డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి
క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డు/ఏటిఎమ్ కార్డు వాడుటకు ముందు తీసుకో వలసిన జాగ్రత్తలు
- మీరు బ్యాంకు నుండి కార్డుఅందుకునేముందు ఆ కవర్ మొత్తం సీల్ చేయబడి ఉన్నట్లుగా, ఎటువంటి డేమేజ్ లేకుండా ఉన్నట్లుగా నిర్ధారించుకోండి.
- మీరు బ్యాకు నుండి కార్డు తీసుకున్న వెంటనే కార్డుపై సంతకం చేయండి.
- కార్డువెనకాల ఉన్న చివరి మూడు అంకెల (సివివి) నంబరు మూసిఉంచుటకు ప్రయత్నించండి.
- ఖాతా లావాదేవీలను సరిచూసుకోటానికి మీ ఫోను నంబరును రిజిష్టర్ చేసుకోండి.
- మీ పిన్ నంబరును వెంటనే మార్చేయండి.
షాపింగ్ మాల్స్ మరియు రెస్టారెంట్‌లలో సురక్షితంగా క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను వాడటం
- అమ్మకందారు మీ కార్డ్‌ను ఎలా స్వైప్ చేస్తున్నాడనేదానిని ఒక కంట గమనిస్తుండండి.
- లావాదేవీలు ఎల్లప్పుడూ మీ ఎదుటే జరిగేటట్లు చూసుకోండి
- ఖాళీగా ఉన్న క్రెడిట్ కార్డ్ రసీదుపై ఎప్పుడూ సంతకం చేయొద్దు. రసీదులో ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఒక గీత గీయండి.
- రెస్టారెంట్స్/షాపింగ్ మాల్స్‌లో ఇచ్చే సర్వే పత్రాలలో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దు.
ఇంటర్నెట్‌లో క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను సురక్షితంగా ఉపయోగించటం
- లావాదేవీలకు, షాపింగ్‌కు ఎల్లప్పుడూ సురక్షిత వెబ్‌సైట్లనే వాడండి.
- మీకు తెలిసిన, విశ్వసనీయమైన వ్యాపారులవద్దే కొనుగోలు చేయండి.
- భద్రతకు సంబంధించిన గుర్తులున్నాయో, లేదో చూడండి.
మీ బ్రౌజర్ అడుగున ఒక తాళం బొమ్మ, https:తో మొదలయ్యే యూఆర్ఎల్ వంటి భద్రతా గుర్తుల(మీ ఖాతా సమాచారాన్ని కాపాడటానికి మీ కొనుగోళ్ళను ఎన్‌క్రిప్షన్‌తో భద్రపరిచినట్లు ఈ గుర్తులు తెలుపుతాయి)కోసం చూడండి.
- ఫిషింగ్ మోసాలను తప్పించుకోవాలంటే ఈ మెయిల్ మెసేజ్‌లన్నింటిని అనుమానంతో చూడండి. ఆర్ధిక సమాచారంతోసహా వ్యక్తిగత సమాచారాన్ని అడిగే ఈమెయిల్ మెసేజ్‌లకు స్పందించకండి... బ్యాంక్‌లు అలాంటి సమాచారాన్ని కోరవు.
- మీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో ఆన్‌లైన్ లావాదేవీ జరిపిన తర్వాత ఆ వెబ్‌సైట్‌నుంచి వెంటనే లాగ్ఆఫ్ అవ్వండి మరియు బ్రౌజర్ కుకీలను తొలగించండి.
- పేమెంట్ సమాచారాన్ని ఈమెయిల్‌ద్వారా ఎప్పుడూ పంపొద్దు. ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించే(ఈమెయిల్‌వంటివి)సమాచారం ఇతరులు చదవకుండా ఉండటం పూర్తిగా అసాధ్యమని చెప్పలేం.
- ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం ఇచ్చేటపుడు అప్రమత్తంగా ఉండండి.
- ప్రోత్సాహక పథకాలమోసాలపట్ల జాగ్రత్తగాఉండండి. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేవారు ఫోన్ ఆఫర్‌లను ఉపయోగించుకుని మీ వ్యక్తిగత సమాచారాన్ని అడగొచ్చు.
- మీ పాస్‌వర్డ్‌లను రహస్యంగా ఉంచండి. కొన్ని ఆన్‌లైన్ దుకాణాలలో కొనుగోలు చేసేముందు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదుచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఏటీఎమ్ పిన్‌ను కాపాడుకున్నట్లే ఈ ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లనుకూడా రహస్యంగా, బయటవారికి తెలియకుండా భద్రపరుచుకోవాలి.
మీ క్రెడిట్ కార్డ్ మరియు పిన్‌ను ఒకేచోట ఎప్పుడూ ఉంచకండి.
చేయవలసినవి
- ఏటీఎమ్ ఉపయోగించేముందు, కార్డ్ చొప్పించే ప్రదేశంలో ఏమీ ఉండకుండా చూసుకోండి(స్కిమ్మింగ్ కాకుండా ఉండటానికి).
- లావాదేవీ చేసేటపుడు పిన్ నంబర్‌ను రహస్యంగా ఉంచండి. లావాదేవీ రసీదులను వెంట ఉంచుకోవద్దు.
- బ్యాంకులు సూచించినట్లు మీ ఏటీఎమ్ పిన్‌ను మూడునెలలకొకసారి మార్చండి.
- లావాదేవీలలో మోసాలకు గురికాకుండా ఉండటానికి మీ క్రెడిట్ కార్డ్ రసీదులను దాచి ఉంచండి. మీ మంత్లీ స్టేట్‌మెంట్‌తో వాటిని సరిచూసుకోండి.
- బాగా అవసరమైన క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే వెంట తీసుకెళ్ళండి.
- మీ క్రెడిట్ కార్డ్ నంబర్ ఉన్న రసీదులను చించేయండి.
- మీ అడ్రస్ మారినట్లయితే, క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంక్‌లకు మందే తెలియజేయండి.
- మీ క్రెడిట్ కార్డ్ పోయినట్లయితే, వెంటనే ఆ విషయాన్ని తెలియజేయండి.
- రెన్యూవల్/అప్‌గ్రెడేషన్ సమయంలో మీ కార్డ్‌ను పారవేయాలనుకుంటే, ముందు దానిని అడ్డంగా కత్తిరించి పారవేయండి.
చేయకూడనివి
- బ్యాంక్‌నుంచి కార్డ్ వచ్చిన కవర్ చిరిగిపోయిఉన్నా, సీల్ తెరిచి ఉన్నా దానిని స్వీకరించొద్దు.
- మీ క్రెడిట్ కార్డ్‌పై పిన్ నంబర్ రాయొద్దు
- మీరు అరుదుగా ఉపయోగించే అదనపు క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్ళొద్దు.
- మీ క్రెడిట్ కార్డ్ నంబర్/ఏటీఎమ్ పిన్‌ను ఎవరికీ తెలపొద్దు.
- మీ కార్డ్‌ను ఎవరికీ ఇవ్వొద్దు...బ్యాంక్ ప్రతినిధులమని ఎవరైనా చెప్పినాకూడా.
- ఏటీఎమ్ మెషిన్‌ను ఉపయోగించటంలో సాయపడతామని కొత్తవారెవరైనా ముందుకొస్తే, వారి సాయాన్ని తీసుకోవద్దు.
- ఏటీఎమ్ మెషిన్ సరిగా పనిచేయకపోతే దానిని ఉపయోగించొద్దు.
- మీ ఖాతా వివరాలను తెలియనివారు/ధృవీకరించబడినివారికి బదిలీ చేయొద్దు, పంచుకోవద్దు.
- అందరూ ఉపయోగించే ఇంటర్నెట్ సెంటర్లవంటి కంప్యూటర్లలో మీ క్రెడిట్/డెబిట్ కార్డులనుపయోగించి నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్ లైన్ పేమెంట్‌లు చేయొద్దు.
- మీరు ఊహించని చోట్లనుంచి వచ్చే ఈ మెయిల్ ఎటాచ్‌మెంట్లను, ఇన్‌స్టెంట్ మెసేజ్ డౌన్‌లోడ్ లింక్‌లను ఓపెన్ చేయొద్దు. అనుమానాస్పద ఈ మెయిల్‌లను వెంటనే తొలగించండి.
- ఫోన్ చేసింది మీరే అయితేగానీ, ఆ కంపెనీ మంచిదని మీకు తెలిస్తేనేగానీ మీ ఖాతా వివరాలను ఫోన్‌లో చెప్పొద్దు. మీరు ఫోన్ అందుకున్నపుడు మీరు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని బయటకు చెప్పొద్దు(దీనినే విషింగ్ అంటారు).
- సురక్షితంగాని వెబ్‌సైట్‌లో మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఇవ్వొద్దు.
- ఆదాయపు పన్నుశాఖ, రిజర్వ్ బ్యాంక్‌వంటి ప్రభుత్వ అధికారులు, వీసా లేక మాస్టర్ కార్డ్‌వంటి ఏదైనా కార్డ్‌లు ఇచ్చే సంస్థ ప్రతినిధులు ఈమెయిల్ ద్వారా కోరినాకూడా మీ పాస్‌వర్డ్, కస్టమర్ ఐడీ, డెబిట్ కార్డ్ నంబర్, పిన్ సీవీవీ2, జన్మదినతేదీ వంటి కీలక సమాచారాన్ని ఇవ్వొద్దు.
- మీ బ్యాంక్ ఖాతా సమస్యలనుగానీ, మీ ఖాతా వివరాలనుగానీ, పాస్‌వర్డ్‌నుగానీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో లేదా బ్లాగ్‌లో ప్రస్తావించొద్దు.
- ఏటీఎమ్ పిన్ వంటి కీలక సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్‌లో పెట్టొద్దు.
ఆధారము: http://www.infosecawareness.in/
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.