অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆన్లైన్ లో ఆధార్ కార్డు గ్యాస్ ఎకౌంటు లింకింగ్

ఆన్లైన్ లో ఆధార్ కార్డు గ్యాస్ ఎకౌంటు లింకింగ్

మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం సులబమయిన 4 steps follow అయి చేసుకోండి , మీ ఫ్రెండ్స్ / బందువులకి కూడా చేసిపెట్టండి . ఇలా చేయండి : ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx

  • Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి
  • Step 2: Choose Benefit Type లో ... Benefit Type - (LPG) Scheme Name - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి
  • Step 3: Enter your details... దగ్గర Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ పంపబడుతుంది ,
  • Step 4: Confirm Request మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని ఎంటర్ చేయండి . Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది . మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు . తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు.

వ్యాసం: అశోక్ చేలిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate