బీహార్లో ఇ-గవర్నెన్స్ ఆన్ లైన్ ద్వారా ఇబ్బందుల / ఫిర్యాదుల నమోదు ఆన్లైన్ ద్వారా ఇబ్బందిపడిన /వ్యథపడిన విషయాల నివారణకు సమర్పించే దరఖాస్తును పంపించవచ్చు. మీ పిర్యాదును పంపించుటకు ఇక్కడ క్లిక్ చేయండి ఎలక్ట్రానిక్ గెజిట్ (గెజిట్-ప్రభుత్వ పత్రిక-రాజపత్రం-వ్యవహారంలో ఉన్న వార్తలను నియత కాలాలలో ప్రచురించే పత్రిక) ప్రభుత్వోద్యోగుల గురించి, దివాలా తీయబడిన వారి గురించి, పౌర సంబంధాల విషయాలను ప్రకటించే సూచిక) గెజిట్ లో ఉన్న సమాచారాన్ని అందించడం. పిడిఎఫ్(ఒక కంప్యూటర్ నుండి వేరొక దానికి సులభంగా పంపగలిగే రచన) రూపంలో ఉన్న గెజిట్ రచనను సులభంగా డౌన్ లోడ్ (డౌన్ లోడ్- ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఉన్న కంప్యూటర్ నుంచి ఒక ఫైల్ ని ఇంకో కంప్యూటర్ లోనికి కాపీ)చేయడం. హిందీ, ఇంగ్లీష్ భాషలలో గెజిట్ లు అందుబాటులో ఉన్నాయి. కావలసిన సంఖ్యను టైపు చేసి గెజిట్ లో వెదకాలి. గెజిట్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి వెబ్ సైట్ డైరెక్టరి ( వెబ్ అంటే ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉండే సమాచార సముదాయం- సమాచారమును ఇచ్చిపుచ్చుకునే పద్ధతులలో ఇది ఒకటి. డైరెక్టరి- సమాచార గ్రంధం.) శ్రేణీ వారీగా భిన్నమైన సంస్థల జాబితా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో గల విభాగాలు, శాసన, న్యాయ, కార్యనిర్వాహక శాఖలు, బీహారులో గల జిల్లాలు, పాఠశాలలు, కళాశాలల సమాచారం శ్రేణుల వారీగా సమాచార గ్రంధంలో ఉంటుంది. వెబ్ డైరెక్టరి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి ఆన్లైన్ ద్వారా ఓటర్ల జాబితాలోనమోదు కొత్తగా నమోదయ్యే ఓటర్లను ఆన్ లైన్ ద్వారా ఓటర్ల జాబితాలో నమోదు చేయడం. మీ నమోదు స్థితిని తెలుసుకోవచ్చు. మీరు నమోదు చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి ప్రభుత్వ టెండర్ (టెండర్- కొన్ని నిబంధనలకు కట్టుబడి ఒక పనిని పూర్తి చేసి ఇచ్చుటకు లిఖిత పూర్వకమైన ఒప్పుదల) రాష్ట్ర ప్రభుత్వంలోని విభిన్న శాఖల టెండర్ ప్రకటనలుంటాయి. మెయిల్ ద్వారా టెండర్ ప్రకటనకు నమోదు చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది.(మెయిల్- సందేశాలను త్వరితంగా ఒక కంప్యూటర్ నుండివేరొక కంప్యూటర్కు పంపుటకు ఉపయోగించేఒక విధమైన సందేశపద్ధతియే ఎలక్ట్రానిక్ మెయిల్). టెండర్ ప్రకటనను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు