిన మరియు అమలు చేసిన) ప్రాజెక్టు నివేదిక
- ఎంచుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూ
అర్హత
స్ట్రీమ్ SA (మూల శాస్త్రాలు):
- 10 వ తరగతి బోర్డ్ పరీక్షలో గణితం మరియు సైన్స్ విషయాలలో కనీసం75% మార్కులు తెచ్చుకొని 11వ తరగతి (సైన్స్ విభాగం) లో చేరిన విద్యార్థులు.
స్ట్రీమ్ SB +2 (మూల శాస్త్రాలు):
- 12వ తరగతి చుతువుతున్న విద్యార్థులు ఎవరైతే 10 వ తరగతి బోర్డ్ పరీక్షలో గణితం మరియు సైన్స్ విషయాలలో కనీసం75% మార్కులు తెచ్చుకుని తదుపరి సెషన్ కోసం మూల శాస్త్రాలు (B.Sc/ఇంటిగ్రేటెడు M.Sc) లో అండర్ గ్రాడ్యుయేటు ప్రోగ్రామ్ చేరాలనుకుంటున్నవారు.
స్ట్రీమ్ SP (మూల శాస్త్రాలు):
- 11,12వ తరగతి లేదా అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ (మొదటి లేదా రెండో సంవత్సరం)లో మూల శాస్త్రాలు అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ఎవరికైతే వరుసగా 10 మరియు 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో సగటు 60% మార్కులు వచ్చాయో .
ముఖ్యమైనవి
- ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థుల అర్హత మార్కులలో 10% సడలింపు ఉంది.
- అభ్యర్థి 60%/ మార్కులు మరియు వార్షిక వేసవి కార్యక్రమాలలో సంతృప్తికరమైన పనితీరు పై ఆధారపడి పడిఫెలోషిప్పుల పునరుద్ధరణ ఉంటుంది.
ఫెలోషిప్పు కొనసాగింపు
ఫెలోషిప్ల పునరుద్ధరణ ప్రతి సంవత్సరం అభ్యర్థి తనకు సంబంధిచిన విషయంలో మంచి విద్యా ప్రదర్శన (మొదటి శ్రేణి లేదా సమిష్టిగా 60% మార్కులు) మరియు వార్షిక వేసవి కార్యక్రమాలలో సంతృప్తికరమైన పనితీరు పై ఆధార పడి ఉంటుంది. ఏ దశలో అయినా ఎంపిక చేసుకున్న విషయాన్ని (మూల శాస్త్రాలు లేదా వైద్యం) నిలిపివేస్తే KVPY తక్షణమే ఫెలోషిప్ మరియు కాంటిన్జెన్సీ గ్రాంట్ వదులుకోవాల్సి ఉంటుందని గమనించండి. స్ట్రీమ్ SA కింద ఎంపికైన విద్యార్థులకు ఫెలోషిప్ 12వ తరగతి (+2) తర్వాత కూడా ఉంటుంది కాని వారు బేసిక్ సైన్స్ (బీఎస్సీ /B.S. / Int. M.Sc)లో ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ లో చేయాలి.
మూలం: యువ పరిశోధన ప్రోత్సాహ యోజనపూర్తి సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.