పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం వల్ల యువతీయువకులు ఆర్థికంగా సాధికారులుగా తయారవడమే కాకుండా ఫైనాన్షియల్ విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకుంటారు. సమయపాలన తెలుస్తుంది. డబ్బు విలువ, పని విలువతోపాటు సంపాదనను సేవింగ్ చేయడం తెలుసుకుంటారు. అలాగే పార్ట్‌టైమ్ జాబ్స్‌ను ఫన్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు సామాజికంగా పలువురితో పరిచ యాలు ఏర్పడతాయి. నలుగురితో కలిసిపోవడం నేర్చుకుంటారు. ప్రతి విషయంలో పట్టువిడుపు ధోరణులతో వ్యవహరించడం అలవడుతుంది. పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడం ద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోగలరు. పార్ట్‌టైమ్ ఉద్యోగాల ద్వారా అంతో ఇంతో డబ్బు సంపాదించడమే కాకుండా వర్క్ అనుభవాన్ని సాధించచ్చు . వేసవిలో చేసే రకరకాల పార్ట్‌టైమ్ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం
బేబీ సిట్టింగ్‌ని పార్ట్‌టైమ్ జాబ్‌గా ఎంచుకోవచ్చు. పిల్లలతో గడపడం ఇష్టం ఉన్నవారు ఈ పని చేయొచ్చు. డబ్బు సంపాదించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ రంగాన్నే కెరీర్‌గా చేపట్టవచ్చు. బిజినె్‌సగా మలచుకుని మరింత ఎదగవచ్చు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం వల్ల పిల్లల్ని క్రచ్‌లలో పెట్టేవారు ఎక్కువయ్యారు. భవిష్యత్తులో బేబీ సిట్టింగ్‌ల అవసరం ఇంకా బాగా ఎక్కువవుతుంది. పైగా ఇది ఇంటిపట్టున ఉండి సంపాదించుకోగలిగే ఆదాయవనరు. యువతకు ముఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి కెరీర్ అవకాశం. ఈ బిజినె్‌సలో ముందుకుపోవడానికి వీరికి పార్ట్‌టైమ్ జాబ్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాఫీ షాప్స్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేయొచ్చు. కాఫీషాప్స్‌లో వాతావరణం బాగా ఉంటుంది. పనిని ఎంతో ప్రశాంతంగా చేసుకోవచ్చు. అక్కడకు వచ్చే కస్టమర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కాబట్టి వారి నుంచి టిప్స్ కూడా బాగా వస్తాయి. భవిష్యత్తులో కాఫీషాప్ ఏర్పాటుచేయడానికి ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది.
రిటైల్ క్లర్క్‌గా కూడా పార్ట్‌టైమ్ జాబ్ చేయొచ్చు. ఈ ఉద్యోగం చేయడం వల్ల అదనపు అవసరాలకు కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు.
ఫ్యాషన్, మేకప్, ఎలకా్ట్రనిక్స్ వంటి హాబీలున్న వారు భవిష్యత్తులో ఆయా రంగాల్లో బిజినెస్ చేయొచ్చు.
జంతువులంటే ఇష్టం ఉండేవారు పెట్ గ్రూమింగ్ పనిని పార్ట్‌టైమ్‌గా ఎంచుకోవచ్చు. ఇందులో పెట్స్‌కు స్నానం చేయించి శుభ్రం చేయడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం లాంటి పనులు ఉంటాయి.
రెస్టారెంట్లలో కూడా పనిచేయొచ్చు. నలుగురితో మాట్లాడడం ఇష్టమైన వాళ్లకు ఈ జాబ్ బాగా నచ్చుతుంది. రెస్టారెంట్లలో క్యాషియర్, హోస్టెస్, సర్వర్, ఫుడ్‌రన్నర్, డిష్‌వాషర్‌గా, కుక్‌లకు సహాయకులుగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలను చేయొచ్చు. పైగా ఫుడ్ ఇండసీ్ట్రలో కస్టమర్లను మరింత ఆకర్షించుకునేందుకు ఎన్నో వినూత్న ధోరణులను అనుసరిస్తున్నారు. రెస్టారెంట్లకు ప్రత్యేక డైనర్స్ ఉంటున్నారు. మంచి సోషల్ వర్కింగ్ వాతావరణం సైతం ఉంటుంది. ఫుడ్ ఇండసీ్ట్రలో పనిచేయడం వల్ల నలుగురితో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. మర్యాదలు తెలుస్తాయి. ఆత్మగౌరవంతో వ్యవహరించడం నేర్చుకుంటారు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సోషలైజింగ్ అవుతారు. దీన్ని పార్ట్‌టైమ్‌గా ఎంచుకున్నవాళ్లు తమకున్న అనుభవంతో ఫుడ్ ఇండసీ్ట్ర బిజినె్‌సను భవిష్యత్తులో చేపట్టవచ్చు.
ట్యూటరింగ్ ని పార్ట్‌టైమ్ జాబ్ గ : పిల్లలతో గడపడం ఇష్టమైన వారు ఈ జాబ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు ఇళ్లకు వెళ్లి ట్యూషన్లు చెప్తుంటారు. దీని ద్వారా డబ్బు బాగా సంపాదించవచ్చు. ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సైన్సెస్, ఫారెన్ లాంగ్వేజెస్ చెప్పేవారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబ్ వల్ల బోధనా పటిమ పెరుగుతుంది. అంతేకాదు వారి వారి రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరు.
స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా : ఇది ఎంతో ఫన్‌గా ఉండడంతోపాటు మిమ్మల్ని ఎప్పుడూ యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మీలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచు తుంది.
పార్క్ ఉద్యోగిగా: స్టేట్, నేషనల్ పార్కుల్లో పనిచేయొచ్చు. ఈ ఉద్యోగాల్లో కొన్ని సీజనల్‌గా, కొన్ని అన్‌పెయిడ్‌గా ఉంటాయి. పార్కుల్లో పనిచేయడం వల్ల పర్యావరణం గురించి తెలుసుకోవచ్చు. అందమైన పరిసరాల మధ్య ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు.
రిటైల్ సేల్స్‌పర్సన్‌గా కూడా పార్ట్‌టైమ్ జాబ్ చేయొచ్చు. కస్టమర్లకు మంచి సేవలను అందించాలి. షాపుకు వచ్చిన వారిచేత ఉత్పత్తులను కొనిపించే మాట చాతుర్యం వీరికి కావాలి. మొండి కస్టమర్లను కూడా దారికి తీసుకురాగలగాలి.
మరొక పార్ట్‌టైమ్ జాబ్ సోషల్ మీడియా అసిస్టెంట్. వీళ్లు సోషల్ మీడియా ఛానల్స్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తారు. అంతేకాదు కంటెంట్ మార్కెటింగ్ విషయంలో సైతం కంపెనీలకు పని చేస్తారు. ఆన్‌లైన్ రీసెర్చర్‌గా కూడా పార్ట్‌టైమర్‌గా పనిచేయొచ్చు. మంచి అధ్యయన సామర్థ్యంతోపాటు నాణ్యమైన కంటెంట్‌ను సేకరించగలిగి ఉండాలి. బిజినెస్ గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. కంటెంట్ ఎడిటర్‌గా కూడా పార్ట్‌టైమ్ జాబ్ చేయొచ్చు. దీంట్లో పనిచేసేవారికి ఎక్కువ జీతమే ఉంటుంది.
రైటర్స్‌గా పార్ట్‌టైమ్ చేయొచ్చు వీరికి బాగా రాసే నైపుణ్యం ఉండాలి. ఎడిటింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. ఈ ఉద్యోగం చేస్తున్న పార్ట్‌టైమర్స్‌కు జీతం ఎక్కువగానే ఉంటుంది. వీళ్లు ఫ్రీలాన్సర్స్‌గా కూడా పనిచేయొచ్చు.
సర్క్యులేషన్ క్లర్క్స్ : వీళ్లు లైబ్రరీ అధిపతికి సహాయకులుగా పనిచేస్తారు. మంచి జీతం ఉంటుంది. ఇది కూడా మంచి పార్ట్‌టైమ్ ఉద్యోగం. వీరికి కస్టమర్ సర్వీసు గురించి అవగాహన ఉండాలి. బేసిక్ ఆఫీస్ నాలెడ్జ్ అవసరం. లైబ్రరీకి వచ్చే విజిటర్స్‌పై పాజిటివ్ ప్రభావం చూబించగలగాలి.
ఆధారము : ఈనాడు
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020