విద్య అనేది వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి కూడా ప్రాథమిక విద్య పునాది వంటిది. ప్రాథమిక విద్యను నేర్చుకునే పిల్లలను మరింతమందిని చేర్చుకోవడంలో, వారు మధ్యలో మానకుండా కొనసాగేలా చూడడంలో, హాజరు శాతాన్ని మెరుగుపరచడంలో, దేశ జనాభాలో దాదాపుగా మూడింట రెండువంతులమందికి అక్షరాస్యతను విస్తరించడంలో ఇటీవలి సంవత్సరాలలో ఇండియా ఎంతో ప్రగతి సాధించింది. ఇండియా ఆర్ధిక ప్రగతికి ఒక ప్రధాన సాధనంగా మనదేశంలో విద్యా వ్యవస్థ మెరుగుదలను తరచు ప్రస్తావించడం కూడా జరుగుతున్నది. అయితే, అదే సమయంలో, మనదేశంలో ప్రాథమిక విద్య నాణ్యత పరంగా అందించడంలో ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నది.
ఇండియాలో, 14 ఏళ్ళ వయస్సు వరకు బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య కల్పిస్తామన్నది రాజ్యాంగ పరమైన హామీ. 6-14 ఏళ్ళ వయసు పిల్లలందరికి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత పార్లమెంటు విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది కూడా. అన్ని పల్లెలు, వాడలలో విద్యా వసతులు కల్పించడం, ప్రాథమిక విద్య నేర్చుకునే వయసున్న బాలబాలికలను నూటికి నూరు శాతం పాఠశాలలలో చేర్చుకోవడం, అందరూ కొనసాగేలా చూడడం అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యం (అందరికి ప్రాథమిక విద్య….యు ఇ ఇంకా ఊరిస్తూనే వున్నది. ఈ అంతరాన్ని పూరించడంకోసమే , ప్రభుత్వం 2001 లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే మిక్కిలి విస్తృతమైన కార్యక్రమాలలో ఇది ఒకటి.
ఈ సమాచార సాంకేతిక యుగంలో , విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వున్నవారికి-లేనివారికి మధ్య గల అంతరాన్ని తొలగించడానికి, ఐ సి టి ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నది. ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే అందిస్తున్న విద్యా సమగ్ర సమాచార దర్శిని (వెర్టికల్), ఇండియాలో సార్వత్రిక ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని సాధించడంలో, ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సాధన సంపత్తులను సమకూర్చి, సాధికారత కల్పించే ఒక ప్రయత్నం.
భారతదేశ స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించడం జరుగుతుంది.
దేశ ప్రజలందరూ సమగ్రమైన విద్యను పొందుటకు భారతదేశ ప్రభుత్వము అందరికి ఆమోదయోగ్యమైన విధానాలు, పధకాలను రూపొందించింది. వాటిని గూర్చి ఈ పోర్టల్ నందు తెలుసుకొనవచ్చు.
ఈ విభాగం బాలలకు సంబందించిన ప్రాధమిక విద్య అంశాల పై విద్య విజ్ఞానం, బాలికల జీవన నైపుణ్యాలు, బాలల సైన్స్ విభాగం, మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత వివిధ సమాచారం కలిగిఉన్నది.
ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము.
ఇండియాలో కార్మికుల్లా పనిచేసే బాలికలకోసం ఒక విశిష్టమైన పద్ధతిని ఎంవి ఫౌండేషన్ తయారుచేసింది : సమాజాలను, ప్రభుత్వాలను వెట్టి చాకిరీ , బాల కార్మిక వ్యవస్థలెంత అమానుషమైనవో వారికి తెలియజేసి వారిని సమాయాత్తం చేయడం.
పదో తరగతి తర్వాత అందుబాటులో ఉండే కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ ఉపాధి ప్రగతికి మార్గదర్శకత్వం.
ఈ వెబ్ పోర్టల్ యొక్క ఐటి అక్షరాస్యత విభాగం ఈ ప్రాంతాలలో వెబ్ లోని లభ్యమయ్యే రకరకాలైన టెక్నాలజీల గురించి తెలియజేసింది. కంప్యూటర్ యొక్క ప్రధానాంశాలు మరియు ఆధారభూతమైన హార్డ్ వేరు టిప్స్ మరియు ఎంచుకున్న ప్రాంతీయ భాషలలో తరచుగా అడిగే ప్రశ్నలను అందిస్తుంది.
ఈ సమాచార సాంకేతిక యుగంలో , విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వున్నవారికి-లేనివారికి మధ్య గల అంతరాన్ని తొలగించడానికి, ఐ సి టి ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నది.
ఈ చర్చా వేదిక యందు విద్యా సంబంధిత విషయముల గూర్చి చర్చించెదరు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/26/2020
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖమ్మం జిల్లా మరియు చత్తీస్ ఘఢ...
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనస...
లైంగిక నేరాల నుండి బాలల రక్షణకు POCSO ఇ-బాక్స్ గు...
వ్యక్తులు సాధించిన విజయాలు