অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

టమాట

టమాట

ఆంధ్రప్రదేశ్లో టమాట షుమారుగా 74,108 హెక్టార్లలో సాగుచేయబడుతూ 1408,052 టన్నుల దిగుబడి నిస్తుంది.

వాతావరణం

టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలమైంది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి తట్టుకోలేదు.

నేలలు

బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్బాధార పంటగా కూడా సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగుచేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు.

నాటే సమయం

వర్షాకాలంలో జూన్-జూలైలో శీతాకాలంలో అక్టోబర్-నవంబర్లో, వేసవిలో జనవరి-ఫిబ్రవరిలో నాటుకోవచ్చు.

రకాల వివరాలు

రకం

పంటకాలం

గుణగణాలు

దిగుబడి(/)

పుసారుబీ

130-135

పండ్ల పరిమాణం మధ్యస్ధంగా వుండి లోతైన గాళ్ళు కల్గివుంటాయి.

12

పూసా ఏర్టిడ్వార్ఫ్

120-130

పండ్ల పరిమాణం పుసారుబీ కన్న పెద్దగా వుండి తేలిక పాటి ఎరుపు రంగు కల్గి ఉంటుంది. వర్షాకాలం మరియు వేసవిలో ముందుగా నాటుకోనెందుకు అనుకూలం.

12

మారుతమ్

135-140

పండ్లు గుండ్రంగా, మధ్యస్ధగా వుంటాయి. వేసవి కాలానికి అంకులాం.

12-14

అర్క మేషులి

130

వర్షాధార పంటగా వేయటానికి అనుకూలం.

7-8

అర్క

105-110

పండ్ల పరిమాణం పెద్దగా. గుండ్రంగా (70 గ్రా.) ఉంటుంది. ప్రాసెసింగ్ కు మరియు కాయగూరగా అనుకూలం.

14

అర్క వికాస్

105-110

పండ్ల పరిమాణం పెద్దగా (80-85 గ్రా.) గుండ్రంగా చడుసుగా ఉంటుంది. తాజా కాయగూరగా వాడుటకు అనుకూలం. వేసవి పంటకు అనుకూలం.

14.5-16

రకాలు - అనుకూలత

వర్షాధార పంటకు: తొలకరి ఖరీఫ్లో వేసుకోడానికి అర్కమేఘాలి, పూసా ఎర్లీడ్వార్స్, అలాగే ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోడానికి పూసారూబీ, అర్మవికాస్ రకాలు అనుకూలం.

శీతాకాలానికి: పూసారూబీ, పూసా ఎర్లీడ్వార్స్, అర్మవికాస్, అర్మసారఖ్,

వేసవి పంటకు: మారుతమ్, పికెయమ్-1, అర్మవికాస్, అర్మసారఖ్,

సంకరజాతి రకాలు: వైశాలి,రూపాలి, రష్మి, నవీన్, మంగళ, అవినాష్-2, బిఎస్ఎస్-2, రజనీ, అన్నపూర్ణ ఎమ్.టి.హెచ్. 1, 2, 6.

ప్రాసెసింగ్కి అనుకూలమైన రకాలు: హైబ్రిడ్ రకాలు సలాడ్కు మరియు ప్రాసెసింగ్కు అనుకూలం.

నిల్వకి: (సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 8-10 రోజుల వరకు, శీతల గిడ్డంగుల్లో 30 రోజుల వరకు నిల్వ ఉండే రకాలు) అర్మవికాస్, అర్మసారఖ్ మరియు ఇతర హైబ్రిడ్ రకాలు.

నేల తయారి: 3-4 సార్లు దున్ని చదును చేయాలి. వరాకాలం పంటకు 60 సెం.మీ. దూరంలో బోదెలు చేసుకోవాలి. ఇతర ఋతువుల్లో 4X5 చ.మీ. గల మళ్ళను తయారుచేసుకోవాలి.

విత్తన మోతాదు : ఎకరాకు సూటి రకాలకు 200 గ్రా., సంకరజాతి రకాలకు 60-80 గ్రా, విత్తనం కావాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా, ధైరమ్తో లేదా 3 గ్రా. మెటలాక్సిల్తో, 2 గంటల తర్వాత 4 గ్రా, టైకోడెర్మా కల్చర్తోను విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో రసంపీల్చు పరుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా/ కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత శిలీంద్ర నాశనులతో విత్తనశుద్ధి చేయాలి.

నారుపోయటం : ఎకరం పొలంలో నాటడానికి 1X4 చ.మీ. విస్తీర్ణం గల, 6" ఎత్తైన 8 నుండి 10 నారుమళ్ళు తయారు చేయాలి. నారుకుళ్ళ తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీ. నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5% బోర్లో మిశ్రమంతో నారుమళ్ళను శుద్ధి చేయాలి (100 లీ. మందు ద్రావణం 40 చ.మీ. నారుమడికి) విత్తే ముందు విత్తనాలను 60" సెల్సియస్ వేడి నీటిలో 5-10 ని|ల సేపు వుంచి తీయాలి. నారుమడిలో 10 సెం.మీ. ఎడంతో వరుసల్లో 1-1.5 సెం.మీ. లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్తో నీటిని చల్లి పాలిథీన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమళ్ళను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7-10 రోజులకు) మల్చింగ్గా వేసిన వరిగడ్డి లేదా పాలిథీన్ షీట్ తీసివేయాలి. 2-3 వారాల వయసులో నారుకుళ్ళ తెగులు రాకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ (2.5 గ్రా/లీ)తో పిచికారీ చేయాలి. 3 వారాల వయసుగల నారుమడికి రసంపీల్చే పరుగుల నుండి నివారణకు కార్బోఫ్యురాన్ 3 జి. గుళికలు 40 చ.మీ. నారుమడికి 100 గ్రా. చొప్పన వేసి నీటి తడి ఇవ్వాలి. నారుమడిని పీకడానికి 2-3 రోజులకు ముందుగా లీటరు నీటికి 2 మి.లీ. రోగార్+1 గ్రా. బావిస్టిన్ను కలిపి నారుమడిపై పిచికారి చేయాలి. నారుమడిలో మొక్కలు ధృడపడటానికి గింజ విత్తిన 20-30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాలి. 25-30 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురునారును నాటరాదు.

నాటటం : వర్షాకాలంలో 60X45 సెం.మీ. శీతాకాలంలో 60x60 సెం.మీ., వేసవిలో 45X30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పడు ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్ఫేట్) మరియు 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమపాళ్ళగా చేసి, నాటిన 30, 45 మరియు 60వ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారి చేస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. నాటేముందు ఎకరాకు 8-12 కిలోల చొuన బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా వుంటాయి. ఎకరానికి 10 కిలోల చొuన జింకు సల్ఫేట్ వేసినట్లయితే జింకు లోపం రాకుండా వుంటుంది. నాటిన తర్వాత 30, 45 రోజులకు లీ. నీటికి 5 గ్రా. జింకుసల్ఫేట్ను కలిపి పిచికారి చేసినట్లయితే 20% దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మి.గ్రా, 2, 4-డి మందును 200 లీటర్ల నీటకి కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్ 4.5 లీ/నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేస్తే పూత, పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.

కలుపు నివారణ, అంతరకృషి : కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25 లీ. లేదా అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.25 లీ. (బరువు నేలలు) లేదా మెట్రిబుజిన్ 300 గ్రా, చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేయాలి. మెట్రిబుజిన్ అనే మందును అదే మోతాదులో నాటిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30, 35 రోజులప్పడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పొలంలో కలుపు లేకుండా, మొదటి నాలుగు వారాల్లో అంతరకృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.

పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా ఊతం కర్రలను పాతాలి. ఊతం నివ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి, అంతేకాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. వేసవి టమాట పంటకు ప్రతి 2-3 వరుసల టమాటాకు రెండు వరుసల మొక్కజొన్న పంటను ఉత్తర దక్షిణ దిశలో విత్తుకోవాలి.

నీటి యాజమాన్యం : భూమిలో తేమనుబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరుకట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం వుంటుంది.

సస్యరక్షణ పరుగులు

కాయతొలుచు పరుగు : లేత ఆకులను, కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎరపంటగా బంతిని వేసుకోవాలి. (ఒక వరుస బంతి మొక్కలు ప్రతి 16 వరుసలకు) టమాటా కంటే బంతినారును 20 రోజుల ముందుగా నాటుకోవాలి. టైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొuన విడుదల చేయాలి. ఎకరాకు 4 చొuన లింగాకర్షణ బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు ఎండోసల్బాన్ 2 మి.లీ. లీ. నీటికి చొప్పన కలిపి పిచికారిచేయాలి. యన్.పి.వి. వైరస్ ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఎకరానికి 20 చొప్పన పక్షి స్థావరాలను వుంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహారక మందులను పిచికారి చేయుటకు ముందు కాయలను కోయాలి.

పచ్చదోమ : ఆకుల అడుగుభాగం నుండి రసాన్ని పీల్చటం వలన, ఆకలు చివర్లు పసుపుపచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిధోయేట్ లేదా మిధైల్ డెమటాన్ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రబ్బరు పరుగు : కాయతొలుచు పరుగువలెనే పంటను నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాలి. (10 కి తవుడు + 1 లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బరిల్ 50 శాతం పొడి మందు + 1 కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి పులియ పెట్టినది). ఈ పురుగు నివారణకు కాయతొలుచు పరుగుకు చెప్పబడిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి.

తెగుళ్ళ

నారుకుళ్ళ తెగులు : ఈ తెగులు ఆశించడం వలన, నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రా, ధైరం లేదా మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాలి.

ఆకుమాడు తెగులు (ఎర్లీబైట్) : ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి, క్రమేణా తకులు మాడి, ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పడయినా ఆశించవచ్చు. తేమ ಹಿನ್ನಿ చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ సీజనులో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3 గ్రా. కాప్లాన్ లేదా మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 3 లేక 4 సార్లు పిచికారి చేయాలి.

వడలు తెగలు (బాక్టీరియల్ విల్డ్) : మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకుమారి, తొడిమతో సహా రాలి, తర్వాత మొక్క వడలిపోయి, చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులును తట్టుకునే బిటి-1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి.

వైరస్ తెగులు (టొబాకో మోజాయిక్) : తెగులు సోకిన మొక్కల ఆకుల మీద, అక్కడక్కడ పసుపుపచ్చ మచ్చలు ఏర్పడి, ఆకులు ముడుచుకొని, మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పరుగుల (పేనుబంక) నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారి చేసుకోవాలి.

టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ : టమాట చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి. మొక్కలు గిడసబారి, పూత పిందె పట్టక ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్-డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రా, మరియు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్చోప్యురాన్ 3 జి. గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు.

టమాటాలో సమగ్ర సస్యరక్షణ

  • ఫ్రెంచి చిక్కుడు (బిన్నీస్) పంటతో పంటమార్పిడి చేస్తే బాక్టీరియా ఎండు తెగులు కొంత వరకు తగ్గుతుంది.
  • ఆవాలు, బంతి మరియు ధాన్యపు పంటలతో పంటమార్పిడి చేయడంవల్ల నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది.
  • కిలో విత్తనానికి, ముందుగా 3 గ్రా, ధైరం ఆ తర్వాత 4 గ్రా.ల టైకోడెర్మా కల్చర్తో విత్తనశుద్ధి చేయాలి.
  • వేసవిలో దుక్కలు లోతుగా దున్నడంవల్ల నేలలో వున్న నిద్రావస్థ దశలోని పురుగులు నివారింపబడతాయి.
  • టైకోడెర్మా కల్బర్ను (ఒక క్రిలో కల్చర్ను 10 కిలోల వేపపిండి + 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి) దుక్మిలో వేసుకోవాలి.
  • పొలం చుటూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డుపంటగా వేయడంవల్ల రసం పీల్చుపురుగుల ఉధృతి తగ్గి ట్రూమాంట్రోలో ఆకు ఎండుతెగులు/వైరస్ తెగులు కొంత వరకు తగ్గుతుంది.
  • పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గ్రుడ్ల సముదాయాలను, అప్పడే పొదగబడిన పిల్ల పరుగులను ఏరి నాశనం చేయాలి.
  • పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పన పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం/గ్రీజ్ పూసి పెట్టాలి. తెల్లదోమలు వీటికి ఆకర్షింపబడి అతుక్కుంటాయి.
  • ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి శనగపచ్చపురుగు మరియు రబ్బరు పరుగుల యొక్క ఉనికిని గమనించాలి.
  • ఎరపంటగా బంతి మొక్కలను 1:16 నిష్పత్తిలో (ఒక బంతి వరుసకు 16 టొమాటో వరుసలు చొ.న) వేసుకోవాలి. 45 రోజుల బంతి నారును 25 రోజుల టోమాటో నారును దీనికోసం నాటుకోవాలి.
  • పూత దశకు ముందుగా ఎకరాకు 20,000 చొప్పన టైకోగ్రామా బదనికలను వారానికి ఒకసారి చొప్పన 6 వారాలు విడుదల చేయాలి.
  • 250 లార్వాలకు సమనమైన వైరస్ ద్రావణాన్ని (పొగాకు లద్దె పురుగుకు యస్.ఎన్.పి.వి., శనగ పచ్చ పురుగుకు హెచ్.ఎస్.పి.వి.) రెండుసార్లు 10 రోజుల వ్యవధితో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. ఆశించిన పురుగును నిర్ణయించి తగిన వైరస్ను ఎంపిక చేసుకోవాలి.
  • పొలంలో ఎకరానికి 20 చొ.న పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి.
  • మొక్కపెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత వరకు 5 శాతం వేప గింజల కషాయాన్ని (5 కిలోల వేపగింజల పప్పు 100 లీటర్ల నీటిలో) 15 రోజుల తేడాతో పిచికారి చేయాలి.
  • బాక్టీరియా ఎండుతెగులు ఉన్న చోట్ల ఎకరాకు 6 కిలోల చొప్పన బ్లీచింగ్ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేయాలి.
  • బాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును 100 పి.పి.యమ్. (100 మి.గ్రా. లీటరు నీటికి) సైప్లాసైక్లిన్ ద్రావణంలో మంచి నాటాలి.
  • ఎండో సల్ఫాన్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పన పూత సమయం నుండి పిచికారి చేయాలి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate