ప్రపంచంలో పౌష్టికాహారలోపం గల ప్రతీ ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశంలో ఉన్నారు
- ప్రపంచంలోని పౌష్టకాహారలోపం గల పిల్లలలో సగం మంది భారతదెశం, బంగ్లాదేశ్, పాకిస్ధాన్‌లలోనే ఉన్నారు
- సబ్ సహారా - ఆఫ్రికాల సరాసరితో పోల్చినప్పుడు ఆహారలోపం గల పిల్లలశాతం భారత, పాకిస్ధాన్‌లలోనే ఎక్కువగా ఉంది.
- 5సం||లలోపు పిల్లలలో 47 శాతం మంది బరువు తక్కువ
- 5సం||లలోపు పిల్లలలో 45 శాతం ఎదుగుదలలేని పిల్లలు
- 6సం||లలోపు పిల్లలలో 66 శాతం మందికి పైగా పౌష్టికాహారలోపంతో ఉన్నారు. (జిల్లాస్ధాయి శీఘ్ర(రేపిడ్) ఇంటింటి సర్వే వివరాలు డి.ఎల్.హెచ్.ఎస్. 2002 - 05)
- పూర్వప్రాథమికవిద్య పిల్లలలో, కౌమారబాలికలలో, గర్భిణీస్త్రీలలో 90 శాతం మందికి పైగా రక్తహీనత కన్పిస్తొంది. (డి.ఎల్.హెచ్.ఎస్. 2002 - 05)
- 2002 - 03 సం|| మధ్యకాలంలో పిల్లలపైన జరిగేనేరాలు 11.1 శాతం పెరిగాయి
- 6-14 సం||ల మధ్య గల పిల్లలలో 1.26 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు (2001 జనాభా లెక్కల ప్రకారం)
- 1.34 కోట్లు లేదా 6.94 శాతం మంది *6-14 సం||ల వయస్సు గల వారిలో బడిబయట పిల్లలు ఉన్నారు.
- మధ్యలోబడిమానేసిన పిల్లలు 62-68 శాతం మంది ఉన్నారు ( 1 నుండి 10 తరగతులవరకు) ( మానవవనరుల విభాగవార్షిక నివేదిక 2005-06)
- 15సం||లలోపు గల బాలికలు దాదాపు 300000 కనీసం ఒకబిడ్డను కన్నారు (2001 జనాభాలెక్కల ప్రకారం)
భారతదేశంలో అప్పుడే పుట్టిన ప్రతీ మూడవ శిశువు హనికరమైన ఆరోగ్య సమస్యలతో అభివృద్ధి చెందని మెదడుతో ఉంటున్నారు.
- 0-6 సంల మధ్యగల వారిలొ స్త్రీ పురుష శాతం ( సెక్స్ రేషియో ) 927:1000
- అయోడిన్ లొపంతో మెదడు దెబ్బతిన్న పిల్లలు 66 లక్షల మంది ఉన్నారు.
- ఎన్.ఎఫ్.హెచ్.ఎ్‌స ప్రకారం చాలా రాష్ట్రాలలో ఇనుము లోపంతో బాధపడ్తున్న పిల్లలు 70 శాతం కంటె ఎక్కువ మంది ఉన్నారు.
- ప్రపంచవ్యాప్తంగా విటమిన్ ఎ లోపంతో బాధపడ్తున్న 4 కోట్లమంది పిల్లలలో 15 లక్షల మంది భారతదేశంలోనే గలరు.
- 4 కోట్ల 70 లక్షల మంది పిల్లలు కచ్చాఇళ్ళలోనే నివసిస్తున్నారు.
- 7 కొట్ల 70 లక్షల మంది పిల్లలు కొళాయి (నల్లా) మంచినీటిని ఉపయోగించడంలేదు.
- 8కోట్ల 50 లక్షల మంది పిల్లలు వ్యాధినిరోధకశక్తి లేనివారు. 2 కోట్ల 70 లక్షల మంది అతితక్కువ బరువుతో ఉన్నారు.
- కోట్ల 30 లక్షల మంది అసలే బడికి వెళ్ళనిపిల్లలు.
- 18 సం||లోపు జనాభా 42 కోట్ల, 7లక్షలు.
ఆధారము: యునిసెఫ్ 2005 నివేదిక మరియు ఇతర యునిసెఫ్ సమాచారంలో ప్రపంచ బాలల స్దితిని “బాల్యం ఆపదలోఉంది” అనే శీర్షిక.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.