ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి. 2013కుగాను అత్యుత్తమ అప్లికేషన్ గా నిలిచిన ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ మొబైల్ ప్రోగ్రామ్ వినియోగదారులకు పరిమిత కాలపరిధిలో మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. బహుశా ఆ సమయం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు కావొచ్చు. ట్రెయిల్ పిరియడ్ ముగిసిన తరువాత వాట్సాప్ లైసెన్స్ పిరియడ్ ను ఒక సంవత్సరం పాటు పొడిగించుకునేందుకు 0.99 డాలర్లు (రూ.55) చెల్లించాల్సి ఉంది.
ఇతర మెసేజింగ్ యాప్స్ ఉచిత సేవలను ఆఫర్ చేస్తునపుడు వాట్సాప్ కూడా ఎందుకు ఉచిత సేవలను ఆఫర్ చేయకూడాదు, అన్న సందేహం మీలో తలెత్తవచ్చు..? అయితే, వాట్సాప్ అప్లికేషన్ పూర్తిగా యాడ్ ఫ్రీ. ఈ యాప్‌లో ఏ విధమైన ప్రకటనలు మనుకు కనిపించవు. అందుకే ఈ యాప్‌ను అభివృద్థి చేసిన డెవలపర్ తమను సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బును ఆశిస్తోంది.
వాట్సాప్ అడిగిన కొత్త మొత్తాన్ని కూడా మీరు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే పలు ట్రిక్స్‌ను ఉపయోగించి వాట్సాప్ ట్రెయిల్ పిరియడ్‌ను గడువు ఆఖరి తేదీ నుంచి సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం...
స్టెప్ 1 : ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి
స్టెప్ 2: సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: అకౌంట్ విభాగంలోని Delete my account ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: అక్కడ కనిపించే ఫీల్డ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Delete my account పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి పూర్తిగా తొలగించబడతారు.
స్టెప్ 5: ఇప్పుడు కొత్త సమాచారంతో కొత్త వాట్సాప్ అకౌంట్‌ను మీ డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.
స్టెప్ 6: ఇప్పుడు మీ కొత్త వాట్సాప్ అకౌంట్ ముగింపు తేదీని తెలుసుకునేందుకు అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Settings > Account > Payment infoలోకి వెళ్లండి.
స్టెప్ 1: ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను అన్ఇన్స్టాల్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు మరోసారి వాట్సాప్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకని ఇన్స్టాల్ చేసుకోండి.
స్టెప్ 3: కొత్త సమాచారంతో కూడిన కొత్త వాట్సాప్ అకౌంట్‌ను డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.
స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్సాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్సాప్‌లో మనం షేర చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను షేర్ చేసే సమయంలో ఉపయోగించే ఎన్క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్ జోన్లో ఉంచుకునేందుకు పలు చిట్కాలు....
వాట్సాప్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పిన్ నెంబర్ ఇంకా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకండి.
మీకు తెలియని వాట్సాప్ యూజర్ల నుంచి వచ్చిన డేటా ఫైళ్లను ఓపెన్ చేయకండి. వీటిలో ప్రమాదకర వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.
మీకు తెలియన వ్యక్తులతో కమ్యూనికేషన్ సంబంధాలను పెంచుకోవద్దు. మీ కాంటాక్ట్స్‌లో లేని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్లయితే సున్నితంగా తిరస్కరించండి.
వాట్సాప్ మీకు ఏ విధమైన సందేశాలను పంపదు. కాబట్టి వాట్సాప్ పేరుతో వచ్చే సందేశాలను విశ్వసించకండి.
మీ వాట్సాప్ అకౌంట్లోని ఆటోమెటిక్ డౌన్లోడ్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి. తద్వారా ఫోన్ మెమరీ బోలేడంత ఆదా అవుతుంది.
ఓపెన్ వై-ఫై నెట్‌వర్క్‌ల వద్ద మీ వాట్సాప్ అకౌంట్‌ను సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయకండి. ఈ విధమైన నెట్‌వర్క్‌ల వద్ద వాట్సాప్‌తో కనెక్ట్ అయినట్లయితే స్నిఫన్ నెట్వర్క్ ద్వారా మీ సంభాషణలను వేరొకర దొంగిలించే అవకాశ ముంది.
మీ వాట్సాప్ అకౌంట్ కు సంబంధించిన సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. మీ వాట్సాప్ అకౌంట్లో ఇన్కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ' ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.
వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.
స్మార్ట్ఫోన్లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతిఒక్కరూ వాట్స్ యాప్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. తాజాగా వెల్లడవుతోన్న సమాచారం మేరకు ఈ యాప్ ద్వారా ఉచితంగా ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..? దీనికి సంబంధించి ఏ విధమైన అధికారిక సమాచారం వెలువడనప్పటికి ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఓ వాట్స్‌యాప్ యూజర్ డౌన్లోడ్ చేసుకోవటంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఆ వ్యక్తి ఈ సమాచారాన్ని బయట పెట్టటంతో సోషల్ మీడియా ప్రపంచంలో ఈ వార్త హల్చల్ చేస్తోంది.
వాట్స్‌యాప్ 2.11.508 వర్షన్లో మాత్రమే ఈ వాయిస్ కాలింగ్ ఆప్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ వర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్స్‌యాప్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నప్పటికి దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు అది పనిచేయట్లేదని తెలుస్తోంది. ఏదేమైనప్పటికి వాట్స్ యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులకు పండుగే పండుగ.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఇప్పుడు కొత్త మెటీరియల్ డిజైన్‌లో పొందవచ్చు. మునుపటి డిజైనింగ్ వర్షన్‌తో పోలిస్తే కొత్త డిజైనింగ్ ఆకట్టుకునే లుక్‌లో ఉంది. అయితే ఈ అప్డేట్ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఈ లేటెస్ట్ వర్షన్‌ను వాట్సాప్ అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.12.38లో డీప్ గ్రీన్ టైటిల్ బార్లో మూడు ట్యాబ్‌లను అనుసంధానం చేసారు. ఈ ట్యాబ్స్ కాల్స్, చాట్స్ ఇంకా కాంటాక్ట్‌లను సూచిస్తాయి.
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్‌తో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ కానట్లయితే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం కొద్ది కాలం ఎదురు చూడక తప్పదు.
వాట్సాప్ యూజర్ల కోసం పలు చిట్కాలు...
వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.
ఒక ఫోటో మనుకు కనిపిస్తుంది, ఆ ఫోటో పై క్లిక్ చేస్తే వేరొక ఫోటోలా మారిపోతుంది. ఈ ట్రిక్ మీ వాట్సాప్ అకౌంట్లో వర్క్ అవుట్ అవ్వాలంటే, ఐఫోన్ యూజర్లు FhumbAppఅనే అప్లికేషన్‌ను, ఆండ్రాయిడ్ యూజర్లు Magiapp అనే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. (పాఠకులకు గమనిక: Magiappను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించటం జరిగింది)
ఈ ట్రిక్ కేవలం మీ ఫోన్లో మాత్రమే అమలవుతుంది. ముందుగా మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్‌కు సెట్ చేసిన ఫన్నీ ఫోటోను ఎంపిక చేసుకోండి. ఫోటో సైజు 561×561 పిక్సల్ ఉండాలి. మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్‌తో ఫోటోను రీనేమ్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ను SD card > WhatsApp > Profile picture విభాగంలో సేవ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో లేదా నెట్వర్క్ డిసేబుల్ చేయండి.
WhatSaid అనే యాప్‌ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా నకిలీ సంభాషణలను సృష్టించుకోవచ్చు. (పాఠకులకు గమనిక: WhatSaidను గూగుల్ ప్లే స్టోర్‌ను తొలగించటం జరిగింది)
WhatsApp Plus అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా వాట్సాపో ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేసుకోవచ్చు.
ఫోన్లోని ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లి WhatsApp and Profile Picturesను ఎంపిక చేసుకోండి. ఇక్కడ ప్రొఫైట్ ఫోటలతో కూడిన మీ మిత్రుల మొబైల్ నెంబర్లను కనిపిస్తాయి.
Settings -> Chat Settings -> Media auto-download లోకి వెళ్లి ‘When using mobile data', ‘when connected on WiFi' and ‘When roaming' వంటి ఆప్షన్లను అన్‌చెక్ చేయటం ద్వారా ఆటోమెటిక్ మల్టీ మీడియా కంటెంట్‌ను నిలిపివేయవచ్చు.
అనుకోకుండా విహార యాత్రను ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చూడవల్సిను ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఆ ప్రదేశాలను తిలకించటం కాస్తంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవటం ద్వారా విహారయాత్రను ఏ మాత్రం మిస్ కాకుండా పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. విండోస్ పీసీ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మీ వద్ద ఉన్న ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించుకుండా డిజిటల్ క్యామ్ లేదా ఇంటర్నెట్ ద్వారా మీరు సేకరించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవచ్చు.
ముందుగా ఫోల్డర్లో మీకు కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.
ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక పోటోనే కావాలా, లేకు రెండు ఫోటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫోటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్బ టన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫోటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను కలిగి ఉన్న ఉద్యోగులు ఆన్ లైన్లో ఈ పాస్ బుక్ ద్వారా బ్యాలెన్స్‌ను, లావాదేవీలను చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ పాస్ బుక్‌ను పలుమార్లు డౌన్ లౌడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఈ సర్వీసుని ఉద్యోగులు పొందాలనుకుంటే చేయాల్సిందల్లా ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో రిజస్టర్ చేసుకోవడమే. ఇందుకు గాను మీరు పీఎఫ్ నెంబర్, కోడ్, పే స్లిప్‌లో ఉన్న మీ పేరుతో నమోదు చేసుకోవాలి.
ఫోటో గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్న పాన్, ఆధార్, ఎన్పీఆర్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, ఓటరు ఐడీ, రేషన్ కార్డ్ లాంటి వాటితో పీఎఫ్ దారుడు మెంబర్ పోర్టల్‌లో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్‌ని వినియోగించి రిజస్టర్ అవ్వొచ్చు.
1. ముందుగా ఈపీఎఫ్ఓ వైబ్ సైట్‌ను సందర్శించండి.
2. మొబైల్, డాక్యుమెంట్ ప్రకారం పుట్టినరోజు లాంటి వివరాలను నమోదు చేయండి.
3. బాక్సులో చూపించిన పదాలను టైప్ చేయిండి.
4. పిన్ నెంబర్ కోసం క్లిక్ చేయండి.
పైన మీరు పొందుపరచిన మొబైల్ నెంబర్‌కు పిన్ నెంబర్ వస్తుంది. ఈ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
పూర్తి వివరాలతో లోపలికి లాగిన్ అయిన తర్వాత, మెను బార్లో ఈ పాస్ బుక్‌ను సెలక్ట్ చేసుకోండి.
మీ ఈ పాస్ బుక్‌ను డౌన్ లౌడ్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోండి.
ఆధారము: తెలుగు.గిజ్ బాట్.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020