అందరికీ విద్య
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఏప్రిల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
73వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్ సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం నిర్దేశింపబడినది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచన కొరకు ఉద్దేశించిన పథకాల అమలులో స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయగలుగుతాయి.
- రాజ్యాంగ అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
- భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను బదిలీ చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
పంచాయితీ విద్యా ఉపకమిటీ ఏర్పాటు
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు / తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఉపకమిటీ విధులు :
- గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
- పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
- పిల్లల విద్యా ప్రమాణాలు
- పాఠశాల మౌళిక సదుపాయాలు
- మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.
సమావేశాల నిర్వహణ
ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొంటారు.
చర్చించే అంశాలు :
- ఉపాధ్యాయుల హాజరు
- పిల్లల నమోదు మరియు గైర్హాజరు
- మధ్యలో బడిమానిన పిల్లల వివరాలు మరియు కారణాలు
- పాఠశాలకు అవసరమగు స్వల్ప మరమ్మత్తులు
పై అంశాలకు సంబంధించిన గ్రామ పంచాయితీ అందించే సహాయం తదితర విషయాలను ఉపకమిటీ చర్చిస్తుంది.
అలాగే ఈ దిగువ తెలిపిన విషయాలను కూడా తనిఖీ చేసే అథారిటీని కలిగి ఉంటుంది.
- ఉపాధ్యాయులు బడి వేళలు పాటించేలా చూడటం
- పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరు పర్యవేక్షించడం.
- మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకోవడం.
- పాఠ్యపుస్తకాల సరఫరాలను పరిశీలించడం.
- పాఠశాల ఫర్నీచర్, లైబ్రరీ పుస్తకాలు, ప్రయోగశాలలు ఎక్విప్ మెంట్ సరిగా ఉన్నదీ లేనిదీ సరిచూసి నివేదికలను ఉన్నతాధాకారుల దృష్టికి తీసుకెళ్ళడం.
- ఉన్నత పాఠశాలలైతే అందులో చడివే 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతుల నిర్వహణకు అవసరమైన లైటింగ్, అల్పాహారం తదితర ఏర్పాట్లను గ్రామ పంచాయితీ సహకారంతో సమకూర్చడం.
ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం – 2009
6 నుండి 14 సం|| ల గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి పార్లమెంట్ చేసిన విద్యాహక్కు చట్టం 2009 ఆగష్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొంది, ఏప్రిల్ ఒకటి 2010 నుండి భారత దేశమంతటా అమలులోనికి వచ్చింది. దీనినే Right to Education Act అని కూడా అంటారు.
RTE – 2009 చట్టంలోని ముఖ్యాంశాలు :
- 6 నుండి 14 సం|| ల గల పిల్లలందరు పరిసర ప్రాంత పాఠశాలల్లో ఎలిమెంటరీ అనగా 1 నుండి 8 తరగతుల విద్య పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలిగి ఉంటారు
- పాఠశాలల ఏర్పాటు, పాఠశాల భవనము, బోధనా సిబ్బంది, బోధనా పరికరాలతో సహా మౌళిక సదుపాయాలను కల్పించడానికి సంబంధిత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
- ప్రతి ఒక్క బాలుడు లేదా బాలిక బడిలో చేరి, సక్రమంగా హాజరవుతూ, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేలా చూసే బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.
- ఈ చట్టం ప్రకారం తమ బిడ్డ లేదా సంరక్షణలో ఉన్న బాలుడు / బాలికను పరిసర ప్రాంతంలోని పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ప్రతి తల్లి/ తండ్రి లేదా సంరక్షకులపై ఉంటుంది.
- ఎయిడెడ్ పాఠశాలలు, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ బడిలో చేర్చుకున్న పిల్లల్లో కనీసం 25 శాతానికి తగ్గకుండా 1వ తరగతిలో పేద పిల్లలను చేర్చుకొని ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచితంగా విద్యనందించాలి. ఇందుకయ్యే ఖర్చును ఆన్ ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- బడిలో పిల్లల ప్రవేశానికి పరీక్ష మరియు క్యాపిటేషన్ రుసుమి ఉండదు. అంతేకాక వయస్సు నిర్ధారణ చేయలేదన్న కారణంగా ఏ బాలుడు / బాలికకు బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. ఒక వేళ క్యాపిటేషన్ ఫీజును వసూలు చేస్తే దానికి 10 రెట్ల జరీమానాతో పాటు శిక్ష కూడా విధిస్తారు.
- పాఠశాలలలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్ళీ కొనసాగించడం లేదా బడి నుండి తీసివేయడం నిషేధం
- పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం, ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.
- సంబంధిత అధీకృత సంస్థ నుండి గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించరాదు. ఈ చట్టం ప్రకారం నియామాలు, ప్రామాణికాలు పూర్తి చేసే వరకు బడికి సంబంధిత అధీకృత సంస్థ గుర్తింపు ధృవీకరణ పత్రం జారీ చేయరాదు. ఒక వేళ ఇప్పటికే నడుస్తున్న పాఠశాలల్లో ప్రమాణాలు సరిగా లేకుంటే చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయాలి. ఇలా సరైన ప్రామాణీకాలు, నియమాలు ప్రకారం లేకుంటే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.
- గుర్తింపు రద్దు అయిన తరువాత కూడా ఏ వ్యక్తి అయినా పాఠశాలను నడిపిస్తే లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఉల్లంఘన ఇంకా కొనసాగితే తరువాత రోజులకు రోజుకు పదివేల చొప్పున జరిమానా విధిస్తారు.
- ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహాయించి అన్ని పాఠశాలల్లో స్ధానిక ప్రభుత్వానికి ఎంపికైన ప్రజాప్రతినిధులతో, ఆ పాఠశాలలో చదువుచున్న పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఉపాధ్యాయులతో పాఠశాల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
- పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాలల పనితీరును సమీక్షిస్తుంది. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి సిఫారుసు చేయడం, నిధులు వినియోగాన్ని పర్యవేక్షించడం లాంటి విధులను నిర్వర్తిస్తుంది.
- నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తారు.
- ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, సకాలంలో పాఠ్యాంశాలు బోధించడం, పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైతే అదనపు బోధన నిర్వహించడం, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం, పిల్లల ప్రగతి గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం లాంటి విధులను నిర్వహించాలి. ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనా పనులను చేపట్టకూడదు.
- జనాభాగణన, వైపరీత్య సహాయ విధులు, ఎన్నికలకు సంబంధించిన విధులను మినహాయించి, టీచర్లను విద్యేతర పనులకు పంపకూడదు.
- పిల్లల సర్వతోముఖాఖివృద్ధి జరిగేలా, పిల్లల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందేలా, శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందేలా పాఠ్యప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకనం ఉండాలి. ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు పిల్లలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు.
- ఈ చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులు బోధించడానికి 60 మంది పిల్లల వరకు ఇద్దరు, 61 నుంది 90 వరకు ముగ్గురు, 91 నుండి 120 వరకు నల్గురు, 121 నుండి 200 వరకు 5 గురు ఉపాధ్యాయులు ఉండాలి. 150 కంటే ఎక్కువ పిల్లలున్న పాఠశాలల్లో 5 గురు ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండాలి. 200 మంది కంటే ఎక్కువ పిల్లలున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు 1;40 మించకుండా ఉపాధ్యాయులను నియమించాలి.
- 6 నుండి 8 వ తరగతి వరకు బోధించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అందులో సైన్సు మరియు లెక్కలకు ఒక ఉపాధ్యాయుడు, సాంఘికశాస్త్రానికి ఒక ఉపాధ్యాయుడు, భాషను బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తరగతిలో పిల్లల సంఖ్య 35 కు మించితే అదనంగా ఒక ఉపాధ్యాయున్ని ఇవ్వడం జరుగుతుంది.
- 6 నుండి 8 వ తరగతిలో చేర్చుకున్న పిల్లల సంఖ్య 100 కు మించి ఉంటే, పూర్తి కాల ప్రధానోపాధ్యాయులు మరియు చిత్రకళ, ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్యలు బోధించడానికి తాత్కాలిక బోధకులను నియమించాలి.
- అన్ని పాఠశాలల్లో ప్రతి టీచరుకు ఒక తరగతి గది, ప్రధానోపాధ్యాయుల గది, వంటగది, మంచినీటి సౌకర్యం, బాల బాలికలకు వేరువేరుగ మరుగుదొడ్లు, ఆటస్థలం, ప్రహారీగోడ లేదా కంచె, గ్రంథాలయం లాంటి సౌకర్యాలు మరియు బోధనా పరికరాలు, క్రీడాసామాగ్రి ఉండాలి.
చదువుకోవడం పిల్లల హక్కు, పిల్లలందర్నీ బడిలో చేర్చి చదివించే బాధ్యత మనందరిది. పిల్లలు చదువుకునే హక్కును కోల్పోతే చట్ట ప్రకారంగా న్యాయాన్ని కోరవచ్చు. అలాగే పాఠశాలలన్నింటికి సరైన వసతి సౌకర్యాలు, భౌతిక వసతులు, బోధనా సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. బాలల భవితలో వెలుగు నింపడానికి ఈ చట్టం ఎంతో దోహదపడుతుంది. కావున విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు జరిగేలా మనవంతు చేయూత నందిద్దాం.
రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) - లక్ష్యాలు
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక స్థాయి విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది.
- ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధి.
- అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించినది.
- దీనిలో భాగంగా ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్యకొరకు కేంద్రప్రభుత్వం విద్యహక్కు బిల్లును 29 ఆగష్టు 2009 న ఆమోదించింది. దీనికి అనుగుణంగా విద్యహక్కుచట్టం 2009 ఏప్రియల్ ఒకటి 2010 నుండి జమ్ము- కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
లక్ష్యాలు :
- సార్వత్రిక విద్యా సాధనకు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరిట సర్వశిక్ష అభియాన్ ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
- బడిఈడు గల బాలలందరూ 2010 – విద్యా సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య ( 8వ తరగతి వరకు) ను పూర్తి చేసేలా కృషి చేయడం.
- ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్య పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం.
- 2010 – సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య స్ధాయిలో, బాలురు, బాలికలు మధ్య వివక్షతను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.
- 2010 – విద్య సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) లో అమలుతున్న కార్యక్రమాలు
1 . పాఠశాలలు అందుబాటు:
ప్రాథమిక పాఠశాలలు :
- ఆవాస ప్రాంతంములో 5 నుండి 10సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు కనీసం 25 మంది ఉండి 200 పైగా జనాభా కలిగి 1 కి.మీ పరిధిలో నైబర్ హుడ్ పాఠశాల లేనట్లయితే నూతన పాఠశాల ఏర్పాటు చేయడం.
ప్రాథమికోన్నత పాఠశాల :
- ఆవాస ప్రాంతంములో 5వ తరగతి ఉత్తీర్ణులయ్యే కనీసం 25 మంది ఉండి 3 కి.మీ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ( 1 నుండి 8వ తరగతి) లేనట్లయితే ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయడం
2 . ఉపాధ్యాయులు :
- ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాథమికోన్నత తరగతులలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించుకొనే సౌకర్యం ఉంది.
| తరగతులు | నమోదైన విద్యార్ధుల సంఖ్య | అవసరమైన ఉపాధ్యాయులు సంఖ్య |
1
|
నుండి 5 వరకు
|
60 వరకు
61- 90 వరకు
91 - 120 వరకు
121 -200 వరకు
150 మంది కంటే ఎక్కువ విద్యార్ధుల ఉంటే
200 మంది కంటే ఎక్కువ
|
2
3
5
5 గురు+ 1ప్ర..ఉ
1:40 (ప్రధానోపాధ్యాయులు మినహా)
|
6
|
నుండి 8 వరకు (ప్రాథమికోన్నత తరగతులు)
|
- కనీసం ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు అంటే
- . సామాన్యశాస్త్రము / గణితం
- . సాంఘికశాస్త్రము
- . భాషోపాధ్యాయులు
II . ప్రతి 35 మంది విద్యార్ధులకు అదనంగా ఉపాధ్యాయులు.
III . నమోదు విద్యార్ధుల సంఖ్య 100 కంటే ఎక్కువ ఉంటే
- పూర్తి కాలం పనిచేసే ప్రధానోపాధ్యాయులు
- పార్ట్ టైమ్ విద్యావాలంటీర్లు
ఎ) కళావిద్య
బి) ఆరోగ్య మరియు శారీరక విద్య
సి) పని అనుభవం
|
ఒకరు
ఒకరు
ఒకరు
ఒకరు
ఒకరు
ఒకరు
ఒకరు
|
3 . అదనపు తరగతి గదులు :
ప్రాథమిక పాఠశాలలు :
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం వరండాతో కూడిన రెండు గదులతో పాటు ప్రధానోపాధ్యాయుని గది / కార్యాలయం / స్టోర్ రూము ఉండాలి.
- ఏదైనా పాఠశాలలో తరగతి గదులలో పాటు అదనంగా ఉన్న గదులలో ఒక దానిని ప్రధానోపాధ్యాయుని గది / కార్యాలయం / స్టోర్ రూముగా పరిగణించబడును.
- ఉపాధ్యాయుల సంఖ్య పెరిగిన కొలది ఉపాధ్యాయుల పోస్టులకు సమానమైన తరగతి గదులు ఉండును. ప్రధానోపాధ్యాయుని గది అదనం
4 . మరుగుదొడ్లు:
- బాల బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల సదుపాయం ఏర్పాటు చేయడం.
5 . త్రాగునీటి సౌకర్యం:
- ప్రతి పాఠశాలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటుకు కృషి చేయడం.
6 . విద్యుత్తు సౌకర్యం:
- ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యుత్తు సౌకర్యము కల్పించబడినది.
7 . పాఠశాల భవనాల నిర్వహణ మరియు స్వల్ప మరమ్మత్తులు:
- 3 గదుల వరకు గల పాఠశాలకు రూ|| 5000/- లు 4 గదులు మరియు అంతకంటే ఎక్కువ గదులు గల పాఠశాలకు రూ|| 10000/- లు ప్రతి సం|| అందజేయబడును.
8 . భారీ మరమ్మత్తులు:
- భారీ మరమ్మత్తులు క్రింద కనీసం 10 సంవత్సరాలు పై బడిన నిర్మాణము జరిగిన భవనములకు ప్రతి సంవత్సరము 5 శాతము పాఠశాలలకు అవసరమైన నిధులు మంజూరు చేయబడతాయి.
9 . పాఠశాల గ్రాంటు :
- పాఠశాల అవసరాల కొరకు ప్రతి ప్రాధమిక పాఠశాలకు రూ|| 5000/- మరియు ప్రాథమికకోన్నత పాఠశాలకు – ప్రాధమిక మరియు ప్రాథమికకోన్నత తరగతులు కలిపి రూ|| 5000/- మరియు రూ|| 7000/- మొత్తం రూ|| 12000/- స్కూలు గ్రాంటు అందజేయబడును.
10 . నూతన ప్రాథమిక / ప్రాథమికకోన్నత పాఠశాలకు బోధనాభ్యసన పరికరాల గ్రాంటు (టి.ఎల్.ఇ):
- నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతి ప్రాధమిక పాఠశాలకు రూ|| 20000/- లు మరియు ప్రాథమికోన్నత పాఠశాలకు రూ|| 20000/- రూ|| 50000/- చొప్పున టి.ఎల్.ఇ కొనుగోలు నిధులు ఇవ్వబడును. ప్రస్తుతం 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ, తరగతి ప్రవేశపెట్టినట్లయితే ఆదనంగా రూ|| 15000/- మంజూరు చేయబడతాయి.
. ఉపాధ్యాయ గ్రాంటు :
- ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి రూ|| 500/- చొప్పున ఉపాధ్యాయ గ్రాంటు ఇవ్వబడును.
12 . ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు :
- సంవత్సరములో 20 రోజులు (10 రోజులు మండల స్ధాయి, 10 రోజులు పాఠశాల కాంప్లెక్స్ స్ధాయి ) ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు, 30 రోజులు నూతనంగా నియమించబడిన శిక్షితులైన ఉపాధ్యాయులకు, 60 రోజులు ఇంతవరకు శిక్షణ పొందని (అన్ ట్రైయిన్ డ్) ఉపాధ్యాయులకు శిక్షణ నిచ్చే సౌకర్యం కలదు. మండల స్ధాయిలో శిక్షణకై రోజుకు ఉపాధ్యాయునికి రూ|| 100/- చొప్పున, పాఠశాల కాంప్లెక్స్ స్ధాయిలో రోజుకు రూ|| 50/- చొప్పున ఇవ్వబడును.
13 . సమాజ సభ్యులకు శిక్షణా కార్యక్రమం :
- ప్రతి సం|| ఒక్కొక్క పాఠశాల నుండి ఆరుగురికి, ఒక్కొక్క గ్రామ పంచాయితీ లేదా వార్డు నుండి నలుగురికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మూడు రోజులు రెసిడెన్షియల్ పద్ధతిలో, మరో మూడు రోజులు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది .
- రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే శిక్షణకు రోజుకు ఒక్కొక్క సభ్యునికి రూ|| 100/- చొప్పున, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే శిక్షణకు రోజుకు రూ|| 50/- ఖర్చు చేయబడును.
14 . ప్రత్యేక అవసరాలు గల పిల్లలు :
- సంవత్సరములో ప్రత్యేక అవసరాలు గల ప్రతి విద్యార్ధికి కావలసిన సౌకర్యాలు కల్పించడానికి రూ|| 3000/- ల సౌకర్యం కలదు.
- ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి, తీవ్ర, అతితీవ్ర వైకల్యం గల పిల్లలకు రిసోర్స్ టీచర్ల ద్వారా ఇంటి వద్దనే విద్య అందించడం జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో పాఠశాలలో చేర్పించుటకు అవకాశం గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించటం, వారిని కొనసాగించుటకు పిల్లలకు అవసరమైన బోధనోపకరణముల సరఫరా చేయడం అవసరమైన పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించడంలో సహాయం అందించడం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు శిక్షణ పొందిన రిసోర్స్ ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది.
15 . విన్నూత కార్యక్రమాలు :
- ఎస్. సి/ ఎస్.టి పిల్లల విద్య, బాలికల విద్య, పూర్వ ప్రాథమిక విద్య, మైనారిటీ పిల్లల విద్య, పట్టణ అణుగారిన పిల్లల విద్య మరియు కంప్యూటర్ విద్యలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం.
16 . మండల రిసోర్స్ కేంద్రాలు, పాఠశాల సముదాయ గ్రాంటు:
- మండల రిసోర్స్ కేంద్రానికి రూ 90,000/ లు మరియు స్కూల్ కాంప్లెక్స్ కు రూ 25,000/- విడుదల చేయబడును.
- అలాగే సమావేశాలు, ప్రయాణభత్యాలు క్రింద నెలకు రూ2,500/ - మరియు 1,000/ - చొప్పున 12 నెలలకు విడుదల చేయబడును
17 . బడిబయట పిల్లలకు విద్యావకాశాలు :
- బడిబయట పిల్లలను వయస్సుకు తగిన తరగతిలో నమోదు చేయించుటకు వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు ఆర్.ఎస్.టి.సి, ఎన్.ఆర్. ఎస్.టి.సి, వర్క్ సైటు పాఠశాలలు, సీజనల్ హస్టల్స్ మొదలగునవి ఏర్పాటు చేయాలి.
- ఆనాధ పిల్లలు, వీధిబాలలు, బాలకార్మికుల వివరాలను హెల్ప్ లైను ద్వారా సేకరించి (ట్రాన్సిట్ హామ్) లలో చేర్పించి విద్యను అందించడం.
18 . ఎలిమెంటరీ స్ధాయి జాతీయ బాలికల విద్య కార్యక్రమం (ఎన్.పి.ఇ.జి.ఇ.ఎల్):
- ఈ కార్యక్రమం క్రింద ప్రతి మోడల్ క్లస్టర్ పాఠశాలకు రెండు విధాలైన గ్రాంట్లు విడుదల చేయబడును.
- నాన్ రికరింగ్ గ్రాంటు : ఈ గ్రాంటు క్రింద ప్రతి మోడల్ క్లస్టర్ పాఠశాలకు రూ 30,000/ - దిగువ విధముగా వినియోగించుటకు
ఎ) లైబ్రరీ పుస్తకాల కొనుగోలుకు రూ 10,000/ -
బి) వృత్తి విద్యా నిర్వహణకు కావాలసిన ఎక్విప్ మెంట్ కొరకు రూ 10,000/ -
సి) ఆటలు మరియు క్రీడల సామాగ్రి కొనుగోలుకు రూ 10,000/ -
- రికరింగ్ గ్రాంటు రూ 62,700/ - దిగువ విధముగా విడుదల చేయబడును
1
|
పాఠశాల నిర్వహణ, వృత్తి విద్యా కార్యక్రమాలు మేళాలు మొదలగునవి వాటి నిర్వహణకు -
|
రూ 27,000/-
|
2
|
ఉత్తమ పాఠశాలలకు అవార్డులు
|
రూ 5,000/-
|
3
|
బాలికా సాధికారితా కార్యక్రమాల కొరకు
|
రూ 22,000/-
|
4
|
పూర్వ ప్రాథమిక పాఠశాలలు / పాఠశాలల సంసిద్ధతా కార్యక్రమాల కొరకు
|
రూ 5,000/-
|
5
|
సామాజిక చైతన్య కార్యక్రమాల నిర్వహణ కొరకు
|
రూ 3,700/-
|
మొత్తం
|
|
రూ 62,700/-
|
19 . కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు (కె.జి.బి.వి):
ఈ పాఠశాలలు విద్యాపరంగా వెనుకబడిన బ్లాకులు (మండలాలు) బడిబయట బాలికల కోసం ఏర్పాటు చేయబడినవి.
మెడల్ | రకం | నాన్ – రికరింగ్ | నాన్ రికరింగ్ బిల్డింగ్ గ్రాంటు మినహా |
1
|
పాఠశాల మరియు హస్టల్ భవనంతో కలిపి 100మంది బాలికలు
|
రూ 32.07ల
|
రూ రూ 9.95లక్షలు
|
2
|
పాఠశాల మరియు హస్టల్ భవనంతో కలిపి 50మంది బాలికలకు
|
రూ 23.95ల
|
రూ 8.08 లక్షలు
|
3
|
ఇది వరకే హాస్టల్స్ కల్గి ఉన్న పాఠశాలల్లోని 100 బాలికలకు
|
రూ 17.950
|
రూ 8.05 లక్షలు
|
4
|
ఇది వరకే ఏర్పాటు చేయబడి ఉన్న హాస్టళ్ళ సామర్ద్యాన్ని పెంచడానికి
|
రూ 17,050/ - ప్రతి బాలికలకు ప్రతి సంరానికి
|
రూ 8050/ - ప్రతి బాలికకు
|
20 . యూనిఫామ్స్ :
- 1 నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలందరికి, ఎస్.సి/ ఎస్.టి బాలలందరికి మరియు దారిద్రరేఖ దిగువనున్న బి.సి/ఓ.సి బాలికలందరికి, యూనిఫామ్ లు కొనుగోలు కొరకు సంవత్సరానికి రూ.400 / - లు చెల్లించబడును.
21 . రవాణా సౌకర్యం :
- . పాఠశాలలు ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రాంతాలలో మరియు జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఉండే వారికి, రవాణా సౌకర్యం కల్పించడం.
- . పట్టణ మురికి వాడల్లోని పిల్లలకు, అనాధ వీధి బాలల కోసం పాఠశాల ఏర్పాటు చేయడానికి స్థల వసతి లేని ప్రాంతాల్లో ఉండే పిల్లల కొరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం.
22 . రెసిడెన్షియల్ పాఠశాలలు :
- జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు, కొండ ప్రాంతాలు దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉండే పిల్లలకు మరియు పట్టణ మురికి పిల్లలకు, అనాథ పిల్లలు మరియు వీధి బాలల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం.
పాఠశాలలు అందుబాటు
ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరికి విద్యనందించటానికి పాఠశాలలను అందుబాటులోకి తేవటం సర్వశిక్ష అభియాన్ ప్రధాన లక్ష్యం
అన్ని నివాస ప్రాంతాలలోని బాల బాలికలందరికి 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ పరిధిలో ఎలిమెంటరీ (1 – 8 తరగతులు) పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పాఠశాల ఏర్పాటు చేయటానికి వీలుకాని ఆవాస ప్రాంతాల పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించటం. అది వీలుకాని పరిస్థితుల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
బడిఈడు పిల్లల నమోదు మరియు నిలకడ
సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే బాల బాలికలందరూ విధిగా చదువుకొని తీరాలి. అందుకు పాఠశాలే సరియైన చోటు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, మధ్యలో బడిమానివేయకుండా కనీసం 8 వ తరగతి పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం బాధ్యత వహించాలి.
నూరుశాతం నమోదు మరియు నిలకడ సాధించాలంటే సమాజ సహకారం ఎంతైనా అవసరం. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్వచ్చంధ సేవా సంస్థలు ప్రజాప్రతినిధులు బడి మనదే... పిల్లలూ మన వారే అనే భావనతో పనిచేయాలి. విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం 6 – 14 సం పిల్లలందరూ బడిలో చేరి, ప్రతిరోజు హాజరవుతూ ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరి పైన ఉంది.
6 – 14 సం వయస్సు గల పిల్లలందరిని పాఠశాలలో చేర్పించి, నిలుపుదల సాధించటానికి ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఉంది.
గుణాత్మక విద్య సాధించాలంటే.....?
పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాల బాలికందరికి అన్ని విషయాలలో ఆశించిన సామర్థ్యాలు సాధించడం ద్వారా గుణాత్మక విద్యను అందించటం సర్వ శిక్షా అభియాన్ లక్ష్యం.
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం బాలల సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే సాధ్యమైనంత వరకు బోధనామాధ్యమం బాలల మాతృభాషగా ఉండాలి.
- బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులను పెంపొందే బోధన జరగాలి.
- పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన బోధనా పద్ధతుల్లో కార్యక్రమాలు, పరిశోధనలు, కనుగొనటం ద్వారా నేర్చుకొవాలి.
- భయాలు, ఆందోళనల వంటి వాటి నుంచి బాలలను విముక్తి చేసి వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించటంలో సహాయపడాలి.
- జ్ఞానాన్ని బాలలు అర్ధం చేసుకున్న విధానం, దానిని అన్వయించే సామర్థ్యాలపై నిరంతర సమగ్రమూల్యాంకన జరగాలి.
- ప్రస్తుత పాఠశాలల్లో అమలవుతున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమం (లైపు) ద్వారా విద్యార్ధి, తరగతి మరియు పాఠశాల వారీగా గ్రేడింగ్ నిర్ణయించి విద్యార్ధుల అభివృద్ధికై కృషి జరగాలి. పాఠశాలలో 1,2, 3 తరగతి పిల్లల కొరకు స్నేహ బాల కార్డులు ద్వారా బోధన జరగాలి. విద్యాబోధనలో నిరంతరం కొత్తదనాన్ని చూపిస్తూ..... పిల్లల జ్ఞాన సమపార్జనే లక్ష్యంగా ముందు కెళితే గుణాత్మకతను సాధించవచ్చును.
పాఠశాలలకు అందజేసే వివిధ గ్రాంట్లు – నిధుల వినియోగం – మార్గదర్శకాలు
తరగతి గదిలో బోధనాభ్యాసన ప్రక్రియలు సరిగా జరగాలంటే అందుకు సరియైన వాతావారణం అనగా మంచి తరగతి గది, బోధనాభ్యాసన సామాగ్రి వస్తు సామాగ్రి మొదలైనవి అవసరం. ఇందుకోసం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వివిధ రకాల గ్రాంట్లు ఆయా జిల్లాల కార్యాలయం ద్వారా అందజేయబడుచున్నవి.
1. ఉపాధ్యాయ గ్రాంటు ( Teacher Grant)
ఈ గ్రాంటు కింద అన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత (అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప) పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి ఆర్ధిక సంవత్సరానికి రూ 500/- వంతున విడుదల చేయబడతాయి. ఉన్నత పాఠశాలల్లో అయితే 6, 7, 8 తరగతులు బోధించు సబ్జెక్టు ఉపాధ్యాయులకు విడుదల చేస్తారు ఈ గ్రాంటును ఉపాధ్యాయుడు గుణాత్మక విద్యను అందజేసే క్రమంలో భాగంగా అవసరమైన బోధనాభ్యాసన సామాగ్రి కొనుగోలు చేయుటకు వినియోగించవచ్చు.
1, 2 తరగతులు బోధించు ఉపాధ్యాయులు కొనవలసినవి
1
|
|
తెలుగు మరియు ఆంగ్ల వర్ణమాల చార్టులు, అంకెల చార్టులు |
|
200.00
|
|
2
|
|
అక్షరాలు కార్డులు (ఫ్లాష్ కార్డులు) |
|
50.00
|
|
3
|
|
సుద్దముక్కలు (తెల్లనివి 8, రంగులవి 2) |
|
80.00
|
|
4
|
|
చార్టులు మరియు గళ్ళ పేపర్లు |
|
100.00
|
|
5
|
|
ఇతర ఖర్చులు |
|
70.00
|
|
|
|
మొత్తం
|
|
500.00
|
|
3 ,4, 5 తరగతులు బోధించు ఉపాధ్యాయులు
1
|
|
Outline maps of A.P for 3rd class/ India for 4th class / world maps for the 5th class |
|
50.00
|
|
2
|
|
Atlas |
|
50.00
|
|
3
|
|
English word / Alphabets |
|
100.00
|
|
4
|
|
Maths lab material |
|
100.00
|
|
5
|
|
Science lab material |
|
100.00
|
|
6
|
|
Chalk pieces |
|
50.00
|
|
7
|
|
Drawing sheets |
|
50.00
|
|
|
|
Total
|
|
500.00
|
|
గమనిక :
- పైన తెలిపిన సామాగ్రి ఇది వరకే ఆ పాఠశాలల్లో ఉంటే ఉపాధ్యాయుడు టి.ఎల్.ఎమ్ తయారీ కొరకు ఇతర సామాగ్రిని కొనుగోలు చేయవచ్చును.
6, 7, 8 తరగతుల ఉపాధ్యాయులు
6, 7, 8 తరగతుల సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాల బోధనకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయవచ్చును.
2. పాఠశాల గ్రాంటు (School Grant)
పాఠశాల గ్రాంటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గిరిజన, రెసిడెన్షియల్, ఎయిడెడ్ తదితర ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాధమిక పాఠశాలలకు రూ. 5000/- లు మరియు ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలకు రూ. 7000/- లు విడుదల చేస్తారు.
| ప్రాథమిక స్థాయి పాఠశాలలు 5000/- | ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలు (రూ. 7000/- లు) |
గ్రంధాలయ పుస్తకాల కొనుగోలు
|
2500.00
|
3500.00
|
రేడియో / రిపేరు/ బ్యాటరీలకు
|
300.00
|
300.00
|
అద్దం, బకెట్ గ్లాసులు, దువ్వెన, నెయిల్ కట్టర్రీ
|
200.00
|
200.00
|
పాఠశాలలో సైన్స్ పరికరాలు, కంప్యూటర్, రేడియో, టీవి లాంటి పరికరాలు మరమ్మత్తులు మరియు విడి భాగాల కొరకు (ఈ పరికరాలు ఎప్పుడు పనిచేసే స్థితిలో ఉండాలి.
|
|
400.00
|
వార్తాపత్రికలు, మ్యాగజైనులు మొదలగునవి
|
200.00
|
200.00
|
పిల్లలకు ఉపయోగపడే ఫర్నీచర్/ మ్యాట్స్ / సి.డిలు
|
400.00
|
600.00
|
పిల్లలకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు
|
500.00
|
500.00
|
సామాగ్రి భద్రపరిచే బాక్సులు
|
400.00
|
800.00
|
మొత్తం
|
5000.00
|
7000.00
|
గమనిక :
- పైన తెల్పిన వస్తు సామాగ్రిలో ఖచ్చితంగా ప్రతి సం రూ.2500/- రూ.3500/- లకు గ్రంథాలయ పుస్తకాలు గతంలో కొనుగోలు చేయకున్న కొనాలి ఇది వరకే కొనుగోలు చేసిన మార్గదర్శకాలు మేరకు కొనుగోలు చేయాలి.
- పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకు నోటుబుక్కులు పెన్నులు కొనివ్వాలి. అవసరమైతే ఇందుకోసం మరింత ఎక్కువగా కూడా ఖర్చు చేయవచ్చు.
- మిగిలిన గ్రాంటుకు పాఠశాలకు అవసరమైన సామాగ్రిని ప్రాధాన్యతను బట్టి కొనుగోలు చేయవచ్చు. పర్మినంట్ ఆర్టికల్స్ ఒకసారి కొన్నవి మరో సంవత్సరంలో కొనుగోలు చేయరాదు.
3 . పాఠశాల నిర్వహణ గ్రాంటు (School Maintanance Grant)
ఈ గ్రాంటు పాఠశాలలోని గదుల సంఖ్యను బట్టి ఇవ్వబడుతుంది. ఒక పాఠశాలలో 3 గదులు అంతకు లోపు ఉంటే గరిష్టంగా రూ.5000/- అట్లే 3 కంటే ఎక్కువ గదులు ఉంటే గరిష్టంగా రూ.10000/- విడుదల చేస్తారు.
ఈ నిధులను ముఖ్యంగా పాఠశాలలను ఆకర్షణీయంగా చేయటం కోసం ఉపయోగించాలి.
ఈ గ్రాంటును కింది అవసరాల కోసం ఖర్చు చేయవచ్చు.
వివరములు | 3 గదులు కంటే ఎక్కువ రూ.10000/- | 3 గదులు వరకు |
సున్నం వేయుటకు/ పరిశుభ్రం చేయుటకు/ బ్లాక్ బోర్డు/ రన్నింగ్ బ్లాక్ బోర్డు ఏర్పాటు లేదా పెయింట్ వేయుటకు
|
3000.00
|
1500.00
|
కరెంట్ రిపేరు చేయుటకు/ బిల్లులు చెల్లించుటకు
|
1500.00
|
750.00
|
నీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకుటర్రీ
|
1500.00
|
750.00
|
ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, ఫర్నీచరు మరియు ఇతర చిన్న చిన్న రిపేర్లు
|
1000.00
|
500.00
|
ఫెన్సింగ్, గేటు ఏర్పాటు చేయడం/ రిపేరు మొదలగునవి
|
1500.00
|
500.00
|
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణకు (ఉదా. బడిబాట, సామూహిక అక్షరాభ్యాసం, బాలల దినోత్సవం, ఆగష్టు 15, జనవరి26, మేళాల నిర్వహణ మొదలగునవి
|
1500.00
|
1000.00
|
|
10,000.00
|
5000.00
|
గమనిక :
- పై గ్రాంటును ఉపయోగించి కరెంట్ సౌకర్యం కల్పించడం అత్యంత ప్రాధాన్యతగా భావించాలి.
- పాఠశాల అవసరాలను బట్టి, పిల్లల సంఖ్యను బట్టి ఏఏ అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలో కమిటీ నిర్ణయంలతో ఖర్చు చేయాలి.
- ప్రతి పాఠశాలకు డబ్బు వచ్చిన వెంటనే లేదా గతంలో ఈ గ్రాంటును డబ్బు ఖర్చు చేయకపోయినా వెంటనే పాఠశాలలకు సున్నం వేయించి, పాఠశాల గదులలో, ఆవరణలో ఉన్న అవసరమైన మెటీరియల్ / చెత్తను తొలగించి శుభ్రంగా, ఆకర్షణీయంగా పాఠశాలను ఉంచాలి.
- ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం కంటే ముందే విధిగా సున్నం వేయించండం, అవసరమైన రిపేర్లు చేయించడం, తప్పని సరిగా చేయాలి.
4 . పాఠశాల సముదాయ గ్రాంటు (School Complex Grant)
పాఠశాల సముదాయం పరిధిలోని వివిధ పాఠశాలల్లో అమలు అవుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరు, ఎల్.ఇ.పి పురోగతి, Innovative Activities, material preparation గురించి చర్చించేందుకు మరియు సమావేశాలు, సమీక్షలు, పర్యవేక్షణ కొరకు ప్రతి పాఠశాల సముదాయానికి రూ. 25000/- మంజూరు చేస్తారు.
ఎ)
కంటిన్ జెన్సి గ్రాంటు
10,000.00
బి)
మీటింగ్, ట్రావెల్ అలవెన్సు
12,000.00
సి)
టి.ఎల్.ఎమ్ గ్రాంటు
3000.00
25,000.00
ఈ గ్రాంటును పాఠశాల సముదాయపు ప్రధానోపాధ్యాయుడు మరియు జాయింట్ సెక్రటరీల జాయింట్ అకౌంట్ కు జమచేసి వినియోగిస్తారు.
5. మండల వనరుల కేంద్ర గ్రాంటు (Mrc Grant)
మండల స్ధాయిలో నిర్వహించబడే అన్ని రకాల విద్యా సంబంధ కార్యక్రమాల నిర్వహణ, అమలు తీరు పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు, నివేదికలు రూపొందించేందుకు ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ప్రతి మండల విద్యా వనరుల కేంద్రానికి (యం.ఆర్. సి) రూ.90,000/- విడుదల చేస్తారు.
యం.ఆర్. సి గ్రాంటు వినియోగ విధానము
క్ర.సం. | గ్రాంటు | మొత్తం రూ |
1
|
కంటిన్ జెన్సి గ్రాంటు
|
50,000.00
|
2
|
మీటింగ్, ట్రావెల్ అలవెన్సు
|
30,000.00
|
3
|
టి.ఎల్.ఎమ్ గ్రాంటు
|
10,000.00
|
|
మొత్తం
|
90,000.00
|
6 . టి. ఎల్. ఇ గ్రాంటు (టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్ మెంట్ గ్రాంటు)
సర్వ శిక్షా అభియాన్ (రాజీవ్ విద్యామిషన్) కింద నూతనంగా ప్రారంబించబడిన ప్రాథమిక పాఠశాలకు రూ.20,000/- చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలుగా పదోన్నతి (అప్ గ్రేడ్) చేయబడిన పాఠశాలలకు రూ.50,000/- లు ఒకసారి మాత్రమే మంజూరు చేయబడును.
ఈ గ్రాంటును రాష్ట్ర పథక కార్యాలయపు సూచనల మేరకు పాఠశాలల ప్రయోగశాలలకు కావలసిన పరికరములు కొనుగోలు చేయవచ్చును.
పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ తీర్మానాల ద్వారా ఈ కొనుగోళ్లు జరపాలి.
గమనిక : పైన వివరించిన వివిధ గ్రాంట్లకు సంబంధించిన వినియోగ వివరాలను ఓచర్లతో పాటు వినియోగ ధృవపత్రమును పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మండల విద్యాశాఖాధికారి ద్వారా రాజీవ్ విద్యామిషన్ జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.
బాలికల విద్య
విద్యహక్కు చట్టం 2009 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికందరూ ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయాలి.
లక్ష్యాలు :
- ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన బాలికల విద్యను మెరుగుపరచడం.
- బాలబాలికల మధ్య విద్యాపర లింగవివక్షతను తగ్గించడం వారి విద్యపట్ల సమాజంలో చైతన్యం తీసుకురావడం.
నిర్వహించే కార్యక్రమాలు :
- పాఠశాలలను అందుబాటులోకి తెచ్చి సౌకర్యాలను పెంపొందించడం.
- బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించడం.
- అన్ని వర్గాల బాలికలకు ఉచిత పాఠ్యపుస్తకాలను, ఉచిత యూనిఫాంలను అందజేయడం.
- పాఠశాలల్లో నిర్వహించు కార్యక్రమాలలో బాలికలకు అధిక ప్రాధాన్యత నివ్వడం
- సమభావన కలిగించడం కోసం పాఠశాలల్లో, గ్రామాలలో బాలిక సాధికారిత, బాలిక స్వశక్తి కార్యక్రమాలను నిర్వహించండం.
- చెల్లిక్లబ్, సమవయస్కుల బృందాలు, బాలికమేళా, కళాజాతాల వంటి చైతన్య కార్యక్రమాల ద్వారా నిలకడ పెంచుట, బడిబయట బాలికలను బడిలో చేర్చుట
- నమోదయిన బాలికలు ప్రతిరోజూ బడికి హాజరయ్యేలా ప్రోత్సహించడం, చదువుపట్ల ప్రేరణ కలిగించి గుణాత్మకతను సాధించడం కోసం తరచుగా తల్లులు సమావేశాలు ఏర్పాటు చేయడం.
ఎ) ఎలిమెంటరీ స్ధాయి బాలికల జాతీయ విద్యాకార్యక్రమం (NPEGEL)
- స్త్రీల అక్షరాస్యతా శాతం, జాతీయ అక్షరాస్యతా శాతం కంటె తక్కువ మరియు జెండర్ వ్యత్యాసము జాతీయ సగటు కంటె ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో NPEGEL కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేయబడుచున్నది.
ఉద్దేశ్యం :
- బాలికల విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాలలో లింగవివక్షతను రూపు మాపడానికి బాలికల సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధనకు ఈ కార్యక్రమం రూపొందించబడింది.
NPEGEL కార్యక్రమం లక్ష్యాలు
- పాఠశాలలు అందుబాటులో ఉంచి మెరుగైన సౌకర్యాలు కల్పించడం.
- బాల బాలికల మధ్య లింగ వివక్షతను తగ్గించి సమానత్వాన్ని పెంపొందించడం.
- బాల బాలికల మధ్య నమోదు, నిలకడ వ్యత్యాసాలు తగ్గించడం.
- బాలికల విద్య పట్ల సమాజాన్ని చైత్యన్యపరచడం.
- బాలికల హాజరు శాతాన్ని మెరుగుపరచడం.
- బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమాలను రూపొందించడం.
- బాలికల్లో వృత్తి విద్యా నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంపొందించడం.
- పాఠశాలల్లో బాలికలకు స్నేహపూరిత వాతావరణం కల్పించడం.
- విద్యావ్యవస్థలో స్త్రీల, బాలికల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.
- బాలికల విద్య పై ఉపాధ్యాయులకు అవగాహన కలిగించడం మరియు శిక్షణా తరగతులు నిర్వహించడం.
NPEGEL కార్యక్రమం అమలు విధానం
- సర్వ శిక్షా అభియాన్ యంత్రాంగం ద్వారానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి జెండర్ కో – ఆర్డినేటర్, జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి జెండర్ కో – ఆర్డినేటర్ కార్యక్రమాల అమలు, నిర్వహణను పర్యవేక్షిస్తారు. మండల స్థాయిలో మండల విద్యాధికారి మండల జెండర్ కో – ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు.
- మండలంలో క్లస్టర్లను, క్లస్టర్ కమిటీలను ఏర్పాటు చేయాలి.
- మండలంలో క్లస్టర్లను మహిళా అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండి బడిబయటి బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న ఎస్.సి/ఎస్.టి/బి.సి, మైనారిటీ ఆవాస ప్రాంతాలను క్లస్టర్ గా ఎంపిక చేయాలి.
- మండల పరిధిలో బాలికల నమోదు ఎక్కువగా ఉండి, కనీస వసతులు గల పాఠశాలలను మోడల్ క్లస్టర్ పాఠశాలలగా గుర్తించాలి. వీలున్నంత వరకు ఉన్నత పాఠశాల లేక స్కూల్ కాంప్లెక్సు పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఒక క్లస్టర్ పాఠశాలకు అనుబంధంగా 8 నుండి 10 పాఠశాలలుంటాయి.
- ప్రతి క్లస్టర్ లో కమిటీని ఏర్పరచి క్లస్టర్ కో – ఆర్డినేటర్ ను నియమించాలి.
- ప్రతి క్లస్టర్ లో చదువులో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి, అభివృద్ధి పరచుటకై పార్ట్ టైమ్ వాలంటీరును ఏర్పాటు చేయాలి. రెమిడియల్ టీచింగ్ మెటీరియల్ అందజేయాలి.
- ప్రతి క్లస్టర్ లో అవసరమైన చోట 3 నుండి 5 స ల సయసు గల పిల్లలకు చిన్నారుల వికాస కేంద్రాలను, పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లలను చిన్న పిల్లల సంరక్షణ బాధ్యత నుండి తప్పించాలి.
- బడిబయట బాలికల కొరకు స్వల్పకాలిక మోటివేషన్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి.
- క్లస్టర్ లో ప్రాధాన్యత క్రమంలో బాలికలు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పాటు చేయాలి.
- కౌమారదశలోని బాలికలు బడిమానకుండా ఒక అదనపు తరగతి గదిని ప్రత్యేకంగా నిర్మించి మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి సౌకర్యలు కల్పించడం
- బాలికల సర్వతోముఖాభివృద్ధికై పాఠ్యాంసాలతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాలలో తర్ఫీదు నివ్వాలి. వృత్తి విద్యాబోధకులను నియమించాలి. శారీరక అభివృద్ధి కోసం ఆటపరికరాలను అందుబాటులో ఉంచడం.
- పిల్లల లైబ్రరీని నెలకొల్పాలి
- క్లస్టర్ పరిధిలో శిక్షణా కార్యక్రమం, కమ్యూనిటీ మొబిలైజేషన్, మానిటరింగ్ మొదలగు కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలి.
- బాలికల ఆరోగ్య పరిరక్షణ కొరకు మొబైల్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం సానిటరీ నాప్ కిన్స్ వారితోనే తయారు చేయించి ఉపయోగించడం, గ్రీటింగ్ కార్డులు, స్క్రీన్ ప్రింటింగ్, ప్యాషన్ టెక్నాలజీ, బ్యూటీషియన్ మరియు ఇతర కోర్సులలో శిక్షణలను అందజేయాలి.
బి) కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు. 10 సం పై బడి బడి మానివేసిన మరియు ఇంకను బడిలో చేరని షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఓ.బి.సి ఇతర మైనారిటీ బాలికలకు అందుబాటులో గుణాత్మక విద్యనందించడానికి ఏర్పాటు చేయబడినవి.
కె.జి.బి.విలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ?
- కె.జి.బి.విలు 2001 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షర్యాసతా శాతము జాతీయస్థాయి కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు (46.13 శాతం)
- డ్రాపౌట్ బాలికలు, మైనారిటీ మరియు CWSN విద్యార్థినులు అధికంగా గల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
కె.జి.బి.విల్లో చేరుటకు ఎవరు అర్హులు?
- 6, 7, 8 చదువుతూ మూడు నెలలు అంతకన్నా ఎక్కువ రోజులు బడిమానివేసిన బాలికలందరూ, వయస్సును బట్టి ఆయా తరగతుల్లో చేరుటకు అర్హులు.
- రెసిడెన్వియల్ నాన్ రెసిడెన్వియల్ ప్రత్యేక శిక్షణా సెంటర్ లలో, జాతీయ బాలకార్మికుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన బాలికలు కె.జి.బి.విలో చేరుటకు అర్హులు.
కె.జి.బి.వి లక్ష్యాలు :
- గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న లింగ వివక్షను తొలగించడం.
- బడుగు, బలహీన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల బాలికలకు ఎలిమెంటరీ స్థాయిలో గుణాత్మక విద్యను అందించడం.
- బాలికల్లోని కళాకౌశలాన్నా వెలికితీసి అభివృద్ధి పరచే విధంగా వివిధ వృత్తి విద్యా నైపుణ్యాలలో తర్పీదు నివ్వడం, విద్యలో వెనుకబడిన విద్యార్ధునుల కోసం రెమిడియల్ టీడింగ్ అందజేయడం.
- విద్యార్ధునుల ఆరోగ్య పరిరక్షణ కోసం, మొబైల్ హెల్త్ క్లినిక్ లు నిర్వహించడం, శానిటరీ నాప్ కిన్స్ వారితోనే తయారు చేయించి, ఉపయోగింపజేయడం, గ్రీటింగ్ కార్డులు, స్క్రీన్ ప్రింటింగ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణనందించటం.
- ఆడ పిల్లలను చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతల నుండి తప్పించి వారు క్రమం తప్పకుండా బడికి వెళ్ళేలా చూడడం.
- కె.జి.బి.విలలో చేరిన బాలికలకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత సిబ్బంది పై ఉన్నది.
- కె.జి.బి.వి విద్యాలయాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది బాలికల భవితకు బంగారు మార్గం ఏర్పరచడం దీని ముఖ్యో ఉద్దేశ్యం.
కె.జి.బి.విలు – కల్పించే సదుపాయాలు
- మంచి భవన వసతి
- అభ్యసనలో వెనుకబడిన బాలికల కొరకు ప్రత్యేక బోధనాబ్యసన సామాగ్రి తయారు చేసి దానిని అందుబాటులో ఉంచడం.
- వృత్తి విద్యా కోర్సులు మరియు వ్యాయామ విద్యను అందించడం
- బాలికలకు జీవన నైపుణ్యాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం
- బాలికల సాధికారిత కార్యక్రమాలు చేపట్టడం.
బడి బయటి పిల్లలకు విద్యావకాశాలు
విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి 14సం లోపు వయసు గల పిల్లలందరికీ విద్యనందించడం రాజీవ్ విద్యామిషన్ ప్రధాన లక్ష్యం. ఈ వయసులోని బడిబయట పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు రాజీవ్ విద్యామిషన్ వివిధ రకాల వ్యూహాలను చేస్తోంది.
బడిబయట పిల్లల్లో ప్రధానంగా అసలు బడికి పోనివారు, మధ్యలో బడిమానిన వారు ఉంటారు. వారి వయసు తగిన తరగతుల్లో చేర్పించి ప్రత్యేక శిక్షణా కేంద్రాల (ఎస్.టి.సి) ద్వారా పిల్లలకు విద్యవకాశం కల్పించడం జరుగుతుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం బడిబయట పిల్లలకు కల్పించబడిన సౌకర్యాలు నాన్ రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
బడిబయట ఉన్న 9 నుండి 14 సంవత్సరాల వయసులో అసలు బడిలో చేరని, మధ్యలో బడిమానిన పిల్లలను వయసుకు తగిన రీతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాన్ రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా విద్యావకాశం కల్పించబడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన వాచకాలతో శిక్షణ నిస్తారు. సాధారణ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో ఎంపిక చేసిన బోధకులు ఈ కేంద్రం నిర్వహిస్తారు. ఈ కేంద్రంలోని పిల్లలకు ఉచిత అభ్యసన సామాగ్రితో పాటు మధ్యాహ్న బోజన సౌకర్యం కల్పించబడుతుంది.
రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
బడిబయట ఉన్న 9 నుండి 14 సంవత్సరాలలోపు వయసు గల, అసలు బడికి పోని, పని నుండి విముక్తి కలిగించిన పిల్లలను RTE- 2009 ACT ప్రకారం తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించి తక్కువ సమయంలో వయసుకు తగిన తరగతికి సిద్ధం చేయడానికి రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవాస పద్ధతిలో ప్రత్యేక వాచకాలతో శిక్షణ పొందిన బోధకులు శిక్షణ నిస్తారు. బసకు వసతులు కల్పించాలి.
ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రాజీవ్ విద్యామిషన్ (ఎస్.ఎస్.ఎ) ద్వారా ప్రత్యేక శిక్షణా కేంద్రాలు నిర్వహించబడుచున్నాయి.
మానసిక వికలాంగులు, దృష్టిలోపం గల పిల్లలు, వినికిడి లోపం గల పిల్లల కోసం వేరు వేరుగా ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్వహించే వీలుంది. ఒక్కొక్క NRSTC/ RSTC లో యాభై మంది పిల్లలు శిక్షణ నందించిన అనంతరం వారి స్థాయి ఆధారంగా అర్హత గల తరగతితో హాస్టల్ సదుపాయంతో విద్యావకాశం కల్పిస్తారు.
మదర్సాలు
ముస్లిం మైనారిటీ పిల్లల కోసం నిర్వహించబడుతున్న మదర్సాలకు రాజీవ్ విద్యామిషన్ విద్యావిషయంగా చేయూత నందిస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ద్వారా చేయూత పొందుటకు ముందుకు వచ్చిన మదర్సాలలో చదివే పిల్లలకు మత విద్యతో పాటు సాధారణ పాఠ్యాంశాలలో కూడ విషయ పరిజ్ఞానం అందించడం జరుగుతుంది. ఇందుకు వీలుగా వాలంటీర్లకు గౌరవ వేతనం, శిక్షణ, టి.ఎల్.ఎం గ్రాంటు, బాలబాలికలకు పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాంలను అందజేస్తారు. వీరికి మధ్యాహ్న భోజన పధకం అమలు చేయడం జరుగుతుంది. వీటితో పాటు మదర్సాలలో కంప్యూటర్ విద్యను అందించడం జరుగుతుంది. మదర్సాలలోని పిల్లలకు కూడా పై తరగతుల్లో సాధారణ విద్యను కొనసాగించే అవకాశం కల్పించబడింది.
పట్టణ ప్రాంత అణగారిన పిల్లలకు విద్యావకాశాలు
జీవనోపాధి కొరకు పట్టణాలకు వలస వెళ్ళిన కుటుంబాల పిల్లలు, చదువుకు దూరమై మెకానిక్ షాపుల్లోను, ఇండ్లలో పనిచేసే పిల్లలు, బిక్షాటన చేసే పిల్లలు ఇల్లు లేని అనాధ పిల్లలు, వీధులలో చెత్త చెదారం ఏరుకొంటూ దయనీయస్థిలో ఉండే పిల్లలను వీధిబాలలుగా గుర్తించి వారికి విద్యావకాశాలు కల్పించడం జరుగుతుంది. దీని కోసం ప్రత్యేకంగా ఈ దిగువ కార్యక్రమాలు నిర్వహించబడుచున్నాయి.
1 . హెల్ప్ లైన్
బాల కార్మికులుగా పనిచేసే పిల్లల సమాచారం, సహకారం అవసరమున్న పిల్లల సమాచారం అందించడానికి ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించబడింది. సమాచారం ఆధారంగా కార్మికశాఖ RVM అధికారుల బృందంతో ఆయా ప్రాంతాలను సందర్శించి పని నుండి పిల్లలకు విముక్తి కలిగించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో వయస్సు కు తగిన తరగతిలో చేర్పించి ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుంది.
2 . హెల్ప్ డెస్క్
వీధి బాలలు, అనాధ బాలలు, తల్లిదండ్రుల నిరాదరణకు గురైన, ఇల్లు లేక ప్లాట్ ఫాం పై నివసించే పిల్లలను గుర్తించడానికి బస్టాండ్ లలో రైల్వే స్టేషన్ లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం. వీరిని గుర్తించిన తర్వాత ట్రాన్సిట్ హొమ్ కు పంపడం జరుగుతుంది.
3. ట్రాన్సిట్ హొం
అనాధలు, వీధి బాలలు, బిక్షాటన చేసే పిల్లలు, చిత్తుకాగితాలు, పాత సామాను ఏరుకునే ఇల్లు లేక ప్లాట్ ఫారం పై నివసించే పిల్లలను ప్రత్యేక డ్రైవ్ లు, పిల్లలను హెల్ప్ లైన్ ద్వారా గుర్తించి ట్రాన్సిట్ హాంలలో చేర్పించి వారిలో మానసిక పరివర్తన ఆనంతరం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వారిని పాఠశాలలో చేర్చి విద్యనందించడం కోసం ప్రత్యేక ఆవాస శిక్షణా కేంద్రాలకు పంపడం జరుగుతుంది.
4 . వర్క్ సైట్ స్కూల్
వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన కూలీల పిల్లలకు వారు పనిచేసే చోట పాఠశాలను ఏర్పాటు చేసి వారి వయసుకు తగిన తరగతుల్లో చేర్పించి, వారి స్థాయికి అవసరమైన శిక్షణ నందించడం
5 . సీజనల్ హాస్టల్స్
జీవనోపాధికోసం ఆయా కాలాల్లో వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళే కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులతో వలస వెళ్ళకుండా ఉండేందుకు వారికి అదే ప్రాంతంలో హాస్టల్ వసతి సదుపాయంతో విద్యను కొనసాగించడం జరుగుతుంది.
6. సంచార పాఠశాలలు
సంచార జీవనం గడిపే కుటుంబాల పిల్లల కోసం వాలంటీరును నియమించి ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కూడా వారితో పాటు విద్యావాలంటీరు వెళ్ళుతూ విద్యనందించడం.
ఇవే కాకుండా 6 – 14 బాలబాలికలకు పడవల్లో బళ్ళు, సంచార వాహన పాఠశాలలు, ప్రత్యేక అవసరాలు గల బడికి హాజరు కాని పిల్లలకు రిసోర్స్ టీచర్ల చే ఇంటివద్దనే, డోర్ స్టెప్ పాఠశాల విన్నూతనమైన కార్యక్రమాల ద్వారా సార్వత్రిక ప్రాధమిక విద్యాసాధనే లక్ష్యంగా రాజీవ్ విద్యామిషన్ కార్యక్రమాలను చేస్తుంది.
పాఠశాల భవన నిర్మాణాలు
రాజీవ్ విద్యామిషన్ ద్వారా సమాజ సహకారంతో పాఠశాలలకు మౌళిక వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది పాఠశాల మౌళిక వసతుల కల్పనకై మొత్తం ప్రణాళికా వ్యయంలో 33 శాతం బడ్జెట్ ను భవన నిర్మాణ పనుల కొరకు కేటాయించడం జరిగింది.
పాఠశాలలకు నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, ఇతర మౌళిక వసతుల అవసరాలను మండల విద్యాశాఖాధికారుల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ మరియు చైర్మెన్ రాజీవ్ విద్యామిషన్ వారి ఆమోదంతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది.
ఈ మౌళిక వసతుల నిర్మాణాలను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నాణ్యతతో సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది.
పాఠశాల భవన నిర్మాణమునకు గాని లేదా ఏ ఇతర మౌళిక సదుపాయల కల్పనకు గాని అంచనా విలువకు అనుగుణంగా రాజీవ్ విద్యామిషన్ నుండి సంబంధిత పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీలకు నేరుగా నిధులు విడుదల చేయబడును. భవన నిర్మాణం జరిగిన తరువాత డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ధృవీకరించిన వాల్యూవేషన్ సర్టిఫికెట్ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిధులు బ్యాంకు నుండి విత్ డ్రా చేయవలెను.
నూతన భవనాలు అదనపు తరగతి గదులు నిర్మాణంలో రెయిలింగ్ తో కూడిన ర్యాంపు నిర్మాణం తప్పక జరిగేటట్లు జాగ్రత్త వహించాలి.
భవన నిర్మాణ సమయంలో క్యూరింగ్ సరిగా చేయించుట. నిర్మాణ అనంతరం, కనీసం సంవత్సరానికి కొకసారి వెల్ల వేయించేలా పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ వారు శ్రద్ధచూపాలి
ఇది వరకే నిర్మాణం జరిగి క్యాంపు లేని పాఠశాలలకు రెయిలింగ్ తో కూడిన ర్యాంపుల నిర్మాణం జరిగేలా చూడాలి
అన్ని హంగులతో పాఠశాలలను నిర్మించి విద్యార్ధుల చదువుకు అనుకూలంగా ఉండేలా చూడాలి.
ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్యావకాశాలు
సమాజంలోని అన్ని రకాల పిల్లలకు విద్యావకాశాలు అందినప్పుడే ఆ సమాజం కొత్త రూపును సంతరించుకుంటుంది. బడిఈడు గల పిల్లలందరూ బడిలో ఉండేలా అన్ని చర్యలు చేపట్టింది రాజీవ్ విద్యామిషన్ అయితే ఇంకను కొంతమంది పిల్లలు వివిధ కారణాల వల్ల బడికి వెళ్ళి చదువును కొనసాగించే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. వారిలో కొంత మంది బుద్ధిమాంద్యం, వినికిడిలోపం, దృష్టి లోపం, శారీరకలోపం మొదలగు లోపాలను కలిగి ఉండమే కారమం. ఇటువంటి లోపాలు గల పిల్లలను ప్రత్యేక అవసరాలు గల పిల్లలు C.W.S.N (Children With Special Needs) అంటారు.
ఈ పిల్లలను కూడా సాధారణ పిల్లలతో సమానంగా బడిలో చేర్చి చదువు కొనసాగించాల్సిన బాధ్యత మనం దరిపైన ఉంది.
ప్రత్యేకావసరాలు గల పిల్లలు అభివృద్ధి కోసం రాజీవ్ విద్యామిషన్ ఈ క్రింది కార్యక్రమాలను అమలు చేస్తుంది.
- తీవ్ర, అతి తీవ్ర వైకల్యం గల పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందించటం కోసం ఐ.ఇ రిసోర్స్ టీచర్స్ ను నియమించి వారి ద్వారా 15 మందికి విద్యను అందించడం.
- ప్రత్యేకావసరాలు గల పిల్లలున్న పాఠశాలల్లో రెమీడియల్ టీడింగ్ నిర్వహించడం.
- పిల్లల వైకల్య నిర్ధారణకై వైద్య శిబిరాలు నిర్వహించి వైకల్య ధృవీకరణ పత్రాలు, బస్సు మరియు రైల్వే పాసులు అందించడం జరుగుతుంది.
- వివిధ రకాల వైకల్యాలు గల పిల్లల పెన్షన్స్, స్కాలర్ షిప్స్, బుద్ధిమాంద్యం గల పిల్లలకు న్యూరెన్స్ పాలసీని (నిరామయ) వికలాంగ సంక్షేమశాఖ ద్వారా అందజేయడం జరుగుతుంది.
- నిర్ధారణ శిబిరాల ద్వారా గుర్తింపబడిన పిల్లలకు అవసరమైన ట్రైసెకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు బ్రెయిలీ కిట్స్, కేన్స్ మొదలగు ఉపకరణాలు అందిస్తున్నారు.
- దృష్టిలోపం, గ్రహణ మొర్రి, పోలియో గల పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి పాఠశాలలో కొనసాగేలా తోడ్పాటు నివ్వటం జరుగుతుంది.
- మాట్లడలేని పిల్లలకు స్వీచ్ థెరపి, సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ఫిజియోథెరపినందించి మెరుగైన జీవితాన్ని అందించటమే లక్ష్యంగా కృషి చేస్తుంది.
- ఎస్కార్ట్ సహాయంతో పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు నెలకు రూ 150/- లు ఎస్కార్చ్ అలవెన్స్ అందించడం జరుగుతుంది.
- మధ్యలో బడిమానివేసిన, బడిలో చేరని ప్రత్యేకావసరాలు గల పిల్లలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేసి విద్యనందించడం జరుగుతుంది.
- ప్రతి పాఠశాలకు రెయిలింగ్ తో కూడిన ర్యాంపుల నిర్మాణం చేయటం జరుగుతుంది.
- ఇంటి వద్దనే విద్య సేవల ద్వారా శిక్షణ పొందిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించి / వారిని కొనసాగేలా చూడటం జరుగుతుంది.
-
ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేకావసరాలు గల పిల్లలు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేరటానికి ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా చేర్చుకోవాలి. వారి దండ్రులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు, స్కాలర్ షిప్పులు, రాయితీల పట్ల అవగాహన కల్పించి పిల్లల ఎదుగుదలకు అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం.
పాఠశాల అభివృద్ధి మరియు గుణాత్మక విద్యాసాధనలో ప్రజల భాగస్వామ్యం
పాఠశాల అభివృద్ధికి, గుణాత్మక విద్యా సాధనకు విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్ / కౌన్సిలర్ తో అకడమిక్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అకడమిక్ మానిటరింగ్ కమిటీలో ఈ క్రింది వారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి
- గ్రామ సర్పంచ్ / కౌన్సిలర్ / కార్పోరేటర్ అధ్యక్షులుగా ఉంటారు.
- పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటాడు.
- ప్రాధమిక పాఠశాలలో ఒక్కొక్క తరగతిలో ఎల్.ఇ.పి ప్రారంభ పరీక్షలో బాగుగా చదివే విద్యార్థి తల్లి/ తండ్రి, చదువులో బాగా వెనుకబడిన విద్యార్థి తల్లి/ తండ్రి.
- సామాజిక వర్గం ప్రకారం ఒక్కొక్క తరగతిలో యస్.సి / యస్.టి, బి.సి మరియు మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రులలో ఒక్కొక్కరిని సభ్యులుగా తీసుకోవాలి.
- ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతిలో సామాజికపరంగా 20 మంది, చదువులో ముందున్న మరియు వెనుకబడిన విద్యార్థి తల్లి/ తండ్రులు 10 మంది గ్రామ సర్పంచ్ మరియు ప్రధానోపాధ్యాయులతో కలిపి మొత్తం 32 మంది సభ్యులుగా ఉంటారు.
ఇదే విధంగా ప్రాథమికోన్నత స్థాయిలో మొత్తం 44 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి.
అకాడమిక్ మానిటరింగ్ కమిటీ ఏమి చేస్తుంది ?
- విద్యార్థుల ప్రగతి ప్రదర్శన బడిలో పిల్లలు ఎంత మంది చదవడం, రాయడం లెక్కలు చేయగల్గుతున్నారో, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విన్నూత కార్యక్రమాలు విద్యార్ధులచే తల్లిదండ్రుల ముందు ప్రదర్శన నిర్వహించడం
- విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరును పరిశీలించడం.
- మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించడం.
- పాఠశాల గ్రాంట్ల వినియోగాన్ని చర్చించడం.
నెలలో విద్యార్థుల తల్లిదండ్రులను అనూకూలమైన రోజు, అనుకూల సమయంలో ముందస్తూ సమాచారంతో గ్రామసర్పంచి గారి అధ్యక్ష తన ప్రధానోపాధ్యాయుడు, అకడమిక్ మానిటరింగ్ కమిటీని సమావేశపరచి పై అంశములను చర్చించి వాటిని అకడమిక్ మానిటరింగ్ కమిటీ తీర్మానాలను రిజిష్టరులో నమోదు చేయాలి. ఈ తీర్మానాలు అమలు చేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలి.
అకడమిక్ మానిటరింగ్ కమిటీ అదనపు బాధ్యతలు
- సర్పంచు గారు తల్లిదండ్రులు వీలైన రోజులలో ప్రార్థనకు హాజరుకావడం.
- కమిటీ మధ్యాహ్న భోజనం రుచిచూడడం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించడం.
- కమిటీ వారు ఇంటిలో పండించే కూరగాయలు వీలైతే, మధ్యాహ్న భోజన పథకమునకు, ఉచితంగా ఏదో ఒక రోజు సరఫరా చేయాలి.
- విద్యార్థులు పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను చిన్న చిన్న బహుమతులనిచ్చి ప్రోత్సహించాలి.
- కమిటీ సభ్యులు, ఆగష్టు 15, ఉపాధ్యాయ దినోత్సవం గాంధీ జయంతి, బాలల దినోత్సవం, రిపబ్లిక్ మొదలగు ముఖ్యమైన వేడుకలను పాఠశాలలో జరపాలి.
- బడిమనది.... పిల్లు మనవారే అనే భావనతో కమిటీ సభ్యులు పాఠశాలను పరిరక్షించాలి.
- పాఠశాల వార్షికోత్సవములో కమిటీ సభ్యులు తప్పని సరిగా పాల్గొనాలి.
- 6 నుండి 14 సంల వయసు (బడిఈడు గల) పిల్లలందరిని నమోదు చేసి వారు పాఠశాలలో కొనసాగేలా తమ వంతు సహకారాన్ని అందించాలి.
పాఠశాల యాజమాన్య కమిటీ
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా చట్టం ప్రజల భాగస్వామ్యం 1998 ప్రకారం ప్రతి పాఠశాల సక్రమంగా పనిచేసే విధంగా పరిశీలించడానికి పాఠశాల విద్యాకమిటీ (ఎస్.ఇ.సి) లు ఏర్పాటు చేయబడినాయి.
ప్రస్తుతం వాటి స్థానే పాఠశాల యాజమాన్య కమిటీలు (ఎస్.యం.సి) ప్రభుత్వ ఉత్తర్వులు 95 ద్వారా ఏర్పాటు చేయబడినాయి.
పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్.యం.సి) ఏర్పాటు
- గ్రామ సర్పంచ్ ఎస్.యం.సి అధ్యక్షులు ఎక్స్ అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తారు.
- పాఠశాల ఆవాస ప్రాంత వార్డు సభ్యులు – ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
- పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నలుగురు సభ్యులు జిల్లా ఇన్ చార్జి మంత్రినే నామినేట్ చేయబడుతారు.
- నలుగురు సభ్యులలో – ఇద్దరు మహిళ సభ్యులు ఉండాలి. వారిలో కనీసం ఒకరు షెడ్యూలు కులాలు / తెగలు/ వెనుకబడిన తరగతులు / అల్పసంఖ్యాక వర్గ సభ్యులై ఉండాలి.
- పాఠశాల ప్రధానోపాధ్యాయుడు – మెంబర్ కన్వీనర్ గా ఉంటారు.
పాఠశాల మున్సిపల్ / కార్పోరేషన్ / పట్టణ పరిధిలో ఉన్నట్లేతే
- మున్సిపల్ కౌన్సిలర్ / కార్పోరేటర్ – ఎస్.ఇ.సి అధ్యక్షులు (ఎక్స్ అఫీషియో చైర్మెన్) గా వ్యవహరిస్తారు.
- పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రుల నుండి ఐదుగురు సభ్యులు జిల్లా ఇన్ చార్జి మంత్రిచే నామినేట్ చేయబడతారు.
- ఈ ఐదుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళ సభ్యులై ఉండాలి. మరియు కనీసం ఒక్కరు ఎస్.సి/ఎస్.టి/బి.సి/ మైనారిటీ వర్గ సభ్యులై ఉండాలి.
- పాఠశాల ప్రధానోపాధ్యాయుడు – మెంబర్ కన్వీనర్ గా ఉంటారు.
అ) విద్యానిధి :
పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి పొందే ఆర్థిక సహాయ సహకారాలకు తోడుగా సమాజంలో విద్యాభిమానులు, దాతలు, ఔత్సాహికులు, పూర్వ విద్యార్థులు, యన్.ఆర్.ఐ లు మరియు ప్రజాప్రతినిధులు మొదలగు వారి నుండి ఆర్థిక, వస్తు రూపంలో పొందే నిధిని ‘’విద్యానిధి” అంటారు.
విద్యానిధి ద్వారా సేకరించిన డబ్బును పాఠశాల బ్యాంకు అకౌంటులో జమచేసి యాజమాన్య కమిటీ ఆమోదం ప్రకారం బ్యాంకు నుండి డబ్బును తీసుకుని దాతలు కోరిక మేరకు వస్తువులు, పాఠశాలకు సౌకర్యాలు కలుగ చేయవలెను. వస్తువులు సేకరించినపుడు స్టాకు రిజిష్టర్ లో నమోదు చేయాలి.
పాఠశాల అభివృద్ధికి దాతలు అందించే విరాళాలు వారు కోరిన విధంగా ఖర్చు చేయటం జరుగుతుంది. విద్యానిధిని అందించే దాతలు ఏ సమయంలో నైనా పాఠశాలను సందర్శించి అభివృద్ధి క్రమాన్ని అంచనా వేసి సలహాలు ఇవ్వవచ్చును.
ఆ) పాఠశాలల దత్తత
ఈ పాఠశాల మనది అనే అభిప్రాయం ఆ ఆవాస ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరునికి ఉండాలనే ఉద్దేశ్యంతో పాఠశాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడం జరుగుతుంది.
దీనిలో భాగంగా ప్రభుత్వం, స్థానిక సంస్థలు ద్వారా నిర్వహించబడుతున్న పాఠశాలల్లో కనీస వసతులు, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా నిర్వహించబడుతున్న పాఠశాలలతో పోలిస్తే అసంపూర్తిగా ఉన్నాయి. ఈ లోపించిన కనీస వసతుల వలన విద్యార్థులు పొందే అ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాభిమానులు, ఔత్సాహికులు, దాతలు, పూర్వ విద్యార్థులు, యన్.ఆర్.ఐలు మరియు ప్రజాప్రతినిధులు మొదలగు వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తద్వారా కనీస వసతుల సాధనతో పాటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల విద్యాస్థాయి మరింత పెంపొందించటం సాధ్యపడుతుంది. దీనికై ప్రభుత్వం వారు పాఠశాల దత్తతకై ఈ క్రింది సూచనలతో ప్రభుత్వ ఉత్తర్వు 162 విద్యా విభాగం తేది : 14..2004 నాడు విడుదల చేయటం జరిగింది.
- ప్రాథమిక పాఠశాలలకు రూ 5 లక్షలు ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7.5 లక్షలు ఉన్నత పాఠశాలలకు రూ 10 లక్షలు విరాళంగా అందించిన దాత సూచించిన పేరును ప్రభుత్వ అనుమతి మేరకు ఆ పాఠశాలకు పెట్టడం జరుగుతుంది.
- దాతలు, వారు కోరిన పాఠశాలకు విరాళం డిమాండ్ డ్రాప్ట్ / నగదు రూపంలో రాష్ట్ర పథక సంచాలకులు రాజీవ్ విద్యామిషన్ (ఎస్.ఎస్.ఎ) ఆంధ్రప్రదేశ్, హైద్రాబాద్ వారి పేరిట సేవింగ్స్ ఖాతా సంఖ్య 37427, ఆంధ్రాబ్యాంకు, ఖైరతాబాద్, హైదరాబాద్ పేరున చెల్లు బాటు అయ్యే విధంగా పాఠశాల దత్తత విబాగం వారి పేరిట అందజేయాలి. అట్టి మొత్తం రాష్ట్ర కార్యాలయం నుండి సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మెన్ ఖాతాకు తిరిగి బదిలీ చేస్తారు. అక్కడి నుండి ఆ నిధిని సంబంధిత పాఠశాల అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుంది.
పేరెంట్ టీచర్ అసోసియేషన్, పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ సభ్యులు విద్యానిధిని అభివృద్ధి చేయటానికి దాతలను గుర్తించి విద్యానిధి ఆవశ్యకతను తెలియజేసి, వారు అందించే విరాళాలను వారి అభీష్టం మేరకు వారు సూచించిన పాఠశాలలకు వెచ్చించటం ద్వారా విద్యానిధి సత్పలితానిస్తుంది.
- కావున ఔత్సాహికులు, విద్యాభిమానులు, దాతలు, యన్.ఆర్.ఐలు పూర్వ విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు తమ శక్తి మేరకు విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
- దాతలు ఇచ్చిన భూ విరాళాలు రిజిస్ట్రేషన్ ఖర్చుల సత్సంబంధాలు జిల్లా కలెక్టర్ గారు పాఠశాల విద్య గ్రాంటు నుండి చెల్లిస్తారు.
- విద్యానిధి పై అదనపు సమాచారం కొరకు www.vidyanidhi.org వెబ్ సైట్ ను దర్శించవచ్చును.
పాఠశాల సమగ్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం సందేహాలు – సమాధానాలు
1. ఇతర అభివృద్ధికి కార్యక్రమాలతో తీరికలేకుండా ఉంది. పాఠశాల అభివృద్ధికి సమయం ఎక్కడిది?
- మీరు గ్రామంలో మొదటి పౌరులు, గ్రామాన్ని అభివృద్ధి చేయడం మీ గురుతర బాధ్యత. మానవ వనరుల అభివృద్ధియే గ్రామాల అభివృద్ధిగా మేధావుల- విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కావున తమరు పాఠశాల, విద్యార్థులు, విద్యా తదితర అంశాలను శాశ్వతమైన అభివృద్ధిగా పరిగణించి మొదటి ప్రాధాన్యత విద్యను ఇవ్వవలసిన అవసరం ఉంది.
2. పాఠశాల అభివృద్ధికి ఏమైనా చేద్దామనుకుంటే రాజకీయాలు అడ్డం వస్తున్నాయి?
- రాజకీయాలకు అభివృద్ధి ఎలాంటి సంబంధంలేదు. ఎందుకంటే పిల్లల విద్యాభివృద్ధి ప్రజలందరికీ ఆమోదమైన అంశం. కావున చిన్న చిన్న భేదాభిప్రాయాలుంటే పిల్లల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు పోదాం.
3. పాఠశాల పనితీరును పర్యవేక్షించుటకు అధికారులు ఉన్నప్పుడు మా పాత్ర ఎంత వరకు ?
- గ్రామ పంచాయితీలో జరుగు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తమరు పర్యవేక్షిస్తున్నప్పుడు విద్యా కార్యక్రమాలను ఇతర అధికారులలో పాటు పర్యవేక్షణ చేసే బాధ్యత మీకు ఉంటుంది.
4. ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు మాకు సమాచారం చెప్పాలా ? వద్దా?
- ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు సంబంధిత ప్రధానోపాధ్యాయునికి సమాచారం ఇస్తారు. ప్రధానోపాధ్యాయునికి సెలవు పెట్టనప్పుడు సంబంధిత మండల విద్యాధికారి / ఉపవిద్యాశాఖాధికారికి సమాచారం ఇస్తారు. ఎవరైనా సెలవులో ఉంటే ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ లో సెలవు మార్కు చేయబడుతుంది మరియు సెలవు కారణ పత్రాలను భద్రపరడచం కూడ జరుగుతుంది. కావున మీకు పాఠశాలలో సమాచారం అందుబాటులో ఉంటుంది.
5. ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపులో మా భాగస్వామ్యం లేకుండా వారి హాజరును ఎలా మెరుగుపరచగలం?
- ఉపాధ్యాయుల జీతాలు ట్రెజరీల ద్వారా తీసుకుంటున్నారు. వారి జీతభత్యాల వ్యవహారాలను మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షిస్తుంటారు. మీకు ఏ ఉపాధ్యాయునికి సంబంధించిన పనితీరు, హాజరు వంటి విషయాలను మీరు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి / ఉపవిద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేస్తే వారు విచారించి తగు చర్యలు తీసుకుంటారు.
6. ఉపాధ్యాయుల హాజరు పుస్తకంలో సంతకం చేసే అధికారం మాకు ఉందా ? లేదా?
- పాఠశాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, సందర్శకుల రిజిష్టర్ లో పాఠశాలపై వారి అభిప్రాయాలను తెలియపరుస్తూ సంతకం చేయవచ్చు. ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ లో మాత్రం విద్యాశాఖకు సంబంధించిన అధికారులు సంతకం చేయాలి.
7. ఉపాధ్యాయుల బోధించేటప్పుడు తరగతి గదిలోకి వెళ్ళి పర్యవేక్షించే అధికారం మాకు ఉందా? లేదా?
- ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన తరువాతనే వారిని ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమిస్తుంది. వారి బోధనను పరిశీలించే వారు కూడ ప్రత్యేకమైన శిక్షణ పొందిన వారై ఉండాలి.
8. పిల్లల ప్రగతిని మేము ఎప్పుడు, ఎలా సమీక్షించాలి?
- ప్రతి నెల నిర్ణయించిన తేదీన అకాడమిక్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. అట్టి సమయంలో పిల్లల ప్రగతి పత్రంలో ఉపాధ్యాయులు రికార్డు చేసిన పిల్లల ప్రగతిని వారి సమాధాన పత్రాల ద్వారా సమీక్షించుకోవచ్చును.
9. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధులను ఎలా ఖర్చు చేయాలి ?
- రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధులను జమచేయుటకు ప్రత్యేకంగా పాఠశాల విద్యాయాజమాన్య కమిటీ చైర్మన్ (సర్పంచ్), మెంబర్ కన్వీనర్ అయిన ప్రధానోపాధ్యాయులతో బ్యాంకులో ఖాతా తెరచి జమ చేయాలి. పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖర్చు చేసి దానికి సంబంధించిన బిల్లులు మరియు వోచర్ లు సమకూర్చుకోవడం జరుగుతుంది.
10. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధుల జమా ఖర్చులు వివరాలు ఎవరు పర్యవేక్షిస్తారు?
- పాఠశాల స్థాయిలో నిధుల జమా ఖర్చులను మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షిస్తారు. ఖర్చు వివరములు రిజిష్టరును పాఠశాల యాజమాన్య కమిటీ కూడా పర్యవేక్షించవచ్చును.
11. పాఠశాలకు విడుదలైన నిధుల వినియోగానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఎవరు నిర్థారిస్తారు ?
- ప్రాజెక్టు డైరెక్టర్ గారి సూచనల మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో ప్రాధాన్యతా అంశాలను చర్చించుకొని వ్రాత పూర్వకంగా రికార్డు చేసుకొని వనరులను బట్టి విద్యార్థులకు అనుగుణంగా నిధులను ఖర్చు చేస్తారు.
12. పాఠశాల అవసర నిమిత్తం కొనుగోలు చేసిన వస్తువులు ఎవరీ ఆధీనంలో ఉండాలి?
- పాఠశాల అవసర నిమిత్తం కొనుగోలు చేసిన వస్తువులను స్టాక్ రిజిష్టర్ లో నమోదు చేసి, పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుని ఆధీనంలోనే ఉంచాలి.
13. పాఠశాలల్లో విద్యావాలంటీర్లను ఎవరు నియమించాలి ?
- ప్రభుత్వ ఉత్తర్వు నెం. 83 ఆధారంగా ప్రాజెక్టు డైరెక్టర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మెన్ ఆదేశాల ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ రాజీవ్ విద్యామిషన్ (సర్వ శిక్షా అభియాన్) వారి అనుమతి మేరకు విద్యావాలంటీర్లను నియమిస్తుంది.
14. పాఠశాలకు ఎవరు సెలవులు మంజూరు చేస్తారు?
- పాఠశాల విద్యా సంచాలకుల గారి ఆమోదం మేరకు ప్రతి పాఠశాలకు అకడమిక్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం సెలవులు, పరీక్షల నిర్వహణ, సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది.
15. ప్రసూతి సెలవు, దీర్ఘకాలిక ఆరోగ్య మరియు ఇతర అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులు సెలవులు పెడితే విద్యాబోధన కుంటు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
- మండల విద్యాశాఖాధికారి గారి ముందస్తు అనుమతి లేనిదే ప్రసూతి సెలవులు, దీర్ఘకాలిక, ఆరోగ్య మరియు ఇతర అవసరాలకు సంబంధించిన సెలవులు మంజూరు చేయబడవు. ఇలాంటి సెలవులకు అనుమతి ఇచ్చే విషయంలో ఆస్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆయా పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడకుండా ఆ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుని సహకారంతో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను గుర్తించి ఆయా పాఠశాలలకు ఏర్పాట్లు చేసే వరకు పాఠశాల యాజమాన్య కమిటీ ప్రజల సహకారంతో తాత్కాలికంగా విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
16. సమాచార హక్కు చట్టం పరిధిలో ప్రజలు ఎలాంటి సమాచారాన్ని పాఠశాలల నుండి పొందవచ్చును.
- పాఠశాలలో విద్యార్థుల హాజరు, నమోదు వివరాలు, విద్యార్థుల ప్రగతి, భవన నిర్మాణాలు, నిధుల మంజూరు, వాటి వినియోగం, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, తరగతి వారీగా, విషయవారీగా విద్యార్థుల ప్రగతి, గ్రేడింగ్ పాఠశాల విద్యానిధి వినియోగము, మధ్యాహ్న బోజన పథకమునకు సంబంధించిన వివరములు, పాఠశాలకు అందిన గ్రాంట్ల వివరాలతో పాటు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసి సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చు.
17. విద్యా హక్కు చట్టం ఎవరికోసం ప్రవేశ పెట్టబడింది?
- 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్య పొందే హక్కును కల్పిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
- బడిఈడు గల పిల్లందరికీ 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ పరిధిలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలను (1 నుండి 8 తరగతులు) అందుబాటులోకి తీసుకురావటం కోసం విద్యాహక్కు చట్టం ప్రవేశ పెట్టబడింది.
18. నివాస ప్రాంతంలో ఒక్కరిద్దరే పిల్లలుంటే వారి కోసం పాఠశాల ఏర్పాటు చేయబడుతుందా?
- 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాల 3 కి.మీ పరిధిలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ఆందుబాటులో లేనప్పుడు ఆ విద్యార్థులకు నెలకు రూ 300/- ల చొప్పున రవాణా సౌకర్యం కల్పించబడుతుంది. అంతేకాని ఇలాంటి పరిస్థితులలో ఆ పిల్లల కొరకు నూతన పాఠశాల ఏర్పాటు చేయబడదు.
19. విద్యాహక్కు చట్టం ద్వారా పిల్లలకు ప్రత్యేక సదుపాయములు కల్పిస్తున్నారా?
- 1 నుండి 8 వతరగతి చదువుతూ దారిద్ర్యరేఖకు దిగువనున్న పిల్లలకు సంవత్సరమునకు రెండు జతల ఉచిత యూనిఫాం అందజేయబడుతుంది.
- పాఠశాలకు కావాలసిన మౌళిక వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు, తరగతి గదులు, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు మొదలగునవి కల్పిస్తుంది.
20. పాఠశాల లేని ఆవాస ప్రాంతంలో నూతనముగా పాఠశాల ఏర్పాటు చేయాలంటే ఎంత మంది పిల్లలుండాలి?
- 6 నుండి 10 సంవత్సరముల వయస్సు కలిగిన కనీసం 25 మంది పిల్లలకు తక్కువ కాకుండా పిల్లలుండాలి.
- ఎస్.సి / ఎస్.టి ఆవాస ప్రాంతాలలో కనీసం 200 మంది జనాభాకు తగ్గకుండా ఇతర ఆవాస ప్రాంతాలలో కనీసం 300 జనాభా తగ్గకుండా ఉండాలి.
- పాఠశాల ఏర్పాటు చేసే ఆవాస ప్రాంతమునకు కనీసం ఒక కి.మీ పరిధిలో పాఠశాల లేనిచో నూతన పాఠశాల మంజూరు చేస్తారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు