অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆశించిన అభ్యసన ఫలితాలు

ఆశించిన అభ్యసన ఫలితాలు

1వ తరగతి

గణితం

 • 1 నుండి 20 వరకు సంఖ్యలను వినియోగించగలరు.

(i)1 నుండి 20 వరకు వస్తువులను లెక్కించగలరు.

(ii)20 వరకు సంఖ్యలను పోల్చగలరు. ఉదా: తరగతిలోని బాలికల సంఖ్యను, బాలుర సంఖ్యను లెక్కించి ఎవరు ఎక్కువ మంది ఉన్నారో తెలుపగలరు.

 • 1 నుండి 20 సంఖ్యల వరకు గల కూడిక మరియు తీసివేతను నిజజీవిత సందర్భాలలో వినియోగించగలరు.

(i)9 వరకు సంఖ్యల కూడిక సత్యాలను మూర్తవస్తువులను ఉపయోగించి నిర్మించగలరు. ఉదా: 3+2 యొక్కకూడిక ఫలితాన్ని రాబట్టడానికి 3 గులక రాళ్ళను, 2 గులక రాళ్ళను కలిపి మొత్తమును లెక్కించి 3+2=5 అని సత్యవాక్యాన్ని నిర్మించగలరు.

(ii)1 నుండి 9 సంఖ్యలను ఉపయోగించి తీసివేతలు చేయగలరు. ఉదా: పిల్లలు 6 వస్తువుల నుండి 4 వస్తువులను తీసివేసి మిగిలిన వాటిని లెక్కించి 6-4=2 అని సత్యవాక్యాన్ని నిర్మించగలరు.

(iii)9 సంఖ్యల వరకు నిజజీవిత సందర్భాలతో గల సమస్యలను కూడిక మరియు తీసివేతలను ఉపయోగించి పరిష్కరించగలరు.

 • 99 వరకు సంఖ్యలను గుర్తించగలరు మరియు అంకెలను ఉపయోగించి రాయగలరు.
 • వస్తువుల యొక్క భౌతిక లక్షణాలను (ఆకారాలు / ఆకృతులు) వారి స్వంత మాటలలో వివరించగలరు.

ఉదా: ఒక బంతి దొర్లును. ఒక డబ్బా జారును మొదలగునవి.

 • అంగుళం, జాన, మూర, అడుగు మొదలగు అప్రమాణ కొలతలతో చిన్న వస్తువుల పొడవులను, బరువు, ప్రమాణాలను అంచనా వేయగలరు మరియు కొలువగలరు.
 • ఆకారాలు మరియు సంఖ్యలతో గల క్రమాలను పరిశీలించి పొడిగించగలరు.

ఉదా:

1, 2, 3, 4, ....

2, 4, 6, .......

1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, ......

 • చిత్రాలను / దృశ్యాలను పరిశీలించడం ద్వారా దత్తాంశాన్ని సేకరించి దానిని నమోదు (చిత్రాలు/సంఖ్యలు) చేసి అందులోని అంశాలను వ్యాఖ్యానించగలరు.

ఉదా: ఒక జంతువుల మంద చిత్రాన్ని చూసి అందులో ఏ జంతువులు ఎన్నెన్ని ఉన్నాయి? ఏవి ఎక్కువ ఉన్నాయో చెప్పగలరు.

 • సున్నా '0' భావన పట్ల అవగాహనను పెంపొందించుకుంటారు.

తెలుగు

 • వివిధ సందర్భాలకు అనుగుణంగా తమ సొంత భాషలోగాని లేదా బడి భాషలోగాని మాట్లాడుతారు. ఉదా:కథలు, కవితలు గేయాలు విని అర్థం చేసుకుంటారు,మాట్లాడుతారు,ప్రశ్నిస్తారు.
 • విన్న అంశం గురించి ప్రశ్నలకు జవాబులు చెప్తారు, ప్రశ్నిస్తారు, అభిప్రాయం చెప్తారు.
 • భాషాధ్వనులు/పదాలతోకూడిన క్రీడలను ఆడుతూ ఆనందిస్తారు.

ఉదా:అక్కకు చుక్కకు 'ఒత్తు, ముందు నుయ్యి వెనుక గొయ్యి మొదలగునవి.

 • ముద్రించిన, చేతిరాతల, చిత్రాల, గ్రాఫిక్స్లమధ్యపోలికలను గుర్తిస్తారు.
 • చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని సూక్ష్మమరియు ప్రత్యక్ష అంశాలను అవగాహన చేసుకొంటారు.
 • చిత్రాలు / చిత్రకథల ఆధారంగా కథను, సన్నివేశాలను, సంఘటనలను, పాత్రలను, ఆయా సందర్భాలను అర్థం చేసుకొంటారు. ప్రశ్నిస్తారు.
 • కథలు, కవితలు, గేయాలు మొదలగు వాటిలో అక్షరాలు, పదాలు, వ్యాక్యాలు గుర్తిస్తారు.
 • తమ పరిసరాలలోని ముద్రిత అంశాలను చూసి వాటి అర్థాలను, ఉద్దేశాలను ఊహించి చెప్తారు.

ఉదా: చాక్లెట్ రాపర్ ను చూసి చాకెట్ అని చెప్పడం.

 • ముద్రించిన, చేతిరాతలలోని అక్షరాలను, పదాలను, వాక్యభాగాలను గుర్తిస్తారు.
 • పరిచిత / అపరిచిత లిఖిత సామగ్రిపై ఆసక్తి కనబరుస్తారు. వాటి గురించి మాట్లాడుతారు. వాటి అర్థం తెలుసుకొనుటకు రకరకాల పద్దతులు అనుసరిస్తారు. అనగా బొమ్మల కింద ఉన్న వాక్యాలను బొమ్మ ఆధారంగా ఊహించి చదువుతారు. అక్షరాలకు ధ్వనులకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తారు. తమ పూర్వ అనుభవాల ద్వారా ఊహిస్తారు.
 • తెలుగు వర్ణమాలలోని అక్షరాలను, ధ్వనులను గుర్తిస్తారు.
 • పాఠ్యపుస్తకాలు లేదా గ్రంథాలయ పుస్తకాల నుండి తనకు నచ్చిన పుస్తకాన్ని ఎన్నుకొని చదువడానికి ప్రయత్నిస్తారు.
 • స్వయంగా గాని లేక ఉపాధ్యాయుని సూచనల ద్వారా గాని తమ చేతి రాతను, లేఖనా దోషాలను
 • సరిచేసుకుంటారు.
 • తాము గీసిన బొమ్మలకు పేర్లు పెడతారు (తాము మాట్లాడే భాషలో)

2వ తరగతి

గణితం

 • రెండంకెల సంఖ్యలను వినియోగించగలరు.

(i) 99 వరకు సంఖ్యలను చదువగలరు, రాయగలరు.

(ii)రెండంకెల సంఖ్యలను రాయడంలో మరియు ఆ సంఖ్యలను పోల్చడంలో స్థానవిలువలను ఉపయోగించగలరు.

(iii) రెండు లేదా మూడు అంకెలను ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించి అతి పెద్ద మరియు అతిచిన్నరెండంకెల సంఖ్యలను ఏర్పరచగలరు.

(iv) నిజజీవిత సందర్భాలలోని చిన్న చిన్న సమస్యలను రెండంకెల సంఖ్యల కూడికను ఉపయోగించి పరిష్కరించగలరు.

(v)1-100 వరకు ద్రవ్యాన్ని నాణేలు మరియు కరెన్సీనోట్లతో ప్రాతినిధ్య పరచగలరు. (ఒకే రకం, ఒకే విలువ/ వివిధ విలువలు గల నాణేలు, కరెన్సీ నోట్లు)

 • ద్విమితీయ (2D) ఆకారాలను పరిశీలించి వాటి లక్షణాల ఆధారంగా వర్ణించగలరు. (వివరించగలరు).

(i)నిజజీవిత సందర్భాలలో ద్విమితీయ (2D) ఆకారాలైన వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మరియు త్రిభుజాలను (వాటి పేర్లతో కాకుండా) గుర్తించగలరు.

(ii)నిజజీవితంలో గమనించిన వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మరియు త్రిభుజ ఆకారాలతో ఉన్న వస్తువుల పేర్లను చెప్పగలరు.

 • పొడవు/ దూరం మరియు పాత్రల పరిమాణాలను అప్రమాణ కొలతలనుపయోగించి అంచనావేయగలరు మరియు కొలువగలరు.

(i)కర్ర ముక్కలోహపు కడ్డీ/ పెన్సిల్ మొ|| వాటిని అప్రమాణ కొలతలనుపయోగించి, వివిధ వస్తువుల యొక్క పొడవులను అంచనావేయగలరు. ఇంకా ఆ పొడవులను, దూరాలను కొలిచి సరిచూడగలరు.

(ii)జగ్గు/టీ కప్పు/ గ్లాసు / మగ్గు/ చెంచా మొదలగు అప్రమాణ కొలతలనుపయోగించి వివిధ పాత్రల యొక్క పరిమాణాలను అంచనావేయగలరు మరియు కొలిచి సరిచూడగలరు.

 • బరువైన మరియు తేలికైన వస్తువులను చేతితో ఎత్తడం ద్వారా పోల్చి చెప్పగలరు.
 • నిజజీవిత సన్నివేశాల నుండి చేసే పనులను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళలో చేసే పనులుగా వర్గీకరించగలరు. అదే విధంగా ఒక సంవత్సరంలోని నెలలు, ఒక వారంలోని రోజుల పేర్లు వరుసగా చెప్పగలరు.
 • దత్తాంశాన్ని సేకరించి పట్టికలో నమోదు చేసి వాఖ్యానించగలరు.

(i)ఒక సన్నివేశం/ దృశ్యం/ చిత్రంను పరిశీలించి సేకరించిన సమాచారాన్ని పట్టికలో (చిత్రరూపం/సంఖ్యలతో) నమోదు చేసి చూపగలరు.

ఉదా: పండ్ల దుకాణం యొక్క చిత్రం చూసి అందులోని వివిధ పండ్ల సంఖ్యను (చిత్రం/ సంఖ్యలు) పట్టిక రూపంలో నమోదు చేయగలరు.

(ii)తన తరగతిలోని పిల్లలలో ఎంచుకున్న మూడు క్రీడలు/ ఆటలలో ఎవరు వేటిని ఆడడానికి ఇష్టపడుతున్నారో సమాచారం సేకరించి దానిని పట్టిక రూపంలో నమోదు చేసి చూపగలరు.

(iii) పట్టికను చదువడం ద్వారా అందులో ఏ అంశం ఎక్కువ ఉందో లేదా ఏ అంశం తక్కువగా ఉందో తెలుపగలరు. తగు నిర్ణయాలు / ముగింపు ఇవ్వగలరు.

తెలుగు

 • వివిధ సందర్భాలలో వివిధ ఉద్దేశాల కొరకు తన సొంత భాష/పాఠశాల భాషను ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదా: సమాచారం కొరకు ప్రశ్నించడం, నిజజీవితానికి అన్వయించడం, కారణాలు వివరించడం చేయగలరు.
 • ఇతరుల మాటలను / పరిచిత కథలను / కవితలను / గేయాలను / సంభాషణలు విని అర్థం చేసుకొంటారు. సొంత మాటల్లో చెప్తారు.
 • చూసిన/విన్న/కథలు/కవితలు మొదలగు వాటి గురించి మాట్లాడుతారు, స్పందిస్తారు.
 • కథలు, గేయాలు, సన్నివేశాలు మొదలగు వాటిలోని విషయాలను తన నిజజీవిత/పరిసరాలకు అనుభవాలకు జోడిస్తూ మాట్లాడుతారు.
 • పదాలతో,ధ్వనులతో కూడిన భాషా క్రీడల్లో ఆనందంగా పాల్గొంటారు. గేయాలలోని ప్రాస పదాలను గుర్తిస్తారు.
 • కథలను/గేయాలను ఊహిస్తూ పొడిగిస్తారు.
 • తమ స్థాయిని అనుసరించి కథలు, కవితలు, చిత్రాలు, గేయాలు మొదలగు వాటిని ఆసక్తిగా చదివి వాటిపై స్పందిస్తారు, ప్రశ్నిస్తారు.
 • చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని సూక్ష్మ మరియు ప్రత్యక్ష అంశాలను అవగాహన చేసుకొంటారు, ప్రశంసిస్తారు.
 • పరిచిత / అపరిచిత లిఖిత సామగ్రిపై ఆసక్తి కనబరుస్తారు. వాటి గురించి మాట్లాడుతారు. వాటి అర్థం తెలుసుకొనుటకు రకరకాల పద్దతులు అనుసరిస్తారు. అనగా బొమ్మల కింద ఉన్న వాక్యాలను బొమ్మ ఆధారంగా ఊహించి చదువుతారు. అక్షరాలకు, ధ్వనులకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తారు. తమ పూర్వ అనుభవాల ద్వారా ఊహిస్తారు.
 • ముద్రించిన, చేతిరాతలలోని అక్షరాలను, పదాలను, వాక్యభాగాలను గుర్తిస్తారు.
 • తెలుగు వర్ణమాలలోని అక్షరరూపాలను, ధ్వనులను గుర్తిస్తారు. పాఠ్యపుస్తకాలు లేదా గ్రంథాలయ పుస్తకాల నుండి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎన్నుకొని చదువడానికి ప్రయత్నిస్తారు.
 • స్వయంగా గాని లేక ఉపాధ్యాయుని సూచనల ద్వారా గాని తమ చేతి రాతను, లేఖన దోషాలను సరిచేసుకుంటారు.
 • విన్న మరియు తమ మనసులోని భావాలను తమదైన శైలిలో రకరకాల బొమ్మల ద్వారా, పదాల ద్వారా, వాక్యాల ద్వారాలిఖితరూపంలో వ్యక్తపరుస్తారు.

3వ తరగతి

పరిసరాల విజ్ఞానం

 • తమ చుట్టూ ఉన్న పరిసరాలలోని ఆకులు, కాండము, బెరడు యొక్క సాధారణ లక్షణాలను (ఉదా: ఆకారం, రంగు, Texture, వాసన) గుర్తించగలుగుతారు.
 • తమ చుట్టూ ఉన్న పరిసరాలలో జంతువులు, పక్షుల సాధారణ లక్షణాలను (చలనం, నివాసం, ఆహారపు అలవాట్లు, శబ్దాలను) గుర్తించగలుగుతారు.
 • కుటుంబ సభ్యులతో తనకు ఉన్న సంబంధాన్ని, ఎవరెవరు ఎవరెవరికి ఏమి అవుతారో గుర్తిస్తారు.
 • ఇంటిలో/ పాఠశాలలో/ఇరుగుపోరుగున గల వస్తువులు, సూచికలు (పాత్రలు, స్టాలు, రవాణా, ప్రసారసాధనాలు, సూచిక బోర్డులు మొ||) స్థలాలు (ఇండ్ల రకాలు / నివాసాలు బస్ స్టాండ్, పెట్రోల్ పంపు మొ||) పనులు/ కృత్యాలు / ప్రజలు చేసే పనులు, వంటచేసే విధానం) గురిస్తారు.
 • వివిధ వయస్సుల వారికి ఆహారం యొక్క ఆవశ్యకతను, జంతువులకు, పక్షులకు ఆహారం, నీటి లభ్యతను వివరిస్తారు. ఇల్లు మరియు చుట్టు పక్కల వాటి వినియోగం గురించి వివరించగలుగుతారు.
 • కుటుంబంలో, కుటుంబ సభ్యుల పాత్రను, కుటుంబంపై కుటుంబ సభ్యుల ప్రభావాన్ని, కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండే అవసరాన్ని, కుటుంబ సభ్యుల అలవాట్లను, లక్షణాలను మొదలగు వాటిని, మాటల రూపంలో రాతరూపంలో / ఇతర మార్గాలలో వివరిస్తారు.

i)ఒక త్రిమితీయ ఆకారంలో నున్న వస్తువు ఏవైపు నుండి ఎలా కనబడుతుందో తెలుపగలరు (పైనుండి, ప్రక్కనుండి, ముందువైపు నుండి చూసినప్పుడు)

ii)వస్తువులలో, కాగితపు మడతలతో, ముగ్గులలో (రంగవల్లులు), బొమ్మలలో ఇమిడి వున్నజ్యామితీయ ఆకారాలను గుర్తించగలరు. (వాటి పేర్లతో కాకుండా)

iii)ఇచ్చిన ఆకారంతో నిర్దేశించబడిన ప్రదేశం పూర్తిగా నింపడానికి ఆ ఆకారాలు ఎన్ని అసవరమో అంచనా వేయగలరు మరియు సరిచూడగలరు.

 • వస్తువుల పొడవులు, బరువులు మరియు పాత్రల పరిమాణాలను అంచనావేయగలరు మరియు వాటిని వరుసగా మీటర్లు, కిలోగ్రాములు మరియు లీటర్లలో కొలిచి సరిచూడగలరు.

i)వస్తువుల పొడవులను/ దూరాలను మీటర్లలో అంచనావేయగలగుతారు మరియు కొలిచి సరిచూడగలరు.

ii)వస్తువుల బరువులను కిలోగ్రాములలో అంచనావేయగలగుతారు మరియు కొలిచి సరిచూడగలరు.

iii)పాత్రల పరిమాణాలను లీటర్లలో అంచనా వేయగలగుతారు మరియు కొలిచి సరిచూడగలరు.

iv)నిజజీవిత సందర్భాలలో పాత్రల పరిమాణాలను అప్రమాణ కొలతలతో నున్న సమస్యలను చతుర్విధ ప్రక్రియలనుపయోగించి పరిష్కరించగలరు.

 • గడియారంలోని సమయాన్ని గంటలలో చదువగలరు.
 • సరళ ఆకారాలు మరియు సంఖ్యలతో నున్న క్రమాలను కొనసాగించగలరు.
 • దత్తాంశాన్ని పటచిత్రాలు, పట్టికలలో నమోదు చేసి తగిన నిర్ణయాలు / ముగింపును ఇవ్వగలరు.

తెలుగు

 • విన్న విషయాలు, కథలు, గేయాలు, సంఘటనలు, పద్యాలు మొ.నవి విని అర్థం చేసుకొంటారు. సొంత మాటల్లో చెప్తారు, అభిప్రాయం చెప్తారు, స్పందిస్తారు, ప్రశ్నిస్తారు.
 • కథలు, కవితలు, గేయాలు మొదలగు వాటిని రాగ, భావ యుక్తంగా పఠన నియమాలు పాటిస్తూ ధారాళంగా చదువుతారు.
 • పరిసరాలలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుతారు, చర్చిస్తారు, ప్రశ్నిస్తారు.
 • కథలు, గేయాలు, కవితలు మొదలగు వాటిని అర్థం చేసుకొని వాటికి తమ మాటలను/పదాలను జోడిస్తారు, పొడిగిస్తారు.
 • వివిధ రచనలను చదివి వాటి ఆధారంగా ప్రశ్నలను అడుగుతారు, అభిప్రాయం చెప్తారు. తమ తోటి విద్యార్థులతో లేదా ఉపాధ్యాయులతో చర్చిస్తారు. ప్రశ్నలకు జవాబులు చెప్తారు, రాస్తారు (మౌఖిక/లిఖిత).
 • భిన్న రచనలలోని కొత్త పదాలను అర్థం చేసుకొని సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. •
 • భాషాంశాలలోని వివిధ అంశాలను గుర్తిస్తారు. తమ భాషలో ఉపయోగిస్తారు.
 • స్వయంగా గాని, ఉపాధ్యాయుని సూచనల ద్వారాగాని తమ చేతిరాతను, లేఖన దోషాలను సరిచేసుకొంటారు.
 • వివిధ ఉద్దేశాల కొరకు తాము రాయదలచుకొన్న భాషా రూపానికి కావలసిన పదాలను వాక్యరచన విధానాన్ని ఎన్నుకొని రాస్తారు.(ఉదా:సంభాషణలు, బయోడేటా)
 • విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాస్తారు..

గణితం

మూడంకెల సంఖ్యలను వినియోగించగలరు.

(i)999 వరకు సంఖ్యలను చదువగలరు మరియు రాయగలరు.

(ii)స్థానవిలువలను ఉపయోగించి 999 వరకు గల సంఖ్యలను పోల్చగలరు.

(iii)మూడంకెల సంఖ్యలతో కూడిన నిజజీవిత సందర్బాలలోని సమస్యలను మూడంకెల కూడిక మరియు తీసివేత (స్థానమార్పిడి లేని / స్థానమార్పిడి గలవి) లను ఉపయోగించి పరిష్కరించగలరు.

(iv)        ద్రవ్యం, పొడవు, పరిమాణం, కాలం, బరువులకు సంబంధించిన నిజజీవిత సందర్భాలను విశ్లేషించి సమస్యలను పరిష్కరించుటకు తగిన ప్రక్రియను వినియోగించగలరు.

(v)పై నుండి, ప్రక్కనుండి, ముందువైపు నుండి త్రిమితీయ (3D) వస్తువులను పరిశీలించగలరు. ఆ త్రిమితీయ ఆకారాలలోని ద్విమితీయ (2D) ఆకారాలను గుర్తించగలరు. (త్రిభుజం, దీర్ఘచతురస్రం మొ||నవి పేర్లతో కాకుండా)

(i)జ్యామితీయ ఆకారాలలోని వాటి అంచులుగా ఏర్పరచిన రేఖాఖండాల పొడవులను కలిపి లెక్కించడం ద్వారా చుట్టుకొలతను లెక్కించగలరు.

 • కొలతలను వినియోగించగలరు.

(i)వస్తువుల పొడవులు, బరువులు మరియు పాత్రల పరిమాణాలను అంచనావేయగలరు మరియు వాటిని వరుసగా మీటర్లు, కిలోగ్రాములు మరియు లీటర్లలో కొలిచి సరిచూడగలరు.

(ii)వస్తువుల బరువులను గ్రాములు, కిలోగ్రాములలో అంచనావేయగలరు మరియు కొలిచి సరిచూడగలరు.

(iii)పాత్రల పరిమాణాలను లీటర్లు, మిల్లీ లీటర్లలలో అంచనావేయగలరు మరియు కొలిచి సరిచూడగలరు.

 • కాలం (సమయం) గురించి తెలుసుకుంటారు, అవగాహన పొందుతారు.

(i) గడియారంలో సమయాన్ని గంటలు, నిమిషాలలో చదువగలరు.

(ii)ఇచ్చిన సమయాన్ని (గంటలు, నిమిషాలలో) గడియారంలో సరిగ్గా చూపగలరు. (iii)

(iii)క్యాలెండరును చదువగలరు మరియు తేదీలను సరైన పద్దతిలో రాయగలరు.

 • క్రమాలను గుర్తించి, అన్వేషించి, అవగాహన పొంది వాటి నుండి సాధారణీకరణలు చేయగలరు.

(I)వివిధ ఆకారాలు మరియు సంఖ్యలతో నున్న క్రమాలను రూపొందించగలరు మరియు కొనసాగించగలరు.

(II)క్యాలెండర్లోని అమరికలు/ క్రమాల గూర్చి అవగాహన పొందగలరు మరియు ఆ క్యాలెండర్ లోని సంఖ్యల మధ్య సంబంధాన్ని కూడిక, గుణకారాలను ఉపయోగించి సాధారణీకరణలు చేయగలరు.

 • దత్తాంశ పట్టికలను వినియోగించగలరు.

(i)దత్తాంశాన్ని గణన చిహ్నాల నుపయోగించి పట్టిక రూపంలో ప్రాతినిధ్యపరచగలరు.

(ii)దత్తాంశాన్ని పటచిత్రరూపంలో ప్రాతనిధ్యపరచగలరు.

(iii)పట్టికలో, పటచిత్ర రూపంలో నున్న దత్తాంశాన్ని వాఖ్యానించగలరు, ముగింపు నిర్ణయాలు తెలుపగలరు.

4వ తరగతి

పరిసరాల విజ్ఞానం

 • తన చుట్టు ఉన్న పరిసరాలలోని పువ్వులు, పండ్లు, వేర్లు (ఆకారం, రంగు, వాసన, పెరిగే స్థలం, ఇతరము) జంతువులు, పక్షుల (ముక్కు/ పళ్ళు, గోళ్ళు, చెవులు, వెంట్రుకలు గూళ్ళు/ ఆవాసాలు మొదలగునవి) యొక్క సాధారణ లక్షణాలు గుర్తిస్తారు.
 • కుటుంబంలోని సభ్యులతో తనకు ఉన్న సంబంధాన్ని, ఉమ్మడి కుటుంబలోని సభ్యులతో తన సంబంధాన్ని, ఎవరు ఎవరికి ఏమౌతారో గుర్తిస్తారు. .
 • కుటుంబంలోని మార్పులు (ఉదా|| బిడ్డపుట్టినపుడు, పెళ్ళి, బదిలీలు) జంతువులు(చీమలు, తేనెటీగలు, ఏనుగులు) పక్షుల (గూళ్ళ నిర్మాణంలో) ప్రవర్తనలు వివరిస్తారు.
 • నిత్యజీవితంలో వివిధ రకాల నైపుణ్యంగల పని (వ్యవసాయం నిర్మాణం, డ్రాయింగ్ /హస్తకళలు) వారసత్వపు (పూర్వీకుల నుంచి పొందినవి) శిక్షణల గురించి (వివిధ సంస్థల పాత్ర) వివరిస్తారు.
 • నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేయడం, నిల్వ ఉంచడం, అదేవిధంగా ఉత్పత్తి చేసే స్థలం నుండి ఇంటికి చేరవేసే విధానాన్ని వివరిస్తారు.
 • నాడు, నేడు వినియోగిస్తున్న వస్తువులు, పనుల మధ్య తేడాలను చెబుతారు (ఉదా: రవాణ, ద్రవ్యం, ఇల్లు, వస్తువులు, పరికరాలు, నైపుణ్యం మొదలగునవి)
 • జంతువులు, పక్షులు, మొక్కలు, వస్తువుల యొక్క గుర్తించే లక్షణాల (రూపం, ఉపయోగాలు, లక్షణాలు, ఉదాహరణలు మొదలగునవి) ఆధారంగా గ్రూపులు చేయగలుతారు.
 • స్థానీయ పరిమాణాలు (దూరం, బరువులను ప్రామాణిక, స్థానిక ప్రమాణాలలో (1 కిలో, గజం, పావు మొ.) చెప్పడం, (వాటి ధర్మాలు చేసే విధానం యొక్క నిబంధనలు) ఊహించడం చేస్తారు. సాధారణ పరికరాలతో సరిచూసుకుంటారు.
 • పరిశీలనలు, అనుభవాలు, వివిధ రకాల సమాచార సేకరణ ఆధారంగా పరిసరాలు జరిగే సాదృశ్యకాలకు కార్యకారక సంబంధం నమోదు చేస్తారు, ప్రాగుక్తీకరిస్తారు (ఉదా|| బాష్పీభవనం, ఘనీభవనం, విచ్చిత్తి, పీల్చుకోవడం)
 • పటాలలోని గుర్తులనుపయోగించి ల్యాండ్ మార్క్ ఆధారంగా పాఠశాల మరియు ముఖ్యస్థలాలను గుర్తిస్తారు.
 • సూచికలు, పోస్టర్స్, ద్రవ్యం (నోటులు, కాయిన్స్ రైల్వేటికెట్, సమయసారిణిలోని సమాచారాన్ని ఉపయోగించుకోగలుగుతారు.
 • పాఠశాలలోని/ ఇంటి చుట్టుపక్కల గల వ్యర్థ పదార్థాల నుండి ఉపయోగకరమైన ఆకారాలు, నమూనాలు, ముగ్గులు, పోస్టర్స్, ఆల్బమ్స్, పటాలు తయారుచేస్తారు.
 • ఇంటిలో, పాఠశాలలో, సమాజంలో జరుగుతున్న వివిధ చర్యలను చూడడం వల్ల గాని, అనుభవం వల్లగాని (బేధాలు, వివక్ష, బాలలహక్కులు) తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు.
 • మనకున్న వనరులను (ఆహారం, నీరు, ప్రభుత్వ ఆస్తి శుభ్రంగా ఉండచం, తక్కువగా వాడడం, మళ్ళీ మళ్ళీ వాడుకోవడం, రీసైకిల్ చేయడం, వివిధ జీవరాశుల పట్ల శ్రద్ద వహించడానికి సూచనలు చేస్తారు.

తెలుగు

 • ఇతరుల ద్వారా తెలుసుకొన్న విషయాలపై స్పందిస్తారు, ప్రశ్నిస్తారు.
 • విన్న చదివిన విషయాలు, సంఘటనలు, చిత్రాలు, పాత్రలు, శీర్షికలు మొదలగు విషయాలపై మాట్లాడుతారు, ప్రశ్నిస్తారు, అభిప్రాయాలు చెప్తారు తగిన కారణాలు వివరిస్తారు.
 • కథలు, కవితలు, గేయాలు మొదలగు వాటిని అర్థం చేసుకొని వాటికి తమ మాటలను/పదాలను చేరుస్తారు.
 • భాషాంశాలలోని వివిధ అంశాలను గుర్తించి వాక్యనిర్మాణం చేస్తారు. తమ భాషలో ఉపయోగిస్తారు.
 • వార్తాపత్రికలలోని ముఖ్య శీర్షికలు, బాలల పత్రికలు, వివిధ రచనలు మొదలగు అంశాలను అర్థం చేసుకొంటారు. వాటి గురించి చర్చిస్తారు.
 • తాము చదివిన రచనలు, దైనందిన జీవిత అనుభవాల ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా వచ్చిన ఆలోచనలను తమ మాటల్లో / లిఖిత రూపంలో వ్యక్తపరుస్తారు.
 • పాఠ్య/పార్యేతర విషయాలు (బాల సాహిత్యం, వార్తాపత్రికల ముఖ్య శీర్షికలు, బాల పత్రికలు, హెర్డింగ్స్ మొదలగునవి) అర్థం చేసుకొంటూ చదువుతారు.
 • వివిధ రచనల్లోని కొత్త పదాలను అర్థం చేసుకొని వివిధ సందర్భాలలో తామూ ప్రయోగిస్తారు. (మౌఖిక/లిఖిత).
 • చదువడానికి ఉత్సాహాన్ని చూపుతారు. గ్రంథాలయం, చదివేచోటు (Reading Corner) మొదలగు ప్రదేశాల నుండి తమకు నచ్చిన పుస్తకాలను ఎన్నుకుంటారు.
 • తమ స్థాయి /అభిరుచికి అనుగుణంగా ఇతర విషయాలు, వృత్తులు, కళలు (ఉదా: పర్యావరణం, సంగీతం, వ్యవసాయం ... మొదలగునవి) సంబంధించిన పదజాలాన్ని ప్రశంసిస్తారు.
 • భాషాంశాలలోని వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని తమ రచనలలో ఉపయోగిస్తారు.
 • తాము చేసే రచనలలో సందర్భానుసారంగా పదాలను ఉపయోగిస్తారు. పోల్చుకొంటారు, ప్రశంసిస్తారు (ఉదా: జాతీయాలు, సామెతలు, పదబంధాలు మొIIనవి).
 • వివిధ ఉద్దేశాల కొరకు సందర్భానుసారంగా రాస్తారు. (ఉదా: బులెటిన్ బోర్డులోని సమాచారం, వస్తుసామగ్రి సూచి.) తమ రాతలో మార్పులు, చేర్పులు చేసుకొంటారు. రాస్తున్న ఉద్దేశాన్ని పాఠకులను అనుసరించి అందుకు తగిన ప్రక్రియను ఎన్నుకొని రాస్తారు.
 • విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాస్తారు.
 • తమలోని సృజనాత్మక శక్తిని, కల్పనాశక్తిని, కథలు, కవితలు, వర్ణనలు మొదలగు ప్రక్రియలలో మౌఖిక/లిఖిత రూపాలలో వ్యక్తపరుస్తారు.

గణితం

 • 9999 వరకు సంఖ్యలను వినియోగించగలరు.

(i)                   9999 వరకు సంఖ్యలను సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించగలరు.

(ii)                  9999 వరకు గల సంఖ్యల స్థానాలను సంఖ్యారేఖపై అంచనావేయగలరు.

(iii)                 9999 వరకు గల సంఖ్యలను (సంఖ్యారేఖపై) చదువగలరు.

(iv)                నిత్యజీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చతుర్విధ ప్రక్రియలను ఉపయోగించి పరిష్కరించగలరు.

 • భిన్నాలను వినియోగించగలరు.

(I)                  వస్తువులను సమూహంలో లేదా ఒక వస్తువులో సగం, పావు, ముప్పావులను గుర్తించగలరు.

(II)                 సగం, పావు, ముప్పావు మొదలగు ప్రమాణ భిన్నాలను యూనిట్ భిన్నాల గురించి వివరించగలరు.

(III)                ఒక చిత్రం/ పటంలో కావలసిన భాగమును చదువగలరు మరియు భిన్నరూపంలో రాయగలరు.

(IV)               ఇచ్చిన భిన్నమును పటరూపంలో ప్రాతినిధ్యపరచగలరు.

 • నిజజీవితంలోని వివిధ ఆకారాల గూర్చిన అవగాహన పొందుతారు.

(I)                  (3D) త్రిమితీయ వస్తువుల యొక్క అంచులు, మూలాలు, ముఖాలు/ తలాలు గుర్తించగలరు మరియు లెక్కించగలరు..

(II)                  త్రిమితీయ (3D) వస్తువుల వలరూపాలను తయారుచేయగలరు.

(III)                అంచులు, మూలాలు లెక్కించి ద్విమితీయ (2D) ఆకారాలైన త్రిభుజం, దీర్ఘచతురస్రం, చతురస్రం వృత్తాలను గుర్తించగలరు.

 • వివిధ జ్యామితీయ ఆకారాల చుట్టుకొలతలను గూర్చి అవగాహన పొందగలరు.

(I)                  జ్యామితీయ ఆకారం యొక్క చుట్టుకొలత భావన అవగాహన చేసుకుంటారు మరియు దాని అర్థం వివరించగలరు.

 • ఆకారాలు మరియు కోణాల గూర్చి అన్వేషించగలరు. వాటి గురించి ఆలోచించి అవగాహన పొందగలరు.

(I)                  లంబకోణం, అల్పకోణం, అధికకోణాలుగా వర్గీకరించగలరు మరియు వాటిని గీయడం లేదా ట్రేసింగ్ ద్వారా ప్రాతినిధ్యపరచగలరు.

(II)                 ఘనం యొక్కవల రూపాలను తయారుచేయగలరు.

(III)                త్రిభుజం, దీర్ఘచతురస్రం, చతురస్రం మొదలగు జ్యామితీయ ఆకారాలను గీయడానికి డాటీషీట్ (Dot Sheet) ను ఉపయోగిస్తారు.

(IV)               వృత్తం అందలి భాగాలను గూర్చి అవగాహన పొందుతారు. (కేంద్రం, వ్యాసార్థం)

(V)                జ్యామితీయ ఆకారాలతో గల బొమ్మలు లేదా వివిధ ఆకారాలు తయారు చేయుటకు టాన్ గ్రామ్ (Tangram) ను ఉపయోగించగలరు.

 • రాశులను కొలవడంలో ప్రమాణాలను వినియోగించగలరు.

(I)                  పొడవు, బరువు, ఘనపరిమాణాలకు సంబంధించిన ఉపయోగంలో ఉన్న ప్రమాణాలను పెద్ద ప్రమాణాల మధ్య సంబంధాలను ఏర్పరచగలరు.

ఉదా: 1 కి.గ్రా. = 1000 గ్రాములు

1 సెంటీ మీటర్ = 10 మిల్లీమీటర్లు

1 లీటర్ = 1000 మిల్లీ లీటర్లు

(II)                 ప్రమాణాలను చిన్నవాటిని పెద్ద ప్రమాణాలలోకి మరియు పెద్ద ప్రమాణాలను చిన్న ప్రమాణాలలోకి మార్చగలరు.

ఉదా: 25 సెంటీమీటర్ల పొడవు ఇచ్చినచో దానిని 250 మిల్లీమీటర్లుగా తెలుపడం. లేదా 5000 మిల్లీ లీటర్ల ఘనపరిమాణాన్ని 5 లీటర్లుగా మార్చి తెలుపడం.

 • క్యాలెండర్ మరియు వివిధ పద్ధతులలో సమయము గురించి అవగాహన పొందుతారు.

(I)                  సమయాన్ని A.M/P.M లలో వ్యక్తపరచగలరు మరియు రైల్వే సమయపద్ధతిలో తెలుపగలరు. ఇంకా ఒక పద్ధతి నుండి ఇంకొక పద్ధతిలో సమయాన్ని మార్చి చెప్పగలరు.

(II)                 ఇచ్చిన రెండు తేదీల మధ్యన ఎన్ని రోజులు ఉంటాయో లెక్కించగలరు.

 • జ్యామితీ పటాల చుట్టుకొలత మరియు వైశాల్యాలను గూర్చి అన్వేషిస్తారు.

(I)                  జ్యామితీయ పటాల అంచులుగా గల రేఖాఖండముల పొడవు మొత్తం కనుగొనుట ద్వారా చుట్టుకొలతను లెక్కించగలరు.

(II)                 త్రిభుజం, దీర్ఘచతురస్రం మొదలగు ఆకారాలు పూర్తిగా నింపడానికి ఎన్ని ప్రమాణ చతురస్రాలు అవసరమో లెక్కించడం ద్వారా వైశాల్యం గురించి వివరించగలరు.

 • జ్యామితీయ ఆకారాలు మరియు సంఖ్యలతో త్రిభుజాకార, చతురస్రాకార సంఖ్యలు) క్రమాలను ఏర్పరచగలరు మరియు కొనసాగించగలరు.
 • వివిధ నిజజీవిత సందర్భాల నుండి దత్తాంశాన్ని సేకరించగలరు మరియు పట్టికలతో, కమ్మీచిత్రాలతో ఆ దత్తాంశాన్ని ప్రాతినిధ్యపరచగలరు.

5వ తరగతి

పరిసరాల విజ్ఞానం

 • జంతువులలోని అతీంద్రియజ్ఞానం (గొప్పతెలివి), అసాధారణ లక్షణాలను (చూపు, వాసన వినికిడి, నిద్ర, శబ్దం మొ||) మరియు వాటి ఆహారం, వెలుతురు, శబ్దానికి ఇచ్చే స్పందనలను వివరిస్తారు.
 • నిత్యజీవితంలో సాంకేతికత ఉపయోగం, కనీస అవసరాలు (ఆహారం, నీరు) పొందే విధానం గురించి వివరిస్తారు.
 • నిత్యజీవితంలో వివిధ సంస్థల యొక్క(బ్యాంకు, గ్రామపంచాయితీ, సహకార సంస్థ, పోలీస్ స్టేషన్) పాత్రలను వివరిస్తారు.
 • జంతువులు, మొక్కలు, మనుషులు (ఉదా|| వర్గాలు, విత్తన వ్యాప్తి, జంతువులతో జీవనాధారం) ఒకదానిపై ఒకటి ఆధారపడడాన్ని వివరిస్తారు.
 • వాతావరణం, భూమి శీతోష్ణస్థితి, సాంస్కృతిక జీవనం (అసాధారణ ప్రాంతాలలో నివాసం ఉష్ణ శీతల నివాసాలు) వనరులు (ఆహారం, నీరు, నివాసం, జీవ విధానం) అనుసంధానం చేయగల్గుతారు.
 • నాణాలు, చిత్రకళలు, పురాతన కట్టడాలు, పురావస్తుప్రదర్శనశాల, పెద్దలతో మాట్లాడడం వల్ల నాడు, నేడు అలవాట్లలో పద్దతుల్లో వచ్చిన మార్పులను గుర్తిస్తారు.
 • వస్తువులను వాటి యొక్క లక్షణాలు అయిన ఆకారం, రుచి, స్వభావం, రంగు, ధ్వని, ప్రవర్తన ఆధారంగా గ్రూపులుగా చేస్తారు.
 • స్థానీయ పరిమాణాల (దూరం, కాలం, బరువు) ను ప్రామాణిక, సాధారణ ప్రమాణాలలో చెప్పడం (వాటి ధర్మాలు, చేసే విధానం యొక్క నిబంధనలు) ఊహిస్తారు. సాధారణ పరికరాలతో సరిచూసుకుంటారు.
 • పరిశీలనలు/ అనుభవాలు / సమాచారాన్ని క్రమపద్ధతిలో (ఉదా: పట్టికలు, బార్ గ్రాఫ్/ప్రణాళికలు/పైచార్ట్) నమోదు చేస్తారు. వివిధ చర్యలు/ సాదృశ్యకాలు (తేలడం, మునగడం, కలిసిపోవడం, భాష్పీభవనం,మొలకెత్తడం, కుళ్ళిపోవడం) యొక్క కార్యకారక సంబంధం గురించి ప్రాగుక్తీకరిస్తారు.
 • పటాలను ఉపయోగించి సందర్శన స్థలంలోని వివిధ వస్తువులు, ప్రదేశాలు, దిక్కులు, సూచికలకు అనుగుణంగా మార్గాలను (దిశ) ఊహిస్తారు.
 • సృజనాత్మకతో పోస్టర్స్, డిజైన్లు, నమూనాలు, స్థానిక వంటకాలు, ప్రణాళికలు, పటాలను (చుట్టూ పక్కల ప్రాంతాలు సందర్శించిన స్థలాలు) స్థానిక, వ్యర్ధపదార్థాలతో వస్తువులు తయారు చేయడం, నినాదాలు, గేయాలు ప్రయాణ అనుభవాలు మొదలగువాటిని రాయగలుగుతారు.
 • సమాజంలో జరుగుతున్న చర్యలు (వివక్ష/ వనరులు, వలసలు/ స్థానచలన/ బాలలహక్కు గురించి తమ పరిశీలనలు, అనుభవాలు, అనుబంధ చర్యల వల్ల అభిప్రాయాన్ని తెలుపగలరు.
 • పరిశుభ్రత, ఆరోగ్యం, వ్యర్ధపదార్థాలు నిర్వాహణ, అత్యవసర పరిస్థితులు, వనరులు (భూమి, ఇంధనాలు, అడవులు) కాపాడుకోవడం గురించి సూచనలు చేయగల్గుతారు.

తెలుగు

 • ఇతరుల ద్వారా తెలుసుకొన్న విషయాలపై స్పందిస్తారు, ప్రశ్నిస్తారు.
 • విన్న, చదివిన విషయాలు, సంఘటనలు, చిత్రాలు, పాత్రలు, శీర్షికలు మొదలగు విషయాలపై మాట్లాడుతారు, ప్రశ్నిస్తారు, అభిప్రాయాలు చెప్తారు, తగిన కారణాలు వివరిస్తారు.
 • కథలు, కవితలు, గేయాలు మొదలగు వాటిని అర్థం చేసుకొని వాటికి తమ మాటలను / పదాలను చేరుస్తారు లేదా పొడిగించగలుగుతారు.
 • భాషాంశాలలోని వివిధ అంశాలను గుర్తించి వాక్యనిర్మాణం చేస్తారు. సందర్భానుసారంగా ఉపయోగిస్తారు.
 • వార్తాపత్రికలలోని ముఖ్య శీర్షికలు, బాలల పత్రికలు, వివిధ రచనలు మొదలగు అంశాలను అర్థం చేసుకొంటారు. వాటి గురించి చర్చిస్తారు.నివేదిక రూపంలో రాస్తారు.
 • తాము చదివిన రచనలు, దైనందిన జీవిత అనుభవాల ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా వచ్చిన ఆలోచనలను తమ మాటల్లో/లేఖన రూపంలో వ్యక్తపరుస్తారు.
 • పాఠ్య/పార్యేతర విషయాలు (బాల సాహిత్యం, వార్తాపత్రికల ముఖ్య శీర్షికలు, బాల పత్రికలు, హెర్డింగ్స్ మొదలగునవి) అర్థం చేసుకొంటూ చదువుతారు. –
 • వివిధ రచనలలోని కొత్త పదాలను అర్థం చేసుకొని వివిధ సందర్భాలలో తామూ ప్రయోగిస్తారు. (మౌఖిక/లిఖిత). చదువడానికి ఉత్సాహాన్ని చూపుతారు. గ్రంథాలయం, చదివేచోటు (Reading
 • Corner) మొదలగు ప్రదేశాల నుండి తమకు నచ్చిన పుస్తకాలను ఎన్నుకుంటారు).
 • తమ స్థాయి / అభిరుచికి అనుగుణంగా ఇతర విషయాలు, వృత్తులు, కళలు మొదలగున వాటికి (ఉదా: పర్యావరణం, సంగీతం, వ్యవసాయం ... మొదలగునవి) సంబంధించిన పదజాలాన్ని ప్రశంసిస్తారు.
 • భాషాంశాలలోని వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని తమ రచనలలో ఉపయోగిస్తారు. .
 • తాము చేసే రచనలలో సందర్భానుసారంగా పదాలను ఉపయోగిస్తారు. పోల్చుకొంటారు, ప్రశంసిస్తారు (ఉదా: జాతీయాలు, సామెతలు, పదబంధాలు మొ||నవి). –
 • వివిధ ఉద్దేశాల కొరకు సందర్భానుసారం రాస్తారు. (ఉదా: బులెటిన్ బోర్డులోని సమాచారం, వస్తుసామగ్రి సూచి, తమ రాతలో మార్పులు, చేర్పులు చేసుకొంటారు. రాస్తున్న ఉద్దేశం ప్రకారం, పాఠకులను అనుసరించి అందుకు తగిన ప్రక్రియను ఎన్నుకొని రాస్తారు.
 • విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాస్తారు.
 • తమలోని సృజనాత్మక శక్తిని, కల్పనాశక్తిని, కథలు, కవితలు, ఆత్మకథలు, సంభాషణలు మొదలగు ప్రక్రియలల్లో మౌఖిక/లిఖితరూపాలలో వ్యక్తపరుస్తారు.

గణితం

 • పెద్ద సంఖ్యలను వినియోగించగలరు.

(I)9999 వరకు సంఖ్యలను అంకెల స్థాన విలువల ఆధారంగా చదువగలరు మరియు రాయగలరు.

(II)ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయగలరు.

(III)సంఖ్యలను నిజజీవిత సందర్భాలలో వినియోగించగలరు.

 • దవ్యం, పొడవు, బరువు మరియు పరిమాణములకు సంబంధించిన చిన్న చిన్న నిజజీవిత సందర్బాలలోని సమస్యలను చతుర్విధ ప్రక్రియలను ఉపయోగించి పరిష్కరించగలరు.

i) రెండు సంఖ్యలను ప్రామాణిక పద్ధతిలో గుణించగలరు.

ii)ఒక సంఖ్యను ఇచ్చిన సంఖ్యతో ప్రామాణిక పద్దతిలో భాగించగలరు.

iii)రెండు సంఖ్యల మొత్తం, భేదం, లబ్దం, ఆసంఖ్యలలలో ఒక సంఖ్యను మరొక సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం మొదలగు ఫలితాలను ప్రామాణిక పద్దతినుపయోగించి లేదా విస్తరణ రూపాల ద్వారా అంచనా వేయగలరు.

ఉదా: 1243 ను 25 చే గుణించండి.

1243 = 1000+ 200+40+3

25   20+5 దీనిలో ముందుగా 1000, 200, 40, 3 లను 20 చే గుణించగలరు.

తర్వాత 1000, 200, 40, 3లను 5 చే గుణించగలరు. తర్వాత అన్ని లబ్దాల మొత్తంను  ఫలితంగా తెలుపగలరు.

iv)2, 5, 10 మొదలగు వాటి గుణిజాలు తెలుపగలరు.

 • భిన్నాలను గూర్చిన అవగాహన పొందుతారు.

i)నిజజీవిత సందర్భాలలో వస్తువుల సమూహాలు / వస్తువులను భిన్నంగా సూచించగలరు.

ii)భిన్నాలను పోల్చగలరు (ప్రమాణ భిన్నాలు, మరియు సజాతీయ భిన్నాలలో)

iii)భిన్నాలను ఉపయోగించి సమస్యలను సాధించగలరు.

ఉదా: 12 మామిడిపండ్లలో పావు భాగంను తెలపండి. లేదా

36 మీటర్ల లోహపు కడ్డీలో ముప్పావు భాగం ఎంత?

iv)దశాంశ భిన్నాల కూడిక, తీసివేతలతో గల నిజజీవిత సందర్బాలలోని సమస్యలను పరిష్కరించగలరు.

 • చరరాశిని గురించి తెలుసుకొని వినియోగిస్తారు.

i)నిత్యజీవితంలో క్రమాలను పరిశీలించి ఆ క్రమాలలోని సంబంధాలను చరరాశులనుపయోగిస్తూ వ్యక్తపరచగలరు.

ii)చరరాశినుపయోగించి నిజజీవిత సందర్బాలను సమీకరణ రూపంలో వ్యక్తపరచగలరు.

 • జ్యామితీయ పటాలను అన్వేషిస్తారు.

i)పరిసరాలలో జ్యామితీయ పటాలను అనగా బిందువు, రేఖాఖండం, సరళ రేఖ, కిరణం, వక్రము మొదలగు వాటిని గుర్తించగలరు మరియు వివరించగలరు.

ii)బిందువు, రేఖాఖండం, సరళరేఖ, కిరణం మరియు వక్రం మొదలగు జ్యామితీయ భావనలను అవగాహన చేసుకుంటారు మరియు గీసి ప్రదర్శించగలరు.

iii) బిందువు, రేఖాఖండం, సరళరేఖ, కిరణం మొదలగు వాటిని సరైన విధంగా గుర్తులతో రాసి చూపగలరు. గణిత భాషలో సూచించగలరు.

iv) సరళ సంవృత పటాలను త్రిభుజం, చతుర్భుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం మొదలగునవి) పేర్లతో సహా గుర్తించగలరు.

v) జ్యామితీయ పటాలలోని కోణం, శీర్షం, అంచులను గణితపరంగా సరైన పద్దతిలో సూచించగలరు.

 • వృత్తం మరియు అందులోని భాగాలు (కేంద్రం, వ్యాసం, వ్యాసార్థం, చాపం మరియు సెక్టార్) మొదలగు వాటిని గుర్తించగలరు. క్రమబహుభుజాల చుట్టుకొలతను లెక్కించగలరు మరియు ఇచ్చిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం లెక్కించగలరు. జ్యామితీయ పటాలు నిర్మాణం చేయగలుగుతారు, వాటి గురించి అవగాహన పొందుతారు.

i) జ్యామితీయ పరికరాలను వాటిపేర్లతో సహా గుర్తించగలరు.

ii)రూలర్ ను ఉపయోగించి రేఖాఖండమును నిర్మించగలరు.

iii)ఇచ్చిన కోణాన్ని కోణమానిని ఉపయోగించి నిర్మించగలరు.

iv)ఇచ్చిన వ్యాసార్థంతో వృత్తం నిర్మించగలరు మరియు ఇచ్చిన రేఖాఖండమునకు లంబరేఖను, ఇచ్చిన రేఖాఖండమునకు లంబసమద్విఖండన రేఖల, ఇచ్చిన కోణమునకు కోణ సమద్విఖండనరేఖ నిర్మించగలరు.

v)రూలర్ మరియు వృత్తలేఖినితో 15°, 30°, 45°, 60°, 90° మొదలగు కోణాలను నిర్మించగలరు.

 • నిజజీవిత సందర్బాల నుండి సేకరించిన దత్తాంశమును గణన చిహ్నాలనుపయోగించి పట్టిక రూపంలో మరియు పటచిత్రం, కమ్మీచిత్రాలలో ప్రాతినిధ్యపరచగలరు.
 • నిజజీవిత సందర్భాలలో త్రిమితీయ ఆకారాలైన ఘనం, దీర్ఘఘనం, స్థూపం, శంఖువు,గోళం మొదలగు వాటిని వాటి ప్రాథమిక ధర్మాల ఆధారంగా గుర్తించగలరు. .
 • సౌష్ఠవ రేఖను గీసి వస్తువులలోని సౌష్ఠవతను చూపగలరు. సాధ్యమయిన సందర్భాలలో పటాలకు ఒకటి కంటే ఎక్కువ సౌష్టవరేఖలను గీయగలరు.

సామాన్య శాస్త్రం

 • బాహ్యస్వరూపం, విధులు, సువాసన మొదలైన పరిశీలనాంశాల ఆధారంగా మొక్కలు నారలు,పుష్పాలు మొదలైన పదార్థాలు, జీవులను గుర్తిస్తారు.
 • పదార్థాలు మరియు జీవుల ధర్మాలు, నిర్మాణం,విధుల ఆధారంగా అంశాల మధ్య బేధాలను తెలియచేస్తారు. ఉదాహరణకు తల్లి వేరువ్యవస్థ మరియు పీచు వేరు వ్యవస్థ, విద్యుత్ వాహకాలు మరియు నిరోధకాలు మొదలైనవి.
 • జీవులు మరియు పదార్థాలను, పద్దతులను పరిశీలించి ధర్మాల ఆధారంగా అంశాలను వర్గీకరిస్తారు.
 • ఉదాహరణకు (1) కరిగే పదార్థాలు, కరగని పదార్థాలు, పారదర్శక, అపారదర్శక కాంతి నిరోధక పదార్థాలు ఆవాసంలో సజీవ, నిర్జీవ అంశాలు.
 • ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనుటకు చిన్నచిన్న సాధారణ అన్వేషణలను నిర్వహిస్తారు. ఉదాహరణకు పశుగ్రాసంలోఉండే పోషకాలేవి? స్వేచ్చాయుతంగా వ్రేలాడదీయబడిన అయస్కాంతం దిశానిర్దేశం చేస్తుందా ? వివిధ కారణాలతో పద్దతులు మరియు దృగ్విషయాల మధ్య సంబంధాన్ని ఏర్పర్చగలరు. ఉదాహరణకు ఆవాసాలకు అనుగుణంగా మొక్కలు జంతువుల అనుకూలనాలు.
 • పద్ధతులు మరియు దృగ్విషయాలను వివరిస్తారు. ఉదాహరణకు మొక్కలు నుండి నారలు తీసే పద్ధతి.మొక్కలు మరియు జంతువులలో చలనాలు, నీడలు ఏర్పడటం. సమతల దర్పణం నుండి కాంతి పరావర్తనం మొదలైనవి.
 • భౌతిక రాశులను మాపనం చేసి ఎస్ఐ పద్ధతిలో వ్యక్తపరచటం ఉదా: పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత మొదలైనవి. బొమ్మలను గీచి భాగాలను గుర్తిస్తారు. జీవులు మరియు పదార్థాలను ఫ్లోచార్ట్ రూపంలో గీస్తారు. ఉదాహరణకు కీళ్ళు, వడపోత, జలచక్రం మొదలైనవి.
 • పరిసరాలలో దొరికే పదార్థాలతో నమూనాలను తయారుచేసి వాటి పనిచేయు విధానాన్ని వివరిస్తారు. ఉదాహరణకు పిన్ హోల్ కెమెరా, పెరిస్కోప్, విద్యుత్ టార్చ్ లైట్ మొదలైనవి.
 • అభ్యసించిన వైజ్ఞానిక భావలనలను నిత్యజీవితంలో అన్వయించుకుంటారు. ఉదా: సమతుల్య ఆహారానికి ఆహార పదార్థాలను ఎంపిక చేస్తారు. ఋతువులకు తగినట్లు ధరించే దుస్తులను ఎంపిక చేయటం. దిక్సూచి ఉపయోగించి దిక్కులను తెల్సుకోవటం. భారీవర్షాలు, కరువు పరిస్థితులను ఎదుర్కొనుటకు తగిన సూచనలు సలహాలు ఇవ్వటం పాటించటం.
 • పరిసరాలను పరిరక్షించుటకు తగిన కృషి చేస్తారు. ఉదాహరణకు నీరు, విద్యుచ్ఛక్తి మరియు ఆహార పదార్థాల వృధాను అరికట్టడం. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించటం. వర్షపునీటియాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచటం, మొక్కల పెంపకం పట్ల తగిన చర్యలుతీసుకోవటం వాటిని సంరక్షించటం.
 • నిజాయితి, సహకారం, నిర్భయత్వం, హేతుబద్దమైన విలువలను ప్రదర్శిస్తారు.

సాంఘికశాస్త్రం

 • సాంప్రదాయిక చిహ్నాలను ఉపయోగించి స్కేలు, దిక్కులు, లక్షణాలను సూచించే విధంగా తమ గ్రామం, పాఠశాల, మండలం వంటి సమీప ప్రదేశాల పటాలను గీస్తారు.
 • ప్రంపచ పటంలో ఖండాలను, మహాసముద్రాలను మరియు దిక్కులను గుర్తిస్తారు.
 • గ్లోబు, ప్రపంచపటంలో అక్షాంశాలు, రేఖాంశాలు, ధృవాలు, భూమధ్యరేఖ, శీతోష్ణ మండలాలు, భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు పొరుగు దేశాలను గుర్తిస్తారు.
 • తెలంగాణ పటంలో కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు వంటి నైసర్గిక స్వరూపాలను గుర్తిస్తారు.
 • పురావస్తు, సాహిత్యం వంటి విభిన్న రకాల వనరులను గుర్తించి, నేటి చరిత్ర పునర్మిణంలో వాటి ఉపయోగాన్ని వివరిస్తారు.
 • భారతదేశ అవుట్లైను పటంలో ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు, స్థలాలను గుర్తిస్తారు.
 • ఆదిమ మానవుల యొక్క సంస్కృతుల లోని విశిష్టమైన లక్షణాలను గుర్తించి, వారి పరిణామము గురించి వివరిస్తారు.
 • ముఖ్యమైన రాజులు, రాజవంశాల యొక్క విశిష్టమైన సేవాకార్యక్రమాలను ఒక పట్టిక రూపంలో తయారుచేయుట. ఉదా: అశోకుని శాసనాలు, గుపుల నాణెములు వంటివి.
 • ప్రాచీన కాలంలోని విస్తృతమైన అభివృద్ధి గురించి వివరిస్తారు. ఉదా: ఆహారసేకరణ దశ, వ్యవసాయరంభం, సింధూలో మొట్టమొదట నగరాలు వెలయుట వంటివి, ఒక ప్రాంత పరిణామం, మరొక ప్రాంత పరిణామానికి ఎలా దోహదం చేసిందో వివరిస్తారు.
 • ఆ కాలంలోని సాహిత్య రచనలలో పొందుపరచిన సమస్యలు, సంఘటనలు, మహానుభావుల గురించి వివరిస్తారు.
 • సంస్కృతి, శాస్త్రీయ రంగాలలో భారతదేశం అందించిన విశిష్టమైన సేవలను వివరించుట. ఉదా: ఖగోళం, వైధ్యం, గణితం, లోహపరిజ్ఞానం వంటివి.
 • ప్రాచీన కాలంలోని విభిన్నమతాల, వ్యవస్థల ఆలోచనలలోని మౌలిక భావనలు, విలువల గురించి విశ్లేషిస్తారు.
 • తమ చుట్టూ గల వివిధ రకాల మానవ వైవవిధ్యాలను వివరిస్తారు. ఆరోగ్యకర వైఖరులను పెంపొందించుకొంటారు.
 • వివక్షత యొక్క వివిధ రూపాలను గుర్తించి, వివక్షత యొక్క స్వభావమును, దాని యొక్క మూలాలను విశ్లేషిస్తారు. సమానత, అసమానతల మధ్యగల వ్యత్యాసాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన/సరైన మార్గంలో సరిచేయుట వివిధ రూపాలను తెలియజేస్తారు.
 • ప్రభుత్వాల యొక్క వివిధ స్థాయిలను వివరిస్తారు. - స్థానిక, రాష్ట్రం, కేంద్రం స్థాయిలు
 • ఆరోగ్యం విద్య వంటి రంగాలలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల యొక్క విధుల గురించి వివరిస్తారు.
 • గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేపట్టే వివిధ వృత్తులను ప్రభావితం చేసే కారకాలను వివరిస్తారు.

6వ తరగతి

తెలుగు

 • వివిధ ధ్వనులను (వర్షం, గాలి, రైలు, బస్సు మొ||నవి) విన్న తమ అనుభవాలను, ఆహార పదార్థాల రుచుల అనుభవాలను గురించి మాటల్లో చెప్పగలరు.
 • విద్యార్థులు తాము విన్న, చూసిన, సంఘటనల/కార్యక్రమాల గురించి నిర్భయంగా మాట్లాడగలరు.
 • విన్న చూసిన, చదివిన సంఘటనలు / రచనలు / విషయాలను గురించి పిల్లలు తమదైన శైలిలో మాట్లాడగలరు, పొడిగించగలరు.
 • ప్రసార సాధనాలలోని (టి.వి., రేడియో, పత్రికలు) వార్తలను, పిల్లలు తమ సొంత మాటల్లో చెప్పగలరు.
 • ఇతరులు వ్యక్తీకరించిన అభిప్రాయాలను, అనుభవాలను, పిల్లలు తమ కోణంలో, సొంత మాటల్లో చెప్పగలరు, సందర్భానుసారంగా రాయగలరు.
 • పిల్లలు తమ స్థానిక జానపదగేయాలు, సామెతలు, పొడుపు కథలను అర్థం చేసుకొని వాటి గురించి చర్చించగలరు.
 • ఇతరుల భాష (మాతృభాషేతరుల) సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్దతులను గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడగలరు.
 • చిత్రాలను చూసి పాఠ్యాంశవిషయాన్ని ఊహించగలరు.
 • పాఠ్యాంశంలోని కీలకాంశాలను గుర్తించగలరు. సారాంశం చెప్పగలరు.
 • భాషకు సంబంధించిన పఠన సామగ్రి / ప్రసార మాధ్యమాల సామగ్రి అనగా రేడియో, టి.వి., వార్తాపత్రికలు, కథలు మొ||నవి మరియు అంతర్జాలంలో (ఇంటర్నెట్) ఉన్న అంశాలు మొదలగు వాటిని అర్థం చేసుకుంటూ చదువుతారు. వాటిపై తమ అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను చెప్పగలరు, రాయగలరు.
 • విద్యార్థులు వివిధ ప్రక్రియలలోని భాషా సౌందర్యాన్ని ప్రశంసించగలరు. (ఉదా: కవితలలోని ప్రాస పదాలు, వ్యాసాలు, కథలలోని జాతీయాలు, సామెతలు మొ.నవి).
 • పద్యం, వచనం, పాట/గేయం, వచన కవిత, జానపద కథ, సంభాషణ, స్వగతం తదితర అంశాలను శైలీ భేదంతో, అవగాహనతో, హావభావాలతో చదువగలరు.
 • నూతన పదాలకు అర్థాలను తెలుసుకొనేందుకు ఆసక్తిని కనబరచగలరు. అందుకొరకు నిఘంటవును ఉపయోగిస్తూ స్వీయ అధ్యయనం చేయగలరు.
 • హస్తకళ, వాస్తుకళ, నృత్యకళ మొ|| కళలకు సంబంధించి, వ్యవసాయం మొ.న వృత్తులకు సంబంధించిన పదాలను తెలుసుకొనుటకు ఆసక్తి కనపరుస్తారు. వాటిని ప్రశంసిస్తారు.
 • వ్యాకరణాంశాల పట్ల అవగాహన పెంచుకోవడం అనగా వర్ణమాల, భాషాభాగాలు, విభక్తులు, పదాలు కలుపడం/విడదీయం, ద్వంద్వ సమాసం మొ||నవి. చేయగలరు.
 • విభిన్న సందర్భాలలో వివిధ ఉద్దేశాల కొరకు రాసేటప్పడు జాతీయాలను, సామెతలను ఉపయోగించగలరు.

గణితం

 • పెద్ద సంఖ్యలను వినియోగించగలరు.

i) పెద్ద సంఖ్యలను హిందూ-అరబిక్ సంఖ్యామానము, ఆంగ్లసంఖ్యామానములలో చదువగలరు.

ii) సంఖ్యలను స్థానవిలువల ఆధారంగా పోల్చగలరు.

iii)పెద్ద సంఖ్యలనుపయోగించి సరైన ప్రక్రియను అన్వయించడం (కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారం) ద్వారా సమస్యలను పరిష్కరించగలరు.

 • ప్రాథమిక అంకగణితము గురించి అవగాహన పొందుతారు.

i)క్రమాలు / అమరికల నుండి సంఖ్యలను వర్గీకరించగలగడం, సంఖ్యలలో సరి, బేసి, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు గుర్తించగలగడం, ప్రశసించడం చేయగలరు.

ii)నిజజీవిత సందర్భాలలో క.సా.గు మరియు గ.సా.భాలను వినియోగించగలరు.

iii) నిష్పత్తులు, అనుపాతములను ఉపయోగించి నిజజీవిత సందర్బాలకు చెందిన సమస్యలు పరిష్కరించగలరు.

 • పూర్ణాంకాల ధర్మాలను వివరించగలరు. అదే విధంగా సున్నా 'O' యొక్క ఆవశ్యకత / ప్రాముఖ్యతను వివరించగలరు. పూర్ణ సంఖ్యల కూడిక మరియు తీసివేతలనుపయోగించి సమస్యలను పరిష్కరించగలరు.
 • భిన్నాలు మరియు దశాంశ భిన్నాలు వినియోగించగలరు.

i) ఏవేని రెండు భిన్నాలను పోల్చగలరు.

ii)వస్తువుల సమూహంలో ఇచ్చిన భిన్నమును సూచించు భాగమును కనుగొనగలరు.

iii) భిన్నముల కూడిక, తీసివేతలతో నిజజీవిత సందర్భాలకు చెందిన సమస్యలు పరిష్కరించగలరు.

iv)ఒక వస్తువు మరియు కొంత భాగం లేదా ఒకరాశి (పొడవు, ద్రవ్యం, ఘనపరిమాణం మొ.నవి) మరియు కొంత భాగం ఉన్నప్పడు దానిని దశాంశ భిన్నం రూపంలో చూపగలరు.

ఉదా: ఒక మనిషి 3 కి.మీ. మరియు పావు కి.మీ. దూరం ప్రయాణించిన, ఆ ప్రయాణించిన దూరాన్ని 1.25 కి.మీ. లలో చూపగలరు.

 • శాతము, నిష్పత్తులను వినియోగిస్తారు.

i)శాతములను భిన్నాలలోకి మరియు భిన్నాలను శాతాలలోకి మార్చగలరు.

ii)నిజజీవిత సందర్భాలలో లాభం, లేదా నష్టంతో ఇమిడి ఉన్న సమస్యలను శాతం మరియు భిన్నాలను ఉపయోగించి పరిష్కరించగలరు.

 • ఒకే చరరాశితో ఉన్న సమీకరణాలను అవసరమైనప్పుడు వినియోగించి నిజజీవిత సమస్యలు పరిష్కరించగలరు.
 • కోణాలను అన్వేషిస్తారు, వినియోగిస్తారు.

i)పూరక మరియు సంపూరక కోణాలను గుర్తిస్తారు, వివరిస్తారు.

ii)రేఖీయ జత కోణాలు మరియు ఆసన్న కోణాలు మధ్యగల భేదాలను చెప్పగలుగుతారు.

iii)శీరాభిముఖ కోణాల గురించి వివరిస్తారు మరియు రెండు సమానమనే సత్యాన్ని వివరిస్తారు.

iv) రెండు రేఖలు లేదా సమాంతర రేఖల యొక్కతిర్యగ్రేఖను గుర్తించగలరు.

v)రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండిస్తున్నప్పడు ఏర్పడే అన్ని కోణాల (సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు) గురించి వివరించగలుగుతారు. వాటిని చూపగలుగుతారు.

vi)రెండు రేఖలు ఖండించుకున్నప్పడు ఏర్పడే అన్ని కోణాలను చూపగలరు.

 • త్రిభుజంలోని అంతర కోణాలు మరియు త్రిభుజం బాహ్యకోణాలను గుర్తించి చూపి ఆ కోణాల ధర్మాలను వివరించగలరు.

ఉదా: త్రిభుజాలలోని సమాచారం ఆధారంగా రెండు త్రిభుజాల సర్వసమానత్వం గురించి వివరించగలరు (భు.భు.భు, భు..భు, కో.భు.కో, లంబకోణం, కర్ణం, భుజం మొదలగు ధర్మాలు)

 • రూలర్ మరియు వృత్తలేఖిని ఉపయోగించి ఇచ్చిన త్రిభుజాలను నిర్మించగలరు.
 • త్రిభుజం, సమాంతర చతుర్భుజం, రాంబస్ల వైశాల్యాన్ని కనుగొనగలరు.
 • వృత్తం చుట్టుకొలత ఉపయోగించి 'పై' విలువను అంచనా వేయగలుగుతారు.
 • నిజజీవిత సందర్బాల నుండి సేకరించిన అవర్గీకృత దత్తాంశంనకు సగటు, మధ్యగతం, బాహుళకములను లెక్కించగలుగుతారు.
 • నిజజీవిత సందర్బాల నుండి త్రిమితీయ ఆకృతులు అయిన ఘనం, దీర్ఘఘనం, స్తూపం,శంఖువు మరియు గోళం మొదలైన వాటిని గుర్తించగలుగుతారు మరియు వాటి వల రూపాలను రూపొందించగలరు.
 • రేఖీయ సౌష్ఠవం, భ్రమణ సౌష్ఠవం, బిందు సౌష్ఠవాలను గురించి వివరించగలరు.

సామాన్య శాస్త్రం

 • జంతువుల దారాలు (నారలు), దంతాల రకాలు, దర్పణములు, కటకముల బాహ్యస్వరూపం, విధులు మొదలైన పరిశీలనాంశాల ఆధారంగా పదార్థాలు, జీవులను గుర్తిస్తారు.
 • వివిధ జీవులలో జీర్ణ క్రియ, ఏకలింగ - ద్విలింగ పుష్పాలు, ఉష్ణ వాహకములు - ఉష్ణబంధకములు, ఆమ్లాలు, క్షారాలు, తటస్థ పదార్థాలు దర్పణములు మరియు కటకాల ద్వారా ఏర్పడే ప్రతిబింబాలు మొదలైన వాటిని, వాటి ధర్మాలు,నిర్మాణం మరియు విధుల ఆధారంగా పదార్థాలు - జీవులకు మధ్య తేడాలు తెల్పగలరు.
 • వృక్ష మరియు జంతునారలు, భౌతిక రసాయన మార్పులు మొదలైన వాటిని వాటి ధర్మాలు - లక్షణాల ఆధారంగా పదార్థాలు - జీవులుగా వర్గీకరిస్తారు.
 • తమ సందేహాలకు / ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సరళమైన అన్వేషణలు కొనసాగిస్తారు ఉదాహరణకు రంగు పుష్పాల నుండి తీసిన రసాన్ని ఆమ్లాల - క్షారల సూచికలుగా ఉపయోగించవచ్చా ?ఆకుపచ్చగా లేని పత్రాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహిస్తాయా ? తెల్లని కాంతిలో అనేకమైన వర్గాలున్నాయా ? మొదలైనవి. వివిధ కారణాలతో పద్దతులు మరియు దృగ్విషయాల మధ్య సంబంధాన్ని ఏర్పరచగలరు. ఉదాహరణకు
 • గాలి వేగము - గాలి పీడనము, వివిధ రకాల నేలలో పెంచే పంటలు. మానవ చర్యల వల్ల భూగర్భ జలమట్టం తగ్గిపోవటం మొ||నవి. పద్దతులు మరియు దృగ్విషయాలను వివరిస్తారు. ఉదాహరణకు జంతువుల నుండి దారాలు తీసే పద్ధతి,
 • ఉష్ణవాహన సంవాహక విధానాలు, మొక్కలు మరియు మానవులలో అవయవాలు, అవయవ వ్యవస్థలు మొ||నవి. రసాయన సమీకరణాలను పదాలు/ వాక్యల రూపంలో రాయగలరు. ఉదాహరణకు ఆమ్ల, క్షార చర్యలు, క్షయమగు చర్యలు, కిరణజన్యసంయోగక్రియ, శ్వాసక్రియ మొ||వి.
 • రాశులను కొలవగలరు. లెక్కించగలరు. ఉదా: ఉష్ణోగ్రత, నాడీ స్పందన, కదిలే వస్తువుల వేగం, సరళలోలకం యొక్క కాలవ్యవధులు మొ||వి. )
 • ఫ్లోచార్ట్లు, భాగాలు గుర్తించబడిన బొమ్మలు గీయగలరు. ఉదా: మొక్కలు మరియు మానవులలో అవయవాలు. అవయవ వ్యవస్థలు, విద్యుత్ వలయాలు, ప్రయోగ విధానాలు, పట్టు పురుగు జీవిత చక్రం మొ||నవి. గ్రాఫ్లు గీయగలరు. గ్రాఫ్లను వ్యాఖ్యానించగలరు. ఉదాహరణకు దూరం. కాలం మొ.నవి.
 • పరిసరాలలో దొరికే పదార్థాలతో నమూనాలను తయారుచేసి, వాటి పని విధానమును వివరిస్తారు.
 • ఉదాహరణకు స్టెతస్కోప్, ఎనిమెమీటర్, మొ||వి. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలను చర్చిస్తారు. అభినందిస్తారు.
 • అభ్యసించిన వైజ్ఞానిక భావనలను నిత్యజీవితంలో అన్వయించుకుంటారు. ఉదా: ఎసిడిటిని తగ్గించుకోవడం,
 • మృత్తిక పరీక్ష - పరిరక్షణ, ఈ మృత్తిక సంరక్షణ శాఖీయోత్పత్తి ద్వారా పెంచడం, 2-3 ఘటములను సరియైన పద్ధతిలో పరికరములో అమర్చడం, ప్రకృతి విపత్తుల సమయంలో మరియు తర్వాత తగిన చర్యలు చేపట్టడం, మురుగు నీరు శుద్ది చేసి,తిరిగి వాడుట కొరకు సరియైన పద్దతులు సూచించగలరు. పరిసరాలను పరిరక్షించుటకు తగిన కృషి చేస్తారు. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాలలో శుభ్రత,పరిశుభ్రత పాటించటం,
 • కాలుష్య కారకాలను నియంత్రించటం, మృత్తికా క్రమక్షయంను నివారించుటకు మొక్కలు నాటడం. సహజ వనరులకు అధిక మొత్తంలో వాడకం ద్వారా కలిగే పరిణామాలు పట్ల అవగాహన కల్పించటం మొ||వి. సహజ వనరుల వినియోగం విషయంలో తగిన సృజనాత్మకతను, ప్రణాళికను ప్రదర్శిస్తారు.
 • నిజాయితి, సహకారం, నిర్భయత్వం, హేతుబద్ధమైన విలువలను ప్రదర్శిస్తారు.

సాంఘికశాస్త్రం

 • వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యల గూర్చి వివరిస్తారు. వైపరీత్యాలు ఏర్పడడానికి గల కారణాలను చెబుతారు.
 • మొవులుల పరిపాలనా కాలంలో వచ్చిన సాంఘిక, రాజకీయ, ఆర్థిక మార్పుల గురించి విశ్లేషిస్తారు.
 • కాకతీయులు, మొఘలుల, విజయనగర రాజుల సైనిక వ్యూహాలు, పరిపాలన గురించి వివరిస్తారు.
 • కాకతీయులు, మొఘలులు, విజయనగర రాజుల పాలనా విధానాల భేదాలను తెలియజేస్తారు. •
 • వివిధ దేవాలయాలు, సమాధులు, మసీదుల నిర్మాణానికి అవలంబించిన వివిధ అభివృద్ధి రీతులు మరియు సాంకేతికతను గురించి వివరిస్తారు.
 • వివిధ మత ఉద్యమాల ఆవిర్భావానికి దారితీసిన కారణాలు విశ్లేషిస్తారు. "శాసనసభ ఎన్నికలు నిర్వహించు పద్ధతి గురించి వివరిస్తారు.
 • తమ స్వంత నియోజకవర్గంను రాష్ట్ర పటంలో గుర్తిస్తారు. పటాల ఉపయోగాలను వివరిస్తారు.
 • ఎత్తైన ప్రాంతాలలో - పల్లపు ప్రాంతాలలో నివసించే ప్రజల జీవన విధానంలోని వ్యత్యాసాలను పట్టికగా తయారుచేస్తారు.
 • జలచక్రాన్ని వివరిస్తారు.జలకాలుష్యంపై పోస్టర్ తయారుచేస్తారు.
 • కర్ర తెప్పల స్థానంలో మరపడవలు రావడంపై వ్యాఖ్యానిస్తారు.చేపలు పట్టేవారి జీవనస్థితిగతులపై ప్రతిస్పందిస్తారు.
 • ఐరోపాలో ప్రవహించే నదుల వివరాలు సేకరించి పట్టిక రూపొందిస్తారు.
 • ఆఫ్రికాలోని ఎడారుల గురించి వివరిస్తారు, పటంలో గుర్తిస్తారు. నైజీరియాలోని బానిస వర్తకంపై వ్యాఖ్యానిస్తారు.
 • చేనేత కార్మికులు, చేతివృత్తులవారు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తారు.
 • ఫ్యాక్టరీ కార్మికుల పని పరిస్థితుల గురించి ప్రతిస్పందిస్తారు. బాలకార్మికుల వ్యవస్థపై కరపత్రాన్ని తయారుచేస్తారు.
 • పారిశ్రామికీకరణ వల్ల ఉత్పత్తి రంగంలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తారు.
 • నాయంకర, అమరనాయక వ్యవస్థలను పోల్చుతారు. -1857 తిరుగుబాటుకు గల కారణాలను విశ్లేషిస్తారు.
 • తూర్పు ఇండియా కంపెనీ రాక బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించడం గురించి వివరిస్తారు.
 • రాష్ట్ర శాసన సభలో చట్టాలు తయారు చేసే విధానాన్ని వివరిస్తారు. ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలపై వ్యాఖ్యానిస్తారు. 0జిల్లాపాలనలో కలెక్టరు నిర్వహించే పాత్రపై విశ్లేషిస్తారు.
 • కుల వివక్షను నిర్మూలించి సమానత్వం సాధించడంపై కరపత్రం తయారుచేస్తారు. తమ గ్రామంలో గల కులవివక్షత ప్రతిస్పందిస్తారు.
 • ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల స్థితిగతులను వివరిస్తారు. కార్మికుల హక్కుల గురించి కరపత్రం తయారుచేస్తారు.
 • గ్రామదేవతలను పూజించడం గురించి వివరిస్తారు. వివిధ మతాల పూజావిధానాలు, పండుగల వివరాలు సేకరించి పట్టిక తయారుచేస్తారు.
 • కాకతీయుల, విజయనగర రాజ్యాలను భారతదేశపటంలో గుర్తిస్తారు.
 • గురునానక్ బోధనలను వివరిస్తారు.
 • ఈ దేవాలయాల కూల్చివేతపై వ్యాఖ్యానిస్తారు.

7వతరగతి

తెలుగు

 • వివిధ ప్రక్రియల్లో ఉన్నరచనలను చదివిపిల్లలు వాటి గురించి జట్లలో చర్చిస్తారు.
 • కవి/రచయిత యొక్క అభిప్రాయాలను అర్థం చేసుకొని పిల్లలు తమ అనుభవాలను జోడిస్తూ సమ్మతి, అసమ్మతిని తెలియజేస్తారు.
 • పిల్లలు తాము చూసిన దృశ్యాలను గానీ, చిత్రాలను గానీ చూసినప్పుడు తాము పొందిన అనుభూతులను తమ మాటల్లో వ్యక్తీకరించగలరు.
 • చదివిన విషయాన్ని మరింత అవగాహన చేసుకోవడానికి ప్రశ్నలు అడుగుతారు, చర్చలు జరుపుతారు.
 • సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, జానపద గేయాలు మొ. వాటిని గురించి చర్చించగలరు, వాటిని ప్రశంసించగలరు.
 • హస్తకళ/చిత్రకళ/నృత్యకళ మొ|| కళలకు సంబంధించిన, వ్యవసాయం మొ| వృత్తులకు సంబంధించిన పదాలను తెలుసుకొనుటకు ఆసక్తిని చూపుతారు, ప్రశంసిస్తారు.
 • విభిన్న స్థానిక / సామాజిక / ప్రకృతి సంబంధమైన విషయాలపై తార్కికంగా ఆలోచించి మౌఖికంగా వ్యక్తీకరిస్తారు.
 • వివిధ సున్నితమైన విషయాల గురించి (ఉదా: జాతి / ధర్మం, వర్ణం / లింగం/ ఆచార వ్యవహారాలు మొ||నవి) సహేతుకంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచగలరు.
 • పాఠ్యాంశాన్ని అక్కడక్కడ చదివి పాఠ్యాంశం ఇతివృత్తం, ఉద్దేశం, ప్రయోజనాలను గురించి చెప్పగలరు.
 • పాఠ్యాంశాన్ని లోతుగా పరిశీలించి అందులోని కీలకాంశాలను గుర్తిస్తారు.
 • పాఠ్య విషయాన్ని చదువడం, అర్థం చేసుకొనే సందర్జంలో కలిగే ఇబందిని అధిగమించడానికి తోటి విద్యార్థుల, ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటారు. అవసరమైన చోట్ల నిఘంటువు, చిత్రాలు, ఇంటర్నెటుమొ|| సామగ్రి వినియోగిస్తారు.
 • భాషలోని నూతన పదాలను ఉపయోగించి వ్యక్తీకరిస్తారు.
 • ఇతరులు వ్యక్తీకరించిన అభిప్రాయాలను, అనుభవాలను పిల్లలు తమ కోణంలో సొంతమాటల్లో చెప్పగలరు. సందర్భానుసారంగా రాయగలరు.
 • భాషకు సంబంధించిన పఠన సామగ్రి / ప్రసారమాధ్యమాల సామగ్రి అనగా రేడియో, టి.వి., వార్తాపత్రికలు, కథలు మొ||నవి. మరియు అంతర్జాలంలో (ఇంటర్నెట్) ఉన్న అంశాలు మొదలగు వాటిని అర్థం చేసుకుంటూ చదువగలరు. వాటిపై తమ అభిప్రాయాలను ఇష్టాయిష్టాలను చెప్పగలరు.
 • విద్యార్థులు తమ అనుభవాలను తమ సొంతమాటల్లో, సొంతశైలిలో రాయగలరు.
 • వివిధ రకాల ఉద్దేశాల కొరకై రాసేటప్పడు పదాలు, వాక్యాలు, జాతీయాలు, సామెతలు, విరామ | చిహ్నాలను ఇతర వ్యాకరణాంశాలను అనగా కాలాలు, క్రియలు, విశేషణం మొదలైన వాటిని సందర్భోచితంగా ఉపయోగిస్తారు.
 • గోడ పత్రిక కొరకు వివిధ రకాల సమాచారం సేకరించి రాయగలరు. వాటితో పుస్తక సంకలనాలను రూపొందిస్తారు.

గణితం

 • పూర్ణసంఖ్యలను వినియోగించగలరు.

i) సంఖ్యారేఖపై పూర్ణసంఖ్యలను గుర్తించగలరు మరియు సంఖ్యారేఖపై పూర్ణసంఖ్యలను ప్రాతినిధ్యపరచగలరు.

ii) ఏవైనా రెండు పూర్ణసంఖ్యలను పోల్చడం, కూడడం, తీసివేయడం, గుణకారం, భాగహారం చేసే సందర్భాలలో వీటిని ఉపయోగించి తగిన నియమాలను సాధారణీకరణం చేయగలరు.

iii) పూర్ణ సంఖ్యలతో చతుర్విధ ప్రక్రియలను ఉపయోగించి నిజజీవిత సందర్భాలతో కూడి ఉన్న సమస్యలు పరిష్కరించగలరు.

 • భిన్నాలు / దశాంశ భిన్నాలను వినియోగించగలరు.

i) ఏవైనా రెండు భిన్నాల గుణకారమును గూర్చి వ్యాఖ్యానించగలరు.

ఉదా: 1/2 X1/2=1/4 ఎలా అవుతుంది?

ii) భిన్నాల భాగహారం గూర్చి వ్యాఖ్యానించగలరు.

ఉదా: 1/2/1/4=2 ఎలా అవుతుంది?

iii)నిజజీవిత సందర్భాలలో భిన్నాలు, అకరణీయసంఖ్యలు మరియు దశాంశాలతో కూడి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించగలరు.

 • ఘాతాలను వినియోగించగలరు.

i) ఒక సంఖ్య యొక్క ఘాతరూపం గురించి అవగాహన చేసుకుంటారు మరియు సంఖ్యను ఘాతరూపంలో వ్యక్తపరుస్తారు.

ii)ఘాత రూపంలో ఉన్న సంఖ్యలో భూమి, ఘాతాంకములను గుర్తిస్తారు.

iii)పెద్ద సంఖ్యల గుణకారం మరియు భాగహారంనకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సులభంగా సాధించడానికి ఘాత రూపాలను వినియోగిస్తారు.

 • సమతలాకార పట వైశాల్యాలను లెక్కిస్తారు

i)ట్రెపీజియం, రాంబస్ల వైశాల్యాలను సూత్రాల సహాయంతో కనుగొనగలరు.

ii)బహుభుజి, వివిధ చతర్భుజాలలోని ప్రదేశాన్ని త్రిభుజాలుగా విభజించి వైశాల్యాన్ని కనుగొనగలరు.

iii)వృత్తం మరియు సెక్టారు వైశాల్యాల భావనలను ఉపయోగించి వాటిచే ఏర్పడు జ్యామితీయ పటాల వైశాల్యాలు కనుగొనగలరు.

 • ఘనం, దీర్ఘఘనాల ఉపరితలవైశాల్యం, ఘనపరిమాణాలను లెక్కిస్తారు.
 • పట్టికలలో ఇచ్చిన దత్తాంశంనకు సగటు, మధ్యగతం, బాహుళకంలను కనుగొనుగలరు. దత్తాంశాన్ని కమ్మీచిత్రాలలో పౌనఃపున్య వక్రాలలో మరియు "పై" చార్టులో ప్రాతినిధ్యపరచగలరు.

జీవశాస్త్రం

 • పరిశీలించదగ్గ లక్షణాలైన ఆకారం, నిర్వహించే విధులు మొనవి బట్టి పదార్థాలు, జీవుల మధ్య గల తేడాలను గుర్తిస్తారు.

ఉదా|| వృక్షకణాలు - జంతుకణాలు

అండోత్పాదక - శిశోత్పాదక జీవులు.

ఏక లింగక - ద్విలింగ పుష్పాలు

 • ధర్మాలు, నిర్మాణం, నిర్వహించే విధులను బట్టి వస్తువులను, జీవులను వర్గీకరిస్తారు.

ఉదా: ఖరీఫ్ - రబీ పంటలు

ఉపయుక్త - హానికర సూక్ష్మజీవులు

అలైంగిక - లైంగిక ప్రత్యుత్పత్తి

తరిగిపోయే - తరిగిపోని సహజవనరులు

 • సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకు చిన్న చిన్న కృత్యాలు, ప్రయోగాలు నిర్వహిస్తారు.

ఉదా: కూరగాయలు, మురబ్బాజామ్లు తయారుచేయటానికి ఎక్కువ ఉపు/చక్కెరను ఎందుకు

కలుపుతారో తెలుసుకుంటారు.

 • ప్రక్రియలకు, దృగ్విషయాలకు మధ్యగల సంబంధానికి కారణాలు గుర్తిస్తారు. ఉదా: గాలిలోని కాలుష్యకాల వల్ల ‘పొగమంచు' ఏర్పడుట, ఆమ్ల వరాల వల్ల చారిత్రాత్మక కట్టడాలు నశించి, కృషించడం.
 • ప్రక్రియలను, దృగ్విషయాలను వివరించగలరు. ఉదా: మానవులలో, జంతువులలో ప్రత్యుత్పత్తి. ఉల్లిపొర,బుగ్గకణాలు,
 • సూక్ష్మ జీవుల సైడ్లను తయారు చేస్తారు.
 • బొమ్మలు గీసి, భాగాలను గుర్తిస్తారు. ఫ్లో-చార్టులను గీస్తారు.

ఉదా: కణ నిర్మాణం. మానవుని ప్రత్యుత్పత్తి అవయవాలు.

 • నేర్చుకున్న భావనలను నిజజీవితంలో అన్వయించుకుంటారు.

ఉదా: కుళ్ళిపోయే - కుళ్ళిపోని వ్యర్థాలు, కౌమారదశకు సంబంధించిన అపోహలు.

 • శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణల గాథలను చర్చించి ప్రశంసిస్తారు. ఉదా: పెన్సిలిన్ ఆవిష్కరణ
 • పరిసరాల పరిరక్షణకు ప్రయత్నిస్తారు. ఉదా: ఎరువుల, క్రిమిసంహారకాల వినియోగాన్ని
 • నియంత్రించడం. పర్యావరణ సమస్యలను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలను సూచిస్తారు.
 • అందుబాటులోగల వనరులను వినియోగించడంలో మెళుకువతో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.

సహకారం, నిజాయితీ, భయాందోళన లేకపోవడం, వనరులు కాపాడడం వంటి విలువలను కలిగి ఉంటారు.

భౌతిక రసాయన శాస్త్రం

 • పదార్థాలకు సంబంధించిన భేదాలను చెప్పగలరు.

ఉదా: (i) సహజ, కృత్రిమ దారాలు.  (ii) స్పర్శా, క్షేత్ర బలాలు.

(iii) విద్యుత్ వాహక ద్రవాలు - విద్యుత్ బంధక ద్రవాలు

 • పదార్ధాలను ధర్మాలు, లక్షణాల ఆధారంగా వర్గీకరిస్తారు.

ఉదా: (i) లోహాలు - ఆలోహాలు.(ii) ఖగోళ వస్తువులు. (iii) తరిగిపోయే - తరిగిపోని సహజ శక్తివనరులు.

 • సందేహాల నివృత్తికి పరికల్పనలు చేసి సరిచూచుటకు ప్రయోగాలు నిర్వహిస్తారు.

ఉదా: (i) దహన చర్య జరుపుటకు కావలసిన పరిస్థితులు.

 • ప్రక్రియలను, దృగ్విషయాలను సరైన కారణాలతో వివరిస్తారు

ఉదా: (i) కాంతి పరావర్తనం. (ii) పెట్రోలియం ఉత్పత్తులు - వేరు చేయడం.

 • ప్రక్రియలను, దృగ్విషయాలను వివరిస్తారు.

ఉదా: (i) ధ్వని ఉత్పత్తి - ప్రసరణ. (ii) విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన మార్పు (iii) జ్వాల యొక్క ఆకారం.

 • రసాయన చర్యలకు పద సమీకరణాలు వ్రాస్తారు. ఉదా:

(i) లోహాలు - అలోహాలు, గాలి, నీరు మరియు ఆమ్లాలతో చర్యలు.

 • పతన కోణం, పరావర్తన కోణాలను కొలుస్తారు.
 • పటాలు గీచి భాగాలు గుర్తించుట - ఫ్లోచారు తయారు చేయుట

ఉదా: (i) కిరణ చిత్రాలు. (ii) ప్రయోగాల,పరికరాల అమరికలు,

 • తన చుట్టూ గల పరిసరాలలో అందుబాటులో గల పదార్థాల నుండి నమూనాలను తయారు చేస్తారు.

ఉదా: (i)జల తరంగిణి. (ii)సితారా. (iii) విద్యుత్ దర్శిని. (iv) అగ్నిమాపకయంత్రము.

 • శాస్త్రీయ భావనలను నిజజీవితంలో వినియోగిస్తారు.

ఉదా: (i) జీవ విచ్చిన్నం చెందేవి - జీవ విచ్చిన్నం చెందని వాటిని వేరుపరచి వర్గీకరిస్తారు.

(ii) ఘర్షణను పెంచుట - తగ్గించుట.

 • శాస్త్రీయ ఆవిష్కరణలకు సంబంధించిన విషయాలను, కథలను చర్చించి అభినందిస్తారు.
 • పర్యావరణాన్ని పరీక్షించుటకు కృషిచేయుట

ఉదా: (i) ప్లాస్టిక్ వంటి వనరులను చట్టప్రకారంగా వినియోగిస్తారు.

(ii) ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి తగు సూచనలు చేస్తారు.

 • అందుబాటులోగల వనరులను వినియోగించడంలో మెళుకువతో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.
 • సహకారం, నిజాయితీ, భయాందోళన లేకపోవడం, వనరులు కాపాడడం వంటి విలువలను కలిగి ఉంటారు.

సాంఘికశాస్త్రం

 • ఈ పటాలలోని రకాలను వర్గీకరిస్తారు.
 • ఉష్ణోగ్రత విస్తరణకు కారణాలు వివరిస్తారు.
 • సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కరపత్రం తయారుచేస్తారు.
 • భూ పరిభ్రమణానికి - కాలాలు ఏర్పడడానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తారు.
 • అంతరించి పోతున్న ఖనిజాల గురించి వ్యాఖ్యానిస్తారు.
 • అడవుల నరికివేతకు సంబంధించిన సమాచారాన్ని పత్రికల నుండి సేకరించి, విశ్లేషిస్తారు.
 • ప్రపంచ పటంలో ధృవ ప్రాంతాలను గుర్తిస్తారు.
 • బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను, సాంకేతికతను విశ్లేషిస్తారు.
 • క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల ఆహార ధాన్యాలలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యానిస్తారు.
 • జమీందారీ విధానంలో సాధారణ రైతులు ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తారు.
 • దేశవిభజనకు దారితీసిన పరిస్థితులను వివరిస్తారు.
 • స్వాతంత్రోద్యమంలో జాతీయ ఉద్యమ నాయకుల కృషిని వివరిస్తారు.జాతీయ నాయకుల, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్ననాయకుల చిత్రాలను సేకరిస్తారు.
 • జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి వ్యాఖ్యానిస్తారు.
 • నిజాం వ్యతిరేక ఉద్యమాల గురించి వివరిస్తారు.
 • భారతరాజ్యాంగంలోని ప్రవేశికలో గల హామీలు, ఆశయాల గురించి విశ్లేషిస్తారు.
 • లోక్ సభ - రాజ్యసభ అధికారాలు, నిర్మాణం లో గల తేడాలను తెల్పుతారు.
 • ఎఫ్.ఐ.ఆర్, (తొలి సమాచార నివేదిక) ప్రాధాన్యతను అర్థం చేసుకుంటారు. నమూనాను రూపొందించి ప్రదర్శిస్తారు.
 • సివిల్, క్రిమినల్ కేసుల మధ్యగల భేదాలను చెబుతారు.
 • పేదరికానికి గల కారణాలు తెల్పుతారు.
 • జీవించే హక్కు కోసం పోరాటంపై వ్యాఖ్యానిస్తారు.
 • చౌకధర దుకాణాలు పనిచేసే తీరుపై సమగ్రంగా విశ్లేషిస్తారు.
 • సంఘసంస్కర్తలు మూఢనమ్మకాలను రూపుమాపడానికి చేసిన కృషిని వివరిస్తారు.
 • లౌకికవాద భావన గురించి విశ్లేషిస్తారు.
 • ఆధునిక కాలంలో అనేక కళలు అంతరించి పోవడానికి గల కారణాలను వివరిస్తారు. సినిమా రంగం సమాజంపై చూపుతున్న ప్రభావాన్నివివరిస్తారు.
 • ప్రకృతి వైపరిత్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలియజేస్తారు.
 • ప్రపంచ పటములో క్రికెట్ ఆడే ముఖ్య దేశాలను గుర్తిస్తారు.
 • తెలంగాణలో గల కళలు, కళారూపాల పట్టికను తయారుచేస్తారు.
 • బాల్య వివాహాలు, సాంఘిక సంస్కరణలు, కులము, మహిళల సమస్యలపై విశ్లేషిస్తారు.
 • జాతీయోద్యమం జరిగిన ముఖ్యప్రాంతాలను భారతదేశపటంలో గుర్తిస్తారు.
 • భారతదేశంలో లోక్ సభ ఎన్నిక ప్రక్రియను వివరిస్తారు.

8వతరగతి

తెలుగు

 • వివిధ ప్రక్రియల్లో ఉన్న వివిధ విషయాలను చదివి వాటిని గురించి చర్చించగలరు.
 • భాషకు సంబంధించి వివిధ రకాల పఠన సామగ్రి ఉదా: వార్తాపత్రికలు, లేఖలు, మ్యాగజైన్లు, కథలు, విషయానికి సంబంధించిన ఇతర సామగ్రి (అంతర్జాలం) మొదలగు వాటిలోని విషయాలను చదివి అర్థం చేసుకుంటారు మరియు మౌఖికంగా, రాత పూర్వకంగా తమ ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను, వ్యాఖ్యానాలను, వ్యక్తీకరిస్తారు. అందుకొరకు ప్రశ్నిస్తారు, కీలకాంశాలను గుర్తిస్తారు.
 • స్థానిక గీతాలను, లోకోక్తులను మొ|| వాటిగురించి చెప్పగలుగుతారు.
 • ఆయా విషయాన్ని చదివి నూతన సంఘటనలను ఊహించగలరు. ఆ సందర్భంగా తమ మనస్సులో ఏర్పడిన భావాలను తెలుపగలరు, వాటిని రాయగలరు.
 • వివిధ సున్నితమైన విషయాల గురించి (ఉదా: జాతి/ధర్మం/వర్ణం/లింగం/ ఆచార వ్యవహారాలు మొ||నవి) సహేతకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచగలరు.
 • వివిధ రకాల రచనలు చదివి వాటిలోని సామాజిక విలువలపై చర్చించగలరు. వాటికి కారణాలు అన్వేషిస్తారు. ఇరుగుపొరుగు వారి జీవన విధాననాలను అర్ధం చేసుకుంటారు, పరీశీలించగలరు, ప్రశ్నించగలరు.
 • వివిధ పఠన సామగ్రిలో ప్రయోగించబడిన జాతీయాలు, సామెతలు, లోకోక్తులు, నూతన పదాలను అర్థం చేసుకొని వాటిని ప్రశంసిస్తారు.
 • కథలు, కవితలు మొ|| చదివి (వివిధ రూపాల్లో ఉన్న వాటిని) రచనా భేదాలను, శైలిని గుర్తిస్తారు. వాటిని ప్రశంసిస్తారు. తనస్థాయికి తగినట్లుగా వాటిని వ్యక్తపరుస్తారు.
 • పాఠ్యవిషయాలన్ని చదివి అర్థం చేసుకోవడంలో కలిగే ఇబ్బందిని అధిగమించడానికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో నిఘంటువు, చిత్రాలు, ఇంటర్నెట్ మొ||నవి వాటిని వియోగిస్తారు.
 • తమ రచన యొక్క ఉద్దేశ్యాన్ని, రచనను చదివే పాఠకులను దృష్టిలో ఉంచుకొని తాము చెప్పదలచుకొన్న అంశాన్ని ప్రభావవంతంగా రాతపూర్వకంగా వ్యక్తపరుస్తారు.
 • తెలుగు భాషలోని వాక్యనిర్మాణాన్ని అర్థం చేసుకొని రాస్తారు. పద్యం / కవిత / గేయం మొ| రచనల్లోని ఉండే శైలిని అర్థంచేసుకుంటారు.
 • వివిధ సందర్భాల్లో ఇతరులు వ్యక్తపరచిన విషయాలను సొంతంగా రాస్తారు. ఉదా: బడిలో జరిగిన కార్యక్రమాలపై నివేదిక రాయడం, తమ గ్రామంలోని రైతులతో/ వృత్తి పనివారితో/ చిన్న చిన్న దుకాణదారులతో మాట్లాడిన విషయాలను తమసొంత భాషలో తమదైన శైలిలో రాస్తారు.
 • తమ అనుభవాలను సొంతమాటల్లో, సొంతశైలిలో రాస్తారు. అవసరమైన సందర్భాల్లో వివిధ వ్యవహార రూపాల్లో రాస్తారు. ఉదా: కథ/కవిత/ లేఖ/వ్యాసం/సంభాణ మొ||నవి.
 • హస్తకళ | వాస్తు కళ | నృత్యకళ మొ|| కళలకు సంబంధించిన మరియు వ్యవసాయం మొ||న వృత్తులను సంబంధించిన పదాలను తెలుసుకొని వాటిని ఉపయోగించి రాస్తారు.

గణితం

 • సంఖ్యలను వినియోగించగలరు.

(i)అకరణీయ సంఖ్యల కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారాలలోని ధర్మాలను క్రమాల ఆధారంగా సాధారణీకరించగలరు.

(ii) ఇచ్చిన అకరణీయ సంఖ్యల మధ్య కావలసినన్ని అకరణీయ సంఖ్యలను (సరాసరి కనుగొను పద్ధతి మరియు సమాన భిన్నాలు కనుగొను పద్దతిలో) కనుగొనగలరు.

(iii)ఒక భిన్నాన్ని సాధ్యమైనప్పుడు అంతంకాని ఆవర్తన దశాంశంగా రాయగలరు మరియు సూక్ష్మరూపంలో / కనిష్టరూపంలో తెలుపగలరు.

(iv) అంతంకాని ఆవర్తన దశాంశాన్ని ఒక భిన్నంగా మరియు దాని కనిష్ట రూపంలో తెలుపగలరు.

 • 2, 3, 4, 5, 6, 9 మరియు 11 ల భాజనీయతా సూత్రాలను బీజీయ పద్ధతిలో నిరూపించగలరు మరియు పజిల్స్ పరిష్కరించే సందర్భంలో ఇంకా నిత్యజీవిత సమస్యల సాధనలో వినియోగించగలరు.
 • నిజజీవిత సమస్యలను ఘాతాంకాలను వినియోగించి పరిష్కరించగలరు. వివిధ పద్ధతులలో వర్గములు, ఘనాలు, వర్గమూలాలు,ఘనమూలాలు కనుగొనగలరు.
 • లాభనష్టాలు, డిస్కౌంట్, వ్యాట్, బారువడ్డీ, చక్రవడ్డీలలో సమస్య సాధనలలో శాతమును ఉపయోగించగలరు. అదే విధంగా నిష్పత్తులు,అనులోమ విలోమానుపాతములకు సంబంధించిన సమస్యలు సాధించగలరు.
 • బీజగణితంలోని ప్రాథమిక భావనలను గూర్చి తెలుసుకుంటారు.

(i)గణితపరమైన గుర్తులు, చిహ్నాలు మరియు చరరాశులను ఉపయోగించి వాక్యరూపంలో ఉన్న దానిని గణిత భాషలో బీజీయ సమాసంగా వ్యక్తపరచగలరు.

(ii) గరిష్టంగా 3 పదాలు కలిగిన బీజీయ సమాసాలను కూడిక, తీసివేత, గుణకారం చేయగలరు, రెండు బీజీయ పదాల గసా.భాను కనుగొనగలరు.

(iii) బీజీయ న్యాయాలు ఉపయోగించి పజిల్స్ మరియు నిత్యజీవిత సమస్యలను పరిష్కరించగలరు.

 • సరూప పటాలను గుర్తించగలరు, అనురూప భాగాల నిష్పత్తిని లెక్కించగలరు.
 • జ్యామితీయ భావనలను అన్వేశించి అవగాహన పరుచుచుంటారు.

(i) ఇచ్చిన కొలతలతో {SSSA, SSSD, SSSDD, SASSAA, SASAS ఇక్కడ S= భుజం, A = కోణం, D= కర్ణం}  చతుర్భుజాన్ని నిర్మించగలరు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate