దోమ సుమారు 30 రోజులు బతుకుతుంది. జుయ్ మని హోరు పెడుతా, జత కలవడం కోసం ఎగరడంతో దాని జీవితం ప్రారంభమవుతుంది. ఈ విషయంలో ఆడదోమకి చొరవ ఎక్కువ. మగదోమని పట్టుకొని దాని శుక్లాన్ని సంగ్రహిస్తుంది. ఆ తరువాత 48 గంటలకి ఒక్కొక్కసారి అయిన జంతువుల రక్తం కోసం తహతహ లాడిపోతుంది. రక్తంలోని “ఎమైలో” ఆసిడ్లు లభిస్తే కాని దోమ గుడ్లు పరిక్వంకావు. ఆ రక్తం తాగేక సుమారు 40 గుడ్లు ఏ మురికి నీటిలోనో పెడుతుంది. ఆడదోమ రెండేసి రోజుల కొకసారి చొప్పున తనజీవిత కాలంలో సుమారు 15 సార్లు గుడ్లు పెడుతుంది. మగదోమ తో మొదటి సంపర్కంలో లభించిన శుక్లమే అన్నింటికీ సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మగదోమ కోసం పరిగెత్తవలసిన అగత్యం దానికిలేదు. కాని రక్త భోజనం మాత్రం విధిగా ఉండాలి.
ఇదిగో ఈ కారణం చేత ఆడదోమలు మాత్రమే జంతు రక్తం కోసం వెంపరలాడుతాయి. ఆడదోమలు మాత్రమే మనల్ని కుట్టి రక్తం పీల్చుకుంటాయి. తద్వారా జబ్బులు కలిగించేవి అన్నీ ఆడదోమలే. మగ దోమలకి జంతు రక్తం తాగవలసిన అవసరం లేదు. అవి చెట్ల ఆకుల రసాలను పీల్చుకొని కాలక్షేపం చేస్తాయి. అవి పక్కా శాఖాహారులు.
ప్రశ్న అడిగినవారు: యం.నీరజ.గుంటూరు
జవాబు టెలిపినవారు: డా. ఎం. వి. రమణయ్య
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/21/2023