- మీ వ్యక్తిగత వివరములను ఇవ్వకండి ప్రయాణాల తేదీలను, మీరు చూచుటకు వెళుతున్న సినిమా సమయము మరియు స్థల వివరములు , సాయంత్ర వేళ వెళ్ళు క్లాసుల వివరములు మొదలగు మీ వ్యక్తిగత వివరములను ఆన్ లైన్ లో ఇవ్వకూడదు.
- మీ వ్యక్తిగత వివరములను రహస్యముగా ఉంచండి పరిచయములేని వారితో జాగ్రత్త .
- స్నేహితులు పరిచయస్తులు కాని వ్యక్తులతో స్నేహముకొరకు విన్నపములను మరియు మీ వ్యక్తిగత వివరములను ఇచ్చుటకు తిరస్కరించండి. సంబంధాలు బెడిసి నప్సుడు దూషించు మరియు అసభ్యకర సందేశములను పంపవచ్చు.
క్రింది ప్రమాదములతో జాగ్రత్త
స్పామ్
స్పామ్ అంటే ఏదైన వస్తువు గురించి ను ఈ-మెయిల్ లిస్టుకు లేదా ఈ-మెయిల్‌గ్రూపులకు పంపు అనవసర ఈ-మెయిల్ ప్రకటన లు. అలాగే స్పామర్స్ కూడా అనవసర ఈ-మెయిల్స్ ను ఉచిత సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ను వినియోగించు కొన్ని బిలియన్ల వినియోగదారులకు,స్పామర్లు సులభంగా వారి వ్యక్తిగత సమాచారమును సేకరించి పంపుచున్నారు.
స్కామ్స్
సాధారనంగా ఆన్ లైన్ స్కామర్స్ , వినియోగదారులను కొత్త ఫాలోవర్సను జత చేసుకొనుటకు వ్యక్తిగత వివరములకై అడుగుచూ లింకుతో ఉన్న ఈ-మెయిల్ లేదా సందేశములను పంపుతారు. ఈ లింకులు అప్లికేషన్స్, గేమ్స్ మొదలగునటువంటి వాటిలాగా ఉంటాయి. ఎప్పుడైనా వినియోగదారుడు తమ వ్యక్తిగత వివరములను ఈ లింకులకు పంపిన వెంట స్కామర్స్ ఆ వివరములను తీసుకొని దుర్వినియోగపరచవచ్చు.
హానికర అప్లికేషన్స్
హానికర అప్లికేషన్స్, వివిధ అప్లికేషన్స్ ను వినియోగించునప్పుడు లేదా సాఫ్ట్ వేర్ ఇస్టలేషన్ అప్పుడు రావచ్చు. అప్లికేషన్ ఇన్స్టలేషన్ మొదలు పెట్టుటకు లేదా విడియోలను వీక్షించుటకు లింకులు మొదలగు వాటికై సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్ పై క్లిక్ చేస్తే , మీరు అడిగిన అప్లికేషన్స్ ను మొదలు పెట్టుటకు మీమౌలిక సమాచారమును, మీ వాల్ అప్ డేట్ , వాల్ పై పోస్టు చేయుటకు వారికి వీలు కల్పించవలసిండిగా అడుగుతూ, ఇటువంటి హానికర అప్లికేషన్స్ రావచ్చు.
క్లిక్ జాకింగ్
ఇంటర్నెట్ వాడకందారు ప్రమాదరహిత వెబ్ పేజీలపై క్లిక్ చేస్తున్నసమయంలో వారిని తప్పుదోవ పట్టించి వారి రహస్యసమాచారాన్ని రాబట్టుకోవటం, ఆ కంప్యూటర్‌ను తమ అధీనంలోకి తీసుకోవటం అనేమోసాన్ని క్లిక్ జాకింగ్ అంటారు. అనేక బ్రౌజర్‌లు, ప్లాట్‌ఫామ్‌లు క్లిక్‌జాకింగ్‌కు అనువుగా ఉన్నాయి. వాడకందారుకు తెలియకుండానే నడిచే ఎంబెడెడ్ కోడ్ లేదా స్క్రిప్ట్‌ద్వారా క్లిక్‌జాకింగ్ జరుగుతుంది. ఇది సోషల్‌నెట్‌వర్కింగ్ డొమైన్‌లోకూడా జరుగుతుంటుంది. వాడకందారులతో కొన్ని లింక్‌లు, ఐకాన్‌లు, బటన్‌లు మొదలైనవాటిపై క్లిక్ చేయించటంద్వారా వారికి తెలియకుండా వారే హానికరమైన పనులు చేసేటట్లు చేయటం ఈ చర్యవెనక ఉన్న లక్ష్యం.
ఫిషింగ్
అసలు వెబ్‌సైట్‌లాగానే నకిలీ సైట్‌ను సృష్టించటాన్ని ఫిషింగ్ అంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. బ్యాంకులు, సుప్రసిద్ధ వాణిజ్య వెబ్‌సైట్లపై చేసినట్లుగానే సోషల్ నెట్‌వర్కింగ్‌లోకూడా ఇప్పుడు ఫిషింగ్ జరుగుతోంది. ప్రత్యేకమైన థీమ్‌లు అందిస్తున్నామని, ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోమని, సెక్యూరిటీ అప్లికేషన్/ఫీచర్స్ అప్‌డేట్ చేసుకోమనితెలుపుతూ బూటకపు ఈమెయిల్స్, సందేశాలు పంపటం సోషల్ నెట్‌వర్కింగ్‌లో జరిగే ఫిషింగ్. ఆ అప్‌డేట్స్ చూడటానికి నెట్ వాడకందారు ఒక లింక్‌ను అనుసరించి, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వారి వివరాలను మోసగాళ్ళు సేకరిస్తారు. అసలు లాగిన్‌పేజికి నకలుగా సృష్టిచబడిన ఆ లింక్‌పేజి రహస్యసమాచారాన్ని సేకరించటానికి ఉద్దేశించబడినది.
అప్‌డేట్ చేసిన స్పామ్-బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌నే ఎల్లప్పుడూ ఉపయోగించండి.
మార్గదర్శకాలు
- మీ పేరు, ఇంటి/పాఠశాల చిరునామా, ఫోన్ నంబర్‌లు, వయస్సు, లింగం, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు ఇవ్వొద్దు, పోస్ట్ చేయొద్దు.
- ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద సమాచార మార్పిడి సాధనంకాబట్టి మీరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ చూడొచ్చు. మీరు వాడుతున్న వెబ్‌సైట్‌నే వాడే ఇతరులు మీరు పోస్ట్ చేసిన సమాచారాన్ని , మీ ప్రొఫైల్‌ను తెలుసుకోవచ్చు. మీ ఎకౌంటును చూసేవారిలో మీ తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లువంటి మంచివారితో పాటు అపరిచితులైన చెడ్డవారు కూడా ఉంటారు.
- మీరు వెబ్ సైట్లలో ఇచ్చిన సమాచారము మిమ్ముల్ను ఇరికించటానికికూడా ఉపయోగపడే అవకాశం ఉన్నదని గుర్తుంచుకోండి.
- మీ పాస్ వర్డ్ ను మీ తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్ప ఇంకెవరికి ఇవ్వరాదు.
- మీ పాస్ వర్డ్ ను తరుచుగా మార్చుతూ ఉండండి మరియు తిరిగి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు పంపే లింకులపై క్లిక్ చేయకండి.మీరు తిరిగి మీ ఎకౌంటు లోకి వెళ్ళుటకు బ్రౌజర్లలో టైపు చేయండి లేదా మీరు సేవ్ చేసిన బుక్ మార్క్స్ ను ఉపయోగించండి.
- సోషల్ నెట్ వర్క సైట్లను ఎన్నుకున్నప్పుడు గోప్య వివాదాస్పద అంశాలను పరిశీలించాలి.
- సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో స్నేహితులను జత పరుచుకునేటప్పుడు మీకు తెలిసినవారిని మాత్రమే అంగీకరించండి.
- ఎప్పుడూ కూడ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పరచయమైన వ్యక్తులను వ్యక్తిగతంగా కలవకూడదు. ఎందుకంటే వారు మీకు చెప్పిన విధమైన వ్యక్తులు కాకపోవచ్చు.
- సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పరచయమైన వ్యక్తులను కలిసే ముందు మీ తల్లిదండ్రుల అంగీకారమును పొందండి.
- సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు , వాడకందారు తమ సమాచారాన్ని ఎవరెవరు చూడొచ్చని నియంత్రించుకోటానికి అవకాశాలు కలిగిస్తున్నాయి. ఈ సౌలభ్యలను వినియోగించుకోండి.
- మీ కుటుంబ గౌరవాన్ని భంగ పరిచే టపాలను రాయకండి.
- సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పరిచయములేని వ్యక్తులకు మీ ఫొటోలను, విడియోలను మరే ఇతర సున్నితమైన సమాచారమును పంపవద్దు.
- సోషల్ నెట్ వర్కింగ్ ఎకౌంటు నుండి మీ సమాచారమును మార్చినా లేక దొంగలించబడినా వెంటనే సోషల్ నెట్ వర్కింగ్ సపోర్ట్ టీంకు తెలియచేయండి.
- మీ ప్రొఫైల్ లో ఎవరైన పరుషమైన లేదా బాదకలిగించు విధంగా పొస్టులు రాస్తే స్పధించకండి.
- అనవసరమైన విమర్శలను పంపించి స్నేహితులను లేదా సందేశాలను తొలగించి ఈ విమర్శలను నెట్ వర్కింగ్ సైట్లకు తెలియ చేయండి.
- మీ స్నేహితుల వివరాలను నెట్ వర్కింగ్ సైట్ల లో పోస్టు చేయకండి. అది వారిని ఇబ్బందివకి గురిచేయవచ్చు. వారి గ్రూపు ఫొటోలను, స్కూలు పేరును, చిరునామాలను, వయసు మొదలగునవి పోస్టు చేమకుండా వారిని సంరక్షించండి.
- నెట్ వర్కింగ్ సైట్ల లో మీరు చేయబోవు పనులను పోస్టు చేయకండి.
- నెట్ వర్కింగ్ సైట్ల లో ని సెట్టింగులను పరిశీలించి , మీరు స్నేహితులుగా అంగీకరించిన వ్యక్తులు మాత్రమే జతపరుచుకొనేలా సెట్ చేయండి మరియు మీరు స్నేహితులుగా అంగీకరించిన వ్యక్తులు మాత్రమే మీ ప్రొఫైల్ వీక్షించేలా సెట్ చేయండి.
ఆధారము: http://www.infosecawareness.in/