1 | మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? |
జవాబు: | హాజరు పెంచడంతోపాటు, పౌష్టికాహారాన్ని అందించడం |
2 | 'సాక్షర భారత్' అనేది- |
జవాబు | వయోజన విద్యా కార్యక్రమం |
3 | 'బడిబాట' కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? |
జవాబు | 6 - 8 ఏళ్ల బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం |
4 | విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? |
జవాబు | విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి |
5 | విద్యాకమిటీలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? |
జవాబు | పాఠశాల నిర్వహణ |
6 | సార్వజనీన ప్రాథమిక విద్యా సాధనకు మార్గం |
జవాబు | పాఠశాలలను అందుబాటులో ఉంచడం, సార్వత్రిక నమోదు, నమోదైన పిల్లల కొనసాగింపు |
7 | ప్రాథమిక స్థాయిలో పిల్లల గైర్హాజరుకు కారణం |
జవాబు | చదువుకు నిత్యజీవితానికి సంబంధం లేకపోవడం |
8 | ప్రాథమిక పాఠశాలలో అవలంభిస్తున్న బోధనాపద్ధతి ఏది? |
జవాబు | కృత్యాధార పద్ధతి |
9 | విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఉపాధ్యాయుడి విధి |
జవాబు | సామర్థ్యాల ఆధారంగా బోధన |
10 | విద్యతోపాటు వృత్తిపరమైన శిక్షణను అందించే విద్యా కార్యక్రమం |
జవాబు | ఎన్‌సీఎల్‌పీ |
11 | స్త్రీ, పురుష అక్షరాస్యత మధ్య తేడా జాతీయ వ్యత్యాసం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బాలికల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలేవి? |
జవాబు | కేజీబీవీ |
12 | జిల్లా సాక్షరతా సమితి విద్యా కార్యక్రమంలో నియో లిటరేట్స్‌కు పరీక్షలు నిర్వహించేది |
జవాబు | ఎన్.ఐ.ఒ.ఎస్ |
13 | ఆంధ్రప్రదేశ్‌లో ఎస్.ఎస్.సి.కి సమానంగా దూరవిద్యా విధానం ద్వారా విద్యనందిస్తున్న సంస్థ ఏది? |
జవాబు | ఎ.పి.ఒ.ఎస్.ఎస్. |
14 | సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు వ్యవస్థీకరించిన, ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమం ఏది? |
జవాబు | ఎస్.ఎస్.సి |
15 | ప్రాథమిక విద్యాభివృద్ధికి పాఠశాలల్లో వసతులను పెంపొందించడానికి అమలు చేసిన విద్యా కార్యక్రమం |
జవాబు | నల్లబల్ల పథకం |
16 | ప్రాథమిక విద్య తరగతి గది నిర్వహణలో వినూత్న మార్పుల కోసం అమలు చేసిన విద్యా కార్యక్రమం ఏది? |
జవాబు | ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం |
17 | 'అందరూ చదవాలి - అందరూ ఎదగాలి' ఏ పథకం నినాదం? |
జవాబు | సర్వ శిక్షా అభియాన్ |
18 | బాలల హక్కులు |
జవాబు | జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు |
వ్యాసం: వందనం మద్దు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020