కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాజమండ్రిలో జనమించారు. అయన తల్లిదండ్రులు పున్నమ్మ, సుబ్బారాయుడు గారాలు. చిన్నప్పటి నుండి అయన చదువులో, ఆటల్లో ప్రథముడిగా ఉండేవారు. అందువల్ల ఉపాధ్యాయులు ఆయన్ను మెచ్చుకునేవారు. తొట్టి విద్యార్థులు సైతం అప్పుడప్పుడు తమకు తెలియని పాఠాలు ఆయనచేత చెప్పించుకొనేవారు.
విద్యాబ్యాసం పూర్తి ఐన తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరాడు. ఆ కాలంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపుదలకు కృషిచేశాడు, స్త్రీలు చదువుకొంటేగాని సమాజం అభివృద్ధిచెందాడనే భావంతో బాలికల కోసం పాఠశాలను స్ధాపించాడు. విద్యార్థుల్లో ధర్మం, దయ, నీతి, పరోపకారం, చిత్తశుద్ధి, శీలం, సత్ప్రవర్తన అలవరచడానికి పాటుపడ్డాడు.
ఆ కాలంలో చదువుకొన్న వారి సంఖ్య చాలా తక్కువ. కాయాకష్టంచేసి వ్యవసాయాది వృత్తులు చేసేవారే ఎక్కువ. ప్రజల్లో అమాయకత్వం కూడా ఎక్కువగా ఉండేది. అంటరానితనం, ముధునమ్మకాలు, బాల్యవివాహాలు, మత్తుపానీయాల వాడకం మెదలైన దురాచారాలు సహజంలో బాగాలయ్యాయి. ఇలాంటి దురాచారాలనన్నిటిని ఎదిరించి సమాజ సంస్కారాలకు నడుంకట్టాడు. బాల్య వివాహాలను నిరసించాడు. ఈ బాల్య వివాహాల బారినపడి వితంతువులైన స్త్రీలకు పునర్వివాహాలు చేయించడానికి పూనుకున్నాడు.
వీరేశలింగం ఎన్నో పుస్తకాలు రాశాడు. అయన రాసిన పుస్తకాలలో కవుల చరిత్ర, రాజశేఖర చరిత్ర, ప్రహసనాలు మెదలైనవి ముఖ్యమైనవి. వారు వివేకవర్ధని మెదలైన ప్రత్రికలను కూడా నడిపాడు. అయన పుస్తకాలు, పత్రికలు అన్ని సహజంలోని దురాచారాలను ఖండించడానికి, సంస్కరణల ప్రచారానికి, అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.
నూరు మాటలు చెప్పేకంటే ఒక మంచిపని చేసి చూపటం అధిక ప్రయెజనం కల్గిస్తుంది. అని అయన పడే పడే బోధించాడు. స్వయంగా ఆచరించాడు గూడా. జనుల్లో విద్య వ్యాపించాలని, ప్రజలు తమ హక్కులను గూర్చి తాము తెలిసికోవాలని, స్వేచ్ఛగా బ్రతకాలని ప్రబోధించాడు. అయన తాను మరణించేవరకు క్షణంగూడా కలం వృధాచేయలేదు. తన జాతి జనులకు మేలు కలిగించే, ఉత్తేజం కళించే, పనులను చేస్తున్న వచ్చాడు. సంఘాల్లో మార్పుల కోసం కృషిచేసిన తొలినాటి మార్గదర్శకులలో వీరేశలింగం అగ్రగణ్యుడు. అయన కూడా అందరూ సంస్కర్తల వలెనె అపార్ధాలకు, అవహేళనలు గురయ్యాడు. ఆయన వానిని అన్నిటిని దైర్యంగా ఎదిరించి నిల్చిన మహోన్నత వ్యక్తి వీరేశలింగం పంతులుగారు. అయన గొప్ప అభ్యుదయవాది. సాహితీవేత్త, సంఘా సంస్కర్త. 'రావ్ బహదూర్', 'గద్య తిక్కన' అనే బిరుదులూ పొందాడు. మన తెలుగువారికి అయన ప్రాతః స్మరణీయుడు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020