బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?
బొగ్గులో కార్బన్ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్ కణాలే కాకుండా కార్బన్, హైడ్రోజన్ కలిసి ఉండే హైడ్రోకార్బన్ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.
బొగ్గును కాల్చినపుడు కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.
ఈనాడు దినపత్రిక నుంచి సేకరణ
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
పాదరసం తయారీ ఎలా జరుగుతుంది?
సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహమూలకం (metallic elements) పాదరసమే. పాదరస పరమాణువులో ఉన్న 80 ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉండడం వల్లనే పాదరసం ద్రవ రూపంలో ఉంటుందనీ తేలిగ్గా వాయురూపంలోకి వెళ్తుందని రసాయనిక శాస్త్రం చెబుతుంది. పాదరసాన్ని భారమితి రక్తపీడన మాపనం, ఉష్ణమాపనం (థర్మోమీటర్), విద్యుత్తు బల్బులు, విద్యుద్రసాయనిక పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నా ఇది కాలుష్య కారిణి. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థం. దీనికి బంగారంలాంటి లోహాలను కరిగించుకొనే లక్షణం ఉంది. పాదరసం అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ప్రత్యక్షంగా లోహరూపంలో కాకుండా సిన్నబార్ అనే మెర్కురిక్ సల్ఫైడు, ఖనిజంగా పాదరసం లభిస్తోంది. ప్రధానంగా చైనా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఈ లోహాన్ని గాలిలో వేడిచేయడం ద్వారా గంధకం భాగాన్ని తొలగించి పాదరసాన్ని వెలికితీస్తారు.
పాదరసం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరింతగా తెలుస్తుండడం వల్ల దాని వినియోగాన్ని చాలా దేశాలు నియంత్రిస్తున్నాయి.
ఈనాడు దినపత్రిక నుంచి సేకరణ
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
పక్షుల శరీర ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనైనా స్థిరంగా ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతలను జీవక్రియల ద్వారా ఒక పద్ధతిలో నియంత్రించుకుంటాయి. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు వాటికుండే ఈకలను శరీరానికి అతి దగ్గరగా సమతలంలో ఉండేటట్లు తెచ్చుకుంటాయి. దాంతో ఈకలకు, శరీరానికి మధ్య గాలి ఉండకపోవడంతో ఉష్ణ వికిరణం ద్వారా శరీరంలో ఎక్కువైన ఉష్ణం వెలుపలకు పోవడమేకాకుండా వెలుపలి ఉష్ణం శరీరంలోకి చొరబడదు. చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట, శరీర ఉష్ణం వల్ల ఆవిరవడంతో, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పక్షులు తమ శరీరంపై ఉన్న ఈకలను బాగా పైకి లేపి వెలుపలి గాలిని శరీరం మధ్య నింపేసుకోవడం ద్వారా శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి పోకుండా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి.
కుక్కల లాంటి జీవులు వేసవిలో వాటి నాలుకలు వెలుపలకు చాపి వగరుస్తూ ఉండటం ద్వారా నాలుకలపై ఉండే లాలాజలం, వూపిరితిత్తులలోని తేమ ఆవిరి అయ్యేలా చూసుకుంటాయి. తద్వారా ఏర్పడిన చల్లదనం వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జంతువుల శరీరంలోని ఉష్ణం వాటి శరీరానికి దగ్గరగా ఉండే గాలిని వేడి చేయడంతో, అలా ఏర్పడిన వేడి గాలి పొర, వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఒక నిరోధకం లాగా పనిచేస్తుంది. ఆ విధంగా చలికాలంలో కూడా వాటి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
బాష్పవాయువు అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
గుంపులుగా చేరి ఆందోళన చేస్తున్న జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లల్లో నీరు తెప్పిస్తుంది కాబట్టి దీనిని బాష్ప వాయువు అంటారు. బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనిక పదార్థాలను తుపాకుల వంటి ఆయుధాలలో కూరి, పేల్చడం ద్వారా ఈ వాయువును ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాలలో ఉంటుంది. ఆల్ఫా క్లోరాసిటెటో ఫినోన్ అనే రసాయనం ఘన రూపంలోనూ, ఇథైల్ అయోడో ఎసిటేట్ ద్రవరూపంలోనూ ఉంటాయి. బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్ప గ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లలో మంటపుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై ఎక్కువగా నీరు చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. బాష్ప వాయువు శరీరంలోని వాయు నాళాల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. తర్వాత తగ్గి పోతుంది. బాష్ప వాయువు ప్రయోగానికి గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితోగానీ, బోరిక్ యాసిడ్ ద్రవంతో గానీ కడగాలి. సోడియం బైకార్బోనేట్ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే ఒక చిన్న చిట్కా ఉంది. కోసిన ఉల్లిపాయ ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు అవి బాష్పవాయువును పీల్చుకుని మన కళ్లపై అంత ప్రభావం పడకుండా చూస్తాయి.
ఈనాడు దినపత్రిక నుంచి సేకరణ
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?
పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. 'నిప్పు లేనిదే పొగరాదు' అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు.
పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి. ఆయా మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కర్బన రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కర్బన పరమాణువులన్నీ కార్బన్‌డయాక్సైడుగా మారవు.
పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కర్బనరేణువులే.కర్ర, సిగరెట్టు వంటి ఇంధనాలలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినపుడు వెలువడే నైట్రిక్ ఆక్సైడ్, హైడ్రోజన్ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రస్ ఆమ్లం ఏర్పడుతాయి. కర్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటికి చర్యాశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యాశీలత అధికంగా ఉన్న కర్బన రేణువులు, సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్లను చేరినపుడు కంటి పొరల్లో ఉన్న జీవ కణాల్ని వాటి కార్యకలాపాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీళ్ల ధారలో మలినాల్ని, పొగలోని రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ముక్కు ద్వారా కూడా వస్తాయి.
ఈనాడు దినపత్రిక నుంచి సేకరణ
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
పాత్రలలో ఉంచిన ద్రవ పదార్థాలేవైనా గాలిలో పెడితే కొంత కాలం తర్వాత వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి నిదానంగా ఆవిరయిపోతాయి. ఈ ప్రక్రియను భాష్పీభవనం (Evaporation) అంటారు. ఆవిరయ్యే ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు. ఆవిరవుతున్నపుడు ద్రవాల్లోని అణువులు వాటిని ఒకదానిలో మరొకటి బంధించి ఉన్న బంధాలను తెంచుకొని ఆవిరి రూపంలోకి మారి అవి ఉన్న పాత్రలలో నుంచి బయటి వాతావరణంలోకి వెళతాయి. ఇలా జరగడానికి ద్రవంలోని అణువులకు కావలసిన శక్తిని వాతావరణంలోని ఉష్ణం నుంచి గ్రహిస్తాయి. ఒక్కో ద్రవానికి ఒక్కో భాష్పీభవనస్థానం ఉంటుంది. పెట్రోల్ భాష్పీభవనస్థానం చాలా తక్కువ. అంటే పెట్రోల్, తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరిగా మారుతుంది.
పెట్రోల్ మన చేతిపై పడినపుడు అది మన శరీరం నుంచి ఉష్ణం తీసుకొని తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరయి పోవడంతో, అతి తక్కువ కాలంలోనే కొంత ఉష్ణాన్ని కోల్పోయిన మన శరీర భాగం అంటే చేయిపై చల్లగా ఉంటుంది. భాష్పీభవనం చల్లదానాన్ని కలుగచేస్తుంది.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.
ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
సునామీ అంటే ఏమిటి?- సునామీ అనేది జపాను భాషకు చెందిన పదము- దీనిలో సు అనగా అర్దము ఓడరేవు- నామీ అనగా అర్ధము కెరటముసునామీ ఎలా సంభవిస్తుంది?- సముద్ర గర్భంలో భూకంపం సంభవించిన సమయంలో సునామీలు ఏర్పడతాయి.- భూకంపం వలన ఏర్పడిన అలజడి మహా అలలను జనింపచేస్తుంది. ఇవి అత్యంత శక్తితో, అత్యంత వేగంతో తీరాన్ని చేరి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.- సునామీను కొన్ని జంతువులు ముందుగానే గుర్తించగలవని శాస్ర్తవేత్తలు గుర్తించారు.- మన దేశంలో సునామీ హెచ్చరికల కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.- మన దేశంలో 2004 డిసెంబర్ 26 న సునామీ సంభవించింది
సునామీ అంటే ఏమిటి?- సునామీ అనేది జపాను భాషకు చెందిన పదము- దీనిలో సు అనగా అర్దము ఓడరేవు- నామీ అనగా అర్ధము కెరటముసునామీ ఎలా సంభవిస్తుంది?- సముద్ర గర్భంలో భూకంపం సంభవించిన సమయంలో సునామీలు ఏర్పడతాయి.- భూకంపం వలన ఏర్పడిన అలజడి మహా అలలను జనింపచేస్తుంది. ఇవి అత్యంత శక్తితో, అత్యంత వేగంతో తీరాన్ని చేరి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.- సునామీను కొన్ని జంతువులు ముందుగానే గుర్తించగలవని శాస్ర్తవేత్తలు గుర్తించారు.- మన దేశంలో సునామీ హెచ్చరికల కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.- మన దేశంలో 2004 డిసెంబర్ 26 న సునామీ సంభవించింది.
వేడిగా ఉన్న టీను కప్పుతో పోల్చినపుడు సాసర్‌తో త్వరగా త్రాగవచ్చును ఎందుకో తెలుసా?- ఇది ఇగురుట అనే భౌతిక దృగ్విషయానికి సంబంధించినది- సాధారణంగా ద్రవం ఉపరితలంపై ఉన్న ద్రవపు కణాలుశక్తిని గ్రహించి, వాయు రూపంలోకి మారి గాలిని చేరుతూ ఉంటాయి.- భాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద జరిగే ఈ దృగ్విషయాన్ని 'ఇగురుట' (ఎవాపరేషన్) అంటారు.- సాధారణంగా ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే ద్రవం ఇగిరే వేగం కూడా పెరుగుతుంది.- సాసర్ ఉపరితల వైశాల్యం, కప్పు ఉపరితల వైశాల్యంతో పోల్చినపుడు ఎక్కువగా ఉంటుంది.- ఉపరితల వైశాల్యం పెరిగినపుడు ద్రవం వేగంగా ఇగురుతుంది. - దీని వల్ల వేడి టీ లోని కణాలు కప్పుకన్నా సాసర్‌నుండి త్వరగా తప్పించుకుపోగలవు. - అందుకే కప్పులోని టీ కంటే సాసర్‌లోని టీ త్వరగా చల్లారుతుంది.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
సెంటు సీసా మూత తెరిచినపుడు గది అంతా సువాసన ఎలా వ్యాపిస్తుంది?- ఇది వాయు పదార్ధాలకు ఉండే 'వ్యాపనం' అనే లక్షణ ఫలితం- సాధారణంగా వాయు పదార్దాలు వేగంగా చలించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.- వాయు కణాలు ఒకచోటు నుంచి మరోచోటుకు విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.- సెంటు సీసా మూత తెరిచినపుడు అందులోని ద్రవరూపంలోని సెంటు భాష్ప(వాయు) స్థితికి చేరుకుంటుంది.- వాయువుకు ఉండే వ్యాపన లక్షణం ఫలితంగా సెంటు కణాలు గది అంతటా వ్యాపనం చెందుతాయి.- అంటే సెంటు కణాలు గదిలోని అన్ని స్థానాలకు చేరుకుంటాయి.- కనుక సెంటు సీసా మూత తెరిచినపుడు గది అంతటా సువాసన వ్యాపిస్తుంది
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
ఫ్రిజ్‌లోనుంచి తీసిన కూల్‌డ్రింక్ సీసాపై నీటి బిందువులెలా వచ్చాయి?- ఇది సాంద్రీకరణము అనే భౌతిక దృగ్విషయానికి సంబంధించింది- సాధారణంగా వాయుకణాలువేగంగా చలించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.- ఈ వాయు కణాలు శక్తిని కోల్పోయినపుడు వాటి స్థితిని మార్చుకుని ద్రవంగా మారతాయి. ఈ ప్రక్రియను సాంద్రీకరణం అంటారు.- గాలిలో అనేక వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది.- కూల్‌డ్రింక్ సీసాను బయట ఉంచినపుడు గాలిలోని నీటి ఆవిరి కణాలు వేగంగా చలిస్తూ సీసా గోడలను ఢీకొంటుంటాయి.- గాలితో పోల్చినపుడు సీసా ఉపరితలం చల్లగా ఉండడంవలన, సీసా ఉపరితలం తనను డీకొట్టిన నీటి ఆవిరి కణాలను చల్లబరుస్తుంది.- ఇలా చల్లబడిన నీటి ఆవిరి, నీటి బిందువులుగా మారి కూల్‌డ్రింక్‌సీసాపై చేరతాయి.- డ్రింకు ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
శరీరంపై వేడి నీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయాన్ని కలుగచేస్తుంది ఎందుకు?
- ఇది నీటి స్థితి మార్పుకుసంబంధించిన అంశం
- సాధారణంగా ఘనస్థితిలోని మంచు శక్తిని గ్రహించి ద్రవస్థితికి, మరికాస్త శక్తిని గ్రహించి భాష్పస్తితికి చేరుకుంటుంది.
- గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని వేడిచేస్తుంటే నీటి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి వందకు చేరుకుంటుంది.
- వంద డిగ్రీల వద్ద నీరు శక్తిని గ్రహించి నీటి ఆవిరిగా మారుతుంది
- కనుక నీటికంటే నీటి ఆవిరి వద్ద ఎక్కువ శక్తి ఉంటుంది.
- భాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వలన దీని శక్తి అధికం అవుతుంది.
- అందువల్ల నీటి ఆవిరి, వేడినీటికంటే అధిక గాయాన్ని కలుగచేస్తుంది.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
శరీరంపై చెమట పట్టడం వలన మనకు ప్రయోజనం ఏమిటి?
- శరీరంపై చెమట పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించేందుకు శరీరం ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యవస్థ
- సాధారణంగా ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడో, ఎండలో తిరిగినపుడో, కష్టించి పనిచేస్తున్నపుడో శరీరంపై చెమట పడుతుంది.
- ఇలా బయటకు వచ్చిన చెమట శరీరం నుంచి ఉష్ణశక్తిని గ్రహించి, ఇగురును
- అందువలన శరీరపు ఉష్ణోగ్రత తగ్గి క్రమబద్దీకరించబడును.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
ద్రవీభవనం - భాష్పీభవనం- పదార్ధాలు మూడు రకాల స్థితులలో లభిస్తుంటాయి.౧. ఘనస్థితి౨. ద్రవస్థితి౩. వాయుస్థితి- సాధారణంగా ఉష్ణోగ్రతను మార్చడం ద్వారా పదార్దాల స్థితులను మార్చవచ్చు.- ఘనస్థితిలో గల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా పెంచడంద్వారా ద్రవ స్థితిలోకి మార్చడాన్ని 'ద్రవీభవనం' అంటారు.- ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్ధం కరిగి ద్రవ పదార్ధంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.- నీటి విషయంలో ద్రవీభవన స్థానం సున్న డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.- ద్రవస్థితిలో గల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా పెంచడం ద్వారా వాయుస్థితిలోకి మార్చవచ్చు.- ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవపదార్ధము వాయు పదార్ధంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు.- నీటి విషయంలో భాష్పీభవన స్థానం వంద డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.- ఉష్ణోగ్రతను తగ్గించడంద్వారా స్థితులను వెనుకకు కూడా మరల్చవచ్చు- భాష్పస్తిథిలో ఉన్న పదార్ధము ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించినపుడు అది ద్రవరూపంలోకి మారును. - ఈ ప్రక్రియను సాంద్రీకరణము అంటారు.- ద్రవస్థితిలోని పదార్ధపు ఉష్ణోగ్రతను తగ్గించిన అది ఘనస్థితిలోకి మారను.- ఈ ప్రక్రియను ఘనీభవనం చెందించడం అంటారు.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
ఒక వ్యక్తికి చలి వేస్తుందా, ఉక్కపోస్తుందా అనే విషయం ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఆ అధిక వేడిని నివృత్తి చేసుకోవడానికి చెమట పట్టి శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అప్పుడే మనకు ఉక్కపోత అనే భావన కలుగుతుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి భావనకు లోనవుతాము. సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే, ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.7 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ, బయటి నుంచి శరీరానికి కానీ పెద్దగా ఉండదు. అందువల్ల అంత ఇబ్బందిగా ఉండదు. జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడు (105 డిగ్రీల ఫారెన్ హీట్) వరకు ఉండవచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా హెచ్చన్నమాట. కాబట్టి ఉష్ణశక్తి శరీరం నుంచి బయటి వైపు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చలి భావన కలుగుతుందని చెప్పుకున్నాం కదా. అందుకె మరి వణకడం అర్థమైనదా.
పక్షులు జంతువులు శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?పక్షుల శరీర ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనైనా స్థిరంగా ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతలను జీవక్రియల ద్వారా ఒక పద్ధతిలో నియంత్రించుకుంటాయి. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు వాటికుండే ఈకలను శరీరానికి అతి దగ్గరగా సమతలంలో ఉండేటట్లు తెచ్చుకుంటాయి. దాంతో ఈకలకు, శరీరానికి మధ్య గాలి ఉండకపోవడంతో ఉష్ణ వికిరణం ద్వారా శరీరంలో ఎక్కువైన ఉష్ణం వెలుపలకు పోవడమేకాకుండా వెలుపలి ఉష్ణం శరీరంలోకి చొరబడదు. చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట, శరీర ఉష్ణం వల్ల ఆవిరవడంతో, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పక్షులు తమ శరీరంపై ఉన్న ఈకలను బాగా పైకి లేపి వెలుపలి గాలిని శరీరం మధ్య నింపేసుకోవడం ద్వారా శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి పోకుండా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి.
కుక్కల లాంటి జీవులు వేసవిలో వాటి నాలుకలు వెలుపలకు చాపి వగరుస్తూ ఉండటం ద్వారా నాలుకలపై ఉండే లాలాజలం, వూపిరితిత్తులలోని తేమ ఆవిరి అయ్యేలా చూసుకుంటాయి. తద్వారా ఏర్పడిన చల్లదనం వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జంతువుల శరీరంలోని ఉష్ణం వాటి శరీరానికి దగ్గరగా ఉండే గాలిని వేడి చేయడంతో, అలా ఏర్పడిన వేడి గాలి పొర, వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఒక నిరోధకం లాగా పనిచేస్తుంది. ఆ విధంగా చలికాలంలో కూడా వాటి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.
చలిగా ఉన్నపుడు చర్మపు ఉపరితల పొరల్లో ఉండే కణాలు దగ్గరికి రావడం వల్ల కొంచెం ఇబ్బందికి లోనవుతాయి. పైగా చలి వాతావరణంలోకి శరీరపు వేడి వెళ్లిపోకుండా ఉండేందుకు రక్తనాళాలు కూడా ఉపరితల చర్మపు పొరలకు రక్తాన్ని చేరవేయవు. తద్వారా పైపొరల్లో ఉన్న కణాలు పొడిగా ఉంటాయి. అక్కడ ఉన్న నాడీ తంత్రులు కూడా మొద్దుబారి ఉంటాయి. ఇలాంటి స్థితిలో కాస్త వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే ఆ వేడికి చర్మపు పొరలు కొద్దిగా సడలడం వల్ల తాత్కాలికంగా విశ్రాంతి పొందినట్టుగా ఆహ్లాదకరమైన భావనను పొందుతాం. నాడీ తంత్రులకు అధిక ప్రేరణ రావడం వల్ల కూడా కొద్దిగా సుఖానుభూతి పొందుతాం.
ఇక ఏ సమయంలోనైనా బాగా కష్టపడి శారీరక శ్రమ చేసినపుడు కణాలు అలసిపోతాయి. కణాలు అలసి పోవడమంటే వాటిలో పోషక పదార్థాల పరిమితి బాగా పడిపోవడమని అర్థం. అలాగే వ్యాయామం చేసినపుడు అధిక మోతాదులో రక్తంలోని గ్లూకోజు ఆక్సీకరణం చెందుతుంది. ఆ క్రమంలో ఆక్సిజన్ సరఫరా తదనుగుణంగా లేకుంటే నిర్బాత ప్రక్రియ (anerobic oxidation) ద్వారా గ్లూకోజ్ పాక్షికంగా ఆక్సీకరణం చెంది శక్తినిస్తుంది. అపుడు రక్తంలోను, కణాల్లోను పైరూవిక్ ఆమ్లపు మోతాదు పెరుగుతుంది. ఇది అవాంఛనీయమైన రసాయనిక ధాతువు. ఇది ఎముకల కీళ్ల దగ్గర పోగయితే ఒంటి నొప్పులుగా ఇబ్బంది పడతాము. అలాంటి సమయంలో వేడి నీటి స్నానం వల్ల కణజాలాలు వ్యాకోచించి రక్తసరఫరా వేగవంతం అవుతుంది. ఆ క్రమంలో పైరూవిక్ ఆమ్లం త్వరితంగా కణాల నుంచి తొలగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గినట్టు సేదగలిగిన సుఖానుభూతిని పొందుతాం.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతలను కావలసినంత మేరకు సరిచేసుకోవడానికి, తమ కదలికలను నియంత్రించుకోవడానికి తోకలను బాగా ఉపయోగించుకుంటాయి. మనం మన శరీరంపై ఉండే చర్మం ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వేడిని గ్రహించడం లేక ప్రసరింపజేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంతో ఉండేలా చూసుకుంటాం. కానీ ఎలుకలు అలా చేయలేవు. ఎందుకంటే, వాటి దేహాల మీద చాలా వెంట్రుకలు ఉంటాయి. అవి ఉష్ణ నిరోధకాలు. అందువల్ల ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతను చర్మం ద్వారా కాకుండా వెంట్రుకలు లేని తోకల ద్వారా నియంత్రించుకుంటాయి. ఎలుకలు వాటి గుండె నుంచి ప్రసరించే రక్తంలో 0.1 నుంచి 10 శాతం వరకు తోకల గుండా ప్రవహింప చేయగలవు. దాంతో శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిలో 20 శాతాన్ని వాతావరణంలోకి పంపగలవు. ఆ విధంగా వేసవికాలంలో వాటి దేహంలో ఉన్న ఎక్కువ ఉష్ణాన్ని బయటకు పంపించేస్తాయి. అలాగే చలికాలంలో తోకలో ప్రవహించే రక్త ప్రసరణాన్ని తగ్గించి ఉష్ణాన్ని బయటకు పోకుండా కాపాడుకుంటాయి.
ఇక తోకల పొడవు విషయానికి వస్తే, తోకలో ఉండే కండరాన్ని ఎలుకలు అతి నైపుణ్యంగా అదుపులో ఉంచుకుంటాయి. ఇరుకైన మార్గంలో కానీ, సన్నని తీగపైన కానీ వేగంగా పరుగెడుతున్నపుడు తోకను అటూ ఇటూ కదిలించి కింద పడకుండా చూసుకుంటాయి. సర్కస్‌లో తీగపై నడిచే వ్యక్తి ఒక పొడవైన కర్రను పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా ఎలుకలకు కూడా వాటి తోకలు బాగా ఉపయోగపడతాయి.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
నీటిని వేడి చేసేప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఆ నీరు మరగడం ఆరంభిస్తుంది. దీన్ని నీటి భాష్పీభవన స్థానం (boiling point) అంటారు. ఈ ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కూడా నీటికి వేడిని అందిస్తే అది ఆవిరిగా మారుతుంది. నీటి ఉపరితలంపై వాతావరణ పీడనం ఉంటుంది. ఈ పీడనం వల్లనే నీరు 100 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కాకుండా ఉంటుంది. వాతావరణ పీడనం తగ్గితే నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ మనం కొన్ని వాతావరణ పొరలను దాటుకొని వెళ్తున్నట్టే కాబట్టి వాతావరణ పీడనం తగ్గుతుంది. అంటే ఎత్తయిన పర్వత ప్రాంతాలలో పీడనం తక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ ప్రాంతాలలో మనం వండే ఆహార పదార్థాలపై ఆ ప్రభావం ఉంటుంది.
ఉదాహరణకు మనం బంగాళాదుంపలను ఉడికించాలనుకోండి. గిన్నెలో నీరుపోసి అందులో దుంపలను మంటపై పెడతాం. కానీ కొండలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండడంతో నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. అంటే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరగాల్సిన నీరు ఏ 94 డిగ్రీల దగ్గరో మరిగి ఆవిరైపోతూ ఉంటుంది. అందువల్ల బంగాళదుంపలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద సరిగా ఉడకక పచ్చిగా ఉంటాయి. అందువల్ల పర్వత ప్రాంతాల్లో ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి వంటచేయడమో లేదా దుంపలున్న గిన్నెలో కొంచెం ఉప్పు వేయడమో చేయాలి. ఎందుకంటే మంచి నీటి కన్నా ఉప్పునీటి భాష్పీభవన స్థానం ఎక్కువ.
ఈనాడు దినపత్రిక నుంచి
నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
- సాధారణంగా నూనెతో తయారైన ఆహార పదార్ధాలను ఎక్కువకాలం పాటు నిల్వ చేస్తే అవి వాటి రుచిని, సువాసనను కోల్పోతాయి. మెత్తబడిపోతాయి.
- ఈ ప్రక్రియను ముక్కిపోవడం లేదా ర్యాన్సిడిటీ అంటారు.
- ర్యాన్సిడిటీ అనేది ఒక ఆక్సీకరణ ప్రక్రియ.
- ఈ ర్యాన్సిడిటీని నివారించాలంటే ఆహారపదార్ధాలకు ఆక్సిజన్ అందుబాటులో లేకుండా చేయాలి.
- అందుకే లేస్, కుర్‌కురే వంటి నూనె పదార్ధాల ప్యాకెట్‌లలోని ఆక్సిజన్ వాయువును తొలగించి, నైట్రోజన్ వాయువుతో నింపుతారు.
- నైట్రోజన్ సమక్షంలో ముక్కిపోవడం జరుగదు. కనుక ఆహారపదార్ధాలు ఎక్కువకాలం నిలువ ఉంటాయి.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.కం
- పొడిసున్నానికి నీటిని కలపడం ద్వారా తడి సున్నాన్ని (కాల్షియం హైడ్రాక్సైడ్) తయారుచేస్తారు.
- ఈ తడిసున్నాన్ని గోడలకువెల్ల వేయడానికి ఉపయోగిస్తారు.
- తడిసున్నం గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌తో చర్య జరిపి సన్నని, తెల్లని కాల్సియం కార్బోనేట్ పొరను ఏర్పరుస్తుంది.
- అందువల్లనే సున్నంతో వెల్లవేసిన గోడలు మెరుస్తూ ఉంటాయి.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- కాంతి ఋజుమార్గప్రసారం అనే సూత్రంపై ఆధారపడి పిన్‌హోల్ కెమెరాలో ప్రతిబింబం ఏర్పడుతుంది.
- ఒక కొవ్వొత్తిని వెలిగించి దానిని పిన్‌హోల్ కెమెరాగుండా చూడాలి.
- లోపల అమర్చబడిన సన్నని గొట్టపు వెనుకభాగం నుండి చూస్తూ సన్ననిగొట్టాన్ని ముందుకూ, వెనుకకు కదుపుత్తూ కొవ్వొతి ప్రతిబింబం తెరపై స్పష్టంగా కనిపించేట్లు చేయాలి.
- కొవ్వొత్తినుంచి వచ్చిన కాంతి కిరణాలలో కొన్ని కాంతి కిరణాలు పిన్‌హోల్ కెమెరాకు గల చిన్న రంధ్రంగుండా లోనికి ప్రవేశిస్తాయి.
- ఇలా వచ్చిన కాంతి కిరణాలు ప్రతిబింబాన్ని లోపల అమర్చిన తెరపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
- కొవ్వొత్తినుంచి ఒక ప్రత్యేక దిశలో వచ్చిన కాంతి కిరణాల వలన ఈ ప్రతిబింబం ఏర్పడుతుంది.
- ఇలా ఏర్పడే ఈ ప్రతిబింబం నిజ ప్రతిబింబం. ప్రతిబింబం తల్లకిందులుగా ఏర్పడుతుంది.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- వాహనాలలో వెనుకనుండి వచ్చే వాహనాలను గమనించడానికి ఏర్పాటు చేసుకున్న దర్పణమే 'రియర్‌వ్యూ మిర్రర్'
- సాధారణంగా రియర్‌వ్యూ మిర్రర్‌గా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు.
- వస్తువును ఏ స్థానంలో ఉంచినా కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ నిటారు, మిధ్యా ప్రతిబింబాన్నే ఏర్పరుస్తుంది.
- అంటే వాహనం దూరంలో ఉన్నా, దగ్గరగా ఉన్నా ప్రతిబింబం నిటారుగానే ఉంటుంది.
- అలాగే కుంభాకార దర్పణంలో ఏర్పడు ప్రతిబింబం వస్తువు పరిమాణంకంటే చిన్నదిగా ఉంటుంది.
- అందుకే రియర్‌వ్యూ మిర్రర్‌గా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- పెరిస్కోపు అనేది కాంతి పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేసే ఒక పరికరము
- ఇది ఆంగ్ల అక్షరం z ఆకారంలో ఉంటుంది.
- దీనిలో రెండు సమతల దర్పణాలు అమర్చబడి ఉంటాయి.
- ఈ దర్పణాలు రెండుసార్లు కాంతిని పరావర్తనం చెందిస్తాయి.
- బంకర్లలో దాక్కుని శత్రువుల కదలికలను పసిగట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు.
- జలాంతర్గాములలో ప్రయాణించే సందర్భంలో సముద్ర ఉపరితలంపై పరిశీలించడానికి దీన్ని ఉపయోగిస్తారు.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- వాలు దర్పణాల వలన అసంఖ్యాక పరావర్తనాలు అనే సూత్రంపై ఆధారపడి కెలిడయాస్కోపు పనిచేస్తుంది.
- దీనిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ దర్పణాలు కొంతకోణంతో అమర్చి, సంవృత ఆకారాన్ని తయారుచేస్తారు.
- దీనిలోపలి భాగంలో రంగు రంగుల గాజు ముక్కలను ఉంచినపుడు, ఆ గాజు ముక్కలు సమతల దర్పణాలపై అసంఖ్యాకంగా పరావర్తనం చెంది చిత్రమైన ఆకారాలను ఏర్పరుస్తాయి.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- మానవ శరీరంలో అత్యంత ధృడమైన పదార్ధం దంతాలపై ఉండే పింగాణీపొర
- ఇది కాల్షియంఫాస్పేట్‌తో తయారగును.
- ఇది నీటిలో కరుగదు.
- నోటిలో బాక్టీరియా దంతాల మధ్య చిక్కుకొని ఆహారపదార్ధాలను వియోగం చెందించి నోటిలో లాక్టికామ్లమును ఏర్పరచును.
- కావునా నోటిలో పిహెచ్ విలువ తగ్గును.
- దీనివలన అత్యంత ధృఢమైన పింగాణీ పొర క్షీణించి పళ్లు నాశనం అవుతాయి.
- దీనినే దంతక్షయం అంటారు.
- ఈ దంతక్షయాన్ని అరికట్టడానికి క్షారస్వభావంగల టూత్‌పేస్టుతో రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రపరుచుట వలన అధిక ఆమ్లం తటస్తీకరించడం ద్వారా దంతక్షయాన్ని నివారించవచ్చును.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- పాల యొక్క పిహెచ్ విలువ ౬ కంటే తగ్గితే పాలకు పుల్లని రుచి వచ్చి క్రమేణా పాలు పాడైపోవును.
- దీనిని నివారించడానికి పాలకు తినేసోడాను కలిపితే పాలలోని ఆమ్లగుణం తినే సోడా అనే క్షారంతో తటస్తీకరించబడడం వలన పిహెచ్ విలువ పెరుగును.
- పిహెచ్ విలువ పెరుగుట వలన పాలు ఎక్కువకాలం నిల్వ ఉండును.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- బీట్‌రూట్ రసము ఆమ్ల, క్షారాలను గుర్తించడానికి ఒక చక్కని సహజ సూచిక.
- బీట్‌రూట్‌ను సేకరించి శుభ్రంగా కడిగి తొక్కను తొలగించి రసాన్ని తీయవలెను.
- ఈ రసాయన్ని సహజ సూచికగా ఉపయోగించవచ్చును.
- ఆమ్లద్రావణానికి రెండు మూడు చుక్కల బీట్‌రూట్ రసాన్ని కలిపిన ఆమ్లద్రావణం యొక్క రంగుమారును.
- ఇదేవిధంగా క్షారద్రావణాన్ని కూడా బీట్‌రూట్ సూచికను ఉపయోగించి గుర్తించవచ్చు.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- కేక్ తయారీలో బేకింగ్‌సోడాను ఉపయోగిస్తారు.
- బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం వంటి బలహీన, తినదగిన ఆమ్లాలతో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటారు.
- బేకింగ్ పౌడర్‌ను వేడిచేసినపుడు వివిధ రసాయన చర్యలు జరిగి కార్బన్‌డైఆక్సైడ్ వాయువు విడుదల అగును.
- ఇలా విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు రొట్టె లేక కేక్‌నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోవుట వలన రొట్టె లేదా కేక్ వ్యాకోచించడమే కాకుండా మెత్తగా స్పాంజివలె మారుతుంది.
- తినడానికి రుచిగా, సులువుగా, మృదువుగా మారుతుంది.
సేకరణః నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com
- ఇది నీటి స్థితి మార్పుకుసంబంధించిన అంశం
- సాధారణంగా ఘనస్థితిలోని మంచు శక్తిని గ్రహించి ద్రవస్థితికి, మరికాస్త శక్తిని గ్రహించి భాష్పస్తితికి చేరుకుంటుంది.
- గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని వేడిచేస్తుంటే నీటి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి వందకు చేరుకుంటుంది.
- వంద డిగ్రీల వద్ద నీరు శక్తిని గ్రహించి నీటి ఆవిరిగా మారుతుంది
- కనుక నీటికంటే నీటి ఆవిరి వద్ద ఎక్కువ శక్తి ఉంటుంది.
- భాష్పీభవన గుప్తోష్ణం రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వలన దీని శక్తి అధికం అవుతుంది.
- అందువల్ల నీటి ఆవిరి, వేడినీటికంటే అధిక గాయాన్ని కలుగచేస్తుంది.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
శరీరంపై చెమట పట్టడం వలన మనకు ప్రయోజనం ఏమిటి?
- శరీరంపై చెమట పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించేందుకు శరీరం ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యవస్థ
- సాధారణంగా ఏదైనా భౌతిక వ్యాయామం చేసినపుడో, ఎండలో తిరిగినపుడో, కష్టించి పనిచేస్తున్నపుడో శరీరంపై చెమట పడుతుంది.
- ఇలా బయటకు వచ్చిన చెమట శరీరం నుంచి ఉష్ణశక్తిని గ్రహించి, ఇగురును
- అందువలన శరీరపు ఉష్ణోగ్రత తగ్గి క్రమబద్దీకరించబడును.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
- పదార్ధాలు మూడు రకాల స్థితులలో లభిస్తుంటాయి.
౧. ఘనస్థితి
౨. ద్రవస్థితి
౩. వాయుస్థితి
- సాధారణంగా ఉష్ణోగ్రతను మార్చడం ద్వారా పదార్దాల స్థితులను మార్చవచ్చు.
- ఘనస్థితిలో గల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా పెంచడంద్వారా ద్రవ స్థితిలోకి మార్చడాన్ని 'ద్రవీభవనం' అంటారు.
- ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్ధం కరిగి ద్రవ పదార్ధంగా మారుతుందో, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు.
- నీటి విషయంలో ద్రవీభవన స్థానం సున్న డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
- ద్రవస్థితిలో గల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా పెంచడం ద్వారా వాయుస్థితిలోకి మార్చవచ్చు.
- ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవపదార్ధము వాయు పదార్ధంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు.
- నీటి విషయంలో భాష్పీభవన స్థానం వంద డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
- ఉష్ణోగ్రతను తగ్గించడంద్వారా స్థితులను వెనుకకు కూడా మరల్చవచ్చు
- భాష్పస్తిథిలో ఉన్న పదార్ధము ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించినపుడు అది ద్రవరూపంలోకి మారును.
- ఈ ప్రక్రియను సాంద్రీకరణము అంటారు.
- ద్రవస్థితిలోని పదార్ధపు ఉష్ణోగ్రతను తగ్గించిన అది ఘనస్థితిలోకి మారను.
- ఈ ప్రక్రియను ఘనీభవనం చెందించడం అంటారు.
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
- శబ్దానికీ, కాంతికీ సారూప్యత తరంగ చలనమే. రెండూ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి.
- కాంతి తిర్యక్ తరంగం. కానీ శబ్దం అను దైర్ఘ్య తరంగం. కాంతికి యానకం అవసరం లేదు.
· కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు.
· కానీ శబ్దానికి యానకం అవసరం. పదార్థాల్లోకి శబ్దం ప్రసరిస్తుంది.
· శబ్దం అనుధైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుందంటే అర్థం ఏమిటంటే అది తన మార్గంలో ఉండే పదార్థంలోని కణాల్ని లేదా పరమాణువుల్ని ఒత్తుతూ, లూజు చేస్తూ ప్రయాణిస్తుంది.
· ఒత్తిన ప్రాంతాల్లో దట్టంగా అధిక పదార్థం ఉండటం వల్ల అధిక పీడనంలో ఉంటాయి.
· లూజు చేసిన ప్రాంతాల్లో తక్కువ పదార్థం ఉండటం వల్ల తక్కువ పీడనం ఉంటుంది.
· పీడన ప్రాంతాలు, లూజు ప్రాంతాలు నిశ్చలముగా అవే చోట్ల ఉండకుండా శబ్ద వేగంలో కదులుతూ ఉంటాయి.
· ఆ శబ్ద తరంగాలే మన చెవుల్ని చేరుతాయి.
· అయితే శబ్దం ఏ స్థాయిలో ఉందనే విషయం, శబ్దతరంగాలలో ఉన్న సంపీడన ప్రాంతాల్లో ఎంత ఘన పరిమాణం మేరకు పదార్థం (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణం ఉన్నగాలి) ఉందన్న విషయం మీద, విరళీకరణం ప్రాంతంలో ఎంత మేరకు ఘనపరిమాణం తగ్గింది (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణపు గాలి తగ్గింది) అన్న విషయం మీద ఆధారపడుతుంది.
· ఇలా శబ్ద తరంగాలలో పదార్థపు ఘనపరిమాణపు విలువల్లో ఎంత ఎక్కువ తేడాలు సంభవిస్తే అంత ఎక్కువ మోతాదులో శబ్దం వినిపిస్తుంది. అందువల్లే శబ్దపు తీవ్రతకు, వాల్యూమ్‌కు సరాసరి సంబంధం ఉంటుంది.
రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?
కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.
ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.
కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.
సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.
సౌండ్‌కీ, వాల్యూమ్‌కీ తేడా ఏంటి?
- శబ్దానికీ, కాంతికీ సారూప్యత తరంగ చలనమే. రెండూ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి.
- కాంతి తిర్యక్ తరంగం. కానీ శబ్దం అను దైర్ఘ్య తరంగం. కాంతికి యానకం అవసరం లేదు.
· కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు.
· కానీ శబ్దానికి యానకం అవసరం. పదార్థాల్లోకి శబ్దం ప్రసరిస్తుంది.
· శబ్దం అనుధైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుందంటే అర్థం ఏమిటంటే అది తన మార్గంలో ఉండే పదార్థంలోని కణాల్ని లేదా పరమాణువుల్ని ఒత్తుతూ, లూజు చేస్తూ ప్రయాణిస్తుంది.
· ఒత్తిన ప్రాంతాల్లో దట్టంగా అధిక పదార్థం ఉండటం వల్ల అధిక పీడనంలో ఉంటాయి.
· లూజు చేసిన ప్రాంతాల్లో తక్కువ పదార్థం ఉండటం వల్ల తక్కువ పీడనం ఉంటుంది.
· పీడన ప్రాంతాలు, లూజు ప్రాంతాలు నిశ్చలముగా అవే చోట్ల ఉండకుండా శబ్ద వేగంలో కదులుతూ ఉంటాయి.
· ఆ శబ్ద తరంగాలే మన చెవుల్ని చేరుతాయి.
· అయితే శబ్దం ఏ స్థాయిలో ఉందనే విషయం, శబ్దతరంగాలలో ఉన్న సంపీడన ప్రాంతాల్లో ఎంత ఘన పరిమాణం మేరకు పదార్థం (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణం ఉన్నగాలి) ఉందన్న విషయం మీద, విరళీకరణం ప్రాంతంలో ఎంత మేరకు ఘనపరిమాణం తగ్గింది (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణపు గాలి తగ్గింది) అన్న విషయం మీద ఆధారపడుతుంది.
· ఇలా శబ్ద తరంగాలలో పదార్థపు ఘనపరిమాణపు విలువల్లో ఎంత ఎక్కువ తేడాలు సంభవిస్తే అంత ఎక్కువ మోతాదులో శబ్దం వినిపిస్తుంది. అందువల్లే శబ్దపు తీవ్రతకు, వాల్యూమ్‌కు సరాసరి సంబంధం ఉంటుంది.
మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి (heat absorber)గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.
ఈ మెలనిన్ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.
ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఒక నిర్ణీత మార్గంలో దాని చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు (satellites)అంటారు. ఈ నిర్ణీత మార్గాన్నే కక్ష్య (ఆర్బిట్) అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సహజ ఉపగ్రహం. అయితే శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాలు భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. ఇవి భూమి చుట్టూ నిర్ణీత కక్ష్యల్లో తిరుగుతూ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, వాతావరణ సూచనలు, టెలివిజన్ కార్యక్రమాల ప్రసారాలకు, ఖనిజ సంపదలు గుర్తించడానికి తదితర అవసరాలకు ఉపయోగపడతాయి. కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహాలు ప్రయోగించిన దేశానికి ఉపయోగపడాలంటే, భూమి తిరుగుతున్నప్పటికీ అది ఆ దేశంపై స్థిరంగా ఉండాలి. ఇలా ఉండే ఉపగ్రహాన్ని భూస్థావర ఉపగ్రహం(geo stationary satellite) అంటారు. రెండు రైళ్లు ఒకే దిశలో సమాన వేగంతో వెళ్తున్నాయనుకుందాం. అప్పుడు ఒక రైలులోని వ్యక్తి మరో రైలులో ఉన్న వ్యక్తికి స్థిరంగా ఉన్నట్లు కనబడతాడు కదా. అలాగే కృత్రిమ ఉపగ్రహం భూ పరిభ్రమణ వేగంతో సమానంగా భూమి చుట్టూ తిరుగుతుంటే, అది భూమి మీద నిలకడగా ఉన్నట్లు ఒకే దగ్గర కనిపిస్తుంది. దీనిని 'పార్కింగ్ కక్ష్య' అంటారు. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ కక్ష్య ఉంటుంది. ఇక్కడ ఉపగ్రహ వేగం సెకనుకు 3.1 కిలోమీటర్లు. కక్ష్య వ్యాసార్థం 42,000 కిలోమీటర్లు.
నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం ('Island) అంటారు. ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. కాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపం గా తయారవుతుంది. లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోతే ఒక ద్వీపం ఏర్పడవచ్చు. సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని ద్వీపం గా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది.
శ్రీలంక ద్వీపము కాలక్రమేనా భారత ఖండము నుండి విడిపోయినదే .
చలిగా ఉన్నపుడు చర్మపు ఉపరితల పొరల్లో ఉండే కణాలు దగ్గరికి రావడం వల్ల కొంచెం ఇబ్బందికి లోనవుతాయి. పైగా చలి వాతావరణంలోకి శరీరపు వేడి వెళ్లిపోకుండా ఉండేందుకు రక్తనాళాలు కూడా ఉపరితల చర్మపు పొరలకు రక్తాన్ని చేరవేయవు. తద్వారా పైపొరల్లో ఉన్న కణాలు పొడిగా ఉంటాయి. అక్కడ ఉన్న నాడీ తంత్రులు కూడా మొద్దుబారి ఉంటాయి. ఇలాంటి స్థితిలో కాస్త వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే ఆ వేడికి చర్మపు పొరలు కొద్దిగా సడలడం వల్ల తాత్కాలికంగా విశ్రాంతి పొందినట్టుగా ఆహ్లాదకరమైన భావనను పొందుతాం. నాడీ తంత్రులకు అధిక ప్రేరణ రావడం వల్ల కూడా కొద్దిగా సుఖానుభూతి పొందుతాం.
ఇక ఏ సమయంలోనైనా బాగా కష్టపడి శారీరక శ్రమ చేసినపుడు కణాలు అలసిపోతాయి. కణాలు అలసి పోవడమంటే వాటిలో పోషక పదార్థాల పరిమితి బాగా పడిపోవడమని అర్థం. అలాగే వ్యాయామం చేసినపుడు అధిక మోతాదులో రక్తంలోని గ్లూకోజు ఆక్సీకరణం చెందుతుంది. ఆ క్రమంలో ఆక్సిజన్ సరఫరా తదనుగుణంగా లేకుంటే నిర్బాత ప్రక్రియ (anerobic oxidation) ద్వారా గ్లూకోజ్ పాక్షికంగా ఆక్సీకరణం చెంది శక్తినిస్తుంది. అపుడు రక్తంలోను, కణాల్లోను పైరూవిక్ ఆమ్లపు మోతాదు పెరుగుతుంది. ఇది అవాంఛనీయమైన రసాయనిక ధాతువు. ఇది ఎముకల కీళ్ల దగ్గర పోగయితే ఒంటి నొప్పులుగా ఇబ్బంది పడతాము. అలాంటి సమయంలో వేడి నీటి స్నానం వల్ల కణజాలాలు వ్యాకోచించి రక్తసరఫరా వేగవంతం అవుతుంది. ఆ క్రమంలో పైరూవిక్ ఆమ్లం త్వరితంగా కణాల నుంచి తొలగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గినట్టు సేదగలిగిన సుఖానుభూతిని పొందుతాం.
సూక్ష్మజీవులే ఈ భూమ్మీద ఏర్పడ్డ మొదటి జీవులు. భూమి సౌరమండలపు పళ్లెం (solar disc) నుంచి తేజోవంతమైన చిన్న పాటి నక్షత్రంగా సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం వేరుపడింది. ఆ తర్వాత సుమారు 150 కోట్ల సంవత్సరాలకు పూర్తిగా కాంతిని కోల్పోయి గ్రహం(planet)గా రూపొందింది. అపుడున్న విపరీత రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో నిర్జీవమైన పదార్థాల నుంచి తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకోగల DNA అణువు ఏర్పడింది. పరిణామక్రమంలో ఇలాంటి DNA లేదా RNAలున్న కణాలు అవతరించాయి. అంటే నేటికి సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం కాలక్రమేణా ఈ భూమ్మీద సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 99.9 శాతం వరకు ఏకకణ (mono cellular) జీవులే. అవే క్రమేణా జీవ పరిణామం ద్వారా బహుకణ జీవులుగా, జంతువులుగా, వృక్షాలుగా వివిధ జాతుల్ని ఏర్పరిచాయి. నేటికీ వాటి సంఖ్య ఇతర జంతు, వృక్ష జాతులకన్నా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మన పెద్ద ప్రేగులోనే ఉన్న బ్యాక్టీరియాల సంఖ్య మన సొంత జీవకణాల కన్నా హెచ్చుగా ఉంటుంది.
క్రీ||పూ 600 సంవత్సరాల కిందట వీటి ఉనికిని జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు తదితరులు వూహించారు. కంటికి కనిపించని జీవులు ఉంటాయని భావించారు. కానీ శాస్త్రీయమైన రుజువులు కేవలం క్రీ||శ 17వ శతాబ్దం వరకు లభించలేదు. 1674 సంవత్సరంలో లీకెన్ హాక్ అనే జీవశాస్త్రవేత్త తొలిసారిగా తానే రూపొందించిన సూక్ష్మ దర్శిని సహాయంతో సూక్ష్మ జీవుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ తర్వాత రోబర్ట్ హుక్ దాదాపు అదే కాలంలో సూక్ష్మ దర్శిని ద్వారా వివిధ సూక్ష్మ జీవుల్ని పరిశీలించి వర్గీకరించాడు. లూయీ పాశ్చర్, స్పల్లంజాని, కోచ్ వంటి శాస్త్రవేత్తల ఎనలేని కృషివల్ల సూక్ష్మ జీవుల వల్ల కలిగే అనేక లాభనష్టాల గురించి వివరంగా తెలిసింది.
వ్యోమనౌకలో ఉండే తక్కువ ప్రదేశంలో 3 నుంచి 6 మంది వ్యోమగాములు ఉండటంతో గాలి పీల్చుకునే విషయంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అక్కడ వారు క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండటానికి వ్యోమనౌకలో ECLSS (environmental control and life support systems) అనే వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో నీటి నిర్వహణ (వ్యర్థమైన, మూత్రరూపంలోని నీటిని తొలగించడం), కేబిన్‌లో ఉత్పన్నమయే కార్బన్‌డైఆక్సైడ్, అమోనియా, మీథేన్ లాంటి వాయువులను తొలగించడానికి కావలసిన పీడనం, ఉష్ణోగ్రత, తేమను నియంత్రించడం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ ఉంటాయి.
వ్యోమనౌకలో ఉన్న వారు పీల్చుకోవడానికి కావలసిన గాలి (ఆక్సిజన్) రెండు మార్గాలలో లభిస్తుంది. ఒకటి నీటి నుంచి విద్యుత్ విశ్లేషణ ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయడం. నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసి ఉండటంతో ఈ ప్రక్రియ ద్వారా విడుదలయిన ఆక్సిజన్‌ను శ్వాసించడానికి ఉపయోగించి, హైడ్రోజన్‌ను రోదసిలోకి వదిలేస్తారు. మరో మార్గం వ్యోమనౌక వెలుపలి భాగంలో అమర్చిన టాంక్‌లో పీడనంతో ఉన్న ఆక్సిజన్ నుంచి కావలసిన మేరకు ఆక్సిజన్‌ను తీసుకోవడం.
వ్యోమనౌక నుంచి వెలుపలికి వచ్చి రోదసిలో ప్రయోగాలు చేసే వారికి ప్రత్యేకమైన 'స్పేస్ సూట్లు' ఉంటాయి. వాటిలో వారు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్‌ను విడుదల చేసే ఏర్పాట్లు ఉంటాయి. అందులో ఉండే 'పెర్‌క్లోరేట్ కాండిల్స్' అనే పరికరంలో ఉండే లోహాలు రసాయనిక చర్యల ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
కృత్రిమ శ్వాస అందించడంలో కీలకమైనవి ఆక్సిజన్ వెంటిలేటర్లే. మామూలు సిలిండర్లలో పెద్ద పనితనం ఏమీ లేదు. చిన్న వాల్వ్ పిన్నును తెరవడం, రెగ్యులేటర్ల ద్వారా సిలిండర్లలోని గాలిని ఒకే దిశలో ఆశించిన పీడనంలో బయటకు పంపడం మినహా వాటిలో మరే తతంగం లేదు. కానీ ఆక్సిజన్ వెంటిలేటర్లు వేరు. ఎవరికయినా అత్యవసర చికిత్స అవసరమైనపుడు, ఊపిరితిత్తుల పనితనం స్తంభించిపోయినపుడు, కోమాలోకి వెళ్లినపుడు కృత్రిమంగా శ్వాస ప్రక్రియను నిర్వహించాలి. అలాంటి సందర్భాలలో సిలిండర్లలో ఉన్న ఆక్సిజన్‌ను తగు మోతాదులో తగిన పీడనంలో రోగి ముక్కు లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. సాధారణంగా ఇలా కృత్రిమంగా పంపే ఆక్సిజన్ (ఒక్కోసారి నైట్రోజన్‌లో కలిసి) పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా హెచ్చుగా ఉండడం వల్ల బలవంతంగానే ఆక్సిజన్ లోపలికి వెళ్లి రోగి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. అదే సమయంలో అధిక పీడనం వల్ల వ్యాకోచించిన ఊపిరితిత్తుల ప్రోద్బలంతో పేషెంటు ఉదర వితానం (diaphragm)కూడా వ్యాకోచిస్తుంది. ఇది ఉచ్ఛ్వాస ప్రక్రియ (inspiration).ఈ దశకాగానే ప్రత్యేకమైన వాయు సరఫరా పద్ధతుల ద్వారా గాలిని పంపడం నిలుపు చేస్తారు. అప్పుడు ఉదరవితానం సంకోచించడం ద్వారా నిశ్వాస ప్రక్రియ (expiration)జరుగుతుంది. అపుడు విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడు, నీటి ఆవిరి మరో మార్గం ద్వారా గాల్లో కలుస్తాయి. ఇలా ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియనే కృత్రిమ శ్వాస క్రియ అంటారు. ఈ విధానంలో ఉపయోగపడే పరికరాల్ని వెంటిలేటర్లు అంటారు.
పుష్పాల రంగులకు, మకరందాల రుచులకు, సుగంధపు వాసనలకు కారణం వివిధ రకాల సేంద్రియ రసాయనాలే. రంగులనిచ్చేందుకు కెరోటిన్ పదార్థం కారణం. అలాగే గ్లూకోజు, ఫ్రక్టోజు వంటి వివిధ రకాల తేలిక పాటి చక్కెర పదార్థాల వల్లే మకరందాలు తేమగా ఉంటాయి.
పుష్పాలకున్న విశిష్టమైన సువాసనలకు కారణం ఆయా పుప్పొడి రేణువుల మీద, పుష్ప దళాల మీద ఉండి తేలిగ్గా ఆవిరయ్యే టర్పీనులు, ఎస్టర్లు, ఆల్కలాయిడ్లు కారణం. పుష్పాల రంగులు, మకరందాల రుచులు, పుష్ప సౌరభాల గుబాళింపులు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ఎంచుకున్న ఏర్పాటే. రాత్రుళ్లు సంచరించే కీటకాల ద్వారా పుప్పొడి రేణువుల వ్యాప్తి కోసమే కొన్ని పుష్పాలు రాత్రుళ్లు విచ్చుకుంటాయి. పుష్పాలలో ఉన్న మకరందాల, వర్ణాల, వాసనల రసాయనాలకు కాంతి సమక్షంలో చర్యనొందే లక్షణాలుంటాయి. కాంతి సమక్షంలో రసాయనాలు ప్రేరేపితమై పత్రదళాల్ని విప్పారించే విధంగా పగలు విచ్చుకునే పుష్పాలలో ఏర్పాటు ఉంటుంది. కాంతి ఉంటే విచ్చుకోకుండా కాంతి లేనట్లయితే చీకట్లో దళాల్ని విప్పదీసే విధంగా విరజాజి, సన్నజాజి కొన్ని మల్లె జాతుల్లో ఏర్పాటు ఉంటుంది. కాంతి గ్రాహకాల రసాయనిక లక్షణాల ఆధారంగానే పగలు లేదా రాత్రిళ్లు విచ్చుకునే తేడా ఉంటుంది.
పాత్రలలో ఉంచిన ద్రవ పదార్థాలేవైనా గాలిలో పెడితే కొంత కాలం తర్వాత వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి నిదానంగా ఆవిరయిపోతాయి. ఈ ప్రక్రియను భాష్పీభవనం (Evaporation) అంటారు. ఆవిరయ్యే ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు. ఆవిరవుతున్నపుడు ద్రవాల్లోని అణువులు వాటిని ఒకదానిలో మరొకటి బంధించి ఉన్న బంధాలను తెంచుకొని ఆవిరి రూపంలోకి మారి అవి ఉన్న పాత్రలలో నుంచి బయటి వాతావరణంలోకి వెళతాయి. ఇలా జరగడానికి ద్రవంలోని అణువులకు కావలసిన శక్తిని వాతావరణంలోని ఉష్ణం నుంచి గ్రహిస్తాయి. ఒక్కో ద్రవానికి ఒక్కో భాష్పీభవనస్థానం ఉంటుంది. పెట్రోల్ భాష్పీభవనస్థానం చాలా తక్కువ. అంటే పెట్రోల్, తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరిగా మారుతుంది.
పెట్రోల్ మన చేతిపై పడినపుడు అది మన శరీరం నుంచి ఉష్ణం తీసుకొని తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరయి పోవడంతో, అతి తక్కువ కాలంలోనే కొంత ఉష్ణాన్ని కోల్పోయిన మన శరీర భాగం అంటే చేయిపై చల్లగా ఉంటుంది. భాష్పీభవనం చల్లదానాన్ని కలుగచేస్తుంది.
కొంగలకు మిగిలిన శరీరము కన్నా కాళ్ళు మూడూ-నాలుగు రెట్లు పొడవుగా ఉంటాయి. మామూలు గా ఇలా పొడవు కాళ్ళు ఉండడము ఆహారము కోసము నీళ్ళలోకి వెళ్ళే పక్షులలో కనిపిస్తుంది. మిగిలిన సమయము నేలమీద , ఆహారము కోసం నీళ్ళలో నడిచే కొంగలు , ప్లెమింగోల వండి వాటికి నీరు శరీరానికి తగలకుండా ఉండేందుకు వాటి కాళ్ళు పొడవుగా ఉంటాయి.
పెరిగిన కాళ్ళ రూపానికి తగినట్లే ఈ పక్షులు లలో మెడపొడవు పెరుగుతుంది ... కిందికి వంగి నీటిలోని చేపలను అందుకునేందుకు ఆ మెడ అలా సాగింది .
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటే, ఆ భూమి చంద్రునితో సహా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరిగే భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. మరి సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి నీడ దానిపై పడుతుంది. ఆ నీడ పరుచుకున్నంతమేర చంద్రుడు కనబడదు. కాబట్టి దాన్నే మనం 'చంద్రగ్రహణం' అంటాం. భూమి నీడలోకి రావడానికి ముందు చంద్రునిపై కూడా సూర్యకాంతి పడుతుంది. అంటే, భూమిపై నుంచి చంద్రుడు గుండ్రంగా, పూర్తిగా కనిపిస్తుంటాడు. అదే పౌర్ణమి. పౌర్ణమి నాడు చందమామగా కనిపిస్తున్నపుడే చంద్రుడు క్రమంగా భూమి నీడలోకి రాగలడు. అపుడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సౌర పవనాలు విద్యుదావేశంతో కూడిన పరమాణువుల ప్రవాహం. ఈ పవనాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కొంత నిష్పత్తిలో బరువైన కేంద్రకాలు ఉంటాయి. ఇవి సూర్య వాతావరణంలో ఉండే అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడుతాయి. సూర్యుని భాగమైన 'కరోనా'లోని అత్యధిక ఉష్ణం వల్ల ఉత్పన్నమయే అధిక పీడనం వల్ల అక్కడ నుంచి వెలుపలకు అంటే గ్రహాంతర ప్రదేశాల్లోని అన్ని దిశలకు ప్రవహించే గాలులే సౌర పవనాలు. సౌర పవనాలు 1,00,000 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రతతో సూర్యుని నుంచి సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో సూర్యుని క్రియాశీలతని బట్టి వెలువడుతాయి.సౌర పవనాలలోని కణాలు భూమిని చేరుకోవడానికి 4, 5 రోజులు పడుతుంది. ఈ పవనాలను అధ్యయనం చేయడం ద్వారా సూర్యునిలో ఏర్పడే అరోరా, అయస్కాంత తుపాను లాంటి దృగ్విషయాలను శాస్త్రజ్ఞులు విశ్లేషించగలుగుతారు.
ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. సముద్రాలను దాటి వలసపోయే ముందు పక్షులు సముద్ర తీరంలో ఒక నిర్ణీత ప్రాంతంలో గుమిగూడుతాయి. తర్వాత వాటి దృష్టి వ్యవస్థ ఆధారంగా సముద్రాలను దాటుతాయి. వాటి తలలో మాగ్నటైట్ అనే సూక్ష్మకణాలు అయస్కాంత సూచికలాగా పనిచేయడంతో ఆ ప్రభావం వల్ల భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగడుతూ, దానికి అనుగుణంగా దృష్టి వ్యవస్థను అనుసంధానించుకుని ముందుకు సాగుతాయి. ఆపై సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తాము వలసపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి.
చెత్త అంటే పనికిరాని పదార్థాల సముదాయం. కానీ చెత్తతో కూడా ఉపయోగం ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ మధ్య అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం (solid waste management) ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉదాహరణకు... తినగా మిగిలిన పదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలు కానీ అన్నీ కూడా సేంద్రియ రసాయనాలే. వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అలాంటి వ్యర్థ కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్కులు, పేపర్లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాల్ని ఎండబెట్టి వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చగలం.
వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్తగా కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాల్ని తిరిగి పునర్వినియోగం చేసే కార్యకలాపం మన దేశంతో సహా అన్ని దేశాల్లో ఉంది.
ఓజోన్ వాయువు భూ వాతావరణంలో పై భాగంలో ఉంటేనే మేలు. అదే కింది భాగంలో ఉంటే కీడు.
భూమి వాతావరణాన్ని వివిధ ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్లు దాటాక 50 కిలోమీటర్ల లోపు వ్యాపించి ఉండే ప్రదేశాన్ని నిశ్చలావరణం అంటారు. ఈ ఆవరణలోని మిలియన్ భాగాల్లో ఆరు భాగాలు ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను పీల్చుకోవడం ద్వారా జీవకోటికి మేలు చేస్తుంది. అందుచేత ఇది అక్కడుంటేనే మేలన్నమాట.
మనం పీల్చుకునే గాలిలో కూడా ఓజోన్ ఉంటే అది మన వూపిరితిత్తులకు చాలా హాని చేకూరుస్తుంది. మనకేకాక జంతువులకు, మొక్కలకు కూడా నష్టం కల్గుతుంది. దురదృష్టవశాత్తూ మన రోడ్లపై తిరిగే మోటారు వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యాల్లో ఉండే రసాయనిక పదార్థాలు, కాంతితో సంయోగం చెందితే ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు అది అపకారే మరి.
ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే నిరోధక బలం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక ఎత్తు నుంచి పడే చీమల లాంటి జీవుల విషయంలో వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమ వేగంతో నేలను చేరుతాయి. అందువల్ల వాటికి హాని జరగదు. ఒకవేళ ఆ సమయంలో గాలి తీవ్రంగా వీస్తే, చీమల్లాంటి కీటకాలు ఆ గాలి వాటులో కొట్టుకుపోతాయి కూడా.
ప్రపంచవ్యాప్తంగా మంచినీరు తర్వాత అత్యధికంగా మానవుడు సేవించే పానీయం టీనే. ఆ తర్వాత కాఫీ, ఆపై ఇతర పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఉన్నాయి. తేయాకు చెట్ల ఆకుల్ని క్రమబద్ధీకరణ పద్ధతిలో వేడి చేసినపుడు పెళుసైన టీ ఆకులు వస్తాయి. వాటిని దంచితే వచ్చేదే టీ పొడి. ఆకుల కాలం, ఏ ఉష్ణోగ్రతలో వేడి చేశాం, ఏ ప్రాంతంలో పెరిగే తేయాకు తోటలు అన్న విషయాల మీద టీ లోని ధాతువుల స్వరూపం, సంఘటనం ఆధారపడతాయి.
తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో చైనా, ఆ తర్వాత మన భారత దేశం ఉండగా, ఈ రెండు దేశాల ఉత్పత్తి ప్రపంచపు ఉత్పత్తిలో సగం కన్నా ఎక్కువే ఉంది. టీలో ప్రధాన ధాతువు కెఫిన్. ఇది ఒక ఆల్కలాయిడ్. టీని పరిమిత మోతాదులో తీసుకుంటే హృదయ సంబంధ వ్యాధుల నివారణకు సహకరిస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. కానీ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు.
వేర్వేరు పండ్లకు వేర్వేరు రుచులు రావడానికి కారణం ఆయా పండ్లలో ఉండే జన్యు సంకేతాలే (Genetic code).ఆ జన్యు సంకేతాన్ననుసరించే పండ్లలో ప్రత్యేక రుచుల్ని, వాసనలను, ఇచ్చే పదార్థాలే ఉత్పత్తి అవుతాయి. ఏ పదార్థమూ శూన్యం నుంచి ఏర్పడదు. అంటే ఫలాల్లో ఉన్న పదార్థాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు చెట్టుకు అందుబాటులో ఉండాలి. పైగా పండ్ల రుచుల, వాసనల తయారీ సమయంలో తగిన విధంగా వాతావరణంలోనూ, నేలలోనూ అనువైన భౌతిక (ఉష్ణోగ్రతగల పీడనం, గాలిలో తేమ, వెలుతురు మొ||వి), రసాయనిక లక్షణాలు ఉండాలి. ఒకే ప్రాంతంలో సంవత్సరం పాటు ఒకే విధమైన భౌతిక, రసాయనిక లక్షణాలు నేలలోను, వాతావరణంలోనూ ఉండవు. అందువల్లే ఆయా ప్రాంతాలకు, ఆయా రుతువులకు అనుకూలంగా వివిధ పండ్ల మొక్కలు పుష్పించి ఫలిస్తాయి. వివిధ పంటలు పండుతాయి. ఎప్పుడూ కాయలనిచ్చే చెట్లున్నాయి, ఏడాదికోసారి ఫలాలనిచ్చేవి ఉన్నాయి.
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.
ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.
సోర్స్: emitiendukuela.blogspot.in
చిలుకలు పలికే పలుకులు వాటి స్వర సంబంధిత అనుకరణ వల్లనే కానీ, వాటికి ఉండే ఏదో ప్రత్యేకమైన పదజాలం వల్ల మాత్రం కాదు. మానవుల, పక్షుల ప్రవర్తన చాలా వరకు గాత్రం వెలువరించే శబ్దాలు, దృష్టి సంకేతాలపై ఆధారపడి
ఉంటుంది.
పక్షుల స్వరపేటిక (voice box)ను సిరింక్స్ అంటారు. ఇది మానవుల స్వరపేటికలా కాకుండా అతి సామాన్యంగా ఉంటుంది. అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు.
పక్షుల్లో స్వరపేటిక శ్వాసనాళం కింద ఉంటుంది. స్వరపేటికలో ఉత్పన్నమయిన శబ్ద తీవ్రతను శ్వాసనాళంలోని కండరాలు నియంత్రిస్తాయి. ఆ శబ్దాలు అంతగా హెచ్చుతగ్గులు లేని స్వరభేదంతో వాటి నోటి నుంచి వెలువడుతాయి.
చిలుకలు, మైనాలు వాగుడుకాయలు. ఇవి ఒక పర్యాయం 50 పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగలవు. వీటిలో శబ్దాల విడుదలను నియంత్రించే మెదడు ముందు భాగం మగ పక్షులలో ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల అవి శబ్దాలను సంగీత రూపంలో కూడా వెలువరిస్తాయి.
మానవులలో శబ్దాలు పక్షులలో వలె కాకుండా శ్వాసనాళంపై ఉండే స్వరపేటిక నుంచి వెలువడుతాయి. స్వరపేటిక వివిధ భాగాలతో సంక్లిష్టంగా నిర్మితమయి ఉండటంతో శబ్దాలు స్పష్టమైన మాటల రూపంలో వెలువడుతాయి. నాలుక, బుగ్గలు, నోరు, పెదాలు స్వరస్థానాలను తగురీతిలో మార్చడమే కాకుండా నియంత్రిస్తాయి.
ఆవిధంగా చిలుకలు మనం చేసే శబ్దాలను అనుకరిస్తాయే కానీ, అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు. అందుకనే చిన్న పిల్లలు మనలను అనుకరిస్తూ నంగినంగిగా, ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు మాటలను 'చిలక పలుకులు' అంటారు.
ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని, ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు. నిజమేనా?
ప్రతి జీవికి పరిసర పరిజ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మానవుడిలో పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందాయి. మనం చర్మం (స్పర్శ), కళ్లు (దృష్టి), చెవులు (శ్రవణం), ముక్కు (ఘ్రాణం), నాలుక (రుచి) అనే పంచేంద్రియాల ద్వారా మాత్రమే ప్రకృతి జ్ఞానం పొందుతాం. ప్రకృతి పరిజ్ఞానానికి, తెలివి తేటలకు ఇంతకు మించి మరే ద్వారమూ లేదు.
మన మెదడులోనే మనం సంతరించుకున్న జ్ఞాన ముద్రలు, సమాచారం భద్ర పరిచి ఉంటాయి. ఆసక్తి అనేది మానవుడికే ఉంది. ఆసక్తి అంటే తెలుసుకోవాలనే కుతూహలం. పుట్టినప్పట్నించి పెరిగే క్రమంలో తొలి దశల్లో ఆసక్తి అమితంగా ఉంటుంది. క్రమేపీ మెదడులో కూడా సమాచారం నిల్వ అవుతూ ఉంటుంది. ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మనకు తెలిసిన సమాచారంలో సుమారు 60 శాతం పోగవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అభ్యసనం చర్చలు తదితర సామూహిక కార్యకలాపాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.
సోర్స్: emitiendukuela.blogspot.in
కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిర్రున తిరుగుతూ చక్రభ్రమణాలు చేస్తున్నా చివరికి నేలను తాకేముందు రెండు కాళ్లపైనే దిగుతాయి. వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. నేలను తాకే ముందు వాటి నాలుగు కాళ్లు కింది వైపునకే తిరిగి నేలను నిదానంగా, నిటారుగా తాకుతాయి. ఇలా దిగడం వల్ల నేలను ఢీకొనేటపుడు ఉత్పన్నమయే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణాపాయం లేకుండా పిల్లులు తప్పించుకోగలుగుతాయి. అందువల్లనేమో 'పిల్లులకు తొమ్మిది జన్మలుంటాయనే' నానుడి ప్రాచుర్యంలో ఉంది.
కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే, భూమ్యాకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు హెచ్చుతూ, నేలను తాకే ముందు వేగం గరిష్ఠం అవుతుంది. దీనిని త్వరణ వేగం అంటారు. కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే, అపుడు అది గాలిలో ఎగిరే ఉడుతను పోలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గాలి నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా, సమంగా ఉంటుంది. శరీరాన్ని బాగా చాచడం వల్ల పడేటపుడు ఉత్పన్నమయే అభిఘాత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లాచెదరవుతుంది. చివరగా పిల్లి పేరాచూట్‌లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లు నాలుగు కాళ్లపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది.
సోర్స్: emitiendukuela.blogspot.in
స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది.
మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో మసక చీకట్లో కానీ పసుపురంగును మిగతా వాటికన్నా బాగా చూడగలుగుతాం.
వర్ణదృష్టిలోపం ఉన్నవారికి రంగులు సరిగా కనపడవు. ముఖ్యంగా ఎరుపు రంగు అలాంటి వారికి నల్లగా, చీకటి రంగులో కనిపిస్తుంది. అదే పసుపు రంగు విషయంలో ఈ దృష్టి లోపం ఉండదు. ఈ విషయాల దృష్ట్యా పసివాళ్లు పయనించే బస్సులకు పసుపురంగు వేయాలని 1939లో ఉత్తర అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాంక్ సైర్ ఒక సమావేశంలో వివరించారు. డాక్టర్‌సైర్ 'Father Of Yellow School Bus'గా ప్రసిద్ధిగాంచారు. స్కూలు బస్సులకు వేసే పసుపు రంగు సీసం కలిపిన క్రోమ్‌ఎల్లో.
సోర్స్: emitiendukuela.blogspot.in
సౌరమండలంలో సూర్యుడు కేంద్ర బిందువు. సౌర శక్తే మనం వాడే అన్ని రకాల శక్తులకు మౌలిక ఆధారం. సూర్యుడిలో ఉండేది కేవలం రెండే వాయువులు. ఇందులో సుమారు 75 శాతం హైడ్రోజన్, మిగిలింది హీలియం. కేంద్రక సంలీన చర్య వల్ల ప్రతి సెకనుకు సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతుంటాయి. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం అందులో నుంచి సుమారు 420 టన్నుల ద్రవ్యరాశి శక్తిగా మారుతుంటుంది.
సూర్యుడి గోళ వ్యాసార్థం ఏడు లక్షల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. సూర్యుడి కేంద్రక సంలీన చర్య అంతర్భాగం లోపల రెండు లక్షల కిలోమీటర్ల లోపే పూర్తవుతుంది. ఆ తర్వాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం, వికిరణం పద్ధతుల్లో ఉపరితలానికి వ్యాపిస్తుంది. ఆ వేడి తాకిడికి మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి. వీటినే సౌర జ్వాలా కీలలు అంటారు. అయితే అక్కడ బ్రహ్మాండం బద్ధలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమి వరకు వినిపించదు. ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ప్రదేశమంతా కేవలం శూన్యం. శూన్యంలో కాంతి ప్రసరిస్తుందిగానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు.
సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాల్ని వినలేము.
సోర్స్: emitiendukuela.blogspot.in
నాటిన గింజ మొలకెత్తాలంటే ఆ గింజలో ఫలజీవం సజావుగా ఉండాలి. సాధారణంగా పూర్తిస్థాయి క్రోమోజోములున్న సంయుక్త జీవ కణం (Zygote) విత్తనంలో ఉంటుంది. విత్తనం మొలకెత్తగానే కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి సొంతంగా ఆహారం తయారు చేసుకునేంతవరకు తన ఎదుగుదలకు సహాయ పడేలా విత్తనంలో పోషణ ఉండాలి. అందుకే విత్తనాలలో సంయుక్త బీజకణ లక్షణాలతోపాటు పప్పు, కొబ్బరి, ముట్టె వంటి భాగాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి క్షీణించి ఉన్నాగానీ, రసాయనిక కారణాల వల్లగానీ, జన్యులోపం వల్ల గానీ అధిక వేడివల్లగానీ తదితర కారణాల వల్ల విత్తనంలో ఉన్న జీవం నశించి ఉంటే అలాంటి విత్తనాలు మొలకెత్తవు.
అందుకే రైతులు విత్తనాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటారు. తాము పండించిన విత్తనాలు తిరిగి పంటకొచ్చే అవకాశం లేకపోవచ్చు లేదా, టెర్మినేటర్ సీడ్స్ అనే విత్తనాల్లో అన్నీ బాగున్నాగానీ, వీటి క్రోమోజోముల్లో కంపెనీల వాళ్లు కావాలనే జన్యు నిర్మాణం చేయడం వల్ల మొలకెత్తవు కాబట్టి జన్యులోపం లేకుండా, ఆహార సమృద్ధి బాగా ఉంటూ సజీవంతో ఉన్న విత్తనాలే మొలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు బాగున్నా నేలలో ఉండే సారం విత్తనం మొలకెత్తేందుకు అనువుగా లేకున్నా ఆ ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తవు.
సోర్స్: emitiendukuela.blogspot.in
రాత్రి వేళల్లో మనం నిద్ర ద్వారా విశ్రాంతి పొందుతాము. ఆ దశలో చలన సంబంధ అవయవాలు (కాళ్లు, చేతులు మొదలైనవి) సేదదీరి ఉంటాయి. నిద్రలో సేద తీర్చుకున్న తర్వాత అవయవాల్ని, కండరాల్ని పనికి పురికొల్పేందుకు నడక ఉత్తమ మార్గం. పైగా నడక సమయంలో గుండె శరీర భాగాలకు రక్తాన్ని బాగా ప్రసరింపజేస్తుంది. తద్వారా మెదడు, తదితర అంతరంగావయవాలకు సరియైన మోతాదులో రక్తం చేరడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. తేలికపాటి నడకవల్ల గుండెకు కూడా మంచిదని వైద్యులు అంటున్నారు. అంతేకాదు, నడక సమయంలో చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్తేజం పొంది చర్మంపై పొర మీదకు స్వేదాన్ని స్రవించడం వల్ల చర్మపు పై పొర ఆరోగ్యవంతంగా ఉంటుంది. శరీరంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తాం. 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్న సామెత మాటేమోగానీ 'నడక నలభై విధాల మేలు' అనేది ఇప్పుడు గుర్తుంచుకోవాలి.
సోర్స్: emitiendukuela.blogspot.in
సూర్యుడు భూమికన్నా సుమారు 3,30,000 రెట్లు ఎక్కువ బరువుంటాడు. సూర్యుడిలో 3/4 భాగం హైడ్రోజన్ ఉంటే మిగతాది హీలియం. సూర్యుడు అంత బరువుగా ఉండబట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉండి అందులోని వాయువులను ఒకే చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు.
సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి 25 శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది. ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని (వాయువు) అంతా గురుత్వశక్తి కేంద్రంవైపు ఆకర్షించడంతో విపరీతమైన పీడనం (ఒత్తిడి) ఉత్పన్నమవుతుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, హైడ్రోజన్ వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమవుతాయి. రెండు హైడ్రోజన్ పరమాణువులు కలుసుకొని, హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ దశలో ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. ఈ శక్తి కిరణాలు, నీలలోహిత కిరణాలు, కంటికి కనిపించే కాంతి, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల రూపంలో వెలువడుతుంది. సూర్యుడు శక్తిమంతమైన న్యూట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన 'సౌర పవనాలు' వెలువరిస్తాడు. ఈ శక్తి వికిరణ, సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. సూర్యుని అంతర్భాగం నుంచి 55 శాతం మేర వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి 'ఫోటాన్ల' ద్వారా రవాణా అవుతుంది. ఫోటాన్ల నుంచి వాయుకణాలు శక్తి సంగ్రహించి వేడెక్కడంతో కొత్త ఫోటాన్లు ఆవిర్భవిస్తాయి. అవి మళ్లీ వాయుకణాలను వేడెక్కించడం ద్వారా శక్తి సంవాహన మండలాన్ని చేరుకుంటుంది. సంవాహన మండలం మిగతా 20 శాతం సంవాహన ప్రక్రియ ద్వారా క్రమేణా సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. ఈ మండలంలోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవాహం పైకి లేస్తుంది. ఈ ప్రవాహం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణాన్ని పంచుకుంటుంది. చల్లారిన పొరలు మళ్లీ కిందికి పయనిస్తాయి. ఈ విధంగా ఫోటాన్లకు, వాయుకణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ, కాంతి శక్తులు వికిరణ, సంవాహన మండలాల్ని దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటాయి. సూర్యుడు సెకనుకు 400 మిలియన్ టన్నుల హైడ్రోజన్‌ను పూర్తి శక్తిరూపంలోకి మారుస్తాడు. సూర్యుని వికిరణ మండలం నుంచి ఒక ఫోటాన్ సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు లక్షల ఏళ్ల వరకు ఉంటుంది.
సోర్స్: emitiendukuela.blogspot.in
వైర్లతో కూడుకున్న మైక్రోఫోన్లు (మైకులు) ఎప్పటినుంచో వాడుతున్నారు. ఈ మైక్రోఫోన్లు ట్రాన్స్మిటర్, రిసీవర్ లౌడ్‌స్పీకర్ అనే మూడు పరికరాలు కలిగి ఉండే వ్యవస్థ. వీటిని తీగల ద్వారా అనుసంధానిస్తారు.
ఈ తీగల ప్రమేయం లేకుండా వివిధ భాగాలను ఒక అనువైన గొట్టంలో అమర్చి ఉన్న సాధనమే వైర్‌లెస్ మైక్రోఫోన్ (నిస్తంత్రీ శబ్ద ప్రసారిణి). ఈ మైక్రోఫోన్‌ను సులువుగా చేతిలో పట్టుకుని వక్తలు, గాయకులు వేదికపై ఏ మూలకైనా వెళ్లొచ్చు. అవసరమైతే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి మాట్లాడినా ఇది శబ్దాన్ని ప్రసారం చేస్తుంది. కాకపోతే వైర్‌లెస్ మైక్ ఖరీదు కాస్త ఎక్కువ.
వైర్‌లెస్ మైక్రోఫోన్‌లో స్వల్ప పరిమాణంలో ట్రాన్స్మిటర్ రిసీవర్ PA సిస్టం లేక హెడ్‌సెట్ ఒక గొట్టంలో అమర్చి ఉంటాయి. ట్రాన్స్మిటర్ పనిచేయడానికి కావలసిన 9 ఓల్టుల బ్యాటరీ కూడా అందులోనే ఉంటుంది. ట్రాన్స్మిటర్ ఏ ఎలక్ట్రానిక్ తరంగ దైర్ఘ్యాన్ని ప్రసారం చేస్తుందో రిసీవర్ కూడా ఆ తరంగా దైర్ఘ్యానికే ట్యూనై ఉంటుంది. మైక్రోఫోన్‌లోకి ప్రవేశించిన శబ్ద తరంగాలను ట్రాన్స్మిటర్ విద్యుత్ తరంగాలుగా మార్చి అక్కడే ఉన్న ఏంటినా ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ తరంగాలను గ్రహించిన రిసీవర్ అక్కడే అమర్చిన PA సిస్టమ్ లేక హెడ్‌సెట్ సాయంతో శబ్ద తరంగాలుగా మార్చి ఆ శబ్దాన్ని ఎక్కువ తీవ్రతతో ప్రేక్షకులకు అందచేస్తుంది. శబ్దం వెలువడే నోటికి, మైక్రోఫోనుకు మధ్యగల దూరాన్ని చేతి కదలికల ద్వారా మార్చి, వైర్‌లెస్ మైక్రోఫోన్ నుంచి వెలువడే శబ్ద తీవ్రతను స్వచ్ఛతను నియంత్రించవచ్చు.
సోర్స్: emitiendukuela.blogspot.in
నిర్ణీత ఆకారం, ఘన పరిమాణం ఉన్న వస్తువుల్ని ఘన పదార్థాలు అంటాము. నిర్ణీత ఘన పరిమాణం ఉన్నా నిర్దిష్ట రూపం లేకుండా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించుకునే వాటిని ద్రవ పదార్థాలు అంటారు. ఘన పరిమాణం, పీడనం పైన ఆధారపడ్డమే కాకుండా నిర్దిష్ట రూపం లేని పదార్థాల్ని వాయు పదార్థాలు అంటారు. ఘన, ద్రవ పదార్థాల్ని చూడగలం కానీ వాయు పదార్థాల్ని ప్రత్యక్షంగా చూడలేం. పేస్టు, జెల్ చూడ్డానికి ఘన పదార్థాల్లాగే అనిపించినా కొంచెం చిదిమితే రూపం మారిపోతుంది. ఈ లక్షణం ద్రవానిది కాబట్టి మీరు ప్రస్తావించిన పేస్టులు, జెల్‌లను అర్ధ ఘనపదార్థాలు (Semi solids) లేదా ఘన ద్రవాలు అంటారు. వీటినే కొల్లాయిడ్లు అంటారు. ఇందులో ద్రవం తక్కువగాను, ఘన పదార్థం ఎక్కువగాను ఉంటుంది. సాధారణంగా ద్రవ పదార్థం లోపల ఘన పదార్థాలు కరిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా జెల్‌లలో ఘన పదార్థాలలో ద్రవ పదార్థాలు కరిగి ఉంటాయి.
సోర్స్: emitiendukuela.blogspot.in
సుమతీ శతకంలో తేలు, పాములకు మాత్రమే విషమున్నట్లు ఉన్నా, మన జంతు ప్రపంచంలో చాలా జీవులకు విషం ఉంటుంది. కొన్ని వృక్ష జాతుల్లోనూ విషం ఉంటుంది. ప్రతీ జీవికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్నింటికి కొమ్ములు, శరీరంపై ముళ్లు, పదునైన పళ్లు ఉంటే కొన్ని జీవుల శరీరాల్లో విషం ఉంటుంది. విషపు జంతువులు పనిగట్టుకుని ఎవరికీ హానీ చేయవు. ఆహార సముపార్జనకోసమో, లేదా ఎవరైనా హానీ తలపెట్టినపుడో విష జంతువులు తమను తాము రక్షించుకోవడానికి కుట్టడమో, కరవడమో చేస్తాయి.
పాములతోపాటు కొన్ని రకాలైన సముద్రపు నక్షత్రపు చేపలు, ఆక్టోపస్‌లు, చేపలు, కీటకాలు, సాలెపురుగులు, చీమలు, బల్లులు, గబ్బిలాలు కరిస్తే విషం సోకే ప్రమాదం ఉంది.
విషం కూడా ఓ విధమైన ప్రోటీనన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కానీ అది మన శరీరంలో అవాంఛనీయ చర్యలతో కీడు కలిగిస్తుంది.
సోర్స్: emitiendukuela.blogspot.in
ఆకాశంలో నీటి ఆవిరి, మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఒకదానినొకటి ఒరుసుకోవడం వల్ల అధిక ఓల్టేజీ, కరెంటు విలువలతో కూడిన విద్యుచ్ఛక్తి ఉత్పన్నం అవడం వల్ల మెరుపులు, ఉరుములు వస్తాయి. వాటి నుంచి వెలువడి భూమి వైపు పయనించే విద్యుత్ తరంగాలు, భూమిపై మనం ఏర్పరుచుకున్న విద్యుత్ లైన్లను, టీవీ ఏంటినాలను తాకుతాయి. వాటి నుంచి వాటికి అనుసంధానించిన టీవీ లాంటి పరికరాల్లోకి ఎక్కువ ఓల్టేజీలో ఉండే విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే కాలం అతి తక్కువైనా, తక్కువ ఓల్టేజీ విద్యుత్ ప్రవహించే ఏర్పాటుతో తయారు చేసిన ఆ పరికరాల్లోని భాగాలు పాడవుతాయి. అందువల్ల మెరుపులు, ఉరుములు వచ్చేటపుడు టీవీలాంటి పరికరాల్ని కట్టేయడం మంచిది.
సోర్స్: emitiendukuela.blogspot.in
దోమల్లో ఆడ దోమలే మనుషుల, ఇతర క్షీరదాల రక్తాన్ని పీలుస్తాయి. రక్తంలో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీను ఆడ దోమల్లో జరిగే అండోత్పత్తికి అవసరం. అంతేకాదు, రక్తం పీల్చడం ద్వారా ఆడ దోమ పొట్ట ఉబ్బితేనేగానీ ఆ ఒత్తిడికి అండాశయం నుంచి అండాలు ఉత్పత్తి కావు. మనుషులు, ఇతర క్షీరదాల చర్మం నుంచి చాలా స్వల్పంగా విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్, లాక్టిక్ ఆమ్లాలను వాసన చూడ్డం ద్వారా దోమలు మనుషుల్ని ఇతర రక్త జీవుల్ని గుర్తిస్తాయి. కాబట్టి కార్బన్‌డయాక్సైడ్‌ను, లాక్టిక్ ఆమ్లాలను గుర్తించే యంత్రాంగాన్ని భగ్నం చేయడం ద్వారా దోమలు మనుషుల్ని చేరుకోకుండా చేయవచ్చును. ఈ సూత్రం ఆధారంగా NN-డైయిథైల్ మెటాటోలమైడ్ (DEET)వంటి పదార్థాల్ని తేలిగ్గా ఆవిరయ్యే ద్రావణాల్లో సుమారు 8శాతం గాఢతతో ఉండేలా లిక్విడ్స్ సరఫరా చేస్తున్నారు. మస్కిటో రిపెల్లెంట్ లిక్విడ్స్‌ను ప్రత్యేక బాటిళ్లలో వేడి చేయడం ద్వారా DEETఆవిర్లు గాల్లోకలుస్తాయి. ఇవి దోమల ఘ్రాణ కణాల్ని తాకినపుడు వాటికున్న గ్రాహణశక్తి నశిస్తుంది. మస్కిటో కాయిల్స్‌లో కూడా దాదాపు ఇదే యంత్రాంగం ఉంటుంది. పైగా కొన్ని సహజ కీటక వికర్షక పదార్థాలను కూడా కాయిల్స్‌లో కలుపుతారు. సహజమైనవైనా, కృత్రిమమైనవైనా మస్కిటో కాయిల్స్‌లో, లిక్విడ్స్‌లోను ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అదే పనిగా రోజూ వాటిని వాడినట్లయితే అవాంఛనీయమైన అనారోగ్యస్థితులు రాగలవు. దోమల నివారణకు ఉత్తమ మార్గం, పరిసరాల శుభ్రత, ఆపై దోమతెరల వాడకమే!
సోర్స్: emitiendukuela.blogspot.in
మందుల దుకాణం వాళ్లు కల్తీ, నకిలీ మందులు అమ్మనంత వరకు వారిచ్చే మాత్రల్ని నమ్మవచ్చు. సాధారణంగా విటమిను మాత్రలు బహుళ విటమిను మాత్రల రూపంలో దొరుకుతాయి. ఒక్కోసారి అవసరంలేని విటమిను సంఘటనం కూడా ఆ మాత్రల్లో ఉండగలదు. గర్భిణిలు, పథ్యం లేదా నిర్ణీత ఆహార నియమాలు పాటించేవారు, వృద్ధులు, తల్లిపాలు లభించని శిశువులు మొదలయిన వారికి ప్రత్యేకంగా విటమిను సరఫరా అవసరం. అయితే మందుల రూపంలో కాకుండా శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే 'డి' విటమిను వంటి వాటిని అనవసరంగా కొని డబ్బు వృథా చేసుకోనవసరం లేదు. తగిన మోతాదులో కూరగాయలు, ఆకు కూరలు, మాంసకృత్తులు నిండిన సమతలాహారం, పండ్లు తీసుకుంటే విటమిన్ల మాత్రలు కొనవలసిన అవసరం ఉండదు.
సోర్స్: emitiendukuela.blogspot.ఇన్
రెఫ్రిజరేటర్‌ను, ఏదైనా కారణాల వల్ల స్విచ్ ఆఫ్ చేస్తే వెనువెంటనే మళ్లీ స్విచ్ ఆన్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో కీలక పరికరమైన సంపీడకం (కంప్రెషర్) పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇదెలాగో తెలియాలంటే ఫ్రిజ్ పనితీరును కూడా అర్థం చేసుకోవాలి. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేసే రిఫ్రిజరెంట్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయక ముందు ఎక్కువ పీడనంలో ఉండే దీన్ని తక్కువ పీడనంలోకి తెచ్చే వ్యాకోచ సాధనం ఉంటుంది. దీని ద్వారా రెఫ్రిజిరెంట్ నెమ్మదిగా దానిని ఆవిరిగా మార్చే భాష్పకారిణి (ఎవాపరేటర్)లోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌ను స్విచాఫ్ చేసినప్పుడు కంప్రెషర్ పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు రెఫ్రిజరెంట్ పూర్తిగా భాష్పకారిణిలోకి చేరుకుంటుంది. ఈ పరిస్థితిలో తిరిగి స్విచ్ ఆన్ చేస్తే, కంప్రెషర్‌లో ఎలాంటి రెఫ్రిజరెంట్ ఏమాత్రం లేని స్థితి కలుగుతుంది. దీనిని 'నో లోడ్ కండిషన్' అంటారు. దాని మూలంగా కంప్రెషర్ పాడవుతుంది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫ్రిజ్ తయారీదారులు తక్కువ సామర్థ్యం గల మోటార్లతో కూడిన కంప్రెషర్లను అమరుస్తారు. దీని వల్ల ఫ్రిజ్ ధరలో కూడా కొంత ఆదా అవుతుంది. no load condition ద్వారా ఫ్రిజ్ పాడవకుండా ఉండటానికి, ఫ్రిజ్‌ను 'ఆఫ్' చేసిన వెంటనే 'ఆన్' చేయకుండా కొన్ని సెకండ్లు వేచి ఉండటం మంచిది.
సోర్స్: emitiendukuela.blogspot.in
కొంచెం లోతైన ప్లాస్టిక్ ట్రేలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి వూదండి. ఆ ట్రే అంతా చిన్న తరంగాలు కదలడాన్ని చూడవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడతాయి.
సముద్రాల సగటు లోతు 3.7 కిలోమీటర్లు ఉంటుంది. సముద్రాలలో ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల అలలు ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన అల కిందికి పడినపుడు ఏర్పడే గతిజశక్తి వల్ల కూడా తిరిగి కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ, కిందికీ వూగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల కూడా వ్యాపించి అలలు నిరంతరంగా కనిపిస్తాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో అలల కదలికకు ప్లవనశక్తి కూడా తోడై మరింతగా అలలు ఏర్పడతాయి.
సముద్ర ఉపరితలంపై వీచేగాలి వేగం ఎక్కువయ్యేకొలదీ అలల ఎత్తు ఎక్కువవుతుంది. అలల ఎత్తుతోపాటు వాటి మధ్య దూరం కూడా ఎక్కువవుతుంది. ఒక దశ తర్వాత గాలి తీవ్రత ఎంతగా ఉన్నా అలల ఎత్తు కొంత గరిష్ఠ స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది. తీరానికి దూరంగా ఉన్న సముద్రంలోపలి లోతైన ప్రదేశాల్లో అలల ఎత్తు తక్కువగా ఉంటుంది.
తీరానికి చేరుకొనే కొద్దీ లోతు తక్కువ కావడంతో వాటి వేగం, వాటి మధ్యదూరం తగ్గుతాయి. వాటి ఎత్తు మాత్రం పెరుగుతుంది. చివరకు అలలు తీరం చేరేటప్పటికి వాటి ఎత్తు మరీ ఎక్కువై అలలు ఒకదానిపై ఒకటి విరిగిపోవడం వల్ల నురగ వ్యాపిస్తుంది. ఇలా నిమిషానికి పదికి మించి విరిగితే తీరంపై ఉన్న పదార్థాలను తన లోపలికి లాక్కుంటాయి. పది కన్నా తక్కువగా విరిగితే సముద్రంలోని గవ్వలు, ఆలు చిప్పలు లాంటి పదార్థాలు తీరంలోకి వచ్చిపడతాయి.
సోర్స్: emitiendukuela.blogspot.in
శరీరంలో పలు జీవన కార్యకలాపాలు జరగాలంటే శక్తి కావాలి. ఓ కారు నడవడానికి పెట్రోలు యంత్రంలో మండడం వల్ల వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. ఇక్కడ గాలిలోని ఆక్సిజన్ పెట్రోలును మండిస్తుంది. మండటం అంటే ఇంధనంలోని అణువులను ఆక్సిజన్‌తో సంధానించి ఆక్సీకరణం చేయడమే.
మన శరీరంలోని కార్యకలాపాలు నడవాలంటే మనకూ ఓ ఇంధనం అవసరం. ఆ ఇంధనమే గ్లూకోజు. మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజు లభ్యమవుతుంది. దీనిని రక్తం శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. కానీ ఇంధనంలోని శక్తిని రాబట్టాలంటే ఆక్సిజన్ కూడా కావాలి. దానిని మనం శ్వాసక్రియ ద్వారా రక్తంలోకి పంపుతాం. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శ్వాసక్రియలో వూపిరితిత్తుల్లోంచి స్వీకరిస్తుంది. రక్తం బదులు మొత్తం నీరే ఉన్నట్లయితే ప్రతి కణానికి గ్లూకోజు అందుతుంది కానీ ఆక్సిజన్ అందదు. ఎందుకంటే నీటిలో గ్లూకోజు కరిగినంతగా ఆక్సిజన్ కరగదు. ఆక్సిజన్‌ను అధిక మోతాదులో మోయగల హిమోగ్లోబిన్ అవసరం. అలాగే శరీరానికి గాయం తగిలితే సూక్ష్మ క్రిముల బారి నుంచి శరీరాన్ని రక్షించాలన్నా, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడాలన్నా సైన్యంలాగా తెల్ల రక్త కణాలు అవసరం. ఇవి నీటిలో కరగవు. ఇలా ఎన్నో జీవ రసాయనాలు కలిసి ఉన్న నీటినే రక్తం అంటాం. రక్తంలో నీరు 70 శాతం వరకు ఉంటుంది. ఉత్త నీటి వల్ల లాభం లేదు. నీటిలో నిమగ్నమై ఉన్న పలు జీవ రసాయనాల, వర్ణ ద్రవ్యాల సమాకలనమే రక్తం. ఇది గాయం తగిలితే గడ్డ కడుతుంది. నీరు గాయం తగిలితే కారిపోతూ ఉండేది. రక్తంలోని ప్లేట్‌లెట్స్ గడ్డ కట్టడంలో ఉపకరిస్తాయి.
రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి .నైట్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .
సోర్స్: emitiendukuela.blogspot.in
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020