ఈ-మెయిల్స్‌ద్వారా వచ్చే ఉద్యోగావకాశాలపట్ల జాగ్రత్తగా ఉండండి
- చాలామంది విద్యార్ధులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. వెబ్‌సైట్‌లలో నమోదైన వీరి వివరాలను మోసగాళ్ళు సేకరించి బూటకపు ఈ-మెయిల్స్ పంపుతుంటారు.
- ఈ ఈ-మెయిల్‌కూడా నిజమైన కంపెనీలు పంపే మెయిల్‌లాగానే కనిపిస్తుంది. మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సైట్లద్వారా ఈ మెయల్స్‌ను పంపి ఇంటర్వ్యూలుకూడా నిర్వహిస్తారు.
- బాధితుడికి ఉద్యోగంలో చేరమంటూ ఒక మోసపు నియామకపత్రం అందుతుంది. ఈ లేఖ అందుకున్నవారు ఒక పెద్దమొత్తం చెల్లించాలనికూడా మోసగాళ్ళు ఆ లేఖలో సూచిస్తారు.
- మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సర్వీస్ ద్వారా ఉద్యోగనియామక పత్రాన్ని పంపుతారు. బహుళజాతిసంస్థ పేరుతో ఫోన్ చేయటం, ఉద్యోగ నియామకపత్రాన్ని పంపటం చేస్తుంటారు. వారి మాటలు నమ్మి ఉద్యోగార్థులు వారి ఖాతాలలో డబ్బును జమచేస్తారు. మోసగాళ్ళు వెంటనే ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు.
ముందుజాగ్రత్తలు
- స్పామ్ మేయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో సరిచూసుకోకుండా జవాబు ఇవ్వరాదు.
- అభ్యర్దులు సంస్థలతో స్వయముగా మాట్లాడనంత వరకు డబ్బులు ఖాతాలలో జమ చేయకూడదు.
- డబ్బులు చెల్లించి ఉద్యోగాలను పొందునటువంటి ప్రక్క దారులను ప్రయత్నించకండి, అవి మోసపూరితమైనవి.
- ఉద్యోగ అవకాశాలకై సంస్థలయోక్క వెబ్ సైట్లలో సరిచూసుకోండి.
సంస్థల నకిలీ ఈ-మెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి.
- ఈ-మెయిల్స్ ద్వారా చేయు వ్యాపార లావాదేవీలకు ముందు ఈ-మెయిల్ ఐడి లోని ప్రతి అక్షరమును సరిచూసుకోండి.
- నగదును సంస్థల ఖాతలలో జమచేయు ముందు వారి ఖాతా మరియు సంస్థ పేరుల వివరముల ఏమైన మార్పులు ఉన్నాయేమొ ఫోనులో అడిగి తేలుసుకోండి.
- మీ ఎకౌంటును తెరుచుటకు సెకెండ్ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ (మొబైల్ ఎలర్ట్) ను నిర్వహించండి .
- ఏదైన మోసపూరితమైనవి గమనించి నపుడు సంస్థలకు వెంటన తెలియపరచండి.
- స్పామ్ ఈ-మెయిల్స్ ఎక్కడనుండి వచ్చాయే సరి చూసు కోకుండా ప్రత్యుత్తరము ఎవ్వకూడదు.
ఆధారము: http://www.infosecawareness.in/
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.