1.గాలిలోకి రేణురూప కలుషితాలు (ఏరోసాల్స్) ఎక్కువగా ఎక్కడ నుండి చేరుతాయో తెలుసుకుందాం.
2. వాటి వల్ల కలిగే పర్యావరణ కాలుష్య ప్రభావాలను అర్థం చేసుకుందాం.
గాలిలోని ఘన, ద్రవ రూప రేణువులను రేణురూప కలుషితాలు అంటారు. ఇవి ఉండవలసిన స్థాయికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, గాలి కాలుష్యం అవుతుంది. ಮಿಮ್ಮಿ, పరాగరేణువులు, పొగ, బూడిద, వాహనాల నుండి వెలువడే పొగ, బొగ్గు, సిమెంట్ రేణువులు మొదలైనవి గాలిలో ఉండే రేణురూప కలుషితాలు. ఇవి ఎక్కువైతే, సూర్యకిరణాలు భూమికి చేరకుండా అడ్డుపడతాయి. అంతేకాకుండా, భూ ఉపరితల ఉష్ణం వాతావరణాన్ని చేరకుండా నిరోధిస్తాయి. ఈ రెండింటి వలన భూగోళం వేడెక్కుతుంది. రేణురూప కలుషితాలు కాంతిని శోషించడమే కాక, వసువులను సరిగా కనబడకుండా చేస్తాయి. వీటివలన శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
దోమల నివారణకు వాడే హిట్ వంటి స్ప్రేలు, ఫంక్షన్లలో చల్లే ఫోం స్ప్రేలు, డియోడరెంట్లు, ఫెర్ఫ్యూం స్ప్రేలు, ముగ్గుల్లో వాడే రసాయన రంగులు గాలిలోకి రేణురూప కలుషితాలు(ఏరోసాల్స్) గా చేరుతాయి. ఇలాంటి పదార్ధాల తయారీలో వాడే పరిశ్రమలలో రక్షణ చర్యలు తక్కువగా ఉండడం వల్ల వాటినుండి వెలువడే వ్యర్దాలు, దుమ్ము ధూళికణాలు వాతావరణాన్నికలుషితం చేస్తున్నాయి. ఇలాంటి వాటివల్ల ఆస్తమావంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
మీ పరిశీలనల ఆధారంగా నిర్ణయాలు చేయండి. అన్ని స్లైడులపై ఒకే మొత్తంలో కలుషితాలు పోగయ్యాయా? ఈ కలుషితాలు ఎక్కడినుండి విడుదల అవుతున్నాయి? మీ టీచరుతోగాని, పొరుగువారితోగాని చర్చించండి. మీరు కనుగొన్న విషయాలతో ఒక నివేదిక తయారుచేయండి.
ఆధారము: apscert
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/4/2024