অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ సాహస పురస్కారాలు

జాతీయ సాహస పురస్కారాల కార్యక్రమము పిల్లలు ఎవరైతే తమ విశిష్ట సాహసాలతో ప్రత్యేకతను ప్రదర్శిస్తారో వారికి గుర్తింపును ఇస్తుంది మరియు  ఇతర పల్లలు వీరి ఉదాహరణను అనుసరించేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. జాతీయ సాహస పురస్కారాలకు 1957లోని ఒక సాహస దృష్టాంతము మూలం.

ఫిబ్రవరి 4, 1958న ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు మొదటి సాహస మరియు సేవా బహుమతిని  ఇద్దరు పిల్లలకు బహూకరించారు. అప్పటి నుంచి ఇండియా శిశు సంక్షేమ మండలి ప్రతి సంవత్సరము పిల్లల జాతీయ పురస్కారాలకోసం సమాలోచన చేస్తుంది.

వినతి పత్రాలను ఆహ్వానించే పద్ధతి

నామనిర్దేశనాలు రాష్ట్ర/కేంద్రపాలిత ఐ.సి.సి.డబ్ల్యూ మండళ్ళు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు , ప్రధాన సంచాలకులు మరియు రాష్ట్ర పోలీసు కమీషనరులతో కలుపుకొని, మరియు  కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ఆహ్వానిస్తారు.

వినతి పత్రాలను సమర్పించే పద్ధతి

నామనిర్దేశనాలు నిర్ణీత వినతి పత్ర రూపంలో తీసుకుంటారు దానిని ఐ.సి.సి.డబ్ల్యూ కార్యాలయం, కొత్త డిల్లీ, నుంచి పొందవచ్చు. వినతి పత్రాలను నమోదు చెసిన ఇద్దరు యోగ్య అధికారులు శిఫారసు చేయాలి. పత్రాన్ని కిందివాటితో కలిపి పంపాలి.

  • ఇంచు మించు 250 పదాలతో అభ్యర్ధి ప్రదర్శించిన పని వివరాల రాత.
  • పుట్టిన తేదీ ప్రమాణం
  • న్యూస్ పేపరు/పత్రికల కత్తెరింపులు మరియు లేదా మొదటి సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) లేదా పోలీసు స్టేషనులో చేర్చిన పోలీసు డైరీ.
  • సంఘటన వివరాలను ఆధార పత్రాలతో పాటు కింది ఇద్దరు యోగ్య అధికారులు రాయాలి
    • అభ్యర్ధి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాలు/ప్రధానోపాధ్యాయుడు లేదా
    • పంచాయితీ పెద్ద/జిల్లాపరిషత్తు ముఖ్యకార్యదర్శి లేదా
    • శిశు సంక్షేమ రాష్ట్ర పరిషత్తు అధ్యక్షుడు
    • కలెక్టరు/డిఎమ్/సమానమైన ప్రభుత్వ అధికారి
    • ఆ ప్రాంత పోలీసు సూపరిండెంటు లేదా
    • పోలీసు ఉన్నతాధికారులు

వయో పరిమితి

సంఘటన జరిగిన నాటికి పిల్లల వయసు 6 సంవత్సరాల కంటే ఎక్కువ 18సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

సంఘటన తేదీ

ప్రతి సంవత్సరం జులై 1 మరియు జూన్ 30 నడుమ జరిగిన సంఘటనలను పరిశీలిస్తారు. ఎంపిక సంఘం తన విచక్షణతో తేదీని జలై 1 కంటే ముందు  మూడ నెలల వరకు సడలించవచ్చు.

వినతి పత్ర సమర్పణ తేది

వినతి పత్ర సమర్పణ చివర తేది సెప్టంబరు 30

ఎంపిక విధానము

ఐసిసిడబ్ల్యూ నియమించిన ఇండియా రాష్ట్రపతి కార్యదర్శులు, ఇండియా ఉప రాష్ట్రపతి, మానవ వనరుల శాఖ మంత్రులు, మహిళా మరియు శిశు సంక్షేమాభివృద్ధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, సాంఘీక న్యాయం మరియు సాధికారత, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, రైల్వే, రక్షణ, రక్షణ వ్యవహారాలు, కార్మిక, గ్రామీణాభివృద్ధి, సమాచార మరియు ప్రసారాలు, ఏఐఆర్, దూరదర్శను, పోలీసు, కొన్ని ఎన్ జీ ఓలు, అధికారులు మరియు మండలి సభ్యులతో కూడిన ఉన్నత కమిటి ద్వారా ఎంపిక జరుగుతుంది. ఒకసారి తిరస్కరించిన వినతి పత్రాన్ని తిరిగి స్వీకరించరు.

బహుమతి

పురస్కారము గెలిచిన వారు ఒక పతకము, ఒక యోగ్యతా పత్రము మరియు నగదును పొందుతారు. లోకోపకార సంస్థలు బహుమతులను ఇస్తాయి.

ఇతర ప్రయోజనాలు: అర్హులైన పురస్కార గ్రహీతలు వారు పాఠశాల చదువు పూర్తి అయ్యే వరకు సహాయాన్ని పొందుతారు. ఐసిసిడబ్ల్యూ ఇంజనీరింగు మరియు వైద్యం లాంటి వృత్తి సంబంధంమైన చదువులు చదువుతున్నవారికి మరియు ఇతరులకు వారి డిగ్రీ పూర్తయ్యే వరకు ఇందిరా గాంధీ ఉపకారవేతన పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇండియా ప్రభుత్వము ఇంజనీరింగు,  వైద్య కళాశాలలో మరియు పాలిటెక్నిక్ లలో కొన్ని సీట్లను పురస్కార గ్రహీతలకు కేటాయించింది.

పురస్కార వర్గాలు

  • భరత్ పురస్కారం
  • గీతా చోప్రా పురస్కారం
  • సంజయ్ చోప్రా పురస్కారం
  • బాపు గైధని పురస్కారాలు (మూడు)

సాధారణ పురస్కారాలు

  • ఇరవై ఐదు మంది పిల్లలు - 2015కు గాను ముగ్గురు అమ్మాయిలను 22 మంది అబ్బాయిలను జాతీయ సాహస పురస్కారాలకు ఎంపిక చేసారు.  వాటిలో రెండు పురస్కారాలు మరణించిన వారి పేరు మీద ఇచ్చారు.
  • ఆపేక్షించిన భరత్ పురస్కారాన్ని తన నలుగురు మిత్రులను రక్షించే ప్రయత్నంలో చనిపోయిన మహారాష్ర్టకు చెందిన  15 సంవత్సరాల మాస్టర్ గౌరవ్ కవడుజి సహస్త్రబుద్ధేకు ఇచ్చారు.
  • గౌరవ గీతా చోప్రా పురస్కాన్ని తన తల్లి ప్రాణాను కాపాడటానికి పులితో పోరాడి అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్ళంచిన 16 సంవత్సరాల మాస్టర్ అర్జున్ సింగ్ కు ఇచ్చారు.
  • మిజోరాంకు చెందిన మాస్టర్ రాందింతర (15 సంవత్సరాలు), గుజరాత్ కు చెందిన మాస్టర్ రాకేశ్ భాయ్ పటేల్ (13 సంవత్సరాలు), కెరళాకు చెందిన మాస్టర్ అర్మోల్ ఎస్. ఎమ్ (12 సంవత్సరాలు) లకు బాపు గైధని పురస్కారాలు ఇచ్చారు. మాస్టర్ రాందింతర ఇద్దరు వ్యక్తులను విద్యున్మరణం నుంచి రక్షించాడు. మాస్టర్ రాకేశ్ భాయ్ లోతు బావిలో పడ్డ ఒక బాలున్ని రక్షించాడు. మాస్టర్ అర్మోల్ ఇద్దిరు మహిళలను మునిగి పోకుండా కాపాడాడు.

మూలము: ఇండియా శిశు సంక్షేమ మండలి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate