অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ విద్యార్ధిఉపకారవేతనాలు మరియు ఆవార్డులు

జాతీయ విద్యార్ధిఉపకారవేతనాలు మరియు ఆవార్డులు

జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి(యన్.సి.ఇ.ఆర్.టి)విద్యా సంబంధమైన అభివృద్ధిని రాశిలోనూ,వాసిలోనూ ప్రోత్సహిస్తుంది, మరియు అసమానతలను తొలగించటానికి మరియు అందరు విధ్యార్ధులకు సమాన విద్యావకాశాలను కల్పించేందుకుగాను ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ ప్రతిభా అన్వేషణ పథకం ద్వారా, యన్.సి.ఇ.ఆర్.టి విద్యార్ధులలోని తెలివితేటలను గుర్తించి, ప్రశంసిస్తుంది. కళాత్మక, సృజనాత్మక నైపుణ్యాలకు.చాచా నెహ్రూ విద్యార్ధి ఉపకార వేతనాల ద్వారా కళాత్మకతను శ్లాఘించేందుకు ప్రయత్నిస్తుంది.

జాతీయ విద్యార్ధి ఉపకార వేతనాలు

ఎనిమిదవ తరగతి కి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష

జాతీయప్రతిభా అన్వేషణపథకం యన్.సి.ఇ.ఆర్.టి యొక్క ప్రధాన కార్యక్రమం 1963 లో ప్రారంభమయ్యింది. ఈపథకం యొక్క ఉద్దేశ్యం ప్రతిభావంతులైన విద్యార్ధులను గుర్తించి మరియు వారి ప్రతిభను ప్రోత్సహించటం. ఈపథకం విజ్ఞానశాస్త్రాలు,సాంఘికశాస్త్రాలు,ఇంజనీరింగ్,వైద్యశాస్త్రము,మేనేజ్ మెంట్ మరియు న్యాయశాస్త్రము వంటి రంగాలకు వర్తిస్తుంది.నెలవారీ విద్యార్ధిఉపకారవేతనాల ద్వారా ఆర్ధికసాయం అందించి ప్రతిభావంతులైన విద్యార్ధులను గౌరవించి సహాయం చేస్తుంది.

విద్యార్ధిఉపకారవేతనాలు:నిర్వహించిన పరీక్ష ఆధారంగా ఎనిమిదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి సమూహములోని విద్యార్ధులకు వెయ్యి విద్యార్ధిఉపకారవేతనాలు ఇవ్వబడతాయి.

అర్హత:గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదవతరగతి చదువుతున్న విద్యార్ధులు ఈ పరీక్షరాసేందుకు అర్హులు. ఈ పాఠశాలలున్న రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.ఎలాంటి శాశ్వతనివాస అర్హతా నిబంధనలు ఇందులో ఉండవు.

పరీక్ష:ఎనిమిదవ తరగతి వారి రాతపరీక్ష ఈ రీతిగా ఉంటుంది:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగేమొదటిదశ పరీక్షరెండు భాగాలుగా ఉంటుంది,అవి (ఎ)మానసిక సామర్ధ్య పరీక్ష(యం ఏ టి) మరియు (బి)స్కాలాస్టిక్ సామర్ధ్యపరీక్ష (యస్ ఏ టి) ఇందులో సాంఘికశాస్త్రాలు,విజ్ఞానశాస్త్రాలు మరియు గణితం ఉంటాయి.

జాతీయస్థాయిలో జరిగేరెండవదశ పరీక్షలో(ఎ)మానసిక సామర్ధ్య పరీక్ష(యం ఏ టి)మరియు (బి) స్కాలాస్టిక్ సామర్ధ్య పరీక్ష (యస్ ఏ టి) సాంఘికశాస్త్రాలు,విజ్ఞానశాస్త్రాలు మరియు గణితం ఉంటాయి (సి) ఇంటర్వ్యూ. జాతీయస్థాయిలో రాతపరీక్షలో అర్హులైన వారిని మాత్రమే ఇంటర్వ్యూ కు పిలుస్తారు.

పూర్తి వివరాలకు :www.ncert.nic.in/html/talent.htm

జాతీయ ప్రతిభా అన్వేషణ పథకం (పదవ తరగతి రెగ్యులర్ విద్యార్ధులకు)

జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి తన జాతీయ ప్రతిభా అన్వేషణ పథకం క్రింద ప్రతి సంవత్శరం 150 విద్యార్ధి ఉపకార వేతనాలు షెడ్యూల్డ్ కులాలకు మరియు 75 షెడ్యూల్డ్ తెగలకు సహా వెయ్యి విద్యార్ధిలకు ఉపకార వేతనాలు ఇస్తుంది. ఈ పథకం యొక్క ఉద్దేశ్యం ఏమనగా తెలివైన విద్యార్ధులను పదవతరగతి చివరిలో గుర్తించటం మరియు ఉత్తమ విద్య పొందేందుకుగాను వారికి ఆర్ధికసాయం అందజేయటం,తద్వారా వారి ప్రతిభ మరింత అభివృద్ధి చేసికొని మరియు వారు తమ తోటి వారికి మరియు దేశానికి సేవ చేయవచ్చు.

అర్హత:

కేంద్రీయ విద్యాలయం,నవోదయ విద్యాలయం,సైనిక్ స్కూలు మొదలైన సహా గుర్తింపు పొందిన ఎలాంటి పాఠశాలలోనైనా పదవతరగతి చదువుతున్న విద్యార్ధులు,ఆ పాఠశాల ఉన్నరాష్ట్రం నుంచి రాష్ట్రస్థాయి పరీక్షకు హాజరయేందుకు అర్హులు. ఏది ఏమైనా ఎలాంటి శాశ్వతనివాస అర్హతానిబంధనలు ఇందులో ఉండవు.

ఎలా దరఖాస్తుచెయ్యాలి?

దేశములో పదవతరగతి చదువుతున్న విద్యార్ధులెవరైనా వార్తాపత్రికలలో వచ్చే ప్రకటనలు లేదా పాఠశాలకు వచ్చేసంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు పైన పేర్కొన్న పరీక్షకొరకు విడుదలచేసే సర్క్యులర్ కొరకు వేచి చూడాలి మరియు ఆ ప్రభుత్వప్రకటన / సర్క్యులర్ లో పేర్కొన్నవిధంగా చెయ్యాలి.

పరీక్ష :

యన్ సి ఇ ఆర్ టి నిర్వహించే రెండవ స్థాయి పరీక్ష అర్హత సాధించేందకు, విద్యార్ధులు రాష్ట్రస్థాయి లో జరగే పరీక్ష లో విజయం సాధించ వలస ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది,మానసిక సామర్ధ్య పరీక్ష(యం ఏ టి )మరియు స్కాలాస్టిక్ సామర్ధ్య పరీక్ష(యస్ ఏ టి).

పూర్తివివరాలకు :www.ncert.nic.in/html/talent.htm

కళాత్మక, సృజనాత్మక నైపుణ్యాలకు చాచా నెహ్రు విద్యార్ధి ఉపకార వేతనాలు

జాతీయ బాల భవన్:బాల శ్రీకార్యక్రమం
జాతీయబాల భవన్ దేశవ్యాప్తంగా కళలను ప్రోత్శహించటంలో కీలక పాత్ర పోషించింది .ప్రస్తుతం దేశములో 73 రాష్ట్ర మరియు జిల్లా బాల భవనాలు ఉన్నాయి.బాల శ్రీ పథకంద్వారా వివిధ వయసులకు చెందిన ప్రతిభావంతులైన బాలలను గౌరవించే విధానాన్నిజాతీయబాల భవన్ 1995 లో ప్రవేశపెట్టింది.సెకండరీ మరియు సీనియర్ సెకండరీ విద్యను తొమ్మిది నుంచి పన్నెండువ తరగతులలో చదివే విద్యార్ధులందరికీ కళాత్మక,సృజనాత్మక నైపుణ్యాలకు చాచా నెహ్రు విద్యార్ధిఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి.

బాల శ్రీ కార్యక్రమం ద్వారా ఈ క్రింది రంగాలలో ప్రతిభను గుర్తిస్తుంది:

  1. సృజనాత్మక ప్రదర్శన
  2. సృజనాత్మక కళలు
  3. సృజనాత్మక శాస్త్రీయ ఆవిష్కరణలు
  4. సృజనాత్మక రచనలు

జాతీయ బాల భవన్ మూడు స్థాయిలలో జరిగే కార్యక్రమాలద్వారా సృజనాత్మక బాలలను ఎంపికచేస్తుంది.

  1. స్థానిక స్థాయిలో రెండురోజుల శిబిరాలను నిర్వహించి ఎనిమిది మంది బాలలను (ప్రతి విభాగములో ఇద్దరిని) స్థానిక స్థాయిలో గుర్తించటం.
  2. జోనల్ స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించే శిబిరాలలో స్థానిక నిపుణులు, ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య, మరియు దక్షిణ-మరియు దక్షిణ-జోనల్స్ నుంచి ప్రత్యేకనిపుణులు బాలల ఎంపికలో పాల్గొంటారు.
  3. జాతీయ స్థాయిలో ఆరు జోన్ల నుంచి నాలుగు రోజుల పాటు శిబిరాలు నిర్వహిస్తారు. నాలుగు విభాగాలకు ప్రాతినిధ్యం వహించే నిపుణులతో కూడిన బృందాన్ని బాలల సృజనాత్మకతను గమనించి అంచనా వేసేందుకు గాను గుర్తిస్తారు.

ఒలింపియాడ్స్

ఒలింపియాడ్లు విద్యలోని ప్రాశస్త్యాన్ని సూచిస్తాయి మరియు నిస్సందేహంగా జ్ఞానానికి పునాది.విద్యార్ధులలోని అలాంటి ప్రతిభను వెలికితీసేందుకు భారతదేశము ఈక్రింది ఒలింపియాడ్లను నిర్వహిస్తుంది.

నేషనల్ సైబర్ ఒలింపియాడ్

జాతీయ సైబర్ ఒలింపియాడ్,దేశంలోనే ఈ తరహాలో ఇదే మొదటిది,ఇది దేశవ్యాప్తంగా ప్రతిభను అన్వేషించే పోటీ.ఇది యువతరంలో సైబర్ సామర్ధ్యం గల వారిని గుర్తించి వెలికితీస్తుంది. ఇది(ఒక విధమైన) పోటీ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కంప్యూటర్ల గురించి చైతన్యాన్ని కలగచేయడం,అలాగే యువతరాన్ని కంప్యూటర్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై అవగాహన,సమాచారాన్ని (విజ్ఞానాన్ని) పెంపొందించుకునేలా ఉత్తేజపరచడం,మరియు భవిష్యత్తులో వారు కంప్యూటర్ రంగంలో పనిచేసేందుకు అవసరమైన ప్రతిభని పరీక్షించడం.

అర్హత

సిబియస్ ఇ / ఐసియస్ ఇ మరియు రాష్ట్రబోర్డులకు అనుబంధమైన ఇంగ్లీషుమీడియం పాఠశాలలలో మూడునుంచి పన్నెండు వరకు చదువుతున్న విద్యార్ధులు యన్ సి ఓ లోపాల్గొనవచ్చు. ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్సులో ఉపాధి పొందాలనుకునే తొమ్మిది నుంచి పన్నెండవతరగతి చదువుతున్న విద్యార్ధులందరూ పాల్గొనవచ్చు ఎందుకనగా కంప్యూటర్లపట్ల విద్యార్ధుల అభిరుచిని తెలుసుకునేందుకు ఈ పరీక్షఉద్దేశ్యించినది కాబట్టి.

పూర్తివివరాలకు:http://www.sofworld.org/html2003/intronco.shtml

నేషనల్ సైన్స్ ఒలింపియాడ్

నేషనల్ సైన్స్ ఒలింపియాడ్మూడవతరగతి చదువుతున్న విద్యార్ధుల మొదలు అందరినీ జాతీయ స్థాయిలో పాల్గొని, అధిగమించమని అహ్వానిస్తుంది. ఈపరీక్ష మొదటి దశ వారి వారి పాఠశాలలలో పనివేళలలో పాల్గొనే వారికొరకు నిర్వహిస్తారు.కనీసం యాభైమంది పాల్గినేపాఠశాలలకు మాత్రమే ఒలింపియాడ్లో నమోదు చేసుకునేందుకు అనుమతిస్తారు.

విద్యార్ధుల నమోదు: ఈ కార్యక్రమములో మూడు నుంచి పన్నెండు తరగతి చదువుతున్న వారందరూపాలొనవచ్చు మరియు నమోదు కొరకు నిర్ధిష్ట నమూనాలో ఉన్న దరఖాస్తును సంభంధిత పాఠశాలల ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది. భారతదేశము మొత్తానికి పంపబడిన సమాచారమున్న చిన్నపుస్తకంతో పాటు విద్యార్ధులు మరియు పాఠశాలలకునమోదు దరఖాస్తులు జతచేయబడి ఉన్నాయి.

పూర్తి వివరాలకు:http://www.sofworld.org/html2003/htp.shtml

నేషనల్ మాధమాటికల్ ఒలింపియాడ్

జాతీయ స్థాయిలో మాధమాటికల్ ఒలింపియాడ్ కార్యక్రమం అన్నది 1986నుంచి నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మాథమాటిక్స్(యన్ బి హెచ్ యమ్) వారి ప్రధాన కార్యక్రమం. ఉన్నత పాఠశాల విద్యార్ధులలో గణితశాస్త్ర ప్రతిభను గుర్తించటం అన్నది ఈకార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపియాడ్ కు భారతీయ బృందాన్ని ఎంపికచెయ్యటం మరియు శిక్షణ అన్నబాధ్యతలను కూడా యన్ బి హెచ్ యమ్ స్వీకరించింది. ఒలింపియాడ్ నిర్వహణా సౌలభ్యం కొరకు దేశాన్ని పదహారు రీజియన్లుగా విభజించారు.అంతర్జాతీయ మాధమాటికల్ ఒలింపియాడ్ లో భారతభాగస్వామ్యం కొరకు దారితీసే కార్యక్రమం ఈ దశలను కలిగిఉంది:

మొదటిదశ: రీజినల్ మాధమేటిక్స్ ఒలింపియాడ్(ఆర్ యమ్ ఓ):ఆర్ యమ్ ఓ సాధారణంగా సెప్టెంబరు నుండి డిసెంబరు నెల మొదటి ఆదివారం మధ్యలో ప్రతి ఏటా దేశములోని వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. పదకొండవ తరగతి చదువుతున్న అందరు పాఠశాల విద్యార్ధులు ఆర్ యమ్ ఓ కు హాజరయ్యేందుకు అర్హులు.ఈ ఒలింపియాడ్ ఆరు నుంచి ఏడు సమస్యలిచ్చే మూడుగంటలుండే రాతపరీక్షలు.

రెండవదశ: ఇండియన్ నేషనల్ మాధమాటిక్స్ ఒలింపియాడ్(ఐ యన్ యం ఓ):ఐ యన్ యం ఓ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం విభిన్నప్రాంతాలలో వేరువేరు కేంద్రాలలో నిర్వహిస్తారు.విభిన్నప్రాంతాల నుంచి ఆర్ యమ్ ఓకు ఎంపికయిన విద్యార్ధులు మాత్రమే ఐ యన్ యం ఓ కు హాజరయ్యేందుకు అర్హులు. ఐ యన్ యం ఓ నాలుగు గంటల రాత పరీక్ష: ప్రశ్నాపత్రాన్ని ఒక్కచోటే రూపొందిస్తారు మరియు ఇది దేశమంతా ఒక్కటే ఉంటుంది.ఐ యన్ యం ఓ లో ప్రతిభను ప్రదర్శించిన 30-35 మందికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ బహుకరిస్తారు.

మూడవదశ:అంతర్జాతీయ మాధమాటిక్స్ ఒలింపియాడ్ శిక్షణాశిబిరం(ఇంటర్నేషనల్ మాథమాటిక్స్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్-ఐ యమ్ ఓ టి సి):యు యన్ యంఓ సర్టిఫికెట్ గ్రహీతలను ప్రతి ఏటా మే/జూన్ నెలలో నెలరోజులపాటు జరిగే శిక్షణాశిబిరానికి ఆహ్వానిస్తారు.అదనంగా గడచిన సంవత్సరం పోస్టల్ కోచింగ్ ను సంతృప్తికరంగా ముగించిన,గత సంవత్సరపు ఐ యన్ యం ఓ గ్రహీతలను కూడా మరొక మారు రెండవసారి శిక్షణ కొరకు ఆహ్వానిస్తారు.శిబిరం ద్వారా నిర్వహించిన ఎంపిక పరీక్షలను బట్టి,ఇంటర్నేషనల్ మాథమాటిక్స్ ఒలింపియాడ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకుగాను జూనియర్,సీనియర్ బృందాల నుంచి సంయుక్తంగా ఆరుగురు ఉత్తమ విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

నాలగవ దశ:ఇంటర్నేషనల్ మాథమాటిక్స్ ఒలింపియాడ్ (ఐ యమ్ ఓ):ఎంపికయిన ఆరుగురు సభ్యుల బృందం ఒక నాయకుడు మరియు ఒక ఉపనాయకుడు తోపాటు ప్రతిఏటా ఒక దేశములో జులై మాసములో జరిగే ఐ యమ్ ఓలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.ఐ యమ్ ఓ లో నాలుగున్నర గంటల కాలవ్యవధిలో జరిగే రెండు పరీక్షలుంటాయి,రెండు రోజులపాటు జరిగే ఈ పరీక్షలలలో కనీసం ఒక రోజు ఖాళీ ఉంటుంది. ఐ యమ్ ఓ వేదికకు వెళ్ళివచ్చే ప్రయాణానికి రెండువారాల సమయం పడుతుంది.ఐ యమ్ ఓ లోస్వర్ణ,రజత,కాంస్య పతక గ్రహీతలైన భారత విద్యార్ధులకు యన్ బి హెచ్ యం వారు మరుసటి సంవత్శరం జరిగే శిక్షణాశిబిరం చివరలో జరిగే ఒక లాంఛన ప్రాయమైన ఉత్సవంలో రూ.5000/-,రూ.4000/-మరియు రూ.3000/-నగదు బహుమతిని అందజేస్తారు.మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వారు ఎనిమిదిమంది సభ్యుల అంతర్జాతీయ ప్రయాణపు ఖర్చులను భరిస్తారు,అలాగే యన్ బీ హెచ్ యం(డి ఏఇ) వారు దేశములో జరిగే కార్యక్రమ మరియు అంతర్జాతీయ ప్రాతినిధ్యానికి కావల్సిన ఖర్చులను భరిస్తారు.

మాథమాటిక్స్ ఒలింపియాడ్ కొరకు పాఠ్యప్రణాళిక:మాథమాటిక్స్ ఒలింపియాడ్ (ప్రాంతీయ,జాతీయ మరియు అంతర్జాతీయ) కొరకు పాఠ్య ప్రణాళిక కాలేజీ స్థాయికి ముందరి గణితం. అర్ యం ఓ నుండి ఐ యన్ యం ఓ నుండి ఐ యమ్ ఓ కు క్లిష్టత పెరుగుతూ ఉంటుంది.

ఈ క్రింది రెండు పుస్తకాల నుంచి మాథమాటిక్స్ ఒలింపియాడ్ కు కావలిసిన ముఖ్య సమాచారము పొందవచ్చు

మాథమాటిక్స్ ఒలింపియాడ్ ప్రైమర్,రచన:వి.కృష్ణమూర్తి.సి.ఆర్.ప్రానేసచార్,కె.యన్.రంగనాధన్ మరియు బి.జె.వెంకటాచల(ఇంటర్ లైన్ పబ్లిషింగ్ ప్రవేట్ లిమిటెడ్,బెంగలూరు)

ఛాలెంజ్ అండ్ థ్రిల్ ఆప్ ప్రి-కాలేజ్ మాథమాటిక్స్,రచన:వి.కృష్ణమూర్తి.సి.ఆర్.ప్రానేసచార్,కె.యన్.రంగనాధన్ మరియు బి.జె.వెంకటాచల(న్యూ ఏజ్ ఇంటర్నేషనల్ పబ్లిషర్స్,న్యూ డిల్లీ)

పూర్తి వివరాలకు :http://math.iisc.ernet.in/matholym-nat.htm

జాతీయ ప్రతిభ పురస్కారాల పథకం

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్

1961-62 నుండి జాతీయ ప్రతిభ పురస్కారాల పథకం అమలులో ఉంది ఈ పథకం యొక్క ఉద్దేశ్యం మెట్రిక్ ఉత్తీర్ణత సాధించిన తరువాత ప్రతిభ గల బీద విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని, తమ బీదరికం కారణంగా వదిలివేయకుండా కొనసాగించేందుకు వీలుగా ఉపకార వేతనం అందజేయడం 1971-72 నుండి ప్రతిభ గల ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు గల గ్రామీణ విద్యార్థులకు ఉపకార వేతన పథకం సమానత్వం గల విద్యావకాశాలను కలిగించేందుకు వీలుగా ప్రారంభించారు. 9వ ప్రణాళిక వరకు ఈ పధకాలు కేంద్రం అమలు చేసింది. ప్రభుత్వ విభాగం, ఈ రెండు పధకాలను విలీనం చేసి నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ గా అమలు చేయడం ప్రారంభించింది. ఈ సవరించిన పథకం,యిది పొందే వారికి కావలసిన అర్హతలు, ఉపకార వేతనాల విలువలో మార్పులు మొదలైన వాటిని నిర్దేశిస్తుంది.

ఆశయం

ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాలలోని 9 మరియు పది తరగతుల విద్యార్థులు, మరియు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఉద్దేశించబడింది.

అవకాశం

ప్రతీ అభివృద్ధి చెందే ప్రాంతంలోని గ్రామీణ పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో తొమ్మది, పది తరగతలకు ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో గల పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని రాష్ట్ర వ్యాప్త ప్రతిభ ఆధారంగా మెట్రిక్ తరువాత విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య దాకా ఉపకార వేతనాలు లభిస్తాయి. ఈ పురస్కారం, ప్రభుత్వం, తన రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలోని వారైన అభ్యర్ధి లేక అతడు/ ఆమె తమకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణతా ఫలితం మీద ఆధారపడి ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలను, రాష్ట్ర ప్రభుత్వం లేక కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం గుర్తిస్తుంది.

అవకాశం మరియు అర్హత ( కవరేజి ఎండ్ ఎలిజిబిలిటీ)

ఉపకార వేతనాలు, గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలల్లో చదివే తొమ్మది, పది తరగతుల విద్యార్థులకు మాత్రమే యివ్వబడతాయి. సైన్సు, కామర్సు చదివే విద్యార్థులు, సగటు మార్కులు అరవైశాతం, అంతకు మించి హ్యూమానిటిస్ (సాంఘీక శాస్త్రాలు) విద్య నభ్యసించే విద్యార్థులు ఏబై ఐదు శాతం, అంతకు మించి సగటు మార్కులు దిగువ పేర్కొన్న పరీక్షలో సాధించినట్లైతేనే, మిగిలిన నిబంధనలు కూడ అనుసరించి జాతీయ ప్రతిభ పురస్కారాలు యివ్వబడతాయి.

పదోతరగతి/ మెట్రిక్యులేషన్/ ఉన్నత పాఠశాల- ఉపకార వేతనం మంజూరుకు +2 స్ధాయి / ప్రీ యూనివర్సిటీ/ ప్రీ డిగ్రీ (పట్టభద్రులు కాక ముందు అభ్యసించే విద్య)

పన్నెండవ తరగతి – 10 +2 పద్ధతిలో సీనియర్ సెకండరీలో బోర్డు ఎగ్జామినేషన్ (ఉన్నత మాధ్యమిక బోర్డు పరీక్ష) ఇంటర్ మీడియట్ / ప్రీ యూనివర్సిటీ/ ప్రీ డిగ్రీ- మొదటి సం..బిఎ/ బిఎస్ సి/ బికామ్/ బి ఆర్కియాలజీ మొదలైన విద్యల (కోర్సుల) తరువాత వరకు ఉపకార వేతనం మంజూరు.

ఒక విద్యార్ధి, ఒక విద్యకు లేక కోర్సుకు సంబంధించి ఉపకార వేతనం లేక స్టైపెండ్ అందుకున్న తరువాత వేరే ఏ యితర ఉపకార వేతనం, స్టైపెండ్ పొందరాదు.

పూర్తి స్ధాయి ఉద్యోగం చేస్తున్న ఒక విద్యార్ధి ఉపకార వేతనం మంజూరుకు అర్హుడుకాదు.

ఈ పథకం క్రింద ఉపకార వేతనం పొందే ఒక విద్యార్ధి అతడు చదివే సంస్ధలో యిచ్చే ఫీజు రాయితీని కూడ పొందవచ్చు. అభ్యర్ధులు తాము అర్హత సాధించవలసిన పరీక్షలో ఉపకార వేతనం మంజూరు చేసే సంవత్సరం కన్నా ముందు సంవత్సరంలో ఉత్తీర్ణులైనట్లైతే ఉపకార వేతనం పొందడానికి అర్హులుకారు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate