నీటి పారుదల నదులు, కాలువలు - నీటి సామర్ధ్యం గోదావరి( 127.80 టీఎంసీలు): గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది. జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు గోదావరి ఆనకట్ట ద్వారా నీటిని మళ్లిస్తారు. గోదావరి జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గౌతమి, వశిష్టగా విడిపోతుంది. ఏలేరు (29.28 టీఎంసీ): ఏలేరు నదిపై ఏలేశ్వరం వద్ద ఏలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏలేరు నదిలో ఏడాదికి సుమారు 24 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ నది ఆధారంగా సుమారు 54 వేల ఎకరాలు సాగు జరుగుతోంది. తాండవ (3.91 టీఎంసీ): తాండవ నదిపై విశాఖపట్నం జిల్లా జీకే గూడెం వద్ద తాండవ జలాశయాన్ని నిర్మించారు. తాండవ నది జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు సాగునీరు అందిస్తుంది. 17 వేల ఎకరాల సాగు జరుగుతోంది. పంపా (3.42 టీఎంసీ): అన్నవరం వద్ద పంపా నదిపై పంపా జలాశయాన్ని నిర్మించారు. 12 వేల ఎకరాలకు దీని ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. ఇవికాక బురదకాల్వ (9.04 టీఎంసీ), సీతపల్లివాగు (4.65 టీఎంసీ),సుద్దగెడ్డవాగు (2.10 టీఎంసీ), పాములేరు (5.50 టీఎంసీ) మొత్తం 185.70 టీఎంసీల నీరు జిల్లాకు పై నదులు, కాల్వల ద్వారా లభిస్తోంది. మేజర్ ఇరిగేషన్ 4,83,199 ఎకరాలకు (గోదావరి తూర్పు, మధ్య డెల్టా (ప్రాంతాలకు) సరిపడే నీరు సర్ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ యేలేరు ఇరిగేషన్ సిస్టమ్: యేలేరు రిజర్వాయర్ వల్ల 53,017 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు: పంపా రిజర్వాయర్ (అన్నవరం) - దీని ద్వారా 12,005 ఎకరాలకు నీరు అందుతోంది. మద్దిగడ్డ రిజర్వాయర్:దీని ద్వారా 2,700 ఎకరాలకు సాగునీరు అందుతోంది. సుబ్బారెడ్డి సాగర్ - దీని ద్వారా 9,364 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ - దీని ద్వారా 13,758 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తారక రామవరపు ఆవ ఎల్ఐ స్కీం - దీని ద్వారా 9,785 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది. చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు: ఎం.ఐ. చెరువులు 249. వీటి ద్వారా 57,295 ఎకరాలకు ఆయకట్ట ధారాకాల్వ రిజర్వాయర్: ఇది మొత్తం 4,938 ఎకరాల ఆయకట్టకు నీరు అందిస్తుంది. వెంకటనగరం పంపింగ్ స్కీం: దీని ద్వారా మొత్తం 4,250 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది. ఆధారము: ఈనాడు ప్రధాన పంటలు మిశ్రమ నేలలు... విభిన్న పంటలు ధాన్యాగారంగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లాలో వరితోపాటు అనేక రకాల పంటలు సాగవుతుంటాయి. ఇక్కడ నల్లరేగడి, ఇసుక, ఎర్రనేలలు తదితర చాలా రకాల సాగునేలలు ఉన్నాయి. నేలరకం, నీటి సౌలభ్యాన్ని బట్టీ పంటల సాగు జరుగుతుంది. జిల్లాలో వరి తర్వాత చెరకు, అపరాలు, పత్తి, మొక్కజొన్న, ఆయిల్ఫామ్ పంటలు కూడా అధికంగా సాగవుతున్నాయి. జిల్లాలో పంటల రకాలు వరి దక్షిణభారత ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట ప్రధానమైనది. ఇక్కడ 4.50 లక్షల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. గోదావరి డెల్టాలో ఇది సుమారు 40 శాతం. ఇక్కడ ఖరీఫ్, రబీల్లో వరిని ప్రధాన పంటగా సాగుచేస్తారు. ప్రతీ పంటకూ కోట్ల విలువైన పంట దిగుబడి వస్తోంది. కోనసీమలో ప్రధానంగా సాగుచేస్తున్న వరి పంటకు గోదావరి నీరే ఆధారం. ధవళేశ్వరం వద్ద గోదావరి పాయలుగా వీడి కోనసీమలో గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలలో ఈ పంటను సాగుచేస్తున్నారు. కొబ్బరి జిల్లాలో సుమారు 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తోంది. ముఖ్యంగా ఈ పంట కోనసీమలో కేంద్రీకృతమై ఉంది. సుమారు 70లక్షల కొబ్బరి చెట్లు ఇక్కడ ఉన్నాయి. తోటలతో పాటు చేలగట్ల మీద కూడా కొబ్బరిచెట్లను ఎక్కువగానే పెంచుతున్నారు. కొబ్బరి పంటపై పరిశోధన చేసేందుకు గాను ఇక్కడ కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ పండిన కొబ్బరి దేశంలోని నలుమూలలకూ ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అరటి గోదావరి పాయలుగా విడిపోయిన చోట నుంచి నదీ పాయల్లోనూ, లంకల్లోనూ, నది ఏటిగట్ల కింద అరటి పంట విరివిగా సాగవుతోంది. అరటి పంటకు కూడా కోనసీమ ప్రాంతమే ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని మిగతా ప్రాంతాలకు వచ్చేసరికి మెట్టలో ముఖ్యంగా కోటనందూరు మండలంలో అరటి పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో 15వేల ఎకరాల వరకూ సాగుచేస్తున్నారు. ఏటా రూ.500ల కోట్ల విలువైన అరటి పంట పండుతోది. జిల్లాలోని రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ ద్వారా ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ ఆసియాలోనే పెద్దదిగా పేరుగాంచింది. కోనసీమలో పండిన అరటి పంటను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. చెరకుసాగుపైనా మక్కువే జిల్లాలోని దాదాపు 35 వేల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. వీటి ద్వారా వచ్చే దిగుబడితో నాలుగు చక్కెర పరిశ్రమల్లో చక్కెర తయారవుతోంది. అయితే ఈ దిగుబడిలో పది శాతంతో మాత్రం రైతులే స్వయంగా బెల్లం తయారు చేస్తుంటారు. కిర్లంపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఈ ప్రక్రియ అధికంగా సాగుతోంది. ప్రస్తుతం టన్నుకి సుమారు రెండు వేల వరకు ధర పలుకుతోంది. అయితే నిర్వహణా వ్యయం అధికంగా ఉండడంతోపాటు దీర్ఘకాలిక పంట కావడంతో దీని సాగుపై గతంలోకన్నా మక్కువ తగ్గింది. విస్తరిస్తున్న ఆయిల్ఫామ్ ఆయిల్ఫామ్ సాగు క్రమక్రమంగా జిల్లాలో పెరుగుతోంది. ఇది కూడా సుమారు 30వేల ఎకరాల్లో ఆయిల్ఫామ్ తోటలు ఉండగా టన్ను ఆయిల్ఫామ్ ధర సుమారు రూ.6500 చేరింది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వ్యవసాయ కూలీల అవసరం అంతగా లేకపోవడంతో రైతులు దీనిసాగుపైనే మక్కువ చూపుతున్నారు. ఆయిల్ఫామ్ విస్తీర్ణం మరింత విస్తరించనుంది. పత్తి సాగు జిల్లాలో పత్తిసాగు కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 30వేల ఎకరాల్లో పత్తిసాగవుతున్నట్టు అంచనా. రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం, తుని, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. గతేడాది క్వింటా పత్తి ధర రూ.6వేలపైనే ఉండడంతో గత ఏడాదికన్నా రెట్టింపు విస్తీర్ణంలో దీనిని సాగుచేశారు. మెట్టలో అపరాల సాగు మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి ఖరీఫ్‌లో 14వేల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రబీ సీజన్లో మాత్రం డెల్టా, కోనసీమ ప్రాంతాలలో అధికంగా అపరాల సాగును అధికంగా చేపడతారు. అపరాల సాగుకు నామమాత్రపు నీటి తడులు సరిపోవడంతో నీటి ఎద్దడి సమయంలో మినుము, పెసల సాగుకే ప్రాధాన్యతను ఇస్తారు. మొక్కజొన్న జిల్లాలోని సీతానగరం మండలంలో అధికంగా మొక్కజొన్నను చేపడతారు. ఖరీఫ్‌లో రెండు వేల ఎకరాల్లో దీనిని సాగుచేస్తే దాదాపు సగం విస్తీర్ణం ఆ ప్రాంతంలోనే ఉండటం విశేషం. కోళ్ల మేతలో ప్రధానంగా మొక్కజొన్ననే వినియోగిస్తారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమ అధికంగా ఉండడంతో పండిన మొక్కజొన్న స్థానికంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో కోళ్ల రైతులే దీనిని ప్రోత్సహించి కోళ్ల ఎరువుని అందించే వారు. ఇప్పుడు ప్రభుత్వం దీని సాగుని ప్రోత్సాహిస్తోంది. అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం కొబ్బరి పంటకు వ్యాపిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలోనే ఏకైకంగా ఉన్న పరిశోధనా కేంద్రం అంబాజీపేట ఉద్యాన ( కొబ్బరి) పరిశోధన కేంద్రం. 1955లో ఈ కేంద్రాన్ని ఇక్కడ స్దాపించారు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశోధన కేంద్రం విస్తరించివుంది. ముఖ్యంగా కొబ్బరి పంటకు వ్యాపించే తెగుళ్లు... పురుగుల నివారణకు ఇక్కడ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు. నూతన కొబ్బరి రకాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కేంద్రం కార్యాలయం ఫోన్ నెం: 08856- 243289పరిశోధన కేంద్రం అధిపతి డాక్టరు జి.రామానందం సెల్‌ఫోన్ నెం: 9441474967శాస్త్రవేత్త ఎన్.బి.వి.చలపతిరావు సెల్‌ఫోన్: 9849769231 కొబ్బరి మార్కెట్‌కూ అంబాజీపేట ప్రసిద్ది మన రాష్ట్రంలో కొబ్బరిమార్కెట్కు పెట్టింది పేరు అంబాజీపేట. ఇక్కడ ప్రతి బుధ, గురువారాలు కొబ్బరిసంత జరగుతుంది. ఇందులో రూ లక్షల్లో కొబ్బరి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కొబ్బరి, కొత్తకొబ్బరి, కుర్డీకొబ్బరికి సంబంధించి ఇక్కడ మార్కెట్లు ఉన్నాయి. కుర్డీవ్యాపారుల సంఘం, కొబ్బరి వర్తక సంఘాలతో పాటు ... కొబ్బరిరైతులను చైతన్యం చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో అంబాజీపేట కేంద్రంగా రైతు సంఘం ఉంది. ఆధారము: ఈనాడు ప్రాజెక్టులు గోదావరి డెల్టా వ్యవస్థ (సర్ఆర్ధర్ కాటన్ బ్యారేజ్): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాల్లో తూర్పు, మధ్య డెల్టాలుగా పేరొందిన 30కి పైగా మండలాలకు పుష్కలంగా సాగు, తాగునీటిని అందిస్తోంది. 4,83,199 ఎకరాలల్లో వరి పంటకు ఆధారం. ఏలేరు ప్రాజెక్టు: మెట్ట ప్రాంతంలోని 66 వేలకు పైగా ఎకరాల భూమికి సాగు నీరందిస్తోంది. శివారు భూముల్లోని అనధికార ఆయకట్టును కూడా కలుపుకుంటే లక్ష ఎకరాల పైమాటే. ఏలేశ్వరం మండలంలో తూర్పు కనుమల నడుమ ఏర్పడ్డ సహజ జలాశయంపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. జిల్లా సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు కీలక పాత్ర వహిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఉద్ధేశించిన భూసేకరణ తదితర పనులకు 1978లో శ్రీకారం చుట్టారు. పనులకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శంకుస్థాపన చేసారు. అంచనా వ్యయం రూ.250 కోట్ల నుంచి రూ.350కోట్లకు పెరిగింది. రిజర్వాయర్‌కు ఏడు కట్టలు ఉన్నాయి. వరద నీరు పోయేందుకు పది క్రస్ట్‌గేట్లను ఏర్పాటుచేసారు. ఏలేరు రిజర్వాయర్‌ను 1991 సెప్టెంబర్ 21న అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి జాతికి అంకితం చేసారు. ఏలేరు ద్వారా మెట్ట ప్రాంతంలోని 67వేల ఎకరాలకు నీరు అందేలా ఏర్పాట్లు చేసారు. విశాఖనగర ఉక్కు అవసరాలను తీర్చడంలోనూ విశిష్ఠమైన పాత్ర పోషిస్తోంది. మెట్టలో సిరులు పండిస్తున్న ఏలేరు 'మెట్టబాంధవి' అయింది. పంపా రిజర్వాయర్: అన్నవరంలోని సత్యదేవుని పాదాల వద్ద ఈ జలాశయం ఉంది. మెట్టప్రాంత రైతాంగానికి వరప్రదాయినిగా పంపా రిజర్వాయర్ సేవలందిస్తోంది. 105 అడుగుల సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా తుని, తొండంగి మండలాల్లోని సుమారు 12వేల ఎకరాలకు సాగునీరందుతుంది. రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని ఎగువప్రాంతాల్లో వర్షపు నీరు రిజర్వాయర్‌లోకి చేరుతుంది. దీనిద్వారా రిజర్వాయర్‌లో నుంచి పంటభూములకు నీరు విడుదల చేస్తారు. రిజర్వాయర్ సామర్ధ్యానికి మూడుసార్లు నీరు నిండితే పూర్తిస్ధాయిలో ఆయకట్టుకు నీరందుతుంది. ఇటీవల కాలంలో తీవ్రవర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో నీరుసరిపడలేక ఆయకట్టుకు పూర్తిస్ధాయిలో నీరందడం లేదు. అయితే పంపా రిజర్వాయర్‌లో నిర్మించిన పుష్కర ఆక్విడెక్ట్వల్ల రానున్న ఖరీఫ్ నాటికి నీరు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. చాగల్నాడు ఎత్తిపోతల పథకం: రాజానగరం, రంగంపేట, కోరుకొండ, బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో 2002లో రూ.70.77కోట్ల అంచనాతో చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. రంగంపేట, రాజానగరం, బిక్కవోలు, అనపర్తి, రాజమండ్రి రూరల్, కోరుకొండ మండలాల్లోని 35వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తుని అందిస్తోంది. పుష్కర ఎత్తిపోతల పథకం: గోదావరి నుంచి జలాలను ఎత్తిపోసి మెట్ట ప్రాంతంలోని 1.86 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం తొలిదశ మాత్రమే పూర్తయింది. 86 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. సూరంపాలెంరిజర్వాయర్: ఏజెన్సీ గంగవరం మండలంలోని సూరంపాలెంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. వర్షాకాలంలో కోరుకొండ, గోకవరం మండలాలను ముంచెత్తే బురదకాలువ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు దీన్ని నిర్మించారు. 23వేల ఎకరాలకు సాగునీరందుతోంది. సుబ్బారెడ్డి సాగర్: ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలోని కుంతీదేవి వాగుపై 1967లో సుబ్బారెడ్డిసాగర్ ఆనకట్టను కట్టారు. 1998లో ఈ ప్రాజెక్టు వరద ఉద్ధృతికి కొట్టుకుపోగా రూ.10 కోట్లతో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుగా పునర్నిర్మించారు. ఈ జలాశయం కింద 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2010 ఆగస్టు 29న వచ్చిన నీటి వత్తిడికి ఎడమ స్లూయిస్ వద్ద ఆనకట్టకు భారీ గండి పడింది. సాగర్ ఆధునికీకరణకు సంబంధించి జలవనరులు ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా రూ.3.39 కోట్లు మంజూరయ్యాయి. ఎడమ స్లూయిస్ వెల్, నీటిని విడుదల చేసే ఆర్సీసీ బ్యారెల్ నిర్మాణం, హెడ్స్లూయిస్ను పక్కాగా తీర్చిదిద్దడంతోపాటు మట్టికట్టను పటిష్ఠపరుస్తున్నారు. భూపతిపాలెం ప్రాజెక్టు: రంపచోడవరం మండలం భూపతిపాలెం గ్రామం సీతపల్లి వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రంపచోడవరం, గోకవరం మండలాలకు సాగు, తాగునీటిని అందించాల్సి ఉంది. ముసురుమిల్లి ప్రాజెక్టు: రంపచోడవరం మండలం ముసురుమిల్లి వద్ద సీతపల్లి వాగుపై నిర్మిస్తున్నారు. రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, గోకవరం, కోరుకొండ మండలాలకు ప్రయోజనం. 22 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతోపాటు అయిదు మండలాల ప్రజలకు తాగునీటిని కూడా అందిస్తుంది. పోలవరం ప్రాజెక్టు: ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా పేరొందిన పోలవరం ప్రాజెక్టును పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. 123 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యంతో పోలవరం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. పోలవరం ఎడమకాల్వ తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల మీదుగా వెళుతుంది. అపురూపం... కాటన్ అక్విడెక్టు నగరం దీవిగా వ్యవహరించే సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాలతోపాటు పి.గన్నవరం మండలంలోని నాలుగు గ్రామాలు 1852కి పూర్వం కరవుకాటకాలతో దుర్భిక్షాన్ని ఎదుర్కొనేవి. 1852లో పి.గన్నవరం వద్ద సర్ఆర్ధర్ కాటన్ మహాశయుడు పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరినదీపాయ మీద 1852లో అక్విడెక్టు నిర్మించి గన్నవరం ప్రధాన పంటకాల్వను అక్విడెక్టుమీదుగా నగరం దీవిలోకి తీసుకెళ్లారు. దీంతో నగరం దీవిలో అప్పటినుంచి స్వర్ణయుగం మొదలైంది. కాటన్ నిర్మించిన అక్విడెక్టు ద్వారా నగరం దీవిలోకి 600 క్యూసెక్కుల సాగు నీరు వెళ్లటంతో 33వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పండించేందుకు అవకాశం కలిగింది. అంతేకాకుండా వేలాది పశువులు, లక్షలాదిమంది ప్రజలకు తాగునీరు పుష్కలంగా దొరికింది. రూ.1,68,935తో అక్విడెక్టు నిర్మాణం పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నదీపాయ మీద కాటన్ మహాశయుడు హేగ్ అనే ఇంజినీర్ పర్యవేక్షణలో అక్విడెక్టును కేవలం మూడు నెలల వ్యవధిలో నిర్మించారు. దీనికి అప్పట్లో రూ.1,68,935 ఖర్చయింది. తర్వాత 1942 ప్రాంతంలో కాటన్ నిర్మించిన అక్విడెక్టుకు అనుసంధానంగా ఇక్కడే గోదావరినది పాయమీద అప్పటి రెవెన్యూ మంత్రి, కోనసీమ ముద్దుబిడ్డ స్వర్గీయ కళా వెంకటరావు స్వీయపర్యవేక్షణలో రోడ్డుబ్రిడ్జితో కూడిన అక్విడెక్టును నిర్మించారు. ఈ అక్విడెక్టు నుంచి 300 క్యూసెక్కులనీరు నగరం దీవిలోకి వెళ్లేందుకు రూపకల్పన చేశారు. అలాగే కింద అక్విడెక్టు, పైన రోడ్డుబ్రిడ్జితో కూడిన అక్విడెక్టు 1942లో రూపుదిద్దుకుంది. 1852లో కాటన్ నిర్మించిన అక్విడెక్టు, 1942లో కళా వెంకటరావు నిర్మించిన అక్విడెక్టులద్వారా నగరం దీవిలోకి మొత్తం 900 క్యూసెక్కుల సాగునీరు వెళ్లటంతో 47,500 ఎకరాల ఆయకట్టులో సిరులు పండుతున్నాయి. కాటన్ నిర్మించిన అక్విడెక్టు 150 ఏళ్లపాటు సుదీర్ఘసేవలందించి నీరసించటంతో 2000లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.40 కోట్లతో కొత్త అక్విడెక్టు నిర్మించింది. పాత అక్విడెక్టుకు 45 మీటర్ల ఎగువన కొత్త అక్విడెక్టు నిర్మించారు. ఇది నగరం దీవికి సేవలందిస్తుంది. ఇతర నీటి వనరులు ఎం.ఐ. చెరువులు 249. వీటి ద్వారా 57,295 ఎకరాలకు ఆయకట్ట ధారాకాల్వ రిజర్వాయర్: ఇది మొత్తం 4,938 ఎకరాల ఆయకట్టకు నీరు అందిస్తుంది. వెంకటనగరం పంపింగ్ స్కీం: దీని ద్వారా మొత్తం 4,250 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది. ఇవికాక మద్దిగడ్డ రిజర్వాయర్ (2,700 ఎకరాలు), సుబ్బారెడ్డి సాగర్ ( 9,364 ఎకరాలు), తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ (13,758 ఎకరాలు), తారక రామవరపు ఆవ (9,785 ఎకరాలు) కూడా జిల్లాలో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అపర భగీరధుడు కాటన్ గోదావరి జిల్లాల్లో సిరులకు ప్రాణం పోసిన మహనీయుడు భగీరధుడు ఎలాఉంటాడో ఎవ్వరికీ తెలియదు... అలాంటిది గోదావరి డెల్టా వాసులకు సర్ఆర్ధర్ కాటన్ అపరభగీరధుడుగా నిలిచాడు... అందుకే నేటికీ అన్నదాత ఆయనను నిత్యం స్మరించుకుంటునే ఉంటాడు... ప్రతీ రైతు కాటన్ నామ స్మరణం చేస్తుంటాడు. ఎక్కడో లండన్‌లో పుట్టిన కాటన్‌ను గోదావరి డెల్టా వాసులు గుండెలనిండా పెట్టుకుని నిత్యం స్మరిస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఆయన ఆనకట్ట కట్టక పూర్వం గోదావరి జిల్లాలు రాయలసీమ ప్రాంతం మాదిరిగా కరవు కాటకాలతో విలవిలలాడేవి. అలాంటి గోదావరి జిల్లాలు కాటన్ పాద ధూళి స్మర్శతో పునీతమయ్యాయి. ఈ ప్రాంతాలు సస్యశ్యామలంగా విలసిల్లుతున్నాయి. జీవ జలాలు ఉప్పుసముద్రం పాలవ్వటంతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి రెండు జిల్లాల్లో డెల్టా ప్రాంతాల్లో సిరులు పండించిన అపరభగీరధుడుగానిలిచారు. కాటన్ నిర్మించిన బ్యారేజి ధవళేశ్వరం వద్ద కాటన్ మహనీయుడు 1852లో ఆనకట్ట నిర్మించారు. దాని పొడవు నాలుగు కిలోమీటర్లు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరినదికి ఎడమవైపున ధవళేశ్వరం, కుడివైపున విజ్జేశ్వరం మధ్యలో నాలుగు కిలోమీటర్ల పొడవునా కాటన్ నిర్మించిన ఈ ఆనకట్టకు అప్పట్లో రూ.1,65,000 ఖర్చయింది. ప్రారంభంలో ఈ ఆనకట్టద్వారా గోదావరి డెల్టాలో 4,38,000 ఎకరాలకు సాగునీరు చేరటంతో కాటన్ స్వర్ణయుగాన్ని అందించారు. తర్వాత కాల్వలు, లాకులు విధానాన్ని అభివృద్ధిచేయటంతో రెండు జిల్లాలో జలరవాణా అందుబాటులోకి వచ్చింది. అంతే కాకుండా సాగు విస్తీర్ణం 7,94,829 ఎకరాలకు పెరిగింది. 110 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించిన కాటన్ ఆనకట్ట శిధిలావస్థకు చేరుకోవటంతో కొత్త ఆనకట్ట నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్త ఆనకట్ట ఇలా...కాటన్ నిర్మించిన బ్యారేజి శిధిలావస్థకు చేరుకోవటంతో 1970లో అప్పటి ప్రభుత్వం కొత్త బ్యారేజి (ఆనకట్ట) నిర్మించేందుకు రూ.26.59 కోట్లు మంజూరు చేసింది. దీనికి కాటన్ బ్యారేజిగా నామకరణం చేసి 1977 ప్రాంతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనిని జాతికి అంకితం చేశారు. కొత్త కట్టడం ద్వారా కొత్తగా బ్యారేజి నిర్మించటంతో గోదావరిజిల్లాల్లో ఆయకట్టు పది లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే లక్షలాది మందికి తాగునీరు, లక్షలాది పశువులకు తాగునీరు అందిస్తుంది. గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మాణం 1852కి పూర్వం తూర్పుగోదావరిజిల్లా కోనసీమలోని నగరం దీవి కరవుకాటకాలతో విలయతాండవం చేసేది. 1852లో కాటన్ పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నదీపాయమీద అక్విడెక్టు నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో రూ.1,65,935 నిధులు వెచ్చించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ కట్టడం ద్వారా నగరం దీవిలో 33వేల ఎకరాలకు సాగునీరు అందటంతో ఆ దీవిలో పచ్చదనం పరుచుకుని సిరులు పండాయి. దాని ద్వారా జలరవాణా వృద్ధి అయ్యింది. కాటన్ జీవిత చరిత్ర విశేషాలు 1803 మే 15న కాటన్ మహనీయుడు ఇంగ్లండ్‌లో హెన్రీ కేల్వెసీ కాటన్, అంబేర్మెర్ఎబే దంపతులకు జన్మించాడు 1818లో ఏడిస్కోంబ్లో మిలట్రీలో కేడెట్‌గా చేరారు. 1819లో రెండో లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1820లో వేల్స్ ఇంగ్లండ్‌లో ఆర్డినెన్సు సర్వే నిమిత్తం వెళ్లారు 1821లో ఇంగ్లండ్ నుంచి భారత్‌కు వచ్చారు. 1822లో పంబన్ స్ట్రెయిట్‌లోని దక్షిణ డివిజన్లో ఎ.ఇ.గా బాధ్యతలు తీసుకున్నారు. 1824లో బర్మా యుద్ధంలో పాల్గొన్నారు. 1825లో మద్రాస్‌లోని ట్యాంక్ సర్కిల్‌కు ఎస్.ఇ.గా బాధ్యతలు చేపట్టారు. 1828లో కెప్టెన్‌గా పదోన్నతి లభించింది. 1829లో కన్వెనరీ స్కీముకు ఇన్వెస్టిగేషన్ అధికారిగా వ్యవహించారు. 1830లో ఇంగ్లండ్ వెళ్లేందుకు రెండున్నర సంవత్సరాలపాటు సెలవు తీసుకున్నారు. 1832లో కన్వెరిడెల్టాను వదిలేశారు. ఆ సమయంలో అనారోగ్య కారణంతో ఇంగ్లండ్ వెళ్లారు 1834లో యూరప్, ఆఫ్రికాల మీదుగా ఏడాదిపాటు ప్రయాణం చేసి భారత్‌కు చేరుకున్నారు. 1837లో మద్రాసు పోర్టు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశారు. 1840లో కృష్ణానదిమీద ఆనకట్ట నిర్మించేందుకు ప్రతిపాదించారు. 1841లో ఎలిజబెత్‌ను వివాహమాడారు. 1843లో భారత్‌కు తిరిగి వచ్చారు. 1844లో విశాఖపట్నం పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసిన కాటన్ దాంతోపాటే గోదావరి డెల్టాను అభివృద్ధిచేసేందుకు ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు. 1847లో ధవళేశ్వరం బ్యారేజివద్ద గోదావరి నదిమీద ఆనకట్ట నిర్మించేందుకు అనుమతులు లభించాయి. 1847లో కృష్ణానదిపై ఆనకట్ట నిమిత్తం సలహాదారుగా నియమాకం 1848లో అనారోగ్యంతో ఆస్ట్రేలియా వెళ్లారు. అప్పట్లో బాధ్యతలను కెప్టెన్ ఓర్‌కు అప్పగించారు 1840లో భారత్‌కు తిరిగి వచ్చి కల్నల్‌గా బాధ్యతల స్వీకరణ 1852లో పి.గన్నవరం వద్ద గోదావరి నదీపాయ మీద అక్విడెక్టు నిర్మాణం 1852లో ధవళేశ్వరం బ్యారేజి పూర్తి 1858లో ఒరిస్సాలో కరవు సహాయ చర్యలు నిమిత్తం సలహాదారుగా నియమితులైన కాటన్ కాల్వల వ్వవస్థ గురించి సలహాలు ఇచ్చారు 1860లో కాటన్ ఉద్యోగ బాధ్యతలనుంచి పదవీ విరమణ పొందారు 1863లో భారత్‌కు వచ్చి నదీజలాల వినియోగంపై సలహాలు ఇచ్చారు 1877లో కె.సి.ఎస్.ఐ. బిరుదుతో సత్కారం 96 సంవత్సరాల రెండు నెలలపాటు జీవించిన కాటన్ 1899లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆధారము: ఈనాడు నదులు నదులు, కాలువలు - నీటి సామర్ధ్యం గోదావరి( 127.80 టీఎంసీలు): గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది. జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు గోదావరి ఆనకట్ట ద్వారా నీటిని మళ్లిస్తారు. గోదావరి జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గౌతమి, వశిష్టగా విడిపోతుంది ఏలేరు (29.28 టీఎంసీ): ఏలేరు నదిపై ఏలేశ్వరం వద్ద ఏలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏలేరు నదిలో ఏడాదికి సుమారు 24 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ నది ఆధారంగా సుమారు 54 వేల ఎకరాలు సాగు జరుగుతోంది.. తాండవ (3.91 టీఎంసీ): తాండవ నదిపై విశాఖపట్నం జిల్లా జీకే గూడెం వద్ద తాండవ జలాశయాన్ని నిర్మించారు. తాండవ నది జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు సాగునీరు అందిస్తుంది. 17 వేల ఎకరాల సాగు జరుగుతోంది. పంపా (3.42 టీఎంసీ): అన్నవరం వద్ద పంపా నదిపై పంపా జలాశయాన్ని నిర్మించారు. 12 వేల ఎకరాలకు దీని ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. ఇవికాక బురదకాల్వ (9.04 టీఎంసీ), సీతపల్లివాగు (4.65 టీఎంసీ),సుద్దగెడ్డవాగు (2.10 టీఎంసీ), పాములేరు (5.50 టీఎంసీ) మొత్తం 185.70 టీఎంసీల నీరు జిల్లాకు పైనదులు, కాల్వల ద్వారా లభిస్తోంది. ఆధారము: ఈనాడు